దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు అమిత ఆదరణ తెచ్చిన ఘనత పుల్లెల గోపీచంద్‌కే దక్కుతుందని జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి కొనియాడారు.
తణుకు టౌన్, న్యూస్‌లైన్ : దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు అమిత ఆదరణ తెచ్చిన ఘనత పుల్లెల గోపీచంద్‌కే దక్కుతుందని జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి కొనియాడారు.
పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న సందర్భంగా పుల్లెల గోపీచంద్‌ను స్థానిక ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల యాజమాన్యం సత్కరించింది. క్రీడారంగంలో అర్జున, రాజీవ్ ఖేల్త్న్ర, ద్రోణాచార్య, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి విశిష్ట పురస్కారాలు పొందిన ఏకైక క్రీడాకారుడు గోపీచంద్ ఒక్కరేనన్నారు.