న్యూఢిల్లీ : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ నామినేష్లన స్వీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వచ్చే ఏడాది (2021) గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించనున్న పద్మ పురస్కారాలకు ఆన్‌లైన్ నామినేషన్లు లేదా సిఫారసులకు ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గడువు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. నామినేషన్లు లేదా సిఫారసులను కేవలం ఆన్‌లైన్ ద్వారా, పద్మ పురస్కారాల పోర్టల్ ద్వారా స్వీకరిస్తారు.
పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేర్లతో ఇచ్చే పద్మ పురస్కారాలు, పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవాలు. పద్మ పోర్టల్ అందుబాటులో ఉన్న నిర్ణీత నమూనా ప్రకారం నామినేషన్లు లేదా సిఫారసులు ఉండాలి. నామినేట్ లేదా సిఫారసు చేస్తున్న వ్యక్తి, సంబంధింత రంగంలో సాధించిన విజయాలు లేదా సేవల గురించి 800 పదాలకు మించకుండా స్పష్టంగా రాయాలి. సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న అర్హులైన మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు వంటి ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రయత్నాలు చేయమని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, అత్యున్నత సంస్థలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. నామినేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 15న ముగుస్తుందని ఈలోగా దరఖాస్తులు పంపాల్సిందిగా పేర్కొంది. 1954 నుంచి మొదలైన ఈ అవార్డుల పర్వం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతోంది.
జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేకుండా కళ,సాహిత్యం, విద్య,క్రీడలు, సామాజికం, సైన్స్ అండ్ టెక్నాటజీ సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించినవారు పద్మ అవార్డులకు అర్హులు. అంతేకాకుండా సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నవారిని గుర్తించి వారి వివరాలను నమోదు చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలు, పద్మ అవార్డుల గ్రహీతలకు కేంద్ర హోంశాఖ కోరింది. అంతేకాకుండా పౌరులు కూడా స్వతహాగా నామినేషన్లు దాఖలు చేయొచ్చని పేర్కొంది. గరిష్టంగా 800 పదాలకు మించకుండా సిఫారసులో సూచించిన ఫార్మాట్ తరహాలో పద్మ అవార్డుల పోర్టల్‌లో సంబంధిత వివరాలను నమోదు చేయాలని తెలిపింది. (కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం )
Comments
Please login to add a commentAdd a comment