Padma awards
-
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
Padma Awards 2024: అసామాన్య పద్మశ్రీలు
స్త్రీలు జీవానికి జన్మనివ్వడమే కాదు.. జీవాన్ని కాపాడతారు కూడా! ఈసారి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీలలో కొందరు అసామాన్యమైన స్త్రీలు తమ జీవితాన్ని కళ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కలు వీటన్నిటిలోని జీవాన్ని కాపాడుకుంటూ రావడం కనిపిస్తుంది. ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పర్బతి బారువా... లక్షలాది మొక్కలు నాటి ఆకుపచ్చదనం నింపిన చామి ముర్ము... విస్మరణకు గురైన ఔషధ మూలికలకు పూర్వ వైభవాన్ని తెచ్చిన యానుంగ్... కొబ్బరి తోటలు తీయటి కాయలు కాచేలా చేస్తున్న అండమాన్ చెల్లమ్మాళ్... గోద్నా చిత్రకళకు చిరాయువు పోసిన శాంతిదేవి పాశ్వాన్... వీరందరినీ పద్మశ్రీ వరించి తన గౌరవం తాను పెంచుకుంది. ఏనుగుల రాణి భారతదేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆమె పరిచయం. ఇది సంతోషించదగ్గ విషయం. అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కడైనా అటవీ ఏనుగులు అదుపు తప్పి, తల తిక్కగా వ్యవహరిస్తూ ఉంటే పర్బతి బారువాకు పిలుపు వచ్చేది... వచ్చి వాటిని కాస్త పట్టుకోమని, మాలిమి చేయమని. ఇన్నేళ్లకు 69 ఏళ్ల వయసులో ఈ ‘ఏనుగుల రాణి’కి, ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన రుషికి భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ‘ స్వీకరించమని పిలుపు వచ్చింది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రమాదస్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణకు, వాటిని ఎలా కనిపెట్టుకోవాలో తెలిపే జ్ఞానాన్ని సముపార్జించి పంచినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇవ్వడం సంతోషించాల్సిన సంగతి. కళ్లు తెరవగానే ఏనుగు ‘నాకు ఊహ తెలిసిన వెంటనే నా కళ్ల ఎదురుగా ఏనుగు ఉంది’ అంటుంది పర్బతి. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన గౌరిపూర్ సంస్థానం పర్బతి కుటుంబీకులది. పర్బతి తండ్రి రాజా ప్రతాప్ చంద్ర బారువా సంస్థానం మీద వచ్చే పరిహారంతో దర్జాగా జీవిస్తూ 40 ఏనుగులను సాకేవాడు. అంతేకాదు అతనికి ఏనుగులతో చాలా గొప్ప, అసామాన్యమైన అండర్స్టాండింగ్ ఉండేది. వాటి ప్రతి కదలికకూ అతనికి అర్థం తెలుసు. మహల్లో ఉండటం కన్నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని అడవుల్లో నెలల తరబడి ఉండటానికి ఇష్టపడే రాజా ప్రతాప్ తన తొమ్మిది మంది సంతానంలో ఒకతైన పర్బతికి ఏనుగుల మర్మాన్ని తెలియచేశాడు. 9 ఏళ్ల వయసు నుంచే పర్బతి ఏనుగులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల వయసులో మొదటిసారి అటవీ ఏనుగును పట్టి బంధించగలిగింది. అది చూసి తండ్రి మెచ్చుకున్నాడు. కష్టకాలంలో ఏనుగే తోడు 1970లో భారత ప్రభుత్వం (విలీనం చేసుకున్న) సంస్థానాలకిచ్చే భరణాన్ని ఆపేయడంతో పర్బతి తండ్రి పరిస్థితి కష్టాల్లో పడింది. రాబడి లేకపోవడంతో ఏనుగులే అతని రాబడికి ఆధారం అయ్యాయి. ఏనుగులను అమ్మి, టింబర్ డిపోలకు అద్దెకిచ్చి జీవనం సాగించాడు. ఆ సమయంలో పర్బతి ఏనుగుల గురించి మరింత తెలుసుకుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగు కళ్లను చూసి దాని మనసులో ఏముందో చెప్పే స్థితికి పర్బతి చేరుకుంది. ఏనుగుల ప్రవర్తనకు సంబంధించిన ఆమె ఒక సజీవ ఎన్‌సైక్లోపిడియాగా మారింది. క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీబీసీ వారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ పేరుతో పర్బతి మీద డాక్యుమెంటరీ తీయడంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఉదయం నాలుగున్నరకే లేచి ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యే పర్బతి దినచర్యను చూసి సలాం చేయాల్సిందే. ‘ఏనుగును మాలిమి చేసుకోవాలంటే ముందు దాని నమ్మకం, గౌరవం పొందాలి. లేకుంటే ఏనుగులు మావటీలను చంపేస్తాయి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక ఏనుగు తనను ఇబ్బంది పెడుతున్న మావటిని అతను నిద్రపోతున్నప్పుడు వెతికి మరీ చంపింది’ అంటుంది పర్బతి. కాని నమ్మకం పొందితే ఏనుగుకు మించి గొప్ప స్నేహితుడు లేదని అంటుంది. ‘ఒకో ఏనుగు రోజుకు 250 కిలోల పచ్చగడ్డి తింటుంది. దానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే ఆరోగ్యం కుదుటపడుతుందో ఆ మొక్కను వెతికి తింటుంది. అది తినే మొక్కను బట్టి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం చేయించాలి’ అంటుందామె. ‘ఎవరికైనా విశ్రాంతి ఉంటుంది కాని మావటికి కాదు. మావటి పని డ్రైవర్ ఉద్యోగం కాదు. కారు గ్యారేజ్‌లో పెట్టడానికి. జీవంతో నిండిన ఏనుగుకు మావటి అనుక్షణం తోడు ఉండాలి’ అంటుందామె. అస్సాం అటవీశాఖలో ‘చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్’గా పని చేసిన ఆమె ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం పని చేస్తోంది. నారియల్ అమ్మ దక్షిణ అండమాన్‌లోని రంగచాంగ్కు చెందిన 67 ఏళ్ల కామాచీ చెల్లమ్మాళ్ సేంద్రియ కొబ్బరి తోటల పెంపకంలో చేసిన విశేష కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. దక్షిణ అండమాన్‌లో ‘నారియల్ అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం తరువాత నేలలో తేమను సంరక్షించడానికి కొబ్బరి ఆకులు, పొట్టు మొదలైన వాటితో సేంద్రియ ఎరువు తయారుచేసింది. ‘నాకు పద్మశ్రీ ప్రకటించారు అని ఎవరో చెబితే నేను నమ్మలేదు. అయోమయానికి గురయ్యాను. అండమాన్‌లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే నాకు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ ఎందుకు ప్రకటిస్తారు అనుకున్నాను. ఆ తరువాత నేను విన్న వార్త నిజమే అని తెలుసుకున్నాను’ అంటున్న చెల్లమ్మళ్ ఆగ్రో–టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. తమ ప్రాంతంలోని రకరకాల పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపకం...మొదలైనవి ఆగ్రో–టూరిజానికి ఊతం ఇస్తాయి అని చెబుతుంది చెల్లమ్మాళ్. అవమానాలను అధిగమించి గోద్నా చిత్రకళలో చేసిన విశేష కృషికి బిహార్‌లోని మధుబని జిల్లా లహేరిఆగంజ్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి పాశ్వాన్ ఆమె భర్త శివన్ పాశ్వాన్లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గోద్నా చిత్రకళ ద్వారా ఈ దంపతులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా నుంచి జపాన్ వరకు వీరి చిత్రాలను ప్రదర్శించారు. తన కులం కారణంగా ఎన్నో అవమానాలకు గురైన శాంతిదేవి, వాటిని అధిగమించి జీ20 సదస్సులో పాల్గొనే స్థాయి వరకు ఎదిగింది. శాంతిదేవి, శివన్ పాశ్వన్ దంపతులు ఇరవైవేల మందికి పైగా గోద్నా చిత్రకళలో శిక్షణ ఇచ్చారు. ఆది రాణి అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యానుంగ్ జమెహ్ లెగో ఆది తెగ సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన 58 సంవత్సరాల యానుంగ్ను అభిమానులు ‘ఆది రాణి’ అని పిలుచుకుంటారు. లక్షమందికి పైగా ఔషధమూలికలపై అవగాహన కలిగించించిన యానుంగ్ ఏటా 5,000 ఔషధ మొక్కలను నాటుతుంది. ప్రతి ఇంటిలో హెర్బల్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తోంది. ఆర్థికపరిమితులు ఉన్నప్పటికీ విస్మరణకు గురైన ఆది తెగ సంప్రదాయ వైద్య వ్యవస్థను, సాంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేసింది యానుంగ్. మొక్కవోని ఆత్మస్థైర్యం ‘మొక్కలు నాటడానికి నువ్వు ఏమైనా కలెక్టర్ వా!’ అని ఊరి మగవాళ్లు చామిని వెక్కిరించేవాళ్లు. మొక్కలు నాటడం అనే పుణ్యకార్యం వల్ల ఉత్త పుణ్యానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన చామి కూలి పనులు చేసుకుంటూనే 36 ఏళ్ల రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఝార్ఖండ్‌కు చెందిన చామి ముర్ము ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది.... తన గ్రామం భుర్సాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సమావేశానికి హాజరు కావడం ద్వారా పర్యావరణ కార్యకర్తగా చామీ ముర్ము ప్రయాణం ప్రారంభమైంది. ‘మా ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములు కనిపించేవి. బాధగా అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. అయితే మొక్కలు నాటడం మా ఊరిలోని మగవాళ్లకు నచ్చలేదు. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవల వల్ల సోదరుడి ఇంటికి వెళ్లాను. అతడితో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఒకవైపు జీవనోపాధిపై దృష్టి పెడుతూనే మరోవైపు ప్రకృతికి మేలు కలిగించే పనులు చేయడం ప్రారంభించాను’ అంటుంది చామీ ముర్ము. పదో తరగతి వరకు చదువుకున్న చామి మొక్కలు నాటడం, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నందుకు కొంతమందికి అకారణంగా శత్రువు అయింది. 1996లో చామి నాటిన మొక్కలను ధ్వంసం చేశారు కొందరు. ‘ఇక ఆపేద్దాం. ఎందుకు లేనిపోని గొడవలు’ అని కొందరు మహిళలు చామిని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే చామి మాత్రం ఆనాటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉత్సాహం ముందు ప్రతికూలశక్తులు తోకముడిచాయి. ‘నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. నేను నాటిన 28 లక్షలకుపైగా మొక్కలు నా బంధువులే’ అంటుంది చామి. ఝార్ఖండ్‌లోని వెనబడిన జిల్లా అయిన సరైకెలా ఖరావాన్లో రైతులు వ్యవసాయం కోసం వర్షంపై ఆధారపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి అవసరాల కోసం వాటర్షెడ్లను నిర్మించడానికి చామి కృషి చేస్తోంది. 2,800 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా, సొంత వ్యాపారం ప్రారంభించేలా చేసింది. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ స్పృహతో మొదలైన నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది చామి. ఒంటరిగా అడుగులు మొదలు పెట్టినప్పటికీ అంకితభావం కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల ప్రభావం చూపించగలరు అని చెప్పడానికి చామీ ముర్ము ప్రయాణం బలమైన ఉదాహరణ. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చామీ ముర్ము పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. టింబర్ మాఫియాపై పోరాడిన చామీ ముర్మును ‘లేడీ టార్జన్ ఆఫ్ ఝార్ఖండ్’ అని అభిమానులు పిలుచుకుంటారు. -
క్రీడారంగంలో పద్మ పురస్కారాలు వీరికే..
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రద్మ పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ ఏడాది క్రీడారంగం నుంచి మొత్తం ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వెటరన్ టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్, పూర్ణిమా మహతో (ఆర్చరీ), సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండేలను (మల్లఖంబ-కోచ్) పద్మశ్రీ అవార్డులు వరించాయి. -
తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు!
Foxconn CEO Young Liu: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ 'యంగ్ లియు' (Young Liu) ను కూడా పద్మభూషణ్ వరించింది. 66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ 'యంగ్ లియు' నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లియుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. యంగ్ లియు స్థాపించిన మూడు కంపెనీలలో యంగ్ మైక్రో సిస్టమ్స్ అని పిలువబడే మదర్బోర్డ్ కంపెనీ (1988), నార్త్‌బ్రిడ్జ్ అండ్ సౌత్‌బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ (1995), ఐటీఈ టెక్ అండ్ ఏడీఎస్ఎల్ ఐసీ డిజైన్ కంపెనీ (1997) ఉన్నాయి. తైవాన్‌కు చెందిన యంగ్ లియు 1978లో తైవాన్‌లోని నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. భారతదేశంలో ఫాక్స్‌కాన్ ఉనికి భారతదేశంలో.. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు, వెంచర్లతో తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్‌కాన్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమిళనాడులో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 40000 మంది పనిచేస్తున్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ బెంగళూరు శివార్లలో యూనిట్‌ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కోసం 1.6 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని విస్తృతం చేయబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీనియర్ అధికారి గత సంవత్సరం తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఫాక్స్‌కాన్ దేశంలో విస్తృత సేవలను అందించనున్నట్లు సమాచారం. పద్మ అవార్డ్స్ 2024 కేంద్రం ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. విదేశీయులకు పద్మ అవార్డులు ఎందుకిస్తారంటే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డ్స్ వెబ్సైట్ ప్రకారం.. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన లేదు. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సేవలందించిన ఎవరికైనా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్, సీఎం రేవంత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్వర్క్: తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్‌కాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్‌కాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్సంగ్ హీరోస్’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. పద్మ అవార్డుల వివరాలివీ.. పద్మ విభూషణ్ (ఐదుగురికి): వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ–బిహార్), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). పద్మభూషణ్ (17 మందికి): ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్ జీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్), సీతారాం జిందాల్ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్), రాంనాయక్ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం–గుజరాత్), ఓలంచెరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూ అలియాస్ రాజ్ దత్ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్), ప్యారేలాల్ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం–బిహార్), ఉషా ఉతుప్ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్‌కాంత్ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) – పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. బాధ్యతను పెంచింది ‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ – ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్ పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు. -
మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్‌కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీకి చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరికి పద్మ శ్రీ పురస్కారం వరించింది. తెలంగాణకు చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య కు పద్మశ్రీ అవార్డు లభించింది. #PadmaAwards2024 | Somanna, a Tribal Welfare Worker from Mysuru, tirelessly working for the upliftment of Jenu Kuruba tribe for over 4 decades, to receive Padma Shri in the field of Social Work (Tribal PVTG) pic.twitter.com/zZl6Sge1tE — ANI (@ANI) January 25, 2024 తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇదీ చదవండి: రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య, కర్పూరి ఠాకూర్ ప్రస్తావన -
నేను అలా అన్నందుకు నామీద తిరగబడ్డారు : గరికపాటి నరసింహారావు
-
పద్మశ్రీ అవార్డు అందుకున్న కానీ..!
-
Padma Awards 2024: ‘పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి’
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి, వారి గొప్పదనం, విజయాలు పద్మ అవార్డులతో సత్కరించడానికి అర్హులను భావించినట్లయితే ఆ పేర్లను సిఫారసు చేయాలని ప్రజలను సోమవారం కేంద్రం కోరింది. 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లు, ప్రతిపాదలను 2023 మే ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పద్మ అవార్డుల సిఫారసులకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 15. ప్రతిపాదనలను ఆన్లైన్లో https://awards.gov.in ద్వారా పంపాలని కోరింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవిస్తుంది. -
‘మోదీజీ.. ఇది అస్సలు ఊహించలేదు’
రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికర సంభాషణ ఒకటి జరిగింది. కర్ణాటకకు చెందిన హస్త కళాకారుడు ఒకరు.. బీజేపీ ప్రభుత్వం నుంచి ఇది అస్సలు ఊహించలేదంటూ ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. దానికి ప్రధాని మోదీ కూడా నవ్వులు చిందించడం విశేషం. కర్ణాటకకు చెందిన బిద్రీ కళాకారుడు రషీద్ అహ్మద్ ఖ్వాద్రీకి పద్మశ్రీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిన్న(బుధవారం) జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. అయితే.. అవార్డుల విజేతలను ప్రధాని మోదీ అభినందించే క్రమంలో.. ఖ్వాద్రీ ముచ్చటించారు. ‘‘మోదీజీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పద్మ అవార్డు నాకు వస్తుందని అనుకున్నా. కానీ, రాలేదు. మీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో.. ఈ ప్రభుత్వం నాకు ఎలాంటి అవార్డు ఇవ్వదని అనుకున్నా. కానీ, అది తప్పని మీరు నిరూపించారు. మీకు నా కృతజ్ఞతలు అని ఖ్వాద్రీ, ప్రధాని మోదీతో అన్నారు. ఆ దిగ్గజ కళాకారుడి మాటలు వినగానే ప్రధాని మోదీ రెండు చేతులు జోడించి నమస్తే పెట్టి.. చిరునవ్వు నవ్వారు. కాస్త దూరంగా నిల్చున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం చిరునవ్వులు చిందించారు. Indian Muslim artist from #Karnataka #RasheedAhmedQuadri after winning #PadmaShri. 'I used to think #BJP never gives anything to #Muslims,but #Modi proved me wrong.' A moment of dialogue between the awardee & PM Modi, with mutual respect and appreciation from both sides. TQ🇮🇳🫡 pic.twitter.com/EO5h2FyEGw — سعود حافظ | Saud Hafiz (@saudrehman27) April 6, 2023 -
పద్మశ్రీ అవార్డు అందుకున్న కీరవాణి.. సుధామూర్తికి పద్మభూషణ్ ప్రధానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురికి పద్మ అవార్డులు ప్రధానం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. సామాజిక సేవ చేసినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. అలాగే చినజీయర్ స్వామి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరైంది. అలాగే సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి బుధవారం వీటిని ప్రధానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోనే ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
Padma Awards: అట్టహాసంగా 2023 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
సాక్షి, ఢిల్లీ: 2023 ఏడాదికిగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇవాళ(బుధవారం మార్చి 22) సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కర్తో పాటు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ అందుకోగా.. ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, సింగర్ సుమన్ కళ్యాణ్పూర్లు పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. పాండ్వానీ సింగర్ ఉషా బర్లే, చునారా కమ్యూనిటీకి చెందిన కళంకారీ కళాకారుడు భానుభాయ్ చితారా, త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా(దివంగత.. బదులుగా ఆయన తనయుడు సుబ్రతా దెబ్బర్మా), కాంతా ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ ప్రీతికాకా గోస్వామి, ప్రముఖ బయాలజిస్ట్ మోడడుగు విజయ్ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త.. ప్రముఖ కళాకారుడు దిల్షద్ హుస్సేన్, పంజాబీ స్కాలర్ డాక్టర్ రతన్ సింగ్ జగ్గీ, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(దివంగత.. బదులుగా ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా అవార్డును అందుకున్నారు), మ్యూజిక్ ఆర్టిస్ట్ మంగళ కాంతా రాయ్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి చింతల పాటి వెంకట పతి రాజు( కళారంగం), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం), తెలంగాణకి చెందిన పసుపులేటి హనుమంతరావు (మెడిసిన్ ), బి.రామకృష్ణరెడ్డి (సాహిత్యం) పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. #WATCH | Former Union Minister SM Krishna receives the Padma Vibhushan from President Droupadi Murmu. pic.twitter.com/WqA5b0YH1i — ANI (@ANI) March 22, 2023 LIVE: President Droupadi Murmu presents Padma Awards 2023 at Civil Investiture Ceremony-I at Rashtrapati Bhavan https://t.co/jtEQQtx1DP — President of India (@rashtrapatibhvn) March 22, 2023 -
భారత రత్న ఇవ్వాలి!
ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించారు కానీ దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించలేదు. ఎన్నో త్యాగాలూ, సేవలూ చేసినవారికి ప్రదానం చేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రతి ఏడాదీ ప్రకటించి వారిని గౌరవించుకోవడం మన విధి. 1954 నుండి భారత రత్న పురస్కారాన్ని ఇస్తున్నారు. ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును అందించారు. చివరిసారిగా 2019లో ముగ్గురికి ఇచ్చారు. సామాజిక సేవకుడు నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపేన్ హజారికా (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత రత్నకు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ అవార్డుకు వ్యక్తులను సిఫార్సు చేసే ప్రక్రియ ప్రధాన మంత్రి నుంచి మొదలవుతుంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు. కులం, వృత్తి, జెండర్... ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవరి పేరునైనా భారత రత్నకు పరిశీలించొచ్చు. ప్రతి ఏటా ముగ్గురికి భారత రత్న ఇవ్వొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మ పురస్కారాలను ప్రకటించినట్లుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం లేదు. అలా ప్రకటించాలని ప్రత్యేక నిబంధనలు ఏమీ లేకపోయినప్పటికీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ ఏడాది దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయులకూ గొప్ప సంఘ సంస్కర్తలైన ఫూలే దంపతులకూ, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య వంటి త్యాగ ధనులకూ, ధ్యాన్ చంద్ వంటి క్రీడాకారులకూ భారతరత్న పురస్కారం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజా భివృద్ధి కోసం పాటుపడిన విశిష్ట వ్యక్తులకు భారతరత్నను ప్రదానం చేయడం ద్వారా వారి త్యాగాలను ఈ తరానికి మరొక్కసారి పరిచయం చేసినట్లు అవుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఎం. రాం ప్రదీప్, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా -
Mann ki Baat 2023: వారి జీవితాలు స్ఫూర్తిదాయకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారి జీవితాలు, వారు సాధించిన ఘనత గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2023 పద్మ అవార్డుల్ని పీపుల్స్ పద్మగా అభివర్ణించారు. సామాన్యుల్లో అసామాన్యులుగా ఎదిగిన వారిని గుర్తించి గౌరవిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా ప్రధాని ఆదివారం ఆకాశవాణి మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. గిరిజనులు, వారి అభ్యున్నతికి కృషి చేసిన వారినే అత్యధికంగా పద్మ అవార్డులతో సత్కరిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘ పద్మ పురస్కారాలు పొందినవారి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. గిరిజన భాషలైన టోటో, హో, కూయి వంటి వాటిపై అవిరళ కృషి చేసిన వారు, ఆదివాసీల సంగీత పరికరాలు వాయించడంలో నిష్ణాతులకి ఈ సారి పద్మ పురస్కారాలు వరించాయి.. నగర జీవితాలకి , ఆదివాసీ జీవితాలకు ఎంతో భేదం ఉంటుంది. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లుంటాయన్నారు. అయినప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఎంతో పోరాటం చేస్తుంటారు’’ అని ప్రధాని కొనియాడారు. పెరుగుతున్న దేశీయ పేటెంట్ ఫైలింగ్స్ ఈ దశాబ్దం సాంకేతిక రంగంలో దేశీయ టెక్నాలజీస్ వాడకం పెరిగి ‘‘టెకేడ్’’గా మారాలన్న భారత్ కలను ఆవిష్కర్తలు, వాటికి వచ్చే పేటెంట్ హక్కులు నెరవేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. విదేశాలతో పోల్చి చూస్తే దేశీయంగా పేటెంట్ ఫైలింగ్స్ బాగా పెరిగాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్‌లో భారత్ ఏడో స్థానంలో ఉంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లలో అయిదో స్థానంలో ఉందని ప్రధాని వెల్లడిచారు. గత అయిదేళ్లలో భారత్ పేటెంట్ రిజిస్ట్రేషన్లు 50శాతం పెరిగాయని, ప్రపంచ ఆవిష్కరణల సూచిలో మన స్థానం 40కి ఎగబాకిందన్నారు. 2015 నాటికి 80 కంటే తక్కువ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇండియన్ ఇనిస్టి్యూట్ ఆఫ్ సైన్సెస్ 2022లో 145 పేటెంట్లను దాఖలు చేసి రికార్డు సృష్టిస్తుందన్నారు. భారత్ ‘‘టెకేడ్‘‘కలని ఆవిష్కర్తలే నెరవేరుస్తారని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మన్‌కీ బాత్‌లో తెలుగువారి ప్రస్తావన మన్‌కీబాత్‌లో ఇద్దరు తెలుగు వారి గురించి మోదీ ప్రస్తావించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి, తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి మాట్లాడారు. ‘‘నంద్యాల జిల్లాకు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి చిరు ధాన్యాలు పండించడం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగం మానేశారు. తల్లి చేసే చిరు ధాన్యాల వంటకం రుచి చూసి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వాటి ప్రయోజనాలను అందరికీ వివరిస్తున్నారు’’ అని కొనియాడారు. నమో యాప్‌లో ఇ–వేస్ట్ గురించి రాసిన తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి ప్రస్తావించిన ప్రధాని మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్లు నిరుపయోగమైనప్పుడు ఎలా పారేయాలో వివరించారు. -
పాములు పట్టే వారికి పద్మశ్రీ.. వీరిద్దరూ వరల్డ్ ఫేమస్!
సాక్షి, చెన్నై: తమిళనాడు నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికైన వారిని గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ గురువారం అభినందించారు. వివరాలు.. 2023 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి పురస్కారాలు లభించాయి. వీరిలో గాయని వాణీ జయరాంకు పద్మ విభూషణ్ దక్కింది. మిగిలిన ఐదుగురిని పద్మశ్రీ వరించింది. అలాగే, కల్యాణ సుందరం పిళ్లై (కళ) వడివేల్ గోపాల్, మాసి సడయన్ (సామాజిక సేవ), పాలం కల్యాణ సుందరం (సామాజిక సేవ), గోపాల్ స్వామి వేలుస్వామి (వైద్యం) ఉన్నారు. ప్రస్తుతం పద్మశ్రీతో ఇద్దరు వ్యక్తులు తమిళనాడు ప్రముఖులుగా తెర మీదకు వచ్చారు. ఆ ఇద్దరు పాములు పట్టడంలో దిట్టగా ఉండటం విశేషం. పాములను పట్టే ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం చెంగల్పట్టు నుంచి అమెరికా వరకు విషపూరిత పాములను పట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వెనుక బడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని పద్మశ్రీ వరించింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాలు.. చెంగల్పట్టు జిల్లా సెందురి గ్రామానికి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన వడివేల్ గోపాల్, మాసి సడయన్ పాములు పట్టాడాన్నే వృత్తిగా కొనసాగిస్తున్నారు. వంశ పారంపర్యగా వస్తున్న నేర్చుకున్న విద్యతో ఈ ఇద్దరు అమెరికా వరకు తమ సేవలను అందించారు. ప్రస్తుతం పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికై ఉండడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో పాములు పట్టే శిక్షణ ఇచ్చే స్థాయికి వీరు ఎదిగి ఉన్నారు. అమెరికా ఫ్లోరిడాలో కొండ చిలువలను పట్టే ప్రముఖ నిపుణుడు రోమ్లస్ విక్టోరికర్ బృందంలో ఈ ఇద్దరు సభ్యులుగా ఉండడం వెలుగులోకి వచ్చింది. కాగా తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై వడివేల్ గోపాల్ మాట్లాడుతూ ఈ ఘనత అందుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. అమెరికా, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలలో తాము పాములు పట్టామని, అధిక విషం కలిగిన పాములు ఎన్ని పట్టామో తనకే తెలియదని పేర్కొన్నారు. మాసి సడయన్ మాట్లాడుతూ పద్మశ్రీ రావడం గొప్ప ఘతన అని ఈ ఆనందానికి మాటలు లేవని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: వైద్యంలో అతడి సేవలు అమోఘం.. వరించిన పద్మశ్రీ -
1971 యుద్ధంలో సేవలు.. రెండు రూపాయల డాక్టర్‌కు పద్మశ్రీ.. ఆయన ఎవరంటే?
దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. కాగా, పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో ఓ ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే డాక్టర్ ఎమ్సీ దావర్. మధ్యప్రదేశ్‌కు చెందిన దావర్(77)ను స్థానికులు 20 రూపాయల డాక్టర్ అని కూడా పిలుస్తారు. దావర్.. అతని వద్దకు వచ్చిన పేషంట్స్‌కు కేవలం రూ.20 మాత్రమే ఫీజు తీసుకుని వారికి వైద్యం అందిస్తుంటారు. అందుకే దావర్‌కు 20 రూపాయల డాక్టర్ అనే పేరు వచ్చింది. దావర్ వివరాలు ఇవే.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఎమ్సీ దావర్ పద్మశ్రీ దక్కించుకున్నారున. అయితే, డాక్టర్ దావర్ జనవరి 16, 1946న పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన తర్వాత భారత్‌లోకి వచ్చారు. 1967లో దావర్ జబల్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారత సైన్యంలో దావర్ సుమారు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. ఆ తర్వాత 1972 నుండి జబల్పూర్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పేషంట్స్ వద్ద నుంచి కేవలం రూ.2 మాత్రమే తీసుకుని వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం తన ఫీజును రూ.20కి పెంచి అందరికీ వైద్యం అందిస్తున్నారు. కాగా, పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా దావర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దావర్ మీడియాతో మాట్లాడుతూ..‘కష్టపడితే కొన్నిసార్లు ఆలస్యమైనా ఫలితం మాత్రం ఉంటుంది. దాని ఫలితంగానే నేను ఈ అవార్డును అందుకున్నాను. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. అందుకే పేషంట్స్ వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం లేదు. విజయం ప్రాథమిక మంత్రం ఏంటంటే.. ఓపికగా పనిచేస్తే కచ్చితంగా విజయం దక్కుతుంది. అలాగే గౌరవం కూడా అందుతుంది’ అని కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో దావర్ కుమారుడు రిషి కూడా తన తండ్రికి పద్మ పురస్కారం అందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా పరపతి ఉంటేనే అవార్డులు ఇస్తారని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ, ప్రభుత్వం మా లాంటి వారిని కూడా గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి వారిని గుర్తించి సత్కరిస్తున్న తీరు చాలా మంచి విషయం. మా నాన్నకు ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఇది మాకు, మా కుటుంబానికి, మా నగరానికి చాలా గర్వకారణమని దావర్ కోడలు సుచిత అన్నారు. -
పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: పద్మ అవార్డు గ్రహీతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విశేష ప్రతిభతో అవార్డులు గెలుచుకోవడం గర్వించదగిన విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 91 మందికి పద్మశ్రీ, 9 మందికి పద్మభూషణ్, ఆరుగురికి పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ఏడుగురికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. చదవండి: (‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి) -
‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి
సాక్షి, న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి ఆరుగురికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ దక్కింది. 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ దివంగత నేత ములాయంసింగ్ యాదవ్‌తో పాటు ప్రముఖ తబల వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ గ్రహీతల్లో ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, సుధామూర్తి, గాయకురాలు వాణీ జయరాం తదితరులు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరిలో ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్ సహా ఏడుగురు, తెలంగాణ నుంచి సాహితీవేత్త బి.రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం ముగ్గురున్నారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కమలేశ్ డి.పటేల్‌కు కూడా తెలంగాణ కోటాలో పద్మభూషణ్ దక్కడం విశేషం. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా దూదేకుల ఖాదర్ వలీకి కర్నాటక కోటాలో పద్మశ్రీ లభించింది. పద్మ అవార్డుల విజేతల్లో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి చెందినవారున్నారు. పద్మ పురస్కారాల విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషి సాటిలేనిదంటూ ప్రశంసించారు. ప్మద అవార్డుల గ్రహీతలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్ ములాయంసింగ్ యాదవ్ (మరణానంతరం), జాకీర్ హుస్సేన్, ఎస్ఎం కృష్ణ, ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషీ (మరణానంతరం), ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలనబిస్ (మరణానంతరం), ఇండో–అమెరికన్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్ పద్మభూషణ్ చినజీయర్ స్వామి (ఆధ్యాత్మిక రంగం), కుమారమంగళం బిర్లా (వాణిజ్యం, పరిశ్రమలు), వాణీ జయరాం (కళ), సుధామూర్తి (సామాజిక సేవ), కమలేష్ డి.పటేల్ (ఆధ్యాత్మిక రంగం), ఎస్ఎల్ భైరప్ప (కళ), దీపక్‌ధర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సుమన్ కల్యాణ్‌పుర్ (కళ), కపిల్ కపూర్ (సాహిత్యం–విద్య) పద్మశ్రీ ఏపీ నుంచి: సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (కళ), సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), గణేశ్ నాగప్పకృష్ణరాజనగర (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సీవీ రాజు (కళ), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ), ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం–విద్య). తెలంగాణ నుంచి: మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం–విద్య). పద్మశ్రీ దక్కిన ప్రముఖుల్లో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలీతో పాటు స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం), సినీ నటి రవీనా టాండన్ తదితరులున్నారు. -
‘పద్మ’ నామినేషన్లకు ఆఖరు తేదీ 15
న్యూఢిల్లీ: పద్మ అవార్డులు–2023కు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్లైన్ పోర్టల్ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది. ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్ ఇన్ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్ గోపాలరత్న–2022కు, నేషనల్ వాటర్ అవార్డ్స్‌కు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్–2023కి అక్టోబర్ 31 చివరి తేదీ అని వివరించింది. -
‘పద్మ’ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం–2023 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లను ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు https://padmaawards.gov.in పోర్టల్ ద్వారా స్వీకరిస్తామని తెలిపింది. వివిధ కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజాసంబంధాలు, సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమ మొదలైన రంగాలు, విభాగాలలో విశిష్టమైన, అసాధారణ విజయాలు, సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు. -
పద్మభూషణ్ అందుకున్న కృష్ణ ఎల్ల దంపతులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో సేవలు చేసినవారికి అందజేసే పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. సోమవారం 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం పద్మజారెడ్డి, రామచంద్రయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తనకు మహాశివుడు ఇచ్చిన వరమని, దీనిని తన నాట్య గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నానని పద్మాజారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆదివాసీ కథలే తనను ఈ స్థాయికి తెచ్చాయని సకిని రామచంద్రయ్య అన్నారు. (చదవండి: గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా) -
ఘనంగా ‘పద్మ పురస్కారాల ’ ప్రదానోత్సవం (ఫోటోలు)
-
భారత ప్రజలారా.. మీకు కృతజ్ఞతలు.. ఎమోషనలైన సత్య నాదెళ్ల
మాతృదేశాన్ని, ఇక్కడి ప్రజలను తలుచుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భావోద్వేగానికి లోనయ్యారు. గణతంత్రదినోత్సవ వేడుకల వేళ భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పద్మభూషన్ అవార్డును ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఎమెషనల్ అయ్యారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రిలతో ఇక్కడి ప్రజలకు కృతజ్ఞనతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులతో పాటు ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ చెప్పారు. It’s an honor to receive a Padma Bhushan Award and to be recognized with so many extraordinary people. I’m thankful to the President, Prime Minister, and people of India, and look forward to continuing to work with people across India to help them use technology to achieve more. — Satya Nadella (@satyanadella) January 27, 2022 సత్యనాదెళ్లతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్‌కి సైతం కేంద్రం పద్మభూషన్ అవార్డును ప్రకటించింది.. దీనిపై ఆయన స్పందిస్తూ వివిధ రంగాల్లో గొప్ప ప్రతిభ చూపిన వ్యక్తులతో కలిసి ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. -
పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం
న్యూఢిల్లీ: తమకు ప్రకటించిన పద్మ పురస్కారాలను పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, ప్రముఖ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ తిరస్కరించారు. పద్మభూషణ్ అవార్డు స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనని బుద్ధదేవ్ చెప్పినట్టు సీపీఎం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలు తీసుకోరాదన్నది తమ పార్టీ విధానమని స్పష్టం చేసింది. తాము ప్రజల కోసం పనిస్తామని, అవార్డుల కోసం కాదని ప్రకటించింది. గతంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్‌కు ‘పద్మ’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన దానిని తిరస్కరించారని సీపీఎం వెల్లడించింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును నంబూద్రిపాద్ నిరాకరించారు. దేశాన్ని అవమానించడమే.. గులాం కావాలనుకోవడం లేదు పద్మభూషణ్‌ను తిరస్కరించడం ద్వారా భట్టాచార్జీ దేశాన్ని అవమానించారని, బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ అన్నారు. పద్మ అవార్డులు ఏ ఒక్క పార్టీకి లేదా సిద్ధాంతానికి చెందినవి కాదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ‘ఆయన ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నారు. గులాం అవ్వాలను కోవడం లేద’ని వ్యాఖ్యానించారు. (చదవండి: కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్) అవమానంగా ఉంది.. అవార్డు వద్దు: సంధ్యా ముఖర్జీ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని నిరాకరించినట్లు పీటీఐ తెలిపింది. ఆలస్యంగా ఎంపిక చేసినందుకు ఆమె అవార్డును వద్దనుకున్నట్టు సమాచారం. ‘90 సంవత్సరాల వయస్సులో సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు స్వర ప్రస్థానం సాగించిన సంధ్యా ముఖర్జీకి ఇంత ఆలస్యంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం ఆమెను కించపరచడమేన’ని ఆమె కుమార్తె సౌమీ సేన్‌గుప్తా అన్నారు. అవార్డును తిరస్కరించడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఆ దశను ఎప్పుడో దాటాను: అనింద్య ఛటర్జీ ప్రముఖ తబలా విద్వాంసుడు పండిట్ అనింద్య ఛటర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించినట్టు వెల్లడించారు. అవార్డు కోసం తన సమ్మతిని కోరుతూ ఢిల్లీ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ప్రతికూలంగా స్పందించినట్టు ‘పీటీఐ’కు తెలిపారు. ‘పద్మ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించాను. నాకు అవార్డు ఇవ్వాలని అనుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాను. నా కెరీర్లో ఈ దశలో పద్మశ్రీని అందుకోవడానికి సిద్ధంగా లేనని.. ఆ దశను ఎప్పుడో దాటాన’ని అన్నారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. (చదవండి: బిపిన్, ఆజాద్‌లకు పద్మవిభూషణ్..)