సాక్షి, హైదరాబాద్: ‘పద్మ’ పురస్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 23 మంది పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఏడాది జనవరిలో పంపించిన 22 పేర్లకు అదనంగా ఈ కొత్త పేర్లను సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ తమకు అందిన నామినేషన్లను పరిశీలించి ఈ జాబితాను సిద్ధం చేసింది. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటిస్తుంది.
గత ఏడాది జాబితాలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్, సార్వత్రిక విశ్వవిద్యాలయ రూపకర్త ఆచార్య రామిరెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పేర్లను పద్మ విభూషణ్‌కు ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈసారి ప్రొఫెసర్ కె.శివకుమార్, ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు పేర్లను పద్మ విభూషణ్ పురస్కారానికి సూచించింది.
పద్మ పురస్కారాలకు పంపిన జాబితాలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన మలావత్ పూర్ణ, ఆనంద్‌కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, కూచిపూడి నృత్య కళాకారిణి జి.పద్మజారాణి, ఇటీవల మరణించిన గజల్ కళాకారుడు ఎస్.విఠల్‌రావు, కళాకారులు చుక్కా సత్తయ్య, చిందుల సత్యం, సామాజిక సేవలో సింగారెడ్డి బాల థెరిసా, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చింతలగిరి మోహన్‌రావు, పారిశ్రామికవేత్త బీవీఆర్ మోహన్‌రెడ్డి, వైద్య విభాగం (యోగా నేచురోపతి)లో ప్రొఫెసర్ కె.సత్యనారాయణ, సాహిత్యం, విద్య విభాగంలో డాక్టర్ జెశైట్టి రమణయ్య, ముదిగొండ వీరభద్రయ్య, వడ్డేపల్లి కృష్ణ, రావిరాల జయసింహ తదితరుల పేర్లున్నాయి. కొత్త నామినేషన్లకు మంగళవారంతో గడువు ముగియనుండటంతో ప్రభుత్వం ఈ జాబితాను పంపించింది.
పద్మ పురస్కారాలకు 23 మంది పేర్లు
Published Tue, Sep 15 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement