Screening Committee
-
రేపే ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తిచేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ ముగిసింది. అగ్రనేత సోనియా, కేసీ వేణు గోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలా, రఘువీరారెడ్డి, జెడి శీలం హాజరయ్యారు. 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చించారు. ఇందులో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్‌లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు. దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేయగా.. ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం రెండు, మూడు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు. తెలంగాణలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఖారారు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నాలుగు పార్లమెంటు స్దానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఈసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థులపైనా ఇవాళో, రేపో స్పష్టత వచ్చే అవకావం ఉంది. -
ఏ క్షణమైనా మలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. కమ్యూనిస్టులకు వదిలేసిన స్థానాలు, కొత్తగా నేతల చేరిక ఉండే సీట్లు, పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని స్థానాలు మినహా 50కిపైగా అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను సిద్ధం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఆమోదించిన ఈ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పొత్తు, ఇతర అంశాలతో పెండింగ్ పెట్టిన మిగతా స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు, చేరికలపై చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగే సీఈసీ భేటీలో ఈ సిఫార్సులను అందజేయనున్నట్టు సమాచారం. సీఈసీ దీన్ని పరిశీలించి, పొత్తు సీట్లు, అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగానే.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఒకసారి భేటీ అయిన సీఈసీ.. 55మందితో తొలి జాబితాను ప్రకటించిన విష యం తెలిసిందే. మిగతా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మలిజాబితాపై జాప్యం జరుగుతూ వచ్చింది. మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ గత వారం రెండుసార్లు భేటీ అయి అభ్యర్థుల వడపోతను పూర్తిచేసింది. ఇటీవలే అభ్యర్థుల జాబితాను సీఈసీకి నివేదించింది. బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన సీఈసీ భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్‌గాంధీ పాల్గొని చర్చించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో గెలుపు అవకాశాలు, కుల సమీకరణాలు, సర్వేల ఆధారంగా సుమారు 50 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, వనపర్తి, నారాయణ్‌ఖేడ్, శేరిలింగంపల్లి, తాండూరు వంటి 15కుపైగా నియోజకవర్గాల్లో ఇద్దరేసి అభ్యర్థులను గుర్తించిన చోట గెలుపు అవకాశాలు, విధేయతను దృష్టిలో పెట్టుకొని సీఈసీ అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖరారైన అభ్యర్థుల జాబితాను ఏ క్షణమైనా విడుదల చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం.. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం మునుగోడు స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఆయనతోపాటు బీజేపీ నుంచి చేరుతారని భావిస్తున్న మరో ఇద్దరు సీనియర్లకు సంబంధించిన సీట్లనూ పెండింగ్‌లో పెట్టారు. ఇక సీపీఎం కోరుతున్న మిర్యాలగూడ, వైరా సీట్లపై ఎలాంటి స్పష్టత రాని నేపథ్యంలో అక్కడ అభ్యర్థులను ఖరారు చేయలేదు. కాగా సీఈసీ సమావేశం జరుగుతున్న సమయంలో ఏఐసీసీ కార్యాలయం బయట ఇల్లందు నియోజకవర్గ కార్యకర్తలు కొందరు నిరసన తెలిపారు. ఇల్లందు సీటును పారాచూట్ నేతలకు కేటాయించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణలో పాగా వేస్తాం: ఖర్గే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎన్నుకోవడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఓటమి ఖాయమని గుర్తించిన బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్‌పై దాడులు చేస్తూ నిరాశను వ్యక్తం చేస్తున్నారని ట్వీట్లో ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అన్ని నేరాల్లో భాగస్వాములనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆ మూడు పార్టీలకు అబద్ధాలు, దోపిడీ, కమీషన్లు తప్ప తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి వేరే అంశాలేవీ లేవని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రజలతో పంచుకునే అపార ప్రేమాభిమానాలు న్యాయం, సంక్షేమం, ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆ స్థానాలపై మాత్రం పీటముడి పోటీ తీవ్రంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందని సమాచారం. సూర్యాపేట, తుంగతుర్తి, వరంగల్ (వెస్ట్), నిజామాబాద్ అర్బన్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పరకాల, ఎల్బీనగర్ తదితర సీట్లతోపాటు ఇతర పార్టీల నుంచి నేతలు వస్తారనే అంచనాలున్న స్థానాలపై పీటముడి పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వామపక్షాలతో పొత్తులు ఖాయమే అంటున్నా.. వారికిచ్చే సీట్లపై ఏకాభిప్రాయం రావడం లేదని అంటున్నాయి. సీపీఎం ఆశిస్తున్న పాలేరు, మిర్యాలగూడ స్థానాలను వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని పేర్కొంటున్నాయి. పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి బలమైన అభ్యర్థులని, ఆ సీట్లను సీపీఎంకు ఇచ్చినా ఓటు బదిలీ జరగక ఇరుపక్షాలు నష్టపోయే పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. సీపీఐ అడుగుతున్న కొత్తగూడెం, చెన్నూరు విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని అంటున్నారు. కీలకనేతలపై పోటీ ప్రతిపాదన లేనట్టే! ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరహా ప్రయోగం చేయాలని కాంగ్రెస్ నేతలు తొలుత భావించినా వెనక్కితగ్గినట్టు తెలిసింది. బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై పార్టీ సీనియర్లను రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలతో చర్చించినట్టు సమాచారం. కామారెడ్డిలో రేవంత్, సిద్దిపేటలో ఉత్తమ్, సిరిసిల్లలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గజ్వేల్‌లో రాజగోపాల్‌రెడ్డి ఇలా ఎవరెక్కడ పోటీ చేయాలన్న ప్రతిపాదనలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. కానీ ఎక్కువ మంది నాయకులు రెండు చోట్ల పోటీ చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని... ఈ ప్రభావం రెండు స్థానాలపైనా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ముందే బుజ్జగింపులు షురూ! కాంగ్రెస్ అధిష్టానం మలి జాబితా విడుదలకు ముందే అసంతృప్తులను అంచనావేసి చక్కదిద్దే పనిలో పడింది. ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో టికెట్ వచ్చే అవకాశం లేని వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ అంశంపై బుధవారం రాత్రి భేటీ అయి చర్చించినట్టు తెలిసింది. టికెట్ రాని నేతలకు భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామని పక్కాగా హామీ ఇవ్వాలని.. రెబెల్ అభ్యర్థులు లేకుండా చూసుకుంటూ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలేవీ లేవన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆశావహులతో ఫోన్లో మాట్లాడటం లేదా సీనియర్ నేతలను పంపి బుజ్జగించడం, ఢిల్లీకి పిలిపించుకుని హామీ ఇవ్వడం వంటి మార్గాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై వేణుగోపాల్, రేవంత్ చర్చించినట్టు తెలిసింది. కాగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ పెద్దలు.. ఆ సీటును ఆశిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్‌ను బుజ్జగించేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మహేశ్‌గౌడ్‌ను కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. -
తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీ
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోన్న కాంగ్రెస్.. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశంఉంది. ‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
14న భేటీ తర్వాత అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈ నెల 14న ఢిల్లీలో భేటీ కానుంది. అంతకంటే ముందురోజు తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరోమారు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 14న సీఈసీ భేటీ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని, దసరా తర్వాత మలి జాబితా రానుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేసి, స్క్రీనింగ్ కమిటీ సమరి్పంచిన నివేదికల ఆధారంగా సీఈసీ ఫైనల్ చేయనుంది. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఈ భేటీపై ఇప్పటికే కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 9న భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 70కిపైగా స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మిగతా స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థుల పేర్లతో జాబితాను రూపొందించింది. ఒక్కో స్థానంలో ఖరారైన అభ్యర్థుల జాబితాపై సీఈసీలో ఎలాంటి అభ్యంతరాలు లేనిపక్షంలో వాటిని యథావిధిగా ఆమోదించనున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే సహేతుక కారణాలను చూపి మరో అభ్యర్థిని ముందుకు తెచ్చే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇద్దరేసి అభ్యర్థులున్న చోట్ల ఎంపిక నిర్ణయానికి సీఈసీ కొన్ని మార్గదర్శకాలు సూచిస్తుందని, వాటికనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్నాయి. ఈ నెల 16 లేదా 18న తొలి జాబితా విడుదల చేసేలా ఇప్పటికే నేతల నుంచి హైకమాండ్‌కు ఒత్తిళ్లు పెరిగాయి. దానికి అనుగుణంగా వారంలోనే జాబితా విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ
-
Telangana Congress: 70 సీట్లు ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఓ కొలిక్కి తెచ్చింది. రాజకీయ అనుభవం, కుల సమీకరణాలు, ఆర్ధిక పరిస్థితులు, సర్వేలను బేరీజు వేసుకుంటూ దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరని మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై మరో సారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించింది. ఏకాభిప్రాయం రాని స్థానాలకు ఇద్దరు చొప్పున పేర్లతో జాబితా సిద్ధం చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని.. వారు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా పేర్లను ఖరారు చేయాల ని తీర్మానించింది. ఇప్పటికే ఒక్కో పేరును ఖరారు చేసిన నియోజకవర్గాల జాబితాకు సీఈసీ అను మతి తీసుకుని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14 తర్వాత సీఈసీ భేటీ అయి అభ్యర్థుల జాబితాలను పరిశీలించనుందని.. ఈ నేపథ్యంలో ఈ నెల 16న లేక 18న తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి ముఖ్య నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించడంతో.. ఆ బస్సు యాత్ర పూర్తయ్యాక అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఆలోచన కూడా ఉందని అంటున్నాయి. వాడీవేడిగా సమావేశం.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో భేటీ అయింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నెలలో ఖరారు చేసిన కొన్ని స్థానాలు సహా మొత్తంగా 70 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసి.. ఒక్కో పేరుతో జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సుమారు 10 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీ ఆసాంతం నేతల వాదనలు, అభిప్రాయాలతో వాడీవేడీగానే జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని నియోజకవర్గాలపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇంకొన్ని చోట్ల కుల సమీకరణాలపై ఎవరి వాదన వారే వినిపించడంతో సమావేశం హీటెక్కినట్టు పేర్కొన్నాయి. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్, జూబ్లీహిల్స్, ఆసిఫాబాద్, జనగాం, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, సికింద్రాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు అంశంపై నేతలు వేర్వేరు పేర్లను సూచించినట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా గెలవగలిగే వారిని ఖరారు చేయాలని కొందరు సూచిస్తే.. సీనియారిటీ, పార్టీకి పనిచేసిన అనుభవం, ఆర్థిక, కుల సమీకరణాల ఆధారంగా ఎంపిక ఉండాలని ఇంకొందరు పట్టుబట్టినట్టు సమాచారం. ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలంటూ.. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమకారులు కాంగ్రెస్ వార్‌రూమ్ ముందు నిరసనకు దిగారు. టికెట్లు ఆశిస్తున్న కురువ విజయ్‌కుమార్ (గద్వాల), మానవతారాయ్ (సత్తుపల్లి), పున్నా కైలాశ్ నేత (మునుగోడు), దుర్గం భాస్కర్ (చెన్నూరు), కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్), ఇతర నేతలు అక్కడ ఆందోళన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తమకు టికెట్లు ఇవ్వాలని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్రసింగ్ వారితో మాట్లాడి, అన్ని అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీలైనంత త్వరగా తొలి జాబితా: ఠాక్రే ఆదివారం రాత్రి స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. పార్టీ సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుందని.. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను సీఈసీకి అందిస్తామని చెప్పారు. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పీసీసీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు. వచ్చిన అన్ని దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ భేటీలో పరిశీలించామని.. అన్నివర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నామని వివరించారు. అయితే టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీదే (సీఈసీ)నని చెప్పారు. కాగా.. త్వరలో సీఈసీ సమావేశం ఉండే అవకాశం ఉందని, వారం, పది రోజుల్లో తొలి జాబితా విడుదల చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు ఇలా.. (పీసీసీ వర్గాల సమాచారం మేరకు) 1. కొడంగల్ – రేవంత్‌రెడ్డి 2. హుజూర్నగర్ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. మధిర – భట్టి విక్రమార్క 5. మంథని – శ్రీధర్‌బాబు 6. జగిత్యాల – జీవన్‌రెడ్డి 7. ములుగు – సీతక్క 8. భద్రాచలం – పొదెం వీరయ్య 9. సంగారెడ్డి – జగ్గారెడ్డి 10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 11. అలంపూర్ – సంపత్‌కుమార్ 12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి 13. కామారెడ్డి – షబ్బీర్ అలీ 14. పాలేరు – తుమ్మల నాగేశ్వర్రావు 15. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి 16. పరిగి – రామ్మోహన్‌రెడ్డి 17. వికారాబాద్ – గడ్డం ప్రసాద్‌కుమార్ 18. మహేశ్వరం – చిగురింత పారిజాత నర్సింహారెడ్డి 19. ఆలేరు – బీర్ల ఐలయ్య 20. దేవరకొండ – ఎన్.బాలూనాయక్ 21. వేములవాడ – ఆది శ్రీనివాస్ 22. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 23. జడ్చర్ల – అనిరుధ్‌రెడ్డి 24. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్ 25. కోరుట్ల– జువ్వాడి నర్సింగ్‌రావు 26. అచ్చంపేట – వంశీకృష్ణ 27. జహీరాబాద్ – ఎ.చంద్రశేఖర్ 28. ఆందోల్ – దామోదర రాజనర్సింహ 29. మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌రావు 30. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు 31. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్‌రెడ్డి 32. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ 33. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ 34. షాద్‌నగర్ – వీర్లపల్లి శంకర్ 35. నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్ 36. ఎల్బీనగర్ – మధుయాష్కీగౌడ్ 37. కల్వకుర్తి– కసిరెడ్డి నారాయణరెడ్డి 38. అశ్వారావుపేట– తాటి వెంకటేశ్వర్లు 39. పటాన్చెరు – కాట శ్రీనివాస్‌గౌడ్ 40. సూర్యాపేట – ఆర్.దామోదర్‌రెడ్డి 41. గద్వాల – సరితా తిరుపతయ్య 42. నాగర్‌కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి 43. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్ 44. ముషీరాబాద్ – అంజన్‌కుమార్ యాదవ్ 45. శేరిలింగంపల్లి – రఘునాథ్ యాదవ్ 47. ముథోల్ – ఆనందరావు పటేల్ 48. బెల్లంపల్లి – గడ్డం వినోద్‌కుమార్ 49. ఇల్లెందు – కోరం కనకయ్య 50. చొప్పదండి – మేడిపల్లి సత్యం 51. నారాయణపేట – ఎర్ర శేఖర్ 52. రామగుండం – రాజ్‌ఠాకూర్ 53. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్‌రెడ్డి 54. గజ్వేల్ – తూంకుంట నర్సారెడ్డి 55. నిర్మల్ – శ్రీహరిరావు 56. భువనగిరి – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 57. పెద్దపల్లి – విజయరమణారావు 58. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి 59. పాలకుర్తి – హనుమాండ్ల ఝాన్సీ 60. మహబూబ్‌నగర్ – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 61. ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగారెడ్డి 62. ఖానాపూర్ – ఎడ్మ బొజ్జు 63. బాల్కొండ – ఆరెంజ్ సునీల్‌రెడ్డి 64. రాజేంద్రనగర్ – జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 65. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్ 66. తాండూర్ – వై.మనోహర్‌రెడ్డి 67. సిరిసిల్ల – కేకే మహేందర్‌రెడ్డి 68. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 69. మల్కాజ్గిరి – మైనంపల్లి హన్మంతరావు 70. కంటోన్మెంట్ – వెన్నెల (గద్దర్ కుమార్తె) -
కొలిక్కిరాని తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
ఢిల్లీ: నేడు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాలేదు. దీంతో స్క్రీనింగ్ కమిటీలో సభ్యులతో ఛైర్మన్ మురళీధరన్ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా పిలిచి మాట్లాడుతున్నారు. తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరోసారి జరగనుంది. అటు.. అభ్యర్థులు ఎంపిక సాగదీతతో ప్రచారంలో వెనుకబడి పోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రియాంక, రాహుల్ బస్సు యాత్రల తర్వాతనే లిస్ట్ విడుదల చేస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్రకు ముందే లిస్ట్ విడుదల చేస్తే పంచాయతీలు జరిగే అవకాశం ఉందని అధిష్టానం భయపడుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు సమావేశమైంది. 70 సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికపై నేడు సమావేశమైంది. కానీ ఎటూ తేలకపోవడంతో మరోసారి సమావేశం కానుంది. ఎంపిక చేయాల్సిన దాదాపు 30 సీట్లలో ఒక్కో స్థానంలో ఇద్దరు, ముగ్గురు పోటీ పడటంతో అభ్యర్థుల ఎంపిక కమిటీకి తలనొప్పిగా తయారైంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేస్తాం. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తాం. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుంది. బిసిలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం.. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చింది. అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను మేము పరిశీలించాం. అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నాం. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే’ అని తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. ఆ 30 సీట్లలో తీవ్ర పోటీ ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. ఆ 30 సీట్లలో తీవ్ర పోటీ
ఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ 70 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది. మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపిక కోసం నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. 30 సీట్లలో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఆ 30 నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలపై కాంగ్రెస్ పార్టీ ఫ్లాష్ సర్వే నిర్వహించింది. సర్వే రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేయనుంది. నేడు మరిన్ని సీట్లలో అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వార్ రూమ్ ఎదుట కాంగ్రెస్ టికెట్ ఆశావహులు ధర్నా నిర్వహించారు. ఓయూ విద్యార్థులకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో కురువ విజయ్, మానవతారాయ్, కేతురి వెంకటేష్ , పున్న కైలాష్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల పోటీ ఒకరికి మించి ఉన్న నియోజకవర్గాలు జనగామ: కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తుంగతుర్తి: డాక్టర్ రవి, పిడమర్తి రవి సత్తుపల్లి: సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ గద్వాల: సరిత, కురువ విజయ్ మునుగోడు: కృష్ణా రెడ్డి, పున్న కైలాష్ నేత, స్రవంతి రెడ్డి రామగుండం: హర్కార వేణుగోపాల్, రాజ్ ఠాకూర్ వనపర్తి: మేఘారెడ్డి, చిన్నారెడ్డి దేవరకద్ర: కొత్తకోట సిద్దార్థరెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి హుజూరాబాద్: బల్మూరు వెంకట్, వడితెల ప్రణవ్ సూర్యాపేట: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి మక్తల్: పర్ణికారెడ్డి, శ్రీహరి ముదిరాజ్ ఖైరతాబాద్: విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్, మరో నేత కరీంనగర్: జైపాల్‌రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్, కె. నరేందర్‌రెడ్డి చొప్పదండి: మేడిపల్లి సత్యం, సత్తు మల్లేశం దుబ్బాక: చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, కత్తి కార్తీక నర్సాపూర్: ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్ కుమార్ స్టేషన్ ఘన్పూర్: సింగాపురం ఇందిర, మరో నేత కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు, డాక్టర్ కేతూరి వెంకటేష్ మహబూబాబాద్: బలరాం నాయక్, మురళీ నాయక్ డోర్నకల్: రామచంద్రనాయక్, నెహ్రూ నాయక్, వరంగల్ వెస్ట్: నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి పరకాల: కొండా మురళి, ఇనగాల వెంకట్రామిరెడ్డి జూబ్లీహిల్స్: అజరుద్దీన్, విష్ణు కూకట్పల్లి: సతీష్, మురళి, గొట్టిముక్కల వెంగళ్రావు దేవరకొండ: బాలు నాయక్, ప్రవళిక కిషన్ నాయక్ ఇదీ చదవండి: TS Election 2023: పరిగి బరిలో శైలేందర్‌రెడ్డి? -
ఢిల్లీ: వార్ రూంలో కొనసాగుతున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
-
నేడు మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ
-
ఖరారుకు ముందే తకరారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్లు ఎవరెవరికి ఇచ్చేదీ ఇంకా ఖరారుకాక ముందే అసమ్మతి సెగ మొదలైంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో జరుగుతున్న చర్చలు, ఖరారయ్యాయని భావిస్తున్న స్థానాల గురించిన సమాచారం బయటికి వస్తుండటంతో అసంతృప్తులు గళం విప్పుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ.. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొత్త మనోహర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆశావహుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మాల, మాదిగ, లంబాడీ, ఆదివాసీ, పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర కేటగిరీల పేరుతో ఇప్పటికే టికెట్ల కోసం డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీకి బీసీ నేతలు ఈసారి బీసీలకు టికెట్ల కేటాయింపు కాంగ్రెస్‌లో పెద్ద చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున 34 స్థానాలు బీసీలకు ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు తమకు కనీసం 34 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని.. వాటిని 40 వరకు పెంచాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పలుమార్లు సమావేశం కావడంతోపాటు ఇప్పుడు హస్తిన బాట పట్టారు. బీసీ నేతలు బుధవారమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాల్సి ఉన్నా.. ఆయన బెంగళూరులో ఉండటంతో వీలుకాలేదు. అందుబాటులో ఉన్న అధిష్టానం నేతలను కలుస్తున్న బీసీ నేతలు.. గురువారం ఖర్గేను, వీలుంటే రాహుల్‌ను కలిసే అవకాశం ఉందని సమాచారం. అయితే టీపీసీసీ నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అన్న దానిపై బీసీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలలో మంచి ఫలితాలు రావడం లేదన్న సాకు చూపి తమకు ఇవ్వాల్సిన టికెట్లను అగ్రవర్ణాలకు కేటాయించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అందుకే తొలి జాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా చేసి, వారిని టికెట్ ఒత్తిడిలో ఉంచి మిగతా వారి కోసం మాట్లాడకుండా చేయాలనే ప్రయత్నమని పేర్కొంటున్నారు. ఈసారి టికెట్ల కేటాయింపులో తేడా వస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే టికెట్లు ఆశిస్తున్న బీసీల్లో ఎక్కువ శాతం అగ్రవర్ణ నాయకులతోనే పోటీ పడుతుండటంతో.. తమను కాదని ఓసీ నేతలకు టికెట్లు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మాకు మరో మూడు సీట్లివ్వండి ఎస్టీ నేతలు కూడా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలను కోరుతున్నారు. 40–50 స్థానాల్లో ప్రభావితం చేయగల తమ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన 12 అసెంబ్లీ సీట్లకుతోడు కనీసం మరో 3 జనరల్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా లంబాడా, కోయ (ఆదివాసీ) సామాజిక వర్గాలకు ఏయే సీట్లు ఇవ్వాలనే విభజన కూడా చేస్తున్నారు. దేవరకొండ, వైరా, ఖానాపూర్, బోథ్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు స్థానాలు లంబాడాలకు ఇవ్వాలని.. ఆసిఫాబాద్‌లో ఆదివాసీలకు, ములుగు, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక కోయ వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు. అంతేగాకుండా తెలంగాణలో 31 లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉందని.. జనాభా ప్రాతిపదికన మరో మూడు జనరల్ స్థానాల్లో కూడా ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తాము కూడా బీసీ నేతల తరహాలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని కూడా పేర్కొనడం గమనార్హం. బుజ్జగింపులు షురూ అసమ్మతి కుంపట్లపై ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను రంగంలోకి దింపింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే తన పని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు మరింత ముమ్మరం చేశారు. గాందీభవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. నేతలతో మాట్లాడుతూ.. పార్టీపై నమ్మకం ఉంచాలని, టికెట్ వచ్చినా, రాకపోయినా సహకరించాలని కోరుతున్నారు. మొత్తమ్మీద టికెట్ల ప్రకటన ఘట్టం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అటు ఉత్కంఠతోనూ, ఇటు ఆందోళనతోనూ ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కోచోట పది మంది.. కాంగ్రెస్ టికెట్ల కోసం పదిమందికిపైగా దరఖాస్తు చేసుకున్న స్థానాలు 50కి పైగా ఉన్నాయి. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు గట్టిగానే యత్నిస్తున్నారు. వివిధ సమీకరణాల్లో లాబీయింగ్ చేసుకుంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా నేతలు రోడ్డెక్కే అవకాశాలున్నాయి. ముఖ్య నాయకులపై ఉన్న అసంతృప్తిని కక్కేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోవాలని కొందరు, పార్టీలోనే ఉండి తమకు అన్యాయం చేసిన నేతలను బహిరంగంగా విమర్శించాలని మరికొందరున్నట్టు సమాచారం. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించిన మహేశ్వరం నేత కొత్త మనోహర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. అధికారికంగా టికెట్లు ప్రకటించాక ఎన్ని చోట్ల అసమ్మతి రగులుతుంది? దాన్ని చల్లార్చే యత్నాలు ఏమేరకు గట్టెక్కుతాయి? టికెట్లు రాక రోడ్డెక్కేనేతలపై ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. -
కాంగ్రెస్‌లో ‘సర్వే’ల పీటముడి!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు ప్రక్రియలో ‘సర్వే’ల అంశంతో పీటముడి పడుతోంది. సర్వేల ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తామని ఏఐసీసీ, టీపీసీసీ నేతలు ముందునుంచీ చెప్తూనే ఉన్నా.. అలా చేస్తే ఇబ్బందికరమేనన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 60 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, ఆయా స్థానాల్లో ఒక్కో పేరునే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని నేతలు నిర్ణ యించారు. మరో 30–35 సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు. ఈ స్థానాల్లో సర్వేల్లో వెల్లడైన బలాబలాల ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయాలని కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదన సరికాదని మరికొందరు నేతలు పేర్కొంటున్నట్టు తెలిసింది. కొత్తగా వచ్చిన నాయకులను సర్వేల ఆధారంగా కొన్నిచోట్ల మాత్రమే ఖరారు చేయవచ్చని, మిగతా చోట్ల సర్వేలతోపాటు పార్టీకి విధేయత, ఇతర కోణాలనూ సరిచూసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వేలను పునఃపరిశీలించడంతోపాటు ఆశావహు లతో మాట్లాడి, టికెట్లు ఇవ్వలేని నేతలను బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఈనెల 25న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఆ భేటీ ముగిశాక ఈ నెల 28న లేదా 29న స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ అవుతుందని, అది ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీ తర్వాత మెజార్టీ స్థానాలపై ఏకాభిప్రాయం తీసుకుని, సీఈసీ ఆమోదంతో ఒకేసారి జంబో జాబితా విడుదల చేస్తామని అంటున్నాయి. కొంత ఆలస్యమైనా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడమే మేలనే అభిప్రాయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారని వివరిస్తున్నాయి. ఈ క్రమంలో జాబితాల విడుదల వాయిదా పడే అవకాశమూ ఉందని పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్యారాచూట్లకు టికెట్లా? స్క్రీనింగ్ కమిటీలో జరిగిన చర్చ ప్రకారం ప్యారాచూట్లకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే టికెట్లు వచ్చే అవకాశం ఉందన్న దానిపై కాంగ్రెస్‌లోని సీనియర్ ఆశావహులు రగిలిపోతున్నారు. ప్యారాచూట్లకు టికెట్లు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉప్పల్, గద్వాల, దుబ్బాక, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్ సహా పలుచోట్ల ప్యారాచూట్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సర్వేలు ఎలా అనుకూలంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉండటంతోనే సర్వేలు అనుకూలంగా చూపుతున్నాయని.. అందువల్ల పార్టీలో ముందునుంచీ ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేశం చేరిక వాయిదా! నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమం వాయిదా పడింది. ఆయన శనివారమే రాహుల్ లేదా ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలు అందుబాటులో లేనందున వీరేశంతోపాటు వెళ్లిన ఆయన ప్రధాన అనుచరులు మాత్రం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వీరేశంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అవకాశాన్ని బట్టి అగ్రనేతలు అందుబాటులో ఉంటే ఢిల్లీలోనే చేరికల కార్యక్రమం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, వ్యాపారవేత్త పి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శనివారం ఢిల్లీలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. -
ముగిసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటి సమావేశం
ఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటి సమావేశం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాను పూర్తి చేశారు. దాదాపు 60 శాతానికిపైగా ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ నిన్న, ఇవాళ సుధీర్ఘంగా 5 గంటలపాటు చర్చించింది. త్వరలోనే సీఈసీ సమావేశం తర్వాత జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్ కేటాయింపులపై వార్‌రూంలో రేవంత్, ఉత్తమ్ మధ్య వాడీవేడీ వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశం కానున్నట్లు స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసింది. సర్వేల్లో అభ్యర్థుల ఫలితాలు, ఆయా స్థానాల్లో పార్టీ బలబలాలు, ప్రత్యర్థి అభ్యర్థులను బట్టి కాంగ్రెస్ పార్టీ తమ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల బృందానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభ్యర్థుల జాబితాపై పూర్తిగా కసరత్తు చేసినట్లు స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: తెలంగాణ: షర్మిల పార్టీకి ఝలక్.. బీఆర్ఎస్లోకి ఏపూరి సోమన్న -
TS: ఎన్నికల కసరత్తును స్పీడప్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్పీడప్ చేసింది అధిష్టానం. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ వార్ రూమ్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశం మూడు గంటలుగా సాగుతోంది. ఈ భేటీలో అభ్యర్ధుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. ఒకేసారి అభ్యర్థుల జాబితా ప్రకటించాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశానికి జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధిక్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, భట్టి విక్రమార్క. హాజరయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి ఆ నివేదికను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ తీసుకొచ్చింది. 119 నియోజకవర్గాలకు దాదాపు 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిఫారసు చేసింది. కాగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధవారం కూడా భేటీ అయ్యింది. రెండున్నర గంటల పాటు అభ్యర్థులపై కసరత్తు చేశారు. అయితే నిన్న లోక్‌సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ కారణంగా అర్థాంతరంగా సమావేశం నిలిచిపోయింది. నేటి రోజు సమావేశంతో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కిరానుంది. హైదరాబాద్: మరోవైపు హైదరాబాద్‌లో గాంధీ భవన్లో శ్రీధర్ బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలపైనా కమిటీ కసరత్తు చేసింది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, కేటీఆర్..హరీష్ రావు ఎప్పుడొస్తారో చెబితే కర్ణాటక అంతా తిప్పి ఆ అమలును చూపిస్తామంటూ శ్రీధర్ బాబు సవాల్ విసిరారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం.. మేము హామీ ఇచ్చామంటే అమలు చేసి తీరుతాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రజలు ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారో అలాంటి హామీలు ఇస్తాం. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తాం. జిల్లాలు, నియోజక వర్గాలలో కూడా అక్కడి ప్రత్యేక అంశాలతో స్థానిక మేనిఫెస్టో లు రూపొందిస్తాం. మెగా డిఎస్సి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 13,500 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సి వేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం అని శ్రీధర్ బాబు తెలిపారు. చదవండి: ‘కాంగ్రెస్ నాయకురాలికి డబుల్ ఇల్లు ఇచ్చాం.. ఇప్పుడేమంటారు’ -
Congress Bus Yatra in Telangana 2023: వచ్చే నెలలో కాంగ్రెస్ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా ఇందులో కలసి పాల్గొననున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు కోసం బుధ, గురువారాల్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరపాలని టీపీసీసీ నిర్ణయించింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో భాగంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన ఎంపీలు ఉత్తమ్, రేవంత్ ఢిల్లీలోనే ఉండటంతో.. అక్కడే రెండు రోజుల పాటు కసరత్తు పూర్తి చేసి.. అభ్యర్థుల షార్ట్ లిస్ట్ జాబితాను ఏఐసీసీకి ఇవ్వాలని భావించారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్ ప్రక్రియతో ఎంపీలు ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. వారు లోక్‌సభ నుంచి వచ్చాక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు ఠాక్రే, భట్టి తదితరులతో కలసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించారు. అక్టోబర్ తొలివారంలో మొదలుపెట్టి, 10–12 రోజుల పాటు బస్సుయాత్ర చేపట్టాలని.. యాత్ర రూట్‌మ్యాప్, షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇక గురువారం తిరిగి స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఖరారు కసరత్తు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. కమిటీలోకి మరో ఇద్దరు.. స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు నాయకులను తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా నియమించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి, మధుయాష్కీలకు చోటు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు సీనియర్ నేతలకు స్థానం దక్కింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్లకు చోటు కల్పించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంపీ మురళీధరన్ అధ్యక్షతన సభ్యులుగా గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధికి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కి లకు అందులో స్థానం లభించింది. ఇదీ చదవండి: ఆసక్తికరంగా సెకండ్ లిస్ట్.. భారం దించుకోనున్న స్క్రీనింగ్ కమిటీ! ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే! -
ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే!
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక దఫాలుగా చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు దేశ రాజధాని హస్తినలో అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించింది. ఏఐసీసీ కార్యాలయంలో రెండురోజులపాటు సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఇదే చివరి భేటీ కాగా.. ఆ తర్వాతి బంతి హైకమాండ్ కోర్టుకు చేరుతుంది. దీంతో.. టీ కాంగ్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితా ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ తొలుత ఈనెల ఆరో తేదీన హైదరాబాదులో సమావేశమైంది. వరుసగా పీఈసీ సభ్యులను, డీసీసీ అధ్యక్షులను, మాజీ మంత్రుల అభిప్రాయాలు తీసుకుంది. అయితే సమయం సరిపోక మరోసారి భేటీ అవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు హస్తినలో భేటీ అయింది. స్క్రీనింగ్ కమిటీలో ఛైర్మన్ మురళీధరన్ ,జిగ్నేష్ మేవాని, సిద్దిఖీ ,ఎక్స్ అఫిషియో సభ్యులు ఇంఛార్జి ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు. ఏకాభిప్రాయం కుదిరితే 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థుల ఖరారు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అభ్యర్థులున్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టాలని భావిస్తోంది.ఈ నెలాఖరుకల్లా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేయాలని లక్ష్యం తో ముందుకు వెళ్తుంది. దాదాపు.. 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో ఉండే నియోజకవర్గాలు..(అంచనా) 1. కొడంగల్ - రేవంత్ రెడ్డి, 2. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3.కోదాడ - పద్మావతి , 4. మధిర - భట్టి విక్రమార్క , 5. మంథని - శ్రీధర్ బాబు , 6. జగిత్యాల - జీవన్ రెడ్డి , 7. ములుగు - సీతక్క , 8. భద్రాచలం - పొడెం వీరయ్య, 9. సంగారెడ్డి - జగ్గారెడ్డి , 10. నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 11. అలంపూర్ - సంపత్ కుమార్, 12. నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి , 13. కామారెడ్డి - షబ్బీర్ అలీ , 14. పాలేరు - తుమ్మల నాగేశ్వరరావు , 15. కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 16. పరిగి - రామ్మోహన్ రెడ్డి, 17. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్, 18. మహేశ్వరం - చిగురింత పారిజాత, 19. ఆలేరు - బీర్ల ఐలయ్య, 20. ఖైరతాబాద్ - రోహిన్ రెడ్డి, 21. దేవరకొండ - వడ్త్య రమేష్ నాయక్, 22. వేముల వాడ - ఆది శ్రీనివాస్, 23. ధర్మపురి - లక్ష్మణ్ , 24. జడ్చర్ల - అనిరుద్ రెడ్డి, 25. హుజూరాబాద్ - బల్మూర్ వెంకట్ , 26. నాంపల్లి - ఫిరోజ్ ఖాన్, 27. కోరుట్ల- జువ్వాడి నర్సింగ్ రావు, 28.అచ్చంపేట - వంశీకృష్ణ, 29 జహీరాబాద్ - ఏ. చంద్రశేఖర్ , 30. ఆందోల్ - దామోదర రాజనర్సింహ, 31.మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు, 32. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు , 33. ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి, 34. వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ, 35. భూపాల పల్లి - గండ్ర సత్యనారాయణ హైకమాండ్‌ను ఓ నివేదిక ఇచ్చేయాలని.. కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇచ్చే ఉద్దేశంతో ఉన్న స్క్రీనింగ్ కమిటీ.. కంటిన్యూగా మీటింగ్ నిర్వహిస్తోంది. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ ఉన్న నియోజకవర్గాలపై ఈ భేటీల్లో ఫోకస్ చేసినట్లు స్పష్టం అవుతోంది. అలాగే.. డిస్టబెన్స్ ఉన్న నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పేర్లతో కూడిన నివేదిక ను సిద్ధం చేయనుంది. దాదాపు 70 సెగ్మెంట్ లలో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడంతో.. నివేదికను హైకమాండ్‌కు అందించి భారం దింపేసుకోవాలనే ఆలోచనతో ఉంది స్క్రీనింగ్ కమిటీ. కాంగ్రెస్ లో రెండు నుంచి మూడు అభ్యర్థులు పోటీ పడే నియోజకవర్గాలు.. 1.వనపర్తి - చిన్నారెడ్డి/మెఘారెడ్డి/ శివసేన రెడ్డి 2. అంబర్ పేట - నూతి శ్రీకాంత్ గౌడ్ / మోతా రోహిత్ / లక్ష్మణ్ యాదవ్, 3.మహబూబాబాద్ - బలరాం నాయక్/ మరళీ నాయక్ /బెల్లయ్య నాయక్ , 4.జనగామ - పొన్నాల లక్ష్మయ్య/ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి/ మొగుళ్ళ రాజిరెడ్డి 5.షాద్ నగర్ - ఈర్లపల్లి శంకర్/ ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్, 6 . వైరా - పి.నాగేశ్వర్ రావు/బానోతు విజయ్ భాయి, 7. నిజామాబాద్ అర్బన్ - మహేష్ కుమార్ గౌడ్ / ఎర్రావత్రి అనిల్, 8.వరంగల్ వెస్ట్ - నాయిని రాజేందర్ రెడ్డి/ జంగా రాఘవ రెడ్డి, 9.స్టేషన్ ఘన్ పూర్ - ఇందిరా/ దొమ్మటీ సాంబయ్య , 10.మునుగోడు - పున్న కైలాష్ నేత/పాల్వాయి స్రవంతి, 11.ఎల్బీ నగర్ - మధుయాష్కీ/ మల్ రెడ్డి రాంరెడ్డి, 12.కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి/ రాఘవేందర్ రెడ్డి, 13.ఆశ్వరావు పేట్ - తాటి వెంకటేశ్వర్లు/సున్నం నాగమణి, 14.ఎల్లారెడ్డి - సుభాష్ రెడ్డి/ మధన్ మోహన్ రావు, 15.జూబ్లీహిల్స్ - విష్ణు వర్దన్ రెడ్డి/ అజారుద్దీన్, 16. సూర్యాపేట - దామోదర్ రెడ్డి/ పటేల్ రమేష్ రెడ్డి, 17. మిర్యాలగూడ - రఘువీర్ రెడ్డి/ బి. లక్ష్మారెడ్డి, 18. దేవరకద్ర - ప్రదీప్ గౌడ్ / జీఎంఆర్ , 19. మక్తల్ - శ్రీహరి / నాగరాజు గౌడ్ /కొత్తకోట సిద్ధార్థ రెడ్డి, 20. గద్వాల - సరితా తిరుపతయ్య / రాజీవ్ రెడ్డి, 21. నాగర్ కర్నూల్ - కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి / నాగం జనార్ధన్ రెడ్డి, 22. మేడ్చల్ - తోటకూర జంగయ్య యాదవ్ / హరివర్ధన్ రెడ్డి, 23. ఉప్పల్ - రాగిడి లక్ష్మారెడ్డి / సోమశేఖర్ రెడ్డి / పరమేశ్వర రెడ్డి , 24. కుద్బుల్లాపూర్ - భూపతిరెడ్డి నర్సారెడ్డి / కొలను హన్మంతు రెడ్డి, 25. ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్ / సంగిశెట్టి జగదీశ్వర్ రావు, 26. మలక్ పేట్ - చెక్లోకర్ శ్రీనివాస్ / అశ్వక్ , 27. గోషామహల్ - మెట్టు సాయికుమార్ / ప్రేమ్ లాల్ /ఆనంద్ రావు , 28. సనత్ నగర్ - కోటా నీలిమ / మర్రి ఆదిత్య రెడ్డి , 29. శేర్లింగంపల్లి - జర్పెటీ జైపాల్ / రఘునాథ్ యాదవ్/సత్యనారాయణ రావు , 30. తుంగతుర్తి - అద్దంకి దయాకర్ / జ్ఞానసుందర్ / ప్రీతం , 31. డోర్నకల్ - రామచంద్ర నాయక్ / నెహ్రూ నాయక్, 32. నారాయణ్ ఖేడ్ - సురేష్ శట్కర్ / సంజీవరెడ్డి, 33. కూకట్ పల్లి - శ్రీరంగం సత్యం / వెంగల్ రావు, 34. ముదోల్ - ఆనంద్ రావు షండే/పత్తిరెడ్డి విజయ్ కుమార్ , 35. సత్తుపల్లి - సంబాని చంద్రశేఖర్ / మానవతా రాయ్, 36. బోద్ - శివాలాల్ రాథోడ్ / నరేష్ జాదవ్ , 37. బెల్లంపల్లి - గడ్డం వినోద్ కుమార్ / దుర్గం భాస్కర్, 38. ఇల్లందు - కోరం కనకయ్య / ప్రవీణ్ నాయక్, 39.చొప్పదండి - మేడిపల్లి సత్యం/జిల్లెల భానుప్రియ, 40. నారాయణ్ పేట్ - ఎర్ర శేఖర్ /శివకుమార్ రెడ్డి, 41. ఆసీఫాబాద్ - విశ్వప్రసాద్ / గణేష్ రాథోడ్, 42. రామగుండం - రాజ్ ఠాకూర్ / హర్కల వేణుగోపాల్ రావు /జనక్ ప్రసాద్, 43. నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్ / రాజి రెడ్డి, 44. గజ్వేల్ - నర్సారెడ్డి / బండారు శ్రీకాంత్ రావు , 45. నిర్మల్ - శ్రీహరి రావు / పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి , 46. భువనగిరి - జిట్టా బాలకృష్ణ రెడ్డి/చెవిటి వెంకన్న యాదవ్, 47. పెద్దపల్లి - విజయ రమణా రావు / గంటా రాములు యాదవ్/ఈర్ల కొమురయ్య, 48. నర్సంపేట -దొంతి మాధవరెడ్డి / మేకల వీరన్న యాదవ్, 49. పాలకుర్తి - ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి/ఝాన్సీ రెడ్డి, 50. మహబూబ్ నగర్ - యెన్నం శ్రీనివాసరెడ్డి/ఒబెదుల్లా కొత్వాల్/ఎంపి.వెంకటేష్, 51. ఇబ్రహీంపట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి /దండెం రాంరెడ్డి, 52. కరీంనగర్ - రోహిత్ రావు / కొత్త జైపాల్ రెడ్డి/రమ్యా రావు / కొనగాల మహేష్ , 53. సిద్దిపేట - భవానీ రెడ్డి / పూజల హరికృష్ణ /శ్రీనివాస్ గౌడ్ , 54. ఖానాపూర్ - బొజ్జు/ భారత్ చౌహాన్ / చారులతా రాథోడ్, 55. ఆర్మూర్ - గోర్త రాజేందర్ / వినయ్ కుమార్ రెడ్డి , 56. బాల్కొండ - సునీల్ రెడ్డి / బాణాల మోహన్ రెడ్డి / అన్వేష్ రెడ్డి, 57. రాజేంద్రనగర్ - గౌరీ సతీష్ /ముంగి జైపాల్ రెడ్డి /నరేందర్ ముదిరాజ్, 58. హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్/ ప్రవీణ్ రెడ్డి, 59. తాండూర్ - రఘువీర్ రెడ్డి/కేఎల్ఆర్, 60. చెన్నూర్ - డాక్టర్ శ్రీనివాస్/నల్లాల ఓదెలు/బోడ జనార్థన్, 61.నిజామాబాద్ రూరల్ - అరికెల నర్సారెడ్డి / భూపతి రెడ్డి , 62. పినపాక - దనసరి సూర్యం/పాయం వెంకటేశ్వర్లు, 63. వర్ధన్నపేట - సిరిసిల్ల రాజయ్య/కేఆర్.నాగరాజు/పరంజ్యోతి, 64. జుక్కల్ - గంగారాం/గైక్వాడ్ విద్య/అయ్యాల సంతోష్, 65. బాస్నువాడ - కాసుల బాలరాజు/అనిల్ కుమార్ రెడ్డి, 66. సిరిసిల్ల - కేకే.మహేందర్ రెడ్డి/సంగీతం శ్రీనివాస్, 67. దుబ్బాక - కత్తి కార్తీక/చెరుకు శ్రీనివాస్ రెడ్డి, 68. మల్కాజ్ గిరి - నందికంటి శ్రీధర్/అన్నే వెంకట సత్యనారాయణ/సురేష్ యాదవ్, 69. చేవెళ్ల - షాబాద్ దర్శన్/భీమ్ భారత్/రాచమల్ల సిద్దేశ్వర్/సులోచనమ్మ, 70. కంటోన్మెంట్ - పిడమర్తి/ బొల్లు కిషన్ అభ్యర్థుల ఎంపిక పై టీ పీసీసీస్థాయిలో ఇదే చివరి భేటీ.. ఇక అభ్యర్థులను ప్రకటించే పూర్తి బాధ్యత హైకమాండే. దీంతో కీలక నేతలంతా తమకు అనుకూలంగా ఉండేవాళ్లకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెలాఖరులో మొదటి లిస్ట్ ,వచ్చే నెల రెండో వారంలో రెండో లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందని హస్తం శ్రేణులు భావిస్తున్నాయి. -
అభ్యర్థుల ఎంపికపై నేడు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ
-
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. 30 స్థానాలకు లిస్ట్ ఫైనల్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కీలక దశకు చేరుకుంది. నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ క్రమంలో తెలంగాణలో రానున్న ఎన్నికల కోసం పోటీచేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనుంది. అలాగే, రాష్ట్రంలో ఒకరికి మించి పోటీలేని స్థానాల్లో అభ్యర్థులను ఈ కమిటీ ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. అయితే, దాదాపు 30 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి లిస్టును కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. సీఈసీకి పంపనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరలో తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు గ్యారంటీలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇది కూడా చదవండి: జనగణన లేకుండా బిల్లు పెట్టి ఏం చేస్తారు? -
Telangana: నెలాఖరుకు కాంగ్రెస్ జాబితా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ కానుంది. ఢిల్లీ వేదికగా బుధ, గురువారాల్లో ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జర గనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు లను ఖరారు చేయడంలో భాగంగా దరఖాస్తులను వడపోసి షార్ట్ లిస్ట్ తయారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పీసీసీ నుంచి రేవంత్‌రెడ్డి, భట్టి విక్ర మార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. ఇందులో ఉత్తమ్, రేవంత్‌లు పార్లమెంటు సమావే శాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోనే ఉండగా, భట్టి మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, మన్సూర్ అలీ ఖాన్ కూడా స్క్రీనింగ్ కమిటీ భేటికి హాజరవుతారు. ఇటీవలే హైదరాబాద్ వేదికగా సమావేశ మైన స్క్రీనింగ్ కమిటీ ఏమీ తేల్చకుండానే సమా వేశాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో జరిగే మలిదశ భేటీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన షార్ట్‌లిస్ట్ రెడీ కానుంది. అనంతరం ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపుతారని, ఈ కమిటీ భేటీ అనంతరం ఈ నెలాఖరున లేదంటే అక్టోబర్ మొదటి వారంలో తొలి జాబితాను విడుదల చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
Congress Party: 100 సీట్లలో ఒక్కో పేరే!.. స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను దాదాపుగా రాష్ట్రంలోనే పూర్తి చేయాలని.. 100 నియోజకవర్గాలకు ఒక్కో అభ్యర్థి పేరుతోనే అధిష్టానానికి జాబితాలను పంపాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై ఈ అంశంపై చర్చించింది. కమిటీ చైర్మన్ మురళీధరన్తోపాటు సభ్యులు మాణిక్‌రావ్ ఠాక్రే, సిద్ధిఖీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్ర మార్క, మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి తదితరులు ఇందులో పాల్గొన్నారు. మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. ఈ సమావేశంలో భాగంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ఇచ్చిన నివేదికలను నేతలు పరిశీలించారు. ఇక్కడే కసరత్తు పూర్తి చేద్దాం.. తొలుత స్క్రీనింగ్ కమిటీలో రాష్ట్రం నుంచి సభ్యులుగా ఉన్న రేవంత్, ఉత్తమ్, భట్టి ఆయా చోట్ల టికెట్ల ఖరారు ప్రాథమ్యాలను వివరించారు. అనంతరం రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా టికెట్ల కేటాయింపు ఆవశ్యకత, మహిళలకు కేటాయించాల్సిన సీట్లు, యువతకు టికెట్లు, పార్టీ అనుబంధ సంఘాలకు అవకాశం తదితర అంశాలపై చర్చించారు. ఎక్కడెక్కడ ఏ కేటగిరీ నాయకులకు అవకాశం కల్పించగలమనేదానిని పరిశీలించారు. ఏఐసీసీకి పంపే జాబితాను అన్ని కోణాల్లో క్షుణ్నంగా నిర్ధారించి పంపాలని, మెజార్టీ స్థానాల్లో ఒక్కటే పేరు సూచించేలా కసరత్తును ఇక్కడే పూర్తి చేయాలని భేటీలో నిర్ణయానికి వచ్చారు. దాదాపు రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగినా.. నియోజకవర్గాల వారీగా కసరత్తు పూర్తి కాకపోవడంతో త్వరలో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. భేటీ ముగిశాక మురళీధరన్, ఠాక్రే, భట్టి మీడియాతో మాట్లాడారు. మరో రెండు వారాలు పడుతుంది ‘‘అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. సమావేశంలో భాగంగా అన్ని అంశాలపై నిశితంగా పరిశీలన చేశాం. కసరత్తు పూర్తయ్యేందుకు మరో రెండు వారాల సమయం పడుతుంది. మెజార్టీ స్థానాలకు ఒక్కటే పేరు పంపాలని నిర్ణయించాం. త్వరలోనే మరోమారు సమావేశం జరుగుతుంది.’’ – కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఇంకా చర్చించాల్సినవి చాలా ఉన్నాయి ‘‘పీఈసీ సమావేశంలో వచి్చన అభిప్రాయాలు, పీఈసీ ఇచి్చన నివేదికపై సుదీర్ఘంగా చర్చించాం. పీఈసీ సభ్యులతోపాటు డీసీసీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం. స్క్రీనింగ్ కమిటీలో ఇంకా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. – పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ప్రామాణికాలపై చర్చించాం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ రాష్ట్ర నేతల దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాలపై సమావేశంలో మాట్లాడాం. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ప్రామాణికాలు అనుసరించాలన్న దానిపై చర్చించాం. త్వరలో మరోమారు సమావేశమై కసరత్తు పూర్తిచేస్తాం. – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎల్బీ స్టేడియంలో ఉత్తమ్‌కుమార్‌తో మాట్లాడుతున్న కేసీ వేణుగోపాల్. చిత్రంలో మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, పొంగులేటి తుక్కుగూడలో కాంగ్రెస్ సభ – వివరాలు 2లో తుక్కుగూడలో కాంగ్రెస్ సభ – వివరాలు 2లో -
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. విధివిధానాలు, సర్వేలు, ఈక్వేషన్స్ ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చెయ్యాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశం తర్వాతే తేల్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉండనుంది. ఈసారి స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో పెట్టాలని కెంగ్రెస్ భావిస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల లిస్ట్ తయారు చేయనుంది. అభ్యర్థుల ఎంపికలో విధివిధానాలు, ఎలాంటి అంశాలు ప్రామాణికం చేసుకొని ఎంపిక చెయ్యాలో ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భారీగా దరఖాస్తులు అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావహుల నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాలకు కలిపి వెయ్యి మందికి పైగా అభ్యర్థులు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారందరినీ వడపోసి సరైన అభ్యర్థలను బరిలో నిలపాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది. చదవండి: ప్రధానికి లేఖ.. మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? తీవ్ర కసరత్తు దరఖాస్తుల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కసరత్తు తీవ్రంగానే సాగుతోంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయాలతో పాటు, ఆపై పీఈసీలో లేని సభ్యులు, మాజీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతోనూ వన్ టు వన్ భేటీ నిర్వహించారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్. వాళ్ల నుంచి అభిప్రాయ సేకరణ ద్వారా చివరకు ఒక్కో నియోజకవర్గానికి ప్రయారిటీల వారిగా 1 నుంచి మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 16,17 వ తేదీలలో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ఉండడంతో కేసి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. Cwc సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్ తో పాటు.. భారీ బహిరంగ సభ కోసం పీసీసీ చూసిన రెండు స్థలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం cwc సమావేశాల నేపథ్యంలో.. ఏఐసీసీ గైడ్ లైన్స్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. -
తాజ్ కృష్ణలో ప్రారంభమైన స్క్రీనింగ్ కమిటీ సమావేశం
-
ముగిసిన స్క్రీనింగ్ కమిటీ భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. పార్టీ కీలక నేతలతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. ఓ హోటల్లో ఈ సమావేశం జరగ్గా.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్‌కుమార్‌లు గంటన్నరకుపైగా చర్చలు జరిపారు. స్క్రీనింగ్ కమిటీ మొదటిసారి భేటీ అయ్యింది. స్క్రీనింగ్ కమిటీలో సీనియర్ల సూచనలు తీసుకున్నాం అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ థాక్రే తెలిపారు. సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపై రూపొందించిన నివేదికతో మురళీధరన్ ఈ రాత్రికే ఢిల్లీకి బయల్దేరతారని సమాచారం. ఇదిలా ఉంటే.. దరఖాస్తుల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కసరత్తు తీవ్రంగానే సాగుతోంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయాలతో పాటు, ఆపై పీఈసీలో లేని సభ్యులు, మాజీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతోనూ వన్ టు వన్ భేటీ నిర్వహించారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్. వాళ్ల నుంచి అభిప్రాయ సేకరణ ద్వారా చివరకు ఒక్కో నియోజకవర్గానికి ప్రయారిటీల వారిగా 1 నుంచి మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన నివేదికను తీసుకుని మురళీధరన్ ఈ రాత్రికే ఢిల్లీకి పయనం అవుతారు. అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కావొచ్చని తెలుస్తోంది. ఇక.. రేపు(సెప్టెంబర్ 7వ తేదీన) సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఆ నివేదికను సమర్పిస్తారు. ఆపై అభ్యర్థుల జాబితా ప్రక్రియ ఎంపిక ఓ కొలిక్కి వస్తుంది . అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందా? అనేది అనుమానంగానే మారింది ఇప్పుడు. నేడు హైదరాబాద్‌కు కేసీ వేణుగోపాల్ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 16,17 వ తేదీలలో హైదరాబాద్ లో cwc సమావేశాలు ఉండడంతో కేసి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. Cwc సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్ తో పాటు.. భారీ బహిరంగ సభ కోసం పీసీసీ చూసిన రెండు స్థలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం cwc సమావేశాల నేపథ్యంలో.. ఏఐసీసీ గైడ్ లైన్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. ఇదే హోటల్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతుండడంతో.. కేసీ వేణుగోపాల్ ఆ కమిటీతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
నేడు మరోసారి భేటీకానున్న టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ