సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కె.మురళీధరన్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, బాబా సిద్ధిఖీ, జిగ్నేష్ మేవానీలను సభ్యులుగా నియమించారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తమ్‌కు ప్రాధాన్యత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో భాగంగా ఏఐసీసీ ఈ స్క్రీనింగ్ కమిటీని ఏర్పా టు చేసింది. ఇందులో పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి స్థానం కల్పించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించింది. ఈ కమిటీల్లో సాధారణంగా ఆయా రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి, ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ఏఐసీసీ కార్యదర్శులకు మాత్రమే చోటు కల్పిస్తారు.
ఇతర నేతలకు అవకాశమిచ్చినప్పటికీ సామాజిక వర్గాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఈసారి రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో పీసీసీ అధ్యక్షుడి సామాజిక వర్గానికే చెందిన ఉత్తమ్‌ను నియమించడం గమనార్హం. ఇలా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుందని, ఉత్తమ్‌కు అధిష్టానం అరుదైన గౌరవాన్ని ఇచ్చిందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
మురళీధరన్
Comments
Please login to add a commentAdd a comment