ఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటి సమావేశం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాను పూర్తి చేశారు. దాదాపు 60 శాతానికిపైగా ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ నిన్న, ఇవాళ సుధీర్ఘంగా 5 గంటలపాటు చర్చించింది. త్వరలోనే సీఈసీ సమావేశం తర్వాత జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
టికెట్ కేటాయింపులపై వార్‌రూంలో రేవంత్, ఉత్తమ్ మధ్య వాడీవేడీ వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశం కానున్నట్లు స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసింది. సర్వేల్లో అభ్యర్థుల ఫలితాలు, ఆయా స్థానాల్లో పార్టీ బలబలాలు, ప్రత్యర్థి అభ్యర్థులను బట్టి కాంగ్రెస్ పార్టీ తమ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల బృందానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభ్యర్థుల జాబితాపై పూర్తిగా కసరత్తు చేసినట్లు స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: తెలంగాణ: షర్మిల పార్టీకి ఝలక్.. బీఆర్‌ఎస్‌లోకి ఏపూరి సోమన్న
Comments
Please login to add a commentAdd a comment