Telangana Congress: 70 సీట్లు ఓకే! | Congress Screening Committee has completed selection of 70 candidates | Sakshi
Sakshi News home page

Telangana Congress: 70 సీట్లు ఓకే!

Published Mon, Oct 9 2023 3:42 AM | Last Updated on Mon, Oct 9 2023 9:03 AM

Congress Screening Committee has completed selection of 70 candidates - Sakshi

ఆదివారం రాత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఠాక్రే. చిత్రంలో మధుయాష్కీగౌడ్‌ తదితరులు

సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ ఓ కొలిక్కి తెచ్చింది. రాజకీయ అనుభవం, కుల సమీకరణాలు, ఆర్ధిక పరిస్థితులు, సర్వేలను బేరీజు వేసుకుంటూ దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరని మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై మరో సారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించింది. ఏకాభిప్రాయం రాని స్థానాలకు ఇద్దరు చొప్పున పేర్లతో జాబితా సిద్ధం చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని.. వారు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా పేర్లను ఖరారు చేయాల ని తీర్మానించింది.

ఇప్పటికే ఒక్కో పేరును ఖరారు చేసిన నియోజకవర్గాల జాబితాకు సీఈసీ అను మతి తీసుకుని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14 తర్వాత సీఈసీ భేటీ అయి అభ్యర్థుల జాబితాలను పరిశీలించనుందని.. ఈ నేపథ్యంలో ఈ నెల 16న లేక 18న తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి ముఖ్య నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించడంతో.. ఆ బస్సు యాత్ర పూర్తయ్యాక అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఆలోచన కూడా ఉందని అంటున్నాయి. 

వాడీవేడిగా సమావేశం.. 
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో భేటీ అయింది. కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, ఇతర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నెలలో ఖరారు చేసిన కొన్ని స్థానాలు సహా మొత్తంగా 70 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసి.. ఒక్కో పేరుతో జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది.

సుమారు 10 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీ ఆసాంతం నేతల వాదనలు, అభిప్రాయాలతో వాడీవేడీగానే జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని నియోజకవర్గాలపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇంకొన్ని చోట్ల కుల సమీకరణాలపై ఎవరి వాదన వారే వినిపించడంతో సమావేశం హీటెక్కినట్టు పేర్కొన్నాయి. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్, జూబ్లీహిల్స్, ఆసిఫాబాద్, జనగాం, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, సికింద్రాబాద్, నర్సాపూర్‌ నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు అంశంపై నేతలు వేర్వేరు పేర్లను సూచించినట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా గెలవగలిగే వారిని ఖరారు చేయాలని కొందరు సూచిస్తే.. సీనియారిటీ, పార్టీకి పనిచేసిన అనుభవం, ఆర్థిక, కుల సమీకరణాల ఆధారంగా ఎంపిక ఉండాలని ఇంకొందరు పట్టుబట్టినట్టు సమాచారం. 

ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలంటూ.. 
టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమకారులు కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ ముందు నిరసనకు దిగారు. టికెట్లు ఆశిస్తున్న కురువ విజయ్‌కుమార్‌ (గద్వాల), మానవతారాయ్‌ (సత్తుపల్లి), పున్నా కైలాశ్‌ నేత (మునుగోడు), దుర్గం భాస్కర్‌ (చెన్నూరు), కేతూరి వెంకటేశ్‌ (కొల్లాపూర్‌), ఇతర నేతలు అక్కడ ఆందోళన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తమకు టికెట్లు ఇవ్వాలని, ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్రసింగ్‌ వారితో మాట్లాడి, అన్ని అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 
 
వీలైనంత త్వరగా తొలి జాబితా: ఠాక్రే 
ఆదివారం రాత్రి స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. పార్టీ సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్‌ కమిటీ భేటీ ఉంటుందని.. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను సీఈసీకి అందిస్తామని చెప్పారు. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పీసీసీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు.

వచ్చిన అన్ని దరఖాస్తులను స్క్రీనింగ్‌ కమిటీ భేటీలో పరిశీలించామని.. అన్నివర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నామని వివరించారు. అయితే టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీదే (సీఈసీ)నని చెప్పారు. కాగా.. త్వరలో సీఈసీ సమావేశం ఉండే అవకాశం ఉందని, వారం, పది రోజుల్లో తొలి జాబితా విడుదల చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. 
 
తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు ఇలా.. 
(పీసీసీ వర్గాల సమాచారం మేరకు) 

1. కొడంగల్‌ – రేవంత్‌రెడ్డి  
2. హుజూర్‌నగర్‌ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
3. కోదాడ – పద్మావతి 
4. మధిర – భట్టి విక్రమార్క 
5. మంథని – శ్రీధర్‌బాబు 
6. జగిత్యాల – జీవన్‌రెడ్డి 
7. ములుగు – సీతక్క 
8. భద్రాచలం – పొదెం వీరయ్య 
9. సంగారెడ్డి – జగ్గారెడ్డి 
10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
11. అలంపూర్‌ – సంపత్‌కుమార్‌ 
12. నాగార్జునసాగర్‌ – కుందూరు జైవీర్‌ రెడ్డి 
13. కామారెడ్డి – షబ్బీర్‌ అలీ 
14. పాలేరు – తుమ్మల నాగేశ్వర్‌రావు 
15. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
16. పరిగి – రామ్మోహన్‌రెడ్డి 
17. వికారాబాద్‌ – గడ్డం ప్రసాద్‌కుమార్‌ 
18. మహేశ్వరం – చిగురింత పారిజాత నర్సింహారెడ్డి 
19. ఆలేరు – బీర్ల ఐలయ్య 
20. దేవరకొండ – ఎన్‌.బాలూనాయక్‌ 
21. వేములవాడ – ఆది శ్రీనివాస్‌ 
22. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 
23. జడ్చర్ల – అనిరుధ్‌రెడ్డి 
24. నాంపల్లి – ఫిరోజ్‌ ఖాన్‌ 
25. కోరుట్ల– జువ్వాడి నర్సింగ్‌రావు 
26. అచ్చంపేట – వంశీకృష్ణ 
27. జహీరాబాద్‌ – ఎ.చంద్రశేఖర్‌ 
28. ఆందోల్‌ – దామోదర రాజనర్సింహ 
29. మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌రావు 
30. కొల్లాపూర్‌ – జూపల్లి కృష్ణారావు 
31. ఆదిలాబాద్‌ – కంది శ్రీనివాస్‌రెడ్డి 
32. వరంగల్‌ ఈస్ట్‌ – కొండా సురేఖ 
33. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ 
34. షాద్‌నగర్‌ – వీర్లపల్లి శంకర్‌ 
35. నిజామాబాద్‌ అర్బన్‌ – ధర్మపురి సంజయ్‌ 
36. ఎల్బీనగర్‌ – మధుయాష్కీగౌడ్‌ 
37. కల్వకుర్తి– కసిరెడ్డి నారాయణరెడ్డి 
38. అశ్వారావుపేట– తాటి వెంకటేశ్వర్లు 
39. పటాన్‌చెరు – కాట శ్రీనివాస్‌గౌడ్‌ 
40. సూర్యాపేట – ఆర్‌.దామోదర్‌రెడ్డి 
41. గద్వాల – సరితా తిరుపతయ్య 
42. నాగర్‌కర్నూల్‌ – కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి 
43. మేడ్చల్‌ – తోటకూర జంగయ్య యాదవ్‌ 
44. ముషీరాబాద్‌ – అంజన్‌కుమార్‌ యాదవ్‌ 
45. శేరిలింగంపల్లి – రఘునాథ్‌ యాదవ్‌ 
47. ముథోల్‌ – ఆనందరావు పటేల్‌ 
48. బెల్లంపల్లి – గడ్డం వినోద్‌కుమార్‌ 
49. ఇల్లెందు – కోరం కనకయ్య 
50. చొప్పదండి – మేడిపల్లి సత్యం 
51. నారాయణపేట – ఎర్ర శేఖర్‌ 
52. రామగుండం – రాజ్‌ఠాకూర్‌ 
53. వరంగల్‌ వెస్ట్‌ – నాయిని రాజేందర్‌రెడ్డి 
54. గజ్వేల్‌ – తూంకుంట నర్సారెడ్డి 
55. నిర్మల్‌ – శ్రీహరిరావు 
56. భువనగిరి – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 
57. పెద్దపల్లి – విజయరమణారావు 
58. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి 
59. పాలకుర్తి – హనుమాండ్ల ఝాన్సీ 
60. మహబూబ్‌నగర్‌ – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 
61. ఇబ్రహీంపట్నం – మల్‌రెడ్డి రంగారెడ్డి 
62. ఖానాపూర్‌ – ఎడ్మ బొజ్జు 
63. బాల్కొండ – ఆరెంజ్‌ సునీల్‌రెడ్డి 
64. రాజేంద్రనగర్‌ – జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ 
65. హుస్నాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌ 
66. తాండూర్‌ – వై.మనోహర్‌రెడ్డి 
67. సిరిసిల్ల – కేకే మహేందర్‌రెడ్డి 
68. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 
69. మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు 
70. కంటోన్మెంట్‌ – వెన్నెల (గద్దర్‌ కుమార్తె)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement