t congress
-
తెలంగాణ కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ
-
తెలంగాణ కాంగ్రెస్.. మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఇంకా పెండింగ్‌లో నాలుగు స్థానాలు సీఈసీలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం ఆరు స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పారీ్టలో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావనకు రాలేదు. ఇక ఆరు స్థానాల్లోనూ నాలుగు సీట్లను మాత్రమే ఖరారు చేశారు. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల పేర్లను పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రెండు స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తలనొప్పిగా మారిన ఖమ్మం తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ సీట్‌గా మారింది. ఎక్కువమంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమకు సంబంధించిన అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భట్టి తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం, తుమ్మల తన కుమారుడు యుగంధర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వీరితో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌లు సైతం తమకు ఖమ్మం సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం అభ్యర్థి ప్రకటన వాయిదా పడుతోందని చెబుతున్నారు. -
ప్రచార వేగం పెంచిన టీ కాంగ్రెస్
-
తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
-
ప్రతి నియోజకవర్గంలో వీఐపీ పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు
-
కాంగ్రెస్‌లో ఉత్కంఠ.. నాలుగు స్థానాల్లో ఎటూ తేలని టికెట్ల పంచాయితీ
-
14న భేటీ తర్వాత అభ్యర్థుల జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈ నెల 14న ఢిల్లీలో భేటీ కానుంది. అంతకంటే ముందురోజు తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరోమారు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 14న సీఈసీ భేటీ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని, దసరా తర్వాత మలి జాబితా రానుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేసి, స్క్రీనింగ్ కమిటీ సమరి్పంచిన నివేదికల ఆధారంగా సీఈసీ ఫైనల్ చేయనుంది. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఈ భేటీపై ఇప్పటికే కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 9న భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 70కిపైగా స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మిగతా స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థుల పేర్లతో జాబితాను రూపొందించింది. ఒక్కో స్థానంలో ఖరారైన అభ్యర్థుల జాబితాపై సీఈసీలో ఎలాంటి అభ్యంతరాలు లేనిపక్షంలో వాటిని యథావిధిగా ఆమోదించనున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే సహేతుక కారణాలను చూపి మరో అభ్యర్థిని ముందుకు తెచ్చే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇద్దరేసి అభ్యర్థులున్న చోట్ల ఎంపిక నిర్ణయానికి సీఈసీ కొన్ని మార్గదర్శకాలు సూచిస్తుందని, వాటికనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్నాయి. ఈ నెల 16 లేదా 18న తొలి జాబితా విడుదల చేసేలా ఇప్పటికే నేతల నుంచి హైకమాండ్‌కు ఒత్తిళ్లు పెరిగాయి. దానికి అనుగుణంగా వారంలోనే జాబితా విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
Telangana Congress: 70 సీట్లు ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఓ కొలిక్కి తెచ్చింది. రాజకీయ అనుభవం, కుల సమీకరణాలు, ఆర్ధిక పరిస్థితులు, సర్వేలను బేరీజు వేసుకుంటూ దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరని మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై మరో సారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించింది. ఏకాభిప్రాయం రాని స్థానాలకు ఇద్దరు చొప్పున పేర్లతో జాబితా సిద్ధం చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని.. వారు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా పేర్లను ఖరారు చేయాల ని తీర్మానించింది. ఇప్పటికే ఒక్కో పేరును ఖరారు చేసిన నియోజకవర్గాల జాబితాకు సీఈసీ అను మతి తీసుకుని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14 తర్వాత సీఈసీ భేటీ అయి అభ్యర్థుల జాబితాలను పరిశీలించనుందని.. ఈ నేపథ్యంలో ఈ నెల 16న లేక 18న తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి ముఖ్య నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించడంతో.. ఆ బస్సు యాత్ర పూర్తయ్యాక అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఆలోచన కూడా ఉందని అంటున్నాయి. వాడీవేడిగా సమావేశం.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో భేటీ అయింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నెలలో ఖరారు చేసిన కొన్ని స్థానాలు సహా మొత్తంగా 70 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసి.. ఒక్కో పేరుతో జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సుమారు 10 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీ ఆసాంతం నేతల వాదనలు, అభిప్రాయాలతో వాడీవేడీగానే జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని నియోజకవర్గాలపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇంకొన్ని చోట్ల కుల సమీకరణాలపై ఎవరి వాదన వారే వినిపించడంతో సమావేశం హీటెక్కినట్టు పేర్కొన్నాయి. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్, జూబ్లీహిల్స్, ఆసిఫాబాద్, జనగాం, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, సికింద్రాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు అంశంపై నేతలు వేర్వేరు పేర్లను సూచించినట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా గెలవగలిగే వారిని ఖరారు చేయాలని కొందరు సూచిస్తే.. సీనియారిటీ, పార్టీకి పనిచేసిన అనుభవం, ఆర్థిక, కుల సమీకరణాల ఆధారంగా ఎంపిక ఉండాలని ఇంకొందరు పట్టుబట్టినట్టు సమాచారం. ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలంటూ.. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమకారులు కాంగ్రెస్ వార్‌రూమ్ ముందు నిరసనకు దిగారు. టికెట్లు ఆశిస్తున్న కురువ విజయ్‌కుమార్ (గద్వాల), మానవతారాయ్ (సత్తుపల్లి), పున్నా కైలాశ్ నేత (మునుగోడు), దుర్గం భాస్కర్ (చెన్నూరు), కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్), ఇతర నేతలు అక్కడ ఆందోళన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తమకు టికెట్లు ఇవ్వాలని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్రసింగ్ వారితో మాట్లాడి, అన్ని అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీలైనంత త్వరగా తొలి జాబితా: ఠాక్రే ఆదివారం రాత్రి స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. పార్టీ సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుందని.. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను సీఈసీకి అందిస్తామని చెప్పారు. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పీసీసీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు. వచ్చిన అన్ని దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ భేటీలో పరిశీలించామని.. అన్నివర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నామని వివరించారు. అయితే టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీదే (సీఈసీ)నని చెప్పారు. కాగా.. త్వరలో సీఈసీ సమావేశం ఉండే అవకాశం ఉందని, వారం, పది రోజుల్లో తొలి జాబితా విడుదల చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు ఇలా.. (పీసీసీ వర్గాల సమాచారం మేరకు) 1. కొడంగల్ – రేవంత్‌రెడ్డి 2. హుజూర్నగర్ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. మధిర – భట్టి విక్రమార్క 5. మంథని – శ్రీధర్‌బాబు 6. జగిత్యాల – జీవన్‌రెడ్డి 7. ములుగు – సీతక్క 8. భద్రాచలం – పొదెం వీరయ్య 9. సంగారెడ్డి – జగ్గారెడ్డి 10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 11. అలంపూర్ – సంపత్‌కుమార్ 12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి 13. కామారెడ్డి – షబ్బీర్ అలీ 14. పాలేరు – తుమ్మల నాగేశ్వర్రావు 15. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి 16. పరిగి – రామ్మోహన్‌రెడ్డి 17. వికారాబాద్ – గడ్డం ప్రసాద్‌కుమార్ 18. మహేశ్వరం – చిగురింత పారిజాత నర్సింహారెడ్డి 19. ఆలేరు – బీర్ల ఐలయ్య 20. దేవరకొండ – ఎన్.బాలూనాయక్ 21. వేములవాడ – ఆది శ్రీనివాస్ 22. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 23. జడ్చర్ల – అనిరుధ్‌రెడ్డి 24. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్ 25. కోరుట్ల– జువ్వాడి నర్సింగ్‌రావు 26. అచ్చంపేట – వంశీకృష్ణ 27. జహీరాబాద్ – ఎ.చంద్రశేఖర్ 28. ఆందోల్ – దామోదర రాజనర్సింహ 29. మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌రావు 30. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు 31. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్‌రెడ్డి 32. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ 33. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ 34. షాద్‌నగర్ – వీర్లపల్లి శంకర్ 35. నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్ 36. ఎల్బీనగర్ – మధుయాష్కీగౌడ్ 37. కల్వకుర్తి– కసిరెడ్డి నారాయణరెడ్డి 38. అశ్వారావుపేట– తాటి వెంకటేశ్వర్లు 39. పటాన్చెరు – కాట శ్రీనివాస్‌గౌడ్ 40. సూర్యాపేట – ఆర్.దామోదర్‌రెడ్డి 41. గద్వాల – సరితా తిరుపతయ్య 42. నాగర్‌కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి 43. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్ 44. ముషీరాబాద్ – అంజన్‌కుమార్ యాదవ్ 45. శేరిలింగంపల్లి – రఘునాథ్ యాదవ్ 47. ముథోల్ – ఆనందరావు పటేల్ 48. బెల్లంపల్లి – గడ్డం వినోద్‌కుమార్ 49. ఇల్లెందు – కోరం కనకయ్య 50. చొప్పదండి – మేడిపల్లి సత్యం 51. నారాయణపేట – ఎర్ర శేఖర్ 52. రామగుండం – రాజ్‌ఠాకూర్ 53. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్‌రెడ్డి 54. గజ్వేల్ – తూంకుంట నర్సారెడ్డి 55. నిర్మల్ – శ్రీహరిరావు 56. భువనగిరి – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 57. పెద్దపల్లి – విజయరమణారావు 58. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి 59. పాలకుర్తి – హనుమాండ్ల ఝాన్సీ 60. మహబూబ్‌నగర్ – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 61. ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగారెడ్డి 62. ఖానాపూర్ – ఎడ్మ బొజ్జు 63. బాల్కొండ – ఆరెంజ్ సునీల్‌రెడ్డి 64. రాజేంద్రనగర్ – జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 65. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్ 66. తాండూర్ – వై.మనోహర్‌రెడ్డి 67. సిరిసిల్ల – కేకే మహేందర్‌రెడ్డి 68. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 69. మల్కాజ్గిరి – మైనంపల్లి హన్మంతరావు 70. కంటోన్మెంట్ – వెన్నెల (గద్దర్ కుమార్తె) -
కాంగ్రెస్‌లో ‘సర్వే’ల పీటముడి!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు ప్రక్రియలో ‘సర్వే’ల అంశంతో పీటముడి పడుతోంది. సర్వేల ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తామని ఏఐసీసీ, టీపీసీసీ నేతలు ముందునుంచీ చెప్తూనే ఉన్నా.. అలా చేస్తే ఇబ్బందికరమేనన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 60 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, ఆయా స్థానాల్లో ఒక్కో పేరునే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని నేతలు నిర్ణ యించారు. మరో 30–35 సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు. ఈ స్థానాల్లో సర్వేల్లో వెల్లడైన బలాబలాల ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయాలని కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదన సరికాదని మరికొందరు నేతలు పేర్కొంటున్నట్టు తెలిసింది. కొత్తగా వచ్చిన నాయకులను సర్వేల ఆధారంగా కొన్నిచోట్ల మాత్రమే ఖరారు చేయవచ్చని, మిగతా చోట్ల సర్వేలతోపాటు పార్టీకి విధేయత, ఇతర కోణాలనూ సరిచూసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వేలను పునఃపరిశీలించడంతోపాటు ఆశావహు లతో మాట్లాడి, టికెట్లు ఇవ్వలేని నేతలను బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఈనెల 25న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఆ భేటీ ముగిశాక ఈ నెల 28న లేదా 29న స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ అవుతుందని, అది ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీ తర్వాత మెజార్టీ స్థానాలపై ఏకాభిప్రాయం తీసుకుని, సీఈసీ ఆమోదంతో ఒకేసారి జంబో జాబితా విడుదల చేస్తామని అంటున్నాయి. కొంత ఆలస్యమైనా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడమే మేలనే అభిప్రాయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారని వివరిస్తున్నాయి. ఈ క్రమంలో జాబితాల విడుదల వాయిదా పడే అవకాశమూ ఉందని పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్యారాచూట్లకు టికెట్లా? స్క్రీనింగ్ కమిటీలో జరిగిన చర్చ ప్రకారం ప్యారాచూట్లకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే టికెట్లు వచ్చే అవకాశం ఉందన్న దానిపై కాంగ్రెస్‌లోని సీనియర్ ఆశావహులు రగిలిపోతున్నారు. ప్యారాచూట్లకు టికెట్లు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉప్పల్, గద్వాల, దుబ్బాక, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్ సహా పలుచోట్ల ప్యారాచూట్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సర్వేలు ఎలా అనుకూలంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉండటంతోనే సర్వేలు అనుకూలంగా చూపుతున్నాయని.. అందువల్ల పార్టీలో ముందునుంచీ ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేశం చేరిక వాయిదా! నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమం వాయిదా పడింది. ఆయన శనివారమే రాహుల్ లేదా ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలు అందుబాటులో లేనందున వీరేశంతోపాటు వెళ్లిన ఆయన ప్రధాన అనుచరులు మాత్రం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వీరేశంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అవకాశాన్ని బట్టి అగ్రనేతలు అందుబాటులో ఉంటే ఢిల్లీలోనే చేరికల కార్యక్రమం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, వ్యాపారవేత్త పి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శనివారం ఢిల్లీలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. -
Congress Bus Yatra in Telangana 2023: వచ్చే నెలలో కాంగ్రెస్ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా ఇందులో కలసి పాల్గొననున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు కోసం బుధ, గురువారాల్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరపాలని టీపీసీసీ నిర్ణయించింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో భాగంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన ఎంపీలు ఉత్తమ్, రేవంత్ ఢిల్లీలోనే ఉండటంతో.. అక్కడే రెండు రోజుల పాటు కసరత్తు పూర్తి చేసి.. అభ్యర్థుల షార్ట్ లిస్ట్ జాబితాను ఏఐసీసీకి ఇవ్వాలని భావించారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్ ప్రక్రియతో ఎంపీలు ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. వారు లోక్‌సభ నుంచి వచ్చాక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు ఠాక్రే, భట్టి తదితరులతో కలసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించారు. అక్టోబర్ తొలివారంలో మొదలుపెట్టి, 10–12 రోజుల పాటు బస్సుయాత్ర చేపట్టాలని.. యాత్ర రూట్‌మ్యాప్, షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇక గురువారం తిరిగి స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఖరారు కసరత్తు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. కమిటీలోకి మరో ఇద్దరు.. స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు నాయకులను తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా నియమించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
మీకు మిగిలింది 100 రోజులే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ, ఎంఐఎం సహా ఎవరు మద్దతుగా వచ్చినా సరే వంద రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్తోనే కొట్లాడటం లేదని.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని.. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘కాంగ్రెస్ విజయభేరి’సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. అటు కేంద్రంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాలతోపాటు రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో బీజేపీ విస్తరింపజేస్తున్న హింసను, విద్వేషాన్ని అడ్డుకుని ప్రేమను పంచేందుకు తాము ‘విద్వేషపు మార్కెట్లో ప్రేమ దుకాణం’ తెరిచామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని.. ఆ వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ (బంధువుల) సమితి. పార్లమెంటులో బీజేపీకి అవసరమైన ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ మద్దతు పలకడం నా కళ్లతో చూశాను. కిసాన్ బిల్లులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ తదితరాలపై నరేంద్ర మోదీ ఒక్క సైగతోనే బీఆర్ఎస్ మద్దతు పలికింది. ఈ రోజు తుక్కుగూడ బహిరంగ సభ జరుపుతుంటే ఆ మూడు పార్టీలు ఒకేసారి సభలు నిర్వహించి కాంగ్రెస్‌కు అంతరాయం కలిగించాలనుకున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండటం వల్ల మా బహిరంగ సభ విజయవంతమైంది. రాజకీయాల్లో ఎవరితో కొట్లాడుతున్నామో, మనకు వ్యతిరేకంగా నిలిచే శక్తులేంటో పూర్తి అవగాహనతో ఉండాలి. ఆరు గ్యారంటీ పథకాల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న రాహుల్ గాంధీ, ఖర్గే. చిత్రంలో మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనర్సింహ, అశోక్ గెహ్లోత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి, కేసీ వేణుగోపాల్, ఠాక్రే, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌పై కేసులు పెట్టడం లేదేం? కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కొత్త మార్గాల కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు పరస్పరం ఫోన్లు చేసుకుంటాయి. మేం ఎక్కడ బీజేపీతో కొట్లాడుతామో ఆయా రాష్ట్రాలకు ఎంఐఎం వచ్చి అంతరాయం కలిగిస్తుంది. ఈ మూడు పార్టీలు భాగస్వాములుగా మారి ప్రజలకు నష్టం చేస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తు న్న మోదీ ప్రభుత్వం.. అవినీతిలో అన్ని రికార్డులు బద్దలుకొట్టిన కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క కేసూ పెట్టడం లేదేం? ఎంఐఎం నేతలపైనా ఎలాంటి కేసులు పెట్టడం లేదేం? కేవలం విపక్షాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కేసీఆర్‌ను, ఎంఐఎంను తనవారిగా భావిస్తున్నందునే ప్రధాని మోదీ వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. ఒక్క కుటుంబం కోసం ఇవ్వలేదు కేసీఆర్ లాభం కోసం, ఒక్క కుటుంబం కోసం మేం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. పేదలు, రైతులు, మహిళలు, కూలీల కోసం తెలంగాణ ఇచ్చాం. కానీ ఇక్కడ అన్ని ప్రయోజనాలు సీఎం కుటుంబానికే అందుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ ఇచ్చారు. ఇటీవలే పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేర్చింది. తెలంగాణలో ఇచ్చిన ఆరు హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేస్తాం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా కల: సోనియా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడటం తన కల అని, తెలంగాణలోని అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చెప్పారు. కాంగ్రెస్‌కు ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తుక్కుగూడ విజయభేరి సభలో సోనియాగాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రకటించిన ఆమె.. కొన్ని నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘నా సహచర నేతలతో కలసి తెలంగాణ వంటి గొప్ప రాష్ట్రానికి జన్మనివ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఇప్పుడు మా విధి. ఈ చారిత్రక దినోత్సవ సందర్భంలో మీతో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం. అందులో ‘మహాలక్ష్మి’ పథకం మొదటిది. తెలంగాణ సోదరీమణులకు సాధికారత కల్పించే ఈ ప్రకటన చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తాం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ను ఇవ్వబోతున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం’’ అని సోనియా హామీ ఇచ్చారు. తెలంగాణ సోదర సోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన సోనియా.. ‘జై హింద్.. జై తెలంగాణ’ నినాదంతో ముగించారు. ప్రజల సొమ్మంతా కేసీఆర్ కుటుంబం చేతిలోకి.. దేశంలో అదానీ లబ్దికోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ విషయాన్ని లోక్‌సభలో మాట్లాడినందుకు నా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇక్కడ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ సొమ్మును తన కుటుంబానికి కట్టబెడుతున్నారు. కేసీఆర్ తన మద్దతుదారు కాబట్టే ఇక్కడ జరుగుతున్న అవినీతిపై మోదీ విచారణ జరిపించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఏళ్లుగా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తోంది. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగింది. ధరణి పోర్టల్ తెచ్చి ప్రజలు, దళితుల భూములు లాక్కున్నారు. రైతుబంధుతో పెద్ద రైతులకే లాభం జరుగుతోంది. పేదలకు ఇళ్లు నిర్మించలేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లను లీక్ చేశారు, 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసే లేదు. ఇవన్నీ ప్రజల సొమ్మును దోపిడీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంచుకున్న మార్గాలు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సొమ్మును వాపస్ చేస్తాం. -
T Congress: అంతా హైకమాండ్ కంట్రోల్లోకి..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ హ్యాండోవర్ చేసుకుందా? ఈసారి తెలంగాణలో గెలుపు అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతున్నాయా? రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్న భావన కల్పిస్తూనే చేయాల్సిందంతా అధిష్టానమే చేస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని తాజా పరిణామాలను గమనిస్తే.. అవుననే సమాధానమే వస్తోంది. పార్టీ కమిటీల ఏర్పాటు నుంచి టికెట్ల కేటాయింపు వరకు అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే జరిగేలా ప్రణాళిక అమలవుతోందని, ఇటీవలి అన్ని పరిణామాలు టీపీసీసీకి పూర్తిస్థాయిలో సమాచారం లేకుండానే జరిగాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ పార్టీలో ఉన్న కుమ్ములాటలు పుట్టి ముంచుతాయనే అభిప్రాయానికి వచ్చిన టెన్ జన్‌పథ్ వర్గాలు పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయని, అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి అందే సంకేతాలు కూడా ఏఐసీసీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే.. రాష్ట్రాల్లోని ఇతర పార్టీల విషయంలో అవలంబించాల్సిన వైఖరిపై జాతీయ పార్టీలు సాధారణంగా ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రా యాలు తీసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ వైఎస్సార్టీపీ నేత షర్మిలతో చర్చలు, వచ్చే ఎన్ని కల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల గురించి ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర పార్టీ నేతలకు తెలియడం గమనార్హం. షర్మిల బెంగళూరులో డి.కె.శివకుమార్‌ను కలిసినప్పటి నుంచే ఆమె కాంగ్రెస్‌లో చేరతారన్న దానిపై ఊహాగానాలు సాగినప్పటికీ, దీనిపై నామమాత్రంగా కూడా రాష్ట్ర పార్టీ నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చించకపోవడం గమనార్హం. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా రాష్ట్ర పార్టీ అభిప్రాయంతో పనిలేకుండా ఏఐసీసీయే రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరిపిన తర్వాతే విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసింది. ఇటీవల జరిగిన సంస్థాగత కమిటీల ఏర్పాటు విషయంలో కూడా తెలంగాణ నాయకత్వానికి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోవడం గమనార్హం. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఫలానా నేతను టీపీసీసీ సిఫారసు చేసిందనే సమాచారం కూడా బయటకు వచ్చింది. కానీ ఎన్నడూ చర్చ జరగని ఇద్దరు నేతలకు అనూహ్యంగా సీడబ్ల్యూసీలో చోటు దొరికింది. తమ పేర్లు ఎందుకు రాలేదా అని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు ఆరా తీస్తున్న సమయంలోనే వారికి మరో షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని ప్రకటించిన అధిష్టానం రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండానే తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. అంతకంటే ముందు ఏర్పాటు చేసిన పార్టీ స్క్రీనింగ్ కమిటీలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు మరో నేతను నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సీడబ్ల్యూసీ’పై పీఈసీలో తీర్మానం! గతంలో ఎన్నడూ లేని విధంగా సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ విషయంలోనూ అధిష్టానమే నిర్ణయం తీసుకుని టీపీసీసీకి సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఆ సమాచారం మేరకే సీడబ్ల్యూసీ సమావేశాలతో ఎలాంటి సంబంధం లేని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశంలో.. సీడబ్ల్యూసీ సమావేశాలు రాష్ట్రంలో నిర్వహించాలనే తీర్మానం చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ తీర్మానం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశాల నిర్వహణపై ఆరా తీశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌ను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఈనెల 18న సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్న విషయాన్ని కూడా నేరుగా అధిష్టానమే ప్రకటించింది. కేవలం సోనియాగాంధీ పాల్గొనే సభ, ఆ సభలో ప్రకటించాల్సిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల గురించి మాత్రమే టీపీసీసీకి ముందస్తు సమాచారం ఉందని, మిగిలిన అంశాల్లో ఏఐసీసీ నిర్ణయం తీసుకుని టీపీసీసీకి చేరవేసిందనే చర్చ జరుగుతోంది. ఎందుకిలా? తెలంగాణ వ్యవహారాలను పూర్తిగా అధిష్టానం టేకోవర్ చేయడంపై గా>ంధీభవన్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నేతల మధ్య పాతుకుపోయిన అనైక్యత ఇప్పట్లో సర్దుకునే అవకాశం లేదనే భావనతోనే ఏఐసీసీ రంగంలోకి దిగిందనే చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న పరిణామంపైనా తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలపై హస్తినలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే టీపీసీసీకి సమాచారం ఇస్తున్నారని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు గొడవలు, భిన్నాభిప్రాయాలు సహజమే అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవి తారస్థాయికి చేరాయని, ఎన్నికల్లో గెలుపు అంచనాలున్న పరిస్థితుల్లో తాము రంగంలోకి దిగడమే మంచిదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలో జరుగుతున్న ప్రతి చిన్న పరిణామంపైనా ఢిల్లీకి నివేదికలు వెళుతున్నాయని, ఈ నివేదికల నేపథ్యం కూడా ఏఐసీసీ ఆజమాయిషీకి కారణమని తెలుస్తోంది. -
చెరొక్కటి మాత్రమే..!
-
‘కొడవలి’తో కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి విడిపోయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను వచ్చే ఎన్నికల్లో తమతో కలుపుకోవడంపై కాంగ్రెస్ పారీ్ట ఊగిసలాటలో ఉంది. సీపీఎం, సీపీఐలతో కలసి వెళ్లడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ నేతలు పొత్తులు వద్దనే అభిప్రాయంతో ఉండగా, పార్టీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ భాగస్వాములైన కారణంగా రాష్ట్ర స్థాయిలోనూ దోస్తీ కొనసాగించాలని రెండు పక్షాల హైకమాండ్లు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పారీ్టలు కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. కానీ మెజార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం గతంలోలా ఓట్ల బదిలీ జరిగే అవకాశం లేదని అందువల్ల ఒంటరి పోటీయే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రతిపాదనలు లెఫ్ట్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు వ్యవహారం ఇంకా కింది స్థాయికి రాలేదని, ఇప్పటిరకు ఏఐసీసీ, లెఫ్ట్ పారీ్టల జాతీయ నాయకత్వం స్థాయిలోనే ఈ ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఇరు కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నేతలతో ఫోన్లో మాట్లాడారని వివరిస్తున్నాయి. ‘వారు మాట్లాడుకున్న తర్వాత వ్యవహారం రాష్ట్ర పారీ్టల వరకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.’ అని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఎన్ని స్థానాల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో లెఫ్ట్ పారీ్టల ప్రభావం బాగా తగ్గిపోయిందని, 10–15 చోట్ల అంతోఇంతో ఓటుబ్యాంకు ఉందని, నాలుగైదు చోట్ల మాత్రం గెలుపోటములను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ఆరూ.. అసాధ్యమే ఇతర పార్టీలతో పొత్తు కుదరితే ఏయే అసెంబ్లీ స్థానాలు అడగాలన్న దానిపై సీపీఎం, సీపీఐ నేతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో చర్చించిన అనంతరం ఈ సీట్లపై ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం, మధిర, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో సీపీఎం ఉంది. అయితే ఈ ఆరు స్థానాల్లో ఒక్క స్థానం వదులుకోవడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మధిర, భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా, పాలేరులో గతంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి లాంటి బలమైన నేతలున్నారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో సీపీఎం అడిగే ఈ ఆరుస్థానాల విషయంలోనూ చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అతికష్టంగా ఆ ఒక్కచోట..! సీపీఐ ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, నల్లగొండ జిల్లా మునుగోడు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ స్థానాలపై ఆ పార్టీ దృష్టి ఉంది. కాంగ్రెస్‌తో చర్చల్లో ఈ స్థానాలను అడిగే అవకాశాలున్నాయి. అయితే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకీ కాంగ్రెస్ ఇచ్చే అవకాశం లేదు. వైరాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్లో చేరారు. దీంతో అక్కడ పోటీకి రాందాస్ నాయక్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన విజయాబాయి పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ స్థానాన్ని సీపీఐకి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్, హుస్నాబాద్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు బరిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు స్థానాలను వదులుకోవడం కూడా కాంగ్రెస్‌కు కష్టమే. ఇక మిగిలిన మునుగోడులోనే సీపీఐని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మునుగోడులో 2018 ఎన్నికల్లో గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈసారి ఈ స్థానాన్ని పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. అయితే అక్కడ బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశముంది. దీంతో ఒకవేళ ఇస్తే మునుగోడునే సీపీఐకి ఇవ్వాల్సి వస్తుందని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వామపక్షాలతో చర్చలకు వెళ్లి పొత్తు కుదుర్చుకోవాల్సి వస్తే మాత్రం కనీసం చెరో రెండు సీట్లను వదులుకోవాల్సి ఉంటుందని, దానివల్ల పారీ్టకి నష్టమే జరుగుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదనేది కొందరి అభిప్రాయంగా ఉంది. ఆ రెండు సీట్లు అసలు కుదరవు? ఉభయ కమ్యూనిస్టు పార్టీల సారథులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పోటీ చేయాలని భావిస్తున్న పాలేరు, కొత్తగూడెం స్థానాలపై పీటముడి పడే అవకాశం ఉందని, ఆ రెండు సీట్లు వదులుకోవడం కాంగ్రెస్ పారీ్టకి సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. పాలేరు, కొత్తగూడెంలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లినా ఆ రెండు చోట్లా 2018లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందని, అలాంటప్పుడు ఆ సీట్లను ఎలా వదులుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘పొత్తులపై చర్చలు జరిగితే సీపీఐ, సీపీఎంలు ఆ రెండు సీట్లపైనే పట్టుపట్టడం ఖాయం. కానీ మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు స్థానాలు ఇవ్వలేం. అందువల్ల చర్చలకు వెళ్లకపోవడమే మంచిదేమో..’ అని కాంగ్రెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచే మేం మెజార్టీ సీట్లు గెలుస్తామని అనుకుంటున్నాం. అక్కడ నాయకత్వం బాగా కష్టపడి పార్టీని నిలబెట్టింది. అలాంటి చోట్ల సీట్లు కమ్యూనిస్టులకు ఇస్తామంటే స్థానిక నాయకత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. కాబట్టి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నాం.’ అని మరో ముఖ్యనేత చెప్పారు. -
ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన టీకాంగ్రెస్
-
నేడు ఖమ్మంలో టీ-కాంగ్రెస్ జనగర్జన సభ
-
టీకాంగ్రెస్ నేతలకు ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే హెచ్చరిక
-
టీ-కాంగ్రెస్ లో ట్రోలింగ్ పంచాయతీ కంటిన్యూ
-
ఉద్రిక్తంగా మారిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
-
అక్కడ మార్చాల్సింది ఇంచార్జుల్ని కాదనుకుంటా సార్..!
అక్కడ మార్చాల్సింది ఇంచార్జుల్ని కాదనుకుంటా సార్..! -
సునీల్ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందేనని సునీల్ కనుగోలుకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పోలీసుల విచారణకు సహకరించాలని మంగళవారం విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఈ నెల8వ తేదీన విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా, తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మీమ్స్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ 41 (ఏ) కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆర్.సామ్రాట్ ఫిర్యాదుతో గతేడాది నవంబర్ 24న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీని దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంగా పోలీసులు ఈ నెల 13న రాత్రి మాదాపూర్‌లోని మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అప్పుడే ఇది కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌గా తెలిసింది. అక్కడ పట్టుబడిన ముగ్గురి విచారణలో సునీల్ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. విచారణకు రాకపోతే అరెస్టు సహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు సునీల్ కనుగోలు. 41 ఏ సీఆర్పీసీ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు(మంగళవారం) విచారణ జరిపిన హైకోర్టు..కచ్చితంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అదే సమమంలో సునీల్ కనుగోలును అరెస్ట్ చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. -
నేనే వార్ రూమ్ ఇన్చార్జిని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్‌లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు. -
ఇదీ తెలంగాణ కాంగ్రెస్ సంగతి!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)ల నియామకాలపై సీనియర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, విమర్శలు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి వెళ్లాయి. హరియాణాలోని ఖేర్లీలాలా వద్ద రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి ఆయనతో కలిసి కొద్దిసేపు నడిచారు. ఈ సందర్భంగా టీపీసీసీ వ్యవహారాలపై ఆయనతో మాట్లా డారు. తనతోపాటు పార్టీలోకి వచ్చిన నేతలు 15 మందికి మించి ప్రస్తుత కమిటీలలో లేరని, ఈ నియామకాల్లో ఆయానేతలు సిఫారసు చేసిన పేర్లను పరిగణనలోకి తీసుకున్నామని రాహుల్‌కు వివరించినట్లుగా తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే అధిష్టాన దూతగా వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. ఇదే సమయంలో ఏఐసీసీ దేశవ్యాప్తంగా తలపెట్టిన ‘హాత్ సే హాత్ జోడో’యాత్రపైనా ఇద్దరి నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది. దీంతోపాటే జనవరి 26 నుంచి తాను తలపెట్టిన ‘యాత్ర ఫర్ చేంజ్’ పాదయాత్రపైనా రేవంత్ వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. దీనికి రాహుల్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఎల్పీ నేతల భేటీలోనూ రేవంత్ పాల్గొన్నారు. ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సైతం హాజరయ్యారు. ఇందులో రేవంత్ పాదయాత్ర అంశం ప్రస్తావనకు తెచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రధాని మోదీ నియంతృత్వాన్ని ఈ యాత్ర ద్వారా ఎండగట్టే అంశాల ప్రణాళికను ఏఐసీసీ భేటీలో వివరించినట్లు తెలిసింది. జనవరి 2, 3 తేదీల్లో శిక్షణాతరగతులు: రేవంత్ హాత్ సే హాత్ జోడో యాత్ర, యాత్ర ఫర్ చేంజ్ అంశాలు ఏఐసీసీ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేలా కొత్త కార్యవర్గానికి జనవరి 2, 3 తేదీల్లో శిక్షణా తరగ తులు నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. యాత్రల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై కార్య వర్గానికి దిశానిర్దేశం చేస్తామన్నారు. ఐఏసీసీ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ యాత్రల ద్వారా తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్ తీరును, దేశ రక్షణ విషయంలో ప్రధాని మోదీ విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. కరోనా పేరు చెప్పి రాహుల్ భారత్ జోడో యాత్రను ఆపాలని చూడటంపై రేవంత్ ఆగ్ర హం వ్యక్తం చే శారు. యాత్ర విజయవంతాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడు తున్నా రని ఎద్దేవా చేశారు. రాహుల్ యాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీలు అందరం శనివారం యాత్రలో పాల్గొంటామని తెలిపారు. -
సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు అధిష్టానం దూతగా సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ వచ్చారు. బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్ కుమార్, పార్టీ ముఖ్య నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, సంగిశెట్టి జగదీశ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ నేరుగా తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన్ను కలిశారు. కాగా గురువారం ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్‌లో దిగ్విజయ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో విడివిడిగా భేటీ కానున్నారు. పీసీసీ డెలిగేట్ల నియామకం నుంచి పీసీసీ కమిటీల ఏర్పాటు, రేవంత్ రెడ్డితో సీనియర్ల సమన్వయం, పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు గల కారణాలపై వారితో చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం నాలుగున్నర గంటల సమయంలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడనున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సమాచార సేకరణ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్ బయలుదేరడానికి ముందే ఢిల్లీలో ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు నదీమ్ జావెద్, బోసురాజుతో సమావేశమయ్యారు. పార్టీలో విభేదాలకు గల కారణాలపై ఆరా తీశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సీనియర్లకు పొసగకపోవడానికి గల కారణాలు, పీసీసీ కమిటీపై సీనియర్ల అభ్యంతరాలు, వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. పీసీసీలో రేవంత్ వర్గంగా ఉన్న నేతల వివరాలు, వారి రాజీనామాల అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. రేవంత్‌కు, సీనియర్ల మధ్య సమన్వయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాల వివరాలను తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌కు వెళ్లిన దిగ్విజయ్.. మాణిక్యం ఠాగూర్‌తోనూ సమావేశమై పార్టీలో విభేదాలపై చర్చించారు. ఆ తర్వాతే హైదరాబాద్ బయలుదేరారు. వాదనలకు సిద్ధం: దిగ్విజయ్ ముందు తమ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. పార్టీ అభివృద్ధికి తాము కష్టపడిన తీరును, సీనియర్లతో సమన్వయం కోసం రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలను వివరించేందుకు రేవంత్ వర్గం సిద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలి, పీసీసీ పదవుల్లో పార్టీలోని పాతకాపులకు జరిగిన అన్యాయం, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్‌మీడియాలో దుష్ప్రచారం తదితర అంశాలపై సీనియర్లు నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ఇలావుండగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి గురువారం నాటి సమావేశానికి హాజరుకావడం లేదని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
తెలంగాణ కాంగ్రెస్ పై ఏఐసీసీ ఫోకస్