
కళ్లెం పవన్ కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ కువైట్ చాప్టర్‌ను టీపీసీసీ ఎన్నారై విభాగం చైర్మన్ డా. బీఎం వినోద్ కుమార్ శుక్రవారం (02.03.2018) హైదరాబాద్‌లో ప్రకటించారు. కన్వీనర్‌గా కళ్లెం పవన్ కుమార్ రెడ్డి (నల్గొండ జిల్లా), కో-కన్వీనర్‌గా గుల్లె రాజేశ్వర్ (నిజామాబాద్ జిల్లా), అడ్వైజరీ బోర్డు మెంబర్లుగా రాతుల రెడ్డి (కామారెడ్డి జిల్లా), కొలిచలం పూర్ణచందర్ రావు (ఖమ్మం జిల్లా), షేక్ ముక్తార్ అహ్మద్ (కామారెడ్డి జిల్లా), వర్ల మృణాళిని (మహబూబ్ నగర్ జిల్లా), శివనోళ్ల రాజు (నిజామాబాద్ జిల్లా) ను నియమించారు.
కువైట్ దేశంలో పనిచేస్తున్న విదేశీయులు ఇమిగ్రేషన్, నివాస చట్టాలను ఉల్లంఘించిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్ష లేకుండా తమ తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశాన్ని కల్పిస్తూ కువైట్ ప్రభుత్వం ఇటీవల ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ప్రకటించిన విషయం తెలిసిందే. క్షమాబిక్ష పథకంలో వాపస్ రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ కువైట్ చాఫ్టర్ సభ్యులు చేస్తున్న సేవలను డా. వినోద్ కుమార్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment