తెలంగాణ ఎమ్మెల్సీల బరిలో ఏడుగురి పోటీ!
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి ఐదుగురు, కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కొక్కరి చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.
అభ్యర్థులు వీరే
టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, యాదవ్రెడ్డి, నేతి విద్యాసాగర్, బి.వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత తన నమినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.