T TDP
-
బాటలు వేసిన కడియం.. భారీ షాక్ ఇచ్చిన ఎర్రబెల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ(టీటీడీపీ) దుకాణం ఇక మూతపడినట్లే. పలువురు తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాలో టీడీపీ ప్రాబల్యం రోజురోజుకు తగ్గిపోగా.. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరీ చిక్కిశల్యమైంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా భవిష్యత్ ఉన్న పలువురు నేతలు ఆ పార్టీలో ఉంటే మనుగడ సాధించలేమన్న ఉద్దేశంతో మారుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా భూపాలపల్లి, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల టీడీపీ అధ్యక్షులు, పలువురు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఆదివారం కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాత సీనియర్లు ఒక్కరొక్కరుగా టీడీపీని వీడుతుండటంతో ఆ పార్టీలో చివరకు ఎవరు మిగులుతారన్న చర్చ మొదలైంది. బాటలు వేసిన కడియం.. భారీ షాక్ ఇచ్చిన ఎర్రబెల్లి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగా ఉన్న కడియం శ్రీహరి టీడీపీ నుంచి బయటపడ్డారు. 2013 మే 11న ఆ పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు వైఖరిపై విసిగి వేసారిన ఎర్రబెల్లి దయాకర్‌రావు టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 2015 జులై 21న టీఆర్ఎస్లో చేరారు. ఏకంగా ఆయన టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఆ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి టీడీపీ నుంచి ఇతర పార్టీలకు మొదలైన వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఆయన వెంట ఉమ్మడి వరంగల్‌కు చెందిన సీనియర్ నాయకురాలు ధనసరి అనసూయ(సీతక్క), మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి నడిచారు. ఫలితంగా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి వరంగల్ వరుస వలసలతో దయనీయ పరిస్థితికి చేరుకుంటోంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజురోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను ఒక్క వరంగల్ పశ్చిమ నుంచే పోటీ చేసిన ఆ పార్టీ ఓటమి పాలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సరేసరి కాగా.. పంచాయతీరాజ్ ఎన్నికలతో పాటు పార్టీ రహితంగా జరిగిన గ్రా మ పంచాయతీల ఎన్నికలు.. ఇలా ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కనీసం ఉనికిని చాటలేకపోయింది. పార్టీలో మిగిలిన సీనియర్ ప్రకాశ్‌రెడ్డి నాయకుడు లేని నావలా తయారైన తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నర్సంపేట నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. ఆయన కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగినా.. స్పష్టత లేదు. అయితే, దీనిని ఆయన ప్రచారంగానే కొట్టిపారేస్తుండగా... పార్టీ సీనియర్‌గా ఆయనొక్కరే టీడీపీకి ఇప్పుడు పెద్దదిక్కుగా మిగిలినట్లయింది. ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభలో పలువురు టీడీపీ సీనియర్లు పెద్ద సంఖ్యలో కాషాయ కండువాలు కప్పుకోనున్నట్లు తెలిసింది. కాగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పుల్లూరు అశోక్‌కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ రఘునాథరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున వారి అనుచరులతో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు వీరంతా కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేసి లేఖను అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలో ఆదివారం జరగనున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షాన ఆ పార్టీలో చేరనున్నామని కూడా వారు ప్రకటించారు. -
'కేసీఆర్‌ను బతుకమ్మ చీరలతో ఉరి తీయాలి'
సాక్షి, జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బతుకమ్మ చీరలపై వచ్చిన కమీషన్ డబ్బులతో టీఆర్ఎస్ సింగరేణి ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. ఆయన శుక్రవారం జనగామలోని టీడీపీ పార్టీ కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల కమీషన్ డబ్బులను ఇబ్బడి ముబ్బడిగా సింగరేణి ఎన్నికల్లో ఖర్చుపెట్టి కేసీఆర్ గట్టెక్కారు. అలాంటి కేసీఆర్‌ను అవే బతుకమ్మ చీరలతో ఉరి వేయాలి. జనగామ ఎమ్మెల్యే ప్రభుత్వ కుంటను ఆక్రమించారని స్వయంగా కలెక్టర్ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ తక్షణమే స్పందించి ఈ అంశంపై న్యాయ విచారణ చేపట్టి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
రోగుల ప్రాణాలు పోతున్నా పట్టదా?
• ప్రభుత్వ తీరుపై టీటీడీపీ ధర్నా • 51 మంది అరెస్ట్.. ఉద్రిక్తత హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో కల్తీ మందులు, సెలైన్లతో పాటు డెంగ్యూ, స్వైన్‌ప్లూ ప్రబలి ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టకుండా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం విడ్డూరమని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలని కోరుతూ టీటీడీపీ మహిళా విభాగం, వైద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కోఠిలోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయ ముట్టడి చేపట్టారు. డీఎంఅండ్హెచ్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఎల్. రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూన వెంకటేశ్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్, సారంగపాణి, మహిళ విభాగం అధ్యక్షురాలు శోభారాణితో పాటు పెద్ద ఎత్తున టీ డీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలతో కోఠిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సుల్తాన్‌బజార్ ఏసీపీ చక్రవర్తి, ఇన్స్పెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో అఫ్జల్‌గంజ్, చాదర్ఘట్ పోలీసులు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు 51 మందిని అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు తరలించి.. సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం ఎల్.రమణ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నిర్లక్ష్య పాలన వల్లే పేదల చావులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. నిలోఫర్ ఆసుపత్రిలో 10 మంది బాలింతలు చనిపోయారన్నారు. గాంధీ ఆసుపత్రిలో చిన్నారికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించడంతో మృత్యువు కబలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కేసీఆర్ పక్కన తెలంగాణ ద్రోహులే: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను కుడిఎడమలుగా పెట్టుకున్న కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ద్రోహులను పెట్టుకుంటున్నారని టీటీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన చినజీయర్‌స్వామి, కేవీపీ రామచంద్రరావు వంటివారిని కుడిఎడమలుగా కేసీఆర్ పెట్టుకుంటున్నారన్నారు. కేసీఆర్ బంధువుకు చెందిన కావేరీ కంపెనీ భూములు 265 ఎకరాలను మునిగిపోకుండా చూసేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 21టీఎంసీల నుంచి 7టీఎంసీలకు తగ్గిస్తు న్నారన్నారు. రెండున్నరేళ్లుగా రూ.2 లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలవడం ద్వారా రూ.20వేల కోట్లు కమీషన్లుగా సీఎం కేసీఆర్ తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఓట్లకోసం కులాలు, ఉపకులాల మధ్య చిచ్చుపెట్టి కుట్రలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. -
మహానాడు తీర్మానాలపై టీటీడీపీ కార్యాచరణ
13వ తేదీన ఎన్టీఆర్ భవన్లో వర్క్‌షాప్: రావుల సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో చేసిన తీర్మానాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ సమావేశం జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రావుల సమావేశ వివరాల్ని మీడియాకు తెలిపారు. జిల్లాల మహానాడుల్లో చేసిన తీర్మానాలు, తిరుపతిలో జరిగిన మహానాడులో తెలంగాణపై చేసిన తీర్మానాలపై ఈ వర్క్‌షాప్‌లో చర్చిస్తామని ఆయన చెప్పారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యుత్‌పై వాస్తవాలు చెప్పిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘును అగౌరవ పరుస్తున్నారని తెలిపారు. 12 మంది మంత్రులు ఒకే అంశంపై మాట్లాడిన సందర్భం గతంలో ఎన్నడూ లేదని, చివరకు వారి శాఖల గురించి మాట్లాడని మంత్రులు కూడా స్పందించారంటే కోదండరాం అంశంపై టీఆర్ఎస్ భయపడుతోందని అర్థమవుతోందన్నారు. వర్క్‌షాప్‌లో నీటిపారుదల, ప్రభుత్వ హామీలు, ముస్లింలకు 12% రిజర్వేషన్, జీఓ 123 తదితర అంశాలపై కూడా చర్చిస్తామని రావుల తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
దత్తత గ్రామాన్ని వల్లకాడు చేసిన సీఎం కేసీఆర్
చిన్నముల్కనూర్ సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చిగురుమామిడి: మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చి నేడు గ్రామాన్ని వల్లకాడు చేశాడని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. చిన్నముల్కనూర్ గ్రామాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డిలతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. డబుల్ బెడ్రూం నిర్మాణం కోసం ఉన్న ఇళ్ల్లను కూల్చివేసుకుని గుడిసెలు, రేకుల షెడ్లలో కాలం వెళ్లదీస్తున్న చిలుకమ్మ, రజితతోపాటు పలువురు బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చిన్నముల్కనూర్‌లోని మహిళల మానప్రాణాలతో సీఎం ఆటలాడుకుంటున్నాడని, గోనె సంచులు అడ్డంకట్టుకుని స్నానాలు చేస్తున్న పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ఇండ్లు కూల్చివేసి పందిళ్ల కింద తలదాచుకుంటున్నా సీఎంకు ఎందుకు కనికరం కలగడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే గ్రామంలో ఏడు నెలల కింద నిర్మించిన మోడల్ హౌస్‌కు అధికారులు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ముందుంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుతాన్ని నిలదీస్తామన్నారు. -
గెలుపు కోసం టీటీడీపీ వ్యూహం
-
గ్రేటర్ ఎన్నికల్లోనూ టీటీడీపీకి తిప్పలు
-
'టీ టీడీపీకి మర్యాద లేదా..'
హైదరాబాద్: నగరంలోని ప్రగతినగర్ ఇన్‌కాయిస్‌లో నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ సముద్ర విజ్ఞాన కార్యాచరణ శిక్షణా కేంద్ర భవనాల సముదాయాన్ని సోమవారం శాస్త్ర సాంకేతిక మరియు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సృజనా చౌదరి శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా.. శిలాఫలకం పై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల పేర్లు లేకపోవడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన మల్కాజ్ గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి టీడీపీ పార్టీకి చెందిన వారేనని, తనతో పాటు స్థానిక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా టీడీపీకి చెందిన వారే అయినా తమ పేర్లు లేకపోవడం ఆశ్ఛర్యంగా ఉందని ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే టీడీపీ పార్టీనా.. తెలంగాణ టీడీపీకి విలువలేదా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
చంద్రబాబుతో రేవంత్ భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో టీ టీడీపీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నేరుగా విజయవాడకు వెళ్లిన ఆయన మరికొందరు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబును కలిశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయి ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. దీంతోపాటు త్వరలోనే తెలంగాణ ప్రాంత టీడీపీ బాధ్యతల పగ్గాలు అప్పగించేందుకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మొదలైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో టీ టీడీపీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా ఊపందుకుంటున్న నేపథ్యంలో కూడా వారి సమావేశం చర్చనీయాంశం అయింది. -
కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు
-
తెలంగాణ ఎమ్మెల్సీల బరిలో ఏడుగురి పోటీ!
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి ఐదుగురు, కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కొక్కరి చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు వీరే టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, యాదవ్రెడ్డి, నేతి విద్యాసాగర్, బి.వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత తన నమినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. -
బీజేపీ తీరు పై టీ టీడీపీ నేతల అసంతృప్తి
-
ప్రారంభమైన టీ టీడీపీ బస్సు యాత్ర
-
ఏమవుతుందో..?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎండిన పంటలు..రైతుల ఆత్మహత్యలు మరోసారి రాజకీయం కానున్నాయి. కరెంటు కోతలతో పంటలు ఎండిపోవడానికి, రైతుల బలవన్మరణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ విధానాలే కారణమంటూ టీడీపీ దుమ్మెత్తి పోస్తోంది. జిల్లాలో శుక్రవారం చౌటుప్పల్ నుంచి సూర్యాపేట వరకు బస్సుయాత్ర చేపట్టి, సూర్యాపేటలో ధర్నా చేస్తామని టీటీడీపీ నాయకత్వం ప్రకటించిన వెంటనే టీఆర్ఎస్ నాయకులనుంచి తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ‘టీడీపీ చేపట్టే బస్సుయాత్ర ‘కాశీ’యాత్రే. ఆ యాత్రను అడ్డుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..’ అని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నేరుగానే హెచ్చరిక చేశారు. ఇరుపార్టీల విమర్శ, ప్రతి విమర్శల నేపథ్యంలో టీడీపీ బస్సుయాత్ర సజావుగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతికూలత తప్పదా..? జిల్లా సరిహద్దుల్లోని చౌటుప్పల్ మండలంలో మొదలుపెట్టి చిట్యాల, నార్కట్‌పల్లి, మీదుగా సూర్యాపేట దాకా టీడీపీ బస్సుయాత్ర సాగనుంది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సిం హులు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా నాయకులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. అయితే, టీడీపీ నేతలు పరిశీలించే ఎండిపోయిన వరి పొలాలు, పరామర్శించే రైతు కుటుంబాలు ఉన్న ప్రాంతాలు టీఆర్ఎస్కు పట్టున్నవే. మునుగోడు, నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరగనుండగా ఈ మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇక, వీరు ధర్నా తలపెట్టిన సూర్యాపేట మంత్రి జగదీష్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. ఈ కారణంగానే టీడీపీ బస్సుయాత్రను అడ్డుకునేందుకు ప్రజలకు సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి ఓ రకంగా టీడీపీ నాయకత్వానికి హెచ్చరిక పంపారు. ఈ అంశాలన్నింటినీ ఒకచోట పేర్చి విశ్లేషిస్తే.. యాత్రకు ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. ‘తెలంగాణ రాష్ట్రానికి కరెంటు రాకుండా అడ్డుకుని, ఇప్పుడు అదే సమస్యపై ఆందోళన చేస్తాం, టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తాం అంటే.. అడ్డుకోకుండా ఎలా ఉంటాం..’ అని టీ ఆర్ఎస్ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటు వర్షాభావ పరిస్థితులు ...అటు కరెంట్ కోతలు తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు కరెంటుకోతలు కూడా రైతును వెంటాడుతున్నాయి. జిల్లాలోని 59 మండలాలకు గాను 53 మండలాల్లో తక్కువ వర్షపాతం (సాధారణ వర్షపాతం కంటే తక్కువగా) నమోదైంది. ఈ కారణంగానే అన్ని రకాల పంటలు కలిపి 1.50లక్షల హెక్టార్ల సాగువిస్తీర్ణం తగిపోయింది. ఇది పంటల దిగుబడి మీద ప్రభావం చూపనుంది. రైతులను అప్పుల్లోకి నెట్టనుంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఖరీఫ్ సీజన్ ముగిసేనాటికి (సెప్టెంబరు 30వ తేదీ) జిల్లా బ్యాంకర్లు రైతులకు నయాపైస కూడా రుణంగా ఇవ్వలేదు. ఈ పరిస్థితులు అన్నీ కలగలిసి రైతును ఉక్కిరిబిక్కిరి చేశారు. మనోధైర్యం కోల్పోయిన కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సాగర్ ఆయకట్టులో దోమపోటు వరిపంటను ప్రమాదంలోకి నెట్టింది. నాన్ ఆయకట్టులో కరెంటు కోతలు వరిపొలాలను ఎండబెట్టాయి. తీవ్ర వర్షాభావం పత్తి పంటను దెబ్బకొట్టింది. రైతుకు ప్రతికూలంగా మారిన ఈ పరిస్థితులను రాజకీయంగా లబ్ధిపొందేందుకు ఉపయోగించుకోవాలని చూస్తుండడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
టి.టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: రోజుకో మలుపు తిరుగుతూ సాగిన తెలంగాణ టీడీపీ శాసనసభా పక్ష నేత ఎంపిక వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. టీ టీడిఎల్పీ నేతగా ఎర్రబెల్లి దయాకరరావు నియామకం ఖరారైంది. ఉప నేతలుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్‌రెడ్డిలను, విప్‌గా సండ్ర వెంకటవీరయ్యను చంద్రబాబు నియమించారు. అయితే ఎప్పట్లాగే ఈ సమాచారాన్ని కూడా శనివారం రాత్రి 10 తరువాత మీడియాకు లీకుగా అందజేశారు. ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. తెలంగాణ టీడీపీలో తొలిసారిగా పార్లమెంటరీ పార్టీ తరహా విధానాన్ని అమలు చేయాలని బాబు శుక్రవారం భావించారు. టీటీడీఎల్పీ చైర్మన్‌గా ఎర్రబెల్లిని, శాసనసభాపక్ష నేతగా తలసాని, ఉప నేతలుగా రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యలను నియమించాలని భావిం చారు. ఆ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ తాను అధికారం చేపట్టబోతున్న ఆంధప్రదేశ్‌లోనూ అదే విధానాన్ని అమలు చేయాల్సి రావచ్చన్న భావనతో శనివారం రాత్రికల్లా ఆ ప్రతిపాదనను బాబు విరమించుకున్నారు. టీడీఎల్పీ నేతగా తనను నియమించనున్నట్టు తొలుత ప్రకటించిన బాబు, తరవాత నిర్ణయాన్ని మార్చుకోవడం పట్ల తలసాని తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. తానెలాంటి పదవులూ తీసుకోబోనని, ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పి బాబు ఇంటి నుంచి వెళ్లిపోయారు. -
తెలంగాణా గడ్డపై టీడీపీకి గడ్డు కాలం
-
ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీ అవుతున్న టీడీపి