'టీ టీడీపీకి మర్యాద లేదా..' | mp malla reddy Intolerance on without name in foundation stone | Sakshi
Sakshi News home page

'టీ టీడీపీకి మర్యాద లేదా..'

Published Mon, Jan 4 2016 10:55 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

mp malla reddy Intolerance on without name in foundation stone

హైదరాబాద్: నగరంలోని ప్రగతినగర్ ఇన్‌కాయిస్‌లో నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ సముద్ర విజ్ఞాన కార్యాచరణ శిక్షణా కేంద్ర భవనాల సముదాయాన్ని సోమవారం శాస్త్ర సాంకేతిక మరియు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సృజనా చౌదరి శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
 
కాగా.. శిలాఫలకం పై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల పేర్లు లేకపోవడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన  మల్కాజ్ గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి టీడీపీ పార్టీకి చెందిన వారేనని, తనతో పాటు స్థానిక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా టీడీపీకి చెందిన వారే అయినా తమ పేర్లు లేకపోవడం ఆశ్ఛర్యంగా ఉందని ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే టీడీపీ పార్టీనా.. తెలంగాణ టీడీపీకి విలువలేదా  అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement