srujana chowdary
-
జంపింగ్ టీడీపీ ఎంపీలపై కేశినేని నాని సెటైర్స్
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీలపై ఆపార్టీ ఎంపీ కేశినాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ.. జంపింగ్ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లకు ట్విటర్ వేదికగా చురకలంటించారు. ‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో’ అంటూ ట్వీట్ చేశారు. తన మాజీ సహచరులపై విమర్శనాత్మక ధోరణిలో కేశినేని నాని చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. @YSChowdaryMP@CMRamesh_MP@TGVenkatesh మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లోకి చేరారో pic.twitter.com/NgUbJUiecw — Kesineni Nani (@kesineni_nani) July 6, 2019 -
ఈడీది తొందరపాటు చర్య
సాక్షి, హైదరాబాద్: సుజనా కంపెనీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను 2008లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి లావాదేవీలకు పాల్పడలేదని టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి స్పష్టంచేశారు. ఎలాంటి ఆడిటింగ్, బ్యాలెన్స్ షీట్లు చెక్ చేయకుండా ఈడీ తొందరపాటు చర్యకు పాల్పడిందని సుజనా ఆరోపించారు. మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణ్ తనకు స్నేహితుడు మాత్రమేనని, ఆయన కంపెనీలో తాను డైరెక్టర్‌ను కాదని, తన మిత్రులు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. శుక్ర, శనివారాల్లో తన కార్యాలయంతో పాటు ఇళ్లలో ఈడీ సోదాలు జరిపి విడుదల చేసిన అంశాలపై ఆయన ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం తాను కంపెనీలు స్థాపించానని, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేవరకు తన కంపెనీల గురించి బయటకు తెలియదన్నారు. 2008 నుంచి తన పేరు మీద ఎలాంటి కంపెనీలు లేవని, సుజనా గ్రూపులో ఉన్న కంపెనీలు తన సంబంధీకుల పేర్ల మీదకు ఎప్పుడో మారిపోయాయని తెలిపారు. అదే విధంగా తన కంపెనీలపై బ్యాంకు రుణాలున్నాయని, ఆ విషయం సివిల్ వ్యవహారమని, అయినా తన కంపెనీల్లో ఎలాంటి స్మగ్లింగ్ రవాణా, సంఘ విద్రోహ కార్యక్రమాలు జరగడం లేదన్నారు. పైగా ఒక్క రోజులోనే 30 ఏళ్ల కంపెనీ వ్యవహారాలు ఎలా పరిశీలించారో ఈడీ చెప్పాలని, ఒక్క రోజులోనే 120 కంపెనీలున్నాయని, అందులో రూ.6,000 కోట్ల రుణం ఎగవేసినట్లు ఎలా నిరూపిస్తారని అన్నారు. తనకు డమ్మీ కంపెనీలు, షెల్ కంపెనీలంటే ఏంటో కూడా తెలియదని ఈడీపై సుజనా ఎదురుదాడికి దిగారు. ఈడీ జారీచేసిన సమన్లపై పార్లమెంట్ సమావేశాల అనంతరం విచారణకు హాజరవుతానని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సుజనా గ్రూప్‌లోని కంపెనీలు ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం లేదని, డైరెక్టర్లు, న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం కేసు వివరాలపై క్లారిటీ ఇస్తామన్నారు. -
'టీ టీడీపీకి మర్యాద లేదా..'
హైదరాబాద్: నగరంలోని ప్రగతినగర్ ఇన్‌కాయిస్‌లో నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ సముద్ర విజ్ఞాన కార్యాచరణ శిక్షణా కేంద్ర భవనాల సముదాయాన్ని సోమవారం శాస్త్ర సాంకేతిక మరియు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సృజనా చౌదరి శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా.. శిలాఫలకం పై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల పేర్లు లేకపోవడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన మల్కాజ్ గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి టీడీపీ పార్టీకి చెందిన వారేనని, తనతో పాటు స్థానిక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా టీడీపీకి చెందిన వారే అయినా తమ పేర్లు లేకపోవడం ఆశ్ఛర్యంగా ఉందని ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే టీడీపీ పార్టీనా.. తెలంగాణ టీడీపీకి విలువలేదా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.