
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీలపై ఆపార్టీ ఎంపీ కేశినాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ.. జంపింగ్ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లకు ట్విటర్ వేదికగా చురకలంటించారు.
‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో’ అంటూ ట్వీట్ చేశారు. తన మాజీ సహచరులపై విమర్శనాత్మక ధోరణిలో కేశినేని నాని చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
@YSChowdaryMP@CMRamesh_MP@TGVenkatesh
— Kesineni Nani (@kesineni_nani) July 6, 2019
మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లోకి చేరారో pic.twitter.com/NgUbJUiecw
Comments
Please login to add a commentAdd a comment