tg venkatesh
-
తనయుణ్ని ఎమ్మెల్యేగా చూసుకోవాలని టి.జి.వెంకటేష్ ముచ్చట
-
పిచ్చి పరాకాష్టకు.. టీడీపీ నేత టీజీ భరత్ బర్త్‌డే వేడుక నవ్వులపాలు
ఎవరిదైనా బర్త్‌డే జరిగితే అభిమానంతో వెళ్తాం. పుష్పగుచ్ఛమిచ్చి స్వీట్లు తినిపిస్తాం. ఇంకా దగ్గరి వాళ్లయితే కేక్ తీసుకెళ్లి కట్ చేయిస్తాం. వీలైతే ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం. కానీ ఓ టీడీపీ నేత తన బర్త్‌డేకు రమ్మని ఏకంగా కూపన్లు పంచిపెట్టాడు. వాళ్లు మాత్రమే వచ్చి శుభాకాంక్షలు తెలపాలి. అప్పుడే అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆ కూపన్లను చూసి రూ.700 విలువ చేసే గిఫ్ట్ ఇస్తారు. లేకపోతే వచ్చిన దారిలో వెళ్లిపోవాల్సిందే. ఇదండీ కథ. తండ్రి ప్రజల్లో విశ్వాసం కోల్పోతే.. కుమారుడు లేని ప్రజాదరణను చూపించుకునేందుకు తన బర్త్‌డేను వేదికగా చేసుకోవడం నవ్వులపాలైంది. నాయకుడి బర్త్‌డే అంటే స్వచ్ఛందంగా వచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు కానీ.. ఇదెక్కడి విడ్డూరమని కొందరంటే, ఆ ఫ్యామిలీ అంతే పబ్లిసిటీ పిచ్చి అంటూ మరికొందరు నోరు చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి కర్నూలు: బీజేపీ నేత టీజీ వెంకటేశ్ కుమారుడు, టీడీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్ బర్త్‌డే శనివారం జరిగింది. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం! ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించుకునేందుకు తన బర్త్‌డేను ఎంచుకున్నారు. నాలుగేళ్లుగా జనం మధ్య లేరు, చంద్రబాబు వచ్చినా జనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తన బర్త్‌డేకు జనం రారని భరత్ ముందే ఊహించినట్లున్నాడు. అందులో భాగంగా ఓ ప్లాన్ వేశాడు. డబ్బులిచ్చి ఎన్నికల ప్రచారానికి జనాలను పిలిపించుకున్నట్లు ‘గిఫ్ట్’లు ఎరగా వేశాడు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టీడీపీ నాయకులను పదిరోజుల కిందట పిలిపించి సమావేశం నిర్వహించాడు. తన బర్త్‌డే వేడుకకు రూ.700 విలువ చేసే గిఫ్ట్ ఇస్తామని, దాని కోసం ఓ జాబితా తయారు చేయాలని, ఆ ప్రకారం కూపన్లు అందజేసి గిఫ్ట్‌లు పంపిణీ చేద్దామని నిర్ణయించారు. ఆ మేరకు జాబితాలు తయారయ్యాయి. వ్యక్తుల పేరు, ఓటర్ ఐడీ నెంబర్, పోలింగ్ బూత్ నెంబర్, ఫోన్ నెంబర్‌తో కూపన్ ప్రింట్ చేయించారు. ఈ కూపన్లను నియోజకవర్గంలోని డివిజన్లలో తమ పార్టీ సానుభూతిపరులకు పంపిణీ చేశారు. వీరు ఎస్టీబీసీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకకు వచ్చి భరత్‌కు శుభాకాంక్షలు చెప్పి, భోజనం చేసి చివరలో గిఫ్ట్‌లు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పొదుపు మహిళలకు ముక్కుపుడకలు.. కొందరికి గిఫ్ట్‌లు, ఇలా మొత్తం పుట్టిన రోజు ముసుగులో లేని అభిమానానికి ఈ బర్త్‌డే బాయ్ చేసిన ఖర్చు అక్షరాల రూ.5కోట్ల పైనే. జనం బలం ఉందని చూపించుకునే తాపత్రయం టీజీ వెంకటేశ్ కుటుంబంపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. టీడీపీలో ఉన్న టీజీ వెంకటేశ్ 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2014లో తిరిగి టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. కుమారుడు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరడం మినహా టీజీ వెంకటేశ్‌కు రాజకీయ స్థిరత్వం లేదనేది తన రాజకీయ ప్రస్తానాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. అలాగే తండ్రీకొడుకుల్లో ఒకరు బీజేపీ, మరొకరు టీడీపీలో ఉండటం అవకాశవాద రాజకీయాన్ని సుస్పష్టం చేస్తోంది. పాత రోజులు కాకుండా ప్రజలు రాజకీయంగా చైతన్యం అయ్యారు. దీంతో టీజీ కుటుంబం అవకాశవాద రాజకీయాలను పసిగట్టి వారికి దూరంగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ అత్యంత బలహీనపడింది. ఒకే నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నేతలుగా ఉన్న వీరు రాజకీయంగా ఏ రోజు పరస్పరం విమర్శించుకున్నదీ లేదు. తమ రాజకీయాల కోసం ఏ క్షణం, ఏ పారీ్టలోనైనా చేరే నేతగా టీజీ వెంకటేశ్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఆయన కుమారుడు భరత్ నాలుగేళ్లలో విపక్షపార్టీ నేతగా పోరాటం చేసిందీ లేదు. కేవలం ఎన్నికలకు ముందు బలప్రదర్శన చేసుకోవాలని భావించి, బలం లేక ఆర్థికబలంతో కోట్లు ఖర్చు చేసి గిఫ్ట్‌లు పంపిణీ చేసి వాటి కోసం వచ్చిన వారిని తమ అభిమానులుగా చిత్రీకరించుకుని రాజకీయ అడుగులు వేసే ప్రయత్నం చేశాడు. ఎన్నికల ‘వేడుక’ టీడీపీ నాయకుడు భరత్ పిచ్చి పరాకాష్టకు ఈ వేడుక తాజా నిదర్శనం. పుట్టిన రోజుకు రావాలని పిలవడం బాగుంటుంది కానీ, ఏకంగా ఓటరు ఐడీ జిరాక్స్ కాపీ జత చేసి తీసుకురావాలని కూపన్ల మీద కొట్టించడం ఇదంతా ఎన్నికల వేడుక అని చెప్పకనే చెప్పినట్లయింది. ఇంతేకాదు.. కూపన్ల మీ ద ఇచ్చిన వివరాలన్నీ ఓటరు ఐడీ కార్డు తరహాలో ఉండటం గమనార్హం. ఓటరు ఐడీ నెంబర్, బుక్ ఫోలియో, వార్డు నెంబర్, బూత్ నెంబర్‌ను పంపిణీ చేసిన కూపన్లపైనే ముద్రించారు. డేటా చౌర్యం గురించి మాట్లాడే టీడీపీ నేతలు కూపన్ల మాటున ఏకంగా ఓటరు ఐడీలనే బజారుకు తీసుకురావడం ఏమనుకోవాలనే చర్చకు తావిస్తోంది. చంద్రబాబు వద్ద విశ్వసనీయత కోల్పోయారా?! లక్కీటు బ్రదర్స్‌గా చెప్పుకునే రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్‌లను పార్టీ నుంచి తప్పించాలని భరత్ ప్రయతి్నంచాడు. నియోజకవర్గంలో జరిగిన బస్సుయాత్రలో కూడా లక్కీటు బ్రదర్స్ పాల్గొనలేదు. దీంతో వీరు చంద్రబాబుకు భరత్‌పై ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అధిష్టానం భరత్, లక్కీటు బ్రదర్స్‌ను ఇద్దరినీ పిలిపించి వేర్వేరుగా మాట్లాడారు. రాజకీయంగా బలపడాలంటే చేరికలపై దృష్టి పెట్టేవారిని చూశానని, పారీ్టలో ఉన్నవారిని బయటకు పంపే నేతను చూడలేదని భరత్‌ను చంద్రబాబు హెచ్చరించినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 50 ఓట్లు ఉన్న వ్యక్తి కూడా మనకు ముఖ్యమేనని, సర్దుకుని పోవాలని సూచించారు. పైగా భరత్, టీజీ వెంకటేశ్ వేర్వేరు పార్టీలో ఉండటంతో టీడీపీ నియోజకవర్గంలో నష్టపోయిందని, ఇద్దరూ ఒకే పారీ్టలో ఉంటేనే టిక్కెట్ ఇచ్చే ఆలోచన చేస్తామని.. లేదంటే పార్టీ ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బలం నిరూపించునే ప్రయత్నంలో తన బర్త్‌డే వేడుకను అవకాశంగా తీసుకున్నాడు భరత్. అయితే ఈ వేడుకపై ఇటు ప్రజల్లో, రాజకీయ పారీ్టల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బర్త్‌డే వేడుకల్లో భరత్ కొత్త సంప్రదాయానికి తెర తీశాడని, ప్రతీ అంశాన్ని రాజకీయంగా చూడటం సరికాదని చర్చకు దారితీసింది. -
సంసద్ రత్న అందుకున్న విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సంసద్ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డు అందుకున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మా కమిటీకి సంసద్ రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది . స్టాండింగ్ కమిటీలలో ప్రతి అంశంపై లోతైన చర్చ ఉంటుంది. అన్ని అంశాలను అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు చర్చిస్తారు. గతంలో కామర్స్ కమిటీ చేసిన సిఫార్సులను 95% కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అని గుర్తు చేశారాయన. అలాగే.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరహాలో రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఎంపీల తరహాలో, ఎమ్మెల్యేలు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇక సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం.. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా సాగింది. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్ కూడా అవార్డు అందుకున్నారు. రవాణా ,సాంస్కృతిక, పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ నుంచి ప్రతిష్టాత్మకమైన సంసద్ రత్న అవార్డును స్వీకరించడం జరిగింది. pic.twitter.com/bTGDxBLwuC — Vijayasai Reddy V (@VSReddy_MP) March 25, 2023 ఈ సందర్భంగా.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్లో బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. విజయసాయిరెడ్డి ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పనితీరును గమనించాను. ఆయన పార్లమెంటు కార్యక్రమాలలో చాలా పరిశ్రమిస్తారు అని దత్తాత్రేయ పొగిడారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పార్లమెంటులో గందరగోళం వల్ల బిల్లులపై సరైన చర్చ జరగదని ప్రజలు భావిస్తారు. కానీ స్టాండింగ్ కమిటీలలో అధికార విపక్ష ఎంపీలు ఉంటారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. స్టాండింగ్ కమిటీల పనితీరు బాగా ఉంది. పర్యాటక సాంస్కృతిక రవాణా కమిటీకి అవార్డు రావడం సంతోషకరం. చార్టెడ్ అకౌంటెంట్, మేధావి విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈ కమిటీ మరింత బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. పార్లమెంట్లో సభ్యుల పనితనానికి గౌరవసూచీగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో.. సంసద్ రత్న అవార్డులను 2010 నుంచి అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి, సైన్స్ మేధావి ఏపీజే అబ్దుల కలాం సూచన మేరకు.. ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్ కాగా.. ఇవాళ (మార్చి 25) న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. -
కర్నూలులో ఏ కండువా? ఏ దారి?
నియోజకవర్గంలో తండ్రి కాషాయ కండువా కప్పుకుని తిరుగుతున్నాడు. కొడుకేమో పచ్చ కండువా వేసుకుని రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో వారి కేడర్‌కు ఏ కండువా కప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పచ్చ పార్టీ సీటు మైనారిటీకి ఇస్తారనే ప్రచారంతో కొడుకు పార్టీని పట్టించుకోవడంలేదట. దీంతో అక్కడి రాజకీయాలు మరింత గందరగోళంగా మారాయనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ తండ్రీ కొడుకులు ఎవరు? లీడర్లలో క్లారిటీ మిస్ అయిందా? గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటివరకు పచ్చ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేశ్... పార్టీ ఓటమితో చంద్రబాబు సలహామేరకు కాషాయ కండువా కప్పుకున్నారు. కాని ఆయన కుమారుడు భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు. కర్నూల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వెంకటేశ్ కుమారుడు భరత్ ఎన్నికల్లో ఓటమి తర్వాత చతికిలపడ్డారు. రాజకీయాలకు విరామం ఇచ్చి వ్యాపారాల్లో మునిగిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహంతో వారి కేడర్‌లో అయోమయం కొనసాగుతోంది. మరోవైపు తండ్రి ఒక పార్టీలో...కొడుకు మరో పార్టీలో ఉండటం కూడా కేడర్‌ను ఇబ్బందికి గురిచేస్తోంది. తాము ఏ రంగు కండువా కప్పుకోవాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. కంచుకోట అలా బద్దలయింది.! ఒకప్పుడు కర్నూల్ నియోజకవర్గంలో టీజీ వెంకటేశ్ వర్గం బలంగా ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీజీ కంచుకోటను బద్దలు చేసింది. టీజీ భరత్ దారుణంగా ఓడిపోయాడు. రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్న టీజీ వెంకటేశ్ తన వర్గాన్నంతా కొడుకుకు అప్పగించాడు. వారంతా గత ఎన్నికల్లో పచ్చ జెండాలు పట్టుకుని భరత్ కోసం పనిచేశారు. ఓడిపోయాక భరత్ కేడర్‌ను పట్టించుకోవడం మానేశాడు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటుగా..కేడర్‌తో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో వారంతా చెల్లా చెదురవుతున్నారని తెలుస్తోంది. కేడర్ దూరం కావడం భవిష్యత్‌లో భరత్‌కే నష్టం అంటున్నారు. తండ్రీ, కొడుకులిద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయాన్ని ముందే ఖరారు చేశారనే టాక్ నడుస్తోంది. సైకిల్ కాదు కానీ..! కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు. మైనార్టీలే మెజారిటీగా ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతను ఎన్నికల బరిలో దించి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఏమాత్రం అవకాశాలు లేవని అర్థమవుతోంది. తండ్రీ కొడుకులు వేర్వేరు రాజకీయాలు చేస్తుండటం... కేడర్‌ను దూరం చేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి కోసం టీడీపీ ఇన్చార్జ్ టీజీ భరత్ స్వయంగా బాటులు వేసుకుంటున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిజి భరత్ కు టిక్కెట్ వచ్చేట్లు కనిపించడంలేదని కర్నూలు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరు టిజి భరత్ కు దూరం అవుతున్నారు. టీజీ కుటుంబాన్ని నమ్ముకుంటే నిండా మునగడం ఖాయమని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. తండ్రీ, కొడుకులు చెరో పార్టీలో ఉంటూ... కేడర్‌ను దూరం చేసుకోవడంతో మొత్తంగా కర్నూల్ తెలుగుదేశం పార్టీ అచేతనంగా మారిపోయింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ప్యాకేజీకి చంద్రబాబే అంగీకరించారు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేకహోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి అంగీకారం తెలిపారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆ ఆమోదం ప్రకారం పనిచేయాల్సి ఉంటుందన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టిన వారిలో తాను ఒకడినన్నారు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద అంగీకారం తెలిపిన తర్వాత అందుకు కట్టుబడాల్సి ఉంటుందని చెప్పారు. ప్యాకేజీ రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేరకు నిధులు వస్తే ఆమేరకు తీసుకోవడమే బెటర్ కదా అని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అంశం అయినా రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలన్నదే బీజేపీ రాష్ట్ర పార్టీ విధానమన్నారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసే అంశంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రెండూ ప్రజలను మోసం చేశాయన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ విధానాల కారణంగా ఆంధ్రుల డబ్బులన్నీ హైదరాబాద్‌కి పెట్టుబడులు రూపంలో వెళుతున్నాయన్నారు. దాన్ని తెలంగాణ నేతలు వారిగొప్పగా చెప్పుకొంటున్నారని విమర్శించారు. -
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత టీజీ వెంకటేష్ సెటైర్లు
-
భూ కబ్జా కేసుపై ఎంపీ టీజీ వెంకటేష్ స్పందన
-
బంజారాహిల్స్ భూ కబ్జా కేసు.. ఎంపీ టీజీ వెంకటేష్ క్లారీటి
సాక్షి, హైదరాబాద్: తనకు బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ఏపీ జెమ్స్ భూ కబ్జా కేసుపై ఆయన స్పందిస్తూ.. వివాదం బయటకు వచ్చినపుడు తాను లక్షద్వీప్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. టీజీ విశ్వప్రసాద్.. భూ కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయన్నారు. చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..? ‘‘ముందుగా టీజీ వెంకటేష్ పేరు ఎఫ్ఐఆర్లో లేదు. రెండవ రోజు ఎఫ్ఐఆర్లో టీజీ వెంకటేష్ పేరు చేర్చారు. బంజారాహిల్స్ ఆస్తి కోసం రెండు వర్గాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. నాకు ఈ కేసుతో సంబంధం లేదని టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. టీజీ అనే పేరు ఉన్నంత మాత్రాన నన్ను ఈ వివాదంలోకి లాగడం సరికాదు. మా వంశీయులు ఎందరో టీజీ పేరుతో కొనసాగుతున్నారు. నేను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పర్యటనలో భాగంగా లక్షద్వీప్ వచ్చాను. ఏపీ జెమ్స్ ప్రతినిధులు సైతం ఈ కేసుతో నాకు సంబంధం లేదని తెలిపారు’’ అని టీజీ వెంకటేష్ వివరణ ఇచ్చారు. -
Land Grab: టీజీ రౌడీయిజం.. రూ.100 కోట్ల ఆస్తిపై కన్ను
సాక్షిప్రతినిధి కర్నూలు: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ. వందకోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయబోయిన వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు టీజీ విశ్వప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ–1గా విశ్వప్రసాద్, ఏ–5గా టీజీ వెంకటేష్ ఉన్నారు. సినీఫక్కీలో జరిగిన ఈ కబ్జా వ్యవహారం హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలరీ పార్క్ నిర్మించేందుకు రెండు ఎకరాల స్థలం కేటాయించారు. ఆ సంస్థ కొంత మేర నిర్మాణాలు చేపట్టి, ఆపై వదిలేసింది. ఇందులో 2,250గజాలు(అరెకరం) స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఈ స్థలంపై వీవీఎస్ శర్మ అనే వ్యక్తి కన్నుపడింది. దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. ఆపై స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు తన బలం సరిపోదని, ఎవరైనా బలమైన వ్యక్తులు అవసరమని వీవీఎస్ శర్మ భావించారు. ఈ క్రమంలో స్థలాన్ని తాను కొనుగోలు చేస్తానని, వివాదం తానే సెటిల్చేసుకుంటానని టీజీ విశ్వప్రసాద్ రంగంలోకి దిగారు. తక్కువ మొత్తానికి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రౌడీల సాయంతో స్వాధీనం చేసుకునే యత్నం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో పంచాయితీకి ప్రయతి్నంచారు. అయితే ఒరిజనల్ డాక్యుమెంట్లు నిర్మాణ సంస్థకు ఉండటం, వారు పంచాయితీకి ఒప్పుకోకపోవడంతో టీజీ విశ్వప్రసాద్ యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఆదోని, మంత్రాలయంతో పాటు హైదరాబాద్‌లోని మరికొంతమంది రౌడీలను తీసుకుని ఆదివారం స్థలం స్వాధీనం చేసుకునేందుకు జేసీబీలతో వెళ్లారు. రెడీమేడ్‌గా ఓ కంటైనర్ ఆఫీసును తీసుకుని వెళ్లి అక్కడ ఉంచారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు జెమ్స్ అండ్ జ్యూవెలరీ గార్డు నవీన్‌కుమార్ యతి్నస్తే అతనిపై దాడికి దిగారు. దీంతో నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరందరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అజ్ఞాతంలో టీజీ వెంకటేష్ ఈ కేసులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఏ3, ఏ4గా ఉన్న సుభాశ్‌పోలిశెట్టి, మిథున్కుమార్లు ఆదివారం రాత్రి పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్నారు. అర్ధరాత్రి మూత్రం వస్తోందని చెప్పి స్టేషన్ నుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదోని, మంత్రాలయానికి చెందిన వారే 50మంది ఈ వ్యవహారంలో 63 మందిపై బంజరాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ–1గా టీజీ విశ్వప్రసాద్, ఏ2గా వీవీఎస్ శర్మ, ఏ3గా సుభాశ్‌పోలిశెట్టి, ఏ–4గా అల్లు మిథున్‌కుమార్, ఏ–5గా టీజీ వెంకటేశ్, ఏ–13గా మల్లికార్జున అలియాస్ మల్లప్ప పేర్లు చేర్చారు. వీరిలో ఏ–1 విశ్వప్రసాద్ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి, వ్యవహారానికి సూత్రధారి. ఏ–2 వీవీఎస్ శర్మ అనే వ్యక్తి తప్పుడు రికార్డులు సృష్టించి, స్థలాన్ని విశ్వప్రసాద్‌కు విక్రయించిన వ్యక్తి. తక్కిన వారంతా విశ్వప్రసాద్‌కు వ్యాపార భాగస్వాములు, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న వ్యక్తులు. నవీన్ పోలిశెట్టి తూర్పుగోదావరి జనసేన పార్టీ కనీ్వనర్. అలాగే మల్లికార్జున అనే వ్యక్తి ఆదోని వాసి. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆదోని నుంచి 20 మంది, మంత్రాలయం నుంచి 30 మంది రౌడీలను తీసుకెళ్లింది మల్లికార్జున. ఈ 50 మందిని పోలీసులు విచారిస్తే ఈ విషయం చెప్పారు. దీంతో పాటు తామంతా టీజీ వెంకటేష్ మనుషులమని, ఆయన అండతోనే ఇక్కడకు వచ్చినట్లు మల్లికార్జున చెప్పడంతో కేసులో టీజీ వెంకటేష్ పేరును పోలీసులు చేర్చారు. -
శ్రీనివాస్ గౌడ్ వర్సస్ టీజీ వెంకటేశ్
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఆస్తులు హైదరాబాద్‌లో ఉంటాయి.. కానీ, హైదరాబాద్, తెలంగాణ గురించి మాట్లాడితే వినే ఓపిక లేదా’ ‘మీటింగ్‌కు–మీరు మాట్లాడే విషయానికి ఏమైనా సంబం ధం ఉందా? ఎజెండా ఏంటో దానిపైనే మాట్లాడాలి.. అనవసర విషయాల ప్రస్తావనెందుకు’ తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ – ఆంధ్రప్రదేశ్ ఎంపీ టీజీ వెంకటేశ్ మధ్య జరిగిన వాదన ఇది. ఓ కీలక సమావేశంలో పలువురు ఎంపీలు, అధి కారుల సమక్షంలో ఇద్దరి మధ్య మాటామాట చోటుచేసుకుంది. ఓ దశలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న దాకా వెళ్లింది. చివరకు తెలంగాణ ఉద్యమ సమయ ప్రస్తావన కూడా చోటు చేసుకుంది. ఇతర ఎంపీల జోక్యం చేసుకోవటంతో వివా దం సద్దుమణిగినా.. ఆ సమావేశంలో మరి కొంత సేపు ఉండాల్సి ఉన్నప్పటికీ అర్ధాంతరంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిష్క్రమించారు. ఇదీ విషయం...: రవాణా, సాంస్కృతిక–పర్యాటక శాఖల పార్లమెం టరీ స్థాయీ సంఘం బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఆ కమిటీ పరిధిలోని శాఖల పనితీరును పరిశీలిస్తూ, కేంద్రం నుంచి ఉండాల్సిన సహకారం, ప్రాజెక్టులకు బ్యాం కుల రుణాలు.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది. మాదాపూర్‌లోని ఓ స్టార్ హోటల్లో ఈ కమిటీ చైర్మన్, ఎంపీ టీజీ వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. సమావేశం దాదాపు గంటన్నర ఆలస్యంగా మొదలైంది. తొలుత పర్యాటక, సాంస్కృతిక శాఖపై చర్చ ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, పనుల గురించి మాట్లాడారు. సమావేశం బాగా ఆలస్యమైనందున ఎక్కువ సమయం తీసుకోవద్దని టీజీ వెంకటేశ్ రెండు పర్యాయాలు మం త్రికి సూచించారు. దీనికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. సమావేశంలో అలా గట్టిగా మాట్లాడటం కరెక్టు కాదని చెప్పి ఎం పీలు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఆ వెంటనే శ్రీనివాస్‌గౌడ్ సభ నుంచి నిష్క్రమించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 27 మంది ఎంపీలు, స్థానిక అధికారుల సమక్షంలో ఇది జరగడం గమనార్హం. -
‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ నీటి గొడవలు’
సాక్షి, కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ నీటి గొడవలు మొదలుపెట్టారు.. మాకు హైదరాబాద్ వచ్చే హక్కు ఉందని’’ తెలిపారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. కరోనా బాధితులను చెక్‌పోస్ట్‌ల వద్ద ఆపేశారు. విభజన హామీలను మరిచిపోతే ఎలా. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ఇష్టమొచ్చినట్లు విద్యుదుత్పత్తి చేస్తామనడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు. ‘‘పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ తెలంగాణ ప్రాజెక్టుల కంటే ముందే కట్టారు..మాకు నీళ్లిచ్చిన తర్వాతే తెలంగాణకు నీళ్లివ్వాలి. పోలీసులతో ప్రాజెక్ట్‌ను మోహరించడం కరెక్ట్ కాదని’’ బీజేపీ నేత టీజీ వెంకటేష్ మండిపడ్డారు. -
మోదీ అభివృద్ధికి బాటలు చేస్తున్నారు
-
మోదీ ప్యాకేజీ ఎంతో అభినందించతగ్గది
సాక్షి, కర్నూలు : భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ ఎంతో అభినందించతగ్గదని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 10 శాతం ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్యాకేజీలు కేటాయించడం గొప్ప విషయమన్నారు. ఈ ప్యాకేజీ వల్ల స్వయం ఆధారిత భారతదేశం ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. రైతులకు తమ ఆదాయాన్ని రెట్టింపు చేస్తూనే, పేద వర్గాలకు కూడా సహాయం అందించే ప్యాకేజీ అని అన్నారు. చిన్నతరహా పరిశ్రమలకు చేయూతను ఇస్తూనే, భారత్‌లో తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సులభమైన రుణ సదుపాయాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: టీజీ వెంకటేశ్
సాక్షి, కర్నూలు: కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో సీఎం జగన్, ఎంపీ టీజీ వెంకటేశ్‌ల మధ్య అసక్తికర చర్చ జరిగింది. తమకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందని సీఎంను ఎంపీ కోరగా.. హైకోర్టు కర్నూలులో ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరామని, నివేదిక కూడా పంపించామని సీఎం జగన్ వివరించారు. రాయలసీమ డిక్లరేషన్‌లో, బీజేపీ మేనిఫెస్టోలో హైకోర్టు అంశం ఉండటంతో కేంద్రం నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చని సీఎం జగన్‌తో ఎంపీ టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. కర్నూలులోని దిన్నెదేవరపాడులో జరిగిన పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరై నూతన వధూవరూలను ఆశీర్వదించారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఓర్వకల్లు విమానశ్రయానికి సీఎం జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానశ్రయంలో సీఎం జగన్‌కు ఎంపీ టీజీ వెంకటేశ్‌తో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్‌తో టీజీ వెంకటేశ్ కాసేపు ముచ్చటించారు. చదవండి: సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన జ్యోతి తల్లి జనసేనకి దూరంగా లేను.. దగ్గరగా లేను దూరదృష్టితోనే మూడు రాజధానుల నిర్ణయం -
మాట జారి తడబడ్డ టీజీ వెంకటేష్
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ బీజేపీలోకి ఫిరాయించినప్పటికీ.. ఇంకా టీడీపీలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. మాట జారి తడబడ్డారు. సమావేశం ప్రారంభంలోనే మా తెలుగుదేశం పార్టీ నేతలు అంటూ నాలుక కరచుకున్నారు. ఇంతలోనే అక్కడున్న మీడియా ప్రతినిధులు ‘సార్ మీరు బీజేపీలో ఉన్నార’ని గుర్తుచేయడంలో సరిచేసుకున్నారు. పొరపాటును సరిదిద్దుకుంటూ.. తెలుగుదేశం కాదు.. తెలుగు ప్రజలు అని సవరించుకోవాలని సూచించారు. కుదరక, మళ్లీ మొదటి నుంచి చెబుతానంటూ మీడియా సమావేశాన్ని తొలినుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులపై సానుకూలంగా స్పందించారు. మూడు ప్రాంతాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, వాటి బ్రాంచులు ఉండాలన్న నిర్ణయాన్ని సమర్థించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డైనమిక్ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ‘నాది రాయలసీమ, నా మామది అమరావతి, నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం’ అందుకే అందరి కోసం మూడు రాజధానులుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణకు టీజీ వెంకటేష్ ఇదివరకే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. -
వందతో ఆగకూడదు
శైలేష్, ఏఇషా ఆదరహ జంటగా శైలేష్ సాగర్ దర్శక త్వంలో రామసత్యనారాయణ నిర్మించిన 98వ చిత్రం ‘శివ 143’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ టీజీ వెంకటేష్ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ సెంచురీకి చేరువలో ఉన్నారు. వంద సినిమాలతో ఆపకుండా ఆయన మరెన్నో సినిమాలు నిర్మించాలి. ‘శివ 143’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకున్నాం. కానీ సెన్సార్ బోర్డ్‌వారు సినిమాని చూడకపోవడంతో కుదరలేదు. అందుకే ఫిబ్రవరికి వాయిదా వేశాం. ఈ చిత్రానికి ముందు మేం నిర్మించిన ‘పోలీస్ పటాస్’ ట్రైలర్‌ని వెంకటేష్‌గారి చేతుల మీదగా విడుదల చేయించాం. ఆ సినిమాను విజయవంతంగా విడుదల చేశాం. అలానే ఈ సినిమాని కూడా ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ. -
అన్నీ ప్రాంతాల అభివృద్ధే జగన్ ధ్యేయం
-
అలా అయితే అమరావతిలో ఎండలకే చనిపోతారు...
సాక్షి, అమరావతి: విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన అభినందనీయమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రశంసించారు. కర్నూలులో వరదలు, తుఫాన్లు వస్తాయనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కర్నూలులో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ ...అలా అయితే అమరావతిలో ఎండలు తట్టుకోలేక జనాలు చనిపోతారంటూ వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 200 ఎకరాలు అవసరం అయితే , రాయలసీమలో 400 ఎకరాలు ఖాళీ భూములు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాంతీయ విభేదాలు లేకుండా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఇక రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానంటే ...చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడిగారని, ప్యాకేజీ తీసుకుంటే వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్రెడిట్ వస్తుందని ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. చదవండి: మూడింటిలోనూ ఉద్ధండులే! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
సీఎం జగన్ ఆలోచన మంచి నిర్ణయం: టీజీ
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం మంచి నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రశంసించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంద్ర ఉద్యమ సమయంలో ఈ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరఫున పోరాటం చేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలను ఖండించారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తెరమీదకు తీసుకువచ్చి అక్కడ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామని ప్రస్తావించారు. విశాఖలో పరిపాలన రాజధానితోపాటు రాయలసీమ ప్రాంతంలో ప్రాంతీయ పరిపాలనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాయలసీమలో ఉత్తరాంధ్ర ప్రాంతాంల్లో మినీ అసెంబ్లీ భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక హైకోర్టుతో సరిపెట్టకుండా మినీ అసెంబ్లీ మినీ సెక్రటేరియట్ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో అన్ని విభాగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి : 3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు ‘మూడు రాజధానులపై సర్వత్రా హర్షం’ ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! -
‘పవన్ ఆ ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యం లేకపోవడానికి హిందూ నాయకులే కారణమంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఖండించారు. బుధవారం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. మత ఘర్షణలకు హిందువులే కారణమంటూ చెప్పడం వెనక పవన్‌కు రాజకీయ దురుద్దేశం ఉందని మండిపడ్డారు. పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు బీజేపీతో కలిసే ఉన్నారని, కేంద్ర పెద్దలు అంటే తనకెంతో గౌరవం ఉందంటూ పవన్ చెప్తున్నారని జీవీఎల్ తెలిపారు. బీజేపీ విధానాలు నచ్చి కలిసి పని చేయాలనుకునే ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని చెప్పారు. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తామని.. అందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ముందే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరినప్పటికీ పవన్ అంగీకరించలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు పొత్తులకు ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఏపీకి 3 స్మార్ట్ సిటీలు మాత్రమే కేటాయించారు : టీజీ స్మార్ట్ సిటీల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. అభివృద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రానికి 11 స్మార్ట్ సిటీలు కేటాయిస్తే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 3 మాత్రమే కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల కింద ప్రారంభమైన అమృత్ పథకంలో భాగంగా కర్నూలు పట్టణ త్రాగునీటి అవసరాలకు నిధులు కేటాయించారని వాటిని సక్రమంగా ఖర్చుపెట్టి సకాలంలో పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సకాలంలో పనులు పూర్తి చేసినట్లయితే కర్నూలు జిల్లా ప్రజల నీటి కష్టాలు తొలుగుతాయని టీజీ పేర్కొన్నారు. -
కడుపుబ్బా నవ్వుకుంటారు
‘‘కర్నూలు జిల్లాకు చెందిన దర్శక– నిర్మాతలు కలిసి ‘తెనాలి రామకృష్ణ: బీఏ బీఎల్’ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో నన్ను సంప్రదిస్తే నా వంతు సాయం చేశాను. సందీప్ చక్కగా నటించాడు. దర్శక–నిర్మాతలతో పాటు చిత్రబృందానికి అభినందనలు’’ అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. సందీప్‌కిషన్, హన్సిక జంటగా నటించిన తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ: బీఏ బీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అనేది ఉపశీర్షిక. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. కర్నూలులో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టీజీ వెంకటేశ్ విడుదల చేశారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ–‘‘మా చిత్రబృందంలో తెనాలి రామకృష్ణుడు నాగేశ్వరరెడ్డిగారే. ఆయనలాంటి దర్శకుడు ప్రస్తుతం నాకు దొరకడం నా అదృష్టం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు’’ అన్నారు. ‘‘సందీప్ కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు జి. నాగేశ్వరరెడ్డి. ‘‘ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి. ‘‘కర్నూలులో 18రోజులు చిత్రీకరణ జరిపాం. సినిమా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘కర్నూలులో చిత్రీకరణ జరుపుకున్న సినిమాలన్నీ పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కూడా హిట్ కావాలి’’ అన్నారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ. హన్సిక, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, నటుడు సప్తగిరి, ఎడిటర్ గౌతంరాజు, అశోక్‌కుమార్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ∙కాటసాని రాంభూపాల్ రెడ్డి, టి.జి.వెంకటేశ్, సందీప్ కిషన్, జి.నాగేశ్వరరెడ్డి, సంజీవ్ రెడ్డి -
టీడీపీలో నాయకత్వ లేమి.. జిల్లాలో పూర్తి డీలా
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ పరిస్థితి చూస్తే నాయకత్వ లేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు 20 ఏళ్లుగా జిల్లాలో పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్నేళ్లు ‘సైకిల్’పై ప్రయాణం చేసినా రాజకీయ లక్ష్యాన్ని చేరుకోలేమని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ∙ సాక్షి, కర్నూలు : రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. వైఎస్సార్ జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా వైఎస్సార్ జిల్లా తర్వాత కర్నూలే! గత 20 ఏళ్ల ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచింది 2009 ఎన్నికల్లో మాత్రమే. అది కూడా నాలుగు స్థానాలే. తక్కిన మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. ఈ ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పరిస్థితి అట్టడుగుకు చేరింది. ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఈ స్థాయిలో దెబ్బతినడానికి కారణం ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో పాటు నేతల తప్పులు కూడా కన్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకూ కొంతమంది నేతలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరికొంతమంది పార్టీ వీడి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు పూర్తిగా బలహీనపడటం, టీజీ వెంకటేశ్ లాంటి వ్యక్తులు స్వార్థరాజకీయాలతో రెండు పడవలపై ప్రయాణం చేస్తుండడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారంగా మారింది. విశ్వాసం కోల్పోయిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి జిల్లాలో రాజకీయంగా గౌరవం ఉండేది. అయితే.. ఇటీవలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామాన్ని కోట్ల వర్గంతో పాటు జిల్లా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మను కూడా ఘోరంగా ఓడించారు. వారు కనీసం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే గౌరవం ఉండేది. కానీ కొన్నేళ్లుగా వైరం నడిపిన కేఈ కుటుంబం ప్రయాణిస్తున్న ‘సైకిల్’లోనే వీరు ఎక్కడంతో ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఆయన వర్గంగా ఉన్న వారు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు కోట్ల కుటుంబం రాజకీయంగా చెల్లని కాసైపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. బలహీనపడిన ‘భూమా’, కేఈ వర్గాలు జిల్లా టీడీపీలో కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి బలమైన నేతలుగా ఉండేవారు. భూమా మృతితో కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లో చేరారు. ముఖ్యంగా భూమా స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి... అఖిల ప్రియతో విభేదించి తనవర్గాన్ని దూరంగా ఉంచారు. భూమా సోదరుడి కుమారుడు కిషోర్‌కుమార్‌రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా అఖిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి బంధువైన శివరామిరెడ్డి కూడా అఖిలతో విభేదించారు. క్రషర్ విషయంలో అఖిల భర్తకు, శివరామిరెడ్డికి తలెత్తిన వివాదంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. కుటుంబసభ్యులే ఆమెకు దూరం కావడం, రాజకీయంగా పరిణతి లేకపోవడంతో పాటు కుటుంబం కూడా టీడీపీ నుంచి పీఆర్పీ, ఆ తర్వాత వైఎస్సార్సీపీ, ఆపై తిరిగి టీడీపీలో చేరడంతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. మండల, గ్రామస్థాయి నేతలు కూడా వారికి దూరమవుతున్నారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో టీడీపీ భవిష్యత్తు ఏంటో స్పష్టమవుతోంది. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి వయోభారంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. గత ఐదేళ్లు టీడీపీలో కొనసాగినా, చంద్రబాబు కేఈకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో తన కుమారుడిని కూడా టీడీపీని వీడి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్యాంబాబు పార్టీని వీడితే కేఈ ప్రభాకర్ కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే డోన్, పత్తికొండలో టీడీపీకి గడ్డుకాలమే. ఆదోనిలో మీనాక్షినాయుడుకు వయసైపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే! ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరిత కుటుంబం టీడీపీలో చేరడాన్ని సొంత వర్గీయులే జీర్ణించుకోలేకపోయారు. గతంలో టీడీపీ వైఖరితోనే గౌరు కుటుంబం దెబ్బతింది. అదే పార్టీలో చేరడంతో కేడర్‌కు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో చరిత, వెంకటరెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా ముగుస్తుందని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. టీజీ ద్వారా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో టీజీ వెంకటేశ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ తీర్థం పుచ్చుకునే టీజీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. తన కుమారుడిని మాత్రం టీడీపీలోనే కొనసాగిస్తున్నారు. వ్యాపార రంగంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకే టీజీ బీజేపీలో చేరారనేది బహిరంగ సత్యం. తండ్రీ కొడుకుల ‘డబుల్‌గేమ్’తో బీజేపీ, టీడీపీ ఇద్దరినీ విశ్వసించడం లేదు. ఇలా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ముందు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గస్థాయి నేతలు గత 20 ఏళ్ల ఫలితాలను బేరీజు వేసుకుని..మరో 20 ఏళ్లు టీడీపీతో ప్రయాణం చేసినా ఎమ్మెల్యేలం కాలేమని నిర్ధారణకు వస్తున్నారు. అందుకే ‘సైకిల్’ ప్రయాణాన్ని వీడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. -
‘కేంద్ర ప్రభుత్వ నిధులను బాబు దోచుకున్నారు’
సాక్షి, కర్నూలు : నరేంద్ర మోదీ దేశ ప్రధానిలా గాకుండా సేవకునిగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ దేవధర్ అన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని... దేశ వ్యాప్తంగా అవినీతి రహిత పాలన అందించడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటికే అనంతపురం, కడప జిల్లాల్లో పాదయాత్రలో పాల్గొన్నానని తెలిపారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మార్చుకుని ప్రజలను మోసం చేశారని సునీల్ మండిపడ్డారు. అధికారం ఉందని.. అవినీతిని ప్రోత్సహించి.. కేంద్ర ప్రభుత్వ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. ‘బాహుబలి సినిమాలో కట్టప్ప వలె తన మామ అయిన ఎన్టీఆర్‌ను వెనుపోటు పొడిచి.. టీడీపీని లాక్కొని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయనను, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని విమర్శలు గుప్పించారు. అక్కడక్కడా అంటరానితనం ఉంది.. స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గాంధీ సంకల్పయాత్ర దోహదం చేస్తుందని రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ప్లాస్టిక్ వల్ల లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయని... ప్లాస్టిక్ వ్యర్ధాలను అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో అక్కడక్కడా అంటరానితనం నెలకొని ఉందని.. దానిని రూపుమాపేందుకు బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. ఇక దేశంలో పారిశ్రామిక విప్లవం తెచ్చేందుకు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. -
‘వైఎస్సార్ ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు’
సాక్షి, కర్నూలు : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాయలసీయ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ముందుకు రావాలని కోరారు. రాజధాని, హైకోర్టు కోసం కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల భూమి ఉందని తెలిపారు. కర్నూలుకు రాజధాని, హైకోర్టు ప్రకటిస్తే.. రాజధాని అభివృద్ధి చెందుతుందని అన్నారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పారు. -
రాజధానిపై భిన్నస్వరాలు
-
సీమకు తీవ్ర అన్యాయం : టీజీ వెంకటేష్
సాక్షి, అనంతపురం : రాజధాని విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. రాయలసీమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకోవాలని కోరారు. సీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ జరగాలని కోరారు. -
సీఎం జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారు
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో తిరుగులేని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మంచి పరిపాలన అందిస్తున్నారని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కొనియాడారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరిగి ఉంటే మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయే వారు కాదన్నారు. రాజధాని ప్రాంతం రైతులు వైఎస్ జగన్‌కు ఓటు వేశారని తెలిపారు. కర్నూలు జిల్లాలో రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. -
మాస్ పోలీస్
ఆయేషా హబీబ్, రవి కాలే ప్రధాన పాత్రల్లో శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్ పటాస్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన 97వ చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ ఆవిష్కరించారు. ఇటీవల రోశయ్య 87వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం ట్రైలర్‌ను రోశయ్య చేతుల మీదగా ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అన్నారు రోశయ్య. ‘‘ఆయేషా నటన ఈ చిత్రానికి హైలైట్. మాస్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ సత్యనారాయణ. -
జంపింగ్ టీడీపీ ఎంపీలపై కేశినేని నాని సెటైర్స్
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీలపై ఆపార్టీ ఎంపీ కేశినాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ.. జంపింగ్ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లకు ట్విటర్ వేదికగా చురకలంటించారు. ‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో’ అంటూ ట్వీట్ చేశారు. తన మాజీ సహచరులపై విమర్శనాత్మక ధోరణిలో కేశినేని నాని చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. @YSChowdaryMP@CMRamesh_MP@TGVenkatesh మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లోకి చేరారో pic.twitter.com/NgUbJUiecw — Kesineni Nani (@kesineni_nani) July 6, 2019 -
ఆ నలుగురిపై అనర్హత వేటు వేయండి..
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ మారిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం చెల్లదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతా రామలక్ష్మి, ఎంపీలు గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని తదితరులు ఉప రాష్ట్రపతిని కలిశారు. విలీనం అంశాన్ని తప్పుబట్టిన వారు ....పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాము విలీనం కోరుతూ ఎలాంటి తీర్మానం చేయలేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. మరోవైపు పార్టీ మారిన ఎంపీలు బీజేపీ సభ్యులే అంటూ రాజ్యసభ వెబ్సైట్లో అధికారికంగా పేర్కొన్న విషయం విదితమే. చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఇద్దరే.. టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం -
రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఇద్దరే..
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. దీంతో రాజ్యసభ వెబ్సైట్లో బీజేపీ సభ్యుల జాబితాలో టీడీపీ ఎంపీల పేర్లు అధికారికంగా నమోదు అయ్యాయి. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యులుగా తోట సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ పేర్లను మాత్రమే చూపుతోంది. మరోవైపు విలీనం చెల్లదంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. కాగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేస్తూ తీర్మానించిన లేఖను ఆ పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ నిన్న వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి అందచేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే, కాలికి గాయం కావడంతో గరికపాటి మోహన్‌రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. చదవండి: టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం -
బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు
-
మనసు మార్చుకున్న ఎంపీ సీతా రామలక్ష్మి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావుతో పాటు సీతా రామలక్ష్మి కూడా బీజేపీలో చేరతారని వార్తలు వెలువడ్డా...అనూహ్యంగా ఆమె వెనక్కి తగ్గారు. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి సీతా రామలక్ష్మితో పాటు రవీంద్రకుమార్ మాత్రమే మిగలారు. చదవండి: రాజ్యసభలో టీడీపీ ఖాళీ! రాజ్యసభలో టీడీపీపీ బీజేపీలో విలీనం జ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని తక్షణమే బీజేపీలో విలీనం చేయాలంటూ ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం లేఖను ఉప రాష్ట్రపతికి అందచేశారు. 10వ షెడ్యూల్‌ను అనుసరించి విలీనం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంతో ప్రేరణ పొందామని, దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పార్టీని విలీనం చేస్తున్నట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. ఇక నుంచి తమను బీజేపీ ఎంపీలుగా గుర్తించాలని, తమ పార్టీ విలీనం అంగీకరించాలని బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశామంటూ తీర్మానం ప్రతిపై ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు సంతకం చేశారు. లెజిస్లేటివ్ పార్టీలో రెండింట మూడొంతులు ఫిరాయిస్తే విలీనం లాంఛనమే. రాజ్యసభ చైర్మన్‌ను కలిసి విలీనం లేఖను ఇచ్చిన అనంతరం నలుగురు ఎంపీలు బీజేపీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. -
బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరారు. తెలుగుదేశం ఎంపీలైన సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే, కాలికి గాయం కావడంతో గరికపాటి మోహన్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని, కానీ, బీజేపీలో చేరేందుకు సమ్మతి తెలుపుతూ ఆయన కూడా పత్రం పంపించారని, దీంతో ఆయనను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రగతి.. అమిత్ షా నేతృత్వంలో బీజేపీ సాధిస్తున్న విజయాలను చూసి.. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ చేరాలని చాలాకాలంగా నలుగురు టీడీపీ ఎంపీలు భావిస్తూ వచ్చారని, ఇందులో భాగంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తామని తమను వారు కోరారని తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ, అమిత్ షా సమ్మతించారని, ఈ మేరకు విలీన పత్రాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేశామని తెలిపారు. విలీనం పూర్తికావడంతో ఇకపై వీరు బీజేపీ ఎంపీలుగా మారిపోయారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలను విశ్వసిస్తోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదం ధ్యేయంగా తాము ముందుకు సాగుతామన్నారు. వీరి చేరికల వల్ల ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల అభీష్టం ఎలా ఉందో స్పష్టమైందని, దీనిని గమనించి.. దేశ నిర్మాణంలో భాగం కావాలని, ఏపీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతకుముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని, అందువల్ల ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4వ పేరాగ్రాఫ్‌లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో రాజ్యసభలో టీడీపీ దాదాపు ఖాళీ అయింది. రాజ్యసభలో టీడీపీకి ప్రస్తుతం సీతారామలక్ష్మీ, రవీంద్రకుమార్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
వారం క్రితమే చంద్రబాబును కలిశా...
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ధ్రువీకరించారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. గతంలో తాను బీజేపీ యూత్ వింగ్‌లో సభ్యుడినని టీజీ వెంకటేశ్ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర్మన్‌కు అందచేశామన్నారు. తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వారం క్రితమే చంద్రబాబు నాయుడుని కలిశానని, అయితే పార్టీని వీడొద్దని ఆయన చెప్పారన్నారు. ప్రజా నిర్ణయంలో పాటు, తమ ప్రాంత అభివృద్ధి మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆరుగురు ఉండగా...నలుగురు బీజేపీలో చేరనుండటంతో ఇక ఇద్దరే మిగిలారు. చదవండి: టీడీపీలో భారీ సంక్షోభం! -
భారీ షాక్; రాజ్యసభలో టీడీపీ ఖాళీ!
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యులు ఎంపీలు సుజనా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4 వ పేరగ్రాఫ్లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఇక ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగిలారు. కాగా విజయవాడ ఎంపీ కేశినేని కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా... తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కాపు నేతలు రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకే సమావేశమయ్యామని వారు చెబుతున్నా.. పార్టీలో అంతర్గత సంక్షోభానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా చంద్రబాబు సూచనల మేరకే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో భారీ సంక్షోభం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనేది వెల్లడి కాలేదు. (చదవండి: నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ) -
పోలీస్ పటాస్ @ 97
అయేషా హబీబ్, రవికాలే, కురిరంగా ముఖ్య పాత్రల్లో శశికాంత్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన చిత్రం ‘జనగణమన’. ఈ సినిమాని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘పోలీస్ పటాస్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ కమిట్మెంట్ ఉన్న నిర్మాత అని విన్నాను. ‘పోలీస్ పటాస్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ చూశాక సినిమాలపట్ల ఆయనకు ఉన్న అభిరుచి తెలిసింది. అందుకే ఆయన 97సినిమాలు తీశారు. ఈ ఏడాదిలోనే 100 సినిమా కూడా నిర్మించాలి’’ అన్నారు. ‘‘నిర్మాతగా ‘పోలీస్ పటాస్’ నాకు 97వ సినిమా. ఈ సినిమా కన్నడలో విజయం అందుకుంది. అయేషా తిరుపతి అమ్మాయే. తను త్వరలోనే ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నా. ఈ నెలలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ. -
పంచభూతాల వినాశకారి టీజీ వెంకటేష్..
సాక్షి, కర్నూలు(అర్బన్) : ‘టీడీపీ నేత, ఎంపీ టీజీ వెంకటేష్ తాగే నీళ్లు, పీల్చే గాలి.. అన్నీ కలుషితం చేస్తున్నారు. ఆల్కాలీస్ ఫ్యాక్టరీతో ప్రజలు, ఇతర జీవరాశుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. కర్నూలులో విలువైన స్థలాలను ఆక్రమించుకున్నారు. అలాగే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలను చెల్లించకుండా ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. ఆయన రాజకీయ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేసే రకం. ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎ న్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ప్రశాంతంగా ఉన్న నగరంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాడ’ని వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆయన కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ గురునాథ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ధనదాహం, అధికార బలంతో తన కుమారున్ని గెలిపించుకునేందుకు టీజీ వెంకటేష్ తీవ్ర స్థాయిలో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. నగరాభివృద్ధికి సంబంధించి ఆయన చేసింది శూన్యమన్నారు. టీజీ వెంకటేష్ అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. పరిశ్రమల విద్యుత్ బకాయిలు రూ.50 కోట్లు చెల్లించాలి టీజీ వెంకటేష్ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వానికి రూ.50 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయి పడ్డారు. రాయలసీమ ఆల్కాలీస్ ఫ్యాక్టరీతో పాటు ఇతర పరిశ్రమలు, సినిమా థియేటర్, ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాలి. ఇలా ... ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకుండా ఉండేందుకు ఎప్పడూ తన చేతిలో అధికారం ఉండాలని కోరుకునే తత్వం టీజీది కాదా? అని హఫీజ్‌ఖాన్ ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర గతంలో మత విద్వేషాలను రెచ్చగొట్టిన టీజీ వెంకటేష్ నేడు ప్రశాంతంగా ఉన్న కర్నూలులో కూడా మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. నగరంలో అన్నదమ్ముల వలే జీవనం చేస్తున్న హిందూ ముస్లింల మధ్య తగాదాలు సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేసే వ్యక్తి టీజీ వెంకటేష్. గోశాల స్థలం విషయంలో మాజీ మంత్రి రాంభూపాల్‌చౌదరి మృతికి టీజీ కారణం కాదా? అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గురవయ్యను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టింది ఆయన కాదా? ఇప్పుడు కుమారుని గెలుపు కోసం తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. కాగా ... తన పేరు కలిగిన 88 ఏళ్ల హఫీజ్‌ఖాన్‌తో నామినేషన్ వేయించి ఎన్నికల్లో ఓటర్లను అయోమయంలో పడేసేందుకు కుట్రలు పన్నడం వాస్తవం కాదా? అని హఫీజ్‌ఖాన్ నిలదీశారు. లీజు కట్టాల్సింది రూ.2 కోట్లు.. చెల్లిస్తున్నది రూ.87 వేలు నగర నడిబొడ్డున ఉన్న 1.50 ఎకరాల గోశాల స్థలానికి వాస్తవంగా నెలకు రూ.2 కోట్లను లీజుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే టీజీ వెంకటేష్ మాత్రం తన అధికార బలంతో నెలకు రూ.87 వేలను మాత్రమే చెల్లిస్తున్నారు. గోశాల పూర్తి విస్తీర్ణం 3 ఎకరాలు కాగా, ఇందులో ఆవుల నివాసం, మేత వినియోగానికి ఎకరా వాడుకుంటున్నారు. విద్యానగర్ మాంటిస్సోరి పాఠశాలకు 20 సెంట్లు లీజుకు ఇవ్వగా, పాఠశాల యాజమాన్యం నెలకు రూ.25 వేలను అద్దెగా చెల్లిస్తోంది. మరో 6 సెంట్లలో ఉన్న క్వాలిటీ హోటల్ ( ప్రస్తుతం ఖాళీ స్థలం)కు సంబంధించి నెలకు అద్దె రూ.43 వేలు చెల్లిస్తున్నారు. వారందరి లీజు రెంట్లను పాత వాటిని సవరించి కొత్త రేట్లను నిర్ణయించి లీజు మొత్తాన్ని పెంచారు. మరి టీజీ లీజుకు తీసుకున్న స్థలానికి ఎందుకు పెంచడం లేదు? ప్రభుత్వంతో కుమ్మక్కైనందుకే కదా ఈ ప్రతిఫలం? టీజీ ఆధీనంలో ఉన్న 1.50 ఎకరాల్లో ఖరీదైన భవనాలు నిర్మించి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఈ విషయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి. తాగే నీళ్లు, పీల్చే గాలి అన్నీ కలుషితం నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న తుంగభద్ర నది కలుషితమవుతోంది టీజీ వెంకటేష్‌కు చెందిన ఆల్కాలీస్ ఫ్యాక్టరీ వల్ల కాదా? ఆల్కాలీస్లో నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల పీల్చే గాలి, తాగే నీరు, పంటలు పండే భూములు..ఇలా అన్నీ పూర్తి స్థాయిలో కలుషితమవుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల నగర ప్రజలతో పాటు తుంగభద్ర నదికి అవతలి ఒడ్డున ఉన్న పలు గ్రామాల ప్రజలు అనార్యోగాలకు గురవుతున్నారు. పశువులు, ఇతర జీవరాశులు కూడా రోగాల బారిన పడుతున్నాయి. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన భూములు నెర్రెలు కొట్టి నిస్సారంగా మారుతున్నాయి. ఎలాంటి పంటలు పండకుండా నిస్తేజం అవుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు తిరుగుబాటు చేయకుండా మభ్యపెడుతూ టీజీ పబ్బం గడుపుకుంటున్నారు. కర్నూలు నుంచి గొందిపర్ల వరకు రెండు దశాబ్దాల క్రితమే 2 కిలోమీటర్ల మేర బ్రిడ్జి మంజూరైనా, ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టకపోవడానికి ఆయన స్వార్థమే కారణం. దీనికి ఏమి సమాధానం చెబుతారు? క్షమాపణ చెప్పి ఓట్లడగాలి.. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరే వ్యక్తిత్వం టీజీ వెంకటేష్‌ది కాదా? గతంలో తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఐదు గంటల్లోనే కాంగ్రెస్‌లో చేరలేదా? ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న టీజీ వెంకటేష్ గత 20 సంవత్సరాలుగా కర్నూలును ఎంత మేర అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. నగరంలో డ్రెయిన్లు, రోడ్లు సక్రమంగా లేవు. దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను హరిస్తుంటే ఇంతవరకు ఏమి చేశారు? కనీసం నగర ప్రజలకు తాగునీటిని కూడా సక్రమంగా అందించలేకపోయారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? ముందుగా నగర ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్‌కు ప్రజల కష్టాలు తెలుసా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏనాడైనా ఉద్యమాలు చేశారా? -
‘నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు’
సాక్షి, కర్నూలు : టీడీపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ తన కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ అన్నారు. మంగళవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... తన నామినేషన్ పట్ల పలువురు టీడీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఖండించారు. డబ్బుతో ప్రలోభాలకు పాల్పడుతూ.. టీజీ వెంకటేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బుకు లొంగని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి డబ్బు, బెదిరింపు రాజకీయాలను తిప్పికొట్టేందుకు కర్నూలు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కాగా టీజీ వెంకటేష్ కుమారడు టీజీ భరత్ టీడీపీ నుంచి కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సీటు కోసం ఏకంగా రూ. 100 కోట్ల మేర అధికార పార్టీ చేతులు మారినట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి.(ఆ సీటు... హాట్ కేకు..) డ్రైనేజీ నీరు తాగాల్సి వస్తుంది.. టీజీ వెంకటేష్ నీచ రాజకీయాలకు తెగబడ్డారని వైఎస్సార్ సీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. డబ్బులతో కర్నూలు ప్రజలను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీల వల్ల ఆయనకు డబ్బు వస్తే... వాటి కారణంగా ప్రజలు మాత్రం జబ్బుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయన కుమారుడు టీజీ భరత్ గనుక గెలిస్తే వారి ఫ్యాక్టరీల డ్రైనేజీ నీరు తాగాల్సిన దుస్థితి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. అమలు కాని హామీలతో.. అమలు కాని హామీలు ఇచ్చి...రాష్ట్రంలో అవినీతి పాలన సాగించిన టీడీపీకి బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవీ రామయ్య ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి, కార్పొరేషన్ నిధులు కేటాయించని చంద్రబాబు నాయుడు... ప్రజలను మభ్యపెడుతూ మరోసారి నిస్సిగ్గుగా ఓటు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. -
ఆ సీటు... హాట్ కేకు.. రూ.100 కోట్లతో కొన్న వైనం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లాలో కీలకమైన ఓ అసెంబ్లీ సీటు హాట్‌కేకుగా మారింది. ఏకంగా ఒక సీటు కోసం రూ.100 కోట్ల మేరకు అధికార పార్టీలో చేతులు మారినట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేకే వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు ఓ ప్రజా ప్రతినిధి తనయుడికి కేటాయించారు. ఈ పరిణామం వెనుక భారీ తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. అధికార పార్టీలోని అగ్రనేతలతో పాటు జిల్లాలోని ఇద్దరు బలమైన నేతలకు భారీగా సొమ్ములు ముట్టినట్టు సమాచారం. ప్రధానంగా అధికార పార్టీలోని అగ్రనేత ఒకరికి చెన్నైలోని విలువైన స్థలాన్ని అందజేసినట్టు తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలోని ఇద్దరు నేతలకు కూడా చెరో రూ.20 కోట్ల చొప్పున ముట్టజెప్పినట్టు చర్చ జరుగుతోంది. ఫలితంగానే మొదటి నుంచి ఒకరికి సీటు వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు మరో వ్యక్తికి ఇచ్చినట్టు సమాచారం. చెన్నైలో స్థలం పొందిన నేత కాస్తా వీరికే సీటు ఇచ్చే విధంగా అధినేత వద్ద పావులు కదిపారు. ఇక జిల్లాలోని ఇద్దరు ముఖ్య నేతల్లో ఒకరు రూ.20 కోట్ల ప్యాకేజీతో ఏకంగా వారితోనే కలిసి తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు. మరో నేత కూడా రూ.20 కోట్ల ప్యాకేజీ తీసుకుని సీటు రావడానికి సహకరించినట్టు తెలుస్తోంది. జిల్లాలోని మరో నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా ముగ్గురు నేతలకు మూటలు అందిన తర్వాతే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సీట్ల కేటాయింపులో ప్యాకేజీనే ప్రధానపాత్ర పోషించిందని జిల్లావాసులు అనుకుంటున్నారు. -
టీజీ, ఎస్వీల మధ్య కుర్చీలాట.. విజయం ఎవరిది?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు టికెట్ విషయంలో అధికార పార్టీ నేతల్లో అదే ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు టికెట్ తమకే వస్తోందని.. రెండు రోజుల్లో ప్రకటించే రెండో జాబితాలో పేరు ఉంటుందని టీజీ వర్గం భావిస్తోంది. మరోవైపు తమకే టికెట్ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి అనుచరులు ఏకంగా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కార్యకర్తల సమావేశాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ నిర్వహించారు. రెండో జాబితాలో పేరు ఉంటుందని చెప్పారు. ‘మనకు ఇప్పటికే రాజ్యసభ ఉంది. అయినప్పటికీ కర్నూలు అసెంబ్లీ ఇవ్వాలని కోరాం. రెండో జాబితాలో లేకపోతే మరోసారి అందరితో సమావేశమవుతా’నని ప్రకటించారు. వాస్తవానికి మొదటి జాబితాలోనే పేరు ఉండాలని, లేకపోవడం బాధాకరమని అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రెండో జాబితాలో లేకపోతే అప్పుడు ఆలోచిద్దామన్నారు. అయితే, కేవలం ఎమ్మెల్యే సీటు కోసం రెండు, మూడు రోజులు వేచిచూడడం ఏమిటని టీజీ అనుచరులు వాపోతున్నారు. ఇంటి వద్దకే వచ్చి బీ–ఫారం ఇచ్చే పరిస్థితి నుంచి ఈ విధంగా మూడు రోజులు రాత్రి, పగలు తేడా లేకుండా వేచిచూడటం ఏమిటని అంటున్నారు. రెండో జాబితాలో పేరు లేకపోతే తాడోపేడో తేల్చుకుందామని టీజీ వద్ద అనుచరులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎస్వీ అనుచరుల్లో సంబరాలు అమరావతి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి అనుచరులు ఘన స్వాగతం పలికారు. మోహన్ రెడ్డికే సీటు ఖరారయ్యిందంటూ హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. దీంతో టీజీ వర్గంలో ఆందోళన మొదలయ్యింది. మొత్తమ్మీద ఈ నెల 18న కర్నూలులో జరగబోయే సమావేశంలో టికెట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించే అవకాశముంది. -
టికెట్ పై కుస్తీ
-
కర్నూలు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కర్నూలు: కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య మళ్లీ లొల్లి మొదలైంది. కర్నూలు టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే ఎస్వీ చేసిన వ్యాఖ్యలపై టీజీ ఘాటుగా స్పందించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానిదో లేక టీజీ వెంకటేశ్ కుటుంబానిదో కాదన్నారు. కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఓటర్ల ఆస్తి అన్నారు. పార్టీ అధినేత సర్వేలు చేయించి టికెట్ కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమన్నారు. నిన్న సీటు తనకేనని చెప్పిన ఎస్వీ మోహన్ రెడ్డి, నేడు లోకేష్ నిలబడితే సమర్థిస్తానని చెప్పడం సరికాదన్నారు. లోకేష్ నిలబడితే అందరం సమర్థిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి జనాలను గందరగోళానికి గురిచెయ్యడం తప్ప ఇంకేమీ లేదన్నారు. గెలిచే అభ్యర్థికే చంద్రబాబు పట్టం కడతారని మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని పరోక్షంగా హెచ్చరించారు. -
ఎస్వీ మోహన్ రెడ్డి అదా సంగతి!
సాక్షి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుపై ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అంతర్మథనంలో పడినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఆయన కర్నూలు సీటు తనదే అని ధీమా వ్యక్తం చేసినా .... ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి... కర్నూలు నుంచి ఒకవేళ నారా లోకేష్ పోటీ చేస్తే తానే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. అయితే మరో నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనని, టికెట్ కూడా అడగనని అన్నారు. కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆయన... మరొకరికి ఆ సీటు కేటాయిస్తే ఒప్పుకునేది లేదన్నారు. కాగా ఇప్పటికే కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి నారా లోకేష్ దాదాపుగా ప్రకటించారు. దీనిపై రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికార పార్టీలో మొదలైంది. మరోవైపు టీడీపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబానికి మద్దతు తెలిపిన ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్ ఇచ్చేందుకు కేఈ సోదరులు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద కేఈ సోదరులు ప్రతిపాదన తెచ్చారు. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డికి.. ఓవైపు టీజీ వెంకటేశ్ కుమారుడు, మరోవైపు కోట్ల కుటుంబం నుంచి పోటీ ఎదురు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. టీజీ, కేఈ వర్గానికి చెక్ పెట్టేందుకు ఆయన తాజాగా కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేయాలంటూ కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. అంతేకాకుండా పోటీ చేస్తే లోకేష్...లేదా నేనే... అంతేకానీ వేరేవాళ్లు కర్నూలు నుంచి పోటీ చేస్తే ఊరుకునేది లేదంటూ ఎస్వీ మోహన్ రెడ్డి మీడియా ముఖంగా ఫీలర్లు వదులుతున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న కర్నూలు అసెంబ్లీ టికెట్ చివరికి ఎవరికి దక్కుతుందో. -
కర్నూలు అసెంబ్లీ టికెట్ భరత్‌కే: టీజీ
సాక్షి, న్యూఢిల్లీ : కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కర్నూలు సీటును కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆశించినట్లు వార్తలు రాగా.. తాజాగా ఆ స్థానాన్ని తన కుమారుడికి కేటాయించాలని టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కోరుతున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు భరత్ కర్నూలులో కచ్చితంగా గెలుస్తాడని, అతనికే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలిచే వారికే సీట్లు ఇస్తుందని, గెలవడు అనుకుంటే తన కొడుకుకి సైతం టికెట్ ఇవ్వదని టీజీ వెంకటేష్ అన్నారు. ‘కేఈ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారని, వారు కూడా కర్నూలు సీటును ఆశిస్తున్నట్లు వార్తల్లో చదివాను. కర్నూలు నుంచి గెలిచే అవకాశాలు భరత్‌కే ఎక్కువగా ఉన్నాయి. అతనికే సీటు వస్తుందని అనుకుంటున్నాను. మిగిలిన వారు ఎవరూ తమకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పలేదు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే నడచుకుంటా’ అని టీజీ అన్నారు. కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాల మధ్య కొన్ని తరాలగా అంతర్గత విభేదాలు ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. (ఎస్వీకి ఝలక్.. కోట్లకు టికెట్ ?) ఏమీచ్చారో చెప్పి రాష్ట్రానికి రండి ఆనాటి పరిస్థితుల దృష్ట్యా తొలుత బీజేపీతో చంద్రబాబు నాయుడు జత కట్టారని, కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే విడిపోయారని టీజీ పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పుడు పోరాడాలో చంద్రబాబుకు తెలుసన్నారు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని టీజీ వెంకటేష్ మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది కానీ కొన్ని రాష్ట్రాలకు హోదాను అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి ఏపీకి వస్తానని అంటున్నారని... వచ్చే ముందు రాష్ట్రానికి ఎం ఇచ్చారో చెప్పి రావాలని ఆయన డిమండ్ చేశారు. -
మార్చిలో జనసేనతో సీట్లపై చర్చలు
సాక్షి, అమరావతి: జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్, మాయావతి ప్రపంచంలో ఎవరూ లేనంతగా కొట్లాడుకున్నారని.. వారే కలిసినప్పుడు టీడీపీ, జనసేన కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఉండవల్లిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చిలో రెండు పార్టీల మధ్య ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంపై చర్చలు జరుగుతాయని, తెలిపారు. పొత్తు తప్పకుండా ఉంటుందని తేల్చి చెప్పారు. తనకు ముఖ్యమంత్రి కుర్చీపై ఆశ లేదని పవన్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. రెండు పార్టీల నాయకుల మధ్య అపోహలు తొలగిపోయాయని చెప్పారు. తన కుమారుడికి కర్నూలు సీటు వస్తుందని, సర్వేల్లో ప్రజాదరణను బట్టి చంద్రబాబు సీటిచ్చే అవకాశం ఉందన్నారు. పొత్తుపై టీజీ వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్‌కల్యాణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆయన మళ్లీ ఉండవల్లిలో మీడియాతో మాట్లాడుతూ పవన్ ఆవేశం తగ్గించుకోవాలని, అప్పుడు మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. పొత్తు ఖరారైతే మార్చిలో చర్చలు ఉంటాయని మాత్రమే చెప్పానన్నారు. కాగా పొత్తు గురించి మాట్లాడడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు టీజీ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసినట్లు మీడియాకు లీకులిచ్చారు. -
టీజీ వెంకటేష్‌కు పవన్ కల్యాణ్ హెచ్చరిక
పాడేరు: తాను వద్దనుకుని వదిలేసిన.. రాజ్యసభ ఎంపీ పదవిని పొందిన టీజీ వెంకటేష్ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. విశాఖ జిల్లా పాడేరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జనసేన గురించి అదుపుతప్పి పనికిమాలిన మాటలు చెబితే ఊరుకోబోమన్నారు. పద్ధతి మార్చుకోవాలని.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీజీ వెంకటేష్‌ను హెచ్చరించారు. తన ఫ్యాక్టరీల నుంచి విడుదల అవుతున్న పారిశ్రామిక వ్యర్థాలను అడ్డగోలుగా నదుల్లోకి వదిలి పరిసరాలను, భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాడని పవన్ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వానికి దోచుకోవడంలోనే చిత్తశుద్ధి ఉందని, ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రజలకేదో మంచి చేస్తారనుకుని తాను టీడీపీ పార్టీకి గత ఎన్నికల్లో మద్దతు ఇస్తే.. ప్రజల కోసం పనిచేయాలనే చిత్తశుద్ధి వారిలో లేకుండా పోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు తన పాత పద్ధతిని ఇంకా మార్చుకోలేదన్నారు. మన్యంలో కొండల్ని తొలిచేద్దాం బాక్సైట్‌ను దోచేద్దామనే ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మన్యం ఖనిజ సంపదను కొల్లగొట్టకుండా అడ్డుకోవడానికి జనసేన పోరాడుతుందన్నారు. ఖనిజాల జోలికొస్తే తాటతీస్తామని పవన్ హెచ్చరించారు. ఖనిజాల జోలికి పోకుండా ఉంటే ఇటీవల అధికారపార్టీ నేతల ప్రాణాలు కూడా పోయేవి కాదని.. దీనికి చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. నాదెండ్ల మనోహర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
హస్తంతోనే సైకిల్ సవారీ!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుల ఎత్తుగడలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని కలసి పోటీ చేసే కన్నా పరోక్షంగా సహకరించుకోవడమే మేలన్న అవగాహనకు ఈ రెండు పార్టీలూ వచ్చాయి. మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లిన సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అన్నీ వివరించి ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. ఆ వెంటనే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు హుటాహుటిన అమరావతికి వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ ఎంచుకున్న స్క్రిప్ట్‌ను పొల్లుపోకుండా వల్లెవేసి వెళ్లిపోయారు. తాము ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ఇంత అర్ధాంతరంగా ఊమెన్ చాందీ స్పష్టం చేయాల్సిన అవసరమేమిటో ఎవరికీ అంతుబట్టలేదు. అందులోనూ రాహుల్ గాంధీని చంద్రబాబు కలసి మంతనాలాడిన మర్నాడే ఈ ప్రకటన దేనికో అర్ధం కాలేదు. కానీ పరోక్ష పొత్తు గనుక ఇక ఆలస్యం చేయకూడదని ఇద్దరు నాయకులు నిర్ణయించుకున్నందుకే ఈ హడావిడి ప్రకటన వెలువడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హస్తంతో పరోక్ష పొత్తు ఎందుకంటే.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ కుమారుడి వివాహానికి హాజరయ్యే పేరుతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అసలు ఉద్దేశం వేరే ఉంది. రాహుల్ గాంధీతో చర్చలు జరిపి అవగాహనను ఓ కొలిక్కి తెచ్చుకోవడానికే తన ఢిల్లీ పర్యటనను చంద్రబాబు ఉపయోగించుకున్నారు. పెళ్లికి వెళ్లిన చంద్రబాబు మరుసటి రోజు కూడా అక్కడే ఉండబోతున్నారని, బీజేపీయేతర పార్టీల నాయకులతో సమావేశమవుతారని ముందుగా మీడియాకు లీకులిచ్చారు. కానీ పెళ్లికి వెళ్లిన చంద్రబాబు ఢిల్లీలో ఉండలేదు. బీజేపీయేతర పార్టీలను కలిసే ఉద్దేశమే ఆయనకు లేదు. అనుకున్నట్లుగా రాహుల్ గాంధీని కలసి అనుకున్నవన్నీ మాట్లాడుకుని ఆయన తిరుగుముఖం పట్టారు. పెళ్లి ఒక సాకు మాత్రమేనని, రాహుల్ గాంధీని కలవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చునని విశ్లేషకులంటున్నారు. తెలంగాణలో తల బొప్పికట్టిన దరిమిలా రాష్ట్రంలో పరిస్థితులన్నీ మదింపు వేసిన తర్వాత పొత్తుల విషయమై చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారని, కాంగ్రెస్ ఓట్లు తమకు బదిలీ కావడం అంత తేలికైన పనికాదని అర్ధం చేసుకున్నారని అంటున్నారు. అందుకని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలను ఆయన ఎంచుకున్నారు. అందులో 25 నుంచి 35 నియోజకవర్గాలలో కాంగ్రెస్ తరఫున గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించారు. వారిని చంద్రబాబే నిర్ణయిస్తారని, వారి ఎన్నికల ఖర్చును కూడా ఆయనే ఇస్తారని అంటున్నారు. తద్వారా ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి వెళ్లే ఓట్లను వీలైనంత ఎక్కువగా చీల్చాలన్నది వీరి ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇదే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన రహస్య అవగాహన సారాంశం. జనసేనతో పొత్తు కూడా అనుకున్నట్లుగానే.. ఇక ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రల విషయానికొస్తే జనసేనతో పొత్తు పెట్టుకోవాలన్నది తెలుగుదేశం ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇటీవలే అమెరికా పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అక్కడ చంద్రబాబు సన్నిహితుడు లింగమనేని రమేశ్‌ను కలుసుకున్నారని, అనేక విషయాలపై చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఉభయ పార్టీల మధ్య పరస్పర సహకారం విషయమై విడతలవారీగా పలుమార్లు చర్చలు జరిగినట్లు కూడా తెలుగుదేశం, జనసేన వర్గాలలో వినబడుతున్నది. ‘చంద్రబాబుగారిపై కక్షసాధించడానికే వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు కలుస్తున్నాయి’ అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్య గానీ, ‘పవన్ మనోడే ఆయనను ఏమీ అనవద్దు’ అని పార్టీ నాయకులకు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు గానీ ఇరు పార్టీల మధ్య అవగాహన ఏ స్ధాయిలో ఉందో తెలియజేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలను నిర్ధారిస్తున్నట్లుగా బుధవారం నాడు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ మధ్యే పొత్తు కుదిరినప్పుడు జనసేన – తెలుగుదేశం కలిస్తే తప్పేమిటి అని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంపై మార్చిలో చర్చలు జరుగుతాయని కూడా టీజీ తేల్చి చెప్పడం మీడియాలో హల్చల్ చేసింది. పొత్తుల విషయం ముందే బయటకు పొక్కడం ఎందుకనుకున్నారో ఏమో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీనిపై కాస్త ఘాటుగానే స్పందించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని ఖండించడం కాకుండా టీజీ వెంకటేష్‌పై పవన్ వ్యక్తిగత విమర్శలకు దిగడం చూసి అందరూ విస్తుపోయారు. అయితే రెండు పార్టీల మధ్య ఏదో రకంగా పొత్తు కొనసాగే అవకాశాలే ఎక్కువన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమౌతోంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు వినిపిస్తోంది. అందుకనే ప్రత్యక్షంగా పొత్తుపెట్టుకున్నా లేదా పరోక్షంగా సహకరించుకున్నా జనసేన ఎన్నికల ఖర్చులు భరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. -
పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని టీజీకి పవన్ వార్నింగ్
-
టీడీపీ-జనసేనలు కలిస్తే తప్పేంటి?
-
టీడీపీ, జనసేన మధ్య పొడుస్తున్న పొత్తు!
సాక్షి, హైదరాబాద్ : ‘జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఏమనవద్దు’ అని రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు తమ నేతలకు స్పష్టమైన ఆదేశాలివ్వగా.. తాజాగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఏకంగా టీడీపీ-జనసేనలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు–పవన్‌ల రహస్య స్నేహం మరోసారి బయటపడింది. బుధవారం టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేనల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటని పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఉంటాయని, టీడీపీ-జనసేనలు కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసి వచ్చిన తరువాతే వెంకటేశ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు పొడిచిందని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ అనేక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబుపై కక్ష సాధించేందుకే టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. మరోవైపు పవన్ కల్యాణ్ ప్రజాయాత్రకు బ్రేక్ పడటం కూడా పొత్తులో భాగమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
యాత్రను వెంటనే ఆపేయి..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ప్రారంభించిన ‘విజన్ యాత్ర’ అధికార పార్టీలో ఫిర్యాదుల పరంపరకు తెరలేపింది. ఈ యాత్రను వెంటనే ఆపేయించాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి విన్నవించారు. కర్నూలు నియోజకవర్గం నుంచి ఇప్పటికే తన పేరు ప్రకటించిన నేపథ్యంలో భరత్ యాత్ర వల్ల కేడర్‌లో గందరగోళం ఏర్పడడమే కాకుండా అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతోందని వివరించినట్లు సమాచారం. అయితే, యాత్ర ఆపేయాలంటూ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలూ రాకపోవడంతో మరింత జోరు పెంచేందుకు టీజీ భరత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎస్వీతో విభేదిస్తున్న ఎంపీ బుట్టా రేణుకను ముందు పెట్టడం ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపం కాదని, పార్టీ కోసమే యాత్ర చేస్తున్నామన్న సందేశాన్ని ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యంలో బుట్టా రేణుకకు అసలు ఎంపీ సీటే రాదని ఎమ్మెల్యే వర్గం ప్రచారం ప్రారంభించింది. ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా ఈ సందర్భంగా అంటున్నారు. సర్వే పేరుతో.. వాస్తవానికి టీడీపీలో సీట్ల కేటాయింపు సర్వే ప్రకారం జరుగుతోంది. చివరి నిమిషం వరకూ సీటు ఎవరికిస్తారనే విషయం రహస్యంగా ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా ముందుగానే కర్నూలు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ, ఎంపీ స్థానానికి బుట్టా రేణుక పోటీ చేస్తారని నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. దీనిపై ఎంపీ టీజీ భగ్గుమన్నారు. సీటు ప్రకటించడానికి అసలు లోకేష్ ఎవరంటూ మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. నగర ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే విజన్ యాత్ర ప్రారంభించానని, 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని యాత్ర ప్రారంభం సందర్భంగా టీజీ భరత్ ప్రకటించారు.పరోక్షంగా ఎమ్మెల్యే అవినీతిపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. నగర ప్రజలు అవినీతి లేని అభివృద్ధి కోరుకుంటున్నారని, గతంలో తాము అదే చేశామని అంటున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఎంపీ బుట్టా రేణుక కూడా స్వరం కలిపారు. తద్వారా సీటు విషయంలో తన సపోర్ట్ భరత్‌కేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏయే పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది వేచి చూడాలి. -
‘దగ్గరుండి దొంగ ఓట్లు వేయించిన టీజీ వెంకటేశ్..’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఖైరతాబాద్ చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో 2018-20గాను రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 13వందలమంది ఆర్యవైశ్యులకు ఓటుహక్కు ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ ద్వారాకనాథ్, పెనుగొండ సుబ్బరాయుడు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో 86శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అయితే, పోలింగ్ విషయంలో తీవ్ర అవకతవలు జరిగినట్టు ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. వైఎస్సార్సీపీకి చెందిన తనను ఓడించేందుకు టీడీపీ కుట్ర పన్నిందని ద్వారాకనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌లో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని, దొంగ ఓటు వేస్తున్న వ్యక్తిని ప్రత్యక్షంగా పట్టుకున్నా చర్యలు లేవని ఆయన అన్నారు. ఎన్నికలు వాయిదా వేసి మళ్లీ నిర్వహించాలని ద్వారాకనాథ్ డిమాండ్ చేశారు. -
ఎవరి సీటుకు ఎసరు?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీలో కొత్త చర్చను...అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్ దాదాపుగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికారపార్టీలో మొదలైంది. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశం లేదని అధికారపార్టీ నేతలే పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కర్నూలు సీటు దాదాపుగా నిర్ణయం కావడంతో మరో సీటు నంద్యాల, ఆళ్లగడ్డలో ఏది కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. ముందుచూపుతో ఎస్వీ మోహన్ రెడ్డి పావులు కదిపి తన బెర్త్ రిజర్వ్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల, ఆళ్లగడ్డలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎవరిపై వేటు పడుతుందోనంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బులు వెదజల్లడంతో పాటు గెలిచేందుకు సెంటిమెంటు ఆటను కూడా అధికార తెలుగుదేశం పార్టీ బాగా రక్తికట్టించింది. ఇప్పుడు అదే సెంటిమెంటు..అభ్యర్థులకు సంకటంగా మారుతోంది. సెంటిమెంటు పండుతుందా...! నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి పార్టీ మారిన కొన్ని నెలల తర్వాత హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి అదే కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన విషయం విదితమే. ఇందుకోసం గత చరిత్రను సైతం ప్రజలకు గుర్తుచేశారు. గతంలో భూమా శేఖర్‌రెడ్డి మరణిస్తేనే నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని... భూమా నాగిరెడ్డి మరణించడంతో శేఖర్‌రెడ్డి కుమారుడికి ఇవ్వడమే సరైందనే వాదన తీసుకొచ్చారు. అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తల్లిదండ్రులు లేని అమ్మాయి అఖిలప్రియ, తండ్రిలేని అబ్బాయి బ్రహ్మానందరెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ సెంటిమెంటును పండించే ప్రయత్నం చేసింది. అయితే, ఇప్పుడు అదే సెంటిమెంటును అధికారపార్టీ పాటిస్తుందా? లేదా అన్న విషయం చర్చనీయాంశమవుతోంది. అదే సెంటిమెంటును పాటించి నంద్యాల సీటును బ్రహ్మానందరెడ్డికి, ఆళ్లగడ్డను అఖిలప్రియకు ఇస్తారా అన్న చర్చ అధికారపార్టీలోనే జరుగుతోంది. మరోవైపు.. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నంద్యాల తమకివ్వాలంటూ ఇప్పటికే ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒకవేళ సెంటిమెంటును పాటించి బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియకు ఇస్తే ఎస్పీవై రెడ్డితో పాటు ఫరూఖ్ వర్గం కూడా సహకరించే పరిస్థితి లేదని సమాచారం. ఈ మొత్తం చర్చ జరిగి ఎక్కడ తనకు ఎసరు వస్తుందనే ముందుచూపుతోనే ఎస్వీ మోహన్ రెడ్డి ముందుగానే తన సీటు రిజర్వ్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడో సీటు కష్టమే...! సెంటిమెంటుతో ఒకే కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు మూడు సీట్లు కేటాయించేది కష్టమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సెంటిమెంటుతో పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉండదనేది వారి అభిప్రాయం. కేవలం ఉప ఎన్నికల కోసమే సెంటిమెంటు ఫ్యాక్టర్‌ను వాడుకున్నారు మినహా... దీని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశమేలేదని అంటున్నారు. మరోవైపు అఖిలప్రియ– ఏవీ సుబ్బారెడ్డిల వివాదాల సందర్భంగా సర్వే ప్రకారమే సీటు కేటాయిస్తామంటూ చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో మొదలైన అభ్యర్థుల ప్రకటన వ్యవహారం జిల్లావ్యాప్తంగా అధికారపార్టీలో కొత్త అలజడిని రేపిందని చెప్పవచ్చు. -
చంద్రబాబు చెప్పిన తర్వాతే నేను స్పందిస్తా
-
అభ్యర్థులను ప్రకటించడానికి లోకేశ్ ఎవరు?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి నారా లోకేశ్ ఎవరని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం మైనార్టీ మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఎంపీ టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కర్నూలులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. లోకేశ్ టీడీపీ అధినేత కాదని, ముఖ్యమంత్రి కూడా కాదని, అలాంటప్పుడు అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ‘‘నా స్పందన ఒకటే ఉంటుంది. లోకేశ్ మంత్రి. ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు. ముఖ్యమంత్రి కూడా కాదు. కర్నూలు జిల్లాకు ప్రభుత్వ కార్యక్రమం కోసం వచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం నిజంగా నాకు అంతుబట్టడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా పొద్దున బీ ఫారం ఇచ్చే ముందు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారు. సర్వే చేసిన తర్వాత ముందుకు పోతామని చంద్రబాబు నాతో చాలాసార్లు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు. దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. మరి ఆయన(లోకేశ్) ఎందుకు ఆ విధంగా స్పందించారో నాకు తెలియదు. ఎస్వీ మోహన్‌రెడ్డి హిప్నాటైజ్ చేశారేమో లోకేశ్‌ను. మా మోహన్‌రెడ్డి ఏమైనా చేయగలరు. ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించి.. వీళ్లకు ఓట్లు వేయండని అడగటం నాకు నిజంగా ఇప్పటికీ అంతుబట్టడం లేదు. అద్భుతంగా ఉంది. లోకేశ్ కూడా అలా మాట్లాడరు. మా మోహనుడు హిప్నాటైజ్ చేసినట్టున్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాతే నేను స్పందిస్తా’’ అని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. -
బాబు గారు చెప్పిందే లోకేష్ ప్రకటించారు
-
టీజీ వ్యాఖ్యలపై ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్!
సాక్షి, కర్నూలు : మంత్రి నారా లోకేష్‌ను హిప్నటైజ్ చేశారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కౌంటరిచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిందే లోకేష్ ప్రకటించారన్నారు. రాజకీయాల్లో లోకేష్ ఓ కొత్త పంథాను అనుసరిస్తున్నారని, టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఆయన కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరులో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డేనని లోకేష్ ప్రకటించినట్లు ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటన వల్ల గెలుపు అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. గతంలో టీజీ వెంకటేష్‌కు ఎంపీ పదవి, తనకు ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, ఈ విషయంలో తాను ఎవరిని హిప్నటైజ్ చేయలేదన్నారు. ఆ అవసరం కూడా తనకు లేదని, పార్టీ గెలుపు కోసం అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ 2019 ఎన్నికలకు ముందస్తుగానే కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ స్థానాల నుంచి టికెట్లు ఆశించిన టీజీ వెంకటేశ్, లోకేష్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుందని.. మంత్రి నిర్ణయం కూడా ఇలాంటిదేనని ఎద్దేవా చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరని.. అదే విధంగా లోకేష్‌ను ఎమైనా హిప్నటైజ్ చేశారేమో అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: కర్నూలు టీడీపీలో లోకేష్ చిచ్చు -
నారా లోకేష్‌పై టీజీ వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు
-
కర్నూలు టీడీపీలో లోకేష్ చిచ్చు
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, లోక్‌సభ స్థానానికి వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. అయితే చాలా కాలంగా ఆ రెండు స్థానాలు తమవే అనుకుంటున్న టీజీ వెంకటేష్‌కు లోకేష్ ప్రకటన రుచించలేదు. దీంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎమ్మెల్యే స్థానాలపై టీజీ అండ్ కో ఆశలు పెట్టుకుంది. అయితే అకస్మాత్తుగా మంత్రి 2019 ఎన్నికల్లో అభ్యర్థులు వీళ్లేనంటూ ప్రకటించడంతో టీజీ తీవ్ర అసహనానికి గురయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు. మంత్రి ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదని, ముఖ్యమంత్రి కూడా కాదని అలాంటిది అభ్యర్థుల పేర్లు ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. లోకేష్ ఏ ప్రాతిపదికన అభ్యర్థలను నిర్ణయించారో తనకు అంతపట్టడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుందని.. మంత్రి నిర్ణయం కూడా ఇలాంటిదేమోనని ఎద్దేవా చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరని.. అదే విధంగా లోకేష్‌ను ఎమైనా హిప్నటైజ్ చేశారేమో అంటూ టీజీ వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్వేలో అనుకూలంగా ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి తనతో చాలాసార్లు చెప్పారని అన్నారు. -
లోకేశ్‌కు విద్యార్థి సంఘాల సెగ
-
లోకేశ్ వ్యాఖ్యలు.. టీడీపీలో అలజడి
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ‘ప్రత్యేకత’ చాటుకున్నారు. ఈసారి సొంత పార్టీ నాయకులనే గందరగోళంలో పడేశారు. బహిరంగ వేదికలపై నోటికొచ్చినట్టు మాట్లాడి నవ్వులపాలు కావడం ‘చినబాబు’కు ముందునుంచి అలవాటు. తాజాగా కర్నూలులోనూ ఇదే విన్యాసాన్ని పునరావృతం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలోనే దుమారం రేపాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం లోకేశ్ సోమవారం కర్నూలు జిల్లాకు వచ్చారు. వచ్చిరాగానే తన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులను అయోమయంలోకి నెట్టారు. కర్నూలు జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఎంపీగా బుట్టా రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. లోకేశ్ వ్యాఖ్యలకు వేదికపై ఉన్న టీజీ వెంకటేష్ సహా అంతా నిశ్చేష్టులయ్యారు. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం టీజీ వెంకటేష్, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గాల కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. తన కుమారుడు టీజీ భరత్‌కు ఎలాగైనా ఈ సీటు ఇప్పించాలని టీజీ వెంకటేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉరుములేని పిడుగులా వచ్చి లోకేశ్ ప్రకటన చేయడంతో టీజీ వర్గం అవాక్కైంది. హడావుడిగా ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని టీజీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫిరాయింపుదారులైన ఎస్వీ మోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలకు టిక్కెట్లు ఎలా ఇస్తారని తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతారా అని వాపోతున్నారు. ఎవరి మద్దతు ఇవ్వాలో తెలియక టీడీపీ కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. లోకేశ్‌కు విద్యార్థి సంఘాల సెగ మెడికల్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద నారా లోకేశ్ కాన్వాయ్‌ను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం కోసం మంత్రి వద్దకు వస్తే పోలీసులు దురుసుగా వ్యవహరించారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
‘టీజీకి మతి భ్రమించింది’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ మతి భ్రమించిన, ఓ పిచ్చి నాయకుడని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ లోనూ ఎన్నో పదవులను చేపట్టిన ఎంపీ కె.కేశవరావుపై నోరుపారేసుకోవడం సరికాదని శనివారం హెచ్చరించారు. టీజీ లాంటి నాయకులు, వ్యక్తుల వల్ల ఏపీకే నష్టమన్నారు. ఇలాంటి నేతల తప్పుడు మాటల వల్ల 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుదేనని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతున్న వారే.. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించేలా, కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్న టీజీని తక్షణమే పిచ్చాసుపత్రిలో చేర్చాలని వ్యాఖ్యానించారు. -
‘చంద్రబాబు.. టీజీని అదుపులో పెట్టుకో’
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావుపై టీజీ వెంకటేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కర్నె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ లాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కే నష్టం అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీజీని అదుపులో ఉంచాలని సూచించారు. టీజీ వెంకటేష్ అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితి రాకుండా ఉండేలా చూడాలంటూ చంద్రబాబును కోరారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను కించపరచొద్దంటూ హితవు పలికారు. ప్రజలను రెచ్చగొట్టడమే టీజీ పరమావధిగా పెట్టుకున్నారని కర్నె మండిపడ్డారు. -
అసభ్యకరమైన పదజాలంతో టీజీ తిట్లు!
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావుపై ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తీవ్రమైన పదజాలంతో దూషణలకు దిగారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలువురు తెలంగాణ రాజకీయ నాయకులపై కూడా రాయడానికి వీల్లేని అసభ్యకరమైన పదజాలం వాడారు. ‘‘కేకే మాట్లాడితే అందరూ తల గోక్కుంటారు. నాలుగైదు భాషలు కలిపి పిచ్చోళ్ల భాష మాట్లాడుతుంటాడు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా ఆయనను ఎవరూ కేకే అనేవారు కాదు. పిచ్చోడు వచ్చాడా అనేవారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పిచ్చోడు అనేవారే తప్ప కేకే అని పిలిచేవాళ్లు కాదు’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘రాత్రయితే ఫుల్‌గా తాగి కేసీఆర్ కాళ్లొత్తడం తప్ప నీకేం పనుంది? తాగుబోతు సన్నాసివి. ఏం పని చేస్తావ్? నీకు మెదడుందా? మోకాళ్లలో ఉంది. పిచ్చోడికి అంతా పిచ్చోడి మాదిరిగానే కనిపిస్తుంది. చంద్రబాబు, ఆయన కొడుకు కష్టపడుతున్నారు. నువ్వేం కష్టపడుతున్నావ్రా నాయనా? హరీశ్, కేటీఆర్, కవితలను చూసి నేర్చుకో. లేదంటే లోకేశ్ వద్దకు రా’’అంటూ కేకేపై తిట్ల వర్షం కురిపించారు. ‘‘నేను సమస్యల మీద మాట్లాడితే బదులివ్వకుండా నాకే మతిభ్రమించిందన్నాడు. కేకేకే పిచ్చి ముదిరింది. ఆయనను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రతిపాదిస్తే ఈ పిచ్చోడితో వేగలేమని ప్రతిపక్షాలు ఒప్పుకోవు. తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోయారే తప్ప నాయకులకు ఏమీ కాలేదు. వారిని ముందు పెట్టి ఉద్యమం నడిపారు. పిల్లలు చనిపోతున్నారనే సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ ఉద్యమం నడిపారు తప్ప కేకే ఎక్కడున్నాడు? మీ తెలంగాణ గడ్డ మీద ఉండి పోరాటం చేశాం. మీకు దమ్ముంటే మా వద్దకు రా. బట్టలిప్పి పరిగెత్తిస్తారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి సమస్యల పరిష్కారానికి మనం కలిసి పోరాడకుంటే హైదరాబాద్‌లోని ఆంధ్ర, రాయలసీమ వాళ్లు మీకెలా ఓటేస్తారని హెచ్చరికగా చెప్పాం. నావి చిల్లర మాటలైతే మీరెందుకు సీరియస్‌గా తీసుకున్నారు? సబ్జెక్టుపై మాట్లాడితే మాపై నిందలేస్తారా? మా శరీరంలో వేడి రక్తం ఉంది. మీ శరీరంలో ఏముంది? సారాయి రక్తం’’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదడు మోకాళ్లలో ఉన్నవాళ్లను పెట్టుకుని పరిపాలన చేయొద్దని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీని ఏపీ ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి వెళ్తున్నాయనే సందేశం వెళ్తే ప్రజలకు న్యాయం చేయలేరు’’అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు టీజీ డబ్బులిచ్చి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని ఓ నేత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. -
కేకేని నానా దుర్భాషలాడిన ఏపీ ఎంపీ
-
రాత్రైతే కాళ్లు పట్టడమే పని.. ఒంటినిండా అదే!
సాక్షి, ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు(కేకే)ను తీవ్ర పదజాలంతో దూషించారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ నాయకత్వంలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రైతే మీరు చేసేపనేంది?: ‘‘ఉద్యమం పేరుతో వేలమంది పిల్లల్ని బలి చేశారు. ఇప్పుడు అధికారం అనుభవిస్తోన్న కేకే లాంటి చాలా మంది నాయకులు అసలు ఉద్యమంలోనే పాల్గొనలేదు. కనీసం కాలిగోటికైనా బుల్లెట్ తగిలి ఉండదు. వీళ్లందరికీ ఒకటే పని.. రాత్రైతే కేసీఆర్ కాళ్లు పిసకడం, మందుతాగడం తప్ప ఇంకోటి చేయరు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్. టీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన విమర్శలకు ప్రతిగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌కు కేసీఆర్ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణలోని సెటిలర్లు టీఆర్ఎస్కు ఓట్లు వేయరంటూ టీజీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కేకే, నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు ఫైరైన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ దగ్గరికిరా: ‘‘కేకే ముఖానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి అవసరమా? ఆయనకు మెదడు మోకాళ్లలో ఉంటుంది కాబట్టే నా మాటలు పిచ్చివిగా అనిపించాయి. అసలు నేనన్నదాంట్లో తప్పేముంది? విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం తెలంగాణ కూడా మాట్లాడాల్సిందే. ఎందుకంటే 60 ఏళ్ల ఉమ్మడిగా ఉన్నాం. ఎవరు అవునన్నా, కాదన్నా హైదరాబాద్ నిర్మాణంలో ఆంధ్రులు, రాయలసీమ వాసుల కష్టం కూడా ఉంది. గతంలో కేటీఆర్, కవితలు కూడా ఏపీ హక్కుల కోసం మాట్లాడటం మనం చూశాం. ఇప్పుడీ కేకే నన్ను తిట్టడంలో ఏమైనా అర్థం ఉందా? కేకే.. నీకు వ్యవహారం తెలియకుంటే హరీశ్, కవిత, కేటీఆర్‌ల్ని చూసి నేర్చుకో, లేదా, మా మంత్రి నారా లోకేశ్ దగ్గరికి రా’’ అని టీజీ వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోకుండా తన ఒంట్లో ప్రవహించేది పౌరుషంతో కూడిన సీమనెత్తురైతే, కేకే ఒంటినిండా సారాయి నిండి ఉంటుందని అన్నారు. కేసీఆర్ ఏం మెసేజ్ ఇస్తున్నారు?: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఒకవైపు పొగుడుతూనే చురకలు అంటించారు ఎంపీ టీజీ వెంకటేశ్. ‘‘మొన్న ఢిల్లీలో విపక్ష ముఖ్యమంత్రులంతా ఒకచోట ఉంటే, కేసీఆర్ మాత్రం ప్రధాని మోదీని కలుస్తారు. అంటే, ఆయన ఏం మెసేజ్ ఇవ్వదల్చుకున్నారు? ప్రపంచమంతా పర్యటిస్తోన్న మోదీ నిజాయితీ పరుడే కావచ్చు. కానీ పరిపాలనాదక్షత ఏది? ముందు ఇంటగెలిచి ఆ తర్వాతకదా రచ్చగెలవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఓ భస్మాసుర హస్తంలా మారిది. ఇది గుర్తించి తెలంగాణ నాయకులంతా ఆంధప్రప్రదేశ్ గురించి పోరాడాలి. అలా చేస్తేనే ఇరు రాష్ట్రాలకు మంచిది’’ అని టీజీ అన్నారు. టీజీ కావరం: టీడీపీలో నోటుకు సీటు వ్యవహారంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎంపీ టీజీ అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘టీజీ డబ్బులిచ్చి ఎంపీ సీటు కొనుక్కున్నారని మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఏమంటార’న్న ప్రశకు... ‘‘ఏ వెధవ లం..కొడుకు అన్నాడామాట?’’ అని విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వెంటనే గొంతు సవరించుకుని ‘‘నా మాటలు మోత్కుపల్లిని ఉద్దేశించికాదు, ఆయనకు సమాచారం ఇచ్చినవారిని అంటున్నా..’’ అని వివరించారు. -
పోరాటం చేతకాక అక్కసెందుకు: కర్నె
సాక్షి, హైదరాబాద్ : విభజన హామీలను సాధించుకోవడం చేతకాక తెలంగాణపై మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అక్కసును వెళ్లగక్కుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో అభివృద్ధిని చూసి టీజీ వెంకటేశ్‌కు కడుపు మండిపోతోందన్నారు. ఆయన మాటల్లో అసూయ, ద్వేషం కనిపిస్తున్నాయని, ఇలాంటి వెకిలి చేష్టలు మానుకోవాలని హెచ్చరించారు. కర్నె ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. -
'చల్లా'రని సెగ!
నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో సెగలు రేపుతోంది. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డికి కడప రీజియన్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఆ పదవి వద్దని ఆయన తేల్చిచెప్పారు. టీడీపీలో చేరిన సమయంలో తనకు ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చి విస్మరించిందని మండిపడుతున్నారు. ఇన్ని రోజులుగా పార్టీని అంటిపెట్టుకున్న తనను ఈ విధంగా అవమానిస్తారా అని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు : టీడీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. ఇన్నాళ్లు వాడుకొని వదిలేస్తారా అని మండిపడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఇందుకు వేదికగా మారింది. 2014లో పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వర్ల రామయ్యకు ఆర్టీసీ రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టు ఇచ్చి...1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసినతనకు రీజియన్ స్థాయి పోస్టు ఇవ్వడం ఏమిటని చల్లా రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా నామినేటెడ్ పోస్టును ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ పోస్టును ఇస్తామని కూడా ఆయనకు టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నామినేటెడ్ పోస్టుల్లో స్థానం దక్కకపోవడంపై ఏవీ కినుక వహించారు. పెరుగుతున్న విభేదాలు.. కర్నూలులో ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూఖ్ కుమారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బనగానపల్లెలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, కోడుమూరులో విష్ణు, కొత్తకోట వర్గాలకు పొసగడం లేదు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి, తుగ్గలి నాగేంద్రల మధ్య కూడా విభేదాలు పొడచూపాయి. బహిరంగ వేదికల మీద వీరు పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వైఖరిపై పార్టీలోని అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో కూడా ఇన్చార్జీ ఏరాసు ప్రతాపరెడ్డి వైఖరిపై పార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కనీసం కార్యకర్తలకు పనులు ఇవ్వకుండా సొంతానికి చేసుకుంటుండంపై ఆ పార్టీ నేతలు కుమిలిపోతున్నారు. ఇన్చార్జ్ మంత్రిపై అసహనం.. జిల్లాలో విభేదాలు పెరిగిపోవడం..అసంతృప్తులు ఎక్కువగా ఉండడంతో ఇన్చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఇన్చార్జ్ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రిని నిలదీశారు. అదేవిధంగా మంత్రి అఖిలప్రియ వైఖరితో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా సీఎం మందలించినట్టు సమాచారం. సీనియర్ పార్టీ నేతలను కలుపుకుని పోవడంతో పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం చేసినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
విభేదాలు యథాతథం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించడం గమనార్హం. దీన్నిబట్టే ఇక్కడి నేతల మధ్య విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. అందరినీ కలుపుకొని పోవడం లేదని మంత్రి అఖిలప్రియను సీఎం మందలించారు. ఇక కర్నూలు నియోజకవర్గంలో కూడా ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల బదిలీల వ్యవహారంలోనూ ఇద్దరి మధ్య వైరం నడుస్తోంది. కర్నూలు సీటు తనదేనంటూ టీజీ భరత్ ఇప్పటికీ ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని సీఎం వద్ద ఎస్వీ ప్రస్తావించినట్టు సమాచారం. ఇక మంత్రి అఖిలప్రియ తనపై పనిగట్టుకుని కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని సీఎం వద్ద వాపోయినట్టు తెలిసింది. ఇదే విషయమై కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. సీఎంతో సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రమూ మార్పులేదు. కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌తో కూడిన కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా విభేదాలను పరిష్కరించే పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమన్వయ కమిటీ నుంచి... వాస్తవానికి అధికార పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై నేతలతో చర్చించింది. అయితే, ఏ ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో తాజాగా త్రిసభ్య కమిటీ తెర మీదకు వచ్చింది. ఈ కమిటీ నేతృత్వంలో కూడా విభేదాలు తగ్గే అవకాశం లేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఇప్పటికే మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కనీసం మాటలు కూడా లేవు. నంద్యాల మార్కెట్ కమిటీ పాలకవర్గం విషయంలోనూ అటు ఫరూఖ్ వర్గానికి, ఇటు అఖిలప్రియ వర్గానికి మధ్య రాజీ కుదరలేదు. కర్నూలు మార్కెట్ కమిటీదీ అదే పరిస్థితి. ఇక్కడ ఎస్వీ, టీజీ మధ్య రాజీ కుదరకపోవడంతో ఏడాది కాలంగా పాలకవర్గం ఏర్పాటు కావడం లేదు. నందికొట్కూరులో బైరెడ్డి రాకను శివానందరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బైరెడ్డి రాకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. అయితే, త్వరలో బైరెడ్డి కూడా టీడీపీలో చేరితే.. ఆ తర్వాత విభేదాలు మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కోడుమూరులో ఇప్పటికీ విష్ణు–మణిగాంధీ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తమ మధ్య రాజీ ప్రయత్నం వద్దని కూడా ఇరువర్గాలు త్రిసభ్య కమిటీకి తేల్చిచెప్పే పనిలో ఉన్నాయి. మొత్తమ్మీద అధికారపార్టీలో విభేదాలు ఏ మాత్రమూ సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. -
‘టీడీపీ మంత్రుల రాజీనామా.. ఎంపీలు కూడా’
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు లాంటి కేసులకు భయపడి ఏపీ ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన బాబు బ్యాచ్.. ఇప్పుడు కేంద్రంతో యుద్ధం చేస్తామని బీరాలుపోతున్నది. ‘రాజీనామాలు, బహిష్కరణలపై ప్రకటనలు వద్ద’ని సీఎం చంద్రబాబు సూచించి 24 గంటలైనా గడవకముందే తెలుగుదేశం ఎంపీ టీజీ వెంకటేశ్ పూర్తి విరుద్ధంగా స్పందించారు. బీజేపీ పొగరు దించుతామని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తారని చెప్పారు. శుక్రవారం ఇటు అమరావతిలో టీడీపీ సమన్వయ సమావేశం జరుగుతున్న సమయంలోనే టీజీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబునే బీజేపీ పట్టించుకోవడంలేదు. ఒంటరిగా మెజారిటీ సీట్లు ఉన్నాయన్న పొగరుతోనే బీజేపీ తన మిత్రులను లెక్కచేయడంలేదు. ఏపీలో టీడీపీది, మహారాష్ట్రలో శివసేనది అలాంటి పరిస్థితే. ఇప్పుడు బీజేపీ పొగరు దించాల్సిన అవసరం ఉంది. బాబును ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యొద్దు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమికి చంద్రబాబును మించిన నాయకులు లేరు. ప్రేమగా పనులు చేయించుకుందామన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ ఊరుకున్నాం. ఏపీకి ప్రత్యేకహోదా బదులు ప్యాకేజీ ఇస్తానని కేంద్రం అంటే ఒప్పుకున్నాం. ఇప్పుడా ప్యాకేజీ కూడా లేదు. కాబట్టి మేం మళ్లీ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధంలో మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేశాం. మొదటిగా కేబినెట్లో ఉన్న టీడీపీ మంత్రుల రాజీనామా, రెండో దశలో ఎంపీల రాజీనామాల గురించి ఆలోచిస్తున్నాం. చివరిదైన మూడో అడుగులో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటాం. అయినా, బీజేపీకి గతంలో ఉన్నంత బలంలేదిప్పుడు. ఇటీవలి ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఎదురుదెబ్బలు తిన్న విషయం తెలిసిందే. ఆదివారం జరుగనున్న టీడీపీ కీలక సమావేశంలో ఈ మేరకు వార్ డిక్లరేషన్ ఉంటుంది’’ అని టీజీ వెంకటేశ్ చెప్పారు. ఎంపీ వ్యాఖ్యలపై చంద్రబాబుగానీ, ఇతర నాయకులు స్పందించాల్సివుంది. -
కలహాల కాపురం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల్లో లుకలుకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కర్నూలులో తమకే పార్టీ టికెట్ అని ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ అంటుంటే.. కాదు తనకే అని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. తాను చెప్పిన వారికే పింఛన్ ఇవ్వాలని కోడుమూరు నియోజకవర్గంలో ఒక నేత హుకుం జారీచేస్తుంటే.. ఎమ్మెల్యే కాబట్టి తన మాటకే ప్రాధాన్యతివ్వాలని మణిగాంధీ అంటున్నారు. ఇక ఏకంగా ఫ్లెక్సీలోనూ సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ఫొటోనూ వేసేది లేదని తుగ్గలి నాగేంద్ర తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే విభేదాలు గుప్పుమంటున్న నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి వస్తుండటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. పార్టీ మారిన ఎంపీ బుట్టా రేణుకతో తనకు ఇబ్బందులు తప్పవనుకుంటున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి.. ఎంపీతో కనీసం కలిసేందుకూ ససేమిరా అంటున్నారు. నంద్యాలలో మార్కెట్ కమిటీ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, శాసన మండలి చైర్మన్ ఫరూఖ్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఆళ్లగడ్డ సీటు తనదేనంటూ ఏవీ సుబ్బారెడ్డి కొత్త రాగం అందుకున్నారు. అన్ని చోట్లా ఇదే తీరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక కర్నూలు మార్కెట్ కమిటీ ఎంపిక విషయంలో ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ మధ్య ఏకాభిప్రాయం ఏమాత్రమూ కుదరడం లేదు. దీంతో మార్కెట్ కమిటీ ఎంపిక ఏడాదిన్నరగా జరగడం లేదు. నంద్యాల మార్కెట్ కమిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఒక వర్గానికి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మరో వర్గానికి ఫరూఖ్ మద్దతు ఇస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మద్దతిచ్చినా.. ఇదేనా తమకిచ్చే గౌరవమని ఫరూఖ్ వర్గం మండిపడుతోంది. కోడుమూరు నియోజకవర్గంలో ఏకంగా పింఛనుదారుల ఎంపిక నుంచీ విభేదాలు గుప్పుమంటున్నాయి. ఆళ్లగడ్డలో విందు పేరిట ఏవీ సుబ్బారెడ్డి చేస్తున్న రాజకీయాలను అడ్డుకునేందుకు మంత్రి అఖిలప్రియ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కావడం లేదు. ఆయన ఏకంగా భూమా కుటుంబ సభ్యులను కూడా తన విందుకు రప్పించుకున్నారు. పైగా ఆళ్లగడ్డ సీటు తనదేనని మిత్రుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో పనులన్నీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి మాత్రమే చేస్తున్నారని, తమకు ఇవ్వడం లేదని మిగిలిన నేతలు మండిపడుతున్నారు. స్వయాన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలోనూ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తుగ్గలి నాగేంద్ర వేసే ఏ ఫ్లెక్సీలోనూ కేఈ వారి పేరు కనీసం ప్రస్తావించడం లేదంటే విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఊసేలేని సమన్వయ కమిటీ.. అప్పటికే పార్టీలో ఉన్న వారికి, గోడ దూకి వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని భావించిన అధికార పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జిల్లా ఇన్చార్జ్ మంత్రితో పాటు జిల్లా అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. కొద్దికాలం నుంచి క్రమంగా పెరుగుతున్న విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీ కనీసం భేటీ కూడా కావడం లేదు. గతంలో నెలకొక్కసారి కూర్చుని మాట్లాడేవారు. ఇప్పుడు కమిటీ పత్తా లేకుండా పోయింది. అంటే ఈ విభేదాలను ఇక పరిష్కరించలేమని అధికార పార్టీ నేతలు భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. -
నువ్వా.. నేనా? అంటున్న టీడీపీ నేతలు..!
సాక్షి, కర్నూలు: అధికార పార్టీ నేతల మధ్య రోజురోజుకూ విభేదాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎంపిక విషయంలో అధికార పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు సూచించిన పేరును మరొకరు ఒప్పుకోవడం లేదు. పాలక మండలిలో తమ అనుచరులే ఉండాలంటూ ఎవరికి వారు బెట్టు చేస్తున్నారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఏమాత్రమూ ఫలించలేదని సమాచారం. ఫలితంగా మార్కెట్ కమిటీ పాలక మండలి నియామకంలో జాప్యమవుతోంది. నేతల వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. టీడీపీలోని సీనియర్ నేతలకు కూడా ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు. తాజాగా బుధవారం నగరంలోని అశోక్‌నగర్‌లో జరిగిన వివిధ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. పోలీసుస్టేషన్లో ఇరు వర్గాలు కేసులు కూడా నమోదు చేయించడం గమనార్హం. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్–చైర్మన్, డైరెక్టర్ల నియామకం విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ ఎవరికి వారుగా పేర్లను సిఫారసు చేశారు. ప్రధానంగా చైర్మన్, వైస్–చైర్మన్ నియామకం విషయంలో రగడ మొదలయ్యింది. పెరుగు పురుషోత్తంరెడ్డి విషయంలో పాణ్యం నియోజకవర్గంతో పాటు కర్నూలు నియోజకవర్గానికి చెందిన పాతతరం టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన్ను చైర్మన్‌గా నియమించొద్దంటూ పార్టీ కార్యాలయం వద్ద గొడవ చేయడంతో పాటు జిల్లా అధ్యక్షుడికి తమ అసమ్మతిని లిఖితపూర్వకంగా తెలియజేశారు. అంతటితో ఆగకుండా విజయవాడకు వెళ్లి మరీ సీఎం కార్యాలయ (సీఎంవో) అధికారులతో పాటు పార్టీలోని ముఖ్య నేతలను కలిశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని కొత్త వారిని అందలం ఎక్కిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. వీరిని చల్లపరిచేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. మరోవైపు వైస్–చైర్మన్ నియామకం విషయంలో కూడా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి వైస్–చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ఆక్షేపిస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జరిగిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని సమాచారం. ఫలితంగా రేసు నుంచి అబ్బాస్ పేరును తొలగించినట్టు తెలుస్తోంది. సీటుకో బేరం ఒకవైపు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరికొందరు నేతలు ఇదే అదనుగా రంగంలోకి దిగి వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పదవులు వచ్చేలా చేస్తామంటూ భారీ మొత్తాలను వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక నేత ఏకంగా కోటి రూపాయల వరకూ వసూలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పదవి వచ్చే వ్యక్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం చేయాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇంత మొత్తాలను కూడా ఇచ్చి పదవి పొందేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారంటే.. ఏ మేరకు ఆదాయం ఉందో అనే అనుమానాలు ఇప్పుడు అందరికీ తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కర్నూలు మార్కెట్ కమిటీ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ మరింత హీటెక్కడం గమనార్హం. -
అమ్మడం, అమ్ముడుపోవడం ఆయన నైజం
కర్నూలు సీక్యాంప్: అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అడ్డంగా అమ్ముడుపోయిన వ్యక్తి టీజీ వెంకటేశ్ అని, ఆయన జీవితమంతా అమ్మడం, కొనడం, అమ్ముడుపోవడంతోనే ముడిపడిందని జిల్లా దళిత, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో విదేశీ ఆర్యవైశ్య, ఆర్యబ్రాహ్మణుల క్విట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ సంఘాల నేత లు టీపీ శీలన్న, బాలసుందరం, వేల్పుల జ్యోతి, పట్నం రాజేశ్వరి, గోపి, శేషఫణి, లక్ష్మీనరసింహా, విజేయుడు మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ది మధ్య ఆసియా దేశమని, ఇతర దేశానికి చెందిన ఆయనకు ఈ దేశ మూలవాసి కంచె ఐలయ్యపై నోటికొచ్చినట్టు మాట్లాడే అర్హత లేదన్నారు. దేశంలో స్థితిగతులు, జన జీవనంపై పుస్తకం రాసిన ప్రొఫెసర్ ఐలయ్యను చంపాలని, ఆయన పుస్తకాలు నిషేధించాలని టీజీ వెంకటేశ్ లాంటి వారు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఐలయ్య దళిత, బహుజన సంపద అని, ఆయనను కాపాడుకోవడం ఈ దేశ మూలవాసుల బాధ్యత అన్నారు. విదేశీ ఆర్యవైశ్యులు, విదేశీ బ్రాహ్మణులు వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. -
'ఐలయ్యను కృష్ణానది వరకు తరిమి కొట్టేవారు'
సాక్షి, కర్నూలు: అమెరికా మిత్రుడు కంచ ఐలయ్య గృహ నిర్బంధంలో ఉంటేనే మంచిదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న వారిలో ఐలయ్య కుల మత విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. దేశంలో 95 శాతం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఐలయ్య మాట్లాడారని ఆరోపించారు. గృహ నిర్బంధంలో ఉంచినందుకు ఐలయ్య చంద్రబాబు, కేసీఆర్ లకు ధన్యవాదాలు తెలుపుకోవాలన్నారు. ఐలయ్య విజయవాడకు వెళ్లి ఉంటే ప్రజలు కృష్ణా నది వరకు తరిమి కొట్టి ఉండేవారని తెలిపారు. విజయవాడలో జరిగిన చర్చల్లో.. బాధాకరమైన అంశాలను తొలగించుకుంటున్నట్లు ఐలయ్య అన్నట్టు.. తమ వద్ద సమాచారం ఉందన్నారు. అయితే, ఆయన అన్నీ విత్ డ్రా చేసుకుంటే తామూ గౌరవప్రదంగా తమ వాఖ్యలను విత్ డ్రా చేసుకుంటామన్నారు. -
టీజీ వెంకటేశ్ సవాల్
సాక్షి, కర్నూలు (టౌన్): ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సవాల్ విసిరారు. తమ సామాజిక వర్గాన్ని పదే పదే దూషిస్తే తిరగబడతామని కంచ ఐలయ్యను హెచ్చరించారు. గురువారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర భారతదేశంలోని బనియా సంపన్నులతో ఆర్యవైశ్యులను పోల్చడం ఎంత వరకు సమంజసమన్నారు. ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ పుస్తకంపై సుప్రీం కోర్టు కేసును డిస్మిస్ చేయలేదని, కేవలం డిస్పోజ్ చేసిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కేసు త్వరలోనే పరిశీలనకు వస్తుందని వెంకటేశ్ తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్న ఐలయ్య వెనుకబడిన వర్గాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశానికి వత్తాసు పలికే ఐలయ్యకు కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించడం బాగానే ఉందని, వారిలోనూ మార్పు తీసుకొచ్చినందుకు ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. -
వైశ్యులను విమర్శిస్తే వారికి మహిళలే కర్మకాండలు చేస్తారు: టీజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పాతగుంటూరు: ఆర్యవైశ్యులను విమర్శిస్తే ఆర్యవైశ్య మహిళలే వారికి కర్మకాండలు నిర్వహిస్తారంటూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో అర్య వైశ్య కల్యాణ మండపం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కామ వరపుకోటలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన టివీఏ.చిన రాజన్న ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రారంభించారు. ఈ సభలో టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను స్మగ్లర్లుగా పేర్కొంటూ వివాదాస్పద పుస్తకం రాయడం సరికాదని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కట్టడి చెయ్యకపోతే సమాజానికి ప్రమాదమన్నారు. అర్యవైశ్యులను విమర్శించిన వారికి అర్యవైశ్య మహిళలే కర్మకాండలు చేస్తారన్నారు. ఏలూరు ఎంపి.మాగంటి బాబు మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, వాటిని సాగనివ్వరా దన్నారు. అర్యవైశ్యులను ఎవరైనా విమర్శిస్తే వారి కాళ్లు విరగ్గొట్టాలని పిలుపునిచ్చారు. -
టీజీ వ్యాఖ్యలపై బాబు స్పందించాలి
ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ హైదరాబాద్: నడిరోడ్డు మీద ఉరితీయాలని తనపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. స్పందించ కుంటే ఆయన ఎంపీ తీరును సమర్థిస్తున్నట్టు భావిం చాల్సి వస్తుందని మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీ–మాస్ ఫోరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఒక పార్టీ ఎంపీ ఇలా మాట్లాడటంవల్ల అభద్రతాభావానికి గురికావల్సి వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో టీజీ వెంక టేశ్పై కేసు పెట్టనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తరువాత మూడేళ్లుగా టీజీ వెంకటేశ్ హైదరా బాద్‌లో పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ –టీజీ ఏకాభిప్రాయంతో నడుస్తున్నారని, తనను చంప టానికి ఇద్దరి మధ్యా అంగీకారం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పార్లమెం టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చించేలా పోరా టం చేస్తానని ఐలయ్య చెప్పా రు. దేశంలో వైశ్యులకు అనేక వ్యాపారాలు, పెద్ద పెద్ద పరిశ్ర మలున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు లేనందున... ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉదన్నారు. ఈ రిజర్వేషన్లపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైశ్యుల సంవత్సర ఆదాయంలో ఒక శాతం తీస్తే రూ.30వేల కోట్లు వస్తా యని, వీటితో రైతు సహాయ నిధి ఏర్పాటు చేసి, రైతు ఆత్మహత్యలను ఆపాలని కోరారు. దేశంలోని మేధావులు పరిశోధన చేసి, తాను రాసింది తప్పని రుజువు చేస్తే తన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’పుస్తకాన్ని నిషేధిస్తానని ఐలయ్య చెప్పారు. టీ–మాస్ నాయకులు జాన్‌వెస్లీ, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కులచిచ్చు పెట్టేవారిని ఉరితీయాలి
- ఐలయ్యపై చర్యలు తీసుకోవాలి - ఎంపీ టీజీ వెంకటేశ్ హైదరాబాద్: కులాల మధ్య చిచ్చు పెట్టే వారిని ఉరి తీసే చట్టాలు తీసుకురావాలని ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్ అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే రీతిలో కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని అందరూ ఖం డించాలన్నారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐలయ్యను కఠినంగా శిక్షించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగించాలని సమావేశంలో తీర్మానం చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ.. ఐలయ్యపై తెలుగు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కులాన్ని, మతాన్ని చివరకు జాతిపిత మహత్మాగాంధీని కూడా విమర్శిస్తూ రచనలు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి రాతలు గల్ఫ్ దేశాల్లో రాస్తే రోడ్డుపై నరికేవారన్నారు. గతంలో మజ్లీస్ నాయకులకు, మతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కిరణ్‌కుమార్ సర్కారు చర్యలు తీసుకుందని, అదే విధంగా ఐలయ్యపై ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విదేశాల నుంచి వ్యాపారం చేసే వారికి మద్దతిస్తూ, ఈ దేశంలో పుట్టి.. ఈ దేశంలోనే వ్యాపారాలు చేస్తున్న ఆర్యవైశ్యులను వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇతర దేశాల మద్దతుతోనే... ఇతర దేశాల మద్దతుతోనే ఐలయ్య దేశంలో అశాంతి సృష్టిస్తున్నారని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టి.రామకృష్ణ అన్నారు. రాజ్యాంగ రచన చేసిన అంబేడ్కర్‌ను గౌరవి స్తామన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మా ట్లాడుతూ గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి మహానేతలు చూపిన అహింసా మార్గంలో నడిచే వైశ్యులు ఎవ్వరికీ హింస తలపెట్టలేదన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, వార్త ఎండీ గిరీశ్ సంఘీ, నటి కవిత, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, కర్ణాటక, తమిళనాడు అధ్యక్షులు అనిల్‌గుప్తా, శంకర్రావు, తెలంగాణ, ఏపీ ఆర్యవైశ్య మహాసభల అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, జయంతి వెంకటేశ్వర్లుతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. -
తైక్వాండోతో ఆత్మరక్షణ
కర్నూలు(టౌన్) : ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతో అవసరమని రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక యునైటెడ్ క్లబ్ యోగా హాల్లో రాష్ట్రస్థాయి యంగ్‌మూడో (తైక్వాండో) పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ.. ఆత్మరక్షణ కోసం ఆయుధం అవసరం లేని ఆయుధమే యంగ్‌మూడో క్రీడ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ క్రీడకు మంచి ప్రాచుర్యం పొందిందన్నారు. మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. అలాగే జాతీయ స్థాయి యంగ్‌మూడో పోటీల్లో ప్రతిభ కనపరచి విజేతలు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. యంగ్‌మూడో సౌత్‌జోన్ డైరెక్టర్ ఫ్రాంక్ ఎడెల్ సహాయ్ రాష్ట్ర ప్రతినిధి దాదాబాషా, సహాయ కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులకు ఐక్యతే బలం
పోరుమామిళ్ల: వైశ్యులు ఐక్యంగా ఉన్నపుడే బలోపేతమవుతారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని బుధవారం దర్శించారు. ఆయన వెంట నెల్లూరు ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, కడప ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు దొంతు సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షుడు గుబ్బా చంద్రశేఖర్ కన్యకాపరమేశ్వరి, శివాలయం, రామాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన ప్రతిష్ఠ ఉత్సవాల్లో సేవలందించినవారికి టీజీ వెంకటేష్ మెమొంటోలు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.టీజీ వెంకటేష్‌ను ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు గుబ్బా చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కన్యకాపరమేశ్వరి వెండి పటాన్ని అందజేశారు. మండల ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు తులసి సుధాకర్ ఆయనను సన్మానించారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్‌ను కమిటీ సభ్యులు సన్మానించారు. -
‘పవన్ కళ్యాణ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారు’
కర్నూలు: జనసేన నేత పవన్ కళ్యాణ్ పై రాజ్యసభ సభ్యుడు ఎంపీ టీజీ వెంకటేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమిళనాడులో ఇలా మాట్లాడితే ముఖ్యమంత్రి జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించేవారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధించడం గెడ్డం గీసుకున్నంత ఈజీ కాదన్నారు. చిరంజీవి పదవీకాలం ముగుస్తున్నందునే ఎంపీలు రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై పవన్ ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎంపీలు తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందని పవన్ చెప్పడం అనుభవరాహిత్యానికి నిదర్శనమని టీజీ వెంకటేశ్ అన్నారు. -
పవన్‌ది అనుభవ రాహిత్యం: టీజీ
ఆదోని: ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఎంపీలు తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందని చెప్పడం పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యానికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఎంపీలు ఏ భాషలో మాట్లాడినా వెంటనే హిందీలోకి అనువాదం అవుతుందన్న విషయం ఆయనకు తెలియక పోవడం విచారకరమన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తిరుపతి సభలో ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పోరాడాలని పవన్ కల్యాణ్ సూచించడం సరికాదన్నారు. -
ఆర్యవైశ్యులకు దేశభక్తి ఎక్కువ
రాస్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆదోని: ఆర్యవైశ్యులకు దేశభక్తి ఎక్కువని, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఆదోని పట్టణ శివారులో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.25 లక్షలతో చేపట్టిన శ్రీ వాసవీ కన్వెన్షెన్ సెంటర్ భవన నిర్మాణానికి ఆదివారం టీజీ దంపతులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ పట్టణంలో కన్వెన్షన్ సెంటర్‌తోపాటు వాసవీమాత ఆలయ నిర్మాణానికి స్థానిక ఆర్యవైశ్య ముఖ్యులు కార్యోన్ముఖులు కావడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. గోదావరి, కష్ణా పుష్కరాల్లో కూడా ఆర్యవైశ్యుల సేవలు ఎంతో అభినందనీయంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల్లో కూడా ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని, అలాంటి వారి ఆర్థిక అభివద్ధి కోసం రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అంతకు ముందు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు టీజీకి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయమై తాము ముఖ్యమంత్రితో మాట్లాడతామని టీజీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాచోటి రామయ్య, మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేకర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తి సర్వేశ్వర ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విట్టా సురేంద్రబాబు, సంఘం ప్రముఖులు విట్టా రమేష్ కుమార్, టీజీ పాండురంగశెట్టి, మహిళా సంఘం ముఖ్యులు విట్టా రాధిక, కౌన్సిలర్ విట్టా శ్రీలత, యార్డు మాజీ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
'కాంగ్రెస్ ఆ పనిచేయడం లేదు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకరావడంపై చిత్తశుద్ధి లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అనేక బిల్లులకు కాంగ్రెస్ సహకారం కోరుతోందని చెప్పారు. ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బిల్లు పాస్ చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని టీజీ వెంకటేశ్ విమర్శించారు. -
'బీజేపీతో యుద్ధం చేయలేం'
న్యూఢిల్లీ : బీజేపీతో మేము యుద్ధం చేయలేమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ప్రత్యేక హోదా సాధించేంత బలం లేదని ఆయన తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు సభలో నేడు ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుపై టీజీ వెంకటేష్ స్పందించారు. కె.వి.పి.రామచంద్రరరావు కేవలం పొలిటికల్ లద్ధి కోసం బిల్లు పెడితే సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాం కలిపితే మద్దతిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాకు ఆమోదం తెలిపితేనే... జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలుపుతామని బీజేపీపై ఎందుకు ఒత్తిడి చేయరు అని కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. -
విడిపోతే ఏమవుతామోనని భయపడ్డాం: టీజీ
కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోతే తాము ఏమవుతామోననే భయం ఉండేదని, ఇప్పుడా భయం లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్)రాష్ట్ర తృతీయ మహాసభల్లో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు సిని మా సన్నివేశాలలాంటివన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏదైనా నష్టం జరుగుతుందని తాను సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించానని తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యూక తెలుగువాళ్లమంతా ఒక్కటేననే భావన ఏర్పడడం హర్షణీయమన్నారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం గా ముందుకు సాగుతోందని అన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లోనూ రాణించాలని కోరారు. సమావేశంలో ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళిగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవి వద్దు: టీజీ వెంకటేష్
తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే తీసుకోబోనని, ఎంపీగానే కొనసాగుతానని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చెప్పారు. ఆదివారం కర్నూలులోని బుధవారపేటో గౌరిగోపాల్ హాస్పిటల్లో వైద్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడారు. తాను పేరుకు ఎంపీ అయినా మంత్రి స్థాయిలో గౌరవం దక్కుతోందన్నారు. మంత్రి పదవి ఇస్తే ఆఫీస్‌లో కూర్చుని పనిచేస్తున్న భావన వస్తుందన్నారు. కొన్నాళ్ల పాటు ఎంపీగా ఉండి, ఇళ్లు, వ్యాపారం చక్కదిద్దుకోవాల్సి ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాతోపాటు రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. -
సీమలో సమ్మర్ క్యాపిటల్!
తిరుపతి: ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అట్టహాసంగా నూతన రాజధాని అమరావతి నిర్మాణ కార్యక్రమాల్లో తలమునకలవుతుంటే..మరో వైపు రాయలసీమ ఐక్యవేదిక నేతలు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాష్ట్రానికి అమరావతే కాకుండా రాయలసీమప్రాంతంలోనూ ఓ రాజధానిని నిర్మించాలనే వాదన ముందుకొచ్చింది. ఈ మేరకు రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల సాధన ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ మంత్రి టీజీ. వెంకటేశ్ డిమాండ్ చేశారు. అంతేకాక రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల సాధన కోసం కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీజీ వెంకటేశ్ మాట్లాడారు. అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించకపోతే అందరి నోట్లో మట్టికొట్టినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమలోని సాగునీటి ప్రాజెక్టులు గుండ్రేవుల, సిద్ధేశ్వరం, వేదవతి ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఉద్యమం ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందకుంటే మరొకసారి మోసపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే మద్రాసు, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని, మళ్లీ అమరావతిలో పెట్టుబడులు పెట్టి అదేవిధంగా బయటకు రావాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండాలంటే సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేకహోదా అంశం పై విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ముందు స్పెషల్ గ్రాంటులు తీసుకుని ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే బాగుంటుందని టీజీ అన్నారు. రాయలసీమ హక్కుల వేదిక ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి రెండింటిపైనా పోరాడుతుందని, దీనికి ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు. -
అమరావతిని ఫ్రీజోన్ చేయాలి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని మాజీ మంత్రి టీ జీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్ లో రాయల సీమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే రాయల సీమ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని.. అన్నారు. రాయల సీమకు నీళ్లు అందించే అన్ని ప్రాజక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. పట్టి సీమ, పోలవరం తో పాటు.. రాయల సీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆదివారందర్శించుకున్నారు. ఏపీ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణతో పాటు మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్ర సభ్యులు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్, హీరో సాయిధర్మతేజ తదితరులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
'అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి'
తిరుపతి కల్చరల్: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని శ్రీవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించకపోతే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు కేంద్రంగా అమరావతి మారునుందని, ఈ నేపథ్యంలో దీనిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని తెలిపారు. రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్, ఉత్తరాంధ్రలో వింటర్ క్యాపిటల్ ఏర్పాటు చేసినప్పుడే మరోసారి రాష్ట్ర విభజన ఉద్యమాలు రాకుండా ఉంటాయన్నారు. రాయలసీమలోని 4 జిల్లాలను 8 జిల్లాలుగా, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను 6 జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించాలన్నారు. చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా పీడిస్తున్న మంచి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని తెలిపారు. ఉత్తరాఖండ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధన కోసం శాంతియుత ఆందోళనలు వేదిక చేపడుతుందన్నారు. -
వారికంటే అవినీతిపరులే మేలు: టీజీ
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): పనిచేయని మంత్రులు, ఐఏఎస్‌లకంటే అవినీతికి పాల్పడే అధికారులే తన దృష్టిలో ఉత్తములని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అధికారులు అవినీతికి పాల్పడినా అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు, మంత్రులు ఎలా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమనే విషయమై పది మంది విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. దేశాభివృద్ధికి అవినీతే అడ్డని విద్యార్థులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇందుకు టీజీ స్పందిస్తూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను కాల్చివేయాలన్న సందర్భాన్ని గుర్తు చేశారు. అసలు పనిచేయకుండా ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించేందుకే ఆనాడు తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. -
'ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్యాకేజీలు రావు'
కర్నూలు: ఆంధ్ర, రాయలసీమ సమాంతరంగా అభివృద్ధి చెందాలని, లేకుంటే మళ్లీ ఉద్యమాలు వస్తాయని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కర్నూలును రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చివరి కోరికగా ఏపీకి ప్రత్యేక హోదా హామీయిచ్చారని గుర్తుచేశారు. స్పెషల్ స్టేటస్ పై మాట్లాడుతున్న కోస్తాంధ్ర నేతలు, ప్యాకేజీపై పెదవి విప్పడం లేదని ఆక్షేపించారు. నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్యాకేజీలు కూడా ఆగిపోతాయని అన్నారు. -
'రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రెండవ రాజధానిని రాయలసీమలో అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఆయన మాజీ మంత్రులు కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డిలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటకలో ఉన్న విధంగానే ఏపీలోనూ రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో మరోసారి ప్రత్యేక ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వాటికన్ సిటీ తరహాలో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. అందుకు తగ్గట్టుగా పూర్తిస్థాయిలో మద్యం, ధూమపానం వంటివి నిషేధించాలని సూచించారు. శేషాచలంలోని మైన్స్, ఎర్రచందనం ద్వారా సమకూరే ధనాన్ని రాయలసీమ అభివృద్ధికే వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ... సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేందుకు టీటీడీ కృషి చేయాలని అన్నారు. వారితోపాటు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
చరిత్ర రిపీట్ అవుతుంది: టీజీ
విశాఖపట్నం(పెదవాల్తేరు): అభివృద్ధి అంతా విజయవాడ చుట్టే తగదని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్నే అభివృద్ధి చేశారు. ఆర్థిక రాజధానిగా హైదరాబాద్ అవతరించిన అనంతరం సీమాంధ్రులను గెంటేశారు. ఇప్పుడు కూడా వెనుకబడిన జిల్లాలను విస్మరించి రాజధాని ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే చరిత్ర రిపీట్ అవుతుంది. నాడు పాలకులు చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నార ’ని వెంకటేష్ దుయ్యబట్టారు. నగరంలోని వైవీఎస్ ఆడిటోరియంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంతా ఒకే చోట కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన సీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాకూ విస్తరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
సీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ‘ప్రత్యేక’ ఉద్యమం
కర్నూలు(అర్బన్) : రాయలసీమ అభివృద్ధిని పాలకులు నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరించారు. శనివారం రాయలసీమ హక్కుల ఐక్య వేదిక 12వ వార్షికోత్సవం స్థానిక మౌర్యా ఇన్ హోటల్లోని శ్రీ ఆర్య వైశ్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదికను రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదికగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని అమరావతితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే రాయలసీమలో సమ్మర్, ఉత్తరాంధ్రలో వింటర్ రాజధానులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.రాయలసీమలోని నాలుగు జిల్లాలను 8, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను 6 జిల్లాలుగా పెంచాలన్నారు. కార్యక్రమానికి రాయలసీ మ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, మదనగోపాల్, వరదరాజులురెడ్డి (కడప),మాజీ మేయర్ ఎస్. రఘురామిరెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, బీజేపీ కర్నూలు పార్లమెంట్ ఇంచార్జి నక్కలమిట్ట శ్రీనివాసులు, జిల్లా ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు సీహెచ్ వెంగళ్‌రెడ్డి, విద్యా సంస్థల అధినేతలు వి. జనార్దన్‌రెడ్డి, పుల్లయ్య, రిటైర్డు డీఎస్పీ రామ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక వివాహాలు... వార్షికోత్సవం సందర్భంగా సామూహిక వివాహాలు జరిపించారు. మౌర్య హోటల్ 27 హిందువులు, 3 ముస్లిం, 11 క్రిస్టియన్ జంటలకు వివాహం జరిపించారు. టీజీ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డా.కేజీ గోవిందరెడ్డి హాజరయ్యారు. -
రాయలసీమ ఐక్య వేదిక పేరు మార్పు
కడప: రాయలసీమ ఐక్య వేదికను రాయలసీమ ఉత్తరాంధ్ర ఐక్య వేదికగా మార్చనున్నట్లు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ప్రకటించారు. ఆదివారం కడప విచ్చేసిన టీజీ వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, రెండు రాజధానుల ఏర్పాటు డిమాండ్‌తో ముందుకు వెళ్తామన్నారు. అందులోభాగంగా ఈ నెల15న కర్నూలులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీజీ వెంకటేష్ తెలిపారు. -
'సీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో కొత్త రాజధాని ఏర్పాటుపై అక్కడి జనంలో ఆనందం కనిపించడం లేదని టీడీపీ నేత టీజీ వెంకటేష్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూములు కోల్పోతున్నామన్న బాధ, ధరల పెరుగుదల అంశాలపై స్థానికులు అసంతృప్తితో ఉన్నారన్నారు. రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని టీజీ డిమాండ్ చేశారు. సమ్మర్ లేదా వింటర్ రాజధానిగా దాన్ని ప్రకటించాల్సిందిగా ఆయన కోరారు. రాజధాని కోసం కర్నూలు ప్రక్కన 30వేల ఎకరాల భూమి కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ గుడ్డిలోమెల్ల అన్న చందంగా ఉందని టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు. -
అంటీముట్టనట్టు..!
సాక్షి, కర్నూలు: ఆయన ఓ మాజీ మంత్రి.. గతంలో జిల్లాలో పవర్ సెంటర్‌గా కొనసాగారు. అప్పట్లో అధికార యంత్రాంగం ఆయన చెప్పినట్లే నడిచింది. ఆయన నివాసం, హోటల్.. నిత్యం కార్యకర్తలు, అధికారులతో సందడిగా ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఎన్నికల ముందు పార్టీ మారిన ఆయన తన వైరివర్గంతో కలవలేకపోతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రజా సమస్యలపై నోరు మెదపడం లేదు. ఒకప్పుడు అన్నీ తానై నడిపించిన ఆయన.. ప్రస్తుతం పార్టీ కార్యాలయం గడప తొక్కడం లేదు. మాజీ మంత్రి, టీడీపీ నేత టీజీ వెంకటేష్ మౌనం దాల్చారు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్న విమర్శలకూ బదులివ్వడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమాన్ని జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అన్నీ తామై నడిపించారు. ఈ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఇప్పటివరకు టీజీవీ ఒక్కటంటే ఒక్క కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమమనుకున్నా...పార్టీ పరంగా జరుగుతున్న సభ్యత్వ నమోదులోనూ ఆయన పాత్ర నామమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. తన చిరకాల వైరివర్గం అధికారాన్ని చెలాయిస్తుండాన్ని ఆయన తట్టుకోలేక.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అదే బాటలో ఆయన అనుచరగణం కూడా పార్టీ కార్యాలయంలో కాలు పెట్టడం లేదని తెలుస్తోంది. ఏదైనా పార్టీ కార్యక్రమం అంటే ‘మా సారు హోటల్లోనే’ అని బాహాటంగా అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కర్నూలు కార్పొరేషన్‌కు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టీజీవీ వైఖరి అధికారపార్టీని కొంత కలవరపాటుకే గురిచేస్తోందని సమాచారం. నీరు రాకున్నా నోరు పెగలదే...! రాష్ట్ర విభజనపై నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో ఉండే టీజీ వెంకటేష్.. విభజన అనంతరం ఆయన ఒక్కటంటే ఒక్కమాట మాట్లాడటం లేదు. శ్రీశైల జలాలను వినియోగించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. కర్నూలుకు నీరు రాకుండా చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు మొత్తుకుంటున్నా టీజీ వెంకటేష్ మాత్రం మాట్లాడటం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఆయనకు ఆస్తులు ఉండటమే ఇందుకు కారణమని రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది. వీటి సంగతి అలా ఉంచినా... మిగిలిన ప్రజా సమస్యల మీద కూడా ఆయన కనీసం పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. కర్నూలు నగరంలో పింఛన్లు, రేషన్‌కార్డుల ఏరివేతలో భాగంగా వేలాది మంది పేర్లను తొలగించారు. అయినా ఈ విషయంపైనా ఆయన నోరుమెదపడం లేదు. కర్నూలు మునిసిపాలిటీ పరిధిలో అంతోఇంతో పట్టున్న నేతగా ఆయనకు పేరుంది. అనేక దఫాలుగా కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి నుంచీ వైరం ఉన్న కేఈ సోదరుల ఆధిపత్యం పెరుగుతుండటం... మరోవైపు మునిసిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి ఎత్తులు వేయనున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వైఎస్సార్సీపీ రాకతో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాకతో ఆయన హవాకు బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. ఆయనకు ప్రధాన అనుచరులైన నర్సింహులు యాదవ్ సోదరులు, అలాగే స్టాండింగ్ కమిటీ చైర్-పర్సన్ గిరిజారెడ్డి భర్త తిమ్మారెడ్డి వైఎస్సార్సీపీలోకి చేరడంతో ప్రస్తుతం నగరంలో ఆయన బలం తగ్గింది. ఇక టీడీపీలోనూ నగరంలో మూడు గ్రూపులు ఉండడంతో టీజీ వెంకటేష్ హవా ఈసారి ఎన్నికల్లో ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక నగరంలో కేఈ సోదరుల హవా కొనసాగుతుండడం, మరోవైపు మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి వర్గం, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గం ఎవరికి వారు అధిపత్యం చలాయించే పనిలో నిమగ్నమయ్యాయి. సీఎం సభకూ చుట్టపుచూపే..! గతంలో అన్నీ తానై నడిపిన టీజీ వెంకటేశ్ ప్రస్తుతం టీడీపీ కార్యాలయానికి కూడా రావడం లేదు. ఇప్పటి వరకూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆయన గడప తొక్కకపోవడం గమనార్హం. ఆయన అనుచరులూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదు. పార్టీ కార్యాలయానికి రావలసిన అవసరం మాకేంటని బిహ రంగంగానే చెబుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా కర్నూలులో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే టీజీ అంతా తానై సభను నడిపించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వస్తే ఏదో చుట్టపుచూపుగా వచ్చినట్లు సభకు హాజరవ్వడం విశేషం. ఎన్నికల్లో సత్తా చాటి.. మరో నెలలో కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీజీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటి, స్థానిక కోటా కింద ఎమ్మెల్సీ పదవిని పొందాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. గత పాలక మండలిలో చూస్తే.. 34 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, అందులో 23 మంది టీజీవీకి చెందిన కార్పొరేటర్లు ఉండడం గమనార్హం. మేయర్, స్టాండింగ్ కమిటీల్లో ఆయన వర్గానికే అగ్రతాంబూలం. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో టీజీ వెంకటేష్ ప్రత్యేకత చాటుకునేవారు. అయితే ఈసారి అది పునరావృతం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. -
కేసీఆర్ విజయవాడ వస్తే.. తాటతీస్తాం: టీజీ వెంకటేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వస్తే ఆయన తాట తీస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేశ్ అన్నారు. విజయవాడలో సభ నిర్వహించి.. చంద్రబాబు రైతులను మోసగిస్తున్న వైనాన్ని ఆంధ్ర రైతులకు వివరిస్తానని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. విజయవాడతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో సమ్మర్, వింటర్ రాజధానులను ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానులను ఏర్పాటుచేయాలని, అవి లేని పక్షంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలవుతుందని టీజీ వెంకటేశ్ అన్నారు. తెలంగాణలో కూడా హైదరాబాద్ నగరంతో పాటు మరో రాజధాని అవసరమని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేసేలా ఉద్యమం కొనసాగిస్తామన్నారు. రెండు ప్రాంతాల్లో రాజధానుల కోసం జనవరిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల పోరాట వేదికను ఏర్పాటు చేస్తామని టీజీ వెంకటేశ్ చెప్పారు. -
మాజీలకు గన్మెన్ల తొలగింపు
కర్నూలు: జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు గన్మెన్లను తొలగించారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం జిల్లా పోలీస్ అధికారులకు చేరాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి 3+3, రాష్ట్ర మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, మీనాక్షి నాయుడు, నీరజారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులకు 2 + 2, కోట్ల సుజాతమ్మకు 1+1 గన్మెన్లను కేటాయించి భద్రత కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 36 మంది నేతలకు 160 మందికి పైగా గన్మెన్లతో భద్రత కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మినహా మాజీలందరికీ గన్మెన్లను తొలగించాలని రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తితో పాటు శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి యాదవ్ ప్రస్తుతం అత్యధిక గన్మెన్లతో భద్రతను పొందుతున్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌కు గతంలో 2+2 గన్మెన్లు ఉండగా 1+1కు తగ్గించారు. ప్రత్యర్థుల నుంచి తనకు హాని ఉందని పోలీస్ శాఖకు విన్నవించుకున్న నేపథ్యంలో గన్మెన్లను కొనసాగించేందుకు పై స్థాయి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మాజీలందరికీ గన్మెన్లను తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వుల మేరకు 1, 2 రోజుల్లో నోటీసులు జారీ చేసి భద్రతను తొలగించనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో నంద్యాల శాసనసభ నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డికి మాత్రం కోర్టు ఆదేశాల మేరకు 3+2 గన్మెన్లతో భద్రత కొనసాగిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలకు 1+1, ఎంపీలకు 2+2 గన్మెన్లతో భద్రతను కొనసాగించనున్నారు. అయితే ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకుని పెయిడ్ గన్మెన్లను పొందిన వారికి కూడా తొలగించాలని హోంశాఖ నుంచి ఉత్తర్వులు అందడంతో ఆ మేరకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. -
జెడ్పీ పీఠం కోసం అడ్డదారులు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాం.. ఇక తమకు తిరుగులేదంటూ జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చాలినంత బలం లేకపోయినా అడ్డదారులు తొక్కుతున్నారు. బెదిరింపులకు దిగడంతోపాటు క్యాంప్ రాజకీయాలను నడుపుతున్నారు. గురువారం కొందరు జెడ్పీటీసీ సభ్యులను తీసుకుని ఇతర ప్రాంతాలకు ఆ పార్టీ నేతలు బయలుదేరి వెళ్లారు. క్యాంపులకు వెళ్లేందుకు ఇష్టపడని వారిని సైతం బలవంతంగా తీసుకెళ్లారు. జిల్లాలో గతంలో 53 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ మాత్రం 20 స్థానాలతో సరిపుచ్చుకుంది. ఈ పరిణామాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారాన్ని ఉపయోగించి అడ్డదారిలోనైనా పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. గురువారం మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన హోటల్ నుంచి.. ఓ బస్సులో కొందరు టీడీపీ జెడ్పీటీసీ సభ్యులను తీసుకొని హైదరాబాద్, తిరుపతి, హోస్పేట, ఊటి, కొడెకైనాల్ తదితర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు.. తాము పార్టీ మారబోమని, పర్యటనకు రాలేమని చెప్పినా.. వినుకోలేదు. టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే మీ అంతు చేస్తామని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ జెడ్పీటీసీ సభ్యున్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. ‘మౌర్య హోటల్ వద్ద బస్సు ఉంటుంది. మీ కుటుంబం అంతా ఆ బస్సులో ఎక్కాలి’ అంటూ టీడీపీ నేతలు ఒకరి వెంట ఒకరు తీవ్రస్థాయిలో బెదిరించినట్లు జెడ్పీటీసీ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తాము రామంటున్నా.. టీడీపీ నేతలు విడిచిపెట్టటం లేదని వెల్లడించారు. ‘నీకు ఎంత కావాలంటే అంత తీసుకో’ అంటూ మరో జెడ్పీటీసీ సభ్యుడికి రూ.10 లక్షలు ఇవ్వజూపినట్లు సమాచారం. ఇంకో జెడ్పీటీసీ సభ్యుడికి రూ.5 లక్షలు నగదు, మరో రూ.5 లక్షలకు బ్యాంక్ చెక్కు ఆశ చూపినట్లు తెలిసింది. జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలెవ్వరూ లేనిది చూసి..టీడీపీ నేతలు రకరకాల ఒత్తిళ్లకు దిగటం గమనార్హం. అసెంబ్లీలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, టీడీపీ నేతల్లా అడ్డదారులు తొక్కటం తమకు తెలియదని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. అడ్డదారులు తొక్కటం మాని బాధ్యతగా నడచుకుంటే ప్రజల్లో విలువ ఉంటుందని హితువు పలికారు. -
టీడీపీలో నాలుగు స్తంభాలాట!
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం నలుగురు ప్రధాన నేతలు పార్టీలో ఉండటంతో ఎవరి నాయకత్వంలోకి వెళ్లాలో కార్యకర్తలకు అర్థం కావటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల వరకు మాజీమంత్రి ఫరూక్ నాయకత్వంలో పార్టీ కొనసాగేది. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇదిలా ఉండగా నంద్యాల పార్లమెంట్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. ఫరూక్, శిల్పా మోహన్ రెడ్డిల మధ్యే ఐక్యత అంతంత మాత్రంగా ఉంటే ఎస్పీవై రెడ్డి చేరడంతో పార్టీలో మరింత గందరగోళం ఏర్పడిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీమంత్రి టీజీ వెంకటేష్ అనుచరుడిగా మరో స్థానిక నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసుల శెట్టి పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే తమను ఓడించిన ఎస్పీవై రెడ్డిని టీడీపీలోకి తీసుకు రావడమే కాకుండా, ఎన్నికల సమయంలో తమకు సహకరించని పెసలకు మద్దతు ఇవ్వడంపై ఫరూక్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో నాలుగు స్తంభాల ఆట కొనసాగుతున్నదని ఏ స్తంభంతో ఎలాంటి సమస్య తలెత్తుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. -
మాజీ మంత్రి టీజీ వివాదాస్పద వ్యాఖ్యలు
కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోనిలో ఐదుగురు ఎంఐఎం కార్పొరేటర్లు గెలుపొందారని.. ఇక ప్రశాంతత ఎలా సాధ్యమని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కులం, మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో కొన్ని ముస్లిం సంస్థలు రెచ్చగొట్టే దోరణి అవలంబిస్తున్నాయని.. వీరివల్లే తాను ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో బీజేపీ పొత్తుతో లాభం చేకూరితే.. కర్నూలులో మాత్రం టీడీపీకి నష్టం జరిగిందన్నారు. -
మహాఛీటర్:టీజీ వెంకటేష్
కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్ నిర్వాకం * ఎన్నికల వేళ అర‘చేతి’లో వైకుంఠం *తర్వాత ప్రజలకు ప్రత్యక్ష నరకం * దుర్వాసనతో జొహరాపురంవాసులు ఉక్కిరిబిక్కిరి *రోడ్ల విస్తరణకు మొదటి అడ్డంకి ఆయన హోటలే * సొంతింటి కల దరఖాస్తులతో సరి * ప్రభుత్వ సొమ్ముతో మినరల్ వాటర్ ప్లాంట్లు * సొంత నిధులు ఖర్చు చేసినట్లుగా ప్రచారం * ‘కేసీ కాలువ గట్టు’ పనులు నాసిరకం * భారీగా నిధులు దుర్వినియోగం సాక్షి ప్రతినిధి, కర్నూలు : దశాబ్దాలుగా పాలకుల నిరాదరణకు నిలువుటద్దం కర్నూలు నియోజకవర్గం. సీమ ముఖద్వారంలోని ఈ ప్రాంతం నేతల స్వార్థంతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రిగా పనిచేసినా నగరాభివృద్ధిలో మార్పు చోటు చేసుకోకపోవడం గమనార్హం. ఆయన హామీలు నీటిమూటలు కాగా.. మరోసారి నందనవనం పేరిట ఓటర్లను బురిడీ కొట్టించేందుకు చేస్తున్న ప్రయత్నం బెడిసికొడుతోంది. తన సొంత ప్రసార మాధ్యమంలో తిమ్మిని బమ్మిని చేసి చూపుతూ.. ప్రధాన రహదారుల్లో గోడలపై గీయించిన రంగుల బొమ్మలే అభివృద్ధిగా భ్రమింపజేస్తుండటం నవ్వులపాలవుతోంది. ఎన్నికల వేళ ప్రజలపై లేని ప్రేమను ఒలకబోయడం.. ఆ తర్వాత పదవిని తన ఆస్తులను కాపాడుకునేందుకు మాత్రమే వినియోగించుకోవడం పరిపాటిగా మారింది. శాసనసభ్యునిగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా తన అనుయాయులకు లబ్ధి కలిగేలా వ్యవహరించారనే అపవాదును మూటగట్టుకున్నారు. ప్రధానంగా జొహరాపురం వాసులకు డంపింగ్ యార్డు నుంచి విముక్తి కల్పిస్తానని ప్రకటించినా.. ఇప్పటికీ ఆ దుర్వాసనతో స్థానికులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. కేవలం యార్డును మరో ప్రాంతానికి తరలించడంతో పనైపోయిందనుకోవడంతో చెత్త తొలగింపులో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలపాలవుతున్నారు. ఇక నగరంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన చిన్న మురుగు కాలువలే దిక్కయ్యాయి. ఫలితంగా మురుగునీరంతా ఎక్కడికక్కడ తుంగభద్ర, హంద్రీ నదుల్లో కలుస్తూ అనారోగ్యాలకు కారణమవుతోంది. రాజీవ్ ఆవాజ్ యోజన పథకం కింద నగరంలోని మురికివాడల అభివృద్ధికి సుమారు రూ.6 కోట్లు మంజూరైనా 10 శాతం నిధులను కూడా ఖర్చు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేసీ కాలువ గట్టు అన్యాక్రాంతం కాకుండా రూ.25 కోట్లు నీటి పారుదల శాఖ ద్వారా ఖర్చు చేయించారు. ఈ పనులు నాసిరకంగా చేపట్టడంతో పాటు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోయింది. మురిగిన హామీలు కొన్ని... ప్రజల దాహార్తి తీర్చేందుకు నగరంలో అసెంబ్లీ అభివృద్ధి నిధుల నుంచి రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేసి మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే టీజీ తన సొంత నిధులతో వీటిని ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. పైగా ప్లాంట్లను నగరపాలక సంస్థకు చెందిన స్థలాల్లోనే ఏర్పాటు చేయడం గమనార్హం. వీటి ఏర్పాటుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినా.. టీజీవీ అడ్డుకున్నారనే చర్చ కొనసాగుతోంది. నగర ప్రజలకు తాగునీటి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపుతానన్న ఆయన హామీ కలగానే మిగిలిపోయింది. మునగాలపాడు సమీపంలో ఎస్ఎస్ ట్యాంకు పక్కనే స్థలం ఉన్నా అదనపు ట్యాంకు నిర్మాణానికి నిధులు కేటాయించలేకపోయారు. కర్నూలు నగర ప్రజలను వరద ముప్పు నుంచి కాపాడేందుకు రక్షణ గోడ నిర్మిస్తానని ప్రకటించినా అతీగతీ లేకపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.244 కోట్లు మంజూరు చేసినా టీజీ చొరవ చూపకపోవడం ప్రజలకు శాపంగా మారింది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంలో భాగంగా పూర్తిస్థాయిలో రోడ్ల విస్తరణను చేపట్టలేకపోయారు. తన సొంత హోటల్ వద్దే విస్తరణకు సహకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇరుకు రోడ్డునే రెండుగా విభజించి తన సొంతింటి వరకు వీధిలైట్లు, రోడ్డు వేయించుకోవడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. వీధిలైట్ల కాంట్రాక్టును సైతం అయినవారికే కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే చర్చ ఉంది. నియోజకవర్గంలోని 39 డివిజన్లలో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చినా.. రూ.4 కోట్లతో ఏడు కమ్యూనిటీ హాళ్లు మాత్రమే పూర్తి చేయించారు. మిగిలిన వాటి ఊసే మరిచారు. నగరపాలక సంస్థ నూతన కార్యాలయానికి 2010లో అప్పటి పురపాలక శాఖ మంత్రి చేతుల మీదుగా టీజీవీ శిలాఫలకం ఆవిష్కరింపజేశారు. నిర్మాణం కోసం రూ.9 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేసి మూడేళ్లు గడుస్తున్నా దిక్కుమొక్కూ లేకపోయింది. కర్నూలులో సొంతింటి కల నెరవేరుస్తానంటూ 20 వేల మందికి పైగా నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీరిలో 10వేల మందికి పొజిషన్ సర్టిఫికెట్లతో సరిపెట్టారు. ఇప్పటికీ సెంటు స్థలం చూపకపోవడం గమనార్హం. -
వలస నేతలు.. విలవిల
టీజీవీకి ముస్లింలు రాంరాం ఏరాసు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత నంద్యాలలో ఓటమి అంచున శిల్పా నందికొట్కూరులో లబ్బికి ఎదురుగాలి కండువాలు మార్చినా.. ఓటర్లను ఏమార్చలేని వైనం సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఆ నలుగురు నేతలను రాష్ట్ర విభజన పాపం వెంటాడుతోంది. కండువాలు మార్చుకున్నా వజ్రాయుధమైన ఓటు నుంచి తప్పించుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను చేపట్టి.. అన్నదమ్ముల్లాంటి తెలుగు ప్రజలను చీల్చొద్దని నెత్తినోరు కొట్టుకున్నా పెడచెవిన పెట్టారు. అధికార దాహంతో తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. విభజనానంతరం కాంగ్రెస్‌ను ప్రజలు చీకొట్టడంతో.. గుడ్డికన్నా మెల్ల నయం అన్నట్లు మంత్రులుగా పనిచేసిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిలు టీడీపీలో చేరిపోయారు. పార్టీ అయితే మారారు కానీ.. ప్రజల ఆగ్రహజ్వాలల నుంచి తప్పించుకునే దారి లేక ఓటమి అంచున కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ‘పచ్చ’ పార్టీ అధినేత చంద్రబాబు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెలిసిందే. పైగా నరేంద్రమోడీ గొప్ప నాయకుడని బాబు పొగడ్తలతో ముంచెత్తడం ముస్లిం ఓటర్లలో వ్యతిరేకతను పెంచుతోంది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల మైత్రి టీడీపీ అభ్యర్థుల ఓటమి కారణమవుతోంది. పైగా వలస నేతలైన ఈ నలుగురికి ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటం కూడా గెలుపు ఆశలను గల్లంతు చేస్తోంది. కర్నూలులో టీడీపీకి ముస్లింలు రాంరాం మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పట్ల కర్నూలు ముస్లింలలో వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తుపెట్టుకోవటం టీడీపీకి గడ్డు పరిస్థితులను తీసుకొచ్చింది. జయాపజయాలను శాసించే ముస్లిం ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తుండటం.. వారి మధ్యే వర్గ విభేదాలు సృష్టించటం ఆ సామాజిక వర్గంలో టీడీపీపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. అదేవిధంగా తన ఆల్కలీస్ పారిశ్రామికవాడ నుంచి వెదజల్లే కాలుష్యంతో ఇటీవల కాలంలో కర్నూలు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యారు. ఓ వృద్ధురాలు మరణించారనే ప్రచారం కూడా ఉంది. ఇవి చాలవన్నట్లు టీజీపై 420 కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ అయినట్లు ప్రచారం జరగడంతో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం గమనార్హం. మొత్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకత నడుమ ఆయన గట్టెక్కడం కష్టమేనని తెలుస్తోంది. నంద్యాలలో శిల్పాకు ఎదురుగాలి నంద్యాల పేరు చెబితే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తారు. నందుల కోటలో ఆయన పట్ల అంతటి అభిమానం ఉంది. రాజకీయ భిక్షపెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా నిలవక ఆయన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో నిలిచిన భూమా నాగిరెడ్డి ప్రజాదరణతో ప్రచారంలో దూసుకుపోతుండగా.. ఆయనను ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కడం ఆయనను ఓటమికి చేరువ చేస్తోంది. మార్పును కోరుకుంటున్న ఇక్కడి ప్రజలు ఈ విడత వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఏరాసును పట్టించుకోని పాణ్యం జనం శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏరాసు ప్రతాప్‌రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించిన ఆయన టీడీపీలో చేరి పాణ్యం బరిలో నిలిచారు. మూడేళ్లు అధికారం కట్టబెట్టినా ఏమీ చేయలేని ఆయన ఇక్కడ అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రచారం సందర్భంగా ఆ వ్యతిరేకత బయటపడుతోంది. బొల్లవరంలో ఇటీవల ప్రచారానికి వెళ్లగా ‘‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా.. చంద్రబాబు అయితే బాగుంటుందా’’ అని ఆయన పదేపదే జనం స్పందన కోరగా.. ప్రజలు ‘వైఎస్ జగన్ సీఎం అయితేనే బాగుంటుంది’’ అని చెప్పడం విశేషం. నందికొట్కూరులో లబ్బి గూండాగిరి ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన లబ్బి వెంకటస్వామికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డే. అలాంటి కుటుంబాన్ని కాదని ప్రత్యర్థులతో చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై అనుచరులచే దౌర్జన్యాలకు దిగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బుధవారం ఓ విద్యార్థిపై తమ్ముళ్లు చేయి చేసుకోవడమే తాజా నిదర్శనం. అదేవిధంగా చిరకాల ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న బెరైడ్డి వర్గం, లబ్బి వర్గం ఏకమై ఎన్నికల్లో ప్రచారం చేస్తుండటాన్ని చూసి స్థానికులు ముక్కన వేలేసుకుంటున్నారు. ఆయన హయాంలో నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించడం పట్ల కూడా ప్రజలు గుర్రుగా ఉన్నారు. -
‘తమ్ముళ్ల’కు గోతులు కొరకరాని కొయ్యలా టీజీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాంగ్రెస్ పార్టీపై విభజన ముద్ర పడటంతో ప్రజాదరణ కలిగిన వైఎస్ఆర్సీపీలో చోటు లేక టీడీపీలో రాజకీయ ఆశ్రయం పొందిన నేతలు పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో సంతృప్తి చెందక.. పక్క నియోజకవర్గాల్లోనూ పెత్తనం చెలాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపులో చక్రం తిప్పడం ద్వారా కింగ్‌మేకర్ ముద్ర వేయించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. వీరి తీరుతో ఇప్పటి వరకు పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తెలుగుతమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరడం తెలిసిందే. ఈయన కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే డోన్, ఆదోని స్థానాలకు అభ్యర్థుల విషయంలోనూ ఆయన చక్రం తిప్పుతున్నారు. ఆదోని నుంచి కుమారుడు టీజీ భరత్‌ను పోటీ చేయించేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి టిక్కెట్ ఇస్తే గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తకు డోన్ టిక్కెట్ కోసం కూడా టీజీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. భరత్, గుప్తలకు సీట్లిస్తే ఆయా స్థానాల్లో ఖర్చుతో పాటు కర్నూలు పార్లమెంట్ వ్యయంలోనూ పాల్పంచుకుంటామనే తన రహస్య ఎజెండాను టీజీ అధినేత ఎదుట ఉంచినట్లు పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆ మేరకు అధినేత సమాలోచన చేస్తున్నారని వినికిడి. ఈ విషయం బయటకు పొక్కడంతో తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. డోన్ నుంచే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి ప్రకటించగా.. ఆదోనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మరోసారి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. వీరిరువురూ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. వీరిరువురూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుండగానే టీజీ వారికి గోతులు తవ్వుతుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. టీజీకి అడ్డుకట్ట వేయకపోతే పార్టీకి అంతా తానే అన్నట్లుగా తయారవుతారని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకు ఆయనకు చెక్ పెట్టేందుకు తమ్ముళ్లు అధినేత వద్ద ‘పంచాయితీ’ పెట్టనున్నట్లు తెలిసింది. -
ఫోన్లు చేయించుకొని ప్రాణహాని అంటావా?
కర్నూలు: తమను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే టీజీ వెంకటేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. సొంత మనుషులతో ఫోన్లు చేయించుకొని తనకు ప్రాణహాని ఉందంటూ టీజీ వెంకటేష్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని అవాస్తవాలు చెప్తున్నారని అన్నారు. కర్నూలు నగరాన్ని సొంత డబ్బుతో అభివృద్ధి చేసినట్టు టీజీ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. వరద సహాయ నిధులను ఆయన దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని టీజీ వెంకటేష్ నిన్న అన్నారు. -
రాస్తే.. రోడ్డెక్కుతా!
మీడియాపై టీజీ చిందులు వ్యతిరేకంగా వార్తలొస్తే ఊరుకోనని హెచ్చరిక కోర్టు మెట్లెక్కుతానని బెదిరింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రోడ్డెక్కుతా.. వారి చిట్టా విప్పుతానంటూ తాజా మాజీ మంత్రి, కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టి.జి.వెంకటేష్ మీడియపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నగరంలోని తన హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీడియాపై చిందులేశారు. ‘ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లపై ఎంతైనా రాసుకోండి కానీ నాపై అక్షరం పొరపాటున రాసినా అంతు చూస్తా’నని హెచ్చరించారు. ‘మీ పేపర్లలో, చానళ్లలో ఎవరి గురించైనా రాయండి, ప్రసారం చేసుకోండి నేను పట్టించుకోను. నా ప్రతిష్ట దిగజార్చేలా నీచంగా చూపించడం, రాయడం చేస్తే ఊరుకోనని’ బెదిరింపు దోరణిలో మాట్లాడారు. అసత్య కథనాలను ప్రసారం చేసిన వారి చరిత్రను బయటపెడతానన్నారు. అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కేందుకూ వెనుకాడబోనన్నారు. గత 35 ఏళ్లుగా కర్నూలును కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని.. అలాంటిది పొరపాటున కూడా వ్యతిరేక వార్తలు వస్తే తగిన గుణపాఠం చెబుతానన్నారు. విలేకరుల సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. నా గురించి మీకు తెలియదు.. నాలో మరో వ్యక్తిని చూడాలనుకోవద్దండిని హెచ్చరించారు. తనకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించకపోతే చానల్స్ ప్రసారాలను నిలిపేస్తానన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి మీడియా ప్రతినిధులను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టీజీకి చెందిన ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల పాతబస్తీవాసులు ఆయనపై మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మీడియా పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. -
రాంభూపాల్ చౌదరి కంటతడి
-
చంద్రబాబు మోసం చేశాడు: రాంభూపాల్ చౌదరి
సాక్షి, కర్నూలు: రానున్న శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట తప్పి మోసం చేశాడని మాజీ మంత్రి, కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రాంభూపాల్ చౌదరి విమర్శించారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ను పార్టీలో చేర్చుకుని కర్నూలు శాసనసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన ఆదివారం తన అనుచరులతో సమావేశమై చర్చించారు. కర్నూలు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా కట్టేందుకు కూడా కార్యకర్తలు లేని పరిస్థితుల్లో తాను పార్టీలో చేరానని చెప్పారు. నాలుగున్నర సంవత్సరాలపాటు వయస్సును కూడా లెక్క చేయకుండా ఇంటింటికి తెలుగుదేశం పేరుతో నగరమంతా పర్యటించి పార్టీకి పునాదులు ఏర్పాటు చేశానన్నారు. అలాంటి తనను కనీసం సంప్రదించకుండా టీజీని పార్టీలో చేర్చుకున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపై ఏమి చేయాలనే విషయంపై అనుచరులు, అభిమానులు, కార్యకర్తల సలహాలు తీసుకున్నారు. జిల్లా పార్టీ ఇన్చార్జి, రాజ్యసభ స భ్యుడు సీఎం రమేష్ జోక్యం పార్టీకి మరింత నష్టం చేకూర్చే విధంగా ఉందని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌదరికి మరో రూపంలో న్యాయం చేయకపోతే తమ సత్తా ఏమిటో చాటుతామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. -
'సైకిల్' ఎక్కిన టీజీ, ఏరాసు
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు వద్ద రాజకీయ శిక్షణ తీసుకోవడం వల్ల మంచి పనులు చేయగలిగామని మాజీ టీజీ వెంకటేష్ అన్నారు. పార్టీ పెట్టే తహతు తనకు లేదన్నారు. ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. మంచివాళ్లను పార్టీలో చేర్చకుంటామని చెప్పి తమను చంద్రబాబు గౌరవంగా ఆహ్వానించారని టీజీ తెలిపారు. అదే తమకు పెద్దకు గౌరవంగా భావిస్తున్నామన్నారు. భూమి గుండ్రంగా ఉన్నట్టు టీడీపీ నుంచి బయటకు వెళ్లి మళ్లీ అదే పార్టీకిలోకి వచ్చామని ఆయన చమత్కరించారు. అయితే అప్పటి పరిస్థితుల కారణంగానే టీడీపీని వదిలిపెట్టామని సమర్థించుకున్నారు. టీడీపీని చంద్రబాబు చక్కగా నడపుతున్నారని కితాబిచ్చారు. ఒంటెద్దు పోకడలతో విభజన చేయడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామని ఏరాసు తెలిపారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుతో టీజీ, ఏరాసు, గంటా భేటీ
హైదరాబాద్: దేశంలో బీజేపీ సానుకూల పవనాలు వీస్తున్నాయని కర్నూలు కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేష్ అన్నారు. కేంద్రంలో బీజేపీ రావడం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. బీజేపీతో మంచి సంబంధాలున్న పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు పాటు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ పాత్ర కూడా టీజీ వెంకటేష్ ఉందన్నారు. చంద్రబాబు ఒత్తిడి తేవడం వల్లే సీమాంధ్రకు ఆ మాత్రం ప్రోత్సకాలు తీసుకొచ్చేందుకు బీజేపీ పోరాడిందని చెప్పారు. చంద్రబాబు తమను టీడీపీలోకి ఆహ్వానించారని టీజీ తెలిపారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేసే సత్తా చంద్రబాబుకు ఉందని నమ్ముతున్నట్టు ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలును సీమాంధ్ర రాజధాని చేయాలని చంద్రబాబును కోరినట్టు వెల్లడించారు. -
వ్యాపారులే కాంగ్రెస్ నుంచి వెళుతున్నారు: కోట్ల
-
టీడీపీలోకి టీజీ, ఏరాసు?
* రాజధాని రాగం.. రంగు మార్చే వ్యూహం! * వైఎస్ఆర్సీపీలోకి మూసుకుపోయిన దారులు * కాంగ్రెస్‌లో ఉండలేక ‘పచ్చ’పార్టీలోకి... * అందులో భాగమే రాజధాని డిమాండ్ * విభజన మచ్చ చెరిపేసుకునేందుకు ఎత్తుగడ * చంద్రబాబుతో రహస్య మంతనాలు కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్‌లో ఉంటే మనుగడ లేదని తెలుసుకున్న నాయకులు ఏదో ఒక సాకుతో పార్టీ మారేందుకు ప్రణాళిక రచించుకుంటున్నారు. ఇన్నాళ్లు సమైక్య రాష్ట్రం తెస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ఆ తంతు ముగియడంతో ఇప్పుడు సరికొత్త రాగం ఆలపిస్తున్నారు. కర్నూలును రాజధాని చేయాలనే వాదన వారి వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది. ఆ ముసుగులో రాష్ట్ర విభజనకు కారణమైన తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రులు టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. పాణ్యం, నందికొట్కూరు శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామిలు ఇప్పటికే టీడీపీలో తమ బెర్తులు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా మాజీ మంత్రులు వారి అనుయాయులు సహా పార్టీ వీడుతున్నట్లు సమాచారం. ఆ మేరకు వీరు సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ కావల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో ఈ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరికపై మరింత సమయం కావాలని గంటా బృందం కోరినట్లు సమాచారం. అయితే బయటకు మాత్రం కర్నూలును తిరిగి రాజధాని చేయాలనే డిమాండ్‌తో చంద్రబాబు మద్దతు కొరేందుకు వెళ్తున్నట్లు ప్రకటించుకోవడం గమనార్హం. గత రెండు రోజులుగా టీజీ వెంకటేష్ రాజధాని డిమాండ్‌తో పాటు ప్రత్యేక రాయలసీమపై ప్రసంగాలు ఊదరగొడుతుండటం తెలిసిందే. రాష్ట్ర విభజన అంశంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎలాగోలా ఆ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారనే చర్చ ఉంది. పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న నాయకులు బహిరంగంగా నిర్ణయం తీసుకోవాలే కానీ.. ఇలా దొంగచాటుగా ప్రయత్నాలు చేయడం ఏమిటని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీజీ, ఏరాసులు టీడీపీలో చేరేందుకు ఈనెల 27వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు చర్చ జరిగినా.. ముందుగానే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. తక్కిన ఎమ్మెల్యేలు కూడా ఒకటి రెండు రోజుల్లో వారినే అనుసరిస్తారని తెలిసింది. అయితే సమైక్య ఉద్యమంలో తన వంతు పాత్రతో ప్రజాభిమానం చూరగొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొనేందుకు.. విభజనకు కారణమైన టీడీపీతో జట్టు కట్టినా ఒరిగేదేమీ లేదని వారికి కొందరు పార్టీ ముఖ్యులు నచ్చజెబుతున్నట్లు వినికిడి. అటు కాంగ్రెస్‌లో ఉండలేక.. ఇటు వైఎస్ఆర్సీపీలో విభజనవాదులకు చోటు లేకపోవడంతో గత్యంతరం లేక టీడీపీ వైపు అడుగులేస్తుండటం చూసి అనుచరులు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారు. ఏదేమైనా టీజీ, ఏరాసులు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనుండటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు కూడా త్వరలో సైకిల్ ఎక్కనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు. -
సీమాంధ్రకు రెండు రాజధానులివ్వాలి: టీజీ
కర్నూలు, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతానికి రెండు రాజధానులను ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. కర్నూలులో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాజధానులు లేకపోతే సీమ ప్రజలు మరోసారి మోసపోక తప్పదన్నారు. 1953లో కర్నూలు రాజధానిని కోల్పోయిందన్నారు. లేనిపక్షంలో కోస్తా, సీమ రెండు ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటుచేసి, ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. -
నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే: టీజీ
కర్నూలు: ‘నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే’ అని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన కర్నూలు నగరంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోవాలని.. తాను నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఓట్ల కోసం వచ్చే వారు ఏ సేవ చేశారో తెలుసుకోవాలన్నారు. కళ్లు లేని వాళ్లకు తాను చేసిన అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. రాజకీయాలను మార్చే శక్తి మీడియాకు లేదన్నారు. ఆ శక్తి ఉంటే తాను ఏనాడో పేపర్, టీవీ చానల్ పెట్టేవాడినని మంత్రి చెప్పారు. -
'కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం'
పార్టీలో కొనసాగడంపై మంత్రులు టీజీ, ఏరాసు, గంటా బిల్లు పెట్టినట్లు తేలిన మరుక్షణమే రాజీనామా కిరణ్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? లేదా సీఎం పెట్టే కొత్త పార్టీలో చేరాలా? టీడీపీలోకి వెళ్లాలా?.. అనే అంశాలను తమ అనుచరులు, కార్యకర్తలతో చర్చించాకనే నిర్ణయిస్తామని మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షకట్టి మరీ తెలుగు ప్రజల గొంతు కోస్తోందని, ఆ పార్టీలో కొనసాగడం ఎవరికీ ఇష్టం లేదని వారు వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎం కిరణ్‌తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేస్తానని కొన్ని నెలలుగా సీఎం అంటున్నా తామే వారించామని.. సీఎం ఇప్పుడు కూడా అందుకు సిద్ధమయ్యారని మంత్రులు చెప్పారు. బిల్లు పెట్టలేదని బీజేపీ అంటున్నందున.. రాజీనామా చేస్తే బిల్లు ప్రవేశపెట్టినట్లు సంకేతాలు పోతాయని, రాజీనామా చేయకుండా ఉంటే బీజేపీ వాదనకు బలం చేకూరుతుందని తాము వివరించినట్లు పేర్కొన్నారు. బిల్లుపై అధికారికంగా ప్రకటన వచ్చాక సీఎం రాజీనామా చేస్తారని వెల్లడించారు. కొత్త పార్టీ అవసరం ఎంతో ఉందని... సీఎం కొత్త పార్టీ పెట్టడం ఖాయమని చెప్పారు. అయితే, కొత్త పార్టీ సంగతి తమతో సీఎం ప్రస్తావించలేదని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మీడియాకు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై ఏం జరుగుతుందో వేచి చూడాలని తాను సీఎంకు తెలిపానని ఎమ్మెల్యే మస్తాన్‌వలీ చెప్పారు. సీఎం రాజీనామాతో పాటు అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన కూడా వచ్చే అవకాశముందని ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెప్పారు. ఈ నెల 18 లేదా 19న సీఎం రాజీనామా చేయవచ్చని వారు పేర్కొన్నారు. బిల్లు పెట్టినట్లు తేలిన మరుక్షణమే రాజీనామా: పితాని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారా? లేదా? అన్న సందిగ్ధం ఉన్నందున... దానిపై అధికారిక ప్రకటన వచ్చిన తక్షణమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. రాజీనామాపై కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో సీఎం చర్చించారని... బిల్లు పెట్టలేదని ప్రతిపక్షాలు చెబుతున్నందున రాజీనామా చేయవద్దని తామంతా సీఎంకు చెప్పామని వివరించారు. సీఎం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదని... కేంద్ర మంత్రుల సూచనలు, ఢిల్లీలో ఏపీఎన్జీవోల దీక్షల నేపథ్యంలో సోమవారం సాయంత్రం నిర్ణయించే అవకాశముందని తెలిపారు. -
పార్లమెంటులో బిల్లు పెట్టిన అనంతరం సీఎం రాజీనామా: టీజీ
-
‘బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే పార్టీని వదిలేస్తా’
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే, పార్టీ నుంచి తప్పుకుంటానని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆత్మసాక్షిగా సంతకం పెట్టలేదన్నారు. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన రోజు తెలుగు ప్రజలకు చీకటి రోజని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందితే.. అది పార్లమెంటులో పూర్తిస్థాయిలో ఆగిపోవడం కష్టమని అన్నారు. విభజన బిల్లు విషయమై పార్టీ వైఖరి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఆయన పార్టీనుంచి బయటకు వస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆత్మసాక్షిగా ప్రణబ్ సంతకం పెట్టలేదనుకుంటా: టీజీ
తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంపై సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు తమ స్పందన తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ఆత్మసాక్షిగా బిల్లుపై సంతకం పెట్టలేదని అనుకుంటున్నాం అని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను రాజ్యసభలో ప్రవేశపెడితే పార్టీ నుంచి తప్పుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెడితే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా సమర్పిస్తాను అని టీజీ స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాన్ని లెక్కలోనికి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించడానికే నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని టీజీ వెంకటేశ్ అన్నారు. -
అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ
-
అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ
హైదరాబాద్ : అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ ముగిశాక తమపై దాడి జరిగే అవకాశం ఉన్నందున తమకు భద్రత కల్పించాలన్నారు. దాడులకు పాల్పడేవారిపై ముందే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తక్షణమే తెలంగాణ బిల్లుపై ఓటింగ్ పెట్టాలన్నారు. ఓడిపోతామనే భయంతో ఓటింగ్‌కు ఒప్పుకోవటం లేదని టీజీ అన్నారు. మరో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ఓటింగ్ కోరటం ప్రతి సభ్యుడి హక్కు అన్నారు. ఓటింగ్ పెట్టాలని 159మంది సభ్యులు స్పీకర్‌కు లిఖితపూర్వకంగా లేఖలు ఇచ్చారన్నారు. మెజార్టీ సభ్యులు సమైక్యాన్నే కోరుకుంటున్నారని, గురువారం అసెంబ్లీకి భద్రత పెంచాలని మంత్రి డిమాండ్ చేశారు. -
మా పేర్లు వాడుకుంటే క్రిమినల్ చర్యలు: టీజీ, కాసు
-
టీజీ Vs కోట్ల
-
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై టీజీ ఫైర్
కర్నూలు: కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిక్కెట్టు ఇవ్వలేదని కార్యాలయానికి నిప్పంటించే సంస్కృతి ఒక్క సూర్య ప్రకాశ్ రెడ్డికే ఉందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయంతో ఎవరుపడితే వారిపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. ఓవైపు మంత్రి పదవులు అనుభవిస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని టీజీని ఉద్దేశించి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీని వీడతానన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీజీ వెంకటేష్ తెలిపారు. పార్టీ కన్నా ప్రజల మనోభావాలే ముఖ్యమని అన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
టీజీ వెంకటేష్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు: కోట్ల
కర్నూలు : కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సొంతపార్టీ నేతలపైనే ధ్వజమెత్తారు. ఓవైపు మంత్రి పదవులు అనుభవిస్తూ మరోవైపుకాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ద్రోహం చేసే మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని కోట్ల డిమాండ్ చేశారు. మంత్రి టీజీ వెంకటేష్‌పై స్పీకర్ ఫిర్యాదు చేస్తామని...ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం అందుతుందని ఆయన అన్నారు. -
కర్నూలు రాజధానైతే రూ.500కోట్లు ఇస్తా: బాలసాయిబాబా
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగి, కర్నూలును రాజధానిగా చేస్తే తన రూ.500కోట్ల ఆస్తిని నగర అభివృద్ధికి రాసిస్తానని భగవాన్ బాలసాయిబాబా ప్రకటించారు. బాలసాయిబాబా జన్మదిన వేడుకలు మంగళవారం కర్నూలులోని శ్రీనిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. బాలసాయిబాబా స్థానికుడైనందున ముందుగా కర్నూలు నగర అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దీనికి ప్రతిస్పందించిన బాబా కర్నూలును రాజధానిగా చేస్తే రూ.200కోట్ల విలువైన భూములు, రూ.300 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను రాసిస్తానని ప్రకటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే, తన తదనంతరం తన ఆస్తిని దేశానికి అందజేస్తానన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, మంత్రి సారయ్య, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ హాజరయ్యారు. -
సిగ్గుంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలి
హైదరాబాద్ : శ్రీధర్ బాబు శాఖ మార్పు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మంత్రులు అవకాశం దొరికినప్పుడల్లా తమ నోటికి పని చెబుతున్నారు. సిగ్గు ఉంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబును బలిపశువును చేశారని ఆయన అన్నారు. కాగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యలకు మంత్రి దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేస్తే సీమాంధ్ర మంత్రులు కిరాణా దుకాణం పెట్టుకోవాలన్నారు. -
శాఖ మారిందని గోల చేయటం తగదు: టీజీ
కర్నూలు : మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు వ్యవహారంపై సీమాంధ్ర మంత్రులు కూడా స్పందిస్తున్నారు. ఇష్టం లేకుంటే మిగిలిన తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేయాలని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాతే ముఖ్యమంత్రిని ప్రశ్నించాలన్నారు. శ్రీధర్ బాబుకు ఇచ్చిన శాఖను విస్మరించి శాఖ మారిందని గోల చేయటం తగదని టీజీ వ్యాఖ్యానించారు. ఆయన సమర్థవంతంగా పనిచేయటం వల్లే శ్రీధర్ బాబుకు అదనపు శాఖలను కేటాయించటం జరిగిందన్నారు. మంత్రుల శాఖలను మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉందని, కిరణ్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని అన్నారు. -
బాబు, కిరణ్, జగన్‌లు ఒకే తాటిపైకి రావాలి: టీజీ
కర్నూలు: విభజన బిల్లును కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పంపిన నేపథ్యంలో సీమాంధ్ర నుంచి తీవ్ర వ్యతిరేకతా నెలకొంది. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా సీమాంధ్రలో ఆందోళన కార్యక్రమాలు పెద్దఎత్తునా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ సంక్షోభాన్ని అడ్డుకోవాలంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఒకేతాటిపైకి వచ్చి పోరాడాలని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. అయితే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారని చెప్పారు. కాగా, విభజన జరిగితే పార్టీ వీడే అవకాశం ఉంటుందని టీజీ వెంకటేష్ అన్నారు. -
చర్చ జరగకుండా అడ్డుకోవాలన్న టీజీ
-
తూతూమంత్రంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారం.. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కరువైంది. కేంద్ర ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా వ్యయం చేస్తుండటంతో లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్రమాలు.. లొసుగులపై చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆరు నెలలకోసారి నిర్వహించే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం అభాసుపాలవుతోంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమావేశం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కమిటీ సభ్యులైన జిల్లా మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంది. అయితే వీరంతా గైర్హాజరయ్యారు. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చ జరగాల్సిందిపోయి నామమాత్రంగా ముగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు మాత్రమే హాజరవగా.. నిధుల వినియోగంలో అక్రమాలను ఎండగట్టారు. ఇదిలాఉండగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంతో పాటు డీఆర్డీఏ పాలక వర్గ సమావేశం కూడా సోమవారమే నిర్వహించాల్సి ఉంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పట్టకపోవటంతో రెండింటినీ కలిపి ఒకే సమావేశంలో కానిచ్చేశారు. అతి ముఖ్యమైన తొమ్మిది ప్రభుత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇందులో డీఆర్డీఏ, డ్వామా, ఐఏవై గృహా లు, ఆర్‌డబ్ల్యుఎస్, ఐసీడీఎస్, పీఎంజీఎస్‌వై రోడ్ల నాణ్యత, అటవీశాఖ కార్యక్రమాలు, భూమి హక్కులు, ల్యాండ్ సర్వే అమలు, 13వ ఆర్థిక ప్రణాళిక నిధుల వినియోగంపై ప్రముఖంగా చర్చ చేపట్టాలి. మంత్రులెవరూ హాజరు కాకపోవడంతో అక్రమాలపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ దృష్టి సారించలేకపోయింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే కీలకమైన అంశాలను లేవనెత్తారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధిహామీ పథకంలో అవినీతి, అక్రమాలు.. డీఆర్డీఏ, డ్వామా, గృహ నిర్మాణాలు, నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను నిలదీశారు. అదే విధంగా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సైతం ప్రభుత్వ నిధుల వినియోగంపై చర్చ లేవనెత్తారు. ఏదేమైనా 14 నియోజక వర్గాల పరిధిలో పేరుకుపోయిన సమస్యలు, వాటి పరిష్కారానికి డిమాండ్ చేయాల్సిన అమాత్యులు, శాసనసభ్యులకు చర్చలో పాల్గొనే తీరిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పనేమిటని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి ఫిర్యాదు చేయటానికి వచ్చిన పలు గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ఇదే విషయమై శోభా నాగిరెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మాలో గుంతలు తవ్వితే తప్ప.. విభజన ఆగడం తథ్యం'
ఎవరైనా మాలో గుంతలు తవ్వితే తప్ప, రాష్ట్ర విభజన ఆగుతుందని అనుకుంటున్నాం అని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. బిల్లుపై సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా తమ వ్యతిరేకతను రికార్డు చేసి పంపుతారు అని టీజీ తెలిపారు. బిల్లుపై చర్చ ప్రారంభమైంది అనడం కరెక్టుకాదు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 371(డి)ని సవరించకుండా విభజించలేరు టీజీ స్పష్టం చేశారు. శాసన సభకు సీఎం వస్తారు.. వచ్చాక చర్చ ప్రారంభం అవుతుంది అని ఓ ప్రశ్నకు టీజీ సమాధానమిచ్చారు. రేపు సభకు హాజరవుతానని సీఎం చెప్పారు అని టీజీ అన్నారు. బిల్లు పంపడానికి జనవరి 23వరకూ అవకాశం ఉంది, అవసరమైతే మరింత గడువు కోరతామని టీజీ మీడియాకు వెల్లడించారు. విభజన జరగదని మాకు చివరివరకూ ఆశ ఉంది మంత్రి టీజీ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రుల సమావేశం ముగిసిన తర్వాత టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. -
2014 ఎన్నికల్లోపు విభజన ఉండదు
-
పరిశీలనలో అసెంబ్లీ రద్దు: టిజి వెంకటేష్
హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేసే అంశాన్నీ ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. బిల్లును అసెంబ్లీలో చర్చించడానికి రాష్ట్రపతి ఎన్నిరోజులు గడువు ఇస్తారనే దానిపై తమ వ్యూహం ఉంటుందన్నారు. 45 రోజుల సమయం ఇవ్వకపోతే రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు ఐక్యంగా ఉంటడంతో సమైక్యాంధ్రకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు దిగ్విజయ్ సింగ్ జరిపే మంతనాలు ఫలించవని చెప్పారు. గెలిచే అవకాశాలుంటేనే సీఎం కొత్తపార్టీ పెడతారన్నారు. -
కేసీఆర్ పెద్ద సమైక్యవాది: మంత్రి టీజీ
తిరుమల: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు రాష్ట్రంలో పెద్ద సమైక్యవాది అని మంత్రి టీజీ.వెంకటేష్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం ఆయన సోమవారం రాత్రి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేకరులతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పేరుతో కేసీఆర్ సమైక్యవాదానికి మద్దతు ఇస్తున్నార న్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాదు, కాంగ్రెస్ నాయకత్వంలో వచ్చే తెలంగాణ కు ఆయన అంగీకరించరని అన్నారు. కేసీఆర్ వైఖరే సమైక్యవాదానికి అనుకూలంగా ఉంటోందని, ఇలాంటి తరుణంలో అశోక్‌బాబు, ఇతర సమైక్యవాదుల నాయకత్వం అవసరం లేదని ఆయన అన్నారు. కర్నూలును రాజధాని కానివ్వకుండా ఉండేందుకే కొందరు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. -
కాంగ్రెస్ అధినేతల పొరపాట్లకు సీమాంధ్ర బలి
బొప్పూడి (చిలకలూరిపేట రూరల్), న్యూస్‌లైన్ :కాంగ్రెస్ పార్టీ అధినేతలు చేసిన పొరపాట్లకు కోట్లాది మంది సీమాంధ్ర ప్రజలు బలైపోతున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు. బొప్పూడిలోని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాన్ని శని వారం ఆయన ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సమైక్యాంధ్రను కోరుతూ ఉద్యమాన్ని ఇక్కడ చేస్తే ప్రయోజనం ఉండదని ఢిల్లీని స్తంభింపజేస్తే ఫలితం లభిస్తుందన్నారు. రైతులు సంతోషంగా ఉండి పంటలు పండించుకునేందుకు, భూములు విలు వ పెంపొందేందుకు లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. నాలుగు గ్రామాలకు చెందిన 3153 ఎకరాల వ్యవసాయ భూములకు నీటిని అందించేందుకు రూ 15.87 కోట్లతో దీనిని ఏర్పాటుచేశామన్నారు. లిఫ్ట్‌ను గ్రామ ప్రజలు కాపాడుకుంటూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫుట్ బ్రిడ్జిలను నిర్మించాలి .. పేట ప్రాంతంలోని ఓగేరు, కుప్పగంజి, నల్లమడ పరీవాహక ప్రాంతంలో వాగులు దాటి ప్రయాణించి పంటలు సాగు చేసేందుకు అనుకూలంగా ఫుట్‌బ్రిడ్జిలను నిర్మించాలని రైతు సంఘం కార్యదర్శి బొల్లు శంకరరావు, రైతులు మంత్రి వెంకటేష్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమం అనంతరం ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ సర్పంచి పూసల హరిబాబు గ్రామంలో ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు. వివిధ శాఖల ఉద్యోగులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎత్తిపోతల రైతులకు కల్పవక్షాలు గణపవరం (నాదెండ్ల) : ఎత్తిపోతల పథకాలు రైతులకు కల్పవృక్షాలని మంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు. గణపవరం పరిధిలోని ఏపీఎస్ఐడీసీ నిధులతో 7.87 కోట్ల వ్యయంతో 1700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. కావూరు డొంకరోడ్డులో కుప్పగంజివాగుకు అనుసంధానంగా నిర్మించిన పథకానికి మంత్రి స్విచ్ఆన్ చేశారు. గ్రామ ప్రధాన వీధిలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ మూడేళ్ల క్రితం తానే శంకుస్థానన చేసిన పథకాన్ని నేడు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నా రు. మంత్రి కాసు కృష్ణారెడ్డి అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీఎస్ఐడీసీ చైర్మన్ ఘంటా మురళి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు నల్లమోతు నటరాజేశ్వరరావు, ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు వలేటి హిమంతరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏపీఎస్ఐడీసీ ఎస్ఈ షేక్ కాలేషావలి, ఈఈ డీఎల్ నరసింహం, డీఈ ఆదిశేషారావు, ఏఈ కృష్ణమూర్తి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విభజనవాదులను దేశద్రోహులుగా పరిగణించాలి.. విభజనకోరేవారిని దేశద్రోహులుగా పరిగణించే చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య కంపెనీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను సమైక్యవాదినని, సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటానని, రాయలసీమ హక్కుల కోసం పోరాడతానాన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా అనేక ప్రత్యేక డిమాండ్లు తలెత్తుతాయన్నారు. -
రబీ ఆశలపై నీళ్లు
కర్నూలు(కలెక్టరేట్/రూరల్), న్యూస్‌లైన్: కాల్వల కింద రబీ పంటల సాగుపై రైతన్న ఆశలను ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు నీరుగార్చారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా, నదులు భారీగా ప్రవహిస్తూ ప్రాజెక్టులు నిండినా రబీ పంటలకు అత్తెసరు నీటితో సరిపెట్టేందుకు నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. రైతు ప్రయోజనాలపై చర్చించింది నామమాత్రమే అయినా.. వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులు నీటి పారుదల శాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు ఉండగా మంత్రులతో కలిసి ఆరుగురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఎల్లెల్సీ నీటి విడుదలపై సమావేశంలో వాడివేడి చర్చ సాగింది. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న నీటి చౌర్యంపై ఎల్లెల్సీ నీటి వాటా పరిరక్షణ కమిటీ సభ్యులు పి.సాయిబాబు తదితరులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎల్లెల్సీ కింద కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో మిరప, పత్తి లక్ష ఎకరాల్లో ఉందని, ఈ పంటలకు విధిగా డిసెంబర్ 15 వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే అందుబాటులోని నీటితో మంచినీటి అవసరాలు తీరుస్తూ ఇప్పటికే వేసిన 50వేల ఎకరాల పంటలకు నీరిచ్చేందుకు మంత్రులు, అధికారులు అంగీకరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హెచ్ఎల్సీ నీటిని వాటా మేరకు రాబట్టుకుంటున్నారని, మన జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రం కోటా మేరకు నీటిని రాబట్టలేకపోతున్నారని.. ఇది చేతగాని తనమేనని సాయిబాబు తదితరులు ఘాటుగా విమర్శించారు. దీనిపై మంత్రి ఏరాసు స్పందిస్తూ ‘‘మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఈ విషయమై ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో చర్చించాం. దురదృష్టవశాత్తు కర్ణాటకలో ముగ్గురు, రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఇందువల్ల న్యాయం పొందలేకపోతున్నాం’ అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంకు కూడా ఇదే విషయమే ప్రధానంగా చెప్పామని తెలిపారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రే ఉన్నా వెలుగోడు రిజర్వాయర్‌కు 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యాంలో పూర్తిగా నీరున్నా మన ప్రాంతానికి 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామన్నారు. ఎస్సార్బీసీ సర్కిల్-1 ఎస్ఈ, ఈఈ, హంద్రీనీవా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పని లేక ఇక్కడికి వచ్చామా అంటూ గైర్హాజరైన వారికి చార్జి మెమోలు ఇవ్వాలని మంత్రులు టీజీ, ఏరాసులు కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి టీజీ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాలకు రూ.530 కోట్లు నిధులున్నాయని, ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వీటి ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ సీఈ సుబ్బారావు, ఎస్ఈ నాగేశ్వరరావు, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఠాగూర్ నాయక్, కేసీ కెనాల్, ఎల్లెల్సీ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, జీడీపీ తదితరులు పాల్గొన్నారు. -
'నేనే సీఎం అయితే విభజనవాదులను జైల్లో పెడతా'
తనకు సీఎం పదవి వస్తే కనుక రాష్ట్ర విభజన కోరుకునే వారందరిని జైల్లో పెడతానని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... లక్షలాది మందితో ఢిల్లీ వెళ్లితే విభజన ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీఎన్జీవోల నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఢిల్లీ వెళ్లాలని సూచించారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే ఆ బిల్లును తిరస్కరించాలని తామంతా భావిస్తున్నామని చెప్పారు. అలాగే అసెంబ్లీని రద్చు పరిచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు టీజీ వెంకటేష్ వెల్లడించారు. -
తూతూ మంత్రంగా సాగిన రచ్చబండ కార్యక్రమం
-
తప్పంతా అధిష్టానానిదే: మంత్రి టీజీ
కర్నూలు: ‘రాష్ట్ర విభజన విషయంలో మాకెలాంటి సంబంధం లేదు. తప్పంతా అధిష్టానానిదే. రాష్ర్టం విడిపోకుండా ఉండేందుకు నేను ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నాను. కొంత మంది పుడింగులకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. వచ్చి మాపై రాళ్లు వేస్తున్నారు. అలాంటి వారి మూతులు పగలగొట్టండి’ అని రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సమావేశంలో పాల్గొన్న మంత్రి అధికారిక కార్యక్ర మాన్ని రాజకీయ వేదికగా మార్చారు. సమైక్యవాదులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు వారిపైకి మహిళలను ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గతంలో తాగొచ్చిన భర్తను కొట్టొచ్చిన భార్యలకు రూ.10వేలు బహుమతి ఇస్తామని ప్రకటించానని, అయితే ఎవ్వరూ అలాంటి పనిచేయలేదెందుకని ప్రశ్నించారు. ‘మీ మొగుళ్లేమైనా బంగారమా.. ఎవ్వరూ తాగి రావటం లేదా?’ అని వ్యంగ్యంగా మహిళలను ప్రశ్నించారు. -
'విభజన అనివార్యమైతే సీఎం కొత్త పార్టీ పెట్టొచ్చు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విభజన అనివార్యమైతే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న నేతలు కొత్త పార్టీల్లోకి వెళ్లడం కష్టమన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎంపీల రాజీనామాలపై భిన్నంగా స్పందించారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎంపీలు రాజీనామాలు చేయడం సరికాదన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి ఎంపీలు పదవిల్లో కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అసెంబ్లీకి టీ.ముసాయిదా బిల్లు మాత్రమే వస్తోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా ఒకే వేదికపైకి రావాలని టీజీ తెలిపారు. రాజకీయాల్లో ఉంది సన్యాసం కోసం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో లక్షల మందితో నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
హస్తినలో కాంగ్రెస్ సీమాంధ్ర నేతల తర్జనభర్జన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయంపై అధిష్టానం వెనక్కితగ్గే పరిస్థితి కానరాకపోవటంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం పెరుగుతోంది. ఓవైపు ప్రజల నుంచి ప్రతిఘటన, మరోవైపు అధిష్టాన పెద్దల నుంచి ఏమాత్రం సానుకూల సంకేతాలు కానరాని నేపథ్యంలో సీమాంధ్ర నేతలు సోమవారం ఢిల్లీలో ఏపీభవన్‌లో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, బాలరాజు, కొండ్రు మురళి, పితాని సత్యానారాయణ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అధిష్టానం పునరాలోచన చేస్తుందన్న నమ్మకం కలగటం లేదని.. ఈ దశలో మనకేం కావాలో కోరటం తప్ప మార్గం లేదని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలు తలొగ్గక తప్పదని, అలాకాని పక్షంలో రాజకీయ నేతలే సంక్షోభాన్ని సృష్టించాలని మరికొందరు పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రమంత్రులు రాజీనామాలు చేసేందుకు ముందుకు వస్తే సంక్షోభం తప్పదని.. కేంద్రం కచ్చితంగా దిగివస్తుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డట్లు చెప్తున్నారు. అయితే ఎలాంటి నిర్ణయాలు లేకుండా, భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక లేకుండానే ఈ సమావేశం ముగిసింది. అనంతరం ఆయా నేతలు.. ఏపీభవన్లోనే ఉన్న ముఖ్యమంత్రి కిర ణ్కుమార్రెడ్డిని విడివిడిగా కలసి మాట్లాడారు. చివరి ప్రయత్నంగా మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సహా ఇతర పెద్దలను కలసి సమైక్య రాష్ట్ర అవసరాన్ని మరోమారు తెలియజేస్తానని సీఎం ఈ సందర్భంగా వారికి చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీలో ఆందోళన చేస్తేనే కదలిక: టీజీ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ఆందోళనలు చేస్తే కేంద్రం నుంచి స్పందన వస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ ఏపీభవన్‌లో విలేకరులతో వ్యాఖ్యానించారు. విభజన నిర్ణయాన్ని అసెంబ్లీలో ఓడించేందుకే తామంతా పదవుల్లో కొనసాగుతున్నామని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. రాజీనామాలు ఆమోదించుకుంటే నష్టపోతామని సీఎం చెప్పినందునే పదవుల్లో ఉన్నామన్నారు. విభజన నిర్ణయంపై కాంగ్రెస్ వెనక్కి తగ్గుతుందని తాను భావించటం లేదని బాలరాజు వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో ఉండి సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే సమస్యలు హైకమాండ్‌కు తెలియజేస్తామని, పరిష్కరించాలని కోరతామన్నారు. -
హస్తిన బయల్దేరి వెళ్లిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, టీజీ.వెంకటేష్, ఉత్తంకుమార్‌రెడ్డి, ఏరాసు, చీఫ్ విప్ గండ్ర, ఎమ్మెల్సీ షబ్బీల్ అలీ తదితరులు ఈరోజు ఉదయం హస్తినకు బయలుదేరారు. ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన జరిగే జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరవనున్నారు. మన రాష్ట్రం తరుఫున సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారుల బృందం వెళ్తోంది. ఈ సందర్బంగా మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణను కేంద్రం ప్రకటిస్తుందని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. ఇక ఢిల్లీ వెళ్లినా.. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి అధిష్ఠానం పిలిచి అడిగితే తప్ప.. తనకు తానుగా ఏ విషయం చెప్పేదిలేదని కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ సమగ్రతా మండలి సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం సీఎం హైదరాబాద్ చేరుకోనున్నారు. -
'ముందుగా రాజీనామా ఆమోదింపచేసుకుంటా'
సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం కావడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కారణమని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించేందుకే తాము రాజీనామాలు చేయలేదని తెలిపారు. అవసరమైతే సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధమని చెప్పారు. ముందుగా రాజీనామాను ఆమోదింపచేసుకునేది తానేనని అన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని మంత్రి టీజీ వెంకటేష్ అంతకుముందు అన్నారు. సమైక్యాంధ్ర జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల అధినేతలు ద్వితీయ శ్రేణి నేతలను నిలువునా ముంచారని పేర్కొన్నారు. సీమాంధ్రలో 6 మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేకుండా చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చొద్దని కోరారు. -
దూషిస్తేనే మంత్రి టిజిపై దాడి: ఎస్వి మోహన రెడ్డి
కర్నూలు: రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి టీజీ వెంకటేష్ అక్రమకేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యమకారులను దూషించడం వల్లే మంత్రి టీజీపై దాడి చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. మంత్రి టీజీపై పరువునష్టం దావా వేస్తామని మోహన్‌రెడ్డి హెచ్చరించారు. -
మీసం మెలేసిన మంత్రి!
రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖామాత్యులు టీజీ వెంకటేష్‌కు చిర్రెత్తుకొచ్చింది. సమైక్య సెగ తాకడంతో మంత్రిగారూ ఆగ్రహంతో ఊగిపోయారు. సొంతగడ్డపై పరాభవం ఎదురవడంతో ఈ రాయలసీమ లీడర్ ఫైర్ అయ్యారు. సమైక్యవాదులు చెప్పులతో స్వాగతం చెప్పడంతో కంగుతిన్న టీజీ ఉద్యమకారులపై ఒంటికాలిపై లేచ్చారు. అసలు సిసలైన సమైక్యవాదినైనా తనపైనే చెప్పులేస్తారా అంటూ కోపంతో ఊగిపోయారు. సినిమా హీరో లెవల్లో కారు దిగి మీసం మెలేసి, తొడగొట్టి సమైక్యవాదులకు వార్నింగ్ ఇచ్చారు. కర్నూలులో ఆదివారం ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి టి.జి.వెంకటేశ్ కాన్వాయ్‌ని సమైక్యవాదులు అడ్డుకుని, రాజీనామా చేయాలంటూ నినదించారు. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కారుపై చెప్పులు విసిరారు. దాంతో టీజీ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన టీజీ ఈ విన్యాసం చేశారు. తామేం తక్కువ తినేదన్నట్టుగా మంత్రిగారి అనుచరులు కొందరు న్యాయవాదుల దీక్షా శిబిరంపై చెప్పులు విసిరి స్వామిభక్తి చాటుకున్నారు. టీజీ వెంకటేష్ కంటే ముందు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఈ విన్యాసం ప్రదర్శించారు. పంచెకట్టుతో తెలుగుదనానికి చిరునామాగా కనిపించే తులసిరెడ్డికి సొంత జిల్లాలోనే సమైక్య సెగ తాకటంతో ఆయన కూడా లయ తప్పారు. తొడగొట్టి, మీసం మెలేసి సవాల్ విసిరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పుట్టపర్తి సర్కిల్లో గత నెల 28న ఆయన ఈ ఫీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు 'మీసం' విన్యాసాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.