చరిత్ర రిపీట్ అవుతుంది: టీజీ | developing vijayawada surroundings only not correct, says tg venkatesh | Sakshi
Sakshi News home page

చరిత్ర రిపీట్ అవుతుంది: టీజీ

Published Mon, Jun 15 2015 9:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

చరిత్ర రిపీట్ అవుతుంది: టీజీ

చరిత్ర రిపీట్ అవుతుంది: టీజీ

విశాఖపట్నం(పెదవాల్తేరు): అభివృద్ధి అంతా విజయవాడ చుట్టే తగదని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్నే అభివృద్ధి చేశారు. ఆర్థిక రాజధానిగా హైదరాబాద్ అవతరించిన అనంతరం సీమాంధ్రులను గెంటేశారు. ఇప్పుడు కూడా వెనుకబడిన జిల్లాలను విస్మరించి రాజధాని ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే చరిత్ర రిపీట్ అవుతుంది. నాడు పాలకులు చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నార ’ని వెంకటేష్ దుయ్యబట్టారు.

నగరంలోని వైవీఎస్ ఆడిటోరియంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంతా ఒకే చోట కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన సీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాకూ విస్తరించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement