
విజయవాడఛ కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ. 2.86 కోట్లు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కేసులు వాదించిందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించింది. హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రూ. 2.86 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను సిద్థార్థ్ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ స్కామ్, అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సూపర్ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు.