చంద్రబాబుతో టీజీ, ఏరాసు, గంటా భేటీ
హైదరాబాద్: దేశంలో బీజేపీ సానుకూల పవనాలు వీస్తున్నాయని కర్నూలు కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేష్ అన్నారు. కేంద్రంలో బీజేపీ రావడం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. బీజేపీతో మంచి సంబంధాలున్న పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు పాటు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు.
సీమాంధ్రకు జరిగిన అన్యాయంలో కాంగ్రెస్తో పాటు బీజేపీ పాత్ర కూడా టీజీ వెంకటేష్ ఉందన్నారు. చంద్రబాబు ఒత్తిడి తేవడం వల్లే సీమాంధ్రకు ఆ మాత్రం ప్రోత్సకాలు తీసుకొచ్చేందుకు బీజేపీ పోరాడిందని చెప్పారు. చంద్రబాబు తమను టీడీపీలోకి ఆహ్వానించారని టీజీ తెలిపారు.
సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేసే సత్తా చంద్రబాబుకు ఉందని నమ్ముతున్నట్టు ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలును సీమాంధ్ర రాజధాని చేయాలని చంద్రబాబును కోరినట్టు వెల్లడించారు.