ganta srinivasa rao
-
లోకేశ్ సీఎం కావాలని కోరుకుంటున్నా: ఎమ్మెల్యే అతిథి
-
‘గంటా’ ఆస్తుల వేలం!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన బంధువులు రూ.వందల కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టిన కేసులో వారికి అప్పులిచ్చిన ఇండియన్ బ్యాంకు ఆస్తుల వేలానికి ఉపక్రమించింది. రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకునేందుకు వరుసగా డిమాండ్ నోటీసులు జారీచేసినా గంటా బ్యాచ్ పట్టించుకోకపోవడంతో తనఖా పెట్టిన వాటిలో పలు ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న బ్యాంకు వాటి వేలానికి రంగం సిద్ధంచేసి అందుకు సంబంధించిన తేదీని తాజాగా ప్రకటించింది. గంటా రుణాల ఎగవేత కేసులకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..విశాఖపట్నం వన్‌టౌన్‌లోని లక్ష్మీటాకీస్ వద్ద ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్ నం.047165తో 2005 ఆగస్టు 18న రిజిస్ట్రర్ అయ్యింది. రూ.500 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్ అప్ కాపిటల్‌తో ఈ సంస్థ ఏర్పడింది. కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా తోడల్లుడైన పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య, ప్రభాకరరావు ఉన్నారు. ఈ కంపెనీకి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నే అమూల్యలు హామీదారులుగా ఉన్నారు. కంపెనీ విస్తరణ పేరుతో డాబా గార్డెన్స్ శారదా వీధిలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఇవి పొందినప్పటి నుంచి ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒక దఫా తీసుకున్న రుణం తాలుకా బకాయిలు అక్షరాలా రూ.390.58 కోట్లుగా బ్యాంకు అధికారులు లెక్కగట్టారు. మరో దఫా రుణానికి సంబంధించి వడ్డీతో కలిసి రూ.141.68 కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయని ఇండియన్ బ్యాంకు జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. నోటీసులిచ్చినా బేఖాతరు.. ఆస్తుల స్వాధీనం..ఈ నేపథ్యంలో.. 2016 అక్టోబరు 4 నుంచి పలు దఫాలుగా బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేసి వడ్డీతో సహా కలిపి బకాయిలు చెల్లించాలని కోరారు. అయినాసరే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం.. మరోపక్క గడువు ముగియడంతో బ్యాంకు ఆస్తులు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. అయినప్పటికీ గంటా ముందుకు రాకపోవడం.. బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి ఏడు స్లాట్స్‌లో పూచీకత్తుగా పెట్టిన మరికొన్ని స్థలాల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి 18న బ్యాంకు నోటీసులు జారీచేసింది. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, కంపెనీ డైరెక్టర్లయిన పరుచూరి వెంకట భాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతో పాటుగా కంపెనీకి హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్య ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు మరికొన్ని ఆస్తుల వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటన జారీచేసింది. కాగా, గతంలోనే బ్యాంకు కొన్ని ఆస్తులను వేలం వేయగా.. ఇప్పుడు రూ.390 కోట్ల రికవరీకి బ్యాంకు మరిన్ని ఆస్తుల వేలం ప్రకటన జారీచేసింది.ఆగస్టు 8న ఈ–వేలం..ఈ ప్రకటనలో.. పద్మనాభం మండలం ఐనద గ్రామం వద్ద ఉన్న సర్వేనెం.12లో వీరికి స్టార్ విలేజ్ పేరున వుడా లేఅవుట్లోని 5,326.54 చ.గజాల విస్తీర్ణంలో ఏడు స్లాట్స్‌లో ఉన్న 33 ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు నోటీసుల్లో స్పష్టంచేసింది. వీటి విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, బ్యాంకు హెచ్చరిక జారీచేసింది. అదేవిధంగా రూ.390.58 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు గతంలో స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల విక్రయానికి కూడా మార్చి 18న బ్యాంకు మరోసారి నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో శనివారం ఇండియన్ బ్యాంకు ప్రకటనలిచ్చింది. మెస్సర్స్ ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో నగరంలోని గంగులవారి వీధిలో ఉన్న 274.65 చ.గజాల వాణిజ్య భవనం వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి రిజర్వ్ ధరగా రూ.2.56 కోట్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ద్వారకానగర్‌లోని అదే సంస్థ పేరుతో శ్రీశాంత కాంప్లెక్స్‌లో ఉన్న ప్లాట్ నం.138సీ లోని 2,500 చ.గజాల విస్తీర్ణంగల రెండు ప్లాట్లను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి రిజర్వ్ ధరగా 1.26 కోట్లుగా నిర్ణయించారు. ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలా.. ప్రాతిపదికన వేలంలో విక్రయిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఆగస్టు 8వ తేదీన గంటా అండ్ కో ఆస్తుల ఈ–వేలం పాట జరుగుతుందని ఇండియన్ బ్యాంకు పేర్కొంది.సంస్థకు డైరెక్టర్‌గా గంటా..నిజానికి.. పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఎమ్మెల్యే గంటా స్వయంగా తన బంధువులతో కలిసి ఈ కంపెనీ ప్రారంభించారని.. మొదట్లో గంటా కూడా డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారని తెలుస్తోంది. ఈ కంపెనీకే జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్మాణ బాధ్యతలను అప్పగించగా.. వ్యతిరేకత వ్యక్తంకావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో.. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన బంధువుల ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. -
గంటా ఆస్తులు వేలానికి పెట్టిన ఇండియన్ బ్యాంక్
-
బ్యాంక్‌కు బురిడీ.. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రెడీ
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇండియన్ బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేయడానికి ఆ బ్యాంక్ సిద్ధమైంది.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 409 కోట్లు రుణం తీసుకున్న గంటా అండ్ కో ఎగ్గొట్టింది.తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగష్టు 8న సంబంధిత ఆస్తులు వేలం వేస్తామని పత్రిక ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. లోన్‌కు టీడీపీ ఎమ్మెల్యే గంటా సహా మరో 8 మంది హామీదారులు ఉండగా, రుణాలు తీసుకోవడం.. తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడాన్ని టీడీపీ నేతలు అలవాటుగా చేసుకున్నారు. -
అనితకు చోటివ్వడంపై సీనియర్ల గుర్రు
కొలువు తీరిన కొత్త ప్రభుత్వం సీనియర్లకు షాక్ ఇచ్చింది. పార్టీకి సుదీర్ఘ సేవలందించిన నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఒక్కరికే స్థానం కల్పించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పలుదఫాలుగా మంత్రులు పనిచేసిన గంటా, అయ్యన్నతో పాటు మూడో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారి ఆశలపైనా నీళ్లు చల్లారు. మరోవైపు జనసేన నాయకులకూ ఇదే పరాభవం ఎదురైంది. గ్లాస్ కోటాలో మంత్రి పదవి ఆశించిన సీనియర్ నాయకుడు కొణతాల ఆశలూ గల్లంతయ్యాయి.సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు సహా 24 మంది మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మాత్రమే చోటు లభించడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుండగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనితకు ప్రాధాన్యమివ్వడంపై టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.అయ్యన్న, గంటాకు చెక్ !టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఒకసారి ఎంపీగా, ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మూడుసార్లు మంత్రిగా వ్యవహరించారు. ఈసారీ మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్న అయ్యన్నకు బాబు తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. మంత్రి వర్గంలో చోటు ఇవ్వకపోవడంపై అయ్యన్న కినుక వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒకసారి ఎంపీగా, ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు రిక్తహస్తాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటాకు చంద్రబాబు చెక్ పెట్టారు. అదేవిధంగా.. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఆశించిన వెలగపూడి రామకృష్ణబాబుకు పరాభవం ఎదురైంది. పలుమార్లు పార్టీ కోసం త్యాగాలు చేసి.. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజికవర్గం కోటాలో పల్లాకు రావాల్సిన మంత్రి పదవి కొలుసు పార్థసారధికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అయ్యన్నకు ఇవ్వాలా.. అచ్చెన్నకు ఇవ్వాలా అనే లెక్కల్లో చంద్రబాబు అచ్చెన్న వైపే మొగ్గు చూపడంతో అయ్యన్నపాత్రుడి వర్గం అధిష్టానం వ్యవహారశైలిపై గుర్రుగా ఉంది. మరోవైపు.. ఒకసారి మంత్రిగానూ, ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారు సత్యనారాయణమూర్తిని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. మూడోసారి గెలిచిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు మొండిచెయ్యి చూపించారు. పార్టీ కోసం విధేయంగా ఉన్న వారితోపాటు సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విశాఖ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.గాజు గ్లాసులోనూ అసంతృప్తి జ్వాలజనసేనలోనూ అదే అసంతృప్తి కనిపిస్తోంది. సీనియర్లుగా ఉన్నవారికి కాకుండా కొత్తగా ఎంపికై న వారికి ప్రాధాన్యమివ్వడంపై నాయకులు పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. నలుగురిలో ఒక్కరికై నా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఒక్కరికి ఇచ్చినా మిగిలిన ముగ్గురు మద్దతునివ్వాలని భావించారు. కానీ.. నలుగురికీ చంద్రబాబు, పవన్ ద్వయం మొండి చెయ్యి చూపించింది. సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణకు, పంచకర్ల రమేష్బాబులో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని భావించారు. కానీ.. వారిద్దరికీ అవకాశం కల్పించలేదు.అదేవిధంగా ఆరేళ్లు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉన్నా రాజీనామాతో త్యాగం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణకూ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో నిరాశలో ఉన్నారు. మొత్తంగా సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిన మంత్రివర్గ కూర్పుపై టీడీపీ, జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విశాఖ జిల్లాను విస్మరించడంపై ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అనిత కాపులతో వ్యవహరించిన తీరును... కాపు నేతలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. నాడు చెప్పుతో కొట్టి కేసులు పెట్టి వేధించిన అనిత... ఇప్పుడు ఓట్లు కావాలంటూ పైరవీలు చేస్తుండటం విమర్శలపాలవుతోంది. తమ సొంత సామాజికవర్గాన్ని వేధించిన అనితకు మద్దతుగా భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించడంపై ఆ వర్గాలు మండిపడుతున్నాయి. అనితను వ్యతిరేకించినందుకు ఏకంగా పార్టీ నుంచి కొద్దిమంది నేతలు సస్పెండ్ అయ్యారు.తమ వెనుక ఉండి నడిపించిన గంటా... తీరా తన సీటు కోసం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మళ్లీ అనితకు మద్దతివ్వాలంటూ పాయకరావుపేట నియోజకవర్గానికి వచ్చి మరీ చెప్పడాన్ని కాపులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు గంటా కాపు కాదని కాపునాడు తీవ్రంగా విమర్శలు చేసింది. కాపు సామాజికవర్గానికి పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకే తమ మద్దతని స్పష్టంగా ప్రకటించింది. మొత్తంగా తమ సామాజికవర్గాన్ని తీవ్రంగా అవమానించిన అనితతోపాటు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన గంటాకూ తమ దెబ్బ రుచి చూపిస్తామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనిత బాధితులెందరో...! ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత నియోజకవర్గంలోని నేతలందరిపైనా అధికారం చెలాయించారు. కాపు నేతలపై మరింత కక్షపూరితంగా వ్యవహరించారు. ఏకంగా కాపు నేతలను చెప్పుతో కొట్టడమే కాకుండా కేసులు బనాయించి మరీ వేధించారు. కాపుల మద్దతుతో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత మంగవరం గ్రామానికి చెందిన ఒక కాపు యువకుడ్ని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టారు. తనపై తప్పుగా వ్యాఖ్యలు చేశాడన్న ఆగ్రహంతో చెప్పుతో కొట్టి కాపు జాతిని ఘోరంగా అవమానించారు. మహిళా ఎమ్మెల్యేను కించపరిచే విధంగా మాట్లాడటం తప్పే కానీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఆ సామాజిక వర్గం పెద్దల సమక్షంలో మందలించడం దీనికి పరిష్కారం. ఇవేమీ చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేనన్న అహంకారంతో వ్యవహరించారు.చెప్పుతో కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అదే విధంగా ఆనాడు ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించిన కాపు సామాజికవర్గానికి చెందిన జనసేన సీనియర్ నేత గెడ్డం బుజ్జిపై అత్యాచారం కేసు పెట్టించింది. అతన్ని అరెస్టు చేయించడానికి తన అధికారాన్ని అంతా ఉపయోగించింది. బుజ్జికి చెందిన భూములపై సిట్‌కు ఫిర్యాదు చేసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బుజ్జికి అండగా నిలబడటంతో ఆయన అరెస్టు నుంచి బయటపడ్డారు. తన గెలుపునకు సహకరించిన మరో కాపు నేత తోట నగేష్ పట్ల కూడా ఆమె నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. అనిత ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ ఇద్దరు నేతలు తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నారు. అలాగే పట్టణానికి చెందిన మరో ఇద్దరు కాపు టీడీపీ నాయకులు గొర్లె రాజబాబు, మజ్జూరి నారాయణరావుల పట్ల కూడా అనిత కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ఈ ఇద్దరు నాయకులు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉండటం, వారు వేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కారణంగా వారిద్దరినీ గత ఏడాది పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది.గంటా మధ్యవర్తిత్వంపై కాపుల్లో ఆగ్రహం అనిత చేతిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న గెడ్డం బుజ్జి పలుసార్లు జనసేన సమావేశాలు ఏర్పాటు చేసి అనితకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, ఓడించి తీరుతామంటూ గతంలో ప్రకటనలు చేశారు. కాపులను చెప్పుతో కొట్టి... తమ నేతపై రేప్ కేసు పెట్టిందని పదే పదే బుజ్జి అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. బుజ్జి మెత్తబడడాన్ని కూడా ఆయన అనుచరులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తోట నగేష్ జనసేనలో చేరి అనితకు మద్దతుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటివరకు గంటా వర్గంగా ముద్రపడి... అనితను తీవ్రంగా వ్యతిరేకించిన గొర్లె రాజబాబు, నారాయణరావులు ఏకంగా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.అయితే గంటా వీరి మధ్య రాజీ కుదిర్చారు. ‘నీకు సీటు ఇవ్వాలంటే పాయకరావుపేటలో నీ వర్గాన్ని అనితకు మద్దతు ఇచ్చేలా చేయాల్సిందే’నంటూ చంద్రబాబు నుంచి గంటాకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన స్వార్థం కోసం తనను నమ్ముకున్న వారి మనోభావాలను సైతం పట్టించుకోకుండా గంటా వ్యవహరించాడంటూ ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గంటాది అసలు కాపు సామాజికవర్గమేనా అని కాపునాడు నేతలు నేరుగా ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు అత్యధిక సీట్లను కేటాయించిన వైఎస్సార్సీపీకి మద్దతిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. -
రఘురామ, గంటాకు బ్యాంకుల షాక్
సాక్షి, అమరావతి: రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఉండి, భీమిలి అసెంబ్లీ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు ఎన్నికలకు రెండు రోజుల ముందు బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఆస్తులను వేలం వేయడానికి నోటీసులు జారీ చేశాయి. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇందులో రూ. 826.17 కోట్ల రుణాన్ని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించారు. వడ్డీ కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారం తెలిసి బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో ఆయన మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బ్యాంకులు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో రూ.361.96 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) హైదరాబాద్ శాఖ పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇండ్ భారత్ థర్మల్‌కు చెందిన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులు రూ.180.98 కోట్లు, తమిళనాడు టూటికోరిన్లో ఉన్న 311.72 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాలు రూ.164.73 కోట్లు, కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఉన్న 129.73 ఎకరాలు రూ.11.74 కోట్లు, ఇతర సెక్యూరిటీలు, ఆర్థిక ఆస్తులకు రూ.4.51 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించింది. ఈ ఆస్తులకు సంబంధించిన జూన్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం వేయనున్నట్లు ఎన్సీఎల్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.రూ.400.37 కోట్లు ఎగవేసిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.400.37 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు చెందిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు ఈ రుణం తీసుకొని, ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంకు ఆస్తుల స్వా«దీనానికి రంగంలోకి దిగింది. విశాఖ నగరం గంగుల వారి వీధిలోని సర్వే నెంబర్ 13లో ఉన్న వాణిజ్య భవనాన్ని వేలానికి పెట్టింది. జూన్ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేలం జరుగుతుంది. ఈ భవనం రిజర్వు ధరను రూ.2.84 కోట్లుగా బ్యాంకు నిర్ణయించింది. -
రఘురామ, గంటాకు బిగ్ షాక్
విశాఖపట్నం, సాక్షి: ఎన్నికల వేళ.. తెలుగు దేశం పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాస్‌లకు భారీ షాక్ తగిలింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఈ ఇద్దరి ఆస్తుల వేలం కోసం వేరువేరుగా నోటీసులు జారీ అయ్యాయి.తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన భూములు, ప్లాంట్ ఆస్తుల్ని విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నోటీసు జారీ చేసింది. జూన్ 13 2024 లోపు ఈ ఆస్తులకు సంబంధించిన కొనుగోలు చేసేటువంటి వారు బిడ్డు దాఖలు చేయాల్సిందిగా సదరు ప్రకటనలో NCLT తెలిపింది. ఈ ఆప్షన్ కు పిలిచిన వాటిలో 311 ఎకరాల ఇన్డ్ భారత్ థర్మల్ పవర్ భూములు, కర్ణాటకలో హంకోన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి.అలాగే.. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు ఇన్ఫ్రా కంపెనీ రుణం తీసుకుంది. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీకి ఆస్తులు వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. బిడ్స్ దాఖలు చేసేందుకు జూన్ ఏడో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్.గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి నుంచి, రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘గంట’కు రూ.100.!
‘రండి బాబూ రండి.. గంటా వారి ప్రచారానికి వస్తే.. గంటకు వంద రూపాయలు. ఆలోచించినా ఆశాభంగం.. వచ్చి.. జై గంటా అంటే చాలు.. మీ చేతిలో వంద నోటు పెడతాం.. రండయ్యా.. ప్లీజ్..’ భీమిలిలో గంటా వర్గం తీరిదీ.. సాక్షి, విశాఖపట్నం : ఎవరైనా సరే.. ఎలాగైనా సరే.. నోటిస్తే.. ఓటేస్తారు.. ఇదే సిద్ధాంతంతో గత ఎన్నికల్లో మంది రాజకీయాలు చేసిన గంటా శ్రీనివాసరావుకు ఈ సారి భీమిలిలో చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఒక రేటు కట్టి గంపగుత్తగా బేరమాడి దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గంటాకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రచారానికి ప్రజలే కాదు.. సొంత పార్టీ కార్యకర్తలు.. జతకట్టిన బీజేపీ, జనసేన శ్రేణులు కూడా రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరో గంటలో ప్రచారం మొదలు పెట్టాల్సి ఉండగా.. గంటా గ్యాంగ్ రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. ఎవరు కనిపించినా.. బాబూ.. రండి.. గంట సేపు జెండా పట్టుకొని మా ప్రచారంలో నడవండి. గంటకు ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉండొద్దు. గంట కొట్టగానే.. మీ చేతిలో వంద పెడతాం.. మీకు ఇచ్చిన జెండా మా చేతిలో పెడితే చాలూ.. బాబ్బాబూ.. అమ్మా.. రండమ్మా.. అంటూ బతిమాలుకుంటూ తీసుకొస్తున్నారు. గంట సేపు ప్రచారం మరో పావుగంటలో ముగుస్తుందనగా.. సెకండ్ బ్యాచ్ కోసం వెతుకులాటలు ప్రారంభిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ జరుగుతుండటంతో గంటా గ్యాంగ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వచ్చిన వారితో గంపగుత్త బేరాలు కూడా మాట్లాడుకుంటున్నారు. చెప్పిన టైమ్‌కి ప్రతి రోజూ వస్తే.. రోజూ డబ్బులిస్తామని బతిమాలుకుంటున్నారు.నోటు చూపిస్తే.. వాళ్లే వస్తారులే.. ప్రచారానికి జనం దొరకడం లేదనీ.. గంటా శ్రీనివాసరావు ప్రచారానికంటే మేము రామంటే రామని తెగేసి చెబుతున్నారని గ్యాంగ్ లీడర్లు.. గంటా దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ‘ఎందుకు రారు.. నోట్లు చూపించండి.. వాళ్లే.. తోకలూపుతూ వచ్చేస్తారు. గంటకు వంద కాకపోతే.. మరో యాభై కలపండి.. అప్పటికీ కాదంటే.. ఇంకో వంద ఇస్తామని చెప్పండి.. గెలిచిన తర్వాత.. భీమిలి మొత్తం మనదే కదా.. ఇచ్చిన వందకు వందరెట్లు లాగేద్దామని’ తన అనుచరులతో గంటా చెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఎరవేస్తున్నా ప్రచారానికి రాకపోవడంతో గంటా ప్రలోభాలు మితిమీరేలా చేస్తున్నాడు.కేసులు నమోదవుతున్నా... మరోవైపు ప్రచారానికి జనం రాకపోవడంతో కొడుకు, తన గ్యాంగ్‌ను వివిధ ప్రాంతాలకు పంపించి ప్రచారం చేయిస్తున్నారు. జనం తనతో కలిసి నడవకపోవడంతో దేవాలయాలు, మసీదుల దగ్గరికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రోడ్లను బ్లాక్ చేసి దారినపోతున్న ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్.. గంటా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా.. పదే పదే కోడ్ ఉల్లంఘిస్తూ.. ప్రజల్ని మభ్య పెట్టేందుకు అడ్డమైన వ్యవహారాలు నడిపిస్తున్నారు. గెలుపు కష్టమని తెలిసినా.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న గంటా ప్రలోభాల పర్వంపై భీమిలి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. -
గంటా శ్రీనివాసరావుకి షాక్ భీమిలి వైఎస్సార్సీపీ లో భారీ చేరికలు
-
గంటా.. ఒక భార్య.. రెండు పాన్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలుకు మరో పాన్ అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్‌ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్‌ను కూడా దాఖలు చెయ్యలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్‌ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. -
గంటా కుమారుడిపై కేసు నమోదు
మధురవాడ : భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, టీడీపీ నాయకులు నమ్మి శ్రీను, జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ తండ్రి, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు తదితరులపై పీఎంపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా గురువారం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపే నెపంతో శివశక్తినగర్ రోడ్డులోని సద్గురు సాయినాథకాలనీలోలో ఉన్న మసీద్–ఇ– ఫిర్ధౌస్లో పార్టీ కండువాలు ధరించి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ల ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అతికించి స్వీట్స్బాక్స్లు పంపిణీ చేశారు. వీటిని స్వయంగా గంటా కుమారుడు రవితేజ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను తదితరులు పంపిణీ చేశారు. దీనిపై‘సాక్షి’ దినపత్రికలో ‘టిడీపీ బరితెగింపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. భీమిలి హారి్టకల్చర్ ఆఫీసర్, నియోజకవర్గ ఎంసీసీ టీమ్–4 ఇన్చార్జ్ ఆర్పీ స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. గంటా బావమరిదిపై చర్యలు తీసుకోవాలి ఈ పంపిణీ వ్యవహారంలో గంటా బావమరిది జీవన్ కుమార్‌తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వీరు పేర్లు ఫొటోలు కూడా పత్రికలో ప్రచురితమయ్యాయి. అయితే వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదని విమర్శలు వస్తున్నాయి. మరింత లోతుగా విచారణ చేసి కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
Bheemili: భీమిలి భూములపై కన్నేసిన గంటా శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం : భీమిలి భయపడుతోంది.. 2014 నుంచి ఐదేళ్ల పాటు వారి చెరలో చిక్కుకున్న భూమాత మళ్లీ.. చిగురుటాకులా వణికిపోతోంది. భూచోళ్లు అంతా కలిసి వస్తున్నారని సంకేతాలతో జనం గుండెలు అదురుతున్నాయి. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన అక్రమార్కులు అధికారం అండ ఉన్న బంధువులు కుమ్మక్కై కనిపించిన జాగాలన్నీ కబ్జా చేసిన ఘనులకు సూత్రధారిగా నిలిచిన గంటా శ్రీనివాసరావు కన్ను ఇప్పుడు భీమిలిలో మిగిలిన భూములపైనా పడింది. అందుకే పట్టుబట్టి మరీ భీమిలి టికెట్ సాధించి ఇప్పుడు భూ కబ్జారాయుళ్లనంతా పోగేసుకుంటున్నారు. ఒకప్పుడు దేశంలోనే రెండోదిగా, ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి పురాతన మున్సిపాలిటీగా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత భీమిలికి 2014–19 కాలంలో కొత్త పేరుని తీసుకొచ్చారు గంటా అండ్ కో. కాదేదీ కబ్జాకనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తూ, భీమిలికి ఉన్న మంచి పేరుని కాస్తా చెరిపేసి.. భూకబ్జాల భీమిలిగా మార్చేసి.. నియోజకవర్గ పరువుని బంగాళాఖాతంలో కలిపేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు భీమిలి నియోజకవర్గంలో పాగా వేసిన గంటా ఆక్రమించిన భూముల లెక్క రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సహజంగా ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా నిజమైనా... అనిపిస్తుంది.. కానీ ఆయన అల్లుడుతో పాటు బినామీలు, టీడీపీ తోడేళ్లు ఐదేళ్ల పాటు ఇదే పనిలో ఉండి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మింగేశారనేది ఆ ప్రాంతంలో ఎవరిని కదిపినా బయటకు వచ్చే వాస్తవం. వాటిలో కొన్ని మచ్చుకు పరిశీలిద్దాం.. సీలింగ్ భూముల కథ ఇదీ.. నిరుపేదలకు పంచిపెట్టాల్సిన సీలింగ్ భూములను చుట్టేసేలా గంటా అండతో అతని అల్లుడు, బినామీలు కలిసి భూదందా చేశారు. ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి చెందిన కోరాడ వెంకటస్వామినాయుడు 1973 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం తమ కుటుంబం పేరిట ఉన్న 45.59ఎకరాల మిగులు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. 1975వ సంవత్సరంలో ఆయన ఇచ్చిన భూ వివరాలను పరిశీలించిన ల్యాండ్ సీలింగ్ అథారిటీ ఆ భూముల అప్పగింతపై ట్రిబ్యునల్ తీర్పు (ఎల్సీసీ 230బై75) ఇచ్చింది. ఈ మేరకు విశాఖ రూరల్ మండలం మధురవాడలో సర్వే నంబర్ 262/4, 263/æ2, 276/1, 278, 276/2, 277/2, 329, 262/3, 277/1కి సంబంధించి 28.84ఎకరాలు, ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో 1.66ఎకరాలు, ఆనందపురం గ్రామంలో 6.81ఎకరాలు, వెల్లంకి గ్రామంలో 8.28ఎకరాల భూముల వివరాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఇక్కడ వరకు అంతా సాఫీగానే జరిగినా కోరాడ వెంకటస్వామినాయుడు మృతి తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన కుటుంబీకుల్లో కొందరు ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములను సైతం అడ్డగోలుగా విక్రయించేశారు. మధురవాడ పంచాయతీ పరిధిలో ఇచ్చిన 28.84ఎకరాల భూమిని కోరాడ వారసులు కృష్ణా కో–ఆపరేటివ్ సొసైటీకి విక్రయించారు. ఈ వ్యవహారంపై అప్పటి చినగదిలి ఎమ్మార్వో ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కోరాడ వారసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం ఆ భూములను విక్రయించేశామని, అందుకు బదులుగా తమకు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ బంటుపల్లి వారి కల్లాలు గ్రామంలో ఉన్న 28.80ఎకరాల (సర్వే నంబర్లు 39/1, 39/2) భూమిని అప్పజెబుతామని కోర్టును అభ్యరి్థంచారు. ఈమేరకు కోర్టు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలుచేసి ఆ భూమిని స్వా«దీనం చేసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు తాత్సారం చేశారు. దీంతో ఆ వారసులు మరోసారి ఆ భూముల్లో కొన్ని ఎకరాలను 2006లో విక్రయించేశారు. సర్వే నంబర్ 39/1, 39/5ఏలో 11.8ఎకరాల భూమిని విక్రయించేశారు. అదేవిధంగా వెల్లంకి గ్రామంలో ప్రభుత్వానికి ఇచ్చేసిన 1.14ఎకరాల భూమిని తిరిగి గారిపేట వాస్తవ్యుడు కోరాడ అప్పలస్వామి, రాములకు విక్రయించేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా, ఆ భూమికి బదులు సర్వే నంబర్ 263/2, 264/16లోని 1.14 ఎకరాలు అప్పగించారు. మళ్లీ 263/æ2 లోని 0.34ఎకరాల భూమిని అమ్మేశారు. మొత్తంగా 30 ఎకరాల పంపిణీకి సంబంధించిన పక్కా వివరాలు లేకున్నా కోరాడ కుటుంబీకులు మాత్రం ఇప్పటికే తాము 34.45ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వానికి అప్పగించామని లెక్క కట్టేశారు. ఇంకా తాము 11.14ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని తేల్చేశారు. ఆ 11.14ఎకరాల భూపంపిణీకీ ఇంకో మతలబు పెట్టారు. గతంలో తాము ఆనందపురం గ్రామంలో అప్పజెప్పిన 4.15ఎకరాలు రెండుపంటలు పండే భూమి అని పేర్కొన్నారు. పంటలు పండే భూమి, మిగులు భూముల నిష్పత్తి 1:2 ప్రకారం.. 11.14 ఎకరాల్లో 4.15 ఎకరాలను మినహాయించాలని ప్రతిపాదించారు. ఈ లెక్కన తాము కేవలం 6.63ఎకరాల భూమి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, ఆ భూమి కూడా నర్సీపట్నం పరిసరాల్లోని భూములను ఇస్తామని ప్రతిపాదించారు. ఈ లెక్కన కల్లాలు గ్రామంలోని 11.14ఎకరాల భూమిని తమకు మినహాయించాలని ప్రభుత్వానికి నివేదిస్తూ జిల్లాకోర్టులో కేసు వేశారు. అల్లుడు రంగప్రవేశంతో.. కోర్టు విచారణ పూర్తికాకున్నా ఈలోగా గంటా అల్లుడు రంగంలోకి దిగారు. కోరాడ వారసులకు, అల్లుడికి మధ్య టీడీపీ నాయకులు కోరాడ నాగభూషణం, గాడు వెంకటప్పడు, ఇతర నేతలు మధ్యవర్తిత్వం నెరిపారు. అధికారికంగా పేర్కొంటున్న 11.14ఎకరాలతో సహా తొక్కిపెట్టిన 30ఎకరాలపైగా భూమికి సంబంధించి ఒక్క గజం కూడా ఎవ్వరికీ పంపిణీ చేయకుండా వీళ్లే పంచేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. అంతే కాదు.. గంటా భీమిలి ఎమ్మెల్యేగా.. మంత్రిగా నియోజకవర్గానికి ఏమీ వెలగబెట్టకపోయినా.. అడ్డగోలు సంపాదనకు మాత్రం తెరతీశారు. అనుచరగణంతో కలిసి భూ దందాలతో రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.కోట్ల రుణాలు పొందినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. వెలుగులోకి రాని భూబాగోతాలెన్నో.. మళ్లీ.. అదే గ్యాంగ్‌తో హల్ చల్.! భీమిలిలో గంటా గ్యాంగ్ చేసిన అక్రమాలు, ఆక్రమణలు, కబ్జాలతో ప్రజలంతా విసిగిపోయారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని భూ కబ్జాల కేంద్రంగా మార్చిన గంటాకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రజలంతా డిసైడైపోయారు. విషయం తెలుసుకున్న గంటా.. నియోజకవర్గం నుంచి పారిపోయి ఉత్తరం పంచన చేరారు. ఆయన అనుచరగణం.. చెట్టుకొకరు.. పుట్టకొకరుగా వేరైపోయారు. ఐదేళ్లు గడిచిన తర్వాత ప్రజలు అంతా మర్చిపోయి ఉంటారని భావించిన గంటా.. తిరిగి భీమిలికి చేరుకున్నారు. వచ్చిందే తడవుగా.. తన కబ్జాల అనుచరగణాన్ని చేరదీసుకుంటున్నారు. టీడీపీలో సస్పెండ్‌కు గురైన కబ్జా గ్యాంగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసేస్తూ.. మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. గాడు వెంకటప్పడు, కోరాడ నాగభూషణరావు తదితర బ్యాచ్‌ను పోగేసుకుంటున్నారు. గంటా బాబా.. అరడజను దొంగల మాదిరిగా.. దొంగల ముఠా అంతా ఒక చోట చేరుతుండటంపై భీమిలి ప్రజలు మళ్లీ అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇంక ఆక్రమించేందుకు ఏమున్నాయని వాపోతున్నారు. అయినా డబ్బులు ఎరవేసి, భయపెట్టి.. బెదిరించి.. ఎలాగైనా గెలవాలని భావిస్తున్న గంటా.. గెలిస్తే భీమిలిలో ఉన్న కొద్ది పాటి భూములను సైతం తన గ్యాంగ్‌తో కలిసి కాజేయ్యాలన్న కుట్రతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అందలం ఇస్తే.. భీమిలిని సర్వనాశనం చేస్తారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. -
భలే మంచి లంచ్ బేరం
సాధారణంగా ఒక హోటల్లో లంచ్ చేస్తే సుమారు రూ.500 బిల్లు అవుతుంది.. అదే స్టార్ హోటల్ అయితే రూ.1000 నుంచి రూ.1500. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ నేతల ఇళ్లల్లో మాత్రం లంచ్ ఖరీదు రూ.లక్షల్లోనే ఉంటుంది. లంచ్ ఒక్కటే కాదు.. టీ, టిఫిన్, డిన్నర్ ఏదైనా చాలా ఖరీదు చేసేశారు. ఇంతకీ ఈ లక్షల రూపాయల లంచ్ గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక సమరం సమీపిస్తున్న తరుణంలో ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఓట్ల రాజకీయంతో పనికాదని గ్రహించి.. నోట్ల రాజకీయాలకు తెర తీసింది. ప్రత్యర్థి పార్టీ నేతలను లంచ్, డిన్నర్‌కి పిలిచి బేరాలు పెడుతోంది. సర్పంచ్ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి వరకూ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు నిర్ణయించేస్తోంది. ఇందులో సిద్ధ హస్తుడుగా ఉన్న గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకొని.. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు ఇదే ఫార్ములా అవలంబిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను సంతలో పశువుల్లా బేరాలాడి కొనేస్తే చాలని లెక్కల్లో తలమునకలయ్యారు. లంచ్, డిన్నర్ పేరుతో లక్షలు ముట్టజెబుతున్నారు. గంటా రూటే సేపరేట్ టీడీపీ పెద్దల కాళ్లా వేళ్లా బతిమాలి ఎట్టకేలకు భీమిలి టికెట్ సాధించుకున్న గంటాకు ఎన్నికలంటే డబ్బుతో గెలవడమే అనే నైజం. ప్రజలన్నా నాయకులన్నా ఆయన దృష్టిలో ఓటును, వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనస్తత్వం కలవారు. రూ.500కి వెయ్యకపోవచ్చు.. రూ.వెయ్యికి వెయ్యకపోవచ్చు.. రూ.2 వేలు.. ఇలా.. ఏదో ఒక నంబర్ దగ్గర ఓటరు తనకు లొంగుతారనే విర్రవీగే మనస్తత్వంతో రాజకీయాలు చెయ్యడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఇదే మాదిరిగా చోటా మోటా నాయకులకు సైతం వెలకడుతున్నారు. గంటా ఒక్కరే కాదు టీడీపీ నుంచి టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్క నాయకుడూ ఇదే రీతిలో ఆలోచిస్తూ రాజకీయాలి్న, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. విలువలు అమ్ముకుంటూ రాయ‘బేరాలు’ వెన్నుపోటు రాజకీయాలు మొదలైనప్పటి నుంచి విలువలను విడిచిపెట్టి అడ్డగోలుకు కేరాఫ్‌గా మారిపోయింది టీడీపీ. అంతా ఆ తాను ముక్కలే అన్నట్లుగా పార్టీలలో ఉన్నవారంతా కనీస విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు. డబ్బుతోనే ఏదైనా సాధ్యమనే అహంకారంతో విర్రవీగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు తమ ఇంటికి లేదా సమీపంలో ఉన్న ఓ హోటల్‌కి భోజనానికి ఆహ్వానించడం.. రాయ‘బేరాలు’ మాట్లాడుకోవడమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. బేరం కుదిరిన వెంటనే చోటా నేతలు కండువాలు కప్పేసుకుంటున్నారు. ►చోడవరంలో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు ఇటీవలే పలువురు ప్రత్యర్థి పార్టీ నేతలను నోట్ల కట్టలతో కొనుగోలు చేసుకున్నారు. ►పాయకరావుపేటలో వంగలపూడి అనిత.. ఓ హోటల్లో సామాజికవర్గ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులను ఆత్మీయ సమావేశం పేరిట ఆహా్వనించారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతూ సర్పంచ్‌కు రూ.2 లక్షలు, ఎంపీటీసీ సభ్యుడికి రూ.5 లక్షలు, 100 ఓట్లు ప్రభావితం చేసే సామాజికవర్గ నాయకుడికి రూ.5 లక్షలకు బేరం పెట్టేసుకున్నారు. ►పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు సైతం అదే రాయబేరాలు సాగిస్తున్నారు. ఈయన రూ.లక్ష నుంచి తన బేరాలు మొదలు పెడుతున్నారు. ►ఇవి కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గడపగడపకు వెళ్లి ప్రజలకు ఇంకా అందించాల్సిన మౌలిక సదుపాయాలు, వారి అభిప్రాయాలు సేకరిస్తుంటే.. టీడీపీ అభ్యర్థులు మాత్రం.. నేతల కొనుగోలులో బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.2 కోట్లకు డీల్..! భీమిలి నియోజకవర్గంలో జరిగిన బేరం ఖరీదు అక్షరాలా రూ.2 కోట్లు. ఇక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుడి మద్దతును టీడీపీ నేతలు కోరారు. అతడు ఒప్పుకోలేదు. బతిమలాడారు.. లంచ్, డిన్నర్‌కు ఆహా్వనించారు. పనవ్వలేదు. స్వయంగా వాళ్లే భోజనానికి వెళ్లారు. అర కోటి నుంచి బేరం మొదలైంది... చివరికి రూ.2 కోట్లకు డీల్ కుదిరింది. అక్కడికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే భీమిలిలో ఓ జెడ్పీటీసీ సభ్యుడికి రూ.10 లక్షల ధర పలికింది. మరికొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు బేరాలు కుదిరినట్లు తెలిసింది. కొంతమంది మాజీ నేతలు, పలుకుబడి ఉన్న నేతలకు కూడా మరో రేటు ఫిక్స్‌చేసినట్లు సమాచారం. సీఎం రమేష్ రాకతో పెరిగిన రేట్లు 300 మంది రౌడీ మూకలను వెంటబెట్టుకొని అనకాపల్లిలో అడుగుపెట్టిన మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ నేత సీఎం రమేష్ రాకతో.. ఆయా ప్రతినిధులు తమ రేట్లను అమాంతం పెంచేసుకుంటున్నారు. తమను నమ్ముకొని ఉన్న ప్రజలను పక్కన పెట్టేసి.. తమకింత ఇస్తే చాలు.. మీ పార్టీ కండువా కప్పేసుకుంటామంటూ బేరాలాటలో మునిగితేలుతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బులకు అమ్ముడుపోయి.. పార్టీ కండువాలు మార్చేసుకుంటూ.. టీడీపీ పంచన చేరుతున్న నేతలను చూసి జనం ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారినా మనం సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపించామా అని అసహ్యించుకుంటున్నారు. -
ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం ఆయన స్పెషల్
ప్రజల విశ్వాసం పొందిన రాజకీయ నాయకులు జీవితాంతం ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుంటారు. కొందరు నాయకులు అయితే ప్రతి ఎన్నికకు నియోజకర్గాన్ని మారుస్తుంటారు. గెలిచిన చోట ప్రజలకు ఏమీచేయని వారు భయపడి మరో నియోజకవర్గం వెతుక్కుంటారు. టీడీపీలో ఓ నేత ఉన్నాడు. దక్షిణ కోస్తా నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడ తిష్ట వేశాడు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం, అధికారం కోసం పార్టీల మార్పిడి ఆయన నైజం. ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలసవచ్చిన గంటా శ్రీనివాసరావు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి పోర్టు కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తి వేల కోట్లకు పడగలెత్తారు. బాగా సంపాదించాక రాజకీయాలపై ఆసక్తి పెరిగి తెలుగుదేశంలో చేరి 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోని గంటా 2004లో అనకాపల్లి ఎంపీ సీటు వదిలేసి 2004లో చోడవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో టీడీపీని వదిలేసి..ప్రజారాజ్యంలో చేరి ఈసారి అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పదవి అనుభవించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదృశ్యం కావడంతో మళ్ళీ టీడీపీ గూటికి చేరి ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. చదవండి: ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు? రాజకీయాల్లోకి వచ్చాక జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు చోట్ల నుంచి గంటా పోటీ చేశారు. ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం గంటా శ్రీనివాసరావు స్పెషల్ అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. 2014లో భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా అనుభవించిన గంటా శ్రీనివాసరావు అసలా నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అన్న విషయమే మర్చిపోయారు. దీంతో భీమిలి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక భీమిలిలో మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని అర్థం చేసుకున్న గంటా 2019లో విశాఖ సిటీలోని నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. 2019లో భీమిలిని వదిలేసి విశాఖ నార్త్‌లో పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న గంటా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు. అయినా సరే అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. తనకున్న ఏరుదాటాక తెప్ప తగలేసే అలవాటు ప్రకారం విశాఖ నార్త్ నియోజకవర్గంను మర్చిపోయారు. ఐదేళ్ళ కాలంలో తనను గెలిపించిన ప్రజలకు కనీసం మొహం కూడా చూపించలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభించినపుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గంటా శ్రీనివాసరావు కనిపిస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో గంటా ఈసారి మళ్లీ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కున్నారు. పదేళ్ళ క్రితం తనను గెలిపించిన భీమిలి నియోజకవర్గంపై మళ్ళీ కన్నేశారు. అక్కడి ప్రజలకు తనపై కోపం పోయింటుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు వందల కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి భీమిలి సీటు సంపాదించుకున్నారు. సీటు కొనుక్కోవడానికి ఎంతైనా పార్టీ ఫండ్ ఇవ్వడం.. గెలవడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడం అలవాటైన గంటా శ్రీనివాసరావు భీమిలి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు. అధికారం అడ్డం పెట్టుకొని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటా శ్రీనివాసరావుది. తీసుకున్న అప్పు.. వడ్డీతో కలిపి 400 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో గంటా తనకా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఇటీవల ఇండియన్ బ్యాంక్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు గంటాకు సీటు ఇవ్వడంపై భీమిలిలోని జనసేన, టిడిపిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మొదట ఈ సీటు జనసేనకే అని ప్రకటించారు. దీంతో అక్కడి జనసేన నేతలు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంటా చంద్రబాబు, పవన్‌లను డబ్బుతో కొట్టి సీటు తన్నుకుపోవడంతో భీమిలి నేతలు బహిరంగంగానే తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. జనసేన సీటు వచ్చిందని భావించి భంగపడ్డ పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఔ పవన్ తీరుతో జనసేన కార్యకర్తలమని చెప్పుకునేందుకే సిగ్గేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పుడు భీమిలిలో గంటాకు..అటు టీడీపీ నుంచి..ఇటు జనసేన నుంచి సహాయ నిరాకరణ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంటాకు సీటు విషయంలో పునరాలోచన చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. -
Bheemili: టీడీపీలో సీట్లకు వేలంపాట.. చంద్రబాబుపై కోరాడ రాజబాబు ఫైర్
సాక్షి, విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావుపై భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు మండిపడ్డారు. మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా పాల్పడ్డారని దుయ్యబట్టారు. గంటా ఒక అవినీతిపరుడు. గంటా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు?. నాలుగేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు. డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు. టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు. యువతకి 40 శాతం సీట్లు ఇస్తామన్నారు. స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు’’ అని రాజబాబు ప్రశ్నించారు. -
‘ఉత్తర’ కుమారుడు.. మళ్లీ భీమిలికి..
సాక్షి, విశాఖపట్నం: ఆయనో రాజకీయ సంచారజీవి.. పిల్లిపిల్లలను మార్చిన చందంగా ఎన్నికలకో నియోజకవర్గం మారుస్తూ.. పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో ప్రజల్ని ఏమారుస్తూ.. గెలిచిన తర్వాత.. ఓటర్లను మోసం చేస్తూ.. చివరి నిమిషంలో అక్కడి నుంచి జంప్ అయిపోతారు. ఎన్నికలకో సెగ్మెంట్ మారుస్తున్న గంటా శ్రీనివాసరావు అడ్డగోలు సంపాదన, స్థిర, చరాస్థులను కూడబెట్టడంలో మాత్రం ఏకరీతినే దూసుకుపోయారు. నిన్న మొన్నటి వరకూ టికెట్ కోసం అధిష్టానం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే స్థితికి చేరుకున్న గంటాకు.. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పగా.. చివరికి బతిమాలుకొని భీమిలి టికెట్ సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో తన వలస రాజకీయంతో మరోసారి భీమిలి ప్రజలను మోసం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి ఓ దినపత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. చిరుద్యోగిగా ఆదాయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా.. ఆ తర్వాత షిప్పింగ్ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు. 1999లో అనూహ్య రీతిలో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజానికి 1999లో ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితం మొదలుపెట్టినా.. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనమైన పరిణామాల నేపథ్యంలో 2011లో తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి క్రమక్రమంగా ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో గంటాకు మళ్లీ మంత్రి పదవి రావడం దరిమిలా మొదలైన అవినీతి, అక్రమార్జన పర్వం, దోపిడీ పరాకాష్టకు చేరుకుంది. అంతులేని గంటా గ్యాంగ్ దందాలు ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా లెక్క చెయ్యకుండా.. అవినీతిని కొనసాగించడమే గంటా స్టైల్. గంటా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉంటున్న బహుళ అంతస్తుల భవంతితో పాటు.. ప్రత్యూష పేరుతో కంపెనీ స్థాపించి.. రూ.200 కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టేశారు. దీంతో సదరు ఇండియన్ బ్యాంకు గంటా అండ్ కో అడ్డగోలుగా సంపాదించిన పలు స్థలాల్ని వేలం వేస్తుండగా.. మరికొన్ని స్థలాల్ని స్వా«దీనం చేసుకుంది. గంటా దోపిడీ పర్వాన్ని మొత్తం లెక్క కడితే రూ.వందల కోట్లపైనే ఉంటుందని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకూ గంటా గ్యాంగ్ భీమిలిలో సాగించిన భూదందాలతో మళ్లీ అక్కడ మొఖం చూపించలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. నమ్ముకొని ఓటేసిన భీమిలి ప్రజలకు ఏమాత్రం మంచి చెయ్యకుండా కనిపిస్తే కబ్జా పేరుతో దందా సాగించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో విశాఖలో భూ దందాలకు తెగబడినప్పుడు కీలక సూత్రధారి గంటాయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటా శ్రీనివాసరావే భూదొంగ అంటూ అదే పారీ్టకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా సిట్‌కు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టడంతో తరుణంలో భీమిలి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గంటా నిర్ణయించుకున్నారు. ఓటేసిన జనాన్ని లెక్క చేయని గంటా.. తాను చేసిన అక్రమాలు, అవినీతి పనులు బట్టబయలు కావడంతో 2019 ఎన్నికల్లో భీమిలి ప్రజలు ఛీకొడతారని ముందుగానే ఊహించిన గంటా.. వ్యూహాత్మకంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తర సీటును దక్కించుకున్నారు. ఎలాగోలా భీమిలి నుంచి బయటపడి టికెట్ తెచ్చుకున్న గంటా.. ఎన్నికల సమయంలో ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని మోసపూరిత హామీలతో మభ్యపెట్టారు. పోలింగ్ సమయంలో చివరి నిమిషంలో బర్మాక్యాంపు తదితర కొండవాలు ప్రాంతాల్లో దొంగ ఓట్ల వ్యవహారంతో గట్టెక్కి విజయం సాధించారు. అంతే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేటి వరకూ ఉత్తర ప్రజలకు ఒక్కసారైన మొహం చూపించకుండా ఎంవీపీలోనే తిష్టవేసుక్కూర్చున్నారు. తాము ఓటేసి గెలిపించిన పాపానికి తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన చెందుతున్న నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు అండగా నిలబడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈసారి ఉత్తరంలో పోటీ చేస్తే.. ఓటమి తప్పదని భావించిన గంటా.. మరోసారి భీమిలికి వెళ్లిపోవాలని అక్కడి నేతలతో మంతనాలు ప్రారంభించారు. గెలుపొందిన చోట్ల దోపిడీకి పాల్పడే గంటా చేతిలో మరోసారి తాము మోసపోయే స్థితిలో లేమని భీమిలి ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. అయినా నిస్సిగ్గుగా భీమిలిని దోచుకునేందుకు గంటా మళ్లీ బయలుదేరడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆస్తుల వేలంకు... గంట కొట్టేశారు
చీపురుపల్లి: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్న చందగా చీపురుపల్లి టీడీపీ శ్రేణుల పరిస్థితి మారింది. గంటా వస్తారు.. డబ్బు సంచులు తెస్తారు.. వాహనాలు ఇస్తారు.. కావాల్సినవన్నీ సమకూర్చుతారని ఆశగా ఎదురు చూశారు. ఊహాలోకంలో విహరించారు. ఇప్పుడు గంటా ఆస్తుల వేలంపాటకు బ్యాంకులు గంట మోగించడంతో.. ఎదురు చూపులన్నీ గాలిలో కలిసినట్లేనా.. సంభాషణలన్నీ నీటి మీద రాతలేనా... అయ్యో ఎంతపనైపోయిందంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. చీపురుపల్లిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై పోటీకు విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వెళ్లమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గంటా వస్తే.. డబ్బుకు కొదవ ఉండదు.. ఎంతకావాలంటే అంత నొక్కేయవచ్చు అని గత కొంత కాలంగా కొందరు నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురుచూశారు. తాజాగా గంటాకు చెందిన ఆస్తుల వేలంకు ఇండియన్ బ్యాంక్ శుక్రవారం నోటీసులు ఇచ్చిందన్న వార్త తెలియడంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఏదో అనుకున్నాం గానీ పారాచ్యూట్ నేత ఇంతటి ఘనుడా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. బయటకు పెద్ద మనిషిలా కనిపించినా బ్యాంకులకు సకాలంలో డబ్బులు చెల్లించని పెద్ద మనిషి అనుకోలేదంటూ రచ్చబండలపై మాట్లాడుకోవడం గమనార్హం. ‘గంటా’ ఆస్తుల వేలంకు నోటీసులు.... విశాఖపట్టణంలోని వన్‌టౌన్‌లో ప్రత్యూష రిసోర్స్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ప్రారంభ సమయంలో డైరెక్టర్‌గా కొనసాగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం హామీదారునిగా ఉన్నారు. ఈ కంపెనీ ఇండియన్ బ్యాంక్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒక దఫా తీసుకున్న రుణం రూ.390.58 కోట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. తిరిగి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో పలు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆస్తులను ఏప్రిల్ 16న వేలం వేయనున్నట్టు ఈ నెల 18న ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ఐవీఆర్ఎస్తో ఫేక్ సర్వేలకు దిగిన పారాచ్యూట్ బ్యాచ్.. ఇదిలా ఉండగా బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి, ఆస్తుల వేలం వరకు వచ్చిన పారాచ్యూట్ బ్యాచ్ రాజకీయాల్లో కూడా ఫేక్ సర్వేలకు దిగింది. పారాచ్యూట్ నేత గంటా శ్రీనివాసరావు చీపురుపల్లిలో బొత్సపై పోటీ చేసే ధైర్యం లేక సర్వేలు ద్వారా మంత్రి బొత్స ఇమేజ్ను తెలుసుకునేందుకు పన్నాగం పన్నారు. దీని కోసం పారాచ్యూట్ బ్యాచ్ ఫేక్ ఐవీఆర్ఎస్ సర్వేను చేపట్టినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులు ఐవీఆర్ఎస్ ద్వారా బొత్స సత్యనారాయణకు ఓటు వేయాలంటే ఒకటి నొక్కండి.. లేదంటే రెండు నొక్కండి అంటూ ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో మంత్రి బొత్సకు సంపూర్ణ మద్దతు లభించడంతో పారాచ్యూట్ బ్యాచ్‌తో బాటు నేత కూడా కంగుతిన్నట్టు సమచారం. ఐవీఆర్ఎస్లో వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ ఒకటే నొక్కడంతో ఏం చేయాలో వారికి తోచలేదు. మొత్తానికి చీపురుపల్లిలో గంట మోగించలేమన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. -
భీమిలిలో గంటాపై IVRS సర్వే
-
గంటా శ్రీనివాస్ దారెటో తేలిది ఇవాళే!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారా?.. లేదంటే అయిష్టంగానే ఆ పార్టీలో కొనసాగుతారా? తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చర్చే ప్రధానంగా నడుస్తోంది. చీపురుపల్లిలో పోటీ తన వల్ల కాదని గంటా చెబుతున్నా.. చంద్రబాబు మాత్రం పోటీ చేయాల్సిందేనని తేల్చేశారు. దీంతో ఆయన ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు నన్ను సరైన అభ్యర్థిగా పార్టీ భావించింది. చీపురుపల్లిలో సీనియర్ లీడర్‌పై పోటీ చేస్తే బాగుంటుందని గట్టి ప్రతిపాదన పెట్టింది’’.. ఫిబ్రవరి 23వ తేదీ ప్రెస్మీట్లో గంటా శ్రీనివాసరావు చెప్పిన మాట. అయితే వెంటనే ఆయన వెనకడుగేశారు. చీపురుపల్లిలో అవకాశాలపై తన సహచరులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నానని చెబుతూనే.. అక్కడ నుంచి పోటీకి విముఖత ప్రదర్శిస్తూ వచ్చారు. ‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’ ఇది మారిన గంటా స్వరం. ఈ క్రమంలో పదే పదే చంద్రబాబును కలుస్తూ.. తాను చీపురుపల్లిలో అదీ బొత్స లాంటి పవర్ఫుల్ లీడర్‌పై పోటీకి సిద్ధంగా లేనని, కాదని బలవంతంగా పోటీకి దించితే ఫలితం మరోలా ఉండొచ్చని మొరపెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు కనికరించడం లేదు. పోటీ చేస్తే చీపురుపల్లి నుంచే చేయాలని.. లేకుంటే మీ దారి మీరు చూస్కోండంటూ చంద్రబాబు తేల్చేసినట్లు సమాచారం. తాజాగా బుధవారం కూడా ఆయన చంద్రబాబును కలిసినా.. అదే సమాధానం వచ్చింది.దీంతో.. గంటా శ్రీనివాస్ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్య అనుచరులతో గురువారం గంటా తన నివాసంలో భేటీ కానున్నారు. వాళ్లతో చర్చించి తన తర్వాతి అడుగులపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. -
వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దోపిడీలో భాగస్వాములై, అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఆ టీడీపీ నేతలను ఇప్పుడు అదే చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రమే సొంతమైన ‘యూజ్ అండ్ త్రో’ ఆటలో ఆ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే దిక్కు లేకుండాపోయింది. అధికారంలో ఉండగా ఈ నేతలకు సర్వాధికారాలూ ఇచ్చి, అక్రమ సంపాదనకు వారిని ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారికి టికెట్టు దక్కని పరిస్థితి కల్పించారు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరిపోయాక పక్కన పడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న నైపుణ్యం. సొంత కుటుంబం నుంచి పార్టీలో అనేక మంది నాయకుల వరకు చంద్రబాబు పాలసీకి బలైనవారే. తాజాగా ఆ కోటాలో టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు చేరిపోయారు. 2014–2019 మధ్య యధేచ్ఛగా అవినీతికి పాల్పడి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కి కప్పం గట్టిన వీరికి ఇప్పుడు సీట్లు లేకుండాపోయాయి. అప్పట్లో అధికారం తలకెక్కడంతో చంద్రబాబు చెప్పినట్లు చేసి తమ కోసం పనిచేసిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్నే హింసించారు. తద్వారా కేడర్ వ్యతిరేకతను మోయలేనంతగా మూటగట్టుకున్న ఈ నేతలు ప్రజా క్షేత్రంలో బలం కోల్పోవడంతో చంద్రబాబు వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. ఈ నేతలను పూచికపుల్లల్లా తీసి పక్కన పడేశారు. జలవనరులను దోచి ఇచ్చినా ఉమాను పక్కన పెట్టిన బాబుఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు నిరాకరించడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చంద్రబాబుకు అత్యంత విధేయుడు, సుదీర్ఘకాలం కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్నా ఎవరూ ఆయన గురించి ఒక్క మంచి మాట చెప్పరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టును దోపిడీకి ఉపయోగించుకున్నారు. ఇతర సాగు నీటి ప్రాజెక్టుల్లోనూ అవినీతిని పారించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ అందిన కాడికి దండుకుని వేల కోట్లు పోగేశారు. ఆ అక్రమ సంపాదనను చంద్రబాబు, లోకేశ్‌కి కట్టబెట్టి వారి మెప్పు పొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో అవినీతి పిచ్చిలో మునిగిపోయిన ఉమ తన కేడర్, నేతలను వదిలేశారు. జిల్లాలో ఇతర నాయకులు, సీనియర్లను కూడా ఇబ్బంది పెట్టారు. జిల్లా పార్టీలో తానే సర్వం అయ్యారు. పని మీద వెళ్లిన పార్టీ నేతలను అవమానించారు. దీంతో నియోజకవర్గం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయింది. దీంతో బాబు ఆయన్ని పక్కన పెట్టేశారు. అప్పట్లో తనకు ఎంత సహకరించినా, అవినీతి సొమ్ములో కమీషన్లు కట్టినా చంద్రబాబు కనికరించలేదు. గంటాతో భూకుంభకోణాలు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవకాశవాద రాజకీయానికి, అవినీతికి నిలువెత్తు రూపమైనా చంద్రబాబుకు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారు. గంటా ద్వారా చంద్రబాబు విశాఖలో ఊహించని రీతిలో భూ దందాలు చేయించారు. విశాఖ జిల్లావ్యాప్తంగా నానా బీభత్సం సృష్టించారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిన ప్రతిచోటా గంటా పేరు వినిపించేది. దీంతో పార్టీలో, జనంలోనూ ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇక గంటాతో ఉపయోగం లేదనుకున్న చంద్రబాబు ఈసారి విశాఖలో సీటు లేదని కరాఖండిగా చెప్పారు. ఏకంగా జిల్లా దాటించి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించారు. దీంతో గంటా ఏమి చేయాలో పాలుపోక చింతిస్తున్నారు. అన్ని విధాలుగా వాడుకుని చింతమనేనికే ఎసరు టీడీపీలోని పాపులర్ నాయకుల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైపు చూసేందుకే నేతలు, ప్రజలు భయపడేవారు. పోలవరం కాలువ గట్లపై యధేచ్ఛగా మట్టిని తవ్వి అమ్మేసి డబ్బు దండుకున్నారు. తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా తవ్వి కనీవినీ ఎరుగని రీతిలో సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన అనధికారిక మంత్రిగా వ్యవహరించారు. అంతటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడికి చింతమనేని క్రమం తప్పకుండా కప్పం కట్టారు. వారి అండ చూసుకుని చింతమనేని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను అల్పులుగా చూశారు. ఇసుకను అక్రమంగా తవ్వద్దని అడ్డపడినందుకు మహిళా తహసీల్దార్‌పైనే దాడి చేసిన ఘనుడు. దానికి చంద్రబాబు వంతపాడి తహశీల్దార్నే తప్పుపట్టి రాజీ చేశారు. ఇలా అనేక దౌర్జన్యాలకు పాల్పడిన చింతమనేనిపై 40కిపైగా కేసులున్నాయి. వీటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా గొడవలకు వెళ్లడం, రౌడీయిజంతో భయపెట్టడంతో జనం ఆయన్ని 2019లో ఓడించి కసి తీర్చుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకు సీటిస్తే పని చేసేది లేదని చెప్పడంతో చంద్రబాబూ ఆయన్ని వదిలించుకోవాలనుకున్నారు. దెందులూరు సీటు ఇవ్వనని చెప్పేశారు.యరపతినేనితో గనుల దోపిడీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ డాన్‌గా పేరుపొందారు. లోకేశ్ అండతో ఆయన అక్రమ మైనింగ్‌లో రికార్డులు సృష్టించారు. గనులను కొల్లగొట్టి ఆ సొమ్మును లోకేశ్, చంద్రబాబుకు పంచిపెట్టారు. సొంత పార్టీ నేతలే ఆయన అక్రమ మైనింగ్ చూసి నివ్వెరపోయారు. అధికారులను కూడా బెదిరించి లొంగదీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గుంటూరు జిల్లాలో తానే హోంశాఖ మంత్రి అనేలా పరిస్థితిని తయారు చేశారు. చంద్రబాబు ఇచ్చిన అధికార బలంతో పోలీసు అధికారులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. చివరికి ఆయన పాపం పండి అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇవన్నీ చూసి పార్టీ కేడరే విసుగెత్తిపోయింది. సొంత నియోజకవర్గంలో ప్రజలు, కేడర్ వ్యతిరేకం కావడంతో చంద్రబాబుకు యరపతినేని కరివేపాకు అయ్యారు. ఆయనకు సీటును డౌటులో పెట్టారు. టికెట్టు ఇస్తారో లేదో తెలియక యరపతినేని గందరగోళంలో ఉన్నారు. -
భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్న గంటా
-
సీటు లేక పాట్లు
సాక్షి, అమరావతి: సీట్ల కేటాయింపు తర్వాత టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడటంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. అలక పాన్పు ఎక్కిన నేతలను పిలిచి సర్దిచెబుతున్నారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, బొడ్డు వెంకట రమణలతో విడివిడిగా చర్చలు జరిపారు. ► తొలి జాబితాలో సీటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు మరోసారి సూచించారు. తనను ఓడిపోయే చోటకు ఎందుకు పంపుతున్నారని గంటా ప్రశ్నించడంతో గెలుస్తావంటూ ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. గంటా ఇందుకు ససేమిరా అంటూ భీమిలి లేదా విశాఖ జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని కోరారు. జి.మాడుగుల, చోడవరం స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ► మైలవరం సీటు తనకే ఇవ్వాలని దేవినేని ఉమామహేశ్వరరావు కోరగా ఆ సీటు వసంత కృష్ణప్రసాద్‌కి ఇస్తున్నానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయం చూస్తానని దేవినేనికి సర్దిచెప్పారు. ఆయన పేరును పెనమలూరుకు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ► తెనాలిని జనసేనకు కేటాయించడంతో సీటు గల్లంతైన మాజీ మంత్రి ఆలపాటి రాజాతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆయన్ను బుజ్జగించినట్లు తెలిసింది. అయితే గుంటూరు జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ► తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీటును ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన అసంతృప్తితో నిష్క్రమించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. భవిష్యత్తులో అవకాశం ఇస్తానని పేర్కొనగా గోవింద్ అసంతృప్తిగా వెళ్లిపోయినట్లు సమాచారం. -
టీడీపీ తొలి జాబితాలో పార్టీ విధేయులకు మొండి చెయ్యి
సాక్షి, విశాఖపట్నం : నమ్మిన వారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి నిరూపితమైంది. పార్టీని అంటిపెట్టుకొని.. భూజాలపై మోస్తున్న సీనియర్లను కరివేపాకులా తీసి పడేశారు. పొత్తులో భాగంగా జనసేనతో కలిసి తొలి విడత విడుదల చేసిన జాబితా.. సీనియర్లలో కుంపటి రాజేసింది. సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయని భావించిన వారంతా.. చంద్రబాబు కుతంత్ర రాజకీయాలకు బలయ్యారు. మొత్తం 94 మంది అభ్యర్థుల లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో కంగుతిన్నారు. నిన్నా మొన్న పార్టీలోకి వచ్చిన వారికి సీట్లు కేటాయించడంపై సీనియర్లు అవాక్కయ్యారు. అందరిదీ అదే పరిస్థితి..! ► ముందుగా ఊహించినట్లుగానే గంటా శ్రీనివాసరావును పొమ్మనలేక పొగపెట్టినట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. సీటు మార్పు అంటూ ఊహాగానాలు వచ్చినా.. చివరికి ఆయన పేరు ప్రస్తావన లేకుండానే తొలి జాబితా సాగిపోయింది. గత ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ అన్నీ తానై వ్యవహరించిన గంటాకు మొండిచెయ్యి చూపించడంతో కేడర్ భగ్గుమంటోంది. జాబితా విడుదలైన తర్వాత గంటా ఇంట్లో ఒంటరిగా ఉండిపోయారు. ఒకరిద్దరు సన్నిహితులతో మాత్రమే మాట్లాడిన గంటా.. కేడర్, పార్టీ శ్రేణులు ఇంటికి వచ్చినా.. తర్వాత కలుద్దామని చెప్పి పంపించేశారు. ► విశాఖ టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికీ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయన మొహం చాటేశారు. పెందుర్తి సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ముందుగానే ప్రచారం చేశారు. అయితే.. పెందుర్తి సీటు కచ్చితంగా తనకు గానీ, కుమారుడికి గానీ ఇవ్వాలని ఇటీవల పర్యటించిన చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ బండారు విజ్ఞప్తి చేశారు. కానీ.. ఈ సీనియర్ని కూడా పక్కన పెట్టేలా వ్యవహరించడంతో.. కేడర్ మూగబోయింది. ముఖ్యనేతలతో సమావేశమైన బండారు.. మరోసారి అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ► విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుదీ అదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో పల్లాని చంద్రబాబు పోటీలో నిలబెట్టినా.. గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తున్నందున ప్రచారం కూడా చెయ్యొద్దంటూ హుకుం జారీ చేశారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. గాజువాక రాకపోయినా పట్టించుకోని పల్లా.. పార్టీని కాపాడుకునేందుకు నాలుగున్నరేళ్లుగా కష్టపడుతున్నారు. అయినా.. పల్లాకు సీటు గ్యారెంటీ లేదని అధిష్టానం చెప్పకనే చెప్పింది. మరోసారి అధిష్టానంతో మాట్లాడి.. సీటు ఉంటుందా.. లేదా అనేది క్లారిటీ వచ్చిన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది నిర్ణయించుకుందామని తన అనుచరగణంతో పల్లా చెప్పినట్లు తెలుస్తోంది. ► పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని గణబాబుకు మరోసారి పశ్చిమ సీటు కేటాయించడంపై పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. గణబాబుకు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ సీనియర్లు తిరుగుబావుటా ఎగరేసినా.. పట్టించుకోకుండా టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. టీడీపీలో అడ్డగోలు రాజకీయాలు జరుగుతున్నాయంటూ సన్నిహితుల వద్ద వాపోయారు. ఏ పార్టీలో చేరుతాననేది త్వరలోనే చెబుతానని ప్రకటించారు. ► అనకాపల్లిలో పార్టీకి పునాదిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఏడాదిన్నర క్రితం జరిగిన నియోజకవర్గ సమీక్షలోనూ పీలాకే టికెట్ అన్నట్లుగా చంద్రబాబు సంకేతాలిచ్చి.. చివరి నిమిషంలో జనసేన తరఫున కొణతాల రామకృష్ణకు టికెట్ కేటాయించడంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితా ప్రకటించిన వెంటనే పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. అధిష్టానం పునరాలోచన చేయకుంటే తమ నాయకుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ► వలస పక్షుల్లా.. ఆ గూటికీ.. ఈ గూటికీ తిరుగుతూ ఉండే దాడి వీరభద్రరావు కుటుంబం.. నెల రోజుల క్రితం చంద్రబాబు హామీతో టీడీపీ పంచన చేరారు. బాబు చేసే మోసాల గురించి పూర్తిగా తెలిసినా.. దాడి ఫ్యామిలీ మరోసారి భంగపాటుకు గురైంది. తనకు గానీ.. కుమారుడు రత్నాకర్‌కు గానీ టికెట్ ఇస్తానని చెప్పి.. నమ్మించి గొంతు కోశారంటూ దాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైరి వర్గంగా భావించే కొణతాలకు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ●నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అంటూ టీడీపీ సీనియర్ నాయకులు అనుచర వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బాబు కొట్టిన దెబ్బకు భవిష్యత్తు కార్యాచరణపై సీనియర్లంతా సమాలోచనలు చేస్తున్నారు. -
యూజ్లెస్ ఫెలో.. గెటవుట్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్‌గా చెలామణి అవుతున్న టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చేతిలో ఘోరమైన అవమానం జరిగినట్లు తెలియవచ్చింది. గంటాను ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఎత్తు వేయగా... తనకు ఓడిపోయే సీటిచ్చి పొమ్మనలేక పొగ పెడుతున్నారని గ్రహించిన గంటా దీన్ని బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. తనను విశాఖ జిల్లా నుంచి పంపేయాలని చూస్తున్నారని, అలాంటిదేమీ కుదరదని బయటక్కూడా చెప్పారు. ఇదే విషయంలో ఆయనకు, పార్టీ అధినేత చంద్రబాబుకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి, మాటా మాటా పెరగడంతో ‘యూజ్లెస్ ఫెలో.. గెటవుట్’ అంటూ గంటాపై చంద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారని తెలిసింది. అవమానాన్ని భరించలేని గంటా... మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశారని, ఇంతటి అవమానం జరిగాక ఇక ఆ పార్టీలో కొనసాగటమెలాగంటూ సన్నిహితుల వద్ద వాపోయారని తెలియవచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను గంటా తిరస్కరించారు. అంతదూరం వెళ్లి పోటీ చేయలేనని కరాఖండిగా చెప్పేశారు. ‘మనుషులు కాదు.. పార్టీ ముఖ్యం. పార్టీ అధినేతగా చెబుతున్నా... చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాల్సిందే’ అని బాబు కూడా అంతే స్పష్టంగా చెప్పటంతో... ‘నన్ను ఓడించేందుకే కంకణం కట్టుకున్నట్టున్నారు’ అని గంటా బిగ్గరగా బదులిచ్చినట్లు తెలిసింది. దీంతో బాబు సహనం కోల్పోయి కొన్ని మాటలనటం... గంటా కూడా ఎదురు తిరగటంతో ‘యూజ్లెస్ ఫెలో.. గెటవుట్’ అంటూ గంటాకు చంద్రబాబు గేటు చూపించారని సమాచారం. అవమానభారంతో బయటకు వచ్చిన గంటా... తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని, తానైతే భీమిలి నుంచే పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. జిల్లా వెలుపల ఎప్పుడూ పోటీ చెయ్యలేదు: గంటా చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం తనకు సూచించడం నిజమేనని గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ఆయన గురువారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ‘చీపురుపల్లిలో పోటీపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాక నిర్ణయాన్ని ప్రకటిస్తా. నేను గతంలో చాలా నియోజకవర్గాలు మారినా ఎప్పుడూ జిల్లా దాటలేదు. కాబట్టే చీపురుపల్లిలో పరిస్థితులను సమీక్షించి... నా నిర్ణయాన్ని అధిష్టానానికి చెబుతా’ అని గంటా అన్నారు. ఉద్దేశపూర్వకంగానే లీకులు..! విశ్వసనీయ సమాచారం మేరకు... వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఎక్కడా సీటు లేదని, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు టీడీపీ సలహాదారు రాబిన్ శర్మ మొదట చెప్పారు. అయితే, అంతదూరం వెళ్లి తాను పోటీ చేయలేనని గంటా బదులిచ్చారు. దీంతో కొద్దిరోజుల క్రితం అనుకూల మీడియాలో టీడీపీ పెద్దలు చీపురుపల్లి నుంచి గంటా పోటీ చేయనున్నట్టు లీకులిచ్చారు. దీనిపై గంటా తన అనుచరుల వద్ద తీవ్రంగా మండిపడ్డారు. తనను ఓడించేందుకే ఈ కొత్త నాటకానికి తెరతీశారని వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబుతో గంటా భేటీ అయ్యారు. ‘ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే మీరు.. ఈసారి చీపురుపల్లికి వెళ్లండి’ అని బాబు ఆదేశించారు. తాను అక్కడకు వెళ్లి పోటీ చేయలేనని, భీమిలి సీటు కావాలని గంటా కోరారు. దీంతోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.