ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా టీడీపీ అధినాయకత్వం పావులు కదుపుతోందని భావిస్తున్న గంటా శ్రీనివాసరావు.. మంగళవారం సాయంత్రం అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే. విశాఖపట్నం భూకుంభకోణంలో తనకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిల్ వెనుక టీడీపీ పాత్ర ఉందని మంత్రి గంటా అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయం చెప్పినా పట్టించుకోకపోవడంతో గంటా అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది.