
సాక్షి, అమరావతి: అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ విషం చిమ్ముతోంది. గంజాయి సాగు, రవాణాకు తమ నిర్వాకమే కారణమని బయటకు చెప్పుకోలేక రాష్ట్ర ప్రతిష్టను పణంగా పెట్టి రాజకీయ దిగజారడుతనానికి పాల్పడుతోంది. రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ ఆ మూలాలన్నీ టీడీపీ హయాంలోనే ఉన్నాయనే విషయం మరిచిపోయి.. దుష్ప్రచారం చేస్తోంది. (చదవండి: ఇజ్రాయెల్ ‘ఎగ’సాయం: బాబు ‘షో’కు.. నష్టాల సాగు)
గత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో గంజాయిపై గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖ నుంచే దేశమంతా గంజాయి సరఫరా అవుతుందని స్వయంగా ఆయనే చెప్పారు. ఇప్పుడేమో తమకు ఏపాపం తెలియదంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ బురద చల్లి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఏవోబీలో భౌగోళిక స్థితిగతుల దృష్ట్యా దశాబ్దాల తరబడి గంజాయి సాగవుతోందన్నది బహిరంగ రహస్యం. కానీ గంజాయిపై వాస్తవాలకు ముసుగేసి గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారు పచ్చనేతలు.
Comments
Please login to add a commentAdd a comment