
సాక్షి, వైజాగ్: భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ గెలుపును బహుమతిగా ఇస్తానని పార్టీ భీమిలిసమన్వయకర్త, ఎంపీ అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రస్టేషన్‌లో ఉన్నారని, అందుకే వైఎస్ జగన్‌ను భీమిలికి వచ్చి పోటీ చేయాలంటున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో ప్రధాని నరేంద్రమోదీని, అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ను కూడా భీమిలి నుండి పోటీ చేయమన్నా.. ఆశ్చర్య పడక్కర్లలేదని, టీడీపీ నేతల ప్రస్టేషన్ ఆ స్థాయిలో ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావుకు అవంతి శ్రీనివాస్ చురకలు అంటించారు.