Avanthi Srinivasa rao
-
బాబే భూబకాసురుడు
-
రాజకీయాల్లో ఉన్నంత వరకూ వైఎస్సార్ సీపీతోనే..
కొమ్మాది (భీమిలి): త్వరలో టీడీపీలోకి వెళ్లిపోతున్నానని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని పలువురు దు్రష్పచారం చేస్తున్నారని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీతోనే ఉంటానని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మధురవాడలో జరిగిన ఆసరా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షనేతలకు పుట్టగతులుండవని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
విశాఖకు రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి: అవంతి
-
వికేంద్రీకరణ కోసం రాజీనామాకు నేను సిద్ధం: కరణం ధర్మశ్రీ
-
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈక్రమంలోనే విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్‌లో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. చదవండి: (Visakhapatnam: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: అవంతి శ్రీనివాస్) -
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి: అవంతి శ్రీనివాస్
-
అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదు: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ సమావేశమైంది. ప్రొఫెసర్ లజపతిరాయ్ అధ్యక్షతన విశాఖపట్నంలో శనివారం ఉత్తరాంధ్ర మేధావులు భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.., ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖకు రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జేఏసీ ఆవిర్భవించింది. రాజకీయేతర జేఏసీలో ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాల భాగస్వామ్యం ఉంటుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి సహా కర్నూలు, విశాఖ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అవసరమైతే విశాఖ రాజధాని కోసం నా పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చదవండి: (వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు) విశాఖకు మద్దతుగా భారీ ర్యాలీ అక్టోబర్ 15 న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో మండల, నియోజక వర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. -
3 రాజధానులే మా విధానం
మధురవాడ (భీమిలి): రాష్ట్రంలో మూడు రాజధానులే తమ ముఖ్యమంత్రి ఉద్దేశం, తమ ప్రభుత్వ విధానం అని విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆమె సోమవారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం తంగుడుబిల్లిలో 519 ఎకరాల్లో 263 కోట్లతో నిర్మించనున్న 16,690 ఇళ్ల జగనన్న హౌసింగ్ కాలనీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో పరిపాలన, కర్నూలులో న్యాయ, అమరావతిలో శాసన రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడుకి రాష్ట్రం బాగుపడడం, మంచి జరగడం ఇష్టం ఉండదని, అందుకే అమరావతి పేరుతో పాదయాత్ర ప్లాన్ చేశారని విమర్శించారు. ఈ వయసులో చంద్రబాబు పాదయాత్ర చేయలేడని, లోకేశ్ చేసినా ఉపయోగంలేదని భావించి అమరావతి పేరుతో అక్కడి వారిని రెచ్చగొట్టి పాదయాత్రకు ప్లాన్ చేశారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జనం జగనన్న వెంటే ఉన్నారన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర వల్ల ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తినా చంద్రబాబే బాధ్యత వహించాలని చెప్పారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అటు సూర్యుడు ఇటు వచ్చినా విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. చంద్రబాబులాంటి వారు ఎన్ని కుట్రలు పన్నినా అడ్డుకోలేరన్నారు. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ఆగదని చెప్పారు. ప్రజలకు మేలు చేయడానికి కావాల్సింది పెద్ద వయసు కాదని, పెద్ద మనసని పేర్కొన్నారు. ఆ పెద్ద మనసు సీఎం జగన్మోహన్రెడ్డికి ఉందని ఆయన చెప్పారు. -
ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తా
తగరపువలస (విశాఖపట్నం): సీఎం వైఎస్ జగన్ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేసే ప్రశ్నేలేదన్నారు. చిట్టివలస బంతాట మైదానంలో సోమవారం జీవీఎంసీ భీమిలి జోన్‌కు చెందిన 363 మంది వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర అవార్డుల కింద ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు అదనపు అర్హత మాత్రమేనని చెప్పారు. శక్తియుక్తులన్నీ ఉపయోగించి భీమిలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో త్వరలో భీమిలిలో రూ.25 కోట్లతో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్, సీఎస్ఆర్ నిధులతో ఆర్టీసీ కాంప్లెక్స్ హామీ నెరవేరిస్తే 95% ఎన్నికల హామీలు నెరవేర్చినట్టేనని చెప్పారు. విద్యుత్ సమస్యలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు పెద్ద వయసు, అనుభవం ఉన్నా జగన్‌లా పెద్ద మనసు లేదన్నారు. ఇన్నాళ్లు జగన్ కేబినెట్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నూరుశాతం మంచివారని చెప్పారు. టీడీపీ నేతలు వలంటీర్లను హేళన చేశారని గుర్తుచేశారు. వలంటీర్లే లేకుంటే కరోనా కాలంలో మరిన్ని ప్రాణాలు పోయేవని ఆయన పేర్కొన్నారు. -
పొలమే పర్యాటక స్థలం
సాక్షి, అమరావతి: వ్యవసాయం పర్యాటక సొబగులను అద్దుకోనుంది. సాగు క్షేత్రమే సందర్శనీయ స్థలంగా మారనుంది. వ్యవసాయాన్ని ప్రోత్స హించడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ వనరుగా అగ్రి టూరిజం అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ఆర్థిక వనరులను నగరాల నుంచి గ్రామాలకు పంపిణీ చేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల సందర్శకులు పొలం గట్లపై నడిచేలా.. పొలం దున్నేలా.. పంట కోస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరేలా వ్యవసాయ క్షేత్రాలు రూపుదిద్దుకున్నాయి. వ్యవసాయ విజ్ఞానాన్ని, వినోదాన్ని పర్యాటకులకు ఒకేచోట అందిస్తున్నాయి. ‘గెస్ట్–హోస్ట్’ ప్రాతిపదికన దేశంలో అగ్రి టూరిజం గెస్ట్–హోస్ట్ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ విధానంలో పొలం యజమానులే పర్యాటకులకు వ్యవసాయ క్షేత్రంలో భోజన వసతి కల్పిస్తారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే సందర్శకులు రైతుల దైనందిన కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చు. స్వయంగా సాగు విధానాలు తెలుసుకోవచ్చు. పొలం గట్లపై భోజనం చేస్తూ ఆహ్లాదాన్ని పొందొచ్చు. తద్వారా పర్యాటకులు స్థానిక ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పండుగలు, ప్రకృతి పరిశీలన చేయడంతోపాటు చేపల వేట వంటి వ్యవసాయ ఆధారిత, అనుబంధ రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించొచ్చు. ప్రకృతి ఒడిలో ‘ఆదరణ’ అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపా పురం గ్రామంలో ‘ఆదరణ’ పేరుతో అగ్రి టూరిజం సెంటర్ నడుస్తోంది. అక్కడ పూర్తిగా ప్రకృతి వ్యవ సాయం చేస్తున్నారు. ఇక్కడే నేచురల్ ఫార్మింగ్‌కు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది. ప్రత్యేక ప్యాకేజీతో పర్యాటకులు, పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ వ్యవసాయ విధానాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఎడ్లబండి నడపటం, మేకల పెంపకం, జీవామృతాల తయారీ, తిరగలి పిండి విసరడం, రోకలి దంచడం, వెన్న చిలకడం వంటి వ్యవసాయ, గ్రామీణ పనులతోపాటు గ్రామీణ క్రీడలతో ఆహ్లాదాన్ని పంచుతున్నారు. అగ్రి టూరిజాన్ని విస్తరిస్తాం.. రాష్ట్రంలో అగ్రి టూరిజాన్ని ప్రోత్సహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పాడేరు ప్రాంతాల్లో ఇలాంటి విధానమే ఉంది. త్వరలో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వ్యవసాయ పర్యాటకాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి సాగు అనుభూతి పట్టణాల్లోని ప్రజలు, ఉద్యోగులు వారాంతాల్లో వినోదాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని అగ్రి టూరిజం విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వీకెండ్ వ్యవసాయం చేయాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. – వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీ టీడీసీ -
అన్ని వర్గాల వికాసానికి సీఎం జగన్ అండ
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అందించి అన్ని సామాజిక వర్గాల వికాసానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలుస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు సాహిత్యం, సంగీత, నృత్య, నాటక రంగాల అభ్యున్నతకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వివిధ అకాడమీల సభ్యుల ప్రమాణ స్వీకారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటక రంగాల్లో బహుముఖ పురోగతి, పద్య, ఆధునిక నాటక వికాసం, శిల్ప, చిత్రకళల అభివృద్ధి, జానపద కళారూపాల అభివృద్ధి, ఆధునికీకరణ, తెలుగు ప్రజల చారిత్రక పరిశోధన, ఆవిష్కరణ, టెక్నాలజీ, డిజిటల్ రంగాలకు సంబంధించిన ఆధునిక ఆవిష్కరణ లక్ష్యాలుగా ప్రభుత్వం ఏడు అకాడమీలను పునరుద్ధరించిందని వివరించారు. ఈ అకాడమీలకు ఇదివరకే చైర్మన్లను నియమించామని తెలిపారు. ఆయా అకాడమీలకు ప్రభుత్వం నామినేట్ చేసిన డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించడం ఆనందంగా ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన వారంతా అకాడమీల కీర్తి, ప్రతిష్టలను పెంచేలా కృషిచే యాలని కోరారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను అభినందించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ పి.శ్రీలక్ష్మి, సంగీత, నృత్య అకాడమీ చైర్మన్ పి.శిరీష యాదవ్, నాటక అకాడమీ చైర్మన్ ఆర్.హరిత, దృశ్య కళల అకాడమీ చైర్మన్ కుడుపూడి సత్యశైలజ, జానపద కళల చైర్మన్ కె.నాగభూషణం, చరిత్ర అకాడమీ చైర్మన్ కె.నాగమల్లేశ్వరి, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ టి.ప్రభావతి, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్మన్ వంగపండు ఉష, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, సీఈవో మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించకుంటే లీజులు రద్దు
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం ఆదాయన్ని పెంచే లక్ష్యంతో అభివృద్ధి, విస్తరణ చర్యలు చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడినపడుతోందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.200 కోట్ల ఆదాయ ఆర్జన లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక సంస్థ ఆస్తులకు సంబంధించి రూ.31.08 కోట్ల లీజు బకాయిలు రావాల్సి ఉందన్నారు. సకాలంలో లీజు అద్దెను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. 13 ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రూ.35 కోట్లతో 18 చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లను ఆధునికీకరించనున్నట్టు వివరించారు. ఉగాది నాటికి పర్యాటక యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 13 రకాల క్రీడలతో సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్టు మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో టోర్నీ పూర్తవగా వచ్చే వారంలో మిగిలిన జిల్లాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన 1,497 మంది క్రీడాకారులకు దాదాపు రూ.8.55 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు అందజేశామన్నారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రతిపాదనల మేరకు రూ.7.50 కోట్లతో విశాఖపట్నం కొమ్మాదిలో ఈతకొలను, రూ.5.50 కోట్లతో కర్నూలు డీఏస్‌ఏ స్టేడియంలో సింథటిక్ టర్ఫ్ ఫుట్‌బాల్ మైదానం, రూ.7.50 కోట్లతో కడపలో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ (8 లేన్లు), రూ.7.50 కోట్లతో నెల్లూరు జిల్లా స్పోర్ట్సు విలేజ్ మొగలాయిపాలెంలో 400 మీటర్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ (8 లేన్లు) ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభా వంతుల కోసం ఆయా సంక్షేమ శాఖల సమన్వయంతో 8 క్రీడా పాఠశాల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. కొత్త జిల్లాలపై చంద్రబాబు వైఖరేంటి? అభివృద్ధి వికేంద్రీకరణ, సత్వర సేవలే లక్ష్యంగా జిల్లాల విభజన చేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. అనవసర విమర్శలు కాకుండా జిల్లాల విభజనపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జిల్లాలను విభజించినప్పుడు చంద్రబాబు ఇక్కడ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి ముత్తంశెట్టి సాంస్కృతిక శాఖలో కొత్తగా నియమితులైన వివిధ అకాడమీ చైర్మన్లతో తొలిసారిగా సమావేశమయ్యారు. రాఘు హరిత (నాటక అకాడమీ), సత్యశైలజ (దృశ్య కళల), నాగభూషణం (ఫోక్–క్రియేటివిటి), ప్రభావతి (సైన్స్ అండ్ టెక్నాలజీ), నాగమల్లేశ్వరి (హిస్టరీ), శిరీషా యాదవ్ (సంగీత, నృత్య), లక్ష్మి (సాహిత్యం)లను మంత్రి సన్మానించారు. -
త్వరలో టూరిజం యాప్
విశాఖ తూర్పు/భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల వివరాలతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలను మంగళవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ అనుమతితో విశాఖ నుంచి రాయలసీమ వరకు టూరిజం సర్క్యూట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అందమైన ప్రాంతాలు పురాతన, చారిత్రాత్మక ప్రాంతాలతోపాటు ఆలయాలు, సాహస క్రీడల పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా విశాఖ నుంచి గోదావరి, కృష్ణలంక, గండికోట మొదలైన ప్రాంతాలను సర్క్యూట్‌గా తీర్చిదిద్దితే పర్యాటకం గణనీయంగా అభివృద్ది చెందుతుందన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వరప్రసాదరెడ్డి, కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి భారతదేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎల్ మల్రెడ్డి చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో మంగళవారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా, యోగా నిపుణుడు కేవీఎస్‌కే మూర్తి 12 నిమిషాల్లో 12 సూర్య నమస్కారాలను 108 సార్లు ప్రదర్శించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు దక్కించుకున్నారు. అవార్డును ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జివీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్ ప్రదానం చేశారు. -
పర్యాటక ప్యాకేజీలతో ఆదాయం పరుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటిస్తున్న ప్యాకేజీల కారణంగా ఆ శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.24.05 కోట్లు ఆర్జించింది. ఇందులో తిరుపతి ప్యాకేజీల నుంచే అత్యధికంగా రూ.18 కోట్లు రావడం విశేషం. ఒక్క డిసెంబర్లోనే రూ.4 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ లోకల్‌టూర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. మరోవైపు కార్తీకమాసంలో శైవక్షేత్రాలు, శక్తిపీఠాల ప్యాకేజీలు కొంతమేరకు ఆదాయవృద్ధికి దోహదపడ్డాయి. ప్రస్తుతం పర్యాటక శాఖ 35 టూర్ ప్యాకేజీలను నడుపుతూ.. 30 సొంత బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబయి వంటి మెట్రో నగరాల నుంచి తిరుపతికి విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటకు బెంగళూరు, హైదరాబాద్ నుంచి పర్యాటకుల రాకను ప్రోత్సహిస్తున్నారు. కోవిడ్ ప్రారంభమైన తర్వాత పడిపోయిన పర్యాటకశాఖ ఆదాయం ప్యాకేజీలతో తిరిగి పుంజుకుంటుంది. తిరుపతికి ఇలా.. రవాణాతో పాటు వసతి, స్వామివారి దర్శనం కల్పిస్తుండడంతో తిరుపతి టూర్ ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం కర్నూలు, ఒంగోలు, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి తిరుపతికి పర్యాటక శాఖ బస్సులు నడుపుతోంది. మరోవైపు చెన్నై–వళ్లూరు–తిరుపతి, తిరుపతి–శ్రీశైలం, తిరుపతి–కాణిపాకం–స్వర్ణ దేవాలయం, అరుణాచలం తదితర లోకల్ ప్యాకేజీలను అందిస్తోంది. లోకల్ టూరిజం.. స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విశాఖపట్నం–లంబసింగి, విశాఖపట్నం–అరసవిల్లి దేవాలయం, రాజమండ్రి–మారేడుమిల్లి, కర్నూలు–శ్రీకాకుళం–నంద్యాల, శ్రీకాకుళంలో అరసవిల్లి–శ్రీకూర్మం–శాలిహుండం–కళింగపట్నంకు ఒక్కరోజులో చుట్టివచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే సర్క్యూట్ టూరిజంలో భాగంగా కొత్తగా అనంతపురం–కదిరి–వేమనగారి జన్మస్థలం ప్రాంతం–గండి ఆంజనేయస్వామి దేవాలయం, గండికోట, బెలూం గుహలు, తాడిపత్రి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో కలిపి రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్యాకేజీల ద్వారా పర్యాటక శాఖ సిబ్బంది జీతాలు, రవాణా ఖర్చులు అన్నీ పోనూ నికరంగా సుమారు రూ.6 కోట్లకు పైగా ఆదాయం లభించింది. పర్యాటకానికి కొత్త ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యూట్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా హైదరాబాద్, ముంబయి నుంచి విమాన ప్యాకేజీని ప్రవేశపెట్టాం. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఏపీ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి సొంత బస్సుల్లో సురక్షితంగా.. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పర్యాటక ప్యాకేజీలను నడుపుతున్నాం. కోవిడ్ కారణంగా రెండేళ్లలో ఎన్నడూ లేనంత వృద్ధి కేవలం ఆరు నెలల్లో సాధించాం. సొంత బస్సుల్లో సురక్షితంగా పర్యాటకులను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో ఎక్కువ ఆదరణ లభిస్తోంది. – ఎస్. సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ -
భోగి సంబరాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్
-
మూడు రాజధానులతోనే సమాన అభివృద్ధి
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. పాలకవర్గం ఏర్పడిన తరువాత మొదటిసారి ఆదివారం జిల్లా పరిషత్ సమావేశం చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. మూడు రాజధానులపై తీర్మానం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రతిపాదించగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. సభ్యులంతా ఆమోదించారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. తొలి సమావేశంలో ఏడు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక నిర్వహించారు. మొదటి స్థాయి సంఘంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏడో స్థాయి సంఘంలో మంత్రి ముత్తంశెట్టి సభ్యులుగా ఎన్నికైనట్టు చైర్పర్సన్ సుభద్ర ప్రకటించారు. మాజీ సీఎం రోశయ్య, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్, విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సభ సంతాపం తెలిపింది. -
మంచి సౌకర్యాలతో మెరుగైన ఆదాయం
సాక్షి, అమరావతి: భద్రాచలం నుంచి పాపికొండలకు వచ్చే పర్యాటకులకు వీలుగా పోచవరంలో ఈ నెల 14 నుంచి బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. పర్యాటకులకు రాత్రి బస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 20వ తేదీలోగా పోలవరం నుంచి పాపికొండలకు కొత్త బోటింగ్ పాయింట్‌ను ప్రారంభించాలని, వారంలోగా నాగార్జునసాగర్‌లో బోట్ సర్వీసు నడపాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే హరిత రెస్టారెంట్ల్ల ఆదాయం మెరుగుపడుతోందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 69.57 కోట్లు వచ్చిందని తెలిపారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పర్యాటకానికి మంచి సీజన్ అని, రెస్టారెంట్లలో పూర్తిస్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ, నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఆక్యుపెన్సీని పెంచాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో రూ.4.50 కోట్లతో రోప్ వే, బొర్రా గుహల్లో రూ. 2.70 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, మారేడుమిల్లిలో రూ.1.15 కోట్లతో కాటేజీలు, అడ్వంచర్ స్పోర్ట్స్ పనులు వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. లంబసింగికి వచ్చే పర్యాటకుల కోసం తాత్కాలికంగా చేపట్టిన రెస్టారెంట్, టాయిలెట్స్ పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు. పాండ్రంగిలో అల్లూరి మ్యూజియం, కృష్ణ్ణదేవిపేటలో ఆయన సమాధి అభివృద్ధి పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు, ఉత్తమ క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తయిందని, ఈ నెల 11, 12 తేదీల్లో విజయనగరంలో కొనసాగుతుందన్నారు. మార్చిలో రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహించి సీఎం చేతులమీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. -
నైపుణ్య పోటీల్లో సత్తా చాటిన ఏపీ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో విశాఖలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ నైపుణ్య పోటీలు ఘనంగా ముగిశాయి. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ముగింపు వేడుకలు జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. మొబైల్ రోబోటిక్స్, ఐటీ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ కన్స్ట్రక్షన్ వంటి నైపుణ్య విభాగాల్లో రాష్ట్ర యువత పురస్కారాలు దక్కించుకుంది. 2018లో జరిగిన నైపుణ్య పోటీల్లో మన రాష్ట్రానికి 8 అవార్డులు దక్కగా, ఈసారి 20 అవార్డులు వచ్చాయి. అందులో 12 బంగారు, 8 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వీరంతా జనవరి 6 నుంచి పదో తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారు. జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు 2022 అక్టోబర్‌లో చైనాలో జరిగే ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ) చల్లా మధుసూదనరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు మన రాష్ట్రంలోని యువతకు అందించాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. ఈ పోటీల్లో మొత్తం 51 టెక్నికల్ ట్రేడ్‌లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన 124 మందిని నైపుణ్య పోటీల్లో విజేతలుగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. -
ఘంటసాల కుటుంబ సభ్యులకు అండగా ప్రభుత్వం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సరస్వతీ పుత్రుడని, తన అమృత గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఘంటసాల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీఎంఆర్డీఎ చిల్డ్రన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖ పోస్టల్ కవర్ విడుదల చేయగా.. మంత్రి ఆవిష్కరించారు. ఘంటసాలపై రచించిన రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర, రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్పర్సన్ వంగపండు ఉష తదితరులు పాల్గొన్నారు. -
పాపికొండల యాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్
-
పర్యాటకులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: పాపికొండలు బోటు విహార యాత్రను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధరను రూ.1,250 (రవాణా, భోజన వసతి)గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల పర్యాటక బోటింగ్ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి కూడా పాపికొండలుకు బోట్లును నడపాలని కోరారు. -
పర్యాటక హబ్‌గా రాయలసీమ
తిరుపతి అర్బన్(చిత్తూరు జిల్లా): రాయలసీమను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో హెలి టూరిజాన్ని వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతితో పాటు అవసరమైన ప్రధాన కేంద్రాల్లో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలున్న పట్టణాలకూ ఇదే పద్ధతిని అవలంభిస్తామని చెప్పారు. కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. ప్రస్తుతం పెరుగుతోందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారని, తిరుపతితో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఆలయాలనూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేకంగా 20కి పైగా టూరిజం బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను హబ్‌గా మార్చి, మెరుగైన వసతులు కల్పించి.. పర్యాటకులను ఆకర్షించేలా పలు సంస్కరణలు చేపట్టనున్నట్టు మంత్రి అవంతి వెల్లడించారు. -
పర్యాటక రంగానికి చేయూత
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చి.. రాష్ట్ర పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లు నిర్మించే క్రమంలో విశాఖ, తిరుపతి నగరాల్లో హోటళ్లను నిర్మించేందుకు ఓబరాయ్ హోటల్ ముందుకొచ్చినట్టు తెలిపారు. కరోనా వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎంపీలు బి.సత్యవతి, మాధవి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, జి.బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా టూరిజం పాలసీ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి.. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు టూరిజంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని హరిత బరంపార్క్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన టూరిజం పాలసీ దేశంలోనే బెస్ట్ పాలసీ కానుందని తెలిపారు. వైజాగ్ బీచ్ కారిడార్‌తో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లంబసింగి, అరకు ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. రుషికొండలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, రికార్డ్ స్థాయిలో ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వైజాగ్, గండికోటల్లో అడ్వంచర్ బోట్స్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. విజయవాడ హరిత బరంపార్క్కు బెస్ట్ రెవెన్యూ, బెస్ట్ ఫుడ్ ఫాల్, బెస్ట్ ఆపరేషన్స్‌కు గానూ ఏపీటీడీసీ అవార్డ్‌ను ప్రకటించింది. దీనిని బరంపార్క్ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్‌కు రజత్ భార్గవ అందించారు. -
కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం
కొండకోనల్ని చూసినా.. అందాల మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో హొయలొలుకుతున్న సాగర తీరంలో విహరిస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాల్లో అర్చన చేసినా... ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని అందిస్తుంది విహార విశాల విశాఖ. ప్రపంచంలోని అందాలన్నీ ఓచోట చేరిస్తే బహుశా దానినే విశాఖ అంటారేమో. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడి సహజసిద్ధమైన అందాలకు ఫిదా అవుతుంటారు. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ అందాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో అడుగుపెట్టే ప్రతి పది మంది విదేశీ పర్యాటకుల్లో ముగ్గురు విశాఖని సందర్శించేందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే అద్భుత పర్యాటక ప్రాంతాలు విశాఖ సొంతం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాల్ని మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్ అవ్వగా, మరికొన్ని పనులు ప్రారంభానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇంకొన్నింటికి డీపీఆర్‌లు తయారవుతున్నాయి. చదవండి: (ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!) సర్క్యూట్లు పూర్తయితే.. సూపర్ రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి ముత్తంశెట్టి సంబంధిత అధికారులతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సర్క్యూట్లు సిద్ధమైతే.. పర్యాటకానికి మరిన్ని సొబగులు చేకూరనున్నాయి. 10 బీచ్‌ల అభివృద్ధితో కొత్త సోయగాలు విశాఖలోని బీచ్‌లంటే అందరికీ ఇష్టమే. ఆర్కే బీచ్‌కు రోజూ లక్షల మంది వస్తుంటారు. అందుకే కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 10 బీచ్‌లు అభివృద్ధి చేయనున్నారు. సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమూరిపేట, చేపలుప్పాడ, ఐఎన్ఎస్ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నాగాయంపాలెం, అన్నవరం, కంచేరుపాలెం బీచ్‌లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆయా బీచ్‌లలో పర్యాటకులకు అవసరమైన వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్‌రూమ్స్, తాగునీటి సౌకర్యం, ఫుడ్ కోర్టులు, ఫస్ట్‌ఎయిడ్, సీసీటీవీ కంట్రోల్ రూమ్, సిట్టింగ్ బెంచీలు, సిట్ అవుట్ అంబ్రెల్లాలు, రిక్‌లైయినర్స్, చిల్డ్రన్‌పార్కులు, ఫిట్నెస్ ఎక్విప్మెంట్, జాగింగ్ ట్రాక్, పార్కింగ్ సౌకర్యం మొదలైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. వీటికి తోడుగా సేఫ్ స్విమ్మింగ్ జోన్లు అభివృద్ధి చెయ్యడంతో పాటు బీచ్ స్పోర్ట్స్, వాచ్ టవర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా రానున్నాయి. చదవండి: (అందరి చూపు ‘ఆంధ్రా’వైపే) రుషికొండలో పారాసెయిలింగ్ సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్‌లను పరిశీలన చేసింది. రుషికొండలో పారాసెయిలింగ్ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. త్వరలోనే రుషికొండలో పర్యాటకులకు పారాసెయిలింగ్ చేసే అవకాశం కలగనుంది. లంబసింగిలో ఎకో టూరిజం అటవీ ప్రాంతాల్లో అద్భుతమైన పర్యాటక ప్రపంచాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రా ఊటీగా పిలిచే లంబసింగిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నారు. హైఎండ్ టూరిజం రిసార్టులు నిర్మించనున్నారు. పర్యాటకులకు మన్యంలో అధునాతన సౌకర్యాలు అందించేలా రిసార్టులు రూపుదిద్దుకోనున్నాయి. దీనికి సంబంధించిన డీపీఆర్ త్వరలోనే పూర్తికానుంది. రెస్టారెంట్‌గా ఎంవీ మా కార్గోషిప్ తెన్నేటిపార్కు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ కార్గో షిప్ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా తీరంలో కనువిందు చేయనుంది. 30 గదులతో పాటు మల్టీకుజిన్ రెస్టారెంట్, బాంక్విట్ హాల్‌కూడా ఏర్పాటు చేస్తారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10.50 కోట్లుగా నిర్ధారించింది. రూ.1021 కోట్లతో బీచ్ కారిడార్ కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 30 కిలోమీటర్ల పరిధిలో విభిన్న సమాహారాల కలబోతగా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. సుమారు 570 ఎకరాల విస్తీర్ణంలో రూ.1021 కోట్లతో బీచ్ కారిడార్ రూపుదిద్దుకోనుంది. సాగర తీరంలో.. సరికొత్త ప్రయాణం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచబాట వేస్తున్న ప్రభుత్వం.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 6 లైన్లు నిర్మించి భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి వెంబడి పర్యాటక శాఖ టూరిజం రిసార్టులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, అటవీ శాఖ భూముల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు, ఎకో క్యాంపులు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, అకామిడేషన్ బ్లాక్, గోల్ఫ్ కోర్సు నిర్మాణాలు జరగనున్నాయి. నూతన ప్రాజెక్టులు ►ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో పలుచోట్ల హోటళ్లు, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు. అరకులో రిసార్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ►అరకులో 5 స్టార్ రిసార్ట్స్ అభివృద్ధికి అవసరమైన భూమిని ఐటీడీఏ నుంచి సేకరించనున్నారు. లంబసింగిలో రోప్ వేలు ఏర్పాటు చేయనున్నారు. ►పర్యాటక శాఖకు సంబంధించి జిల్లాలో మొత్తం 550 ఎకరాల భూములున్నాయి. ఈ స్థలాల్ని లీజుకి ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు పర్యాటకాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ►సందర్శకుల సంఖ్య పెంచేందుకు వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక శాఖ ముందుకెళ్తోంది. ఇందులోభాగంగా అరకు, లంబసింగి తదితర ప్రాంతాలను అటవీశాఖతో కలిసి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ►జాతీయ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా ప్రసాద్ పథకం, స్వదేశ్ దర్శన్ పథకం ద్వారా పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఈ ఏడాది ‘సమగ్ర వృద్ధి కోసం పర్యాటకం’ అనే అంశంపై పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. హోటళ్లను పర్యాటకశాఖ సారధ్యంలో అభివృద్ధి చేయడంతో పాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొత్త టూరిజం ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం లభించనుంది. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. – ముత్తంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి -
ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి