సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ అఖిలపక్ష సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు..?. రాష్టంలో రోజుకు రెండు, మూడు కేసులు ఉన్నప్పుడు కరోనా షాకుతో ఎన్నికలు వాయిదా వేశారు.
ఇప్పుడు రోజుకు రెండు మూడు వేల కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం తగదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వమే కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది' అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం)
Comments
Please login to add a commentAdd a comment