Nimmagadda Ramesh kumar
-
ఎన్నికల కమిషనా.. ఎన్డీఏ కమిషనా?
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ ఉందన్న కారణంతో ఆపేస్తే ఆ లబ్ధిదారుల పరిస్థితేంటి? కొనసాగుతున్న పథకాలను ఆపాల్సిన పనిలేదని ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా కూడా... ఎన్నికల కమిషన్ ఎందుకిలా చేస్తోంది? ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు జతకట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేయాల్సిన అవసరం లేదు కదా? ఏ రాష్ట్రానికీ వర్తించని నిబంధన ఇక్కడే ఎందుకట? పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటమనేది వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందీ లేదు కూడా. కానీ ఎన్నికల కోడ్ సాకుగా చూపించి ఇపుడు ఏకంగా 6,95,857 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లకుండా నిలిపేయటం దుర్మార్గం కాదా? పంట వేసుకునే సమయంలో రైతుకు అవసరమనే కదా ప్రభుత్వం రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది!!. మరి ఆ సబ్సిడీని నిలిపేస్తే రైతులు ఇబ్బందులు పడరా? రైతుల ఇబ్బందులు ఈ ఎన్డీఏ కూటమికి గానీ..ఎన్నికల కమిషన్‌కు గానీ పట్టవా? ఎవరేమైపోయినా మాకు రాజకీయాలే ముఖ్యమనుకుంటే ఎలా చంద్రబాబూ? విత్తన సబ్సిడీ అందకపోతే ఎలా? నిజానికి రబీ కోతలు పూర్తి కావడంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి విత్తన సబ్సిడీపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం వారికి మింగుడుపడటం లేదు. నిజానికి గతంలో మాదిరే సీజన్‌కు ముందే సబ్సిడీపై పంపిణీ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేసి... కోడ్ నేపథ్యంలో పంపిణీకి అనుమతినివ్వాల్సిందిగా ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఐదేళ్లుగా ఏ విత్తనాలు ఏయే తేదీల్లో పంపిణీ చేసారో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏటా కోతలు పూర్తయిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని, అదును దాటి పోయాక పంపిణీ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికారులు లేఖలో పేర్కొన్నా... ఈసీ తిరస్కరించింది. రబీ కరువు పంట నష్టం అంచనాలకూ బ్రేకు వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ సీజన్లో 84 మండలాలను కరువు మండలాలను ప్రకటిస్తూ మార్చి రెండోవారంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంట నష్టం అంచనా వేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఇన్నాళ్లూ మిన్నకున్న ఈసీ... నష్టం అంచనాపై ఆంక్షలు విధించింది. అనుమతి ఇవ్వలేమని తేచ్చిచెప్పేసింది. దీంతో రబీ కరువు సాయం అందుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ‘విద్యా దీవెన’ నిధులపైనా విషమే! పేద విద్యార్ధులకు చెల్లించే ‘విద్యా దీవెన’ నిధులనూ చంద్రబాబు కూటమి నిలుపు చేయించింది. ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేయటంతో... ఎన్డీఏ భాగస్వామి కనక బాబుకు అనుకూలంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల చెల్లింపునూ నిలిపేసింది. నిజానికి విద్యార్థులు ఇప్పుడు కాలేజీలు మారాల్సి ఉంటుంది. విద్యా దీవెన నిధులు చెల్లిస్తే గానీ కాలేజీలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేమని చెబుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే రూ.610.79 కోట్లు విడుదల చేసినా... కూటమి కుట్ర కారణంగా పేద విద్యార్దులు బయట అప్పులు చేసి కాలేజీలకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ నీరో చక్రవర్తుల మాదిరి తమాషా చూస్తున్నారు తప్ప రైతుల గురించి గానీ, విద్యార్థుల గురించి గానీ ఆలోచిస్తే ఒట్టు. ఇప్పుడు రైతులు, విద్యార్థులు అప్పుల పాలైతే నీ కళ్లు చల్లబడతాయా చంద్రబాబూ? ఈసీపై ఒత్తిళ్లు... ఎన్డీఏ భాగస్వామి కనక ఓకే నిజానికి ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన చెల్లింపులు గత ఐదేళ్ల నుంచీ అమలవుతున్నాయి. ఇవేమీ కొత్తవి కావు. లబ్దిదారుల ఎంపిక కూడా ఎప్పుడో చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక చేసిందేమీ లేదు. కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని నియమావళిలో స్పష్టంగా ఉంది. కాబట్టి వీటికి కేంద్ర ఎన్నికల సంఘం సహజంగానే అనుమతివ్వాలి. మరో చిత్రమేంటంటే మిగతా రాష్ట్రాల్లో ఇలా ఏ పథకాన్నీ అడ్డుకోవటం లేదు కూడా. ఉదాహరణకు తెలంగాణలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు గత నెల 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4న ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. అంతేకాదు. రైతు బంధు నిధులను విడుదల చేస్తూ సోమవారమే జీవో ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో ఇవి రైతుల ఖాతాల్లోకి పడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కూడా. నిజానికి 2019 ఎన్నికల్లో చూసుకున్నా... అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ‘పసుపు కుంకుమ’ పేరిట మూడో విడత నిధులను మహిళల ఖాతాల్లో వేశారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ లేని నిబంధన ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఎందుకు వర్తింపజేస్తున్నారు? దీన్నిబట్టి చంద్రబాబు తనకు అలవాటైన కుట్రను ఎంత లోతుగా కొనసాగిస్తున్నారో... ఈసీపై తన ‘బీజేపీ మిత్రుల’ ద్వారా ఎంత ఒత్తిడి చేయిస్తున్నారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. పింఛన్లపైనా ఇలాంటి దారుణాలే... కేంద్ర ఎన్నికల కమిషన్‌పై అటు చంద్రబాబు, బీజేపీలోని ఆయన మిత్రులు, ఎల్లో మీడియా, నిమ్మగడ్డ రమేశ్... ఇలా పచ్చ మంద మొత్తం కలిసి దారుణంగా ఒత్తిడి తెచ్చి సామాజిక పింఛన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను రాచిరంపాన పెట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతవుల ఇంటికి పింఛను రాకుండా అడ్డుకుని... వాల్లను మండుటెండల్లో సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిప్పుతూ కొంత మంది వృద్దులు మరణానికి కూడా కారణమయ్యిందీ ముఠా. మొదటి నెల సచివాలయాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయగా.. ప్రతి ఊరికీ సచివాలయం ఉండటంతో వృద్ధులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కూడా నచ్చని పచ్చ ముఠా... నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లో వెయ్యాలని ఈసీపై ఒత్తిడి తెచ్చాయి. ఈసీ అలాగే చేయటంతో... బ్యాంకులకు వెళ్లలేక, ఏటీఎంల వద్ద ఎండల్లో నిల్చోలేక వృద్ధులు నరకయాతన అనుభవించారు. చంద్రబాబును ప్రతి ఒక్కరూ నోరారా తిట్టుకున్నారు. జనం ఆగ్రహం తమ మీదకు మళ్లుతోందని భయపడ్డ బాబు... అదంతా వైఎస్ జగన్ వల్లే అయిందంటూ తన రామోజీరావు చేత దుర్మార్గపు కథనాలు రాయించాడు. ఈ కుట్రలన్నిటికీ ప్రజలే జబాబు చెబుతారు బాబూ!!. -
దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి
-
కళ్లు చల్లబడ్డాయా బాబూ!
సాక్షి, అమరావతి: పింఛన్ల కోసం ఎర్రటి ఎండలో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు బ్యాంకుల వెంట, ఏటీఎంల వెంట, సచివాలయాల వెంట తిరుగుతున్నారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా చంద్రబాబు నాయుడూ? ఇప్పుడు నీ మనసు శాంతించిందా? ఐదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లు... ఈ ఒకటి రెండు నెలల్లోనే ఓటర్లను ప్రభావితం చేసేస్తారా?ఒకవేళ ప్రభావితం చేయగలిగి ఉంటే ఇప్పటికే చేసి ఉండేవారు కదా!!. ఐదేళ్లలో లేనిది... కొత్తగా ఈ రెండు నెలల్లో మారింది.. ఏంటి చంద్రబాబు నాయుడూ నీ కుట్ర బుద్ధి తప్ప? మీరే గనక పనిగట్టుకుని కోర్టుల్లో పిటిషన్లు వేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి వలంటీర్లను ఈ కార్యక్రమానికి దూరం చేయకుండా ఉంటే అవ్వాతాతలకు ఈ కష్టాలుండేవా? వాళ్లు ఈ రెండు నెలలు కూడా ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చి ఉంటే పండుటాకులు ఇంత వేదన పడేవారా? ఇదెక్కడి రాజకీయం బాబూ? బ్యాంకుల్లో వెయ్యమన్నదీ మీరేగా? ప్రతి పథకాన్నీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం పింఛన్లను మాత్రం ఎందుకు వేయటం లేదు? వలంటీర్లు నేరుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి... ఆయన వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి, దత్త పుత్రుడు పవన్.. వీళ్లు చెప్పినట్టల్లా ఆడే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వీళ్లంతా అడిగిన ప్రశ్న ఇదే. అక్కడితో ఆగలేదు వీళ్లెవరూ. కోర్టులకెక్కారు. వలంటీర్లు పింఛన్లు ఇవ్వటానికి ఈ మూడు నెలలూ వీల్లేదన్నారు. నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే నగదు వెయ్యాలని ఎన్నికల కమిషన్‌కు నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చెప్పారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ బహిరంగ సభల్లో కూడా ఇదే చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో వేసేలా ఈసీపై ఒత్తిడి తెచ్చారు. నిజానికి బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఏమవుతుందో ప్రభుత్వానికి తెలియదా? ప్రతి పథకాన్నీ పైసా అవినీతికి తావు లేకుండా నేరుగా లబి్ధదారులకే చేరుస్తున్న వైఎస్ జగన్‌కు ఇదంతా తెలియదా? కానీ పింఛన్లు తీసుకుంటున్న వాళ్లంతా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వాళ్లు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే తీసుకోవటం వాళ్లకంత సులువేమీ కాదు. బ్యాంకులు ఎక్కడో ఊళ్లకు దూరంగా ఉంటాయి. అన్ని గ్రామాల్లోనూ ఏటీఎంలు అందుబాటులో లేవు. పైపెచ్చు ఖాతాల్లోని డబ్బులు ఎలా తియ్యాలో కూడా కొందరికి తెలియదు. కొందరికి ఖాతాలే లేవు. ఇంకొందరిదైతే ఇల్లు కదల్లేని పరిస్థితి. అందుకే బ్యాంకుల్లో వేయకుండా... ఆ నగదును బ్యాంకుల్లో డ్రా చేసి నేరుగా వలంటీర్లు ఇళ్లకు పట్టుకెళ్లి వాళ్లకు ఇస్తున్నారు. ఒకరకంగా ఖాతాల్లో వేయటానికన్నా అడ్వాన్స్డ్ ప్రక్రియ ఇది. అలాంటి ప్రక్రియను నిలిపేయించడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబూ? ఖాతాల్లో వెయ్యమని చెప్పేటప్పుడు వీళ్లు ఇన్ని కష్టాలు పడతారన్న సంగతి నీకు తెలియనిది కాదు కదా? మండుటెండల్లో విలవిల్లాడుతున్న వృద్ధుల శాపాలిపుడు ఊరికే పోవు కదా? బాబు రక్షణకు ఎల్లో మీడియా... ఎండలకు విలవిల్లాడుతూ వృద్ధులు పెడుతున్న శాపనార్థాలకు తానెక్కడ కొట్టుకుపోతాడోనన్న భయం చంద్రబాబునిపుడు నిలువెల్లా వణికిస్తోంది. దీంతో పింఛన్లు ఇవ్వటానికి సచివాలయ సిబ్బందిని వినియోగించాలని, వాళ్ల ద్వారా ఇంటింటికీ పంచాలని కథలు చెబుతున్నారు. నిజానికి సచివాలయ సిబ్బందిని కూడా మొదట్లో అడ్డుకున్నది చంద్రబాబే. పైపెచ్చు ప్రతి ఇంటినీ అడ్రస్ పట్టుకుని వెతకటం, ఆ చిరునామాలో ఉన్నవారికి ఇవ్వటం ఎవరో కొత్తవారిని చెయ్యమంటే సాధ్యం కాదు. అయితే ఈసీ ఆదేశాల మేరకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లే పింఛన్లు ఇస్తున్నారు. దారుణమేంటంటే ఇలా పింఛన్లిచ్చేటపుడు కొందరు చిరునామాలు దొరక్క వలంటీర్ల సాయం తీసుకుంటున్నారు. కానీ వారు వలంటీర్ల సాయం తీసుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ‘ఈనాడు’ దాని తోక మీడియా దౌర్భాగ్యపు రాతలు రాసి ఆయా సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేదాకా వెంటాడుతున్నాయి.చంద్రబాబు మాత్రం సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఇస్తే బాగుంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైపెచ్చు చేసిందంతా చేసి... ఇలా వృద్ధులు మండుటెండల్లో బయటకు రావటానికి ముఖ్యమంత్రి జగనే కారణమని ‘ఉల్టా చోర్...’ తరహాలో నిందిస్తున్నారు. ఈ మాటలు ఎవరూ నమ్మటం లేదని తెలిసి... ఎల్లో మీడియానూ రంగంలోకి దింపారు. ‘ఈ పాపం జగన్‌దే’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వండి వార్చిన కథనం ఉద్దేశం చంద్రబాబును రక్షించటమే. మొదటి నుంచీ వలంటీర్లంటే కక్షే... కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఏపీ వలంటీర్ల సైన్యాన్ని ప్రశంసించని వారు లేరు. కానీ చంద్రబాబు ముఠాకు మొదటి నుంచీ ఈ వ్యవస్థంటే ఇష్టం లేదు. వలంటీర్ల సేవల కారణంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరొస్తుండటమే దీనికి కారణం. ఈ వ్యవస్థను ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వలంటీర్లంతా మగవాళ్లు లేనపుడు ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వీళ్లది మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు నాయుడు నానా మాటలూ అన్నారు. ఇక ఈయన గారి దత్తపుత్రుడైతే మూడడుగులు ముందుకేసి.. వలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని, ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ తమ వాళ్లచేత కేసులూ వేయించారు. కానీ వీళ్ల పథకాలేవీ పారకపోవటంతో... తాము వలంటీర్లకు వ్యతిరేకం కాదంటూ, తాము గెలిస్తే వారి పారితోషికాన్ని పెంచుతామంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. చేసిన పనికి కూలీ ఇవ్వనివాడు ఫ్రీగా బిరియానీ పెట్టిస్తానంటే నమ్మేదెవరు బాబూ? బాబు యావ తెలియనిదెవరికి? బాబుకు పని చేయటం చేతకాదు. కానీ చేయని పనిని కూడా అందంగా చెప్పుకోవటంలో మాత్రం పెద్ద బిడ్డే. అమరావతిలో ఒకటిరెండు భవనాలు కూడా కట్టకుండానే అదో పెద్ద సింగపూర్‌లా అయిపోయినట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసుకున్న ఘనత బాబుది. నిజానికి అమరావతిని గురించి తెలిసిన వారు... బయటి వారెవరైనా ఆ ప్రాంతమెలా ఉందని అడిగితే, పేరు తప్ప అక్కడేమీ లేదని చెప్పటానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇక 2015లో గోదావరి నదిని ఈయనే కనిపెట్టినట్టు పుష్కరాల సందర్భంగా భారీ ప్రచార వీడియోను షూట్ చేయబోయి ఏకంగా 29 మంది అమాయక భక్తుల్ని బలితీసుకున్నాడు. ఏడాదిన్నర కిందట కూడా... ఎక్కువ మంది జనం వచ్చినట్లుగా చూపించుకోవాలన్న తాపత్రయంలో ఇరుకు సందులో సభ నిర్వహించి, జనాన్ని రప్పించడం కోసం తాయిలాలు కూడా ఇవ్వటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెబుతూ పోతే బాబు ప్రచారపిచ్చికి ఎంతైనా చాలదు. అప్పుడు ప్రభావితం చేస్తారా..!! వలంటీర్లను రాజకీయాలకు సంబంధం లేకుండా, అందరి వద్ద నుంచి నిర్ణీత సమయంలో దరఖాస్తులు స్వీకరించి, అధికారులు ఇంటర్వ్యూలు చేసి వారిని ఎంపిక చేశారు. అలాంటి వలంటీర్లు ఇప్పుడు పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటింటికి వెళితే, వాళ్లు అధికార పార్టీకి అనుకూలంగా లబ్దిదారులను ప్రభావితం చేస్తారనేది చంద్రబాబు అండ్ కో విపరీత బుద్ధి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే అంశంపై ఫిర్యాదు చేసి వలంటీర్లను అడ్డుకున్నారు. ‘అయినా నిత్యం ఆ 50 ఇళ్ల మధ్య ఉండే వలంటీర్లు... పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటికి వెళ్లిన పది నిమిషాలు లేదా పావుగంట సమయంలోనే రాజకీయంగా ప్రభావితం చేస్తారా? వాళ్లు గనక చెయ్యాలనుకుంటే మిగిలిన రోజులన్నీ వాళ్ల పక్కనే ఉంటూ ప్రభావితం చేసే అవకాశం ఉండదా?’ అనేది పింఛనుదార్ల మాట. బాబూ... అచ్చెన్నాయుడు చేత ఫిర్యాదు చేయించలేదా? వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని చంద్రబాబు తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఈ ఏడాది మార్చి 1న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదులో.. ‘ప్రభుత్వం పింఛన్ల పంపిణీ, రేషన్ల పంపిణీలో వలంటీర్లను ఉపయోగిస్తోంది. వలంటీర్లు తమ గ్రామాల్లో, వార్డులో రాజకీయ కార్యకలాపాల్లో నిమ్నగమయ్యే అవకాశం ఉంది. వలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచే గౌరవ వేతనాలు చెల్లిసున్నందున సెక్షన్ 32 ఆర్పీ చట్ట ప్రకారం ప్రభుత్వ సేవకులకు వర్తించేలా శాఖపరమైన క్రమశిక్షణ, నిబంధనలను వీళ్లకూ వర్తింపజేయాలి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు వలంటీర్లపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ ఈసీని కలిసి ‘‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు పింఛను డబ్బులు వాళ్ల ఖాతాల్లోనే జమ చేయాలి’’ అని సూచించారు. ఈ విషయాన్ని ఈటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. దీంతో ఈసీ ‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ విధానంలో పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. 97.91% మందికి పంపిణీ రాష్ట్రంలో 97.91 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. 65,49,864 మందికి ఈ నెల పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి 64,13,200 మందికి పెన్షన్ డబ్బులు నేరుగాను, బ్యాంకు ఖాతాల్లో జమచేయడం ద్వారాను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇవీ... వలంటీర్లపై బాబు, పవన్ మాటలు ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది. గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం, డిస్ట్రబ్ చేయడం. పగలు మగవాళ్లు ఉండరు.. వలంటీర్లు పోయి తలుపులు కొడుతున్నారు. ఎంత నీచం ఇది’ – 2019, సెపె్టంబర్ 27వ తేదీన చంద్రబాబు ‘ఊళ్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటిష్ ఏజెంట్లలా వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ – 2021, అక్టోబర్ 30న కుప్పంలో చంద్రబాబు ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశి్నస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్లకేంటి సంబంధం’ – 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో చంద్రబాబు. ‘వలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ – 2023, అక్టోబర్ 7న ఏలూరులో పవన్‌కళ్యాణ్ పింఛన్ కోసం వెళ్లి 12 మంది మృతిరెండు రోజుల్లో 16 మంది మృత్యువాత సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు వికృత రాజకీయానికి రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు బలవుతున్నారు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛను కార్యక్రమంపై చంద్రబాబు తన మనుషులతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి పంపిణీని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసి, బ్యాంకుల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు అవ్వాతాతలు మండుటెండలు, వడగాడ్పుల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలా గురువారం పింఛను కోసం వెళ్లి వడదెబ్బకు నలుగురు మరణించగా, శుక్రవారం 12 మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం జంబుకేశవపురానికి చెందిన జి.నాగయ్య (68), పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరుకు చెందిన ఇంజేటి మంగతాయారు (69), గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన వితంతు మహిళ చొప్పర లక్ష్మి (49), బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువుకు చెందిన చాగంటి సుబ్బాయమ్మ (68), ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన తానికొండ రమణమ్మ (65), ఏలూరు జిల్లా పోలవరం బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాంకు చెందిన కె.పోలినాయుడు (70), కర్నూలు జిల్లా మాచాపురం గ్రామానికి చెందిన ఆనంద్ (61), వైఎస్సార్ జిల్లా బద్వేలులో నాగిపోగు యల్లమ్మ (64), రామయ్య (68), పల్నాడు జిల్లా చిలకలూరిపేటకి చెందిన మాట నాగేశ్వరరావు (65), అనంతపురం జిల్లా ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన ఎరుకుల సుంకన్న (72) వడదెబ్బకు మృతి చెందారు. -
బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష
-
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
వరుసబెట్టి పదేపదే ఫిర్యాదులతో..మేం 2024 మార్చి 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ) విధానంలో ఫింఛన్ల పంపిణీకే పాధాన్యం ఇవ్వండి. లేదంటేనే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న సీఎస్‌కు ఈసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం. (ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులిచ్చిది) విలన్ నంబర్–1 పింఛను లబ్ధిదారుల్లో బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పి వస్తున్నాం. బ్యాంకు అకౌంట్లు లేని వారికి సచివాలయం వద్ద పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పాం. దివ్యాంగులకు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చు. – 20 రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలివీ. (ఇతను చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.)విలన్ నంబర్ 2 కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ(నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ) రూపంలో అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పింఛన్ డబ్బులను అలా ఎందుకు పంపిణీ చేయదు? – 10–15 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్(ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే.) సహాయ పాత్రధారులు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఖాతాల్లోనే పెన్షన్ వేయాలి. మిగిలిన వారికి ఇళ్లకే వెళ్లి ఇస్తే సిబ్బందికి శ్రమ తగ్గుతుంది. ఏప్రిల్ 28న ఏపీ బీజేపీ నేతల సూచనసాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి ఐదేళ్లుగా ప్రతి నెలా ఠంచన్‌గా ఇంటివద్దే చేతికి ఇస్తున్న పెన్షన్లకు అడ్డుపడి రచ్చ చేసిన పచ్చ బృందం సచివాలయాల్లో అందిస్తున్నా శాంతించలేదు! మండుటెండల్లో తిరగలేక పండుటాకుల ప్రాణాలు విలవిల్లాడే పరిస్థితికి తెచ్చిది. అవ్వాతాతల ఉసురు మూటగట్టుకుంటూ పెద్ద ప్రాణాలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా వికృత రాజకీయాలకు బాబు బృందం తెర తీసింది! అవ్వాతాతల ఫించన్ల కష్టాలకు చంద్రబాబు, ఆయన సన్నిహితులు, మిత్ర పార్టీల నిర్వాకాలే కారణం. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటూ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, కొందరు ఏపీ బీజేపీ నాయకులు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లోనే పింఛను డబ్బులు జమ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. పింఛన్‌దారులకు ఇళ్ల వద్ద కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి తానే చెప్పానంటూ ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన అనంతరం నిమ్మగడ్డ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇలా ఈసీకి వరుస ఫిర్యాదులతోపాటు ఉన్నతాధికారులను బెదిరించేలా ఎల్లో మీడియాలో కథనాలు వెలువరించేలా చంద్రబాబు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మరోవైపు ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ అవే అవస్థలుఐదేళ్ల తర్వాత మళ్లీ అవ్వాతాతలు పింఛన్ల కోసం అవస్థ పడుతూ ఊరు దాటారు! తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు చేరుకుని చాంతాడంత క్యూలో నిలబడి నానా అగచాట్లు పడ్డారు. గత 58 నెలలుగా ప్రతి నెలా ఏ కష్టం లేకుండా కరోనాలో సైతం ఠంఛన్‌గా ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా పింఛన్ మొత్తాన్ని అందుకున్న లక్షలాది మంది పింఛన్‌దారులు ఈసారి కొత్తగా బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా అందే ఆ డబ్బులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఖాతాల్లో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు చేరుకోవడంతో గురువారం రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు పింఛన్ లబ్ధిదారులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ మంది అవ్వాతాతలు బ్యాంకులు తెరవక ముందే ఉదయం 9 గంటల నుంచే చేరుకుని ఎదురు చూస్తూ ఉండిపోయారు. బ్యాంకు అందుబాటులో లేని గ్రామాలకు చెందిన వారు పనులు మానుకుని 10 కి.మీ. దూరంలోని ప్రాంతాలకు తరలి వచ్చారు. పలుచోట్ల ఊళ్లకు ఊళ్లే తరలిరాగా పింఛను డబ్బులు పడ్డ బ్యాంకు ఖాతాలు చాలా కాలంగా వినియోగంలో లేని కారణంగా ఇన్ యాక్టివ్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఉసూరుమన్నారు. బ్యాంకు అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు ఒకేసారి వందల మంది రావడంతో బ్యాంకు సిబ్బంది సైతం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. బాబు సేవలో వీర విధేయులు.. పింఛను డబ్బులు బ్యాంకుల్లో జమ చేయాలంటూ ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. 2020లో మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకు నోటిఫికేషన్లు జారీ చేయగా ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు ఏకగ్రీవంగా గెలుస్తున్న పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా నిలిపివేశారు. చంద్రబాబు కుటుంబ బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ పొత్తులో దక్కిన సీట్లను 20–30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా చంద్రబాబు వీర విధేయులుగా ముద్రపడ్డ బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకు ఇచ్చారు. దీనికిపై సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేయడంలోనూ నిమ్మగడ్డ, పురందేశ్వరి లాంటి వారిని ముందు పెట్టి చంద్రబాబు రాజకీయ డ్రామాలకు తెర తీశారు.మొదలు పెట్టిందే టీడీపీరాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇంటి వద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే దీన్ని అడ్డుకుంటూ చంద్రబాబు సన్నిహితులంతా వరుసపెట్టి ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు సామాజికవర్గం పరంగా, రాజకీయ ప్రయోజనాల పరంగా వివిధ సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఫింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీకి బ్రేక్‌లు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిది. టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదుల మేరకే వలంటీర్లు పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు వినియోగించే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్‌లో పింఛను డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చేపట్టారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్న అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు ఏ కష్టం లేకుండా పింఛను తీసుకున్న వారికి ఈ నిర్ణయం కాస్త కష్టంగా అనిపించినా కేవలం ఐదు రోజులోనే అందరికీ సజావుగా డబ్బులు చేతికి అందాయి. అయినా సరే ఆగకుండా టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు ఉమ్మడిగా గత నెల రోజులుగా దాదాపు రోజు మార్చి రోజు పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు వెలువరించి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై నెపం వేస్తూ చంద్రబాబు, టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారు.చంద్రబాబు మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు పది కిలోమీటర్ల దూరం నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు జంగారెడ్డిగూడెం వచ్చా. ఉదయం 9 గంటలకే ఇక్కడకొచ్చిన నేను పింఛన్ సొమ్ము తీసుకుని ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది. మండుటెండలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిది. చంద్రబాబు ఎన్నికల ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. దాని పర్యావసానాలు చంద్రబాబు అనుభవించాల్సిందే. – రాయల మునేశ్వరరావు, పింఛన్ లబ్ధిదారుడు, కేతవరం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా ముసలివాళ్లపైనా మీ ప్రతాపం ప్రతినెలా 1వ తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. గత నెల సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకున్నాం. ఈ నెల బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చిది. మండుటెండలో ఎలా వెళ్లగలం. చంద్రబాబు, ఆయన మనుషులు చేసిన ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు అందకుండా పోయాయి. ముసలివాళ్లపై ఇలా అక్కసు చూపడం తగదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఉసురు తగులుతుంది. – పెసర పోలమ్మ, పాలమెట్ట, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లానా అకౌంట్ రన్నింగ్‌లో లేదంటున్నారు సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా వలంటీర్‌ను మా ఇంటికి పంపించి పింఛన్ డబ్బులు ఇచ్చేవాడు. వలంటీర్లను ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈ నెల పింఛన్ డబ్బు బ్యాంకులో వేశారని చెప్పారు. ఇండియన్ బ్యాంకుకు వెళ్లి అడిగితే నా అకౌంట్ రన్నింగ్‌లో లేదని చెప్పారు. ఎండలోనే వెళ్లి ఎండలోనే ఇంటికి తిరిగివచ్చా. ప్రతినెల మందులు వాడుతున్నా. ఇప్పుడు పింఛన్ డబ్బులు రాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. – షేక్ గాలిబ్‌సాహెబ్, పింఛన్‌దారుడు, పెండ్యాల, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లాచంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో నా వయసు 70 ఏళ్లు పైనే. పింఛన్ తీసుకోలేకపోతున్నా. ఈ నెల పింఛన్ బ్యాంకులో జమ చేసినారంట. అక్కడికెళ్లాలంటే.. రెండు కిలోమీటర్లు నడిసి హైవే కాడికి పోవాల. ఆటి నుంచి బస్సో, ఆటోనో ఎక్కి మళ్లీ 5 కిలోమీటర్ల దూరంలోని వెల్దుర్తి మండల కేంద్రానికి పోవాల. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరం బస్సులో డోన్‌కి పోవాల. అక్కడ బ్యాంకులో పింఛన్ జమ చేసి ఉంటే సరి. లేదంటే నేను ఎన్ని తిప్పలు పడాలో. ఎన్నికల సమయంలో మళ్లీ ఆ చంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో ఏమో పింఛన్ తీసుకోవడానికి ఈ ఎండల్లో సచ్చి బతుకుతున్నాం – సుబ్బయ్య, అల్లుగుండు గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లామా ఉసురు తగలకపోదు నా వయసు 70 సంవత్సరాలు. గతంలో 1వ తారీఖు తెల్లవారుజామునే తలుపుతట్టి వలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడంటగా.. మాకు ఇంటి దగ్గరకొచ్చి పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ కోసం ఎండలో వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్నా. గంటల కొద్దీ లైన్లో నిలబడాలంటే వయసు సహకరించడం లేదు. ముసలోళ్లపై కక్ష గట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగలకపోదు. – దిబ్బమ్మ, నాగెళ్లముడుపు, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లాపింఛన్ కోసం తిరగలేక అల్లాడుతున్నాం వృద్ధాప్య పింఛన్‌ను ప్రతి నెలా ఇంటికే వచ్చి ఇచ్చేవారు. అయితే చంద్రబాబు కుట్ర ఫలితంగా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే ఇక్కడ కాదు.. బ్యాంకులో జమవుతుందన్నారు. దుత్తలూరులోని యూనియన్ బ్యాంక్‌కు వెళ్తే నగదు జమ కాలేదని తెలిపారు. ఈ రోజంతా ఇలానే గడిచిపోయింది. ఎండలో అవస్థలు పడాల్సి వచ్చిది. ముసలోళ్లను ఇంత ఇబ్బందికి గురిచేసిన వారికి తగిన బుద్ధి చెప్తాం. – దుగ్గినబోయిన పెద్దగురవయ్య, చింతలగుంట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!
-
చంద్రబాబు తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు.. దానికి ఇదే నిదర్శనం
-
పచ్చవన్నె మేధావులు
ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు నిత్యం సీఎం వైఎస్ జగన్ పైనా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా కక్ష పూరితమైన ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్య భక్షకులుగా మారడం మేధావులను నివ్వెరపరుస్తోంది. వీళ్లు నిజంగా సివిల్ సర్వీసుల్లో పనిచేసిన అధికారులేనా అని అనుమానం వచ్చేలా వారి వ్యవహారశైలి ఉంటోంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో చంద్రబాబుకు అనుకూలంగా, వైఎస్ జగన్‌పై మితిమీరిన అక్కసుతో వారు చేస్తున్న ఆరోపణలు సమాజాన్నే తప్పుదోవ పట్టించడానికేనన్నది స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులు, గల్లీ లీడర్ల మాదిరిగా ఎల్లో మీడియాలో వారు చేస్తున్న రచ్చను చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకాలం తాము కలిసి పనిచేసింది ఇంతలా దిగజారిన మనుషులతోనా అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతున్న వీరి నిజస్వరూపం తెలుసుకోండి. – సాక్షి, అమరావతి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ 2021 వరకు మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు సిఫార్స్ చేశారు. అప్పట్లో పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనని నిమ్మగడ్డ అప్పట్లో వాటిని నిర్వహించలేదు. ఇక 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఒకే విడతలో నిర్వహించాలని 2020 ఫిబ్రవరి–మార్చి నెలల్లో నోటిఫికేషన్ జారీచేయగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి అధికారిక వైఎస్సార్సీపీకే దాదాపు సగం స్థానాలు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వానికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా కరోనా పేరుతో వాటిని అర్ధంతరంగా వాయిదా వేసి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఇక జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్లు–గ్రామ సచివాలయాల వ్యవస్థల ద్వారా నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే తీసుకొస్తే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరున వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేశారు. ఈయన ఫిర్యాదు కారణంగా అవ్వాతాతల పింఛన్లను ఇంటివద్దే పంపిణీ చేసే ప్రక్రియకు బేకులు పడ్డాయి. మన్నెం నాగేశ్వరరావు ఈయన అత్యంత అవినీతిపరుడు.. వాదాస్పద రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా చేసిన ఈయన యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. బీహార్‌లో ఓ ప్రభుత్వ వసతి గృహంలో బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడం ద్వారా నిందితులకు ఈయన కొమ్ముకాశారన్నది తేలింది. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ఈయన దర్యాప్తు అధికారిని బదిలీ చేయడం గమనార్హం. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసెస్, హోంగార్డు విభాగానికి బదిలీ చేసింది. నిజానికి.. ♦ నాగేశ్వరరావు ఎక్కడ ఏ పోస్టులో ఉన్నా యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ♦ ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ ‘ద వైర్’తోపాటు జాతీయ మీడియా ఆయన అవినీతి బాగోతాలను ఎన్నోసార్లు బయటపెట్టింది. ♦ అప్పట్లో సీబీఐ డీజీగా ఉన్న అలోక్ శర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్తానా మధ్య విభేదాలు ఏర్పడటంతో మధ్యేమార్గంగా ఎం.నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు. అప్పట్లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ఉన్న కేవీ చౌదరి అండదండలతోనే ఈయనకు ఆ పదవి దక్కిందని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. ♦ ఇక ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పటి నుంచే ఈయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. పీవీ రమేష్ తాను ఆశించిన విధంగా సర్వీసు పొడిగింపు ఇవ్వలేదని అక్కసుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సీఎం జగన్‌పై కక్ష పెంచుకుని నిమ్మగడ్డ బృందంతో చేతులు కలిపారు. తనను తాను మేధావిగా ఊహించుకునే ఈయన రిటైరైన వెంటనే సిగ్గూఎగ్గూ లేకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే ఒక కార్పొరేట్ కంపెనీలో చేరాడు. తన పలుకుబడిని ఆ కంపెనీ కోసం ఉపయోగిస్తానని చెప్పి ఉద్యోగం దక్కించుకున్న ఈయన ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి చిలక పలుకులు చెబుతున్నారు. ♦ అలాగే, 2018లో సీబీఐ చెన్నై జోన్ డైరెక్టర్‌గా ఉండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న 70మంది ఐఆర్ఎస్ అధికారుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా వ్యవహరించారనే తీవ్రమైన ఆరోపణలు ఈయనపై వచ్చాయి. దీంతో ఆయన్ని అప్పట్లోనే హఠాత్తుగా బదిలీచేశారు. ♦ ఇక నాగేశ్వరరావు తన భార్య పేరుతో ఏకంగా ఓ షెల్ కంపెనీలో భాగస్వామిగా భారీగా అక్రమ నిధులు తరలించారు. వాటితో ఆమె గుంటూరు జిల్లాలో భూములు కొనుగోలు చేశారన్నది వెలుగులోకి రావడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆమె ఆ షెల్ కంపెనీలోని 100 షేర్లను కేవలం రూ.వెయ్యికి కొనుగోలు చేసి వాటిని వెంటనే భారీ విలువకు విక్రయించడం గమనార్హం. ఆ షెల్ కంపెనీ షేర్ల ముసుగులోనే భారీ అవినీతికి పాల్పడినట్టు వెల్లడైంది. ♦ అంతేకాదు.. ఒడిశాలోని ఖుర్దాలో ఫోర్జరీ పత్రాలతో ఓ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినట్లు చూపించి భూకబ్జాకు తెగబడ్డారు. ♦ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కూడా నిందితులకు అనుకూలంగా నాగేశ్వరరావు వ్యవహరించడంతోనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ♦ సీబీఐ డైరెక్టర్ పోస్టుకు నాగేశ్వరరావు అనర్హుడని కోర్టు తేల్చడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించింది. ♦ ఇలా తన పదవిని దుర్వినియోగం చేశాడని కోర్టు ఛీవాట్లు పెట్టిన ఆ అధికారి రిటైర్ అయ్యాక ప్రజాస్వామ్య పరిక్షరణ ఉద్ధారకుడి అవతారమెత్తి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తుండడం, అది కూడా చంద్రబాబుకి మద్దతుగా చేస్తుండడాన్ని ఎలా చూడాలి? వీళ్ల నినాదం సేవ్ ఫర్ డెమోక్రసీ.. కానీ, వీరు సేవ్ ఫర్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. -
గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?!: పోసాని
సాక్షి, విజయవాడ: గతంలో చంద్రబాబు కాపులను రౌడీలని అనలేదా? అంటూ ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్‌కు దేవుడు. చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు’’ పోసాని ధ్వజమెత్తారు. వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు. చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు లొంగదీసుకున్నారు’’ అని పోసాని కృష్ణమురళీ నిప్పులు చెరిగారు. -
పేదలు పణంగా బాబు రాజకీయం
రాజకీయాల్లో వ్యూహాలు – ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు వేయటం, ప్రత్యర్ధిని దెబ్బతీసి తాము అధికార పగ్గాలు చేపట్టాలనుకోవటం సహజం. దీని కోసం కొంతమంది స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తే మరి కొంతమంది నాయకులు వెన్ను పోట్లు, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తారు. ఇవి కూడా చర్చనీయాంశమే అయినా... పవర్ కోసం కొట్లాట రాజకీయ పార్టీలు, రాజ కీయ ప్రత్యర్ధుల మధ్య ఉండటం వరకు సమర్థించవచ్చు. కాని స్వార్థం హద్దులు దాటి అధికారం కోసం, ప్రత్యర్ధిని దొంగ దెబ్బ తీయటం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెట్టాలనుకోవటం, బలహీన వర్గాల ప్రజలతో చెలగాటం ఆడే కుట్రలు... ఏ మాత్రం సహించ దగినవి కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కూటమి ఇప్పుడు ఇటువంటి ప్రమాదకర రాజకీయ క్రీడకు తెర తీశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తీవ్ర అనారోగ్యగ్రస్థులకు వారి ఇంటి దగ్గరే వాలంటీర్లు పెన్షన్ అందించే విధానాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు. తన జేబులోని మనిషి, తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్లు పెన్షన్లను లబ్ధిదారులకు పంచకూడదని ఫిర్యాదు చేయించారు. వీరి ఫిర్యాదుకు అను గుణంగా ఈసీ ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పుడు 66 లక్షల మంది పెన్షనర్లు మూడు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో, బాబు హయాంలో పెన్షన్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల వద్ద పండుటాకులు ఎలా పడిగాపులు పడేవారో పత్రికల్లో ఫోటోలతో సహా వార్తలు నిత్యం వస్తూ ఉండేవి. వారం, పది రోజుల పాటు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది ఆ రెండు వందల రూపాయల పెన్షన్ కోసం. పూట గడవని స్థితిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అవ్వా తాతలు అలానే అంతటి కష్టాన్నీ భరించే వారు. కాస్త కాలు చేయి బాగానే ఉన్నవారు సరే. మరి మంచాన పడిన వారు, నాలుగడుగులు కూడా వేయలేని వారు, ఆసరా లేకుండా నిలబడ లేని వారి పరిస్థితిని ఊహించగలమా? జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిస్సహాయులను ఇటువంటి దుఃస్థితి నుంచి బయటపడేశారు. పెన్షన్ కోసం మంచం దిగాల్సిన అవసరం రాకుండా సగౌరవంగా వాలంటీర్లే లబ్ధి దారుల ఇళ్ళకు వెళ్ళి అవ్వా, తాతల చేతుల్లో పెట్టే విధంగా వాలంటీర్–సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారు. అది కూడా ఫస్ట్ తేదీనే, కోడి కూయక ముందే! ఇప్పుడు అక్షరాల 3 వేల రూపాయల పెన్షన్ 66 లక్షల మందికి అందు తోంది. వృద్ధులనే కాదు వికలాంగులు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ వంటి తీవ్ర రోగాల పాలైన వారిని కూడ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకుంటోంది. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడేందుకు వీరి ఆరోగ్యం సహకరించదు. ఓ వైపు మండుతున్న ఎండలను తట్టుకునే శక్తీ ఉండదు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల మంచాన పడిన వారు కూడా పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరిగాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఉన్న భయం, ఆక్రోశం ఇవాళ్టిది కాదు. గత రెండు, మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. పట్టుమని పాతికేళ్లు నిండని ఈ పిల్లలను రెడ్ లైట్ ఏరియాకు మహిళలను సరఫరా చేసే బ్రోకర్లుగా, హ్యూమన్ ట్రాఫికర్లుగా, దొంగలుగా పవన్, చంద్రబాబు మొన్నటి వరకు చిత్రించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి చేసిన మంచి వల్ల ప్రజలంతా జగన్‌కే మళ్లీ పట్టం కడ తారన్న ఆందోళనతోనే చంద్రబాబు ఇంతటి క్రూరమైన క్రీడకు తెర తీశారు. దీని ద్వారా చంద్ర బాబు రెండు విషయాలపై స్పష్టత ఇచ్చారు. రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం మొదటి లక్ష్యం. బడుగు బలహీన వర్గాలకు చెందిన పండు టాకులనూ, నిస్సహాయులనూ మళ్లీ రోడ్డున పడవేసి పెత్తందారీ, దురహంకారపూరిత ఆనందాన్ని పొందటం రెండో లక్ష్యం. వృద్ధులు, నిస్సహాయులను క్షోభ పెడితే ఆ పాపం ఊరకనే పోదు. ఇది నిజం! – ఆర్ఎస్ -
సింహాన్ని నేరుగా ఎదుర్కోలేక పసుపు ముసుగులో నిమ్మగడ్డ
-
బాబు కు సరైన బుద్ధి చెబుతాం..!
-
నిమ్మగడ్డ రమేష్ కి దేవినేని అవినాష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
ఎవ్వరినీ వదలొద్దు..
-
బాబు, నిమ్మగడ్డకు బిగ్ షాక్ ఇంటి వద్దకే పిన్షన్..
-
కుట్ర ఫలించి.. గడప దాటించి!
చంద్రబాబు అండ్ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్‌దారులకు పింఛన్ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్‌దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్‌దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికే పింఛన్ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్‌దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీరికి ఇంటి వద్దే పంపిణీ ► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు (నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు. ► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. బాబు ఎంత పని చేశావయ్యా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్ కోసం ఆలోచించలేదు. ఠంచన్‌గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు. –కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో.. నాకు వితంతు పింఛన్ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్‌ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు. – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం మా ఉసురు తగులుతుంది టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు. మా ముసలోళ్ల ఉసురు ఆయనకు తగులుతుంది. – బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం -
వికలాంగుల పెన్షన్లు ఆపేసి...అవ్వాతాతల కూడు లాగేసి...
-
‘‘ఫించన్లు ఆపి మొసలి కన్నీరా..?’’ బాబుపై మంత్రి మేరుగ ఫైర్
సాక్షి, తాడేపల్లి: పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ‘ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై బాధ్యతగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడు. స్వయాన ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు చేశాడు. నిమ్మగడ్డ సర్వీసులో ఉన్నప్పుడు మాపై కుట్రలు కుతంత్రాలతో పనిచేశాడు. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి బద్ధ విరోధిలా పనిచేశారు. ఆయనే ఈ రోజు దేశంలోనే గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థపై కత్తి కట్టాడు. పేద ప్రజలు, నిస్సహాయులను ఆదుకోడానికి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమమైన పద్దతిలో చేరవేసే ఉద్ధేశంతో వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ పెట్టారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పింఛన్లు పంచకూడదని నీ బంధువు ద్వారా కోర్టులకు, ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఆ వ్యవస్థను నిలిపేశావంటే ఎంత దిగజారావో అర్ధం అవుతోంది. వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని కేసులు వేయించి, తగుదునమ్మా అంటూ మళ్లీ పింఛన్లు పంచాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థను ఆపి రాజకీయంగా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు ఆలోచన. ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డాడు. ఈ రోజు పింఛన్లు రాక అనేక ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబే. ఇదంతా చేసి ఎందుకు పింఛన్లు పంచలేదని ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. అంతా నువ్వే చేసి తగుదునమ్మా అంటూ మెసేజ్‌లు పెట్టడం ఏంటి? ఎవరితో ఆపించావో నీకు తెలుసు. ఆపించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి ఎక్స్(ట్విట్టర్)లో మెసేజ్‌లు పెడుతున్నావు. నువ్వొచ్చాక పింఛన్లు ఇస్తావా? నువ్వు వచ్చేది ఏంటి బోడిగుండు? నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇస్తున్నావు. ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకోలేక అరువు తెచ్చుకున్నావు. ఎస్సీ, ఎస్టీలను అపహాస్యం చేశావ్..ఎస్సీల్లో పుట్టకూడదు అని చెప్పావు. బీసీల తోకలను కత్తిరిస్తానన్నావు..బీసీలు జడ్జిలుగా పనికిరానన్నావు. నువ్వు డబ్బులున్న వారి అడుగులకు మడుగులు వత్తుతున్నావు. నా పేదవాళ్లు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. టిప్పర్ డ్రైవర్లే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు చూడు చంద్రబాబు. టిప్పర్ డ్రైవర్‌కి టికెట్ ఇచ్చారంటూ మాట్లాడతావా? ఎంత మదంతో ఉన్నావు.. మా పల్లెల్లోకి వచ్చి నువ్వు ఓట్లు అడుగుతావా? ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేస్తే పేదవారి స్థితిగతులను మార్చడానికి సీఎం జగన్ పనిచేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్‌గా ఉన్న నా ఎస్సీ సోదరుడికి...అంబేద్కర్ గారు కల్పించిన అవకాశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. మా డ్రైవర్లు అంటే నీకు అంత తేలిక. ఆటోలు, టిప్పర్లు, లారీలు నడుపుతున్న ప్రతి డ్రైవర్ చంద్రబాబు అంతాన్ని పంతంగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర పునరావృతం అవుతుంది. కాసుకో చంద్రబాబూ..నీ కుట్రలు, కుతంత్రాలు సీఎం జగన్ ముందు చెల్లవు. మా పార్టీలో ఉన్నదంతా పేదలు. వారే జగన్ గారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఏ బ్లేడో, ఏ కత్తో..ఎక్కడ జరిగిందో పవన్ కల్యాణే చెప్పాలి. విలువలు లేని మాటలు, విశ్వసనీయత లేని మాటలు పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి? వారెన్ని మాటలు మాట్లాడినా ప్రజలు వారిని తుంగలో తొక్కుతారు’ అని మేరుగ మండిపడ్డారు. ఇదీ చదవండి.. ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. విధి విధానాలివే -
పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు, నిమ్మగడ్డను షాక్
-
పింఛన్లు అడ్డుకుని దొంగ ఏడుపు
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా పక్కాగా, ఠంచన్‌గా జరుగుతున్న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని అడ్డుకునే వరకు నిద్రపోని టీడీపీ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తుండటంపై లబ్ధిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వలంటీర్లు ప్రతి నెలా 1న ఇంటివద్దే పెన్షన్లు అందిస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు దొడ్డిదారిన అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై వరుసగా ఫిర్యాదులు చేశారు. దీంతో కోడ్ ముగిసేవరకు వలంటీర్లను ఈ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ, ప్రజాగ్రహంతో ఉలిక్కిపడ్డ టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ, దేవినేని ఉమా తదితరులు ఇంటివద్దే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఐదో తేదీ లోపు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు. వలంటీర్లు అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి తలుపులు తడుతున్నారంటూ గతంలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వెనుక వైఎస్సార్సీపీ కుట్ర దాగి ఉందంటూ ఎదురుదాడికి దిగారు. వలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేపట్టవద్దంటూ తాము ఎవరినీ కోరలేదంటూ తనకు అలవాటైన రీతిలో బుకాయించారు. టీడీపీ బూత్ కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలే విస్తుపోయారు. పింఛన్లు అందకపోవటానికి సీఎం జగనే కారణమని ప్రచారం చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. -
తిరుగుబాటుతో తత్తరపాటు..
సాక్షి, అమరావతి: అవ్వాతాతలను అవస్థలకు గురి చేస్తూ ఇంటివద్ద పింఛన్ల పంపిణీకి అడ్డుపడ్డ పచ్చ ముఠా దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో తత్తరపాటుకు గురై రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు బరి తెగించింది. వలంటీర్లపై ఆది నుంచి విద్వేషాన్ని పెంచుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బృందం ఇన్నాళ్లూ సజావుగా సాగిన సామాజిక పింఛన్ల పంపిణీకి ఎన్నికల వేళ ఆటంకాలు కల్పించేందుకు సాహసించింది. గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంచన్‌గా లబ్ధిదారుల ఇంటివద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా కోవిడ్ వేళ కూడా పెన్షన్లు అందచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు ఆ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తలేదన్నది నిజం. స్వతంత్ర సంస్థ ముసుగులో బాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ వరుస ఫిర్యాదులతో ఇంటివద్ద ఫించన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఆ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను దూరంగా ఉంచడంతోపాటు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను సైతం స్వాదీనం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాస్తవాలు ఇవి కాగా ఇందులో అధికార పార్టీ కుట్ర దాగి ఉందంటూ ఈనాడు రామోజీ తన విద్వేషాన్ని కుమ్మరించారు. ఆపాలని అడిగి ఆపై నాటకాలు.. వలంటీర్ల ద్వారా ఇంటివద్ద పింఛన్ల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. మరోవైపు టీడీపీ నాయకులు ‘ఛలో సచివాలయం’ పేరుతో మీడియా ముందు హడావుడి చేస్తూ రాజకీయ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. నిమ్మగడ్డ నిర్వాకాలు.. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ రాజ్యాంగ విరుద్ధంగా, వివాదాస్పదంగా ప్రవర్తించారు. స్థానిక సంస్థల్లో ఏర్పడే ఖాళీలకు చట్ట ప్రకారం ఆర్నెళ్లలోగా ఎన్నికలు నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఓ జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా దీనివల్ల ఆ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఉన్న తమ సామాజికవర్గం నేత పదవికి ఎసరు వస్తుందని ఉప ఎన్నిక జరపలేదని నిమ్మగడ్డపై విమర్శలున్నాయి. ► వలంటీర్లకు వ్యతిరేకంగా 2023 డిసెంబరు నాలుగో తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ సుప్రీం కోర్టులో కేసు వేసి మధ్యలోనే ఉపసంహరించుకుంది. ► మళ్లీ 2024 జనవరి 12న అదే సంస్థ వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై తమకు నమ్మకం లేదన్నట్టు పిటిషన్లో నిమ్మగడ్డ తదితరులు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ విషయాన్ని ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ► తర్వాత నిమ్మగడ్డకు చెందిన సంస్థ 2024 మార్చి 13న వలంటీర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికే వదిలివేస్తూ తీర్పు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ► 2021లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వలంటీర్ల వద్ద నుంచి ఫోన్లను స్వా«దీనం చేసుకోవాలంటూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చినట్టు అధికారులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలనే అచ్చెన్నాయుడు వలంటీర్లకు వ్యతిరేకంగా ఈసీకి అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచారు. ► సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులే అయినప్పటికీ వారికి ఎన్నికల నిర్వహణపై అనుభవం లేదని, వారికి ఎన్నికల విధులు అప్పగించవద్దని నిమ్మగడ్డ సంస్థ ఈసీని కోరింది. మరోవైపు సచివాలయాల ఉద్యోగుల ద్వారానే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టాలంటూ టీడీపీ, ఈనాడు ప్రేమ ఒలకబోస్తున్నాయి. అన్నీ ఆలోచించాకే.. సచివాలయాల ఉద్యోగులు ఇన్నాళ్లూ విధి నిర్వహణలో భాగంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లేందుకు వలంటీర్లపై ఆధారపడే పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు పింఛన్ల పంపిణీ బాధ్యతను వారికి అప్పగించినా లబ్ధిదారుల పేర్లు తెలుస్తాయి కానీ ఇళ్ల వివరాలు తెలిసే అవకాశం ఉండదు. మళ్లీ వారు తిరిగి గ్రామంలో ఎవరో ఒకరిపై ఆధారపడే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అభిమానులు వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దీనిపై అధికారులు తర్జనభర్జన పడిన అనంతరమే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఫించన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు 2019 ఎన్నికల సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నాన్ ఐఏఎస్ అధికారిని తొలుత ఓఎస్డీగా నియమించుకొని తరువాత సెర్ప్ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. అదే అధికారి నేతృత్వంలో ఎన్నికల వేళ మహిళా ఓట్లర్లను ప్రభావితం చేసేలా పొదుపు మహిళలకు పసుపు కుంకుమ తాయిలాలు విడుదల చేయడం గమనార్హం. పది రోజుల క్రితమే నిర్ణయం.. ఈ నెలలో పింఛన్ల పంపిణీని మూడో తేదీ నుంచి చేపట్టనుండటంపైనా టీడీపీ, ఈనాడు దుష్ప్రచారానికి దిగాయి. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని పది రోజుల కిత్రం ఎన్నికల కోడ్ వచ్చాకే అధికారుల స్థాయిలో నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో అప్పుడే వివరించారు. పింఛను డబ్బులను సచివాలయాల సిబ్బంది ఏప్రిల్ రెండో తేదీన డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించగా మూడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అప్పుడే జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, సెలవుల కారణంగా ఏటా ఏప్రిల్ నెలలో మూడో తేదీ తర్వాత పంపిణీ కొనసాగడం అనవాయితీగా జరుగుతోంది. గతేడాది కూడా ఏప్రిల్‌లో మూడో తేదీ నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. -
నిమ్మగడ్డ పచ్చ బానిస..అవ్వా, తాతల గోడు తగులుద్ది
-
చంద్రబాబు, నిమ్మగడ్డపై ఫైర్ అయిన సజ్జల
-
పెన్షన్ రాకుండా..వృద్ధులపై కసి తీర్చుకున్న చంద్రబాబు
-
అవ్వాతాతలు, వికలాంగులకు కన్నీళ్లు మిగిల్చిన రాక్షసులు..
-
వాలంటీర్లపై ‘పచ్చ’ కుట్ర.. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు, పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయించడం దురదృష్టకరమన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఈసీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడతారు: ఎంపీ కేశినేని పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారన్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం. ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్‌తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా.. తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు. వృద్ధుల ఉసురు పోసుకున్న చంద్రబాబు: వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే కానీ పెన్షన్లు వచ్చేవి కాదు. ఈ కుట్రకు కారణం చంద్రబాబే. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది. సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
సాక్షి, విజయవాడ: ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలు ఏపీలో ప్రభుత్వం పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. అవ్వాతాతాలపై కసి తీర్చుకుంటున్న చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయిచారు. చంద్రబాబు కుట్రలతో వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసింది. వాలంటీర్లు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ ఫిర్యాదుతో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు పెట్టింది. పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నతాధికారులకు అందించాలని ఆదేశించింది. కోడ్ ముగిసేవరకు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లపై కుట్రకు ఎల్లో బ్యాచ్ బరితెగించింది. -
బాబు, పవన్ రూటులో నిమ్మగడ్డ.. వలంటీర్లపై విషం
సాక్షి, విజయవాడ: ప్రజలతో నిత్యం మమేకమై సేవలందిస్తూ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న వలంటీర్ వ్యవస్థను దెబ్బకొట్టడమే లక్ష్యంగా పచ్చ బ్యాచ్ ప్రయత్నాలు సాగుతున్నాయి. వృద్ధులు, వికలాంగుల పట్ల కనికరం కూడా లేకుండా, ప్రజలకు జరుగుతున్న మంచిని చూడకుండా వలంటీర్లపై విషం కక్కుతున్నారు. డబ్బులు చేతికి ఇవ్వొద్దు, అకౌంట్లలో వేయాలంటూ సీఈవోకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ‘‘అకౌంట్ ఉన్న వాళ్లు తీసుకుంటారు. అకౌంట్ లేదంటే.. పెన్షనర్లే వెళ్లి డబ్బులు తెచ్చుకుంటారు. పెన్షనర్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు డబ్బులు అందించడం వద్దు. పింఛన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి’’ అంటూ వలంటీర్లపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటనల రూటులోనే నిమ్మగడ్డ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. శభాష్ వలంటీర్.. కరోనా వైరస్ భయపెడుతున్నా... వరద వణికిస్తున్నా... ప్రతిపక్షాలు వెక్కిరిస్తున్నా.. వలంటీర్లు వెన్నుచూపలేదు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా కష్టకాలంలో అందరూ ఉన్నా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నవారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. వాన వచ్చినా... వరద వచ్చినా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే అవ్వతాతల ఇంటి తలుపుతట్టి పింఛను అందిస్తున్నారు. అర్హత గల తల్లికి అమ్మఒడి... అక్కచెల్లెమ్మలకు ఆసరా... చేయూత... నిరుపేదలకు నివేశన స్థలం.. పక్కా ఇళ్లు... విద్యార్థులకు విద్యాదీవెన... ఇలా ఒకటేమిటీ సమస్త సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ శభాష్ వలంటీర్ అని అందరి మన్ననలు పొందుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఈసీ పేరుతో తప్పుడు ప్రచారం.. కాగా, వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ సీఈవో కార్యాలయం ఖండించింది. రాజకీయ ప్రచారంలో పాల్గొనే వలంటీర్లను ఎవరైనా మీ కంట కనబడితే వారి ఫోటోలు,వీడియోలతో పాటు వలంటీర్ల పేరు, ఊరు పేర్లు తెలియజేస్తూ ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, లోకేషన్‌ను 9676692888కు వాట్సాప్‌కు షేర్ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలంటూ తామెలాంటి సర్క్యూలర్ జారీ చేయలేదని, ఇదీ ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఏపీ సీఈవో పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కొత్త పాత్రలో ప్రవేశించారు. ఆయన ఏదో నిష్పాక్షికమైన వ్యక్తిగా కనిపిస్తూ, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమికి మేలు చేయాలని సంకల్పించినట్లు కనబడుతోంది. ఆయన నిజాయితీగా ఓటర్లకు విషయ అవగాహన కోసం కృషి చేస్తే తప్పులేదు. ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు వంటి విషయాలలో ఏవైనా అవకతవకలు జరుగుతుంటే వాటిని చెప్పడం ఆక్షేపణీయం కాదు. కానీ, ఆయన ప్రస్తుతం ఏపీలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేసే దురుద్దేశంతో కొత్త పన్నాగం పన్నుతున్నారన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే, ఆయన ఏపీలో ఓటర్ల జాబితా గురించి, ఇతర అంశాల గురించి మీడియా సమావేశాలు పెట్టి, ఎన్నికల సంఘానికి సలహాలు ఇవ్వడమే సందేహాలకు తావిస్తోంది. ఆయన కేవలం ఏపీ కోసమే తన సంస్థను ఆరంభించారేమో తెలియదు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పేరు ఉంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్న చోట ఎన్నికలలో అక్రమాలు జరగకుండా, ఓటర్ల హక్కులు తెలియచేసే విధంగా కృషి చేస్తారని అనుకుంటాం. కానీ, ఆయన మరో ఐదు నెలల తర్వాత కానీ.. ఎన్నికలు రాని ఏపీపై దృష్టిపెట్టారు. అంటే దీని బట్టి ఏం అర్ధం అవుతుంది. ఆయనకు ఏపీపైన, ఏపీ రాజకీయాలపైనే ఆసక్తి అని. నిత్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం పత్రికలు రాస్తున్న అసత్య కథనాల ఆధారంగా ఆయన మాట్లాడుతున్నారు. ఓట్ల నమోదు సరిగా లేదని, ఇష్టాసుసారం ఓట్లు తొలగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రత్యర్ది రాజకీయ పార్టీలపై కేసులు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. అందుకు నిర్దిష్టంగా ఆధారాలు ఏమీ చూపలేదు. కాకపోతే వైఎస్సార్సీపీపై సంశయాలు రేపే విధంగా మాట్లాడారు. స్థానికంగా లేకపోయినా ఓటు హక్కు కల్పించాలని ఆయన సూచిస్తున్నారు. తద్వారా దొంగ ఓట్లకు ఆయనే స్వాగతం చెబుతున్నారన్నమాట. తెలుగు రాష్ట్రాలలో ఎన్ని లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయో ఆయనకు తెలియదా? ఒకప్పుడు బస్సుల్లో హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఏపీకి తరలించి ఓట్లు వేయించిన ఘట్టాలు తెలియవా! అన్ని పార్టీలు ఇలా చేస్తుండవచ్చు. ఇలాంటి వాటికి బ్రేక్ వేయాలని చెప్పాల్సిన మాజీ ఎన్నికల కమిషనర్ వాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విధానాన్ని ప్రస్తావించడం ఎందుకో తెలియదు. ఓటర్ల వ్యక్తిగత సమాచారం, వారిని ప్రభావితం చేసే వారి వివరాలు సేకరిస్తున్నారని ఆయన అంటున్నారు. నిజానికి అన్ని పార్టీల వారికి, వారి స్థానిక నాయకుల వద్ద ఎవరు ఎటు వైపు ఉంటారో నిర్దిష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఇందులో ఆయన కనిపెట్టింది ఏమిటో తెలియదు. ఓట్లు వేయకపోతే స్కీములు రద్దు అవుతాయని ప్రచారం చేస్తున్నారట. నిజంగానే ఆ పని జరిగేటట్లయితే, కులం చూడను, ప్రాంతం చూడను, పార్టీ చూడను అని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే చెప్పి, అర్హులైన అందరికి స్కీములు అమలు చేసింది వాస్తవం కాదా!. మరి అదే చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు, తెలుగుదేశం నేతలు చెప్పిన వారికి, లంచాలు ఇచ్చినవారికే స్కీములు అమలు జరిగిన విషయం రమేష్‌కు తెలియదా!. చంద్రబాబే కలెక్టర్ల సమావేశంలో టీడీపీ వారికే పనులు చేయాలని ఆదేశించిన విషయం బహుశా నిమ్మగడ్డ కావాలని మర్చిపోయి ఉండవచ్చు. చివరికి రేషన్ కార్డు పొందడానికి కూడా ఎన్ని కష్టాలు పడాల్సివచ్చేది?. అలాంటిది ఇప్పుడు అర్హత ఉంటే వలంటీరే రేషన్ కార్డు ఇంటికి తెస్తుంటే, అది కూడా ఓట్ల కోసమేనని నిమ్మగడ్డ వంటివారు భావిస్తే, వలంటీర్లు బెదిరిస్తున్నారని చెబితే నమ్మడానికి ప్రజలు వెర్రివెళ్లు కారు. ఎక్కడైనా ఒకటి, అరా ఘటనలు జరిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. తప్పు సరిదిద్దవచ్చు. తెలుగుదేశం పార్టీవారు గతంలో సేవా మిత్రలకు ట్యాబ్‌లు ఇచ్చి ఏ పార్టీకి ఓటు వేస్తారో కూడా అడిగి తెలుసుకున్న ఘటనలు జరగలేదా?. ఓటర్ల డేటా అంతటిని హైదరాబాద్‌లోని ఒక కంపెనీకి పంపించారా? లేదా?. వారిపై కేసులు పెట్టారా? లేదా? అప్పుడు నోరు కుట్టేసుకోకుండా, గట్టిగా అభ్యంతరం చెప్పి ఉంటే, ఇప్పుడు నైతికంగా ఆయన ఏం మాట్లాడడానికైనా అర్హత వచ్చేది. అంతేకాదు.. స్థానిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన చేసిన విన్యాసాలు జనం మర్చిపోయారా?. కరోనా సంక్షోభంలో ఆయన వ్యవహరించిన తీరు, ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయండని కోరితే అంగీకరించకుండా, ఆ తర్వాత చెప్పాపెట్టకుండా వాయిదా వేసిన తీరు.. ఇదంతా ప్రతిపక్ష తెలుగుదేశం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మేలు చేయడానికేనని అప్పట్లో విమర్శలు వచ్చాయా? లేదా?. చివరికి టీడీపీ ఆఫీసులో తయారైన లేఖనే తన లెటర్‌గా సంకతం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి అప్రతిష్టపాలయ్యారా? లేదా?. ఆయన వచ్చి జనానికి ప్రజాస్యామ్యం గురించి నీతి బోధలు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనిపించదా!. గతంలో తక్కువ సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతుంటే, ఎవరు ఫిర్యాదు చేసినా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని ఆయనే చెప్పారు. మళ్లీ ఇప్పుడు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేస్తుంటే, రాజకీయ ప్రత్యర్ధులపై కేసులు పెడుతున్నారని అంటున్నారు. తప్పుడు కేసులు పెట్టాలని ఎవరం చెప్పం. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని, నలభైఎనిమిది గంటల్లో బెయిల్ ఇప్పిస్తామని చెప్పినప్పుడు ఈ ప్రజాస్వామ్య సంస్థ ఎక్కడకు వెళ్లింది. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు, భీమవరం వద్ద లోకేశ్‌లు రెచ్చగొట్టిన ఫలితంగా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడితే వారిపై కేసులు పెట్టాలా? వద్దా? అన్నది కూడా నిమ్మగడ్డ చెప్పాలి కదా!. పుంగనూరులో ఏకంగా టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చస్తే , ఒక కానిస్టేబుల్ కన్ను పోగొడితే చర్యలు తీసుకోవాలా? వద్దా?. అదేదో మాచ్ ఫిక్సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుంటా! ఒక విలేకరి అరవై వేల కేసులు పెట్టారని అనగానే ఈయన ఎలా స్పందించాలి? అన్ని కేసులు ఎందుకు ఉంటాయి? వాటి గురించి తాను తెలుసుకుంటానని అనకుండా అదేదో నిజమైన పాయింట్ మాదిరి మాట్లాడడం సబబా?. టీడీపీ చేర్చిన దొంగ ఓట్లను తీయకూడదని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఉద్యమం మాదిరి వార్తలు రాస్తుంటే వాటిని వెరిఫై చేయకుండా ఎలా సమర్ధిస్తారు?. రిటైర్డ్ డీజీపీలతో కమిటీ వేయాలనో, ఇంకొక సూచన చేస్తున్న ఈయన తాను ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు?. కేవలం టీడీపీ వారు ఏమి చెబితే అదే ఎందుకు చేశారు?. మరోవైపు పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెబుతారు?. ఇంకోవైపు టీడీపీ మీడియా చేసే గోలను సమర్ధిస్తుంటారు. ఎన్నికలు సక్రమంగా, సజావుగా జరగడానికి ఎవరు కృషి చేసినా తప్పు లేదు. కానీ, ముసుగేసుకుని అదేదో స్వతంత్ర సంస్థ అనుకునేలా, తమకు ఉన్న గత హోదాను అడ్డం పెట్టుకుని పరోక్ష రాజకీయం చేయాలని చూడటమే మోసంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా వచ్చే నాలుగు నెలల్లో మరిన్ని బోగస్ సంస్థలు ఏపీలో ప్రవేశించి ప్రజలను రకరకాల రూపాలలో గందరగోళంలోకి నెట్టాలని చూస్తాయి. కనుక అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే. ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
నేడు ప్రివిలేజ్ కమిటీ విచారణ: కాకాణి
నెల్లూరు (సెంట్రల్): కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై మంగళవారం విచారణ జరుపుతున్నట్టు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆయన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు నోటీసులిచ్చినా విచారణకు హాజరు కాలేదన్నారు. ఆయన అందుబాటులో ఉండి కూడా హాజరు కాలేదని తెలుస్తోందని తెలిపారు. దీన్ని ధిక్కారం కింద నమోదు చేశామని, దీనిపై చర్చిస్తామన్నారు. గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తనపై వచ్చిన ఆరోపణలను విడిచి పెట్టాలంటూ లేఖ రాశారని, దానిపైనా చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని, వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
సభ్యుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
-
సభ్యుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
సాక్షి, అమరావతి: శాసన సభ్యుల హక్కులను కాపాడటమే తమ ధ్యేయమని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కమిటీ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో సభ్యులు ఎస్వీ చినఅప్పలనాయుడు, వి.వరప్రసాదరావు, మల్లాది విష్ణు, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులతో కలసి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా నాలుగు అంశాలు చర్చించినట్లు చెప్పారు. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు గతంలో ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందున వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరామన్నారు. ఇప్పటికే రెండుసార్లు మినహాయింపు ఇచ్చామని, ఈసారి కచ్చితంగా వస్తానని లిఖితపూర్వకంగా లేఖ అందజేశారని తెలిపారు. సెప్టెంబర్ 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని అచ్చెన్నాయుడుకు నోటీసు ఇవ్వనున్నట్లు చెప్పారు. నిమ్మగడ్డ వివరణ బట్టి తదుపరి చర్యలు.. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినతి మేరకు పూర్తిస్థాయి వివరాలు అందచేసి పది రోజుల కాల పరిమితితో నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. టీడీపీ నేత కూన రవికుమార్ పలు సందర్భాలో స్పీకర్‌పై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేయడంపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించామన్నారు. ఆయన కోసం చాలాసేపు వేచి చూశామని, రవికుమార్ గైర్హాజరు కావటాన్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. కూన రవికుమార్ తీరును ధిక్కారంగా భావిస్తున్నామన్నారు. ఆయనపై చర్యలు తీసుకునే అంశంపై ప్రివిలేజ్ కమిటీలో నిర్ణయం తీసుకుని సభ ముందు ఉంచుతామని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వ్యాఖ్యలు ఏ విధంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయో చెప్పాలని కోరడంతో ఆ వివరాలు పంపుతున్నామన్నారు. ఆయన వివరణ బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. -
ఆఖరి నిమిషంలో హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: మరో గంటసేపటిలో ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్న సమయంలో మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందా అని అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. గతేడాది మార్చి 7న మొదలైన ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కరోనా పేరుతో సుదీర్ఘకాలంపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 21న పోలింగ్ జరగాల్సి ఉండగా.. 14న నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఇక అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టే సమయంలో కరోనా పేరుతో అదే నెల 15న అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. మొదట పరిషత్ ఎన్నికలే జరగాల్సి ఉన్నప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. నిమ్మగడ్డ మాత్రం ఈ ఎన్నికలను గాలికొదిలేశారు. మొదట గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన ఆయన అవకాశం ఉన్నప్పటికీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండానే తన పదవీకాలాన్ని ముగించారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని అప్పట్లో ఆగిపోయిన ఎన్నికలను ఆగిన చోట నుంచే తిరిగి కొనసాగించేందుకు వీలుగా ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం 8న (గురువారం) పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అభ్యర్థుల ప్రచారం కూడా ముగిసింది. అయితే అనూహ్యంగా మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్నికలకు బ్రేక్ వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ► రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ స్థానాల్లో 8 చోట్ల కోర్టు కేసులు, తదితర కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 652 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు మృతి చెందడంతో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా మొత్తం 2,058 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ► అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కోర్టు కేసులు, తదితర కారణాల వల్ల 375 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 9,672 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థుల మృతి కారణంగా 81 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సిన 7,220 ఎంపీటీసీ స్థానాల్లో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ► ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఇప్పటికే 116 మంది మరణించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. -
నిమ్మగడ్డ నిర్వాకంతోనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వాకం ఇప్పుడు ఇంకోసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలను తెచ్చిపెట్టింది. ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్ జారీకి, పోలింగ్‌కు మధ్య నాలుగు వారాలపాటు ఎన్నికల కోడ్ అమలు చేయాలంటూ హైకోర్టు గురువారం జరగాల్సిన ఎన్నికలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన ఆయన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా కొనసాగించి ఉంటే.. ఎటువంటి ఆటంకాలు వచ్చి ఉండేవి కావని అధికార వర్గాలు అంటున్నాయి. పరిషత్ ఎన్నికల నిర్వహణను పట్టించుకోని నిమ్మగడ్డ ఫిబ్రవరి 21కే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసింది. దీని తర్వాత కూడా నిమ్మగడ్డ దాదాపు 20 రోజులపైనే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను కొనసాగించారు. జనవరి 9 నుంచి మార్చి 11 వరకు 2 నెలలపాటు ఎన్నికల కోడ్‌ను అమలు చేశారు. ఆ సమయంలో కేవలం ఆరు రోజుల వ్యవధిలో ముగిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఆయన పట్టించుకోలేదు. హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ప్రకారం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే దాదాపు మరో నెల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. కోడ్ అమలు అంటే.. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అనేక ఆంక్షల మధ్య అమలు చేయాల్సి రావడమే. ఎన్నికల ప్రక్రియ ముగిశాక కూడా ఎన్నికల కోడ్ అమలు చేసిన నిమ్మగడ్డ ఉద్దేశపూర్వకంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుండా ఆపారనే విమర్శలు వెల్లువెత్తాయి. సీఎస్ కోరినా పట్టించుకోకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా చేపట్టాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఫిబ్రవరి 15న నిమ్మగడ్డకు ప్రభుత్వం తరఫున ఒక లేఖను పంపారు. సీఎస్, ప్రభుత్వం సూచనలను పట్టించుకోకుండానే పంచాయతీ ఎన్నికలు ముగిశాక కూడా 20 రోజులకుపైనే నిమ్మగడ్డ కోడ్‌ను అమల్లో ఉంచారు. -
బురదజల్లడానికే నిమ్మగడ్డ పిటిషన్
సాక్షి, అమరావతి: గవర్నర్‌కు తాను రాసిన లేఖలు లీక్ అయ్యాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగంపై బురదజల్లడమేనని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ప్రతి ప్రభుత్వ యంత్రాంగం ప్రతిష్టను అపఖ్యాతి పాల్జేసేందుకే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. ఈ పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారించారు. ఈ సందర్భంగా ఏజీ తన వాదనలు వినిపిస్తూ.. లేఖల లీక్ జరిగిందంటున్న నిమ్మగడ్డ, అలా లీక్ కావడం ఏ చట్ట ప్రకారం నేరమో చెప్పడం లేదన్నారు. ఏ కేసులో పడితే ఆ కేసులో, ఎలా పడితే అలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి వీల్లేదని, న్యాయస్థానాలు అధికరణ 226 కింద తమ విచక్షణాధికారాలను చాలా జాగ్రత్తగా, అరుదుగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. తాను హైకోర్టు జడ్జితో సమానమంటూ చెప్పుకొన్న నిమ్మగడ్డ.. అదే రీతి హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్ వేశారని, ఇప్పుడు గౌరవ ప్రదమైన గవర్నర్ కార్యాలయంపై కూడా ఆరోపణలు చేస్తూ వివాదంలోకి లాగారని తెలిపారు. నిమ్మగడ్డ గతంలో కేంద్రానికి రాసిన లేఖ వాస్తవానికి ఓ రాజకీయ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందని, దీనిపై ఓ ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేశారని చెప్పారు. దీనిపై నిమ్మగడ్డ, ఎన్నికల కమిషన్ కార్యాలయ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌కు రాసిన లేఖలు బయటకు రావడాన్ని ఏ చట్టం అడ్డుకుంటుందో నిమ్మగడ్డ ఎక్కడా చెప్పడం లేదన్నారు. గతంలో న్యాయశాఖ మంత్రి, ఢిల్లీ హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు సీజేకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు బహిర్గతం అయ్యాయని, అప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి వాటికి ఎలాంటి రక్షణ ఉండదంటూ తీర్పునిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. లేఖల లీక్ వల్లే హక్కుల ఉల్లంఘన నోటీసులు వచ్చాయని నిమ్మగడ్డ చెబుతున్నారుగా? దీనిపై ఏమంటారని ప్రశ్నించారు. ప్రస్తుత కేసుకూ దానికి ఏ మాత్రం సంబంధం లేదని ప్రశాంత్ తెలిపారు. గవర్నర్‌కు రాసిన లేఖలే హక్కుల ఉల్లంఘన నోటీసులకు దారి తీశాయా? అన్న అంశంపై తాను తన కౌంటర్లో స్పష్టతనిస్తానని చెప్పారు. ప్రతివాదులైన మంత్రి బొత్స సత్యనారాయణ, మెట్టు రామిరెడ్డి తరఫు న్యాయవాదుల వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 6కి వాయిదా వేస్తూ జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీచేశారు. అదేరోజున నిమ్మగడ్డ తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తిరుగు సమాధానం ఇచ్చేందుకు సైతం అనుమతి ఇచ్చారు. చదవండి: చంద్రబాబు సర్కారులో వైద్య పరికరాల స్కామ్ -
నిమ్మగడ్డ వాస్తవాలను దాచిపెట్టారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టారని, ఇందుకు గాను అతనిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తరఫు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. తన ప్రత్యేక హక్కులో భాగంగా గవర్నర్‌కు రాసిన లేఖలు గవర్నర్ కార్యాలయం ద్వారానే లీక్ అయ్యాయని పరోక్షంగా చెబుతూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. అయితే, మార్చి 12న గవర్నర్‌కు రాసిన లేఖ కాపీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి సైతం పంపారని, ఈ విషయాన్ని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించకుండా దాచిపెట్టారని మోహన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్ఈసీ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో నిమ్మగడ్డ రమేశ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల కమిషనర్ పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. అందువల్ల ఆయన రాజ్యాంగ వ్యవస్థగా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదు చేయజాలరని వివరించారు. వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేసి, గవర్నర్‌కు, ఎన్నికల కమిషనర్‌కు మధ్య రాసిన లేఖలు లీక్ అయ్యాయంటూ కోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. తన ప్రత్యేక హక్కులో భాగంగా గవర్నర్‌తో తాను సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ బహిర్గతం అయ్యాయని, దీనిపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోంశాఖను, సీబీఐని ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం మరోసారి విచారించారు. రహస్య లేఖ ఎలా అవుతుంది.. మార్చి 12న నిమ్మగడ్డ మధురై, రామేశ్వరం వెళుతున్నట్టు గవర్నర్‌కు సమాచారం ఇచ్చారని, ఇది రహస్య లేఖ ఎలా అవుతుందని గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఈ లేఖలోని కొంత భాగాన్ని మాత్రమే హైకోర్టు ముందుంచి మోసపూరితంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. ఆ లేఖను పూర్తిగా పరిశీలిస్తే ఆ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి పంపిన విషయం అర్థమవుతోందని కోర్టుకు నివేదించారు. వారి కార్యాలయాల్లో కూడా లీక్ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. లేఖల లీక్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని, సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏం తేలుస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో నిర్దేశించిన నేరాల విషయంలో మాత్రమే సీబీఐ దర్యాప్తు చేయగలుగుతుందన్నారు. నిమ్మగడ్డ తన పిటిషన్లో ఎక్కడా నేరం జరిగినట్టు చెప్పలేదని, అలాంటప్పుడు సీబీఐ ఎలా దర్యాప్తు చేయగలుగుతుందన్నారు. సీబీఐ తన పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదన్నారు. అధికరణ 226 కింద పిటిషనర్ కోరిన అభ్యర్థనను న్యాయస్థానం మన్నించడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై సీబీఐ నివేదిక తదుపరి విచారణ జూన్ 28కి వాయిదా పలు కేసుల్లో హైకోర్టు తీర్పుల సందర్భంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వెలువడిన పోస్టులపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీనికి సంబంధించిన వ్యాజ్యంపై జస్టిస్ బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు.. రోడ్డుపై తాగి న్యూసెన్స్ సృష్టించిన నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అదుపు చేయడంపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై పోస్టులు వెలువడిన విషయం విదితమే. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కొందరిపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సామాజిక మాధ్యమ కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 12న ఉత్తర్వులిచ్చింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ తన ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టు ముందుంచింది. ఈ మొత్తం వ్యవహారంలో అంతర్జాతీయ సోషల్ మీడియా కంపెనీలు ఉండటంతో వాటినుంచి సమాచారం తెప్పించుకునేందుకు సమయం పడుతుందని, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. దర్యాప్తును పూర్తి చేసేందుకు సమయం పడుతుందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా?
సాక్షి, అమరావతి: పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు మేలు, మెప్పుకోసం పనిచేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఉద్యోగం ఊడిపోయే చివరిరోజున శ్రీరంగనీతులు చెబుతున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఉద్యోగం ఆఖరి రోజున ఎన్నికల సంస్కరణలంటూ గవర్నర్‌కు రాసిన లేఖలో నిమ్మగడ్డ చేసిన సిఫారసులను చూస్తే ‘పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాశాడనే’ సామెత గుర్తుకొస్తోందన్నారు. లేఖ ఉపోద్ఘాతంలో ఎన్నికలపై నిమ్మగడ్డ నిష్పక్షపాతం, పారదర్శకమనడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. గవర్నర్‌కు రాసిన లేఖలో ఏ ఒక్కటీ నిమ్మగడ్డ ఆచరించలేదన్నారు. అసలు ఎన్నికల నిబంధనల పట్ల ఆయనకు గౌరవం లేదన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ గుంటూరులో ఓటుహక్కు కావాలనడంలోనే ఆయన వైఖరి అర్థమైందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. 2016 నుంచి ఈరోజు వరకు చంద్రబాబు రక్షణే రాష్ట్ర ఎన్నికల సంఘానికి విధులు, బాధ్యతగా నిమ్మగడ్డ పనిచేశాడని విమర్శించారు. పట్టపగలు బరితెగించి హోటల్‌కెళ్లి సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌తో గంటలకొద్దీ రాజకీయ మంత్రాంగం, యంత్రాంగం నడిపిన ఏకైక ఎస్ఈసీ నిమ్మగడ్డేనన్నారు.ఎన్నికల కమిషన్ అంటే రాజకీయపార్టీలకు దూరంగా ఉండాలని ఆయనంటుంటే ప్రజలు నవుక్వతున్నారన్నారు. ఓటుతో చంద్రబాబును భూస్థాపితం చేసి, నిమ్మగడ్డ దిమ్మతిరిగేలా చేశారన్నారు. విజయవాడ అభివృద్ధికి సీఎం కీలక నిర్ణయం వరదల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసే కృష్ణలంక వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుందని నాని చెప్పారు. సీఎం జగన్ చొరవతో నిర్మించే రిటైనింగ్‌వాల్ వల్ల కృష్ణలంక వాసులు భవిష్యత్తులో ఎంత వరదొచ్చినా నిశ్చింతగా వారిళ్లలోనే హాయిగా జీవించవచ్చన్నారు. ‘‘రిటైనింగ్‌వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుడిపక్క జరిగే నిర్మాణ పనులపై ఆరా తీస్తూ, ఎడమపక్క ఎందుకు నిర్మాణం చేయట్లేదని అధికారులను ప్రశ్నించారు. పెద్దగా ముంపు రాదని వారనడంతో.. ముంపు వస్తుందా, రాదా అనేది కాదు, ఎంత పెద్ద వరదొచ్చినా ఇళ్లలోకి నీళ్లు వెళ్లకూడదన్నారు. వారధి నుంచి పుష్కరఘాట్ల వరకు తక్షణం ఎస్టిమేట్లు తయారుచేసి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్‌ను ఆదేశించారు’’ అని నాని తెలిపారు. -
‘ఏమైనా’.. చేయలేం!: నిమ్మగడ్డ రమేష్
సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషనర్‌కు విస్తృత అధికారాలుంటాయని, ఎన్నికల కమిషన్ ఏదైనా చేయగలదని అంతా భావిస్తుంటారని అయితే అది సాధ్యం కాదని ఎస్ఈసీగా బుధవారం పదవీ విరమణ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలు (మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ) మళ్లీ మొదట్నుంచీ తేవాలన్నారు. అలాంటివి ఎలా చేయగలం?.. మేం చేయలేం.. ఎన్నికల చట్టమనేది పకడ్బందీగా ఉంటుంది. ఓ వ్యక్తి తనకు అనుకూలంగా లేకపోతే ఇష్టమొచ్చినట్టు ఏదైనా, ఏమైనా చేసేందుకు వ్యవస్థ వెసులుబాటు కల్పించదు’ అని పేర్కొన్నారు. పదవీ విరమణకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తన పనితీరు పట్ల పూర్తి సంతృప్తి చెందినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై సంతృప్తితో ఉన్నానన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, రీ పోలింగ్ అవసరం లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడం అరుదైన విషయమన్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల తోడ్పాటు, సహకారం వల్లే సాధ్యపడిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరి సహకారం లభించిందన్నారు. ప్రజల మనోభావాలకు ప్రతిబింబాలు.. ఎన్నికల కమిషన్ చిన్న పరిమితిలో పనిచేసే వ్యవస్థ అని, ఇతర వ్యవస్థలు ఇంకా పెద్దవి, బలమైనవని నిమ్మగడ్డ పేర్కొన్నారు. గవర్నర్, శాసన వ్యవస్థలపై విధేయత, గౌరవం ఉండాలన్నారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించే చట్టసభల ద్వారా జరిగే నిర్ణయాల పట్ల నమ్మకం విశ్వాసం అవసరమన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, విశ్వసనీయతతో నిర్వహించేందుకే తన అధికారాలను వినియోగించుకున్నానని, ఇతర వ్యవస్థల్లోకి చొరబడలేదని చెప్పారు. ఓటు హక్కుపై పౌరుడిగా పోరాడతా.. కొన్ని చిన్న అంశాలు వ్యవస్థల మధ్య అవాంతరాలు కలిగించాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల అనాలోచిత చర్యల వల్ల వ్యవస్థల మధ్య అగాధం ఏర్పడిందన్నారు. పంచాయతీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ సిబ్బంది అంతా మూకుమ్మడి సెలవులో వెళ్లాలని కొందరు వ్యక్తులు చెప్పడంలో ప్రభుత్వ పాత్ర ఏం ఉంటుందన్నారు. ఆ విషయం అసలు ప్రభుత్వానికి తెలిసి కూడా ఉండకపోవచ్చన్నారు. తన స్వగ్రామంలో ఓటు హక్కు అభ్యర్ధనను పెండింగ్‌లో ఉంచడంపై ఒక పౌరుడిగా న్యాయ పోరాటం చేస్తానని, హైకోర్టుకు వెళతానని చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై నివేదిక ఎన్నికల సంస్కరణలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఓ నివేదిక తయారు చేసినట్టు నిమ్మగడ్డ తెలిపారు. నివేదిక ప్రతిని ఆయన మీడియాకు విడుదల చేశారు. గవర్నర్‌ను కలిసి నివేదిక అందజేయాలని భావించినా కోవిడ్ టీకా తీసుకొని వైద్య సహాయం పొందుతుండడంతో అపాయింట్మెంట్లేవీ లేవని ఆయన కార్యాలయం సమాచారమిచ్చిందన్నారు. నివేదికను రాజకీయ పార్టీలకు కూడా పంపి సలహాలు కోరినట్టు చెప్పారు. తదుపరి ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ఇప్పటికే ఆమెకు లేఖ రాసినట్లు చెప్పారు. -
ఏపీ ఎస్ఈసీగా ముగిసిన నిమ్మగడ్డ పదవీ కాలం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసింది. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన పదవీ విరమణ చేశారు. పదవీకాలం ముగియడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కి బయలుదేరారు. రేపు(గురువారం) ఉదయం 9.30 కొత్త ఎస్ఈసీగా మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం జెడ్పీ ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, జెడ్పీ ఎన్నికలకి ఇప్పటికే కోర్టు అడ్డంకులు తొలగిన సంగతి తెలిసిందే. ఏకగ్రీవాలని ప్రకటించాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏకగ్రీవాలని మినహాయించి మిగిలిన జెడ్పిటీసీ, ఎంపీటీసీ స్ధానాలకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. -
‘తిరుగుబోతు బ్రహ్మచర్యంలా నిమ్మగడ్డ నీతులు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ఉద్యోగం ఊడిపోయే రోజున శ్రీరంగనీతులు చెబుతుంటే పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్లుందని విమర్శించారు. ప్రస్తుతం నిమ్మగడ్డ లేఖను చూస్తే తాను చెప్తున్న మాటలకు చేసే చేతలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదని అన్నారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ దూరంగా ఉండాలంటాడని, కానీ! హోటల్లో సుజనా చౌదరీని కలిసి వచ్చిన ఈయన సూక్తులు చెబుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. కేసులు లేనప్పుడు ఎన్నికలు ఆపేశాడని, కేసులు పెరిగిన తర్వాత ఎన్నికలు పెట్టాలంటాడని మండిపడ్డారు. ఆయన తన ప్రసంగాని కొనసాగిస్తూ.. ‘‘ వాక్సినేషన్ వేస్తుంటే ఎన్నికలు నేను జరపను అని మాట్లాడారు. చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు జరపమంటే జరిపాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులని చంద్రబాబు, నిమ్మగడ్డ అనుకుంటున్నారు. సాక్షాత్తు టీడీపీ కార్యాలయములో లేఖ రాయించుకుని కేంద్రానికి పంపారు. ఈ ప్రభుత్వం పనిగట్టుకుని ఆయన ఓటు ఆపినట్లు మాట్లాడుతున్నారు. తన కాపురం హైదరాబాద్ లో ఉంటున్నా ఏపీలో ఓటు కావాలంటాడు. ఆ అడ్రస్ లో ఉంటున్నట్లు ఓటు కావాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలి కదా. ఏ కోర్ట్‌కు పోతే మాత్రం మీకు ఓటు ఎలా వస్తుంది. ప్రతీ దానిక ప్రభుత్వం మీద నిందలు వేయడం తగదని సూచించారు. 2016 ఏప్రిల్ 1న నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిపారో చెప్పమనండి..? .పెడన మున్సిపల్ చైర్మన్ చనిపోతే అప్పుడు ఎన్నిక ఎందుకుపెట్టలేదు..?. ఏలేరుపాడు, ఉక్కునూరుల్లో మీరే జడ్పీటీసీకీ నోటిఫికేషన్ ఇచ్చి చంద్రబాబు వద్దంటే ఆపేవలేదా..? ఇప్పటికైనా మీ చేతలకి పూర్తి వ్యతిరేకమైన ఇలాంటి లేఖలు రాయడం మీకు తగదు’’ అంటూ సలహా ఇచ్చారు. ( చదవండి: ఎమ్మెల్యే కానివాడు సీఎం కుర్చీ ఎక్కుతాడట!: ) -
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ రమేష్
-
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ఎన్‌ఈసీగా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు(మార్చి 31) పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి, మీడియా ద్వారా అపూర్వ సహకారం అందిందన్నారు. తనకు అందించిన సహకారం ఎంతో విలువైనదని, ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం సంతృప్తి కలిగించిందన్నారు. ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపామని, అధికారులు సిబ్బంది ఎంతో నిబద్దతతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారని ప్రశంసించారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిందని, ప్రభుత్వ సాయంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి ‘సీఎస్, డీజీపీ సహా కలెక్టర్లు ఎస్పీలు పూర్తిగా సహకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. మా బాధ్యతలు నిర్వహించడంలో హైకోర్టు మాకు సంపూర్ణ సహకారంగా అందించింది. రాజ్యాంగ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చట్ట సభలపట్ల పూర్తి విశ్వాసం ఉండాల్సిందే. నేను 7 ఏళ్లపాటు గవర్నర్ కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశాను. రాజ్యాంగ వ్యవస్థలపై నాకు అపార విశ్వాసం ఉంది. నామినేషన్ల ఉపసంహరించడంపై హైకోర్టు ఆదేశాలను శిరసావహించా. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన మంచి పద్దతి అమల్లో ఉంది. అన్నింటినీ నివేదిక రూపంలో క్రోడీకరించి వాటిని అమలు చేయాలని గవర్నర్‌కు నివేదిక అందిస్తా. చేయాల్సిన సంస్కరణలపై నివేదికలో పొందుపరిచా. సిఫార్సులు అమలు చేస్తే శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయి. నాకు వారసులుగా నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఎస్ఈసీ నీలం సాహ్నికి అభినందనలు తెలియజేశాను. నేనెప్పుడూ అధికారిక సమాచారాన్ని బయటకు లీక్ చేయలేదు. వ్యవస్థకు సంబంధించి స్వతంత్రత, నిబద్దతపై ఎవరూ రాజీ పడటానికి వీల్లేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతత్రంగా పనిచేయాలనేదే నా అభిప్రాయం. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం, తోడ్పాటు ఉన్నప్పుడే మెరుగైన పనితీరు వస్తుంది. అందరి సహకారం వల్లే ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగాను.’ అని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ రిటైనింగ్ వాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన నిమ్మగడ్డకు నో అపాయింట్మెంట్ -
నిమ్మగడ్డకు నో అపాయింట్మెంట్
సాక్షి, అమరావతి: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అపాయింట్ మెంట్ దొరకలేదు. నిమ్మగడ్డ పదవీకాలం బుధవారంతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరుతూ నిమ్మగడ్డ నాలుగు రోజుల క్రితమే రాజ్‌భవన్ కార్యాలయ అధికారులకు తెలియజేశారు. అయితే నిమ్మగడ్డను కలిసేందుకు గవర్నర్ ఆసక్తి చూపలేద ని సమాచారం. మంగళవారమంతా కమిషన్ కార్యాలయంలో ఉన్న నిమ్మగడ్డ గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూశారు. కానీ పిలుపు రాకపోవడం తో రమేష్ తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. మార్చి 19న తనను అత్యవసరంగా కలవాలంటూ ఒకరోజు ముందు గానే గవర్నర్ సమాచారమిచ్చినప్పటికీ.. తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ నిమ్మగడ్డ ఆయన్ను కలవని విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసే అంశంపై చర్చించేందుకే గవర్నర్ అత్యవసరంగా 19న తనను కలవాలని ఎస్ఈసీని ఆదేశించగా, తన హయాంలో ఆ ఎన్నికలు జరిపేందుకు ఏమా త్రం ఆసక్తిగా లేని నిమ్మగడ్డ ఏవో కారణాలు చెప్పి అప్పుడు ఆయన్ని కలవలేదన్న విమర్శలున్నాయి. (చదవండి: ఎన్నికలకు టైం లేదు!) -
నిమ్మగడ్డది అప్పుడో మాట.. ఇప్పుడో మాట
సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కోవిడ్ వ్యాక్సిన్‌ను సాకుగా చూపుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిమ్మగడ్డ అప్పుడో మాట.. ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో సజ్జల మాట్లాడుతూ.. కేవలం ఆరు రోజుల్లో పూర్తయ్యే పరిషత్ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కోవిడ్ వ్యాక్సిన్‌ను సాకు చెప్పి వాయిదా వేయడంపై ఆయన మండిపడ్డారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం నాడు ఎన్నికలు వాయిదా వేయమని ప్రజల సాక్షిగా కోరినా అప్పుడు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వినలేదని తెలిపారు. ప్రభుత్వం ఈ ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసి కోవిడ్‌పై దృష్టి పెట్టాలనుకుంటోందని స్పష్టం చేశారు. రానున్న ఎస్ఈసీని కూడా ప్రభుత్వం అదే కోరుతుందని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షంలో ఉండగా చాలా పోరాడామని సజ్జల గుర్తు చేశారు. హోదా కోసం చంద్రబాబులా దొంగాట ఆడబోమని, పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును టీడీపీ నేత చంద్రబాబు జీర్ణించుకోలేక మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు తమ్ముళ్లను భ్రమలో పెట్టేందుకే చంద్రబాబు రోజుకో రకంగా చిందులేస్తున్నాడని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సీఎం జగన్ ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారని, దీనిని రక్షించుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 26న ఉక్కు కార్మీకులు తలపెట్టిన బంద్‌కు వైఎస్సార్సీపీతో పాటు, ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పారు. -
ఎన్నికలకు టైం లేదు!
సాక్షి, అమరావతి: తన హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరిపే పరిస్థితి లేదని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దీనికి కారణమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న తనకు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తగినంత సమయం లేదన్నారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. తిరిగి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే కొత్త తేదీలను ఖరారు చేయాలని, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించిందని నిమ్మగడ్డ అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయడం ద్వారా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలను నిర్వహించానని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ బాధ్యత తదుపరి ఎస్ఈసీదే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి ఉండటం, పోలింగ్ సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం, మరోవైపు తన పదవీ కాలం ఈ నెలాఖరు (మార్చి 31వ తేదీ)తో ముగుస్తున్న కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించలేకపోతున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. తన తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేవారు ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిన్న అలా.. నేడు ఇలా దాదాపు నెలన్నర క్రితం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకైనా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా నిమ్మగడ్డ నిరాకరించారు. ఎన్ని అవాంతరాలు తలెత్తినా తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అలా మొండిగా వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించలేకపోవడానికి అదే వ్యాక్సినేషన్‌ను సాకుగా చూపుతుండటం పట్ల అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
కరోనా సాకు చెప్పి ఎన్నికలు అడ్డుకుంటున్నారు: సజ్జల
సాక్షి, అమరావతి : కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆనాడు ఎన్నికలు వాయిదా వేయమని కోరితే పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ ఇప్పుడేమో 6 రోజుల్లో పూర్తయ్యే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికకు వ్యాక్సినేషన్ సాకు చెప్పి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాము ఈ 6 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసి కోవిడ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల కమిషనర్‌ను కూడా తాము అదే కోరతామని సజ్జల స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం కోవిడ్ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కోటి మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షంలో ఉండగా చాలా పోరాడినమని, ఆనాడు చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన పనికి ఆరోజే హోదా డిమాండ్ సగం చచ్చిపోయిందని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం తాము అన్ని విధాలా పోరాడతామని పేర్కొన్నారు. చంద్రబాబులా దొంగాట ఆడకుండా నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామని వివరించారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేం మరోవైపు రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. తన పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుందని, తర్వాత వచ్చే కమిషనర్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి: సీఎం జగన్ -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు.. ఎస్ఈసీని ఆదేశించలేం
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని లేదా మూడ్రోజుల పాటు సెలవుపై వెళ్తుండటాన్ని బట్టి ఎన్నికల కమిషనర్ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పుకున్నారన్న ప్రాథమిక నిర్ణయానికి రాలేమని హైకోర్టు స్పష్టంచేసింది. అంతేకాక.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చడంతో పాటు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అలాగే దురుద్దేశాలు ఆపాదించినందువల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే ముందు కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయనకు అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ ఈ దశలో కోరజాలరని తేల్చిచెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేశ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ పార్టీని మరిన్ని ఇబ్బందుల నుంచి తప్పించేందుకే నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ఆయన అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం విచారణ జరిపి నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమైనవి కావని, వాటిపై సమీక్ష చేయవచ్చునని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలతో ఈ న్యాయస్థానం ఏకీభవిస్తోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని తెలిపారు. నిమ్మగడ్డపై ఆరోపణలు చాలా తీవ్రమైనవి ‘ఇక ఈ వ్యాజ్యంలో చేసిన ఆరోపణల విషయానికొస్తే.. ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం అవి చాలా తీవ్రమైనవి. నిమ్మగడ్డ రమేశ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఆయనకు పక్షపాతాన్ని ఆపాదించారు. ఈ పక్షపాతానికి కొన్ని ఘటనలను కూడా ఉదహరించారు. అధికార పార్టీపట్ల శత్రుభావంతో వ్యవహరించారని ప్రమాణ పూర్వకంగా ఈ వ్యాజ్యంలో చెప్పారు. నిమ్మగడ్డ రమేశ్ తీరును మోసపూరితంగా, దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా, అక్రమాలుగా వర్గీకరించారు. కౌంటర్లు ఆహ్వానించిన తరువాత వీటన్నింటిపై కూడా లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నది ఈ కోర్టు అభిప్రాయం. ఈ విషయంలో ముఖ్యంగా నిమ్మగడ్డ రమేశ్ నుంచి కౌంటర్ ఆహ్వానించాలి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడానికి (ఈనెల 18) ముందు ప్రస్తుత పిటిషన్ దాఖలైంది. సాధారణంగా ఓ అధికార వ్యవస్థ తీసుకున్న నిర్ణయం తప్పయితే, తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆ వ్యవస్థను ఈ న్యాయస్థానం ఆదేశించగలుగుతుంది. అంతేతప్ప దానిని ఫలానా విధంగా చేసి తీరాలని ఆదేశించలేదు. ప్రస్తుత కేసులో నిమ్మగడ్డ రమేశ్‌పై తీవ్రమైన ఆరోణలున్న నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు కోరే హక్కు పిటిషనర్‌కు లేదు’.. అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పోలింగ్‌కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సరిగ్గా వంద మంది పోలింగ్ జరగడానికి ముందే చనిపోయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖల పరిశీలనలో వెల్లడైంది. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు సైతం కొందరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యాక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేసిన విషయం కూడా తెలిసిందే. ఇటీవలే గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. అప్పట్లో వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై అధికారులు వాకబు చేసినట్టు తెలిసింది. 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 87 మంది, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 13 మంది చనిపోయారని నిర్ధారించారు. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది ఎంపీటీసీ సభ్యులు రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 9,692 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,321 స్థానాల్లో పోటీ జరుగుతుండగా, 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 2371 మందిలో చిత్తూరులో ఐదుగురు.. విజయనగరం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున 8 మంది చనిపోయారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాల్లో పోటీలో ఉన్న 19 వేల మందిలో 79 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారే కావడం గమనార్హం. ఐదుగురు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు. ఏకగ్రీవంగా నెగ్గిన జెడ్పీటీసీ సభ్యుడొకరు.. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను అప్పట్లో 8 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన 652 చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఒకరు మృతి చెందారు. ఏకగ్రీవంగా ముగిసినవి పోను 526 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 2,092 మంది పోటీలో ఉన్నారు. వీరిలో చనిపోయిన 12 మందిలో (ఏకగ్రీవమై చనిపోయిన వ్యక్తి కాకుండా) 11 మంది వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారు. ఆ స్థానాల్లో మళ్లీ నామినేషన్‌కు వీలు! అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సంప్రదాయం అమలు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయిన చోట మాత్రం ఈ అవకాశం ఉండని చెబుతున్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చనిపోతే ఎలా వ్యవహరించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. -
గవర్నర్‌కు నేను రాసిన లేఖలు లీకయ్యాయి..
సాక్షి, అమరావతి: తాను గవర్నర్‌తో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ లీక్ అయ్యాయని, దీనిపై ఫిర్యాదు చేసినా ఆయన ముఖ్య కార్యదర్శి విచారణ జరపడంలో విఫలమయ్యారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోం శాఖను, సీబీఐని ఆదేశించాలని కోరారు. లీకేజీపై 72 గంటల్లో మధ్యంతర నివేదికను సమర్పించేలా సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, మంత్రులు.. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గుంటూరు వాసి మెట్టు రామిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ముందు విచారణకు వచ్చింది. నిమ్మగడ్డ తనకు బాగా తెలిసిన వ్యక్తి అని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించనని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావుకు జస్టిస్ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో దీన్ని మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. రహస్య లేఖల ద్వారా గవర్నర్‌ను సంప్రదించాను: నిమ్మగడ్డ ‘ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో నేను రహస్య లేఖల ద్వారా గవర్నర్‌ను సంప్రదించాను. రెండు రాజ్యాంగ కార్యనిర్వాహకుల మధ్య సాగిన ఈ లేఖలను ప్రజానీకానికి, మీడియాకు బహిర్గతం చేయడానికి వీల్లేదు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాలతో వీటిని ప్రజాబాహుళ్యంలోకి తెచ్చారు. ఈ నెల 18న అసెంబ్లీ కార్యదర్శి నుంచి నాకు ఓ లేఖ అందింది. నేను రాసిన లేఖల ఆధారంగా మంత్రులు.. బొత్స, పెద్దిరెడ్డిలు నాపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను దూషించారు. ఏపీ పోలీసులకు లేఖల లీకేజీ దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తే వాటిని నేనే లీక్ చేశానని ఇరికిస్తారు. అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సి వచ్చింది’ అని నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
మీ అధికారాలకు పరిమితులు లేవా?
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను శనివారం గట్టిగా నిలదీసింది. ఒక 2 నెలల తర్వాత ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామంటే ఎలా? అని ఆయనను ప్రశ్నించింది. కోర్టులు అధికార రహితమని భావిస్తున్నారా? అని నిలదీసింది. ఎన్నికల కమిషనర్ తనకున్న విచక్షణాధికారాలను ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలని స్పష్టం చేసింది. వాటికి పరిమితులు లేవని అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఆ విచక్షణాధికారాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవా? అంటూ నిలదీసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ప్రకటించారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదని గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మరోసారి న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ముందుకు విచారణకొచ్చింది. నిమ్మగడ్డ కోర్టుకు బాధ్యత వహించాల్సిందే.. ముందుగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషనర్ ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానం ప్రశ్నించజాలదని, పరీక్షించజాలదని తెలిపారు. పరీక్షించడమంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఏ దశలో అయితే పరిషత్ ఎన్నికలు నిలిచిపోయాయో అక్కడి నుంచే నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందన్నారు. గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికలు పూర్తి కాగానే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహిస్తామని నిమ్మగడ్డ తెలిపారని వివరించారు. ఆయన కోర్టుకు బాధ్యత వహించాల్సిందేనని తెలిపారు. మరో 11 రోజులు మాత్రమే నిమ్మగడ్డ పదవిలో ఉంటారని, పరిషత్ ఎన్నికల పూర్తికి 6 రోజులు సరిపోతాయని, ఇప్పుడు ఆయన సెలవుపై వెళుతూ తనను ఏ రకంగానూ ప్రశ్నించకూడదనడం ఆయన తీరుకు నిదర్శనమన్నారు. ఎన్నికలు నిర్వహించేలా కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. న్యాయ సమీక్షకు ఎన్నికల కమిషనర్ అతీతుడేమీ కాదు.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మరో రాజ్యాంగ వ్యవస్థ పట్ల బాధ్యతారాహిత్యంతో, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ ఓ రాజకీయ పార్టీ కార్యాలయంలో తయారైందని, దీనిపై విచారణ కూడా జరుగుతోందన్నారు. కోర్టు ప్రశ్నించడం తన స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనని ఆయన చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ న్యాయ సమీక్షకు అతీతుడు కారని తెలిపారు. అతీతుడిని అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అందరి వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
నిమ్మగడ్డ దాగుడుమూతలు
సాక్షి, అమరావతి: గతేడాది మధ్యలో నిలిపివేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాగుడుమూతలాడుతున్నారు. ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించినప్పటికీ నిమ్మగడ్డ మాత్రం తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ సమాచారమిచ్చి ముఖం చాటేయడం గమనార్హం. ఏడాది క్రితం మధ్యలో నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం గవర్నర్‌ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలిఉన్న ఆ ఎన్నికలను పూర్తి చేసేలా ఆదేశించాలని సీఎస్ కోరారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ఆరు రోజుల్లో ముగిసిపోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే వ్యాక్సినేషన్‌ను పూర్తి స్థాయిలో వేగవంతంగా చేపట్టవచ్చని ప్రభుత్వం తరపున సీఎస్ నివేదించారు. ఈ క్రమంలో ఈ అంశాలపై చర్చించేందుకే తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. సెలవు కాదు.. విధుల్లోనే ఉన్నా నిమ్మగడ్డ శుక్రవారం సెలవులో లేరని, అధికారికంగా ఆయన విధుల్లోనే ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత నాలుగు రోజులుగా నిమ్మగడ్డ హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని, 18న జరిగిన మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలను ఆయన అక్కడ నుంచే పర్యవేక్షించారని పేర్కొన్నాయి. కాగా ఈ నెల 22 నుంచి 24వతేదీ వరకు ఎల్టీసీపై తమిళనాడులోని మధురై, రామేశ్వరం పర్యటనకు వెళ్లేందుకు గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది. కలవకపోవడం ధిక్కారమే.. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా అధికార యంత్రాంగం అంతా ఈ ప్రక్రియలో నిమగ్నమైనందున ఈ ఏడాది జనవరిలో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ వైద్య ఆరోగ్య శాఖ నివేదికతో సహా ఎస్ఈసీకి తెలియచేశారు. అయినప్పటికీ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఆగమేఘాలపై నిర్వహించి ఏడాది క్రితం మధ్యలో ఆపేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి మాత్రం పట్టించుకోలేదు. న్యాయపరంగా ఎటువంటి ఆటంకాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డ ఆ ఎన్నికల నిర్వహణకు సుముఖత చూపడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ అంశాలపై చర్చించేందుకు తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ ఆదేశించినా ఏవో సాకులు చెప్పి రాకపోవడం నిమ్మగడ్డ ధిక్కార ధోరణికి నిదర్శనమనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
నిమ్మగడ్డా.. వివరణ ఇవ్వు
సాక్షి, అమరావతి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నుంచి వివరణ కోరాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన వర్చువల్ సమావేశంలో కమిటీ సభ్యులు మల్లాది విష్ణు, వెంకట చిన అప్పలనాయుడు, శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ సభ్యుడు సత్యప్రసాద్ పాల్గొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తూ నిమ్మగడ్డ ఫిబ్రవరి 7న జారీ చేసిన ఆదేశాలపై స్పీకర్ తమ్మినేనికి మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు చేశారు. తాను ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నానని, దౌర్జన్యాలు చేస్తున్నానని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నానంటూ ఎన్నికల కమిషనర్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో మంత్రి పేర్కొన్నారు. స్పీకర్ ఈ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. కాగా, ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన తమ కమిటీ అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ‘మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు విచారణకు స్వీకరించాం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యక్తిగతంగా లేదా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాం. దీనికి సంబంధించిన లేఖను అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు పంపిస్తున్నాం. అలాగే అందుబాటులో ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నాం. ఆయన నుంచి వివరణ వచ్చిన తర్వాత తదుపరి అంశాలను పరిశీలిస్తాం’ అని కాకాణి తెలిపారు. -
నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఈ ఏడాది ఫిబ్రవరి 18న జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మొదటిదశ నుంచి విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల ప్రకారం గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికను ప్రకటించి తీరాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికపై వారి ప్రత్యర్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే, వారు సంబంధిత ఎన్నికల ట్రిబ్యునల్‌లో ఆ ఎన్నికను సవాలు చేసుకోవచ్చునంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు, ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఈ మధ్యలో ఎన్నికలకు సంబంధించి వచ్చే ఏ ఫిర్యాదుపైన కూడా విచారణ జరిపే అధికారం ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల్లోని రూల్ 99 ప్రకారం ఎన్నికల కమిషన్‌కు లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఎన్నికను రద్దు చేసే అధికారం కూడా ఎన్నికలకు కమిషన్‌కు లేదని స్పష్టం చేసింది. ఎన్నికల్లో మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాలు విచారణ చేయదగ్గవే అయినా కూడా, అందులో జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదంది. ఓసారి ఎన్నిక ముగిసిన తరువాత ఎన్నికలకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ట్రిబ్యునల్ మాత్రమే విచారణ జరపాలని చట్టం చెబుతోందని గుర్తుచేసింది. మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాల విషయంలో స్పష్టమైన, నిర్దిష్ట ఆధారాలు ఉండాలంది. ఇలాంటివాటిని న్యాయపరంగా సుశిక్షితులైన న్యాయాధికారి మాత్రమే విచారణ జరపగలరని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఎన్నికల కమిషనర్ గత నెల 18న జారీచేసిన ఉత్తర్వులతో పాటు బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుత్తూ ఫారం–10 అందుకున్న పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు గత వారం వాయిదా వేసిన తీర్పును మంగళవారం వెలువరించారు. సమాచారం సేకరించవచ్చు ఎన్నికల ప్రక్రియలో లోపాలను సవరించేందుకు ఎన్నికల అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించవచ్చని, సమాచార సేకరణకు మాత్రమే కమిషన్ విచారణను పరిమితం చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై, సిబ్బంది చర్యలు తీసుకునేందుకు సైతం సమాచారం సేకరించవచ్చన్నారు. సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వీయ అవసరాల నిమిత్తం లేదా చట్ట సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనసభకు, పార్లమెంట్‌కు పంపొచ్చని పేర్కొన్నారు. తీర్పు వెలువరించిన తరువాత అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో ఎన్నికల కమిషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని కోరారు. అలా చేయడం ద్వారా సమస్యలు వస్తాయన్న న్యాయమూర్తి.. అది ఈ వ్యాజ్యాలతో సంబంధం లేని స్వతంత్ర అంశమని చెప్పారు. జనసేన పిటిషన్‌పై విచారణ 23కి వాయిదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు విచారణను వాయిదా వేశారు. -
హైకోర్టులో మరోసారి ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఈసీకి ఎదురుదెబ్బ
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిమ్మగడ్డ 'వెనకడుగు'
సాక్షి, అమరావతి: ఎన్ని అవాంతరాలు ఎదురైనా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టు బట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజా పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారని రాజకీయ పార్టీలు, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు, అవకాశాలు ఉన్నా.. కావాలనే దాట వేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిషన్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించిన అదనపు సిబ్బందిని నిమ్మగడ్డ వారి మాతృశాఖలకు తిరిగి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తీరు చూస్తుంటే ‘పరిషత్’ ఎన్ని కలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదనే విషయం స్పష్ట మవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వచ్చిన నలుగురు ఏఎస్వో స్థాయి అధికారులను మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే మాతృశాఖలకు తిరిగి వెనక్కి వెళ్లేందుకు నిమ్మగడ్డ అనుమతి ఇచ్చారు. సోమవారం మరో నలుగుర్ని వారి పాత విధులకు పంపేందుకు నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా అందుకు ఆయన సుముఖంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. న్యాయపరమైన చిక్కులు లేకున్నా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలు ఏమీలేవు. ఒక ట్రెండు పార్టీలు మాత్రమే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, ఎన్నికల ప్రక్రియను మొదటినుంచీ చేపట్టాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాయి. ఆగిపోయిన ఎన్నికలను రద్దుచేయాలనిగానీ, తాత్కాలికంగా నిలిపివేయాలని గానీ కోర్టు తీర్పులు కూడా ఏమీ లేవు. ‘పరిషత్’ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గతంలోనే ముగిసిన దృష్ట్యా ఆ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు వారం రోజులకు మించి అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. టీడీపీకి నష్టమని భావించి.. ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ నిమ్మగడ్డ వాటి జోలికి వెళ్లకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా వెలువడ్డాయి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించుకున్న నిమ్మగడ్డ ప్రభుత్వం వారిస్తున్నా ఎన్నికల నిర్వహణకు సిద్ధçమయ్యారని అప్పట్లో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కనీసం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చినా.. ఎన్నికలు జరపాల్సిందేనని పట్టుబట్టి ఆ ఎన్నికలకు నిమ్మగడ్డ పూనుకున్నారు. చివరకు ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించకపోగా.. తీవ్ర నష్టం చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే కనీసం తాను కమిషనర్‌గా ఉన్నంత వరకైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకూడదని నిమ్మగడ్డ నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఒక్కసారే రీ కౌంటింగ్‌కు అనుమతి
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అన్నిచోట్లా రాత్రి 8 గంటలకల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లాల కలెక్టర్లతోపాటు మున్సిపల్ శాఖ కమిషనర్, ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీ/కార్పొరేషన్ కమిషనర్లకు సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఒక అంకె ఓట్ల తేడా ఉన్నచోట మాత్రమే రీకౌంటింగ్ నిర్వహించాలని, రెండంకెల ఓట్ల తేడా ఉన్నప్పుడు అభ్యర్థులెవరైనా రీకౌంటింగ్ కోరితే రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని తెలిపారు. కేవలం ఒకసారి మాత్రమే రీకౌంటింగ్‌కు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై నిమ్మగడ్డ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అన్నిచోట్ల వీడియో కెమేరాల ద్వారా, లేదంటే సీసీ కెమేరాలు, వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ఆ వీడియో ఫుటేజీని ఎన్నికల రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో విద్యుత్ అంతరాయాల్లేకుండా చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైతే జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచనలిచ్చారు. -
18న మేయర్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: నగర పాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆ రోజు ఉ.11గంటలకు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయించారు. ఏలూరు మినహా 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీల్లో పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. 14న జరిగే మున్సి‘పోల్స్’ ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అలాగే, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. వీరు ముందుగా విజేతలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలను చేపడతారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు హక్కు ఉంటుంది. వీరు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ► లోక్‌సభ సభ్యుడు లేదా ఎమ్మెల్యే తాము గెలిచిన నియోజకవర్గ పరిధిలో ఒకటి కంటే ఎక్కువ పట్టణాలు ఉంటే ఏదో ఒకచోట మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యునిగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గ పరిధిలో ఒకటే పట్టణం ఉంటే అందులోనే అతను ఎక్స్ అఫిషియో సభ్యునిగా పరిగణిస్తారు. ► రాజ్యసభ సభ్యునికి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎక్కడ ఓటు హక్కు కలిగి ఉంటుందో ఆ నగర పాలక సంస్థ లేదంటే మున్సిపాలిటీలో అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. ఇక ఎమ్మెల్సీలు కూడా తాము ఎన్నికయ్యే సమయంలో ఏ మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో ఓటు హక్కు కలిగి ఉంటారో అక్కడే అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. కోరం ఉంటేనే ఎన్నిక నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలోని ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యులలో కనీసం సగం మంది 18న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరైతేనే ఆయాచోట్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను నిర్వహిస్తారు. గంట వ్యవధిలో కనీసం సగం మంది సభ్యులు హాజరుకాని పక్షంలో కోరం లేని కారణంగా ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. విప్ జారీచేసే అధికారం లేని జనసేన ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తమ అభ్యర్థులకు విప్ జారీచేసే అధికారం ఆయా పార్టీలు కలిగి ఉంటాయి. అధికార వైఎస్సార్సీపీ, తెలుగుదేశంతో సహా జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మొత్తం 18 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలో విప్ జారీ చెయ్యొచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పక్షాలకు లేఖలు రాసింది. కానీ, విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో జనసేన లేదు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా నమోదై ఉండి.. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద కూడా నమోదు చేసుకుని ఉంటే అలాంటి పార్టీలకు మాత్రమే ఈ ఎన్నికల్లో విప్ జారీచేసే అధికారం ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కానీ, రాష్ట్రంలో జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కాదని.. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక గుర్తు రిజర్వుడు చేయబడిన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అయినందున ఆ పార్టీని విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో చేర్చలేదని ఆ వర్గాలు వివరించాయి. -
ఓటెత్తిన పురం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో ఓట్లు పోటెత్తాయి. 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ఏకంగా 62.28 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల కంటే పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగిన 12 నగరపాలక సంస్థల్లో 57.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 70.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏకగ్రీవమైనవాటిని మినహాయించగా 12 నగరపాలక సంస్థల్లోని 581 డివిజన్ల్లో 2,569 మంది, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డుల్లో 4,981 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం మీద 7,550 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నగరపాలక సంస్థల పరిధిలో 4,626, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 3,289 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు సైతం ఓటింగ్ పట్ల ఆసక్తి చూపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్నవారిని కూడా ఓట్లు వేసేందుకు అనుమతించారు. ఓటర్ స్లిప్పులు లేకపోయినా ఓటర్ల జాబితాలో ఉన్నవారు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకువస్తే ఓటింగ్‌కు అవకాశమిచ్చారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను సంబంధిత ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. సీసీ కెమెరాలతోపాటు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్లేసిన 48.30 లక్షల మంది.. ► పోలింగ్ నిర్వహించిన 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొత్తం 77,56,200 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 48,30,296 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► అత్యధికంగా 75.93 శాతం ఓటింగ్‌తో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ► 75.49 శాతం పోలింగ్‌తో ప్రకాశం జిల్లా రెండో స్థానంలో, 71.52 శాతంలో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ► కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 55.87 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల్లో టాప్‌లో ఒంగోలు ► నగరపాలక సంస్థల్లో 75.52 శాతం పోలింగ్‌తో ఒంగోలు మొదటి స్థానంలో నిలిచింది. ► 71.14 శాతం పోలింగ్‌తో మచిలీపట్నం రెండో స్థానంలో, 66.06 శాతం పోలింగ్‌తో చిత్తూరు మూడో స్థానంలో ఉన్నాయి. ► కర్నూలులో అత్యల్పంగా 49.26 శాతం ఓట్లు పోలయ్యాయి. పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొదటి స్థానంలో గూడూరు ► 85.98 శాతం పోలింగ్‌తో గూడూరు (కర్నూలు జిల్లా) నగర పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. ► 83.04 శాతం ఓటింగ్‌తో అద్దంకి రెండో స్థానంలో, 82.24 శాతం ఓటింగ్‌తో మండపేట మూడో స్థానంలో ఉన్నాయి. ► ఆదోనిలో అత్యల్పంగా 50.05 శాతం ఓట్లు పోలయ్యాయి. పురపాలక ఓట్ల లెక్కింపు కోసం విస్తృత ఏర్పాట్లు.. పురపాలక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్, పురపాలక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఎన్నికలు నిర్వహించిన 12 నగరపాలక సంస్థల్లో మొత్తం 2,204 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 9,788 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్ సిబ్బంది 7,412 మంది కాగా కౌంటింగ్ సూపర్వైజర్లు 2,376 మంది. ► ఎన్నికలు నిర్వహించిన 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కోసం 1,822 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 7,136 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్ సిబ్బంది 5,195 మంది కాగా కౌంటింగ్ సూపర్వైజర్లు 1,941 మంది ఉన్నారు. -
ఏపీ: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
-
మాకు విశేషాధికారాలున్నాయి
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు విశేషాధికారాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల వాయిదా, రద్దు, తిరిగి నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారాలున్నాయన్నారు. పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. భారత ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కూ ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతుంటే జోక్యం చేసుకుని నిష్పాక్షికంగా నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా 126 జెడ్పీటీసీలు, 2,363 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, గతంతో పోలిస్తే ఏకగ్రీవాల సంఖ్య అసాధారణంగా పెరిగిందన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో బెదిరింపులు, ప్రలోభాలపై కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయని, అందుకే ఏకగ్రీవాల్లో ఎన్ని న్యాయమైనవో తేల్చేందుకే విచారణ జరపాలని నిర్ణయించామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను కొట్టివేయాలని, మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని అభ్యర్థించారు. ఫాం – 10 ప్రస్తావన లేకుండా కౌంటర్ 657 పేజీల కౌంటర్లో న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన దాదాపు 25 తీర్పులను నిమ్మగడ్డ ప్రస్తావించారు. పిటిషనర్లు ప్రధానంగా ప్రస్తావించిన ఫాం – 10 (అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఇచ్చే పత్రం) గురించి కనీసం ఒక్క పదం కూడా ఆయన కౌంటర్లో పేర్కొనకపోవడం గమనార్హం. కౌంటర్లో మొత్తం ఎన్నికల కమిషన్ అధికారాల గురించే ప్రస్తావించారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తయిందా లేదా అని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆరా తీశారు. విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఆయా నగర పాలక సంస్థల కమిషనర్లతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీసుల సహకారంతో అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమ్మగడ్డతో సీఎస్ భేటీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై నివేదిక పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీల వారీగా కౌంటింగ్, రీ కౌంటింగ్ జరిగిన తీరుపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఆదివారం ఎస్ఈసీకి నివేదిక అందజేసినట్టు తెలిసింది. కౌంటింగ్ తీరుపై ఎస్ఈసీ నివేదిక కోరిన విషయం తెలిసిందే. -
రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ
-
హైకోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ..
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఎస్ఈసీ సమయం కోరారు. కోర్టు కేసులు ఉన్నాయని ఎస్ఈసీ ఆలస్యం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ చెప్పారు. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో.. కౌంటర్ దాఖలు చేసినట్లుగానే భావించి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది. చదవండి: చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం సిట్టింగ్‌లకు టీడీపీ షాక్.. జనసేనతో లోపాయికారి ఒప్పందం! -
ఎస్ఈసీకి హైకోర్టు ఝలక్
సాక్షి, అమరావతి: విశేషాధికారాల పేరుతో చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసిన తరువాత కూడా పలుచోట్ల పలువురు అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు అనుమతినిస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఫిర్యాదులు స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును కూడా నిలుపుదల చేసింది. మరోవైపు మునిసిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్ చర్యలన్నీ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం వేర్వేరుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్లపై ఇవీ వ్యాజ్యాలు... నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కూడా నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మునిసిపాలిటీకి చెందిన పాపిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన వి.ఈశ్వరి, కొమ్మినేని అనీష్ కుమార్ మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించినట్లు ఫిర్యాదులు వస్తే స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులను కూడా పిటిషనర్లు సవాలు చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ వ్యాజ్యాల్లో కోరారు. ఆ అధికారం కమిషన్‌కు లేదు... ‘ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని భావిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. నామినేషన్ల దాఖలు నుంచి ఫలితాల వెల్లడి వరకు వచ్చే ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ విచారణ జరపడానికి వీలేదు. ఆ ఫిర్యాదులను ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే తేల్చాలి. నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని భావిస్తే సంబంధిత వ్యక్తులు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ప్రస్తుత కేసులో జారీ చేసినటువంటి ఉత్తర్వులు వెలువరించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం’ అని జస్టిస్ సోమయాజులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషన్ జోక్యంపై స్పష్టమైన నిషేధం ఉంది మోసం తదితర విషయాల్లో ఎన్నికల కమిషన్ వాదన ప్రశంసించదగ్గదే అయినా ఈ కేసులో న్యాయ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రత్యామ్నాయ పరిష్కారం ఉన్నప్పుడు న్యాయస్థానాల జోక్యం తగదు. అందువల్ల ఈ కేసులో ఎన్నికల కమిషన్ వాదనతో ఏకీభవించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో చట్టంలో లేదని, అందువల్ల పరిస్థితులకు తగినట్లు అధికారాన్ని ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ చెబుతోంది. మునిసిపల్ ఎన్నికల నిర్వహణ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలిస్తే నామినేషన్ దాఖలు మొదలు ఫలితాల వెల్లడి వరకు ఏవైనా అక్రమాలు జరిగితే ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ విచారించడానికి వీల్లేదని, వాటిని ఎన్నికల ట్రిబ్యునల్ మాత్రమే విచారించాలన్న విషయం తేటతెల్లమవుతోంది’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నలుగురే నామినేషన్లు వేశారు.. ‘ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగితే ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యామ్నాయం ఉందన్న పిటిషనర్ల వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. హైదరాబాద్ మునిసిపల్ చట్టం సెక్షన్ 71 ప్రకారం ఎన్నికను ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే ప్రశ్నించగలుగుతారు. రాజ్యాంగంలోని అధికరణ 243 జెడ్జీ ఏ మునిసిపాలిటీ ఎన్నికనైనా ఎన్నికల పిటిషన్ ద్వారా తప్ప మరో రకంగా ప్రశ్నించజాలరని చెబుతోంది. ఒక చర్యను ఫలానా విధంగా చేపట్టాలని చట్టం చెబుతున్నప్పుడు ఆ విధంగానే చేపట్టాలే కానీ మరోరకంగా కాదు. మునిసిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే తిరిగి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పరిస్థితుల్లో పిటిషనర్లకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎన్నికల్లో మోసం జరిగిందని చెబితే సరిపోదు, నిర్దిష్ట ఆధారాలను సమర్పించాలి. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో రిటర్నింగ్ అధికారి జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఎన్నికల కమిషన్ దీన్ని తోసిపుచ్చింది. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అందుకు కారణాలు తెలియచేయాలి. కానీ ప్రస్తుత కేసులో అలాంటి కారణాలు ఏవీ చెప్పలేదు’ అని జస్టిస్ సోమయాజులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారనేందుకు ఆధారాల్లేవ్ మునిసిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. వార్డు వలంటీర్ల కార్యకలాపాలన్నింటినీ నిలిపేయాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లలో డేటాను వలంటీర్లు దుర్వినియోగం చేస్తారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని, ఓటర్లను ప్రభావితం చేస్తారనేందుకు సైతం ఆధారాల్లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ బెదిరింపులు, ఒత్తిళ్లకు పాల్పడినా, ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జేసీ, వెలగపూడి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాల్లో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలను చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ వేశారు. బెదిరించాలనుకుంటే.. ఫోన్లు లేకుండా కూడా చేయొచ్చు ‘వలంటీర్లు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్ స్లిప్పుల పంపిణీ విషయంలో 19.2.2021న పురపాలకశాఖ జారీ చేసిన సర్కులర్ చాలా స్పష్టంగా ఉంది. ఓటర్ స్లిప్పుల పంపిణీని బ్లాక్ లెవల్, అధీకృత ఉద్యోగులు మాత్రమే చేపట్టాలని అందులో పేర్కొన్నారు. ఫోన్లను జాగ్రత్తగా ఉంచకుంటే లబ్ధిదారుల వివరాలను వలంటీర్లు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశం ఉందన్నది ఎన్నికల కమిషన్ ఆందోళన మాత్రమే. ఈ ఆధునిక యుగంలో సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్ లేకుండా కూడా డేటాను సంపాదించవచ్చు, దుర్వినియోగం కూడా చేయవచ్చు. మొబైల్ ఫోన్లలో డేటాను ఉపయోగించి ఫలానా వారికి ఓటు వేయకుంటే పథకాలు ఆపేస్తామని బెదిరించడం అన్నది వలంటీర్లు మొబైల్ ఫోన్లు లేకుండా కూడా చేయవచ్చు. వారిని విధులు నిర్వర్తించకుండా స్తంభింప చేయడం, మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం చేయాలని చెప్పజాలం. ప్రజల మంచి కోసం వలంటీర్లను విధులు నిర్వర్తించడానికి అనుమతించాలని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది’ అని జస్టిస్ సోమయాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే హవా..
సాక్షి, తాడేపల్లి: తామందరమూ ఊహించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనడానికి ఈ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలే నిదర్శనమన్నారు. ఏకగ్రీవాలు అధికంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు ఉండేవని పేర్కొన్నారు. సుపరిపాలన అందిస్తే ప్రజల ఆశీస్సులు ఉంటాయనేది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఫలితాలు వైఎస్సార్సీపీ అనుకూలంగా ఉంటాయని తెలిసే చంద్రబాబు కోవిడ్ చూపి ఎన్నికలను వాయిదా వేయించాడన్నారు. ఎస్ఈసీ విషయంలో చంద్రబాబు రోజుకో తీరులో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఒక రోజు మెరునగధీరుడు అన్నారు.. ఇప్పుడేమో ఎస్ఈసీ మారిపోయాడంటున్నాడన్నారు. వలంటీర్ల సర్వీసులపై ఆంక్షలు పెట్టాలని ఎస్ఈసీ కుట్రలు పన్నినప్పటికీ, కోర్ట్ ఆ కేసును కొట్టేసిందని గర్తుచేశారు. ఎస్ఈసీ అధికార దుర్వినియోగం చేసి మళ్లీ నామినేషన్ వేయండని టీడీపీ వారిని కోరినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఆ పార్టీపై నమ్మకం పోయింది కాబట్టే నామినేషన్ వేసే నాధుడే కరువయ్యాడన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయడం అంత చెండాలం లేదనుకుంటే, ఇప్పుడు మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను మేనిఫెస్టోలో పెట్టడం విడ్డూరంగా ఉందని, దీనిపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 2014 మున్సిపల్ మేనిఫెస్టోలో 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఆతరువాత ఆ ఊసే లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అధికారమే లేకుంటే మున్సిపల్ పన్నులు ఎలా తగ్గిస్తాడని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబుని పంచాయతీకి, మున్సిపాల్టీకి ముఖ్యమంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. ఆస్తి పన్ను సవరణకు సంబంధించి పారదర్శకంగా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆస్తిపన్నుపై చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. పంచాయతీల కంటే పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో గెలుస్తందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. కొత్తగా మున్సిపల్ నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేసింది. వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది. కాగా, తిరుపతి కార్పోరేషన్లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్‌కి అవకాశమిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేకాదు..వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి : పంచాయతీ రీ కౌంటింగ్‌పై ఈసీ మరో కీలక ఉత్తర్వు -
ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు
-
పంచాయతీ రీ కౌంటింగ్‌పై ఈసీ మరో కీలక ఉత్తర్వు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపులో ఎక్కడెక్కడ రీ కౌంటింగ్ జరిగింది? ఎందుకు నిర్వహించారు? తదితర అంశాలపై తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికలు జరిగిన ప్రతి చోట కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి వివరాలతో పంచాయతీలవారీగా నివేదికలు అందజేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 5లోగా నివేదిక ఇవ్వాలి ఓట్ల లెక్కింపు ఎన్ని గంటలకు మొదలైంది..? లెక్కింపు సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందా? కరెంటు సరఫరా ఎందుకు నిలిచిపోయింది? కౌంటింగ్ పూర్తయ్యాక ఓడిపోయిన అభ్యర్ధి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్నారా? తదితర వివరాలు పంచాయతీల వారీగా స్పష్టంగా ఉండాలని పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్‌ను నిమ్మగడ్డ తాజాగా పంచాయతీరాజ్ శాఖకు పంపారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన నివేదికలను ఈనెల 5లోగా పంపాలని పేర్కొన్నారు. ఎలా సాధ్యం? పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు పంపే నివేదికలపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వేర్వేరుగా తమ అభిప్రాయాలను జోడించి ఎన్నికల కమిషన్‌కు పంపాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు కాకుండా 10,890 పంచాయతీల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగిందని, భారీగా ఉన్న పంచాయతీలపై కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఏ ప్రాతిపదికన విడివిడిగా అభిప్రాయాలు వెల్లడించాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా మూడు రోజుల వ్యవధిలోనే ఒక్కో పంచాయతీలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీడీవోకు, అక్కడ నుంచి డీపీవో, జిల్లా కలెక్టర్లకు నివేదికలు అందడం, పరిశీలన జరిపి అభిప్రాయాలు తెలియచేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు అధికారుల్లో ఉత్పన్నమవుతున్నాయి. వివాదాలన్నీ ట్రిబ్యునల్‌లోనే.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పది రోజుల క్రితమే ముగిసింది. గెలిచిన సర్పంచి అభ్యర్ధులు, వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి వివాదాలున్నా ఎన్నికల ట్రిబ్యునల్‌లోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ముగిసిన ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదని పేర్కొంటున్నారు. ఇదంతా గందరగోళానికి గురి చేసేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వలంటీర్లపై ఎస్ఈసీ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కమిషనర్ ఆదేశాలను ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుతూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్‌జైన్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఎస్ఈసీ ఉత్తర్వులవల్ల పెన్షన్లు, నిత్యావసరాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు నిలిచిపోతుందన్నారు. వలంటీర్లకు రాజకీయాలతో సంబంధంలేదని, వారు స్వచ్ఛంద సేవకులని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని, అందువల్ల మున్సిపల్ ఎన్నికల్లో వారు పాల్గొనకుండా ఉత్తర్వులిచ్చామని ఎస్ఈసీ చెబుతున్నారని.. వాస్తవానికి వలంటీర్లపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని శ్రీరామ్ తెలిపారు. నిర్దిష్టమైన ఆరోపణలుంటే చర్యలు తీసుకోవచ్చునని, అంతేతప్ప మొత్తం వలంటీర్ల వ్యవస్థనే స్తంభింపజేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని ఆయన వివరించారు. వలంటీర్ల వ్యవస్థ వచ్చిన తరువాత గ్రామస్థాయిలో సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగిందని ఏజీ తెలిపారు. వలంటీర్లు ప్రతీనెలా మొదటి తేదీన లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారని.. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఆదేశాలవల్ల పెన్షన్ అందజేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తనకు ఎలాంటి ఆదేశాలైనా ఇచ్చే అధికారాలున్నట్లు ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారని, ఈ భావన సరికాదన్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తానని కూడా కమిషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి వలంటీర్ల తొలగింపు అధికారం కమిషనర్‌కు లేదన్నారు. ఒకటో తేదీ పెన్షన్ మంజూరు చేసే రోజు అని, అందువల్ల పెన్షన్ మంజూరులో జోక్యం చేసుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, రేపు చూద్దామని తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పిటిషన్ ఇదిలా ఉంటే.. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు ముగిసే వరకు వార్డు వలంటీర్లను వారి విధుల నుంచి దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ వ్యాజ్యంపై కూడా జస్టిస్ సోమయాజులు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. పురపాలక ఎన్నికలపై పిల్ కొట్టివేత గత ఏడాది పురపాలక ఎన్నికలు నిలిచిపోయిన దశ నుంచే ఇప్పుడు ఆ ఎన్నికలను ప్రారంభిస్తూ ఎన్నికల కమిషనర్ గత నెల 15న జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇందులో తాము ఏ రకంగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల కామన్‌మెన్ ఫోరం కన్వీనర్ జీవీ రావు హైకోర్టులో పిల్ వేశారు. కాగా, పురపాలక ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం, అప్పీల్‌ను భౌతికంగా ఫైలింగ్ చేస్తేనే విచారిస్తామని స్పష్టం చేసింది. -
వలంటీర్ల ఫోన్ల స్వాధీనం సరికాదు
సాక్షి, అమరావతి: వార్డు వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీచేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, పద్మజారెడ్డిలు హాజరుకాగా.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఎం నుంచి వైవీ రావు, సీపీఐ తరఫున జల్లి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలితో పాటు బీజేపీ, జనసేన తదితర పార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలవల్ల వార్డు వలంటీర్లు వారి రోజు వారీ విధులు నిర్వర్తించే పరిస్థితి ఉండదని, నిబంధనల పేరుతో వారికి ఆటంకాలు కలిగే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. వృద్ధులు, వికలాంగులకు రవాణా సౌకర్యం వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగమే వారికి ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటుచేస్తుందని సమావేశంలో కమిషనర్ వివరించారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిమ్మగడ్డ స్పష్టంచేశారు. కాగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పలుచోట్ల బదిలీలు జరుగుతున్నాయని పలువురు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకురాగా.. ‘దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న వారి బదిలీలకు తానే సీఎస్‌కు సిఫార్సు చేశానని, అందుకనుగుణంగానే మార్పులు జరుగుతున్నాయ’ంటూ కమిషనర్ బదులిచ్చారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: వర్ల పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని సమావేశంలో వర్ల రామయ్య ప్రస్తావించడంతో నిమ్మగడ్డ ఆయన్ను వారించి మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడాలని సూచించారు. అయినా, అదే అంశాన్ని పెద్ద గొంతుతో పదేపదే ప్రస్తావిస్తుండడంతో ఎన్నికల కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశానంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ, మేం మొన్నమొన్నటి వరకు చూసిన నిమ్మగడ్డలా ఆయన కనిపించడంలేదని.. ఆయనపై మాకు అనుమానాలున్నాయని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
విశేషాధికారాల ముసుగులో.. టీడీపీ సేవ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ప్రక్రియ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చేలా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజాగా మరో ఉత్తర్వు జారీచేశారు. ఈనెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఘట్టం ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ కొందరు టీడీపీ నేతలకు మాత్రం ఇప్పుడు నామినేషన్ వేసుకునేందుకు తన విశేషాధికారాలతో అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక మళ్లీ వాటిని వేసేందుకు వీల్లేదని ఎన్నికల చట్టాలు స్పష్టంగా చెబుతున్నా నిమ్మగడ్డ వాటన్నింటినీ తోసిరాజని.. ఫిర్యాదులు, వినతులు వచ్చాయంటూ ఓ పార్టీకి లబ్ధిచేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలను దెబ్బతీసేందుకే ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరోవైపు.. నామినేషన్లపై తామెంలాంటి ఫిర్యాదు చేయలేదని, వినతులు కూడా పంపలేదంటూ ఇద్దరు నేతలు స్పందించినట్లు తెలిసింది. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని, ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తిలేదని వారు ఎన్నికల అధికారులకు స్పష్టంచేసినట్లు సమాచారం. వివరాలివీ.. తిరుపతి నగరపాలక సంస్థతో పాటు పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులలో టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడు ప్రత్యేకంగా నామినేషన్ల దాఖలుకు వీలుకల్పిస్తూ నిమ్మగడ్డ సోమవారం ఆదేశాలు జారీచేశారు. నిజానికి ఈ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ 2020 మార్చి 13నే ముగిసింది. ఆ మరసటి రోజు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యాక కరోనా సాకుతో ఎన్నికల ప్రక్రియ వాయిదా వేశారు. అప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి తిరిగి కొనసాగిస్తున్నట్లు గత నెలలో ఎస్ఈసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల దాఖలు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశంలేదు. కానీ, నిమ్మగడ్డ మాత్రం.. పలువురు టీడీపీ నేతలకు అవకాశం కల్పిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలను అడ్డుకునేందుకేనా!? నిజానికి తిరుపతి నగరపాలక సంస్థలోని ఆరు డివిజన్లలో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అవీ వైఎస్సార్సీపీ అభ్యర్థులవే. అంటే ఇక్కడ వీరి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమే. అయితే, ఇప్పుడు ఆ ఆరు డివిజన్లలో నామినేషన్లకు మళ్లీ అవకాశం కల్పించడమంటే వైఎస్సార్సీపీకి అయ్యే ఏకగ్రీవాలకు గండికొట్టి టీడీపీకి లబ్ధిచేకూర్చడమేనన్నది స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరు, రాయచోటిలోనూ ఇదే లక్ష్యం కనపిస్తోందంటున్నారు. అవి ఫోర్జరీలేమో.. ఇదిలా ఉంటే.. పుంగనూరులోని 14, 28 వార్డుల్లో కొత్తగా నామినేషన్ దాఖలకు అవకాశం దక్కిన వారిలో ఇద్దరు నాయకులు ఎస్ఈసీ నిర్ణయంపై విస్మయం వ్యక్తంచేసినట్లు తెలిసింది. తాము అసలు కొత్తగా నామినేషన్ వేసేందుకు జిల్లా కలెక్టరుకుగానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కుగానీ ఎలాంటి వినతులు పంపలేదని.. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని వారు ఎన్నికల అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తి కూడా లేదని వారు స్పష్టంచేసినట్లు తెలిసింది. అప్పుడు అడ్డుకున్నారంటూ.. తిరుపతి నగరపాలక సంస్థలోని 2, 8, 10, 21, 41, 45 డివిజన్లలో ఐదుగురు టీడీపీ, ఒక బీజేపీ నేత పేర్లను ప్రత్యేకంగా తెలియజేస్తూ మంగళవారం సా.3 గంటల వరకు వారి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లుచేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే, పుంగనూరు మున్సిపాలిటీలోని 9, 14, 28 వార్డులు.. వైఎస్సార్ జిల్లా రాయచోటి మున్సిపాలిటీలోని 20, 31 వార్డుల్లో ఐదుగురు టీడీపీ నేతల పేర్లను ప్రత్యేకంగా పేర్కొన్నారు. గతంలో వీరు నామినేషన్లు వేయడానికి సిద్ధపడగా, ప్రత్యర్థులు వీరిని అడ్డుకున్నట్లుగా తాను నిర్ధారణకు వచ్చానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో కూడా 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత ముగ్గురితో వారి ప్రత్యర్థులు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని.. వారికీ ఇప్పుడు మళ్లీ నామినేషన్ దాఖలకు అవకాశం కల్పిస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు. -
ఈసీ నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్‌కి అవకాశం కల్పించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్‌కి అవకాశమిస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పోరేషన్లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్ల రీనామినేషన్‌కు అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఈసీ నిర్ణయంపై కోర్టుని ఆశ్రయించనున్నారు. చదవండి : ‘దాని కోసమే చంద్రబాబు ఇంత డ్రామా చేస్తున్నారు’ -
వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవడమేంటి?
సాక్షి, విశాఖ: వాలంటీర్ల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాగాన్ని పని చేయనీయకుండా అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేయటాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయకుండా ఎన్నికల కమిషనర్‌ను నియంత్రించాలని ఆయన కోరారు. కమిషనర్ ఇచ్చిన న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులపై ప్రభుత్వం ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా కోర్టు సమయం కూడా వృధా అవుతుందని పేర్కొన్నారు. వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు విఘాతం కలుగుతుందని, దాని వల్ల రాష్ట్రంలోని పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా రాజకీయ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానకుంటే కుప్పంలో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని జోస్యం చెప్పారు. -
ఎస్ఈసీ అసహనం: టీడీపీ నేత వర్ల రామయ్య ఔట్..
సాక్షి, విజయవాడ: అఖిలపక్ష నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ ముగిసింది. మున్సిపల్ ఎన్నికలపై అఖిలపక్ష నేతలతో ఎస్ఈసీ చర్చించారు. వైఎస్సార్ సీపీ నుంచి అధికార ప్రతినిధి నారాయణమూర్తి, పద్మజారెడ్డి.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఐ నుంచి విల్సన్.. కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలి, సీపీఎం నుంచి వైవీ రావు హాజరయ్యారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిశీలిస్తామని, ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు పాటించాలని ఎస్ఈసీ కోరారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలపక్ష భేటీలో టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్ఈసీ బయటకు పంపివేశారు. సమావేశంలో అడుగడుగునా ఎస్ఈసీ మాటలకు అడ్డుపడటంపై నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా వర్ల రామయ్య పట్టించుకోలేకపోవడంతో విధిలేక ఆయనను సమావేశం నుంచి బయటకు పంపించారు. బయటకు వచ్చిన వర్ల రామయ్య.. గతంలో ఉన్నట్లు ఎస్ఈసీ లేరంటూ ఆరోపణలు చేశారు. ఎస్ఈసీతో భేటీ అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించొద్దని ఎస్ఈసీకి సూచించామని పేర్కొన్నారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకోవద్దని సూచించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్ చేసుకుంటామనే రీతిలో ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై టీడీపీ చేస్తోన్న దాడులను కంట్రోల్ చేయాలని ఎస్ఈసీని కోరామని చెప్పారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న చంద్రబాబుపై ఎస్ఈసీనే కేసు నమోదు చేయాలని కోరామని నారాయణ మూర్తి తెలిపారు. చదవండి: ‘పచ్చ’పాతం: ఇదేమి వైపరీత్యం! రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా -
నామినేషనే వేయని వారికి ఇప్పుడు అవకాశం కుదరదు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో గతంలో అసలు నామినేషన్ దాఖలు చేయని అభ్యర్థులకు ఇప్పుడు అవకాశమివ్వడానికి, స్కూృటినీలో తిరస్కరణకు గురైన వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలకు లోబడి కొన్ని పరిమితుల మేరకు బలవంతపు చర్యల ద్వారా నామినేషన్లు విరమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సోమ లేదా మంగళవారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ విజయవాడలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నేతలతోనూ వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మున్సిపల్ ఎన్నికల్లో బలవంతం మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న విషయంలో అభ్యర్థిత్వాల పునరుద్ధరణను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటి ఫిర్యాదులపై కొన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాయి. మరికొన్ని చోట్ల నుంచి కూడా తెప్పించుకుంటాం. పాక్షికంగా పునరుద్ధరించడం రాష్ట్రస్థాయిలో జరుగుతుంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యల వల్ల కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం ఐదుగురు మించి చేయడానికి వీలులేదన్నారు. అతిక్రమిస్తే క్రిమినల్ చర్యగా పరిగణిస్తామన్నారు. పరిమితంగా రోడ్డు షోలకు అనుమతిస్తామన్నారు. సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. -
వలంటీర్లను మున్సిపోల్స్‌కు దూరంగా ఉంచండి
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ పాల్గొనకుండా వారిని పూర్తిగా దూరం పెట్టాలని కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఈసీ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని నిబంధనలు వలంటీర్లకూ వర్తిస్తాయన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా వలంటీర్లు వ్యవహరిస్తే నేరపూరిత చర్యగా పరిగణిస్తామన్నారు. ఓటర్ల స్లిప్‌ల పంపిణీ బాధ్యతలను కూడా వలంటీర్లకు అప్పగించవద్దని ఆదేశించారు. వలంటీర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం లేకుండా వలంటీర్ల ఫోన్లను స్వాదీనం చేసుకోవాలన్నారు. కాగా, వారి సాధారణ విధుల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులుండవన్నారు. -
సేవకు అవమానం.. టార్గెట్ వలంటీర్!
వారు నేరస్తులా? ► ఎవరైనా నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడినప్పుడు వారి వద్ద ఉండే ఫోన్‌ను స్వాదీనం చేసుకుంటారు. వారి కదలికలపై నిఘా పెడతారు. ఇలాంటిదేదీ లేకుండా, ఏ ఆధారం చూపకుండా వలంటీర్ల పట్ల ఎస్ఈసీ ఈ రీతిలో వ్యవహరించడం ముమ్మాటికీ వారిని అవమానించడమే. అనుమానించడమే. ► చేయరాని నేరం చేసిన నిందితుల మాదిరి పరిగణించి ఆదేశాలు జారీ చేయడం పట్ల వలంటీర్లు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. తమ కదలికలను నిశితంగా పరిశీలించాలని ఆదేశాలివ్వడాన్ని తప్పు పడుతున్నారు. ► ఇతర ప్రభుత్వ ఉద్యోగులెవరిపై లేని అనుమానాలు తెలుగుదేశం పార్టీ తమపైనే ఎందుకు వ్యక్తం చేస్తోందని, వారి మాటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ల సేవల పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం టీడీపీ పెద్దల కను సైగ మేరకు వీరిని అవమానిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నెపంతో క్షేత్ర స్థాయిలో వలంటీర్లు ప్రజలకు సేవలందించడంలో అత్యంత కీలకమైన మొబైల్ ఫోన్లను స్వాదీనం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించడం ముమ్మాటికీ తుగ్లక్ చర్యే. ప్రతి పథకం బయోమెట్రిక్‌పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఎస్ఈసీ ఆదేశాల్లోని అంతరంగం ఇట్టే అర్థమవుతోంది. టీడీపీకి ప్రాణం పోయాలన్న ఆత్రం అడుగడుగునా కనిపిస్తోంది. నిమ్మగడ్డ ఆదేశాల రీత్యా రెగ్యులర్‌గా ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇస్తున్న పింఛన్లను ఇప్పుడు బయోమెట్రిక్ లేకుండానే పంపిణీ చేయడం సాధ్యం కాదుకదా! ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేకుండా మామూలుగా పని చేసుకోవాలని చెప్పడం వరకు తప్పు లేదు. అయితే ఫోన్లను స్వాదీనం చేసుకోవాలని, వారిపై నిఘా పెట్టాలని అడ్డగోలుగా ఆదేశించడం నిజంగా పిచ్చి పని. కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్నది చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్దిదారుల ఇళ్ల వద్దకే చేరవేస్తున్న వలంటీర్ల వ్యవస్థపై నిమ్మగడ్డకు ఏమాత్రం అవగాహన లేదా? లేక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఇతర నేతలు ఫిర్యాదు చేశారని ఈ ఆదేశాలు జారీ చేశారా? పరిధి దాటి.. శ్రుతి మించి.. వాస్తవం చెప్పాలంటే నిమ్మగడ్డ తన పరిధి దాటి, టీడీపీని బతికించేందుకు శ్రుతి మించి చేస్తున్న ప్రయత్నమిది. ఇప్పటికే పలు విషయాల్లో శ్రుతి మించి వ్యవహరిస్తున్న నిమ్మగడ్డను పలు సందర్భాల్లో హైకోర్టు హెచ్చరించింది. నేరుగా, స్పష్టంగా తప్పు పడుతూ మొట్టికాయలు వేసింది. అయినా ఆయన తన వైఖరి మార్చుకోక పోవడం చూస్తుంటే టీడీపీ కోసం ఎంతకైనా బరితెగిస్తారని మరోమారు స్పష్టమైంది. ఇటీవల రేషన్ బియ్యం ఇంటింటికీ సరఫరా చేసే విషయమై ఇదే నిమ్మగడ్డ టీడీపీ నేతలకు మించి నానా యాగీ చేశారు. తుదకు కోర్టు ఉత్తర్వులతో మిన్నకుండిపోయారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలను సైతం అడ్డుకుని, అధికార పక్షానికి ఇబ్బందులు కల్పించాలన్న తాపత్రయం ఆయన ప్రతి అడుగులోనూ కనిపిస్తోందని రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వలంటీర్లు సేవలు అందిస్తున్నందున, ప్రతి పథకం లబ్ధిదారుని వివరాలు వారి ఫోన్‌కు లింక్ అయి ఉంటాయన్న కనీస పరిజ్ఞానం ఎస్ఈసీకి లేదా అని సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వలంటీర్ల సేవలను అడ్డుకోవడం పట్ల ప్రభుత్వం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సేవాభావంపై ప్రశంసలు ► గతంలో పింఛను తీసుకోవడానికి తీవ్ర కష్టాలు పడిన అవ్వాతాతల ఇబ్బందులను పూర్తిగా మరిపిస్తూ ప్రతి నెలా 1వ తేదీ మధ్యాహ్నం కల్లా వలంటీర్లు అందరి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా నాలుగైదుసార్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగ క్షేమాలు కనుక్కుంటున్నారు. ► ఆయా కుటుంబాల్లో వారికి అర్హత ఉండీ, ప్రభుత్వ పథకాలేవన్నా అందక పోతే వారే దరఖాస్తు తీసుకెళ్లి పూర్తి చేసి వాటిని మంజూరు చేయిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం తప్ప ఇతర ప్రతిఫలాపేక్ష లేకుండా సేవాభావంతో వారు చేసున్న కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు వలంటీర్ల సేవలను కొనియాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వలంటీర్లను రెచ్చగొట్టి.. లబ్ధి పొందాలనుకుని.. ► వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రంలో ప్రతి 50–60 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మందిని వలంటీర్లుగా నియమించారు. కేవలం చదువుకున్న యువతీ యువకులకు అధికారుల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి పూర్తి పారదర్శక విధానంలో ఈ నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ► అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయ్యే ముందు సరిగ్గా 20 రోజుల కిత్రం వలంటీర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. పలుచోట్ల వారు కలెక్టర్ కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసేలా టీడీపీ నేతలు ఉసిగొల్పారు. ► ఈ విషయాన్ని పసిగట్టిన సీఎం వైఎస్ జగన్ వెంటనే అసలు విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరిస్తూ లేఖ రాశారు. దీంతో టీడీపీ అధినేత కుటిల బుద్ధిని వారు అర్థం చేసుకుని ప్రభుత్వ బాటలో సాగుతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకే తాజాగా ఎస్ఈసీ ద్వారా టీడీపీ అధినేత వీరిపై కక్ష తీర్చుకుంటున్నారు. ► ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను కించపరుస్తూ వారిని మున్సిపల్ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వంటి టీడీపీ నేతలు.. వలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దంటూ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సైతం ఇవే చిలుక పలుకులు పలకడం గమనార్హం. -
వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ కఠిన ఆంక్షలు
-
వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ కఠిన ఆంక్షలు
సాక్షి,కృష్ణా: రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారి చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదు. ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో తెలిపింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల పై నిఘా ఉంచడంతో పాటు... వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లను వినియోగిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద భావించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. చదవండి: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి -
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో శనివారం రాత్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు చక్కగా జరిగాయన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలన్నారు. ప్రతి ఓటరుకు ఓటింగ్ స్లిప్ చేరాలని చెప్పారు. ఈ ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచడంతో పాటు వారిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఓటరుకు తమ ఓటు, పోలింగ్‌స్టేషన్ వివరాలు అందించాలని ఆదేశించారు. పార్టీ ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి ఇస్తున్నామన్నారు. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ప్రలోభాలకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఒత్తిడికి, ప్రలోభాలకు లోనై నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అభ్యర్థిస్తే సానుకూలంగా స్పందిస్తామన్నారు. మార్చి 1న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. స్థానికంలోనూ ఈసీ నిబంధనలే.. సాక్షి, అమరావతి: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిబంధనలను.. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శనివారం తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కలెక్టర్లు, ఎన్నికల నిర్వహణాధికారులు ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు. -
1న పార్టీల నేతలతో ఎస్ఈసీ భేటీ
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక ఎన్నికల చిహ్నం పొందేందుకు అర్హత ఉన్న ఇతర రిజిస్టర్డ్ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధత కోసం శని, ఆది, సోమవారాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ప్రాంతీయ సదస్సులను నిర్వహించనున్నట్టు తెలిపారు.