
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరో వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు శనివారం లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు. ఎన్నికలు ముగిసేంతవరకు మంత్రి మీడియాతోనూ మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేశారు. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జత చేశారు.
మరోవైపు ఎస్‌ఈసీ ఉత్తర్వులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఇచ్చిన అదేశాలుపై మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామని తెలిపారు. తను రాజకీయాలు మాట్లాడడని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొనని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలు వచ్చిన అనంతరం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
చదవండి: నిమ్మగడ్డకు ఆ అధికారం ఎక్కడిది?
చదవండి: ఏకగ్రీవాలు జరిగితే తప్పేంటి: వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment