gowtham sawang
-
ప్రభుత్వ ఒత్తిడితో సవాంగ్ రాజీనామా
-
ఏపీ గ్రూప్-1 ఫలితాలు విడుదల
-
2 లక్షల కిలోల గంజాయి ధ్వంసం
-
బుద్దా వెంకన్నపై కేసు నమోదు
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వెంకన్న చేసిన వ్యాఖ్యలపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేశారు. ఏసీపీ కె.హనుమంతరావు ఆధ్వర్యంలో సాయంత్రం వెంకన్న ఇంటికి వెళ్లి విచారణకు రావాలని కోరారు. వెంకన్న అనుచరులు పోలీసులను లోపలకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో వెంకన్నను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వదిలేశారు. అంతకుముందు వెంకన్న మరో టీడీపీ నేత నాగుల్‌మీరాతో కలిసి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి కొడాలి నాని, డీజీపీపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘అరే కొడాలి నానీ.. చంద్రబాబు ఇంటి గేట్ ముట్టుకో. నీ శవాన్ని పంపుతా. అరే నానీ కొట్టుకుందాం రా..’ అంటూ వీరంగం వేశారు. ‘అరేయ్ కొడాలి నాని నీ భాషేంటి? నీ చరిత్ర ఏంట్రా? గుడివాడలో ఆయిల్ దొంగవి. వర్ల రామయ్య నిన్ను లోపలవేసి చితక బాదిన విషయం అందరికీ తెలుసు’ అంటూ రెచ్చిపోయారు. ‘పోలీసుల్లేకుండా విజయవాడలో ప్లేస్, టైమ్ ఫిక్స్ చెయ్యి. కొట్టుకుందాం రా’ అంటూ సవాళ్లు విసిరారు. గుడివాడకు వ్యభిచార కంపెనీ తీసుకొచ్చావని, నోటి దూలతో కృష్ణా జిల్లా పరువు తీశావని అన్నారు. నువ్వు తోపు అయితే కెమెరా పట్టుకొని చంద్రబాబు ఇంటికి వెళ్లు చూద్దాం అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు గేట్ తాకితే నాని శవాన్ని పంపుతానంటూ హెచ్చరించారు. ‘నీ బావ, బావమరిది అనుకున్నవా? మమ్మల్ని వాడు, వీడు అంటున్నావు? డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు’ అంటూ ఊగిపోయారు. నాని కులాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. ‘చంద్రబాబును నా కొడకా అంటున్నావు నీ బాబు పేరు ఏంట్రా? 2004లో నీకు టిక్కెట్ ఇచ్చింది చంద్రబాబు. హరికృష్ణ కాదు. 2024లో ఓడిపోయిన అర గంటలో ప్రజలు నిన్ను చంపుతారు. ఓడిపోగానే దుబాయి పారిపోతావు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా గౌతమ్ సవాంగ్ వ్యవహరిస్తున్నారు. గుడివాడ కేసినోలో రూ.250 కోట్లు చేతులు మారాయి. డీజీపీ నీ వాటా ఎంతో చెప్పు’ అంటూ చిందులేశారు. గుట్కా తిని క్యాన్సర్‌తో చచ్చిపోతావంటూ నానికి శాపనార్థ్ధాలు పెట్టారు. -
ఏపీలో బాగా తగ్గిన నేరాల సంఖ్య
-
దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు
సాక్షి, అనంతపురం: జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గూటి పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మారుతీ ప్రసాద్ ఓ అభాగ్యురాలిపట్ల మానవత్వం చూపించారు. అనంతపురం హైవే రోడ్డులో చలితో వణుకుతున్న మహిళకు తన వింటర్ జాకెట్‌ని అందించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు నగదు సాయం చేయడంతో పాటు అనాథ శరణాలయంలో చేర్చి మారుతీ ప్రసాద్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. కానిస్టేబుల్ దాతృత్వానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మారుతీ ప్రసాద్‌ని ప్రశంసించారు. DGP Gautam Sawang appreciates the humanity gesture exhibited by Maruti Prasad,Police Constable of Gooty PS #Anantapur District when an old woman is suffering with winter on a high way road,he has given his jacket and extended a helping hand financially&joined her in an orphanage. pic.twitter.com/criqZKaYAH — Andhra Pradesh Police (@APPOLICE100) November 26, 2021 -
పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదు: డీజీపీ గౌతమ్ సవాంగ్
-
పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ
-
పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: నిన్న టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.. చాలా దారుణ భాష అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదన్నారు. ‘‘పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలని డీజీపీ హితవు పలికారు. (చదవండి: నారా లోకేష్‌పై కేసు నమోదు) పట్టాభి వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి.. నిన్న పట్టాభి చేసిన వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాం. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతాం. నిన్న సాయంత్రం 5.03 నిమిషాలకు వాట్సాప్‌లో ఒక కాల్ వచ్చింది. కాల్ చేయగానే ఎస్పీ తక్షణమే స్పందించారు. నిరాధార ఆరోపణలు కరెక్టు కాదు నిరాధార ఆరోపణలు కరెక్టు కాదని డీజీపీ అన్నారు. విజయవాడకు డ్రగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. ఆరోపణలు చేయవద్దని చెబుతున్నాం. గుజరాత్లో దొరికిన డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు. ఒక గ్రామ్ కూడా విజయవాడకు రాలేదన్నారు. పోలీసుల త్యాగాన్ని మరువలేం.. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాన్ని మరువలేమని డీజీపీ అన్నారు. ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రేపు పోలీసు ఫ్లాగ్ డే నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామని డీజీపీ అన్నారు. -
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికావొద్దు: ఏపీ డీజీపీ
-
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికావొద్దు: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావొద్దని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ అన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించామని, ప్రజలందరూ సంయమనం పాటిస్తూ సహకరించాలన్నారు. చదవండి: మంగళగిరిలో సాక్షి రిపోర్టర్‌పై టీడీపీ గూండాల దాడి -
అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో అంతా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా టీడీపీకి మనుగడ లేదన్నారు. చంద్రబాబు హస్తం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ, జరిగిన అన్ని ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయాలని డీజీపీని కోరామని ఆయన తెలిపారు. అత్యంత దారుణం.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు అత్యంత నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. జోగి రమేష్‌పై భౌతిక దాడికి దిగడం అత్యంత దారుణమన్నారు. అయ్యన్నపాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు, టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆర్కే తెలిపారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. అయ్యన్న పాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై దాడి చేశారన్నారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ధ్వజమెత్తారు. ‘వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు.. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్ అని జోగి రమేష్ అన్నారు. చదవండి: వెలుగులోకి భూ ఆక్రమణలు: రోడ్డును మింగేసిన గల్లా ఫుడ్స్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన -
ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ
-
ఆ నలుగురి మరణం ‘పోలీస్ కుటుంబానికి తీరని లోటు’
-
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: 75వ స్వాత్రంత్య వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, సీపీ బత్తిన శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, వేడుకలకు వీవీఐపీ, వీఐపీలతో పాటు కొందరికే అనుమతి ఉంటుందని, మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారికే వేడుకలు వీక్షించేందుకు అనుమతి ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
ఆరుగురు మావోయిస్టుల కీలక నేతలు అరెస్ట్
-
ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు: ఏపీ డీజీపీ
సాక్షి,అమరావతి: ఏపీ-ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరంతరం కూంబింగ్ సత్పలితాలనిస్తోంది. నిషేధిత మావోయిస్టు (సీపీఐ) పార్టీకి చెందిన ఆరుగురు కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గత నెలలో మావోయిస్ట్ కమిటీ సభ్యుడు లోంగిపోయాడని.. ఈ రోజు మరో ఆరుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారని డీజీపీ గౌతమ్‌సవాంగ్ తెలిపారు. గతంలో సమస్యలపై మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని,ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తోంది డీజీపీ వివరించారు. మహిళలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ..ఆదివాసిగూడెంలకు సైతం చేరుతున్నాయని గౌతమ్‌సవాంగ్ వాఖ్యనించారు. గతంలో 8 మావోయిస్టు కమిటీలు ఉంటే ప్రస్తుతం నాలుగు ఉన్నాయి.. మావోయిస్టులు రక్తపాతం ద్వారా సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తోంది.. నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గతంలో బాక్సైట్ సమస్య ఉండేది.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బాక్సైట్ జీవోలను రద్దు చేసిందని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు.. -
నంద్యాల రిపోర్టర్ హత్య కేసు: దర్యాప్తునకు డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్ చానల్ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. -
ఏపీ డీజీపీ ట్విటర్ నకిలీ అకౌంట్ తొలగింపు
సాక్షి, అమరావతి: డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను పోలిన నకిలీ అకౌంట్‌ను సృష్టించిన ఆగంతకుడు అందర్నీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇది ‘డీజీపీ అంధ్రప్రదేశ్’ అధికారిక అకౌంట్ అంటూ అపరిచితుడు చేసిన ట్వీట్‌తో అనుమానించిన డీజీపీ కార్యాలయం ఆరా తీస్తే అది నకిలీ అకౌంట్ అని బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఏపీ పోలీస్ టెక్ సర్వీసెస్ అధికారులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్ ః ఏపీస్టేట్డీజీపీ’ పేరుతో ఉన్న నకిలీ అకౌంట్‌ను బ్లాక్‌చేసి దాన్ని వినియోగించే అవకాశం లేకుండా తొలగించారు. చదవండి: సక్సెస్ మంత్ర: రైతు బిడ్డ నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా.. నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్ కీలక ముందడుగు.. -
ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్నకర్ఫ్యూ
-
అందరు రెండు మాస్కులు ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి
-
హిందుత్వాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్
గుంటూరు రూరల్: హైందవ ధర్మంపై, హిందూ దేవుళ్లపై వికృత కార్యక్రమాలు చేసి హిందూ సమాజాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్ యూట్యూబ్ చానల్‌పై కఠిన చర్యలు తీసుకుని చానల్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు, హోంమంత్రి మేకతోటి సుచరితకు ఫిర్యాదు చేసింది. సీఐడీ ప్రధాన కార్యాలయంలోనూ ఫిర్యాదు అందజేశారు. గుంటూరులోని సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ ఏబీఎన్ తెలుగు అనే యూట్యూబ్ చానల్ లైవ్‌లో ఈనెల 21న శ్రీరామనవమి రోజున లైవ్ స్ట్రీమ్‌లో కరోనా వైరస్ రామాయణ, రాములమ్మ, కిరాక్ న్యూస్ అనే కార్యక్రమంలో కరోనా కాండ, రామాయణంలో కరోనా ఉండి ఉంటే అంటూ ఒక కార్యక్రమం చేశారని తెలిపారు. రాముడిని, సీతమ్మను, రావణాసురుడిని అవహేళన చేసి మాట్లాడటం జరిగిందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కార్యక్రమాలు చేస్తున్న ఆ చానల్‌ను రద్దుచేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. ఇదే చానల్ గతంలోనూ ప్రజల్లో మత కలహాలు రేపేలా ముఖ్యమంత్రిపై, తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై, పలు హిందూ దేవాలయాలపై అసభ్యకర కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. -
మావోయిస్టు కీలక నేత జలంధర్‌రెడ్డి లొంగుబాటు
సాక్షి, అమరావతి: గతంలో బలిమెలలో పోలీసులపై జరిగిన దాడి, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్ ఘటనల్లో పాత్రధారి, మావోయిస్టు కీలక నేత.. ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ, మారన్న, కరుణ, శరత్ (40) మంగళవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయారు. తెలం గాణలోని సిద్ధిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన జలంధర్‌రెడ్డి ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా– ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ (ఏవోబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళ వారం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులు హింసాయుత మార్గంలో ఏదీ సాధించ లేరని, జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయేవారికి చట్టపరంగా ఎటువం టి ఇబ్బందులు లేకుండా సహాయం అందించడంతోపాటు పునరావాసం కల్పిస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలు గిరిజనుల్లో కొత్త కాంతిని నింపుతు న్నాయని చెప్పారు. విప్లవం, నూతన ప్రజా స్వామ్యం అంటూ మావోయిస్టులు చేస్తున్న హింసా యుత కార్యకలాపాలపై గిరిజనులు, యువత తోపాటు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పటికే ఏవోబీలో మావోయిస్టులు పట్టు కోల్పో యారని, గత రెండేళ్లలో అనేక మంది లొంగి పోయారని వివరించారు. జలంధర్‌రెడ్డిపై రూ.20 లక్షలు నగదు రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని ఆయన పునరావాసానికి వినియోగిస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఎన్నో పథకాలు.. అటవీ హక్కుల గుర్తింపు కింద 1.53 లక్షల మంది గిరిజనులకు 3.06 లక్షల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం పంచిపెట్టిందని డీజీపీ సవాంగ్ తెలిపారు. పలు సంక్షేమ పథకాల కింద గిరిజనులకు రూ.2,136 కోట్లు జమ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్ఐబీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనే ఉద్యమానికి దూరం మావోయిస్టు పార్టీకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించలేకే ఉద్యమానికి దూరమైనట్టు జలంధర్‌రెడ్డి చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యకలాపాలు, నిర్ణయాల పట్ల విభేదించానని తెలిపారు. పై స్థాయిలో పార్టీ చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదన్నారు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు, తన ఆరోగ్య సమస్యల కారణంగానే లొంగిపోయానన్నారు. ఆర్ఎస్యూ నుంచి సెంట్రల్ జోన్ సభ్యుడి స్థాయికి.. రిటైర్డ్ వీఆర్వో బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1998లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరిన జలంధర్‌రెడ్డి మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 21 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కీలక బాధ్యతలు నిర్వర్తిం చారు. 2000 ఫిబ్రవరిలో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ పార్టీ సభ్యుడిగా గిరాయిపల్లి దళంలో చేరారు. 2000 సెప్టెంబర్ నుంచి 2002 ఆగçస్టు వరకు నల్లమల ప్రాంతంలోని దక్షిణ తెలంగాణ స్పెషల్ గెరిల్లా స్క్వాడ్, ఆంధ్ర ప్రాంత ప్లాటూన్ లలో పనిచేశారు. 2002 సెప్టెంబర్‌లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఏవోబీ ఎస్‌జెడ్‌సీకి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఏవోబీ ఎస్‌జెడ్‌సీలో ఈస్ట్ డివిజనల్ కమిటీ, మల్కన్‌గిరి– కోరాపుట్–విశాఖ బోర్డర్ కమిటీల్లో డివిజన్ కార్యదర్శి, కమాండర్‌గా పనిచేశారు. 2006 నవంబర్‌లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 నుంచి 2016 వరకు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ప్రొటెక్షన్ స్క్వాడ్ కార్యదర్శిగా పనిచేశారు. 2019 అక్టోబర్ నుంచి ఏవోబీ ఎస్జెడ్సీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2008లో గ్రేహౌండ్స్ పోలీసులపై జరిగిన బలిమెల దాడి, 2011లో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ ఘటనలు జలంధర్‌రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. బలిమెల దాడిలో రెండో అస్సాల్ట్ టీమ్‌కు నాయకత్వం వహించారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన ఐదు ప్రధాన దాడులు, 19 ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారు. 2004 ఫిబ్రవరి 6న కోరాఫుట్ జిల్లా ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్‌పై దాడిలోనూ ఉన్నారు. 2001 మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సున్నిపెంట, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. -
స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి: డీజీపీ
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలు సజావుగా జరిగాయని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలు పాలుపంచుకున్నాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా వచ్చిన 250పైగా వాహనాలను తిప్పి పంపించామన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.76,04,970 నగదును, 6,884 లీటర్ల మద్యాన్ని, 94 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ సమస్య తలెత్తినా తక్షణమే డయల్ 100, 112 ద్వారా సమాచారమివ్వాలని ప్రచారం చేసినట్టు చెప్పారు. -
చంద్రబాబు, నారా లోకేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న టీడీపీ అధికార ఫేస్బుక్ అక్కౌంట్లో తమపార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే పోస్టింగ్‌లు పెట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్.. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీజీపీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు.. టీడీపీ ఫేస్బుక్లో పెట్టిన పోస్టులను ఆధారాలతో సహా అందజేశారు. టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లో ‘ఒకప్పుడు జగన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విధేయుడిగా ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర అంతే విధేయుడిగా ఉన్నాడని, ఎందుకంటే వైఎస్సార్సీపీలో దళితులకు ఎదిగే స్వేచ్ఛలేదు. అందుకే ఈసారి వినిపిద్దాం తిరుపతి గొంతు.. లోక్‌సభలో లక్ష్మి గొంతు’ అంటూ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను గురుమూర్తి వత్తుతున్నట్టు ఫొటో సృష్టించి ఉంచారని తెలిపారు. ‘ఆంధ్రుల హక్కుల కోసం గళమెత్తువారు కావాలా? పెద్దిరెడ్డి కాళ్లకు మసాజు చేసేవారు కావాలా?’ అని పేర్కొంటూ పోస్టర్లో పనబాక లక్ష్మి ఫొటో పెట్టి టీడీపీకి ఓటు వేయండి అంటూ పోస్టులు పెట్టారని వివరించారు. ఈ పోస్టింగ్‌ల ద్వారా గురుమూర్తిని ప్రజల దృష్టిలో బహిరంగంగా అవమానించి, మానసికంగా బాధించారని, గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్టు దళిత జాతి యావత్తు భావిస్తోందని తెలిపారు. సోషల్ మీడియాలో వాటిని ట్రోల్ చేస్తూ గురుమూర్తిని కించపరిచిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, టీడీపీ ఫేస్బుక్ అక్కౌంట్లో పెట్టిన తప్పుడు పోస్టింగ్‌లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు బాధ్యులైన చంద్రబాబు, లోకేశ్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టి వారిని అరెస్టు చేయాలని కోరారు. -
రాజభవన్ లో గవర్నర్ ను కలిసిన ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావాన్గ్
-
పోలీస్‌శాఖకు సీఎం అభినందన
-
పోలీస్‌శాఖకు సీఎం అభినందన
సాక్షి, అమరావతి: పలు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇప్పటివరకు 125 జాతీయ అవార్డులు అందుకున్న నేపథ్యంలో సోమవారం డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ అవార్డులకు సంబంధించిన3 వివరాలను తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దిశ’ కార్యక్రమానికి అనేక జాతీయ అవార్డులు దక్కాయని చెప్పారు. తాజాగా జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీగా తనకు అవార్డు వచ్చిందని తెలిపారు. అత్యుత్తమ పోలీసింగ్ నిర్వహించడంలో 13 జాతీయస్థాయి అవార్డులను రెండు రోజుల కిందట సాధించినట్లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ డీజీపీ సవాంగ్‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి పోలీస్‌శాఖకు గౌరవ ప్రతిష్టలను పెంచాలని సీఎం ఆదేశించారు. సీఎంను కలిసిన వారిలో ఇంటెలిజెన్స్ చీఫ్ (డీజీ) కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏపీ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు ఉన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా విచారించాలి
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు పారదర్శకంగా సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ చట్టం–1989 (సవరణ చట్టం–2015) అమలుపై రాష్ట్రస్థాయి హైపవర్ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం (వర్క్‌షాప్) శుక్రవారం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రెవెన్యూ, పోలీస్, ప్రాసిక్యూషన్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు హాజరైన ఈ వర్క్‌షాప్‌ను డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, బాలల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు ఆయన తమకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. సామాజిక మార్పు, చైతన్యం తీసుకురావడం కోసం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రాసిక్యూషన్, పోలీస్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ విభాగాలు ప్రధాన స్తంభాలుగా నిలబడి సమన్వయంతో పనిచేస్తే ఎస్సీ, ఎస్టీ కేసుల్లో సత్వర న్యాయం అందించవచ్చన్నారు. ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఏపీఎస్సీసీఎఫ్సీ వైస్ చైర్మన్, ఎండీ శామ్యూల్ ఆనంద్‌కుమార్, హైకోర్టు రిజి్రస్టార్ భానుమతి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ పాల్గొన్నారు. -
మహిళా రక్షణలో మరో అడుగు ముందుకేసిన ఏపీ ప్రభుత్వం
-
నిమ్మగడ్డ మరో వివాదాస్పద ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరో వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు శనివారం లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు. ఎన్నికలు ముగిసేంతవరకు మంత్రి మీడియాతోనూ మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేశారు. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జత చేశారు. మరోవైపు ఎస్ఈసీ ఉత్తర్వులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఇచ్చిన అదేశాలుపై మాట్లాడుతూ.. ఎస్ఈసీ నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామని తెలిపారు. తను రాజకీయాలు మాట్లాడడని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొనని స్పష్టం చేశారు. ఎస్ఈసీ ఆదేశాలు వచ్చిన అనంతరం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: నిమ్మగడ్డకు ఆ అధికారం ఎక్కడిది? చదవండి: ఏకగ్రీవాలు జరిగితే తప్పేంటి: వైఎస్సార్సీపీ -
రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులంటూ దుష్ప్రచారం జరుగుతోందని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గతేడాదిలో పోలీస్ శాఖకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చొరవ తీసుకున్నారు. కరోనాతో 109 మంది పోలీసులు మరణించారు. పోలీసులు లాక్డౌన్, కరోనాను ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశారు. టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీస్ శాఖకు 100కుపైగా అవార్డులు వచ్చాయి. గతంతో పోలిస్తే నేరస్థుల అరెస్ట్, శిక్ష విషయంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ( రాష్ట్రానికి 4.77 లక్షల టీకాలు ) రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదు. ఈ మధ్య కాలంలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆలయాలకు సంబంధించి మొత్తం 44 కేసులు ముఖ్యమైనవి. ఆలయాలపై దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు సంబంధించిన కులం, మతంపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపై గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదు. పోలీసులు కులం, మతం ఆధారంగా పనిచేయర’’ని అన్నారు. పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారు దేశ సమగ్రతను కాపాడటంలో పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అంతర్వేది ఘటన దురదృష్టకరం. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 58, 871 హిందూ ఆలయాలను జియో ట్యాగింగ్ చేశాం. ఆలయాల భద్రతపై సమీక్షించాం. 13వేల ఆలయాల్లో 43వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గడిచిన రెండు నెలల్లోనే 30వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. హిందూ దేవాలయాల విషయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భద్రతా చర్యలు చేపట్టాం. మూడు నెలల కిందటే రామతీర్థం ఆలయంలో భద్రత పెంచాలని సూచించాం. ప్రధాన ఆలయంలో అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. కొండపైన ఉన్న ఆలయంలో విద్యుత్ సరఫరా లేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. మరో రెండు రోజుల్లో కొండపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 5 నుంచి 180 కేసులు నమోదు, 347 మందిని అరెస్ట్ చేశాం. ఏడు అంతరాష్ట్ర గ్యాంగ్‌లను కూడా అరెస్ట్ చేశాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో మతసామరస్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -
దేశానికే ఏపీ ఆదర్శం అంటూ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి జరుగుతోందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సభ్యుడు డాక్టర్ ఆర్జీ ఆనంద్ కితాబిచ్చారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని డీజీపీతో చర్చించారు. ‘బాలల హక్కులు, రక్షణ, అక్రమ రవాణా నివారణ’ అంశాలపై డీజీపీ సవాంగ్‌తో కలిసి వెబినార్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ ఆఫీసర్లు, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, దిశ పోలీస్ స్టేషన్ల అధికారులతో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మహిళలు, బాలల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇంత మంచి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్న సీఎం జగన్, డీజీపీ సవాంగ్ అభినందనీయులన్నారు. ‘దిశ’ పనితీరు అద్భుతం ఆపరేషన్ ముస్కాన్ నిరంతర ప్రక్రియతో బాలబాలికలకు విముక్తి కల్పించడం, పునరావాసం కల్పించడంలో ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే ముందుందన్నారు. మహిళల రక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ఏపీ పోలీసుల పనితీరు దేశానికే రోల్ మోడల్ అన్నారు. దిశ చట్టం మహిళల రక్షణకు ఉపయోగపడుతున్న తీరు తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు సమర్థంగా పనిచేసి బాలల అక్రమ రవాణాను అడ్డుకున్నారని తెలుసుకున్నానన్నారు. పిల్లలకు మానసిక, సాంఘిక సమస్యల గురించి ఏపీ పోలీస్ చేపట్టిన సైకో సోషల్ కౌన్సెలింగ్ సెంటర్ పనితీరు అద్భుతమన్నారు. పిల్లలకు కౌన్సెలింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 18001212830 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందన్నారు. చదవండి: (అమరావతి అందరిదీ కాకుంటే ఎలా?) సచివాలయ వ్యవస్థ భేష్ గుంటూరు వెస్ట్: రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్.జి.ఆనంద్ కొనియాడారు. గుంటూరు కలెక్టరేట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా చిన్నారులకు చక్కని పోషకాహారం లభిస్తోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. గుంటూరులో జాతీయ బాలల హక్కుల కమిషన్ బెంచ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
అప్రమత్తంగా ఉన్నాం : డీజీపీ సవాంగ్
సాక్షి, అమరాతి : కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైందని ఆంధ్రప్రదేశ్ డీజేపీ గౌతం సవాంగ్ అన్నారు. ఏపీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ..కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించామని, కలెక్టర్లు, ఎస్పీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీసు స్టేషన్లలో పాటు లాకప్‌లతో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శీతాకాలం కనుక కోవిడ్ జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఆదిత్యనాధ్ దాస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు. (నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్) -
వారికి ఎన్నడూ లేని విధంగా ప్రోత్సాహం
సాక్షి, విజయవాడ : హోంగార్డుల సామాజిక, ఆర్ధిక స్థితి అనేక రెట్లు పెంచడంతో పాటు ఎన్నడూ లేని విధంగా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. వేతనాల పెంపు, ప్రమాద భీమా వర్తింపుతో హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. రాష్ట్రానికి హోంగార్డులు అద్భుతమైన సేవలను అందిస్తున్నారని కొనియాడారు. ఆదివారం 58వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు రూ.18 వేల నుంచి రూ. 21,300 పొందుతున్నారు. 15000 హోంగార్డు కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి ఏదైనా ఆకస్మిక మరణం సంభవిస్తే, హోంగార్డు కుటుంబానికి 60 లక్షల భీమా చెల్లించబడుతుంది. వ్యక్తిగత ప్రమాద భీమా పాలసీని ఈ ఏడాది 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. హోంగార్డుల సరైన ఆరోగ్య సంరక్షణ కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు మంది హోంగార్డులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులు జారీ చేయబడ్డాయి. మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నాము. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్క హోంగార్డుకు ఈహెచ్ఎస్/ఆరోగ్యశ్రీ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “అందరికీ హౌసింగ్” పథకం కింద ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి ఇళ్లను కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. -
ఏపీ పోలీస్‌కి అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ జాతీయస్థాయిలో 18 అవార్డులు ప్రకటించగా.. వాటిలో ఏకంగా ఐదు అవార్డులను ఏపీ పోలీసు శాఖ దక్కించుకుంది. దీంతో కేవలం 11 నెలల వ్యవధిలోనే ఏకంగా 108 జాతీయ అవార్డులను దక్కించుకుని ఏపీ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా అవార్డులు దక్కించుకున్న వాటిల్లో సైబర్ మిత్ర (మహిళా భద్రత)తో పాటు అందుబాటులో నేరస్తుల వివరాలు (అఫెండర్ సెర్చ్), మహిళల భద్రత (ఉమెన్‌సేఫ్టీ) కార్యక్రమాల అమలులో విజయనగరం జిల్లా, ఫ్యాక్షన్ గ్రామాల్లో నిందితుల వివరాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిన ‘సువిధ’ కార్యక్రమం అమలులో అనంతపురం జిల్లా, టెక్నాలజీలో పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ‘ప్రాజెక్ట్ టాటా’ కార్యక్రమం అమలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం స్కోచ్ అవార్డులను దక్కించుకున్నాయని ఏపీ పోలీస్ టెక్నాలజీ చీఫ్ పాలరాజు తెలిపారు. ఈ అవార్డుల్లో సైబర్ మిత్ర, ప్రొజెక్ట్ టాటా కార్యక్రమాలు రజత పతకాలు సాధించాయి. సీఎం వైఎస్ జగన్ అభినందనలు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోంమంత్రి సుచరిత అభినందించారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా పనిచేస్తోందని సీఎం, హోంమంత్రి ప్రశంసించారు. ఏపీ పోలీస్ సమర్థత మరోసారి రుజువైంది జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడంలో 11 నెలల వ్యవధిలో ఇది మూడోసారి. దీంతో ఏపీ పోలీస్ శాఖ సమర్థత జాతీయ స్థాయిలో మరోసారి రుజువైంది. ఇన్ని అవార్డులు సొంతం చేసుకోవడం గర్వకారణం. ఇప్పటి వరకు ఏపీ పోలీస్ శాఖ సాధించిన వాటిల్లో రెండు స్వర్ణ, 13 రజత పతకాలు ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండటంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. మహిళల భద్రతకు భరోసానిచ్చేలా సైబర్ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టి సైబర్ నేరాల బాధిత మహిళలు పోలీస్ స్టేషన్లకు రాకుండా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాం. వారికి ఏ సమస్య వచ్చినా వాట్సాప్ నంబర్ 91212 11100కు, డయల్ 112, 181, 100కు ఫోన్ చేసే చెప్పేలా పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. – డీజీపీ సవాంగ్ -
నంద్యాల ఘటనపై స్పందించిన సీఎం జగన్..
సాక్షి, విజయవాడ: ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివిధ సంఘటనలపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం భేటీకి సంబంధించిన విషయాలపై మహమ్మద్ ఫారూక్ మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలకు జరుగుతున్న సంఘటనలపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశాము. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణం అని ఆరోపణలు రావడం జరిగింది. (నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్) ఈ అంశాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఘటనపై తక్షణమే స్పందించి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేశారు. దీంతో ఐజీ శంకర్ బత్ర నేతృత్వంలోని బృందాన్ని నంద్యాలకు పంపుతామని డీజీపీ తెలిపారు. పరిస్థితులను తెలపగానే వెంటనే స్పందించి విచారణ కమిటీ వేసినందుకు ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య) -
హైకోర్టు వ్యాఖ్యలపై సీజేకు న్యాయవాది లేఖ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ న్యాయవాది కోటేశ్వరరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. డీజీపీని రాజీనామా చేయాలని న్యాయస్థానం వ్యాఖ్యానించడం బాధకలిగించిందని లేఖలో పేర్కొన్నారు. ఒక వ్యవస్థపై మరొక వ్యవస్థ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను లేఖలో ప్రస్తావించినట్లు న్యాయవాది తెలిపారు. పెన్షన్ విషయంలో పంచాయతీలకు వేసిన రంగు ఖర్చు కాదన్న వ్యాఖ్యలతోపాటు.. డీజీపీపై చేసిన వ్యాఖ్యలపై ప్రచార మాధ్యమాలు ప్రచారం చేసిన వాటిని ఆధారాలుగా సీజేకు సమర్పించినట్లు వెల్లడించారు. కోర్టుల్లో విచారణ ప్రశ్నించే మాదిరిగా జరుగుతున్నాని లేఖలో పేర్కొన్నారు. తన లేఖను పిల్‌గా విచారించేందుకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిదని, న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపిస్తామని హైకోర్టు న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు. -
మరో 24 గంటల పాటు పోలీసు శాఖ అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు శాఖ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత ఎక్కవగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్వవేక్షించాలని సూచించారు. ఈరోజు కురిసిన వర్షానికి ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటు ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేందరాలకు తరలించడంలో పోలీసు శాఖ చోరవ ప్రశంసనీయం అన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయంతో పోలీసులు పని చేయాడం అభినందనీయమని డీజీపీ వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా 100/112కు డయల్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువు తలపించిన వెలగపూడి హైకోర్టు ప్రాంగణం: ఒక్కరోజు కురిసిన వర్షానికి వెలగపూడి తాత్కాలిక హైకోర్టు ప్రాంగణం చెరువును తలపిస్తోంది. హైకోర్టుకి వెళ్లే మార్గంలో వెలగపూడి వద్ద రోడ్డుపై దాదాపు మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో హైకోర్టుకి వచ్చే ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు చెరువుగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ నానా ఇబ్బంధులు ఎదుర్కొన్నారు. -
గ్లోబల్ వర్చ్యువల్ రన్‌ను ప్రారంభించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
-
ప్రజల ముంగిటకే పోలీస్ సేవలు
సాక్షి, అమరావతి: ఇప్పటికే వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు ‘ఏపీ పోలీస్ సేవా యాప్ (సిటిజన్ సర్వీసెస్ అప్లికేషన్)’ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తోంది. గత నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యాప్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1 నుంచి యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచగా 3 నాటికి.. అంటే కేవలం మూడు రోజుల్లోనే 37 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా.. ► రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన 87 రకాల సేవలను ప్రజలు ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా తాము ఉన్న చోట నుంచే పొందేలా ఈ యాప్ ఉపకరిస్తోంది. ► యాప్ పనితీరు, ప్రయోజనాలపై ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఫైవ్‌స్టార్ రేటింగ్కుగాను 4.8 రేటింగ్ వచ్చింది. ► ‘ఏపీ పోలీస్ సేవా యాప్’ ద్వారా ప్రజలు పొందిన సేవల్లో అత్యధికంగా ఎఫ్ఐఆర్ల డౌన్లోడ్స్ ఉన్నాయి. ► ఆ తర్వాత స్థానంలో తమ వాహనాలకు జరిమానా పడిందా? మరేదైనా నేరంలో ఉందా? అనే అంశాలు ఉన్నాయి. ► యాప్ ద్వారానే నేరుగా ఫిర్యాదులు చేయడంతోపాటు చోరీ సొత్తు రికవరీ, తప్పిపోయిన వారి గురించి వెతికేస్తున్నారు. అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు పోలీస్ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోలీస్‌శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ ముగిశాక సీసీ కెమెరాల ఏర్పాటును త్వరితగతిన చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగానికి సంబంధించి 964 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. తొలి దశలో ఒక్కో స్టేషన్‌లోని లాకప్‌ల్లో రెండు కెమెరాలను ఏర్పాటు చేస్తారు. తర్వాత రెండో దశలో రిసెప్షన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) గదుల్లో మరో రెండు కెమెరాలు పెడతారు. కెమెరాలు 24 గంటలూ అక్కడ జరుగుతున్న అంశాలన్నింటినీ నిరంతరాయంగా రికార్డు చేస్తాయి. వీటిని ప్రధాన పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. పుటేజీలను ఎప్పటికప్పుడు సీడీల రూపంలో భద్రపరుస్తామని సాంకేతిక విభాగం డీఐజీ జి.పాల్‌రాజ్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవల కోసమే.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం. ఆయన ఆదేశాల మేరకు ప్రజలకు మా సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేలా ఏపీ పోలీస్ శాఖ అనేక వినూత్న ఆవిష్కరణలు చేసింది. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలు ఉన్న చోట నుంచే 87 సేవలను పొందొచ్చు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ, ఏపీ పోలీస్ -
పిల్లల భద్రత చట్టం అమలుపై వర్క్‌షాపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జువనైల్ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వర్క్ షాపులో జూమ్ యాప్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెబినార్ ద్వారా పాల్గొని పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనే అంశాలపై చర్చించేందుకే ఈ వర్క్ షాపు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒంటరి, సంరక్షణ లేని బాలురు, బాలికలు తారసపడితే ముందుగా పోలీసులకు తెలపాలని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒంటరి బాలురు, బాలికల వివరాలను పోలీసులకు తెలియపరచాలని సూచించారు. ఇందుకోసం www.trackthemissingchild.gov.in వెబ్సైట్ ద్వారా వారి వివరాలు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ వెబ్సైట్ ద్వారా వచ్చిన వివరాలు తప్పి పోయినప్పటికి.. వారి వివరాలతో సరిపోలితే సదరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని చెప్పారు. ఒంటరి బాలురు, బాలికలను కొట్టడం దుర్బాషలాడటం చేయకూడదని.. పిల్లలు నేరం చేస్తే వారిని స్టేషన్లోనే నేరస్థులతో కూర్చోబెట్టకుండా మృదువుగా వ్యవహరించాలని డీజీపీ పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మాట్లాడుతూ.. పిల్లలు దేశ భవిష్యత్తుకు ముఖ్యమైన మూలధనం అన్నారు. వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఏపీజె అబ్దుల్ కలామ్ కూడా అనాధ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడారని గుర్తు చేశారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ అనాథ పిల్లల భవితవ్యంపై దృష్టి సారించాలని, జువనైల్ జస్టిస్ ప్రకారం నేరం ఆరోపించబడిన పిల్లలు, పట్టించుకొనే వారు లేని పిల్లలుగా వర్గీకరించారని తెలిపారు. అందరూ కూడా పిల్లల భవిష్యత్తు విషయంలో ఒక బాధ్యత కలిగి ఉండాలని, నేరం ఆరోపించబడిన పిల్లలు నేరస్ధులు కాదని ఆయన అన్నారు. వాళ్లు బాధితులని, నేరం ఆరోపించబడిన పిల్లలతో మృదువుగా ప్రవర్తించాలని చెప్పారు. అనాథ పిల్లల మానసిక స్ధితిగతులను అర్ధం చేసుకుని వారితో మెలగాలని, వారి దత్తత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనాథ పిల్లలకు పునరావాస కల్పన చాలా జాగ్రత్తగా చేయాలని, ప్రభుత్వాలు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. వారికి కుటుంబ వాతావరణం కల్పించాలని, ఓల్డేజ్ హోమ్‌ల దగ్గరలో జువనైల్ హోంలు కూడా ఉండాలని చెప్పారు. లీగల్ క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీల విధానాలలో ఇంకా మార్పులు రావాలని, సీడబ్ల్యూసీ, ఆరాలలో ఉన్న ఇబ్బందులతో దత్తత చేయడం ఆలస్యం అవుతోందన్నారు. బాధ్యులందరూ కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. -
దేశంలోనే మొదటిసారిగా...ఏపీ పోలీస్‌శాఖ సరికొత్త యాప్
-
ఏపీ పోలీస్ సరికొత్త యాప్
-
దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్
సాక్షి, అమరావతి : పాలనలో ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీస్ శాఖ సరికొత్త యాప్‌ను పరిచయం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ రూపొందించిన కొత్త యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశంతోపాటు ఫిర్యాదులకు రశీదు కూడా పొందే అవకాశం ఉంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేసే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. (సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు కళ్లెం) దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత,.. సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. వీటితో పాటు ఎన్వోసీలు, లైసెన్సులు,పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను కూడా అందుబాటులో ఉంటాయి. మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌తో మహిళల కు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది. తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్త్ పాటు డీజీపీ గౌతవ్ సవాంగ్ ముఖ్య పోలీసు అధికారులు పాల్గొన్నారు. యాప్ విశిష్టతను సీఎంకు వివరించారు. ఈ యాప్ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ పోలీస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ’రాష్ట్రంలోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ (ఎస్ఓఎస్) స్వల్ప వ్యవధి లోనే పదకొండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 568 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించగా 117 ఎఫ్ఐఆర్లను నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 1,850 పిటిషన్ లు అందగా 309 యఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం.అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్స్మెంట్ వెహికల్స్ (రేస్) విధానం అందుబాటులో ఉంద’న్నారు. నిరంతర నిఘా కోసం డ్రోన్ల నుండి ప్రత్యక్ష ప్రసారం. అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు .ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. స్వల్ప సమయంలో అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చేరుకునే విధంగా ఇప్పటికే 3500 వాహనాలను జీపీఎస్ పరికరాలు & స్మార్ట్ఫోన్లతో అనుసంధానం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకుంది. ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు మరియు మ్యాన్‌ప్యాక్‌లు) ఆరు విభాగాల్లో ఏపీ పోలీస్ సేవ యాప్ 87 రకాల సేవలు శాంతి భద్రతలు.. ♦నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు ♦ఎఫ్ఐఆర్ స్థితిగతులు, డౌన్లోడ్ ♦దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు ♦తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు ♦అరెస్టుల వివరాలు ♦వాహనాల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ సేవలు.. ♦ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్ సర్వీసు(ఎల్ఎంఎస్) , ఇ–బీట్) ♦ఈ–చలానా స్టేటస్ పబ్లిక్ సేవలు.. ♦నేరాలపై ఫిర్యాదులు ♦సేవలకు సంబంధించిన దరఖాస్తులు ♦ఎన్వోసీ, వెరిఫికేషన్లు ♦లైసెన్సులు, అనుమతులు ♦పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ రహదారి భద్రత.. ♦బ్లాక్ స్పాట్లు ♦యాక్సిడెంట్ మ్యాపింగ్ ♦రహదారి భద్రత గుర్తులు ♦బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు ప్రజా సమాచారం.. ♦పోలీస్ డిక్షనరీ ♦సమీపంలోని పోలీస్‌స్టేషన్ ♦టోల్‌ఫ్రీ నంబర్లు ♦వెబ్సైట్ల వివరాలు ♦న్యాయ సమాచారం ♦ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు -
ఇది జరగకూడని సంఘటన: గౌతమ్ సవాంగ్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్ధనా మందిరాల భద్రత చర్యను పరిశీలించాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన శనివారం అంతర్వేది ఆలయంపై పత్రిక ప్రకటన వెలువరించారు. అంతర్వేది ఆలయంలో ఏళ్ల నాటి చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది జరగకూడని సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజల మనోభవాలతో ముడిపడిన సున్నితమైన అంశంగా డీజీపీ పేర్కొన్నారు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అటువంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించకూడదని, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం 2013 ప్రకారం పూర్తి స్థాయిలో దేవాలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తమన్నారు. అంతేగాక అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, దేవాలయాలకు ఫైర్ & ఎలక్ట్రిసిటీ ఆడిట్ నిర్వహించడం, నిరంతరం రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షణ చర్యలు చేపట్టే విధంగా అవగాహన కల్పించడంతోపాటు పెట్రోలింగ్‌ను పటిష్టపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే సోషల్ మీడియా పుకార్లపై నిఘా, మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతి భద్రతలకు సహకరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా ఉండే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఎస్పీలను డీజీపీ అప్రమత్తం చేశారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: పిల్లలు, మహిళలపై సైబర్ వేధింపులను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. సీఐడీ విభాగం ‘ఈ–రక్షాబంధన్’ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఏపీ పోలీస్ వెబ్సైట్, మొబైల్ అనువర్తనం సురక్ష పత్రికను డీజీపీ ప్రారంభించారు. పిల్లలు, మహిళలకు సైబర్ భద్రత గురించిన సీఐడీ విభాగం, సి–డాక్ ముద్రించిన అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సవాంగ్ మాట్లాడుతూ ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్నందున పిల్లలు, మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ సైబర్ భద్రతపై అవగాహన అందరికీ అత్యావశ్యకం అన్నారు. బ్యాంకు ఖాతాలు, ఓటీపీ తదితర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన సూచించారు. -
ఆ పరిస్థితి తీసుకు రావొద్దు: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ : ప్రజలు గౌరవించేలా, నేరస్థులు భయపడేలా పోలీసుల పనితీరు ఉండాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఒక పోలీసు తప్పు చేస్తే పోలీస్ వ్యవస్ధ మొత్తాన్ని తప్పు పడతారని చెప్పారు. అవినీతీ నిర్మూలన, పోలీస్ ప్రవర్తనలో మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో బుధవారం సిబ్బందికి డీజీపీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం సూచనలకు అనుగుణంగా నడుచుకుని ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మంచి పేరు తేవాలి. తొలిసారి ఇంత పెద్ద సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యవస్థలో మార్పు, పరివర్తన ముఖ్య అజెండా. సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండాలి. గత సంవత్సరంగా అదే ఆలోచనతో పని చేస్తున్నాం. కోవిడ్ సమయంలో మన పోలీసుల సేవలు అభినందనీయం, చాలా మంచి పేరు తెచ్చుకున్నాం. ( 34 ఏళ్ల సర్వీసులో ఇదే ప్రథమం: ఏపీ డీజీపీ ) అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కొందరు సామాన్యులు ఇబ్బంది పడ్డారు. నేరం చేస్తే పోలీసులపైనా న్యాయ పరమైన చర్యలు కచ్ఛితంగా ఉంటాయి. పోలీసు సిబ్బంది మీద పోలీసులే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం, ఆ పరిస్థితి తీసుకు రావొద్దు. ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా అవసరం. మార్పు కోసం చేయాల్సింది చాలా ఉంది. మనం అందరం కలిసి చేద్దాం. ప్రభుత్వం, ప్రజలు మనకు బాధ్యత అప్పజెప్పారని మీకు అందరికీ అర్ధమౌతుందని అనుకుంటాను. పోలీసు సిబ్బంది మొత్తం రాబోయే రెండు నెలలో జరిగే ఓరియంటేషన్ క్లాసులకు అటెండ్ అవ్వాలి. మార్పులు ప్రతీ పోలీసు స్టేషన్లో కనిపించాలి. పోలీసు స్టేషనుకు వచ్చిన వారిని మంచిగా రిసీవ్ చేసుకోవాలి. పోలీసు స్టేషనుకు వచ్చేవారితో మసులుకునే ప్రవర్తన బాగుండాలి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రత్యేక బాధ్యత ఎస్ఈబీ అమలులో ఇప్పటివరకు 33,450 ఎక్సైజు కేసులు ఉన్నాయి. 3492 ఇసుక అక్రమ రవాణా కేసులు పెట్టాం. 50 వేల మందిని అరెస్టు చేశాం. 4,22,738 మెట్రిక్ టన్నుల ఇసుక రవాణాకు భద్రత కల్పించా’’మన్నారు. మహిళలను రాత్రిపూట స్టేషనులో ఉంచకూడదు మహిళలను రాత్రిపూట పోలీసు స్టేషనులో ఉంచకూడదని దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారి దీపిక అన్నారు. మహిళలపై నేరాల నియంత్రణ విషయంలో దిశ టీం ముందుకు సాగుతోందని చెప్పారు. మహిళలు రిపోర్ట్ రాయలేకపోతే దిశ పోలీసులు సహాయం చేయాలని ఆదేశించారు. దిశ పోలీసు స్టేషనులో మహిళా హెల్ప్ డెస్క్ పనితీరు బాగుండాలన్నారు. మహిళా బాధితులు, కంప్లైంట్ ఇచ్చే వారితో మహిళా పోలీసులు మాత్రమే ఉండాలని, మహిళా పోలీసులు లేని సందర్భంలో స్ధానిక మహిళా పెద్దల సహాయం తీసుకోవాలన్నారు. పోలీసులు చట్టానికి సైనికులు మాత్రమే పోలీసులు చట్టానికి సైనికులు మాత్రమేనని ఏడీజీపీ, సీఐడీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. అవతలి వ్యక్తిని తమతో సమానంగా గౌరవించలేని మనస్తత్వం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టు సెక్షన్ 4 ప్రకారం సంబంధిత అధికారి కూడా నేరస్ధుడేనని చెప్పారు. సాక్షుల వద్ద తీసుకునే వివరాలు 161 సీఆర్పీసీ ప్రకారం వీడియోగ్రాఫ్ తీసుకుంటామన్నారు. సమస్యతో వచ్చిన వారితో దుర్భాషలాడకూడదని సూచించారు. పోలీసులు ఉండాలో అలాగే ఉండాలి చట్టపరంగా ఎలా పోలీసులు ఉండాలో అలాగే ఉండాలని, పోలీసులు చేసిన కొన్ని దురుసు పనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ఏడీజీపీ, లా అండ్ ఆర్డర్ డాక్టర్ రవి శంకర్ అన్నారు. గత మూడు వారాలుగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై వచ్చిన కంప్లైంట్లు, లంచాల గురించి వచ్చిన కంప్లైంట్లపై పోలీసులకు దిశా నిర్దేశం చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. -
చంద్రబాబు లేఖపై స్పందించిన ఏపీ డీజీపీ
-
ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
సాక్షి, విజయవాడ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మున్సిపల్ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు. పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్ రిహార్సల్స్‌ని వీక్షించిన గౌతమ్ వారికి పలు సూచనలు చేశారు. రేపు పెరేడ్లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.ఆయన వెంట సీఎస్ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. -
విశాఖపై పోలీసు శాఖ ఫోకస్
సాక్షి, విజయవాడ : పరిపాలన రాజధాని విశాఖపట్నంపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి సారించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో మరింత భద్రత చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ శనివారం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం సీపీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో నలుగురు ఐజీలు ( ట్రైనింగ్ ఐజీ, పర్సనల్ ఐజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, పీఅండ్ఎల్ ఐజీ), ఇద్దరు డీఐజీలు (టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ, విశాఖ రేంజ్ డీఐజీ), ప్లానింగ్ ఓఎస్డీ సభ్యులుగా ఉన్నారు. (చదవండి: 3 రాజధానులకు రాజముద్ర) విశాఖలో అదనపు సిబ్బంది, సదుపాయాలు, పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతులపై కమిటీ అధ్యయనం చేయనుంది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని డీజీపీ సవాంగ్ ఆదేశించారు. కాగా, వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఆవిర్భవించనున్నాయి. (చదవండి : విశాఖ విజయీభవ.. రాజధానిగా రాజముద్ర) -
ఆపరేష్ ముస్కాన్ కోవిడ్-19 ఫేజ్ 6వ విడత ముగింపు కార్యక్రమం
-
భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు: చిరంజీవి
సాక్షి, అమరావతి : ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్‌కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుంటున్నారని, యువత మత్తు పదార్థాలకు బానిసవ్వటం మనసును కలిచివేస్తోందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి నైనజశ్వల్, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, పలు కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ అవగాహన కార్యక్రమాల బ్రోచెర్‌ను విడుదల చేశారు. ( మెగాస్టార్‌కు కటింగ్ చేసిన పెద్ద కూతురు) మెగాస్టార్ వెబినార్ ద్వారా మాట్లాడుతూ.. ‘యాంటీ డ్రగ్ ప్రచారం చేయటానికి పూనుకున్న పోలీసు వారిని.. డీజీపీ సవాంగ్, ఇతర అధికారులు, వెబినార్ సమావేశంలో పాల్గొన్న వారందరిని స్వాగతిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనిష్య జన్మ. అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవటం అవసరమా? క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం. మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా. దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా? బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుంది’అని పేర్కొన్నారు. -
మహిళా సంరక్షణ కోసం దిశా చట్టం ఏర్పాటు: సవాంగ్
-
ఏపీలో అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి
-
‘మీడియా నియంత్రణ చట్ట పరిధిలో ఉండాలి’
సాక్షి, విజయవాడ: సమాచార, ప్రసార మధ్యమాల నియంత్రణ చట్టం పరిధిలో ఉండాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాలు నియంత్రణ లేకుండా రెచ్చ గొట్టేలా వ్యవహరిస్తున్నాని తెలిపారు. ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యానాలు వల్ల సమాజంలో అలజడి రేగుతోందన్నారు. వ్యక్తిగత దూషణల నుంచి మొదలై వైషమ్యాల వైపు దారి తీస్తున్నాయని తెలిపారు. అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిణామాలు సమాజానికీ, వ్యవస్థకూ మంచిది కాదన్నారు. వాటిని అరికట్టేందుకు శాఖాపరమైన వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని వివరించారు. సీఐడీ విభాగంలోని సైబర్ క్రైం వింగ్‌లో సోషల్ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో వింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదులపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని డీజీపీ చెప్పారు. మాధ్యమాల్లో రాజ్యాంగ బద్ద సంస్థల పట్ల, ఆ సంస్థల నిర్వహణలో ఉన్న వ్యక్తుల పట్ల వ్యాఖ్యలు చేయడం సరికాదని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ప్రచురించే, ప్రసారం చేసే సమాచారం, అభిప్రాయాల వ్యక్తీకరణలో చట్టాలను అనుసరించాలని తెలిపారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇవ్వడం, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయడం, ప్రచురించడం సరికాదన్నారు. అశ్లీల, అసభ్యకర, నిందాపూర్వక, అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేయడం గర్హనీయమన్నారు. తీరు మార్చుకోకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవు హెచ్చరించారు. పోలీసు శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వ్యక్తులను ఉపేక్షించదని, నిష్ఫక్షపాతంగా ముందుకు వెళుతుందని చెప్పారు. హైకోర్టు తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారని, న్యాయస్థానం ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తుల మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్న వారి మీద పోలీసుల నిఘా ఉందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. -
'వెంకటాపురం గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించాం'
సాక్షి, తాడేపల్లి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..'ఈ ఘటన ఉదయం 3.30గంటల ప్రాంతంలో జరిగింది. సంఘటన సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది ఉన్నట్లు సమాచారం. డయల్ 100 కి ఫోన్ వచ్చింది. సమాచారం అందగానే పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి అధికార యంత్రాంగం కూడా సైరన్ ద్వారా అప్రమత్తం చేసింది. ఇళ్లలోంచి బయటకు రావాలని కూడా మైక్ ద్వారా చెప్పారు. జిల్లా కమిషనర్ ఆర్.కె.మీనా ఘటన జరిగిన ప్రాంతానికి ఉదయం 4.30 సమయంలో వెళ్లారు. గ్యాస్ లీకేజీ ప్రమాదంతో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఉదయం 5.30 గంటలకు ఫ్యాక్టరీలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వెంకటాపురం గ్రామాన్ని ఉదయం 6.30 గంటల కల్లా పూర్తిగా ఖాళీ చేయించాం. ఇళ్లల్లో ఉన్నవారిని డోర్లు పగలగొట్టి బయటకు తీసుకొచ్చాం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. (విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) గాలిలో కూడా వాటర్ స్ప్రే చేశారు. సీఎం వైఎస్ జగన్ ఉదయం నుంచి ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 800 మందికి పైగా ఆస్పత్రులకు తీసుకెళ్లాము..వారిలో ప్రస్తుతం 250 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక ట్యాంక్‌లో స్టైరిన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే గ్యాస్ లీకేజీ అయిన సమయంలో న్యూట్రలైజ్ కూడా పక్కనే ఉంది...కానీ వాడకపోవడంపై పలు అనుమానాలున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి విజయవాడ నుంచి ఫోరెన్సిక్ టీమ్‌ను పంపి వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం మేము వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టామని ' పేర్కొన్నారు. ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సంఘటన నిర్లక్ష్యం వల్లా.. లేక ప్రమాదమా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. (లీకైన గ్యాస్ చాలా ప్రమాదకరం: నిపుణులు) -
అందరికీ రుణపడి ఉంటాం: డీజీపీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. డీజీపీ శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిపై నిఘా కోసం అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినట్లు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో పర్యవేక్షించినట్లు చెప్పారు. (సమన్వయంతో పోరాడుతున్నాం) 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశామని, జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. 28 రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘా కోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైలు యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖకు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనని కొనియాడారు. కరోనా కట్టడికి సహకరించిన వారికి సర్వదా రుణపడి ఉంటామన్నారు. (కోవిడ్ పరీక్షల్లో.. మరింత దూకుడు) -
ఓ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నానని..
-
ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ
సాక్షి, అమరావతి : రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదన్నారు. సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని తమ దగ్గర సమాచారం ఉన్నట్లు తెలిపారు. (‘ఆ లేఖపై రమేష్‌కుమార్ మౌనం వీడాలి’) ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్థన్ల హస్తం ఉందని వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, అయితే ఈ తతంగమంతా రమేశ్ కుమార్కకు తెలిసే జరిగిందని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు. -
ఎస్ఈసీతో మున్సిపల్ కమిషనర్, డీజీపీ భేటీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను శనివారం మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్ఈసీకి నివేదించారు. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత స్థితి గురించి ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంపై నివేదికను అందజేశారు. (ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్) ఎస్ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఈసీతో సుమారు అరగంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఎస్ఈసీ కనగరాజ్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. -
సేఫ్టీ టెన్నెల్ నుంచి..
-
4వేల పోలీస్ సిబ్బందికి గుడ్ల పంపిణీ
సాక్షి, విజయవాడ, గుంటూరు : ఆంధ్రా లయోలా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియోషన్స్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి గుడ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆదివారం విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్‌లో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ డీజీపీ గౌతం సవాంగ్, విజయవాడ సీపీ ద్వారాక తిరుమలరావు పలువరు పోలీసులకు గడ్లను పంపిణీ చేశారు. విజయవాడ, గుంటూరులోని 4 వేల మంది పోలీసు సిబ్బందికి ప్రతిరోజు 4 వేల గుడ్లు పంపిణీ చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. లాక్డౌన్ సందర్భంగా పోలీస్ సిబ్బంది 24 గంటలు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రజల్ని ఇంటి నుండి బయటకు రావద్దని సూచించినా వారు పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వచ్చే వారికి తమ సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి పంపటం జరుగుతుందని చెప్పారు. ఇక కేవలం 9 రోజులు లాక్డౌన్ పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చన్నారు. ఈ సమయం చాలా కీలకమని, ప్రజలందరూ తప్పకుండా లాక్డౌన్ పాటించాలని కోరారు. పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఆంధ్రా లయోలా కళాశాల పూర్వ విద్యార్థులు.. సిబ్బందిలో ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు గుడ్లు పంచటం సంతోషంగా ఉందన్నారు. -
‘ఢిల్లీ సమావేశం తర్వాతే పెరిగిన కరోనా కేసులు’
సాక్షి, కృష్ణా : ఢిల్లీలో జరిగిన సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా క్వారంటైన్‌కు రావాలిన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆ సమావేశానికి సంబంధించిన జాబితా ఆధారంగా చాలా మందిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఏపీ నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నట్లు అధికారికంగా తేలిందన్నారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఆలస్యం అయ్యే కొద్ది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తిని డీజీపీ మరోసారి గుర్తుచేశారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో పర్యటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కేసుల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌లో ఏపీకి చెందిన విద్యార్థులను తీసుకవచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పదిరోజులు లాక్డౌన్ పాటించారని.. మరో పదిరోజులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో కరోనా రూపంలో వచ్చిన కొత్త చాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, చాలా శ్రమపడుతున్నారని పేర్కొన్నారు. ‘మీ కోసం వారంతా త్యాగం చేస్తున్నారు.. మీరు ఇళ్లు వదలి రాకండి’అంటూ రాష్ట్ర ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. బాపట్లలో వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో విచారణ జరుగుతుందన్నారు. ఈ ఘటన బాదకరమని, సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. పోలీస్ సిబ్బంది కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజల పట్ల హ్యూమన్ అప్రోచ్‌తో ఉండాలని సూచించారు. ప్రజల క్షేమం కోసం పోలీసులు కుటుంబ సభ్యులను వదిలి మరీ విధులు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. చదవండి: కరోనా : ప్రధాని మోదీకి మిథున్ రెడ్డి లేఖ కరోనా: బాల మేధావి చెప్పిందే జరుగుతోందా!? -
లండన్‌లోని తెలుగు విద్యార్థులకు ఏపీ డీజీపీ భరోసా
సాక్షి, విజయవాడ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ లండన్ ఉన్న తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ధైర్యం చెప్పారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్‌లోని తెలుగు విద్యార్థులతో గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, నిబ్బరం కోల్పోవద్దని వారికి సూచించారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు డీజీపీకి వివరించారు. విద్యార్థుల సమస్యలు విన్న డీజీపీ.. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులతో నిరంతరం అందుబాటులో ఉండాలని సీఐడీ(ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులను ఆదేశించారు. డీజీపీ స్పందనపై లండన్‌లోని తెలుగు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి : ‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’ సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్ -
‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’
విజయవాడ: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఎక్కడా అలసిపోకుండా విధులు నిర్వరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలియజేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నిరంతరం సేవలందిస్తున్న పోలీసులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులకు, వారి కుటుంబాలకు డీజీపీ సవాంగ్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘మీరు చేస్తున్న సేవలు ఆపారమైనవి. రక్షక భటుడు అనే పేరుకు సార్ధకత జరిగింది. నిజంగా మీరు ప్రజా రక్షక భటులు. ప్రజా ప్రాణరక్షణే కింకర్తవ్యంగా భావించి సేవలందిస్తున్న సిబ్బందిని చూసి గర్వపడుతున్నాను. కరోనా కట్టడికి విధులు నిర్వహిస్తున్న పోలీసులకి అండగా నిలుస్తున్న పోలీస్ కుటుంబాలకి ధన్యవాదాలు. పోలీస్ కుటుంబాలు పరోక్షంగా చేస్తున్న త్యాగాలు మరువలేనివి. కరోనా వైరస్ ను తరిమి కొట్టడంలో ఇంకా చాలా పని ఉంది. అతి త్వరలో ఈ కరోనా మహమ్మారి ని తరిమి కొడతామని పోలీసుల తరపున రాష్ట్ర ప్రజానీకానికి నేను మాట ఇస్తున్నాను’ అని సవాంగ్ లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: ‘అందువల్లే కరోనా కేసులు పెరిగాయి’ సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్ -
కరోనాను తరిమికొడదాం
-
కరోనా: కేంద్ర కేబినెట్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర అధికారులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గొబ్రె గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో నీలం సాహ్నితో పాటు డీజీపీ గౌతం సవాంగ్, కరోనా స్పెషల్ ఆఫీసర్స్ కృష్ణబాబు, ప్రద్యమ్న, వినీత్ బ్రిజ్ లాల్, విశాల్ గున్నీ పాల్గొన్నారు. వారిని అనుమతించేది లేదు : ఏపీ డీజీపీ ఈ సందర్భంగా ప్రభుత్వ సీఎస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ జ్వరం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంతేగాక హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు అక్కడే స్వీయ నిర్భంధంలో ఉండేలా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇక లాక్డౌన్ నిబంధన ఉల్లఘించి ఏపీలోకి వచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, హెల్త్ ప్రోటోకాల్ పాటించి 14 రోజులు క్వారంటైన్లో ఉండేందుకు ఇష్టపడితే అనుమతిస్తామని చెప్పామన్నారు. కాగా లాక్డౌన్ నిబంధన కచ్చితంగా పాటించకపోతే కరోనా కోరలు చాస్తుందని కేంద్రం హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. (కోవిడ్: నిమిషాల్లోనే నిర్ధారణ!) 44 మందిని క్వారంటైన్‌కు తరలింపు -
వారిని అనుమతించేది లేదు : ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ : నిబంధనలకు విరుద్దంగా ఏపీ సరిహద్దు వద్దకు వస్తున్నవారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. రెండు వారాలపాటు క్వారంటైన్ నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు జోడించి చేసిన అభ్యర్థనని అర్థం చేసుకొని అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించకుండా సరిహద్దు వద్దకు వచ్చిన వారిని కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్ నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని స్ఫష్టం చేశారు. లాక్ డౌన్ ఉదేశ్యం ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కరోనా సంక్రమించకండా ఉండేలాగా చేయడమేనని.. బయట ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనికి అనుమతించడం లాక్డౌన్ ఉద్దేశ్యాన్ని నీరు గార్చడమేనన్నారు. పరిస్థితిని ఆర్థం చేసుకొని ఎక్కడివారు అక్కడే స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఙప్తి చేశారు. సరిహద్దులో వందలాది వాహనాలు నిలిపివేత లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పయనమైన విద్యార్థులు, ఉద్యోగులను ఏపీ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదు. కరోనావైరస్ ప్రభావంతో ఆంధ్ర లోకి అనుమతి లేదని.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని తేల్చి చెప్పారు. దీంతో వందలాది వాహనాలు సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. ఆంధ్రాలోకి రాకుండా తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చేవరకు ఏమి చేయలేమని పోలీసులు తెలిపారు. కాగా, హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా హాస్టల్స్‌లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరిని తమ స్వగృహాలకు వెళ్లేందుకు బుధవారం రాత్రి తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వడంతో.. వారంతా సొంత వాహనాల్లో ఏపీకి బయలుదేరారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం నెర్సుగూడెం ఆంధ్రా తెలంగాణ సరిహద్దు వద్దకు రాగానే వారి వాహనాలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రలోకి రాకుండా తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయంటూ ఏపీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే తెలంగాణ అధికారులు తమకు పర్మిషన్ ఇస్తేనే వచ్చామని, తీరా సరిహద్దుకు వచ్చాక ఆంధ్రా పోలీసులు అనుమతి ఇవ్వడంలేదని.. దయచేసి తమను ఇంటికి వెళ్ళనివ్వండి అంటూ ప్రయాణికులు పోలీసులను వేడుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు బయలుదేరిన 150 మంది విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి బ్యాంకు కోచింగ్ కోసం కొద్ది రోజుల క్రితం నంద్యాలకు వచ్చారు. అయితే అక్కడ హాస్టల్స్ మూసివేడయంతో పోలీసులు అనుమతితో 12 వాహనాల్లో ఉత్తరాంధ్రకు బయలుదేరగా.. కృష్ణా జిల్లా గుడివాడలో వారి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక పంపిస్తామని చెప్పి.. ఓ ఇంజనీరింగ్ కాలేజీల్లో భోజన వసతి ఏర్పాటు చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో సొంత గ్రామాలకు పంపించారు. -
'రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలుచేస్తాం'
సాక్షి, విజయవాడ : ఏపీ లాక్డౌన్ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తామన్నారు. అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతిస్తామన్నారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని, హౌజ్ క్వారంటైన్ లో ఉండవలసిన వారు బయటకు వస్తే కేసులు పెడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 మేరకు విడుదల చేసిన జివోఎమ్ఎస్ 209 మేరకు నేటి నుంచి 31 మార్చ్ వరకు ఆంధ్ర ప్రదేశ్‌లో లాక్డౌన్ అమలులో ఉంటుందన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలడానికి అందరూ భాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పబ్లిక్, ప్రైవేట్ వాహనాలను అనుమతించేది లేదని కానీ అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యావసరాల వస్తువుల కొరకు కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలన్నారు. మెడికల్ షాపులు, మెడిసిన్ మినహా నిత్యావసర వస్తువులు రాత్రి 8 గంటల తరువాత విక్రయానికి అనుమతి లేదన్నారు. పండుగలు, పార్టీలు, ఫంక్షన్లు, వివాహాలు, విహారయాత్రలు వాయిదా వేసుకోవాలన్నారు. డాక్టర్లు, నర్సింగ్, మున్సిపాలిటి, రెవిన్యూశాఖల సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. అత్యవసర సేవలకై డయల్ 100,104 విరివిగా ఉపయోగించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పోలీసులు నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. మీడియా పై ఎలాంటి ఆంక్షలు లేవు.. వారు ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను కఠినంగా అమలు చేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమణ కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. వివిధ దేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చిన విద్యార్థులు, టూరిస్టులు, ఉద్యోగులు కచ్చితంగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. కొన్ని విద్యాసంస్థలు బయట రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను బలవంతంగా బయటకు పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. -
‘గోప్యత వద్దు.. కచ్చిత సమాచారం ఇవ్వాల్సిందే’
సాక్షి, మంగళగిరి: విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయని.. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు విధిగా వైద్య ఆరోగ్య శాఖకు కచ్చితంగా సమాచారం అందించాలని పేర్కొన్నారు. అందుకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది సూచనల ప్రకారం ‘స్వీయ నిర్బంధం’ పాటించాలన్నారు. (‘నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ’) ఐసోలేషన్ పూర్తికాకుండా బయట తిరగడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారు గోప్యత పాటించడం చటరీత్యా నేరమని.. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా నిబంధనలు, సూచనలు పాటిస్తున్నారా లేదా అన్న దానిపై పోలీసులు కూడా నిఘా పెడతారని పేర్కొన్నారు. ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ వంతు సహకారాన్ని అందిస్తామని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. (కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష) -
రాజకీయాలు చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో ఎంతో అనుభవముందని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి రాజకీయాలు చేతకాకపోతే.. ఇంట్లో మూల కూర్చోవాలని, పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని ఏపీ స్టేట్ పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణలత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాకు ఎవరిపై ప్రేమలుండవని చట్ట ప్రకారం మా విధులు మేము చేసుకుంటామన్నారు. ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చదవండి: స్వీపర్‌గా చేసిన స్కూల్లోనే ఇంగ్లిష్ టీచర్‌గా! తాము ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లోకి వస్తే అయ్యన్న పార్టీకి పుట్టగతులే ఉండవన్నారు. ఆయన రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయిందని ఎద్దేవ చేశారు. అయ్యన్న తీరు చూస్తే ప్రజలకే అసహ్యం వేస్తోందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ అంటే ఎవరి కింద పనిచేసేది కాదని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, ఎన్నో ప్రభుత్వాలు పోతుంటాయి.. కానీ తామెప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రజల రక్షణ కోసం పని చేస్తూనే ఉంటామన్నారు. నిజాయితీతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పాటుపడుతున్న డీజీపీ గౌతం సవాంగ్పైనే తప్పుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయ్యన్న తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనా అని ఆమె విమర్శించారు. దేశంలోనే అతి ఉత్తమంగా పని చేస్తున్న ఏపీ పోలీస్ వ్యవస్థపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. చదవండి: సారూ.. ఆమె మా బిడ్డనే.. -
కచ్చితంగా చర్యలు తీసుకుంటాం
-
బోండా ఉమ, వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నాం
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగినట్లు ప్రచారం చేయొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, ఏపీ పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. (వీడియోలు తీయండి.. గొడవ చేయండి ) ఆమె చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే.. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన సంఘటనపై డీజీపీ స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలతో పాటు, ఆయన చూపించిన వీడియోపై డీజీపీ వివరణ ఇచ్చారు. మహిళా అభ్యర్థి చుట్టు ఉన్నది టీడీపీ నేతలే అని, నామినేషన్ ఎవరో దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. (ఆడలేక మద్దెల ఓడు) ఎన్నికల నిర్వహణకు మానిటరింగ్ సెల్ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా 35 సంఘటనలు జరిగాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా 43 ఫిర్యాదులు వచ్చాయన్నారు. నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల నామినేషన్లలో 14 ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించారన్నారు. కేవలం ఎనిమిది సంఘటనల్లో మాత్రమే 307 సెక్షన్ కింద కేసులు నమోదు అయినట్లు డీజీపీ తెలిపారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (కాషాయ పవనం.. సైకిల్‌పై పయనం) రూ.కోటి 84 లక్షల నగదు సీజ్ పోలీసుల దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకూ పోలీసుల తనిఖీల్లో రూ.కోటి 84 లక్షల నగదు సీజ్ చేశామని, రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, 701 మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిఘా యాప్ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. (కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేసిన జేసీ!) రికార్డు స్థాయిలో... ఆపరేషన్ సురా 1,1386 బైండోవర్ కేసులు నమోదు చేశామని, అలాగే 10,980 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నామని, జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వద్ద 27,735 మంది, సమస్యాత్మక ప్రాంతాల్లో 4,399 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సురా పేరుతో రికార్డు స్థాయిలో నాటు సారా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరిగేవని, ఈసారి అలా జరగకుండా చూడబోతున్నామన్నారు. అభ్యర్థులు మద్యం, డబ్బుతో పట్టుబడితే అనర్హలు అవుతారంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. (డీజీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు హైడ్రామా) వాళ్ల కాల్‌డేటా పరిశీలిస్తున్నాం.. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమాచర్ల ఎందుకు వెళ్లారో..అక్కడి నుంచి విజయవాడకు ఎలా వచ్చారో విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మాచర్లలో ఘటన జరిగితే అక్కడి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారని, మాచర్ల ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారన్నారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. వాళిద్దరూ ఎందుకు మాచర్ల వెళ్లారు, ఎప్పుడు పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. దీనిపై బోండా ఉమ, బుద్ధా వెంకన్న తమకు స్టేట్మెంట్ ఇవ్వాలని అన్నారు. (అల్లర్లకు పన్నాగం) -
మాకు వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణంగా పరిశీలిస్తున్నాం
-
వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను కించపరిచే విధంగా అసత్య ఆరోపణలు చేసిన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీసులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో నిస్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వర్తిస్తుంటే వర్ల రామయ్య పోలీసు వ్యవస్థపై అవాస్తవ ఆరోపనలు చేస్తూ, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పోయే విధంగా, పోలీసుల మనోభావాలు దెబ్బవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తెలిపింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ముందు అందరూ సమానమే. అందులో ప్రత్యేకంగా పోలీసు శాఖకు కోర్టులపై అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. కోర్టులకు సంబంధించిన విషయాల్లో ఒక మాజీ పోలీసు అధికారి అయివుండి, కోర్టులపై మీసాలు తిప్పి, తొడలు కొడుతూ సవాలు విసరడం మీ అజ్ఞానాన్ని అవగహనారాహిత్యాన్ని తెలియజేస్తోంది. సమాజంలో జరిగిన ఏ సంఘటన పై అయినా, సరైనా వివరాలు అవసరమై సందర్భరాల్లో విధినిర్వహణలో భాగంగా అధికారులను కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని కోర్టులు ఆదేశించడం సాధారణం. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు కోర్టుల ఆదేశాల మేరకు హాజరై వివరాలు తెలిపారు. అదే విధంగా డీజీపీ కూడా విధినిర్వహణలో భాగంగా, బాధ్యత గల అధికారిగా కోర్టులో హాజరై వారి ఆదేశాలను పాటించడం జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ విధినిర్వహణలో సమర్థత, వారి సాహసోపేతమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన గుర్తింపు గల అధికారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సుపరిచితమే. వర్ల రామయ్య లాంటి వ్యక్తుల తప్పుడు ప్రకటనలు ఎవరూ నమ్మరు. మాచర్ల ఘటనలో ఐపీసీ 307 ప్రకారం కేసు నమోదు చేశాము. వెంటనే ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాము. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తే.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కళ్లుండి చూడలేని మీరు ఇకనైనా మీ కళ్లకు పట్టిన పచ్చకామెర్లను వదిలించుకుని వాస్తవాలు తెలుసుకుని అవగహనతో మాట్లాడాలి. పోలీసు వ్యవస్థపై బురదజల్లే కార్యక్రమాను మానుకోవాలని పోలీసు అధికారుల సంఘం హెచ్చరిస్తోంది’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. -
దిశ చట్టంపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపెడుతున్నాయి
-
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : పోలీస్ శాఖకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటకరీ కిశోర్ కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ అమిత్ గార్గ్‌లతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టులకు 49 మంది ఎంపికయ్యారు. హోమంత్రి సుచరిత మాట్లాడుతూ.. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేపట్టామని తెలిపారు. పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.కాగా ఎంపికైన అభ్యర్థులు రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి సేవలను అందిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.విభజన చట్టం ప్రకారం చాలా సంస్థలు కోల్పోయామని,ఇదే విషయమై సీఎం జగన్ కేంద్ర హోంమంత్రిని కలిసి ఏపిపీఎస్సీకి అకాడమీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.ఏపీలో ఇప్పటికే దిశ యాప్ చట్టాన్ని ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారని, దిశకి వచ్చిన ఫిర్యాదులపై రెస్పాన్స్ బాగానే ఉందని సుచరిత వెల్లడించారు. వెయిటింగ్లో ఉన్న వాళ్లకు పోస్టింగ్‌లు ఇచ్చామని, జీతాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
ఏపీలో 41 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 41మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు ఇచ్చారు. 41మంది డీఎస్పీల బదిలీల్లో 37మంది వెయింటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇవ్వగా, మరో నలుగురిని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పోస్టింగ్‌లు ఇచ్చినవారిలో ఆరుగురు సీఐడీ విభాగానికి, ఒకరు ఏసీబీకి, ఇద్దరు ఏపీఎస్పీ బెటాలియన్‌కు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోస్టులను కేటాయించారు. చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎస్ఆర్ వంశీధర్‌గౌడ్, కర్నూలు డీటీసీ పీఎన్ బాబు, రాజమండ్రి డీటీసీ ఆర్.సత్యనారాయణ, రాజమండ్రి డీఎస్ఆర్పీ ఎస్.మనోహర్‌రావులను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.