హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) ఇన్‌చార్జ్ డెరైక్టర్‌గా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్‌గా ఉన్న డాక్టర్ ఎం.మాలకొండయ్య అప్పా బాధ్యతల్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన శుక్రవారం నుంచి వచ్చే నెల ఏడు వరకు అమెరికా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ చీఫ్‌గా ప్రస్తుతం స్పెషల్ డెరైక్టర్ అబ్రహం లింకన్ ను నియమించిన ప్రభుత్వం అప్పా బాధ్యతల్ని గౌతమ్ సవాంగ్‌కు అప్పగించింది.