పెరుగుతున్న సైబర్ నేరాలు
పెట్టుబడికి రెట్టింపు ఆదాయం అంటూ మోసగాళ్ల ఎర
నమ్మి మోసపోతున్న వారిలో విద్యావంతులే అధికం
మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిప్టోకరెన్సీ పేరిట పుట్టుకొస్తున్న సైట్లు, యాప్‌లు
వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్న సైబర్ నిపుణులు
సైబర్ నేరాలపై తక్షణం ఫిర్యాదు చేయాలంటూ సూచన
సాక్షి, అమరావతి: ప్రముఖ ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ పేరిట ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో వేల మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రెట్టింపు ఆదాయం లభిస్తుందని బురిడీ కొట్టించారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయామని విశాఖతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో బాధితులు లబోదిబోమంటున్నారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు, లింక్ క్లిక్ చేస్తే చాలు అంటూ నెట్‌ఫ్లిక్స్ ఫాలో అనే యాప్ పేరిట 2021లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులను బురిడీ కొట్టించారు. రూ. లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఇలాంటి నేరగాళ్లు, గొలుసుకట్టు ఇన్వెస్ట్‌మెంట్ సైబర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
గుంటూరుకు చెందిన రవి ఫోన్ నంబర్‌ను ఐపీజీ అనే పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసినట్టు నోటిఫికేషన్ వచి్చంది. కొద్దిసేపటికి గ్రూప్ అడ్మిన్ ‘రూ.800 పెట్టుబడి పెడితే ఏడాదంతా రోజుకు రూ.35 చొప్పున ఆదాయం’ అంటూ మెసేజ్ పెట్టింది. గ్రూప్ సభ్యులు కొందరు కొన్ని స్క్రీన్‌షాట్స్ షేర్ చేసి తాముసంపాదిస్తున్నాం అంటూ వంతపాడారు. ఇవన్నీ చూసిన రవి వాళ్లను నమ్మి అడ్మిన్ సూచించిన యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రూ.800 పెట్టుబడి పెట్టాడు. తనకు తెలిసిన మరికొందరితోనూ పెట్టుబడి పెట్టించాడు. ప్రారంభంలో వాళ్లు చెప్పినట్లే చెల్లిస్తూ వచ్చారు.
ఇది బావుందని భావించి రవి రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. అంతే రెండు రోజుల్లోనే యాప్ పనిచేయకుండా పోయింది. మెసేజ్‌లకు అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయానని రవి గుర్తించి లబోదిబోమన్నాడు. తక్కువ పెట్టుబడి. ఎక్కువ ఆదాయం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని టాస్‌్కలు పూర్తి చేస్తే డబ్బు వచ్చి ఖాతాలో జమ అవుతుంది అంటూ సైబర్ నేరగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో పడి పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు, ఉద్యోగులు, యువత తమ కష్టార్జితాన్ని సమరి్పంచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
నమ్మించిమోసం చేస్తారు..
అదనపు ఆదాయం వస్తుందనికొందరి ఆశే.. సైబర్ మోసగాళ్లకు వరమవుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకూ నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టెలీగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
గ్రూప్‌లు క్రియేట్ చేసి ఫలానా స్కీమ్ ద్వారా ఫలానా లాభం ఉంటుందని ఆకర్షిస్తున్నారు. ఈ తరహా యాప్‌లు, వెబ్‌సైట్‌లు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏదైనా యాప్, వెబ్‌సైట్‌ను సందర్శించే ముందు ఒకటి రెండుసార్లు పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఫిర్యాదు చేయండిలా
దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు చేయడానికి కేంద్ర హోమ్ శాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచి్చంది.
https://www. cybercrime.gov.in./ వెబ్‌సైట్ ద్వారా, 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి బాధితులు మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు. అదే విధంగాసమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్/సాధారణ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఒక వేళ ఓటీపీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ల ద్వారా మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు.
2023లో దేశ వ్యాప్తంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులు ఇలా..
» ఢిల్లీ 58,748
» బిహార్ 42,029
» ఛత్తీస్‌గఢ్ 18,147
» తెలంగాణ 71,426
» ఆంధ్రప్రదేశ్ 33,507
» కర్ణాటక 64,301
» కేరళ 23,757
Comments
Please login to add a commentAdd a comment