appa
-
పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ
సాక్షి, అమరావతి: ప్రముఖ ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ పేరిట ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో వేల మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రెట్టింపు ఆదాయం లభిస్తుందని బురిడీ కొట్టించారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయామని విశాఖతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు, లింక్ క్లిక్ చేస్తే చాలు అంటూ నెట్‌ఫ్లిక్స్ ఫాలో అనే యాప్ పేరిట 2021లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులను బురిడీ కొట్టించారు. రూ. లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఇలాంటి నేరగాళ్లు, గొలుసుకట్టు ఇన్వెస్ట్మెంట్ సైబర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరుకు చెందిన రవి ఫోన్ నంబర్‌ను ఐపీజీ అనే పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసినట్టు నోటిఫికేషన్ వచి్చంది. కొద్దిసేపటికి గ్రూప్ అడ్మిన్ ‘రూ.800 పెట్టుబడి పెడితే ఏడాదంతా రోజుకు రూ.35 చొప్పున ఆదాయం’ అంటూ మెసేజ్ పెట్టింది. గ్రూప్ సభ్యులు కొందరు కొన్ని స్క్రీన్‌షాట్స్ షేర్ చేసి తాముసంపాదిస్తున్నాం అంటూ వంతపాడారు. ఇవన్నీ చూసిన రవి వాళ్లను నమ్మి అడ్మిన్ సూచించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.800 పెట్టుబడి పెట్టాడు. తనకు తెలిసిన మరికొందరితోనూ పెట్టుబడి పెట్టించాడు. ప్రారంభంలో వాళ్లు చెప్పినట్లే చెల్లిస్తూ వచ్చారు. ఇది బావుందని భావించి రవి రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. అంతే రెండు రోజుల్లోనే యాప్ పనిచేయకుండా పోయింది. మెసేజ్‌లకు అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయానని రవి గుర్తించి లబోదిబోమన్నాడు. తక్కువ పెట్టుబడి. ఎక్కువ ఆదాయం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని టాస్్కలు పూర్తి చేస్తే డబ్బు వచ్చి ఖాతాలో జమ అవుతుంది అంటూ సైబర్ నేరగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో పడి పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, యువత తమ కష్టార్జితాన్ని సమరి్పంచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నమ్మించిమోసం చేస్తారు.. అదనపు ఆదాయం వస్తుందనికొందరి ఆశే.. సైబర్ మోసగాళ్లకు వరమవుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకూ నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టెలీగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గ్రూప్‌లు క్రియేట్ చేసి ఫలానా స్కీమ్ ద్వారా ఫలానా లాభం ఉంటుందని ఆకర్షిస్తున్నారు. ఈ తరహా యాప్‌లు, వెబ్సైట్లు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏదైనా యాప్, వెబ్‌సైట్‌ను సందర్శించే ముందు ఒకటి రెండుసార్లు పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు చేయండిలా దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు చేయడానికి కేంద్ర హోమ్ శాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచి్చంది. https://www. cybercrime.gov.in./ వెబ్సైట్ ద్వారా, 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి బాధితులు మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు. అదే విధంగాసమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్/సాధారణ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఒక వేళ ఓటీపీ, ఆన్లైన్ బ్యాంకింగ్‌ల ద్వారా మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులు ఇలా..» ఢిల్లీ 58,748» బిహార్ 42,029» ఛత్తీస్‌గఢ్ 18,147» తెలంగాణ 71,426» ఆంధ్రప్రదేశ్ 33,507» కర్ణాటక 64,301 » కేరళ 23,757 -
భారత్‌లో గూగుల్ ‘జెమిని’ యాప్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్ ‘జెమిని’ ఆండ్రాయిడ్ యాప్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది. భారత్‌లో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు వివిధ వర్గాల వారు ఉత్పాదకతను పెంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని జెమిని ఎక్స్పీరియన్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమర్ సుబ్రమణ్య ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. తాజాగా గూగుల్‌కి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జెమిని 1.5 ప్రో ఫీచర్లు కూడా భారత్‌లోని యూజర్లకు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
‘నితీష్- మమత.. నింగి-నేల’ ఆప్ నేత ఎందుకన్నారు?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్- మమతలను నింగి-నేలతో పోల్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్ సాగిస్తున్న ప్రచారం గురించి కూడా సంజయ్ సింగ్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 23 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోందని, కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కుమార్ నిష్క్రమణ అనూహ్యమని, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన హఠాత్తుగా ఎన్డీఏలో చేరారన్నారు. ఈ విధంగా పార్టీలు మారితే స్వల్పకాలంలో అధికారాన్ని, ప్రయోజనాన్ని పొందవచ్చని, తరచూ పార్టీలు మారితే చరిత్ర హీనులవుతారని ఆరోపించారు. ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడు దానికి నితీష్ తలొగ్గుతారని తాను భావించలేదన్నారు. ఇక మమతా బెనర్జీ విషయాని కొస్తే ఆమె బీజేపీకి వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారని సంజయ్ సింగ్ అన్నారు. అందుకే మమతకు నితీష్ కుమార్‌కు మధ్య నింగికి నేలకు ఉన్నంత తేడా ఉన్నదన్నారు. మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుండగా, నితీష్ కుమార్ బీజేపీకి సాగిలపడ్డారని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో ఇండియా కూటమికి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
HYD: ఆరు కార్లలో రూ. 6.5 కోట్ల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో శనివారం భారీ నగదు పోలీసులకు పట్టుబడింది. ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ. 6.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో ఈ నగదు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే.. పట్టుబడ్డ ఈ నగదు ఖమ్మం జిల్లా నుంచి తొలిసారి పోటీ చేస్తున్న ఓ నాయకుడికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలె ఐటీ దాడులు ఎదుర్కొన్న నేత అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ తనిఖీలపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
చెఫ్ కాదు టెక్ జీనియస్!
కిషన్‌ని చూసినప్పుడు చాలామందికి అమెరికన్ ఇన్వెంటర్, ఇంజనీర్ చార్లెస్ కెటరింగ్ ఒకప్పుడు చెప్పిన మాట తప్పకుండా గుర్తుకు వస్తుంది. ‘ఇన్వెంటర్ అంటే చదువును మరీ సీరియస్‌గా తీసుకోని వ్యక్తి’ అంటాడు చార్లెస్ కెటరింగ్. అతడు నవ్వులాటకు అన్నాడో, సీరియస్‌గా అన్నాడో తెలియదుగానీ అస్సాంకు చెందిన కిషన్ చదువును సీరియస్‌గా తీసుకోలేదు. లక్ష్యాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. లక్ష్యం ఉన్న చోట క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయి. విజయానికి దారిచూపుతాయి. కిషన్ విషయంలోనూ ఇది నిజమైంది. ఒకప్పుడు ‘కిషన్ బగారియా’ అంటే పక్క గ్రామం వాళ్లకు కూడా తెలియదు. ఇప్పుడు అస్సాం మొత్తం సుపరిచితమైన పేరు....కిషన్ బగారియా. 26 సంవత్సరాల కిషన్ బగారియా సృష్టించిన ఆల్–ఇన్–వన్ యాప్ ‘టెక్స్.కామ్’ను అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఆటోమేటిక్ ఇంక్’ రూ. 416 కోట్లకు కొనుగోలు చేసింది...చెఫ్ కాదు టెక్ జీనియస్ అస్సాంలోని దిబ్రుగఢ్‌లో ఎనిమిది, అగ్రసేన్ అకాడమీలో తొమ్మిది, పదో క్లాస్ చదివాడు కిషన్. ఇంటర్నెట్ అతడి ప్రపంచంగా ఉండేది. రోజూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడమో, నేర్చుకోవడమో చేసేవాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే యాప్స్ తయారీపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టాడు. తన వినోదం కోసం చిన్న చిన్న యాప్స్ తయారుచేసేవాడు. ‘వీడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ప్రపంచంతో పనిలేదు’ అని నవ్వుతూ ఇతరులతో చెప్పేవాడు తండ్రి మహేంద్ర బగారియా. ‘ఎప్పుడు చూసినా కంప్యూటర్లో మునిగిపోయి కనిపిస్తావు. భవిష్యత్‌లో ఓ మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యం లేదా?’ అని ఒక సందర్భంలో బంధువు ఒకరు కిషన్‌ను అడిగాడు. ‘ఉద్యోగం చేయాలని లేదు. లక్ష్యం మాత్రం ఉంది’ అన్నాడు కిషన్.‘ఏమిటి అది?’ అని ఆసక్తిగా అడిగాడు బంధువు. ‘సొంతంగా కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం’ గంభీరంగా అన్నాడు కిషన్.బంధువుతో పాటు అక్కడ ఉన్న వాళ్లు అందరూ బిగ్గరగా నవ్వారు. అలా నవ్విన వాళ్లందరికీ కిషన్ ఇప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. మరో సందర్భంలో... ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రవర్తించకు. పగటికలల ప్రపంచం నుంచి బయటికి వచ్చేయ్. సొంతంగా కంపెనీ అంటే మాటలనుకున్నావా?’ అంటూ ఒకప్పుడు తనకు హైస్కూల్లో చదువు చెప్పిన టీచర్ మందలించాడు. ఇప్పుడు ఆ గురువు గారికి కిషన్ తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు! ‘డీల్ ఫైనలైజ్ కావడానికి మూడు నెలల సమయం పట్టింది. డీల్ ఓకే అయిన సందర్భంలో తట్టుకోలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇది కలా నిజమా! అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాను. ఈ స్థితి నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది’ అంటాడు కిషన్. ‘మరి నెక్ట్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు కిషన్ ఇచ్చిన జవాబు... ‘టెక్ట్స్.కామ్‌పై మరింత పనిచేయాల్సి ఉంది. వర్క్ కంటిన్యూ అవుతుంది’ కిషన్ రూపొందించిన ‘ఆల్–ఇన్–వన్’ యాప్ ట్విట్టర్, వాట్సప్, ఐ మెసేజ్, సిగ్నల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్... మొదలైన యాప్‌లను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులోకి తెస్తుంది. యూజర్ కమ్యూనికేషన్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ ఇది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
హైదరాబాద్ నిజమైన విశ్వనగరం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం అప్పా పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మెట్రో సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. న్యూయార్క్, పారిస్, లండన్‌లో కరెంట్ పోవచ్చు.. కానీ, హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోయే అవకాశం లేదు. 1912లోనే నగరానికి కరెంట్ సదుపాయం ఉండేది. హైదరాబాద్ నిజమైన విశ్వనగరం. చరిత్రలో సుప్రసిద్ధమైన నగరం ఇది. అలాంటి నగరంలో ఒకప్పుడు నగరంలో తాగు నీటి సమస్య ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చూసుకున్నాం. అన్ని కష్టాలను అధిగమించి ముందుకు వెళ్తున్నాం. అందరికీ అనువైన వాతావరణ నగరంలో ఉంది. అన్నివర్గాలను అక్కన చేర్చుకుంది ఈ విశ్వనగరం. దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో పెద్దది హైదరాబాద్. అలాంటి నగరంలో మెట్రో.. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో ముందుకు పోతున్నాం. పరిశ్రమ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
అప్పా–మన్నెగూడ రహదారి విస్తరణకు మోక్షం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎప్పుడెప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ఎన్‌హెచ్–63 (అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు.. 46 కి.మీ) నాలుగులేన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.956 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనుల కాంట్రాక్ట్‌ను సాగునీటి ప్రాజెక్టులు ఇతర నిర్మాణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెఘా ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ చేజిక్కించుకుంది. కేటాయించిన నిధుల్లో రూ.786 కోట్లు రహదారి నిర్మాణానికి ఖర్చు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని భూ సేకరణకు వెచ్చించనుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాలకు సర్వీసు రోడ్లు సైతం అందుబాటులోకి వస్తాయి. రోడ్డుకిరువైపులా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం మొత్తం 18 ప్రాంతాల్లో అండర్ పాస్‌లు రానున్నాయి. వీటిలో మొయినాబాద్ అండర్ పాస్ (100 మీటర్లు) పెద్దది. (క్లిక్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?) ఈ రోడ్డు పనులు పూర్తయితే మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, వికారాబాద్ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణం సులభతరం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇదిలాఉండగా చేవెళ్ల సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ మర్రి, ఇతర వృక్షాలు ఉన్నాయి. వీటి తొలగింపుపై ఇప్పటికే పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎలా సంరక్షిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. (క్లిక్: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు) -
AP Police Academy: త్వరలో ‘అప్పా’ విభజన
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య ఏడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా)’ విషయంలో కీలక ముందడుగు పడనుంది. విభజన చట్టం పదో షెడ్యూల్లో ఉన్న ఈ సంస్థ అధికారిక విభజనకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్వరలో ఎంవోయూ కుదరనుంది. దీంతో ఏపీలో పూర్తిస్థాయి పోలీసు అకాడమీ ఏర్పాటుతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమం కానుంది. చదవండి: Flipkart CEO: విజనరీ సీఎం.. వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవతో త్వరలో ఎంవోయూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రాష్ట్రాల ఉమ్మడి సంస్థల విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. హోంశాఖకు సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల విభజన ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. తాజాగా పోలీస్ అకాడమీ విభజన అంశాన్ని వేగవంతం చేసింది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లలోపే ఈ సంస్థల విభజన పూర్తి కావాలి. అలా అయితేనే ఆ సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల పోలీస్ అకాడమీల అదనపు డీజీలు పలు దఫాలుగా చర్చించి సూత్రప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చారు. త్వరలోనే పోలీస్ అకాడమీ విభజన ఒప్పందంపై రెండు రాష్ట్రాల డీజీపీలు సంతకాలు చేసి ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. అనంతరం అధికారులు, సిబ్బందిని ఏపీ, తెలంగాణ మధ్య 52: 48 నిష్పత్తిలో పంపిణీ చేస్తారు. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఎంవోయూ కాపీని కేంద్ర హోంశాఖకు సమర్పిస్తారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తేనే పోలీస్ అకాడమీ విభజన ప్రక్రియ అధికారికంగా పూర్తి అవుతుంది. విభజన చట్టం హామీ మేరకు ఏపీలో కొత్తగా పోలీస్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం దాదాపు రూ.500 కోట్ల వరకు నిధులు సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాల భూమిని కేటాయిస్తుంది. ఇప్పటికే పోలీస్ అకాడమీ కోసం భూమిని ప్రాథమికంగా గుర్తించారు. ఎంవోయూ ప్రక్రియ వారం పది రోజుల్లో పూర్తి కాగానే మిగిలిన అంశాలను వేగవంతం చేయాలని హోంశాఖ భావిస్తోంది. ఏడాదిలో పూర్తిస్థాయిలో పోలీస్ అకాడమీని నెలకొల్పనున్నారు. -
పొంగిపొర్లుతున్న రాజేంద్రనగర్ అప్ప చెరువు
-
ఆరు పట్టణాల్లో క్రైమ్ సీన్ చిత్రీకరణ
న్యూఢిల్లీ: హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, అహ్మదాబాద్‌లలో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ తరువాత దేశమంతా ఈ పద్ధతిని అమలుచేసేందుకు ఆరు నెలల గడువు కోరింది. ఈ మేరకు కేంద్రం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలుచేసింది. నేర విచారణను చిత్రీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. ఈ విషయంలో చొరవచూపిన గుజరాత్.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘మొబైల్ పాకెట్ యాప్’ అనే అప్లికేషన్‌కు అనుసంధానమయ్యే ఒక సెంట్రల్ సర్వర్‌ను రూపొందించింది. పోలీస్ స్టేషన్‌కు సమకూర్చిన ప్రతి సెల్ఫోన్లో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గుజరాత్ నమూనా ఆధారంగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రూపొందించిన మరో యాప్‌ను పరీక్షించాలనుకుంటున్నట్లు కోర్టు తెలిపింది. ‘నేర విచారణ చిత్రీకరణకు సంబంధించి గుజరాత్ మంచి పురోగతి సాధించింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగించేలా ఒక సమగ్ర నమూనాను కేంద్రం రూపొందిస్తుందని ఆశిస్తున్నాం’ అని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన లాయర్ శిరిన్ ఖాజురియా మాట్లాడుతూ..కోర్టు గత ఉత్తర్వుల మేరకు కేంద్రీయ పర్యవేక్షణ విభాగం(సీఓబీ) ఏర్పాటైందని తెలిపారు. నేరం జరిగిన చోటును వీడియోతీసే ప్రణాళికపై సీఓబీ తొలి సమావేశం మే 24న నిర్వహించారని చెప్పారు.నేరం జరిగిన చోటును వీడియో తీసే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైందని ఏప్రిల్ 5న కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసు విచారణలో వీడియోగ్రఫీ వినియోగం, కాల పరిమితిపై హోం శాఖ నియమించిన కమిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదిస్తూ ఈ విధంగా స్పందించింది. -
యజ్ఞంలా పోలీసు శిక్షణ
అభ్యర్థులకు డీజీపీ సాంబశివరావు సూచన మీ సామర్థ్యం చూసి జిల్లా ఎస్పీ గర్వపడాలి భవిష్యత్‌లో విదేశీ తరహా పోలీసింగ్ వ్యవస్థ పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారిని గౌరవించండి అప్పా తరహాలో ‘అనంత’ పీటీసీ అభివృద్ధి అనంతపురం సెంట్రల్ : యజ్ఞం వలె శిక్షణ తీసుకుని ప్రొఫెషనల్ పోలీసులుగా తయారు కావాలని డీజీపీ నండూరి సాంబశివరావు సూచించారు. పోలీసుశాఖలో సివిల్, కమ్యూనికేషన్స్ విభాగాలకు ఎంపికైన ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్స్ విభాగానికి ఎంపికైన ఏఎస్ఐలకు సోమవారం అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో శిక్షణ తరగతులను డీజీపీ ప్రారంభించారు. మొత్తం 339 మంది అభ్యర్థులున్నారని, అందరూ ఉన్నతవిద్యావంతులని (బీటెక్, ఎంటెక్) పీటీసీ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి వివరించారు. 144 మంది మహిళా అభ్యర్థులున్న ఏకైక బ్యాచ్ ఇది అని వివరించారు. డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ ఇక్కడి పీటీసీలో శిక్షణ తీసుకోవడం ఒక అదృష్టమన్నారు. 1986లో తాను కూడా ఇక్కడే శిక్షణ తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. మళ్లీ డీజీపీ స్థాయిలో ఇక్కడికొచ్చి శిక్షణ అభ్యర్థులతో మాట్లాడే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ నాటికి ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ (నిష్ణాతులైన) పోలీసులుగా తయారుకావాలని ఆకాంక్షించారు. విధుల్లోకి వచ్చిన తర్వాత మీ సామర్థాన్ని చూసి ప్రతి జిల్లా ఎస్పీ గర్వపడాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ మన బాధ్యత నీళ్లు రాలేదని ప్రజలు, ఎరువులు అందలేని రైతులు, కడుపు మండిన ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతారని, అలాంటి సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంటుందని డీజీపీ సూచించారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్స్, కాల్‌డేటా ఆధారంగా కేసుల దర్యాప్తు తదితర విషయాల్లో పట్టు సాధించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రోన్ కెమెరా, బాడీవార్న్ కెమెరాల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. భవిష్యత్‌లో విదేశీ తరహాలో పోలీసింగ్ వ్యవస్థలో మార్పులు వస్తాయన్నారు. టెక్నాలజీ ఉపయోగించకపోతే ఎందుకూ పనికిరారని హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్‌కు నిరక్షరాస్యుల నుంచి ఎన్ఆర్ఐ వరకు వస్తారని, ప్రతి ఒక్కరినీ గౌరవించాలని అన్నారు. జీవితంలో క్రమశిక్షణా రాహిత్యం అనేది మంచిది కాదని సూచించారు. అనంతపురం పీటీసీని ఆంద్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) తరహాలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అందులో భాగంగా రూ. 2 కోట్ల నిధులు తక్షణం విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆధునీకరించిన పీటీసీ ఆస్పత్రిని డీజీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ విభాగం ఐజీలు సంజయ్, రవిచంద్ర, రాయలసీమ రేంజ్ ఐజీ ఎండీ ఇక్బాల్, కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న.. తందె.. బాప్!
తమిళంలో ‘అప్పా’ అంటే నాన్న అని అర్థం. ఏ భాషలో పిలిచినా పిల్లల పట్ల నాన్న ప్రేమ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది. ఇది ఫాదర్స్ డే కాకపోయినా నాన్న గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... తమిళ దర్శకుడు సముద్రఖని ‘అప్పా’ పేరుతో ఓ సినిమా తీశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ రోల్‌ని తానే చేశారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదలు పెట్టినప్పుడు పన్నెండు భారతీయ భాషల్లో తీయాలనుకున్నారట. తమిళ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రీమేక్ సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఒక తండ్రీ కొడుకు, విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగే ఇది. సముద్రఖని జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఇతర భాషల రీమేక్‌లో ఏ హీరో చేస్తే బాగుంటుందనే విషయంలో సముద్రఖని ఓ స్పష్టతకు వచ్చారు. తెలుగులో ‘అప్పా’గా వెంకటేశ్ న్యాయం చేయగలరన్నది సముద్రఖని అభిప్రాయం. కథ, పాత్ర నచ్చితే వెంకీ తండ్రిగా నటించడానికి వెనకాడడం లేదు. ‘దృశ్యం’ చిత్రంలో ఏకంగా టీనేజ్ గాళ్‌కి తండ్రిగా చేసిన విషయం తెలిసిందే. ఓ తండ్రిగా ఆ సినిమాలో పిల్లల పట్ల ప్రేమ కనబర్చే సన్నివేశాల్లో వెంకీ చాలా టచింగ్‌గా నటించారు. ‘అప్పా’ గురించి వెంకీతో సముద్రఖని చర్చలు జరిపారట. ఈ సినిమాలో వెంకీయే నటించే అవకాశం మెండుగా ఉందని వార్త. కన్నడ రీమేక్‌కి హీరో శివరాజ్‌కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. హిందీలో అనిల్ కపూర్ అయితే బాగుంటుందని సముద్రఖని అనుకుంటున్నారట. తమిళ ‘అప్పా’ చూసిన తర్వాత, నచ్చితే తప్పక చేస్తానని అనిల్ మాటిచ్చారట. తెలుగు, కన్నడాల్లో ఎవరు నిర్మిస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే, ‘అమ్మా కనక్కు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వినీ అయ్యర్ తివారీ హిందీలో నిర్మించడానికి ముందుకొచ్చారు. ఆవిడ మాత్రం టైటిల్ రోల్‌ను ఇర్ఫాన్‌ఖాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి.. హిందీ బాప్‌గా ఎవరు నటిస్తారో చూడాలి. ఈ మూడు రీమేక్స్ సముద్రఖని దర్శకత్వంలోనే రూపొందుతాయి. కన్నడంలో నాన్నని ‘తందె’ అంటారు. హిందీలో ‘పితా’, ‘బాప్’ అంటారు. టైటిల్స్ కూడా అందుకు తగ్గట్లే పెడతారేమో. -
సముద్రకని కర్త, కర్మ ,క్రియగా అప్పా
నవ్యతకు చిరునామా మలయాళ సినిమా అన్నది ఇంతకు ముందు మాట. ఇప్పుడు దాన్ని తమిళ సినిమా ఆక్రమించుకుందని చెప్పవచ్చు. నాడోడిగళ్ చిత్రంతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సముద్రకని ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించినా ఒక దశలో దర్శకత్వాన్ని దూరంగా పెట్టి పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఆ మధ్య కిత్నా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆసమయంలో అమలాపాల్ పెళ్లికి సిద్ధం అవడంతో సముద్రకని తన ప్రయత్నానికి తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టారు. తాజాగా ఆయన నటన, దర్శకత్వంతోపాటు నిర్మాతగా అదనపు బాధ్యతలు చేపట్టి అప్పా(నాన్న)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెలైంట్‌గా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి సముద్రకని తెలుపుతూ నాగోడిగళ్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలిసారిగా అప్పా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తూ నటిస్తున్నానని చెప్పారు. ఇందులో కాక్కాముట్టై చిత్రం ఫేమ్ విఘ్నేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. త ంబిరామయ్య, వినెధిని, నవ నటి ప్రీతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం అని వివరించారు. కచ్చితంగా అప్పా చిత్రం తమిళ సినిమాకు కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారని, ఆయన చిత్రం చూసి అద్భుతంగా తీశావంటూ ప్రశంసించారని సముద్రకని పేర్కొన్నారు. చిత్రాన్ని వచ్చే నెల విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఎంత అదృష్టం 'అప్పా'
తూర్పుగోదావరి జిల్లా: వారంతా శిక్షణ పొందుతున్న సబ్ఇన్స్పెక్టర్లు. శిక్షణ ముగియడానికి ఇంకా ఏడాది వ్యవధి ఉంది. ఈలోగా పుష్కరాల్లో విధుల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ అరుదైన అవకాశం వారికి చెప్పలేనంత సంతోషం కలిగిస్తోంది. గోదావరి పుష్కరాల్లో సుమారు 1040 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమి (అప్పా)కి చెందిన ట్రైనీ ఎస్ఐలు సేవలందిస్తున్నారు. శిక్షణ పూర్తవకుండానే వచ్చిన తొలి పుష్కర విధులను సమర్థంగా నిర్వహించి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటామంటున్నారు వీరు. - కోటిలింగాల ఘాట్(రాజమండ్రి) ఎంతో అదృష్టం పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. త్వరలో సబ్ఇన్స్పెక్టర్గా ప్రజలకు సేవలందిస్తామన్న ఆనందంతో ఉన్న మాకు పుష్కరాల్లో విధులు నిర్వహించే అవకాశం రావడంతో చెప్పలేనంత ఆనందంగా ఉంది. -పి.రాంబాబు, ట్రైనీ ఎస్ఐ, నెల్లూరు మా భవితకు పునాది తొలి విధులు పుష్కరాలతో నిర్వహించడం జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. పుష్కరాల్లో తొలి అడుగు వేయడం మా పురోగతికి పునాదిగా మారుతుంది. - ఎ.విభూషణరావు, ట్రైనీ ఎస్ఐ, శ్రీకాకుళం -
అప్పా ఇన్చార్జ్ డెరైక్టర్‌గా సవాంగ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) ఇన్చార్జ్ డెరైక్టర్‌గా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్‌గా ఉన్న డాక్టర్ ఎం.మాలకొండయ్య అప్పా బాధ్యతల్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన శుక్రవారం నుంచి వచ్చే నెల ఏడు వరకు అమెరికా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ చీఫ్‌గా ప్రస్తుతం స్పెషల్ డెరైక్టర్ అబ్రహం లింకన్ ను నియమించిన ప్రభుత్వం అప్పా బాధ్యతల్ని గౌతమ్ సవాంగ్‌కు అప్పగించింది.