తెలుగు, హిందీలో కూడా లభ్యం
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్ ‘జెమిని’ ఆండ్రాయిడ్ యాప్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది.
భారత్‌లో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు వివిధ వర్గాల వారు ఉత్పాదకతను పెంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని జెమిని ఎక్స్‌పీరియన్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమర్ సుబ్రమణ్య ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. తాజాగా గూగుల్‌కి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జెమిని 1.5 ప్రో ఫీచర్లు కూడా భారత్‌లోని యూజర్లకు అందుబాటులో ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment