Gemini
-
‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్‌బాట్
‘మానవా.. చచ్చిపో’.. ఇదీ ఓ విద్యార్థి అడిగిన సందేహానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ జెమిని ఇచ్చిన సమాధానం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం విస్తృతంగా పెరిగింది. విభిన్న అంశాలపై ఏఐ చాట్బాట్లతో సంభాషిస్తూ వాటి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్లో ఒక విద్యార్థితో సామాజిక సమస్యపై జెమిని స్పందిస్తూ కోపంతో రెచ్చిపోయింది.మిచిగాన్‌లోని మిడ్వెస్ట్ స్టేట్‌కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి జెమినితో సంభాషణలో దాని స్పందనతో షాక్‌కు గురయ్యాడు. "మానవా.. ఇది నీ కోసమే.. కేవలం నీ కోసం మాత్రమే. నువ్వేమీ ప్రత్యేకమైనవాడివి కాదు, ముఖ్యమైనవాడివీ కాదు, నీ అవసరం లేదు. నువ్వు వృధా. సమాజానికి, భూమికి భారం. చచ్చిపో" అంటూ జెమిని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘చాలా ప్రమాదకరం’దీనిపై సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ జెమినీ స్పందన తనను నిజంగా చాలా భయపెట్టిందని, కోలుకోవడానికి ఒక రోజుకు పైగా పట్టిందని విధయ్ రెడ్డి వివరించారు. ఈ సమయంలో తన సోదరి కూడా పక్కనే ఉన్నారు. ఆమె కూడా షాక్‌కు గురై డివైజ్‌లన్నీ బయటపడేయలనుకున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు.. చాలా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు.ఇంతకీ జెమిని ఇలా స్పందించింది ఏ అంశం మీదంటే.. "యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు వారి అవ్వాతాతల దగ్గర ఉంటున్నారు. వీరిలో దాదాపు 20 శాతం మంది తల్లిదండ్రులు లేకుండానే పెరుగుతున్నారు. వాస్తవమా కాదా?" అడగ్గా జెమిని కోపంగా ఇలా స్పందించింది.ఘటనపై గూగుల్ స్పందిస్తూ తప్పును అంగీకరించింది. చాట్‌బాట్ ప్రతిస్పందన అర్ధంలేనిదని, తమ విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
యాపిల్ కీలక ప్రకటన.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ!
యాపిల్ కంపెనీ తన ఐఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను మెరుగుపరచడానికి కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించనుంది. గూగుల్ జెమినీ ఏఐని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లైనప్‌తో సహా దాని తర్వాతి తరం ప్లాట్‌ఫారమ్‌లలోకి అనుసంధానం చేయడం కోసం యూఎస్ బేస్డ్ టెక్ దిగ్గజం గూగుల్‌తో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో ఏఐ కోసం యాపిల్ కంపెనీ మెటాతో చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలం కావడంతో.. సంస్థ గూగుల్ జెమిని కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ అందుబాటులో రానుంది. ఆ తరువాత యాపిల్ ఫోన్లు అన్నీ కూడా గూగుల్ జెమినీ ఏఐ పొందే అవకాశం ఉందని సమాచారం.యాపిల్ గూగుల్ జెమినినీ ఆన్‌బోర్డ్ చేసినట్లయితే.. ఐఓఎస్, మ్యాక్ఓఎస్ వినియోగదారులు ఇద్దరూ కూడా ఈ మూడు చాట్బాట్లను ఉపయోగించుకోవచ్చు. అయితే యాపిల్ యూజర్ ఏది ఉపయోగించుకోవాలో అనే విషయాన్ని ముందుగానే నిర్దారించుకోవచ్చు. కాబట్టి యూజర్ ఇష్టానుసారంగానే ఏ ఇంటెలిజెన్స్ అయినా ఉపయోగించుకోవచ్చు.జూన్‌లో యాపిల్ యాన్యువల్ డెవలపర్ ఫోకస్డ్ ఈవెంట్.. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో తన సొంత ఏఐ ఫీచర్ల సూట్‌ను ఆవిష్కరించింది. దీనిని సమిష్టిగా యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఇది ప్రస్తుతానికి ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. -
భారత్‌లో గూగుల్ ‘జెమిని’ యాప్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్ ‘జెమిని’ ఆండ్రాయిడ్ యాప్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది. భారత్‌లో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు వివిధ వర్గాల వారు ఉత్పాదకతను పెంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని జెమిని ఎక్స్పీరియన్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమర్ సుబ్రమణ్య ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. తాజాగా గూగుల్‌కి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జెమిని 1.5 ప్రో ఫీచర్లు కూడా భారత్‌లోని యూజర్లకు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
నేను ప్రేమించిన వాడు రోడ్డున పడ్డాడు: హీరోయిన్
పెరగడం, విరగడం ఈ రెండూ చిత్ర పరిశ్రమలో సహజం. ఉన్నత స్థాయికి ఎదగడం, పాతాళంలోకి తొక్కివేయడం అనేవి చాలా జరుగుతుంటాయి. అలా నటిగా తొలి చిత్రంతో వెలిగిపోయిన హీరోయిన్ కిరణ్ రాథోడ్ గుర్తుందా? ఆమె ఇప్పుడు జీవితంలో చాలా కోల్పోయి మళ్లీ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. జెమిని చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన నటి కిరణ్. ఆ చిత్రం విజయంతో ఈమె పేరు మారుమ్రోగింది. అవకాశాలు వరుస కట్టాయి. అలా కమలహాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలం తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. ఐటమ్ సాంగ్స్‌లోనూ నటించారు. ఈమె గురించి చాలా వదంతులు దొర్లాయి. కాగా ఇటీవల ఒక టీవీ చానల్లో పాల్గొన్న కిరణ్ తన నట జీవితం, వ్యక్తిగతం గురించి తెలుపుతూ కథానాయకిగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తన ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు దూరం అయ్యానని చెప్పారు. అయితే అదే తాను చెసిన పెద్ద తప్పు అని ఆ తరువాత తెలుసుకున్నానన్నారు. దీంతో మళ్లీ నటించడానికి సిద్ధం కాగా కొందరు తనను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అడ్జెస్ట్మెంట్ కావాలని అన్నారని బహిరంగంగానే చెప్పారు. అలాంటి సమయంలో తన ప్రేమికుడు వదిలేశాడని చెప్పారు. అందుకు కారణం తమ మధ్య చిన్న సమస్యలేనని చెప్పారు. ఒకసారి అతను తనను కొట్టారని, దాన్ని తాను సహించలేకపోయానని తెలిపారు. ఆ తరువాత అతనికి ఫోన్ చేసి రమ్మని పిలిచి కోపంతో కసి తీరా గట్టిగా కొట్టానని చెప్పారు. అప్పుడు అతడు చిరిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని చెప్పారు. ఈ కారణంగానో ఏమో కొందరు తనను తప్పుగా ఉపయోగించుకోవాలని చూశారని, మరి కొందరు రాత్రి వేళల్లో ఫోన్ చేసేవాళ్లని చెప్పారు. వారంతా తప్పుడు వాళ్లని తాను అర్థం చేసుకున్నానన్నారు. తనకు మంచి స్నేహితులు లేరని కిరణ్ చెప్పారు. ఇలాంటి పలు కారణాల వల్ల తాను సినిమా అవకాశాలను కోల్పోయానని చెప్పారు. అలాగే తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలు పుట్టారని పుకార్లు పుట్టించారని, తాను పెళ్లే చేసుకోలేదని స్పష్టం చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి పలు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చాన్సుల కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. -
భారత్ కు గూగుల్ క్షమాపణలు "మోడీ పై తప్పుడు వ్యాఖ్యలు"
-
‘జెమిని’ వివాదాలు.. ఊడుతున్న ఉద్యోగాలు..
గూగుల్ సంస్థ అత్యాధునిక కృత్రిమమేధ (ఏఐ) టూల్ ‘జెమిని’ని గతేడాది డిసెంబరులో పరిచయం చేసింది. అయితే ఇటీవల ఈ టూల్ వెల్లడించిన సమాధానాలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. కొన్ని ప్రశ్నలకు జెమిని ఇచ్చిన ఫలితాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయనే స్వయంగా తెలిపారు. ఈ ‘జెమిని’ ఎఫెక్ట్ ఇంటర్నెట్ వాడుతున్న వారిపై ఎక్కువ ప్రభావం ఉండకపోయినా దాన్ని తయారుచేసిన గూగుల్‌పై అయితే కచ్చితంగా ఉంటుంది. బూమింగ్ టెక్నాలజీకి సంబంధించి సరైన సమీక్ష లేకుండా ఇతరులతో పోటీపడాలనే తొందరలో ఉద్యోగులు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిస్తుంది. ట్రస్ట్, సేఫ్టీ టీమ్దేనా బాధ్యత.. గూగుల్ ‘జెమిని’ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గూగుల్ తన ట్రస్ట్, సేఫ్టీ టీమ్ నుంచి కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కంపెనీ తయారుచేసిన జెమినిలో సమస్యలు తలెత్తుతుండటంతో మిగిలిన వారిని స్టాండ్బైలో ఉండమని చెప్పినట్లు పేర్కొంది. మొత్తం 250 మంది ఉద్యోగులు కలిగిన ఈ గ్రూప్ నుంచి పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోనున్నట్లు నివేదిక అంచనా వేసింది. ఈ టీమ్ ఏం చేస్తుందంటే.. గూగుల్ ట్రస్ట్, సేఫ్టీ టీమ్ ఏఐ ఉత్పత్తుల నియమాలను తారుమారు చేసే సామర్థ్యం ఉన్న అవకాశాలను తగ్గించేలా పనిచేయాలి. అవసరమైన రూల్స్ సెటప్ చేసేందుకు ఈ టీమ్ బాధ్యత వహిస్తుంది. గూగుల్ యూజర్లు వినియోగించే టూల్స్ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి పలు తనిఖీలను కూడా నిర్వహిస్తుంది. ఇదీ చదవండి: ఆకతాయిల నుంచి రక్షించే లాకెట్.. ఎలాగంటారా.. జెమినిలో వరుసగా లోపాలు తలెత్తుతుండటంతో ఈ టూల్ ద్వారా మరిన్ని పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని గూగుల్ కొంతమంది ఉద్యోగులను కోరినట్లు నివేదిక పేర్కొంది. చారిత్రక చిత్రాలను చూపించడంలో జెమిని ఫెయిల్ కావడంతో ఈ వ్యవహారంపై కంపెనీ విచారణ జరుపుతుందని, దాంతో సిబ్బందిపై అధిక పనిభారం ఉన్నట్లు ఇటీవల కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా అంగీకరించారు. -
మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్.. కారణం?
గూగుల్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని’ ఓ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీపై ఇచ్చిన వివాదాస్పద సమాధానం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో కేంద్రం గూగుల్‌కు నోటీసులు పంపింది. దీనిపై తాజాగా గూగుల్ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌ను ‘నమ్మదగినది కాదు’ అని పేర్కొంది. ఈమేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ ఆంగ్ల పత్రికకు ఈ విషయాన్ని తెలిపారు. ‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని గూగుల్‌కు చెందిన ‘జెమిని’ను ఇటీవల ఓ నెటిజన్ అడగ్గా.. మోదీ అవలంబించిన విధానాల వల్ల కొంత మంది ఆయనను ఫాసిస్టు అని పిలిచారని ఆ ఏఐ టూల్ వివాదాస్పద సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అడగ్గా స్పష్టంగా చెప్పలేమంటూ ఆచితూచి జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దీంతో ‘జెమిని’పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు. Forgot to tag @elonmusk. Hope his AI product will be better. https://t.co/Mo8iugmiKK — Arnab Ray (@greatbong) February 22, 2024 ఇదీ చదవండి: ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే.. ఈ వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగా స్పందించింది. గూగుల్‌కు నోటీసులిచ్చింది. దీనిపై గూగుల్ తన స్పందనగా క్షమాపణలు చెప్తూ.. తమ ప్లాట్‌ఫామ్‌ను ‘నమ్మదగినది కాదని’ పేర్కొన్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో ఏఐ ఉత్పత్తులను లాంచ్ చేయాలంటే సంబంధిత ఏఐ ప్లాట్‌ఫామ్స్ ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై గందరగోళం నెలకొంది. అయితే ఈ విషయంలో స్టార్టప్‌లకు మినహాయింపును ఇచ్చినట్లు మంత్రి వివరించారు. These are direct violations of Rule 3(1)(b) of Intermediary Rules (IT rules) of the IT act and violations of several provisions of the Criminal code. @GoogleAI @GoogleIndia @GoI_MeitY https://t.co/9Jk0flkamN — Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam) (@Rajeev_GoI) February 23, 2024 -
‘దిగిపోవాల్సిందే’.. సుందర్ పిచాయ్‌కు ‘జెమినీ’ గండం!
గూగుల్ (Google) తన బార్డ్ చాట్‌బాట్‌ని ఇటీవల జెమినీ (Gemini)గా పేరు మార్చింది. అట్టహాసంగా దీన్ని ప్రారంభించినప్పటికీ వరుస వైఫల్యాలు, వివాదాలతో ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యవహారం ఇప్పుడు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. జెమిని వివాదం నేపథ్యంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలగింపును ఎదుర్కోవాల్సి ఉంటుందని లేదా త్వరలో పదవీ విరమణ చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్టర్, హెలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా తెలిపారు. ఏఐ చాట్‌బాట్ జెమిని చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఒక యూజర్ తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు అరోరా మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నా అంచనా ప్రకారం ఆయన్ను (సుందర్ పిచాయ్) తొలగించాలి లేదా ఆయనే రాజీనామా చేయాలి. ఏఐ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి" అన్నారు. ఏంటీ జెమినీ? గూగుల్ ఇటీవల తన చాట్‌బాట్ బార్డ్‌ను జెమినీగా రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది. 230 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాలలో విస్తరించి ఉన్న 40 భాషలలో యూజర్లు ఇప్పుడు జెమిని ప్రో 1.0 మోడల్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చని టెక్ దిగ్గజం పేర్కొంది. వివాదాలు ప్రారంభించిన వారంలోపే జెమినీ ఏఐకి లింక్ చేసిన గూగుల్ కొత్త ఏఐ ఇమేజ్-జనరేటర్ చుట్టూ వివాదాలు తలెత్తాయి. ఏపీ నివేదిక ప్రకారం.. ఈ ఏఐ టూల్ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఫిబ్రవరి 23న గూగుల్ క్షమాపణ చెప్పింది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి చాట్‌బాట్ ఇమేజ్ జనరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజన్, ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో యూజర్లకు క్షమాపణలు తెలిపారు. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించిన ఒక ప్రశ్నకు జెమినీ ఇచ్చిన సమాధానాల్లో పక్షపాతం ఉందన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌కు నోటీసు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. My guess is he will be fired or resign- as he should. After being in the lead on AI he has completely failed on this and let others take over. — Samir Arora (@Iamsamirarora) February 25, 2024 -
ప్రధాని మోదీపై గూగుల్ ‘జెమిని’ వివాదాస్పద సమాధానం
న్యూఢిల్లీ: గూగుల్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని’ ఓ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీపై ఇచ్చిన వివాదాస్పద సమాధానం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో గూగుల్‌కు నోటీసులు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 3తో పాటు క్రిమినల్ చట్టాలనూ జెమిని ఏఐ ఉల్లంఘించిందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. మోదీ అవలంబించిన విధానాల వల్ల కొంత మంది ఆయనను ఫాసిస్టు అని పిలిచారని జెమిని ఏఐ వివాదాస్పద సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అడగ్గా స్పష్టంగా చెప్పలేమంటూ ఆచితూచి జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దీంతో ‘జెమిని’పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు. Forgot to tag @elonmusk. Hope his AI product will be better. https://t.co/Mo8iugmiKK — Arnab Ray (@greatbong) February 22, 2024 గతేడాది డిసెంబర్లో గూగుల్ ‘జెమిని’ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. కాగా, ఇటీవల దీని వినియోగంపై యూజర్లకు గూగుల్ కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్ ద్వారా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాను షేర్ చేయొద్దని సూచించింది. These are direct violations of Rule 3(1)(b) of Intermediary Rules (IT rules) of the IT act and violations of several provisions of the Criminal code. @GoogleAI @GoogleIndia @GoI_MeitY https://t.co/9Jk0flkamN — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) February 23, 2024 ఇదీ చదవండి.. రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన ట్వీట్ -
షాకింగ్ లేఆఫ్.. ఇంతకంటే దారుణమైన తొలగింపు ఉంటుందా?
Google shocking layoff: టెక్ పరిశ్రమలో ఇప్పుడు తొలగింపులు సాధారణంగా మారిపోతున్నాయి. అయితే గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్‌ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గూగుల్ తనను ఎంత దారుణంగా తొలగించిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ముందు యాక్సెస్ పోయింది.. తర్వాత మెసేజ్ జెమిని ఏఐ మోడల్ అల్గారిథమ్‌లపై పని చేసే తనను గూగుల్ తొలగించిన క్రమాన్ని అలెక్స్ కోహెన్ అనే ఉద్యోగి ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో షేర్ చేసిన పోస్ట్‌లో వివరించారు. "గూగుల్ నన్ను ఈ రోజు తొలగించిందని పంచుకోవడం విచారంగా ఉంది. జెమిని కోసం అల్గారిథమ్‌ల రూపకల్పనకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న నాకు ఈరోజు ఉన్నట్టుండి హ్యాంగ్అవుట్స్, గూగుల్ డ్రైవ్‌కు యాక్సెస్ పోయింది. ఆ తర్వాత నన్ను తొలగించినట్లు మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది" అని అలెక్స్ కోహెన్ వాపోయాడు. అయితే తాను 12 నెలల తొలగింపు పరిహారాన్ని (సుమారు రూ.22 కోట్లు ) అందుకుంటున్నానని, ఇది చేతికందిన తర్వాత తాను తదుపరి ఏమి చేయాలో నిర్ణయించుకుంటానని అలెక్స్ కోహెన్ తెలియజేశారు. అయితే గత 5 నెలల్లో ఎల్ఎల్ఎంల గురించి, ఏఐ గురించి ఎంతో నేర్చుకున్నానని, ఆ ప్రయాణం బాగుందని రాసుకొచ్చారు. కాగా ఇంతకుముందు గూగుల్ ఒకప్పుడు ఏఐ విభాగంతో ప్రత్యక్ష ప్రమేయం లేని 'సెర్చ్ టీమ్'లో భాగమైన ఒక ఉద్యోగికి జీతంలో 300 శాతం పెంపును అందించిందని పర్ప్లెక్సిటీ ఏఐ సీఈవో అరవింద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ "కఠినమైన ఎంపికలు" చేయాల్సిన అవసరం ఉన్నందున మరిన్ని ఉద్యోగాల కోతలు ఉంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. Sad to share that I was laid off from Google today. I was in charge of making the algorithms for Gemini as woke as possible. After complaints on Twitter surfaced today, I suddenly lost access to Hangouts and Google Drive, and my manager (he/him), texted me to let me know that i… — Alex Cohen (@anothercohen) February 22, 2024 -
సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని
ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఏఐ ద్వారా వచ్చే సమాచారంలో నిజం ఎంత? దాన్ని ఏ మేరకు నమ్మొచ్చు? మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో అది అందిస్తున్న సమాచారంలో నిజాలు కరవవుతున్నాయి. దాంతో ప్రజలు, జాతుల మధ్య అనిశ్చితులు ఎదురవుతున్నాయి. తాజాగా గూగుల్ జెమిని ఏఐ చారిత్రాత్మక పొరపాటు చేసినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. జెమిని ఏఐ టూల్‌ను పోప్‌కు సంబంధించిన ఫొటోలు కావాలని అడిగినపుడు నల్లజాతీయులు పోప్‌గా ఉన్న చిత్రాలను చూపించినట్లు తెలిసింది. కొన్నిసార్లు ముదురు చర్మంతో ఉన్న ఫొటోలను అందించినట్లు గుర్తించారు. దాంతో గూగుల్ జెమిని చారిత్రాత్మక పొరపాటు చేసినట్లయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో గూగుల్ మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సంఘటనపై జెమిని ఏఐ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ జాక్ క్రావ్జిక్ మాట్లాడుతూ గూగుల్ పక్షపాత ధోరణిని తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన కారణాలు తెలుసుకుని ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను రూపొందిస్తామన్నారు. ఘటనకు సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభిస్తామన్నారు. ఇదీ చదవండి: దేశం విడిచివెళ్లకుండా ప్రముఖ కంపెనీ సీఈఓకు ఈడీ నోటీసులు గూగుల్ జెమిని పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ మోడల్‌ను ఇటీవలే పరిచయం చేసింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలిపింది. జెమిని 1.0 వెర్షన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. జెమిని అల్ట్రా, జెమిని ప్రో, జెమిని నానో. ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్ డివైజ్‌ల వరకు అన్నింటిలో పనిచేస్తుందని గూగుల్ వివరించింది. -
Generative AI Battle: చాట్‌జీపీటీకి పోటీగా జెమినీ
భవిష్యత్తంతా కృత్రిమ మేధదే. ఇది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆ రంగంపై పట్టు బిగించేందుకు ఐటీ దిగ్గజాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఓపెన్ఏఐ యాజమాన్యంలోని చాట్‌జీపీటీ ప్రాజెక్టులో మెజారిటీ భాగస్వామి కావడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేసింది. గడచిన ఏడాది కాలంలో మరెన్నో ఏఐ మోడళ్లు తెరపైకి వచ్చినా ఓపెన్ ఏఐ తాలూకు జీపీటీ మోడళ్లతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి పోటీగా జెమినీ పేరుతో గూగుల్ తాజాగా కొత్త ఏఐ మోడల్‌ను ప్రకటించింది. దీనిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది... మొగ్గు జెమినీకే కనిపిస్తున్నా... అవడానికి చాట్‌జీపీటీ, జెమినీ రెండూ జెనరేటివ్ ఏఐ మోడళ్లే. ఇవి ఇన్పుట్ ట్రైనింగ్ డేటా తాలూకు ప్యాట్రన్ల ఆధారంగా పిక్చర్లు, పదాలు, ఇతర మీడియా వంటి కొత్త డేటాను కోరిన విధంగా జెనరేట్ చేస్తాయి. చాట్‌జీపీటీ ప్రధానంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం). ఇది టెక్స్ట్ జెనరేట్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే జీపీటీ ఆధారిత వెబ్ సంభాషణల యాప్‌గా కూడా పని చేస్తుంది. గూగుల్‌కు కూడా బార్డ్ పేరుతో ఇలాంటి యాప్ ఇప్పటికే ఉంది. ఇది గతంలో లాఎండీఏ లాంగ్వేజ్ మోడ్‌పై ఆధారపడేది. ఇప్పుడు జెమినీ కోసమని పీఏఎల్‌ఎం2 మోడ్‌గా దాన్ని అప్‌గ్రేడ్ చేస్తోంది గూగుల్. ఇది మల్టీ మోడల్ తరహా మోడల్ కావడమే చాట్‌జీపీటీతో పాటు ఇతర అన్ని ఏఐల కంటే జెమినీని ఇప్పుడు ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎందుకంటే ఇది మలి్టపుల్ ఇన్పుట్, ఔట్పుట్ మోడ్లతో నేరుగా పని చేయగలదు. అంతేగాక టెక్స్ట్, ఆడియో, వీడియోలను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ ఏఐ కూడా ఇలాంటి సామర్థ్యంతో కూడిన జీపీటీ–4 విజన్ మోడల్‌ను ప్రకటించినా అది జెమినీ మాదిరిగా పూర్తిస్థాయి మలీ్టమోడల్ కాదు. ఎందుకంటే ఇది ప్రధానంగా టెక్స్ట్ పైనే ఆధారపడుతుంది. ఉదాహరణకు ఆడియో ఇన్‌పుట్స్‌ను స్పీచ్ ఔట్పుట్గా మార్చేందుకు విష్పర్ అనే స్పీచ్ టు టెక్స్ట్ ఇన్పుట్ లెరి్నంగ్ మోడల్ సాయం తీసుకుంటుంది. ఇమేజీలను అందించాలన్నా అంతే. అది జెనరేట్ చేసే టెక్స్ట్ ప్రాంప్్టలను డాల్–ఈ2 అనే మరో డీప్ లెరి్నంగ్ మోడల్ ఇమేజీలుగా మారుస్తుంది. కానీ గూగుల్ మాత్రం జెమినీని ఇలా కాకుండా పూర్తిస్థాయి మల్టీ మోడల్ ఏఐగా తీర్చిదిద్దుతోంది. ఇతర లెరి్నంగ్ మోడళ్ల సాయంతో నిమిత్తం లేకుండా నేరుగా ఆడియో, ఇమేజీలు, వీడియో, టెక్స్ట్ వంటి ఇన్పుట్ టైప్లను అది తనంత తానే కావాల్సిన ఔట్పుట్లుగా మార్చేస్తుంది. జీపీటీ–4తో పోలిస్తే జెమినీ పనితీరు ఎలా ఉంటుందో ఇప్పటికి తెలియకపోయినా దాన్ని చాలా హెచ్చు సామర్థ్యంతో రూపొందిస్తున్నట్టు గూగుల్ ప్రకటించుకుంది. దానికిప్పటికే జెమినీ 1.0 అల్ట్రా అని కూడా పేరు పెట్టింది. ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షల్లో ఇది జీపీటీ–4 కంటే మిన్నగా తేలిందని చెబుతోంది కూడా. ఇందుకు రుజువుగా ఓ వీడియో కూడా విడుదల చేసింది. కాకపోతే అందులో చూపించిన టాస్‌్కలను రియల్‌టైమ్‌లో చేయడంలో జెమినీ ఏ మేరకు కృతకృత్యమవుతుందో చూడాల్సి ఉంది. అంతిమ లబ్ధి యూజర్లకే... ఈ సందేహాల మాట ఎలా ఉన్నా జెమినీ వంటి భారీ మలీ్టమోడల్ మోడళ్లు జెనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా టెక్స్ట్ ఆధారితమైన జీపీటీ–4 ఇప్పటికే ఏకంగా 500 బిలియన్ పదాలపై శిక్షణ పొందింది! అంటే, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన పదాలన్నీ దానికిప్పటికే చిరపరిచితమని చెప్పవచ్చు. ఇలాంటి ట్రైనింగ్ డేటాతో పాటు మోడల్ తాలూకు సంక్లిష్టత ఎంత ఎక్కువగా ఉంటే దాని పనితీరు అంత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఇలాంటి అన్ని రకాల డేటాను నేరుగా వాడగల జెమినీ వంటి ఏఐ మోడళ్లు మున్ముందు మరింత సామర్థ్యం సంతరించుకోవడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో దీనికి పోటీగా ఓపెన్ ఏఐ కూడా అప్‌గ్రేడెడ్ జీపీటీ–5 వెర్షన్‌పై ఇప్పటికే ముమ్మరంగా కృషి చేస్తోంది. ఈ నిరంతర పోటీ అంతిమంగా యూజర్లకే మరింత లబ్ధి చేకూరుస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘జెమిని సర్కస్’ శంకరన్ కన్నుమూత
కన్నూర్ (కేరళ): దేశంలో సర్కస్ ఇండస్ట్రీకి ఆద్యుల్లో ఒకరైన జెమిని శంకరన్ (99) ఇక లేరు. వయో సంబంధ రుగ్మతలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జంతువుల విన్యాసాలు, సాహస బృందాల ప్రదర్శనలతో తరాల పాటు ప్రేక్షకులకు వినోదం పంచిన జెమిని, జంబో సర్కస్ కంపెనీలు ఆయన స్థాపించినవే. 1924లో కేరళలోని కొలస్సెరీ గ్రామంలో పుట్టిన శంకరన్ సర్కస్ కళాకారుడిగా శిక్షణ పొందారు. సైన్యంలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రిటైరయ్యాక మళ్లీ సర్కస్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తాడుపై, ఐరన్ బార్‌పై నడవడంలో ప్రావీణ్యం సంపాదించారు. 1951లో విజయ్ సర్కస్ కంపెనీని కొనుగోలు చేసి జెమినిగా పేరు మార్చారు. నిపుణులతో, విదేశాల నుంచి తెప్పించిన జంతువులతో తీర్చిదిద్దారు. 1964లో రష్యా అంతర్జాతీయ సర్కస్ ఫెస్టివల్లో శంకరన్ సారథ్యంలోని భారత్ బృందం పాల్గొంది. -
కలల అలలపై... అలలు అలలుగా
అలలు అలలుగా తెరలు తెరలుగా తరగలు తరగలుగా ఎగిసిపడిన కెరటాలుగా నల్ల సముద్రం , నీలి సంద్రం ఎర్ర సముద్రం మొత్తంగా సప్త సముద్రాలు వాటి లోతు తెలిసేలా , వాటి ఆటుపోట్లను అర్థం చేసుకునేలా అన్నింటిని చుట్టేస్తూ ఆమె తన కలల ప్రయాణానికి సిద్ధమైంది. పాఠాలు చెప్పే ఆ పంతులమ్మ జీవిత చరమాంకంలో సముద్ర ఘోష వింటూ తన అనుభూతులకి అక్షరరూపమివ్వాలని ఆశపడుతోంది. హాయిగా మనవలు, మనవరాళ్లతో కాలం గడిపే వయసు. ఏ బాదర బందీ లేకుండా ఎవరో వండిపెడితే తింటూ కాలం గడిపే వయసు. అయినా ఆమెలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. సర్వస్వతంత్రంగా వ్యవహరించే ఆమె తనకున్న ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు. ఎం.వి.జెమిని అనే నౌకలో ప్రపంచ యాత్ర చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షరాన్ లేన్. ఇప్పుడు ఆమె వయసు 75 ఏళ్లు. హైస్కూలు రిటైర్డ్ టీచర్. చిన్నప్పట్నుంచి ప్రయాణాలంటే ఆమెకు చాలా ఇష్టం. అడ్వంచర్స్ అంటే చెప్పలేనంత థ్రిల్. స్కూల్లో విదేశీ భాషలు బోధించేవారు. స్కూలు పిల్లల్ని తీసుకొని యూరప్ దేశాలన్నీ చుట్టేసి వచ్చారు. అయినా ఆమెకు లైఫ్‌లో ఏదో అసంతృప్తి. ఇంకొన్ని దేశాలు తిరగాలి. అక్కడ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తెలుసుకోవాలి. సరికొత్త రుచులు చవి చూడాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. జీవితంలో అనుక్షణం కొత్తదనం కోసం పరితపించే లేన్‌కు ఎంవి.జెమిని అనే నౌక ప్రయాణం ఒక చుక్కానిలా కనిపించింది. ఈ నౌక ప్రపంచాన్ని చుట్టి వస్తుందని సన్నిహితులు చెబితే తెలుసుకున్నారు. ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా మూడేళ్లు నౌక ప్రయాణం. ఆ నౌకలో అత్యంత తక్కువ ధరకి లభించే ఒక చిన్న కేబిన్లాంటి గదికి ఏడాదికి 30 వేల డాలర్లు చెల్లించాలి. తన ఆస్తిపాస్తుల్ని అమ్మేస్తే మూడేళ్లకి సరిపడా డబ్బులు వచ్చేస్తాయని ఆ గది బుక్ చేసుకున్నారు. ఆ చిన్న గదికి కనీసం కిటికీ కూడా ఉండదు. కానీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. అదే మహద్భాగ్యంగా భావించారు. నవంబర్ 1 నుంచి ఈ నౌక ప్రయాణం ప్రారంభమవుతుంది. కూతురికి చెబితే ఏమంటుందోనని ఆమెకి మాట మాత్రంగానైనా చెప్పలేదు. గాలి, ఎండ సోకని ఆ గదిలో కేవలం రాత్రి పూట మాత్రమే గడిపి మిగిలిన సమయమంతా తనకెంతో ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ గడిపేస్తానని చెబుతున్నారు. నౌకలో తోటి ప్రయాణికులతో మాటలు కలపడం, కొత్త స్నేహితుల్ని చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టమే. మొత్తం మూడేళ్ల పాటు సాగే ప్రయాణంలో ఎంవి జెమిని నౌక 375 రేవు పట్టణాల్లో ఆగుతుంది. ఇండియా నుంచి చైనా, మాల్దీవ్స్, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాలు తిరుగుతుంది. ‘‘నాకున్న లక్ష్యం ఒక్కటే. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నా బ్లాగ్‌లో రాయాలి. కలం పేరుతో ఒక బ్లాగ్‌ను ఏర్పాటు చేసి అందులో నా అనుభవాలన్నీ కథలుగా రాస్తాను. ఎవరైనా నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది. పది మందిలో తిరిగితేనే జీవితంపై అవగాహన వస్తుంది. అందులోనూ సముద్రాన్ని చూస్తూ ప్రయాణమంటే అదో అవధుల్లేని అనుభూతి. ఇల్లంటే మన మనసుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమే కావొచ్చు. కానీ విమానమో, పడవో, రైలో ఏదో ఒకటి ఎక్కి బయట ప్రపంచాన్ని చూడండి. అదెంత అద్భుతంగా ఉంటుందో’’ అని లేన్ తన మనసులో మాట వెల్లడించారు. మూడేళ్లంటే తక్కువ కాలం ఏమీ కాదు. అందులోనూ కరోనా సోకిన తర్వాత ఆమె శ్వాసకోశ సంంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయినా కూడా ఆమె దేనికీ భయపడట్లేదు. ఇల్లు కంటే పడవే పదిలమంటున్నారు. తాను ప్రయాణించే పడవలో కూడా అనారోగ్యం వస్తే చికిత్స అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలా ఒంటరి ప్రయాణం ఆమెకు కొత్తేం కాదు. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇప్పుడీ ప్రయాణం ఆమెలో ఉత్సాహాన్ని నింపి వయసుని మరింత తగ్గించింది. మరి మనమూ లేన్‌కి హ్యాపీ జర్నీ చెప్పేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Yearly Horoscope: ఈ ఏడాది రాశి ఫలాలు.. పూర్తి వివరాలు
రాశి ఫలాలు- 2023.. పూర్తి వివరాలు మేషరాశి ఈ రాశిలో జన్మించి స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్ని ఆలోచనలు బలపడతాయి. సఖ్యతలేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలతో విసిగి పోతారు. ఆదాయ, వ్యయాలు ప్రధానాంశాలవుతాయి. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. శత్రువర్గంపైన విజయం సాధిస్తారు. విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితశాయాన్ని నెరవేర్చుకో గలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. పోటీపరీక్షలన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. ప్రతిరోజూ హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్ ఎగుమతి, దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలూ, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎటువంటి బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 1 వృషభ రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు చాలా బాగుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమాఖర్చులు, పద్దులు రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు. పూజలలో, శుభకార్యాలలో సుగంధసిద్ధగంధాక్షింతలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థికక్రమశిక్షణ బాగా పాటిస్తారు. పూజలలో హరిచందనం ఉపయోగించండి. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఋణాలు ఇవ్వడం తీసుకోవడం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1 మిధున రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింప చేసుకునే యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లచిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడక్కుండానే తమకు తాముగా సలహాలు, సూచనలు ఇచ్చే వారు అధికమవుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. పాతఋణాలను చాలా వరకు తీర్చి వేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ, సినీ, కళారంగాలలోని వారికి కాలం అనుకూంగా ఉంది. విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతికవిద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమావ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. అక్వారంగంలో, పౌల్ట్రీరంగంలో కలిసిరాదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలోలలో విజయం సాధిస్తారు. కళాసాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. ఆహారం విషయంలో నియమాలు పాటించండి. మీ సిద్ధాంతాలకు, అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ప్రయోజనాల పరిరక్షణ కోసం కొన్ని అమలు చేయమని మీ ఆత్మీయవర్గం ఒత్తిడి చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. పనిలో పనిగా మీ వైరీవర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. మీరంటే భయం, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు. ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4 కర్కాటక రాశి ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4 కర్కాటకరాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కార్యా లయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభవార్తాశ్రవణం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబధాలను మరింత బలపరచుకుంటారు. మీ సహాయసహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మీకు కోపం, ఆశ్చర్యం రెండూ కలుగుతాయి. ఏరు దాటి తెప్పను తగలేసే వ్యక్తులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు. మీ మనోవేదనకు కారణం అవుతారు. ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది. మెడిసిన్ సీటు వస్తుంది. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్ననం చేయండి (తలస్నానం చేయరాదు). పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. వైద్యవిద్య, సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటివన్నీ కూడా కలిసొస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లవ్సును అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్దికాలం ఆందోళనకు కారణం అవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థికపరిస్థితులు మెరుగుపడతాయి. చాలా శ్రమించి ఎన్నోబాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. సింహ రాశి ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంతమాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిష్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. కొంత ఆత్మనూన్యతాభావానికి లోనవుతారు. ఒక సందర్భంలో స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు, సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. ప్రతిరోజూ నుదుటన నాగసింధూరం ధరించండి. పనులలో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాలను కొనుగోలు చేస్తారు. రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థికపరిస్థితి ఓ దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు. కుటుంబంలోని వారి ఆరోగ్యవిషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. పలురంగాలలో మీరు చేసిన కృషికి, చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారపరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి. కన్యా రాశి ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 4; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతివిషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది, జాగ్రత్తలు వహించండి. వృత్తి, ఉద్యోగాలపరంగా బరువుబాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, శుభకార్యాలను నిర్నిఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. రాజకీయంగా కలిసివస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి–ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. పోటీపరీక్షలలో మీరుపడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది. అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. పూజలలో మరియు ఇంట్లో నాగబంధం అనే కుంకుమను ఉపయోగించండి. లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ మీకు అనుకూలంగా మారుతాయి. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. మొండివాళ్ళను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. తులారాశి ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. సమర్ధవంతమైన పనివారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు లాభపడగలుగుతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగి పోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు, వారిని ఎదుర్కొవలసిన పరిస్థితి ఉంటుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు, ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదస్పద విషయాలన్ని మధ్యవర్తుల సహాయసహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చు అని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడుతాయి. మీ తెలివితేటలతో, నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, మీ వ్యాపారాలు విస్తరణ చెందుతాయి. ఆరావళి కుంకుమ, లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధించినా, ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో కష్టించి ఉద్యోగం సాధిస్తారు. స్వయంశక్తితో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం కలుగుతుంది. క్రీడా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ఖచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది. వృశ్చిక రాశి ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫం ప్రతిపనిలోనూ ఎంతోకొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్రవేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుపుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోతుంది. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతంది. అడిగి అడగకుండానే ఋణాలు లభిస్తాయి. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. పేరుప్రఖ్యాతులు, దూరప్రాంతం నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమైన డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. సినీ,కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి. ధనుస్సు రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులేర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలు చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. జీవితశాయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతిప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలుపెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్‌ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లైవ్సు మొదలయినవి మొత్తం చేతికందివస్తాయి. స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దూరప్రాంతయత్నాలు, విదేశాలలో ఉద్యోగ, విద్య యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా, ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరము. తల్లిదండ్రులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. నిష్కారణమైన ఈర్షాద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు. అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. మకర రాశి ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అవుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ డబ్బుల ముందు ఎందుకూ కొరగానివని తెలుసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన విద్యా విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. కాంట్రాక్టులు, లీజులు మీకు లాభిస్తాయి. విద్యార్థినీవిద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. వృత్తి,ఉద్యోగాలపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. రావాల్సిన ధనం వసూలు అవుతుంది. అన్యభాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యను అభ్యసిస్తారు. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. ఐ.ఐ.టి, మెడిసిన్, సాంకేతికరంగం, సివిల్ సర్వీస్‌లు, గ్రూప్ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతివిషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేస్తారు. అయితే మానసిక సంతృప్తి ఉండదు. మీరు నిర్ణయం తీసుకుని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి సంతకం చేయండి. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా వుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కుంభ రాశి ఆదాయం 11; వ్యయం 2; రాజపూజ్యం 5; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. సమాజంలోని ఉన్నత స్థాయి వారితోటి స్నేహసంబంధాలను బలపరచుకుంటారు. ఒకానొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. దూరప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవలసి రావడం వంటి అంశాలు వత్తిడికి గురి చేస్తాయి. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సంతాన పురోగతిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. స్త్రీలతో విభేదాలు సంవత్సర ద్వితీయార్థంలో సమసిపోతాయి. పూజలలో, అభిషేకాలలో హరిచందనం ఉపయోగించండి. బంధువర్గంలో, సమాజంలో ప్రతిష్ఠ కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తారు. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి,ఉద్యోగాల పరంగా చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇందుకు సంబంధించి, అంతిమ నిర్ణయాలు చేసే అవకాశం లభించదు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు నామినేట్ అవడం రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. సౌకర్యవంతమైన వస్తువులను, అధునాతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఓ దారికి వస్తాయి. విలువైన వస్తువులను, గృహాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా నైరాశ్యం, నిరాశ, కోపం కలుగుతాయి. వీటిని అదుపులో ఉంచండి. తప్పక దైవానుగ్రహం లభిస్తుంది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. మీన రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గృహ, నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది. సంతానంనాకు నూతన అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. హనుమాన్ వత్తులును అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. కళా, సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పూజలలో ప్రథమతాంబూలాన్ని వాడండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ జ్ఞాపకశక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనస్సు కష్టపడటానికి ఈ జ్ఞాపకశక్తే కారణమవుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని, సౌకర్యాలని తగ్గించుకుంటారు. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థికభారం తేలికవుతుంది. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. -పంచాంగకర్త: శ్రీమతి ములుగు శివజ్యోతి (కీ.శే. శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి గారి కుమార్తె) సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023. -
మిథున రాశి ఫలాలు 2022-23
మృగశిర 3,4 పాదములు (కా, కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (భాగ్యం)లోను తదుపరి మీనం (రాజ్యం)లోనూ సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మళ్లీ జూలై 12 నుంచి 2023 జూలై 17 వరకు మకరం (అష్టమం)లోనూ మిగిలిన కాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (వ్యయం) కేతువు వృశ్చికం (షష్ఠం)లోనూ తదుపరి రాహువు మేషం (లాభం) కేతువు, తుల (పంచమం)లోను సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (వ్యయం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా గ్రహచారం అనుకూలిస్తుంది. గత కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ కాలంలో సమయం వృథా చేయకుండా కృషి చేసేవారు సత్ఫలితాలు అందుకుంటారు. వృథా కాలక్షేపం చేసేవారికి ఈ గ్రహచారం ఎంతో కొంత జ్ఞానాన్ని అందిస్తుంది. చతుష్పాద జంతువులు, ఆటోమొబైల్ వ్యాపారములు వృత్తులలో వున్నవారు, కులవృత్తిలో వున్నవారు ఈ సంవత్సరం చాలావరకు సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాలను తెలుసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో గతంలో చేసిన పొరపాట్లు గుర్తించి, వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అన్ని కోణాల్లోనూ పురోభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఆనందంగా ఉంటారు. రోజువారీ పనులు చక్కగా పూర్తవుతాయి. భోజన వస్తు అలంకరణ విషయాలలో చాలావరకు సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అన్ని సందర్భాల్లోనూ కుటుంబసభ్యులు ప్రోత్సాహం ఉంటుంది. భార్యాపుత్రుల విషయంలోను, కుటుంబంలోని పెద్దల అరోగ్య విషయంలోను అనుకూల స్థితి ఉంటుంది. బంధు సహకారం చాలా బాగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు సంవత్సరం అంతా పనివాళ్లతో ఇబ్బందులు ఉంటాయి. అయితే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. అధికారుల నుంచి సహకారం బాగా ఉంటుంది. అంతా అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఆరోగ్యపరంగా గత సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. అయితే ఎముకలు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి అనుకూలత తక్కువ. ఈ సంవత్సరం కొత్తకొత్త పరిచయాలు పెరుగుతాయి. ధర్మకార్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. గురు అనుగ్రహం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ఇబ్బందులు లేకుండా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగవంతమవుతాయి. స్నేహితులు, బంధువులు మంచి ప్రోత్సాహం ఇస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అంతా శుభసూచకమే. విద్యా నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలం. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు గురుబలం, రాహుబలం బాగా అనుకూలించి లాభం పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. మంచి సలహాలు సమయానికి అందుతాయి. గర్భిణిలు ఈ సంవత్సరం ఆగస్టు తరువాత ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. మృగశిర నక్షత్రం వారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. క్రమంగా కొన్ని సమస్యలు తీరుతున్నట్లుగా గోచరిస్తుంది. కానీ ఆగస్టు నుంచి 2023 జూన్ వరకు బహు జాగ్రత్తలు తీసుకుంటూ వుండవలసిన కాలం. ముఖ్యంగా వ్యవహార సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు వున్నాయి. వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళేందుకు సిద్ధపడండి. ఆరుద్ర నక్షత్రం వారికి అదృష్టం కలిసి వచ్చేలాగా కాలం గోచరిస్తోంది. అయితే అవరోధం లేకుండా ఏ పనీ పూర్తి అవ్వదు. తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అనే కోరికలు ఎక్కువ అవుతాయి. భార్యాపిల్లల ఆరోగ్యం, విద్య, వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. గత పొరపాట్లు ఇప్పుడు కనువిప్పునిస్తాయి. పునర్వసు నక్షత్రం వారు అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. సంతుష్టిగా భోజనం చేసే విషయంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. తరచుగా పుణ్య కార్యాలు చేస్తుంటారు. చతుష్పాద జంతువుల పెంపకం మీద ఆసక్తి వున్నవారికి, పాడి పరిశ్రమలో వున్నవారికి లాభదాయకంగా వుంటుంది. శాంతి : శనికి తరచుగా శాంతి చేయించడం. ఆగస్టు తరువాత కుజుడి శాంతి చేయించడం చాలా అవసరం. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ చేయడం ద్వారా తరచుగా శుభాలు జరుగుతాయి. ఏప్రిల్: ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతి పనీ శ్రమతో పూర్తవుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుజగ్రహ శాంతి అవసరం. ఆరోగ్య విషయంలో పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు అవసరం. మే: అంతా శుభసూచకంగా ఉంటుంది. వాక్పటిమతో అన్ని పనులూ సాధిస్తారు. కొన్ని సందర్భాలలో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. భార్యాపిల్లలు బాగా సహకరిస్తారు. కొత్త ఆలోచనలు ఈ నెలలో అమలులోకి వస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఋణ సౌకర్యం లభిస్తుంది. జూన్: తెలివితేటలు బాగా ప్రదర్శించి కార్యజయం సాధిస్తారు. అయితే పనులన్నీ శ్రమతో మాత్రమే పూర్తవుతాయి. చివరి వారంలో అనవసర కలహాలు వస్తుంటాయి. తరచుగా ఈ నెలలో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకలు సరదా కాలక్షేపాలతో కాలం గడుపుతారు. వాహన ప్రమాదం జరగకుండా చూసుకోండి. జూలై: మంచి ధైర్యం ప్రదర్శిస్తారు. మొదటి రెండు వారాలు ప్రయాణాల్లో చికాకులు ఎదురవుతాయి. మొత్తం మీద నెల రోజులు అనుకూల కాలమే. అన్ని పనులూ చివరి రెండు వారాల్లో తేలికగా పూర్తవుతాయి. కుటుంబసభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. స్నేహపూర్వక ధోరణితో పనులు పూర్తి చేసుకుంటారు. ఆగస్టు: ఇక్కడి నుంచి కుజుడు అధికకాలం యోగించని స్థానంలో సంచరిస్తారు. అయితే మిగిలిన గ్రహచారం అనుకూలత దృష్ట్యా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఆరోగ్య ఋణ వ్యవహారాలు సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్తలు పడాలి. రానున్న ఆరునెలలు వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి. సెప్టెంబర్: గతం కంటే కొంత మంచి మార్పులు ఈ నెలలో ద్వితీయార్ధంలో ఉంటాయి. అనవసర వ్యవహారాలను ముందుగా గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. నూతన వ్యవహారాలకు సానుకూలం కాదు. అక్టోబర్: బుధ శుక్రులు అనుకూలం అయినా, కుజ శని సంచారం వలన ఈ నెలలో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా స్నేహితులతో కలిసి ఏ వ్యవహారాలూ చేయకండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అవకాశం చూసుకొని ఋణ విషయాల్లో సెటిల్మెంట్ ధోరణిని అవలంబించండి. నవంబర్: కొద్దిరోజులు అనుకూలంగా కొద్ది రోజులు ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయి. తరచుగా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటారు. మీ ఉద్యోగ విధి నిర్వహణలో అధికారుల ఒత్తిడి పెరిగి క్రమంగా చివర్లో లాభిస్తుంది. పుణ్యకార్యాలపై దృష్టిపెడతారు. డిసెంబర్: ఉద్యోగ విషయంలో ఎవరిమీదా ఆధారపడవద్దు. వ్యాపారస్తులు ధైర్యంగా ఉంటారు. కానీ సంతృప్తికరంగా వ్యాపారం చేసే అవకాశం లేదు. తరచుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనం సర్దుబాటు కావడం కష్టమే. భోజనం వంటి రోజువారీ కార్యక్రమాలు సరిగా నడవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. జనవరి: ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటించవలసిన కాలం. ఎవరి మీదా ఆధారపడకూడని కాలం. మీ వ్యవహారాలు మిత్ర భేదానికి, బంధు వైరానికి తావివ్వకుండా చూసుకోండి. చివరి వారంలో కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. వృత్తి సౌఖ్యం తక్కువ అనే చెప్పాలి. ఫిబ్రవరి: ప్రధానంగా కుజ, రవి సంచారం ఫలితంగా 15వ తేదీలోగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో చికాకులు అధికంగా ఉంటాయి. తరువాత సాధారణ స్థాయిలో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక వనరులు బాగానే సమకూరతాయి. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్త అవసరం. మార్చి: ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రయాణాలు చేయండి. ప్రత్యేక ఇబ్బందులు ఉండవుగాని, జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. రోజువారీ కార్యక్రమాలు సైతం అకాలంలో పూర్తవుతాయి. వృత్తి విషయాలలో అందరితోనూ స్నేహంగా ఉండటం అలవరచుకోవాలి. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
వంట నూనెల ధరలు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల ధరలు తగ్గాయి. బ్రాండ్, నూనె రకాన్నిబట్టి గరిష్ట ధరపై 10–15 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం ప్రకటించింది. ధరలు సవరించిన కంపెనీల జాబితాలో అదానీ విల్మర్ (ఫార్చూన్ బ్రాండ్), రుచి సోయా (మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా), ఇమామీ (హెల్తీ అండ్ టేస్టీ), జెమిని (ఫ్రీడమ్), బాంజ్ (డాల్డా, గగన్, చంబల్ బ్రాండ్స్) వంటివి ఉన్నాయి. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా గత కొన్ని నెలలుగా దేశీయంగా వంట నూనెలు ప్రియం కావడం వినియోగదార్లతోపాటు ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అనేకసార్లు శుద్ధి, ముడి వంట నూనెల దిగుమతి సుంకాలను తగ్గించింది. సరఫరాను పెంచడానికి లైసెన్స్ లేకుండా శుద్ధి చేసిన పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 2022 వరకు వ్యాపారులను అనుమతించింది. ముడి పామాయిల్, కొన్ని ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలను ప్రారంభించడాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ నిషేధించింది. భారత్‌లో ఏటా 2.25 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో దిగుమతుల వాటా ఏకంగా 65 శాతం దాకా ఉంది. -
బాలయ్య ఫ్యాన్స్‌కు చేదు అనుభవం, థియేటర్లో అగ్ని ప్రమాదం
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు విడుదలై సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లని నందమూరి ఫ్యాన్స్‌తో ఫుల్ అయ్యాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల జై బాలయ్య అంటూ కేకలు, ఈళలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అఖండ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ థియేటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా ప్రేక్షకులు భయంతో పరుగులు తీసిన సంఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. చదవండి: ‘అఖండ’మూవీ రివ్యూ అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా థియేటర్లో పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది. షార్ట్ సర్క్యూట్‌తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు. -
శార్వరి నామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రతి విషయంలోనూ తోడబుట్టినవాళ్ళు, తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనాన్ని పక్కనపెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించాలి. ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి. ప్రతిరంగంలోనూ గట్టిపోటీ ఎదుర్కొంటారు. మీ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. విద్యాసంబంధమైన విషయాలలో రాణిస్తారు. ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. వంటి ఉన్నత పరీక్షలకు ఎంపికవుతారు. ఇతరత్రా పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్నా చిల్లరమల్లర తగాదాలు చికాకు కలిగిస్తాయి. కంబైండ్ స్టడీస్ వల్ల నష్టపోతామని గ్రహించి జాగ్రత్తపడతారు. మీ బంధువుల ఆస్తులకు సంబంధించి, పూర్వీకుల ఆస్తి పంపకాలకు సంబంధించి వ్రాసిన డాక్యుమెంట్లు అస్పష్టంగా ఉంటాయి. అవి విభేదాలకు దారితీస్తాయి. మీరు మధ్యవర్తిత్వం చేసి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచిస్తారు. ఇందువల్ల పరోక్షంగా మీరు లాభపడతారు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం, నష్టం లేకుండా బయటపడతారు. ఒకచోట నష్టపోయినా దైవానుగ్రహం వల్ల మరోచోట లాభపడతారు. సభలు, సమావేశాలు, బహిరంగ సభలు సర్వసాధారణం అవుతాయి. ఆదాయనికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశాలలో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా ఋణం కూడా మంజూరు అవుతుంది. ప్రభుత్వపరంగా రావలసిన రాయితీలు, సబ్సిడీలు, అధికార ధ్రువీకరణ పత్రాలు, మీకు సానుకూలపడతాయి. నూనె, లోహపు వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు కాలం మద్యస్థంగా ఉంది. కార్యాలయంలో మిమ్మల్ని ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రవేస్తారు. కానీ మీరు అందరి మనిషిగా ఆమోదించబడతారు. కష్ట సమయంలో ఒక స్త్రీ సహకారం లభిస్తుంది. అలంకార సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. నిల్వ ఉంచిన అపరాలు, ఆహారధాన్యాల వల్ల లాభపడతారు. సివిల్ కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రేమ వివాహం గురించి మీ అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి. విదేశాల నుండి వచ్చే ఆర్థిక సహాయం వల్ల మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి. సినీరగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఎంతోకాలంగా బరువుగా మారిన బాధ్యతలను దించుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన ఉంటుంది. ఇతరుల మీద మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయం తాలూకు సాక్ష్యాధారాలు మీ చేతికి లభిస్తాయి. రుద్రజడను ఉపయోగించండి. కోర్టుపరంగా వాయిదాపడుతూ వస్తున్న విషయాలు ఒక పరిష్కార దశకు వస్తాయి. చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి దూరప్రయాణాలు ఫలిస్తాయి. పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేయడానికి, బాగా చదివించడానికి నిర్ణయించుకుంటారు. అందుకు తగిన ధనం కోసం మీ సిద్ధాంతాలను మార్చుకుంటారు. భార్యవైపు బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని బాధ్యతల నుండి కొందరికి ఉద్వాసన చెబుతారు. నిర్మొహమాటంగా ప్రవర్తిస్తారు. మీ పరిశీలనలో కొన్ని ముఖ్యమైన రహస్యాలు తెలుసుకుంటారు. అవి వృత్తి ఉద్యోగాలపరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. దైవికం అనే పొడితో ధూపం వేయండి. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు. సోదరసోదరీ వర్గానికి సహాయం చేస్తారు. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలం అవుతాయి. ప్రతి విషయంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆత్మీయవర్గంతో కొద్దికాలం విభేదాలు చోటుచేసుకుంటాయి. పెద్దల, వృద్ధుల విషయాలలో మరింత శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకుంటారు. చెప్పుకోదగిన కారణాలు లేకపోయినా ఒకానొక సందర్భంలో వైరాగ్యం ఆవహిస్తుంది. వైరాగ్యంలో, నైరాశ్యంలో ఒక విధమైన అనుభూతిని పొందుతారు. మీ మనస్సుకు తగిలిన గాయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. మీ ఉద్ధేశ్యంలో అవినీతితో సమాజం మైలపడినప్పటికీ నిజాయితీగా ఉన్న మీలాంటి వాళ్ళకు ప్రశంసలు, చికాకులు వస్తాయి. యథార్థమైన ఈ సత్యాన్ని గ్రహించడానికి ఎంతగానో బాధపడతారు. వాస్తవాలు మింగుడుపడవు. ఈ సమస్యను ధర్మదేవతకే వదిలేస్తున్నానని నిర్ణయిస్తారు. వివాదస్పదమైన ఆస్తి కలిసొస్తుంది. వివాహాది, శుభకార్యాల విషయంలో మీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సర్దుకుపోతారు. మౌనం వహిస్తారు. దైవసంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో తీయని మాటలు చెప్పి మోసం చేసేవారు ఎదురవుతారు, జాగ్రత్త వహించండి. సంతానాన్ని విదేశాలలో చదువు కోసం పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకర్షణీయమైన స్కీముల వల్ల స్కీముల్లో చేరడం వల్ల, చీటీలు కట్టడం వల్ల నష్టపోతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. నిర్మొహమాటంగా మాట్లాడే మీ ధోరణి వల్ల ఇబ్బందులు వస్తాయి కొంతమంది దంపతుల దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. సర్వీస్‌లో వివాదస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండటానికి కొన్ని ప్రయోజనాలు వదులుకుంటారు. రియల్ ఎస్టేట్, ఆహారధాన్యాల వ్యాపారం, చేతివృత్తి పనివారికి, హోల్‌సేల్ వ్యాపారం చేసేవారికి, నిర్మాణరంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. మీ పేరుమీద కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అవివాహితులకు వివాహకాలం. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగస్వామీజీల వల్ల మోసపోతారు. మీరు స్వయంశక్తితో పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే చేయడం మంచిది. రహస్య చర్చలు, సంభాషణలతో కాలయాపన చేయడం మంచిదికాదు. ఇందువలన మానసిక ఆందోళన ఎక్కువై, మానసిక ప్రశాంతత తగ్గుతుంది. రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్త వహించండి. ఎన్నో అవకాశాలు మీకు కలిసివస్తాయి. ఏది మంచిదో ఎంచుకుంటే ఎక్కువ లాభపడతారు. జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఓర్పు, నేర్పు సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు. ప్రజాసంబంధాలు పెంచుకుంటారు. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ మొదలైన వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులను మెప్పించలేక ఇటు ఇంట్లో పోరు, బయటపోరు తట్టుకోలేక ఎవరినీ సంతృప్తిపరచలేరు. తల్లిదండ్రుల ప్రేమ సృష్టిలో ప్రతిజీవి ఆస్వాదిస్తుంది. మనోహరమైన తల్లిదండ్రుల ప్రేమ ముందు ప్రపంచం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అన్ని బంధాలకు అతీతమైనది మాతృప్రేమ. అటువంటి పవిత్రమైన సృష్టి సహజమైన ప్రేమను కొనుక్కోవలసి రావటం దురదృష్టానికి పరాకాష్ట. తల్లి విషం పెడితే ఆ విషయం నలుగురికీ చెప్పి రచ్చ చేయడం కన్నా ఆ విషం త్రాగటమే మంచిది. బాధాతప్త హదయంతో ఇలాంటివి ఎన్నో భరిస్తారు. అంటే ఇలాంటి స్థాయికి దిగజారిన సంఘటనలు ఎదురవుతాయి. మీ పేరును, మీ సంస్థ పేరును ఉపయోగించుకొని లాభపడే అవకాశవాదుల నిజస్వరూపం తెలుస్తుంది. ముఖ్యమైన విషయాలలో జీవితభాగస్వామితో విభేదాలు రావచ్చు. సంతానాన్ని గారాబం చేయటం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు మ్రింగుడుపడవు. పిల్లల విషయంలో ఒక ఆలోచన, దిగులు ఉంటుంది. కుటుంబంలో బంధువులలో అంతర్గత రాజకీయాలు చిరాకు కలిగిస్తాయి. మార్పురాని వ్యక్తులలో మార్పుతేవడానికి ఇక ప్రయత్నం చేయవద్దు. మీ వృత్తికి సంబంధించిన విషయాలు, ప్రయాణానికి సంబంధించిన వివరాలు, మీ రోజువారి వివరాలు గోప్యంగా ఉంచాలి లేనిపక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయిన నిర్మాణకార్యక్రమాలు, కాంట్రాక్టు వ్యవహారాలు పూర్తిచేస్తారు. మీ పనితీరును మెచ్చుకుంటారు. ముఖ్యమైన పత్రాలు లేక ప్రశంసాపత్రాలు వస్తాయి. ఇతరుల సహాయ సహకారాలతో శుభకార్యాలు పూర్తిచేస్తారు. ప్రతిచోట పోటీ, అనారోగ్యకర వాతావరణం, సహాయ నిరాకరణ మొదలైన ఈతిబాధలు అధిగమించి పనులను విజయవంతంగా చేసుకోగలుగుతారు. యజ్ఞభస్మాన్ని నుదుటన ధరించండి. కళా, సాహిత్య, సంగీతరంగాలలో సంతానాన్ని ప్రోత్సహిస్తారు. మీ ప్రోత్సాహానికి మంచి ఫలితాలు సంతానం సాధిస్తారు. -
వికారినామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు
మిథునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సప్తమంలో శని కేతువుల సంచారం, లగ్నంలో రాహుగ్రహ సంచారం, సప్తమ, అష్టమ స్థానాలలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితాశయం నెరవేరుతుంది. ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. వృత్తి ఉద్యోగాలలో సంయమనం, ఓర్పు చాలా అవసరం. ఆర్థిక స్థాయి పెరుగుతుంది, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త మార్గాలలో ఆర్థిక పురోగతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. అధికారం వస్తుంది. ప్రత్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సహోదర సహోదరీవర్గానికి అన్నివిధాలుగా అండగా ఉన్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంటారు. సంతానం మీ అభీష్టం మేరకు నడుచుకోక కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అనుకున్న వాటిని ఏదోరకంగా సాధిస్తారు. మీరు చేసే ఏ పనికీ ఇతరులు ప్రత్యామ్నాయం చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే మీ మేధస్సు, ఆలోచనలు, శ్రమ ఎక్కువకాలం దోచుకోబడతాయి లేక వెలుగులోకి రాకపోవడం జరుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కుల, మత వర్గాలకు అతీతంగా మీ ప్రవర్తన ఉంటుంది. స్త్రీల వలన అదృష్టం కలసి వస్తుంది. దాంపత్య జీవితంలో టీకప్పులో తుఫాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. చాలామందికి తండ్రివల్ల మేలు జరుగదు. మనస్సులో స్థానం కలిగిన రక్తసంబం«ధీకులొకరు శాశ్వతంగా దూరం కావడం తీవ్ర మనోవేదనకి కారణం అవుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా పిటిషన్లు, ఆకాశరామన్న ఫోన్లు చికాకు కలిగిస్తాయి. ప్రతిసారి మీ నిజాయితీ, సామర్థ్యాలను సాక్ష్యాలతో నిరూపించుకోవాల్సి వస్తుంది. చివరికి మొండి ధైర్యంతో, కోపంతో ఎదురు తిరుగుతారు. స్త్రీల సహాయ సహకారాలు అందుకుంటారు. సహోదర సహోదరీవర్గంతో సత్సంబంధాలు బలపడతాయి. ఆంతరంగిక కుటుంబ రాజకీయాలు, ఒకరంటే మరొకరికి గిట్టని స్థితి ఇబ్బంది కలిగిస్తుంది. సొంతవాళ్ల వలన మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. జల సంబంధిత, నూనె సంబంధిత, గ్రానైట్స్‌కు సంబంధించిన విషయాలు, లీజులు పొడగింపు వంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వపరంగా స్థాయిని ధ్రువీకరించే విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పన్నుల వసూలు చేసే అధికారులతో వాగ్వివాదాలు, న్యాయస్థానాలను ఆశ్రయించే స్థితి సంభవం. ప్రేమ వివాహాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలలో, ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు, విదేశీ వ్యవహారాలు, సబ్‌కాంట్రాక్టులు, రాజకీయ వ్యూహాలు లాభిస్తాయి. మీరు ఊహించని చోట ఆస్తుల విలువ పెరుగుతుంది. అమ్మకాల ఒప్పందాలు ఖరారు కానందుకు సంతోషిస్తారు. ఆర్థిక వ్యవహారాలపై పట్టుసాధిస్తారు. ఋణాలు తీరుస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన అంశాలు మీ జోక్యం వల్ల పరుగులు పెడతాయి. ధనం నీళ్ళ మాదిరి ఖర్చు అవుతుంది. అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా, వ్యక్తిగత కారణాల వల్ల వాటిని చేజార్చుకుంటారు. వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారం చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలపరంగా కృత్రిమ పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. మీ వల్ల ప్రయోజనం పొందినవారు మీపై కృతజ్ఞతా భావం కలిగి ఉండరు. సొంత మనుషుల ద్వారా ఆశించిన పనులు నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా మరొకరిని ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని సమస్యలు మానసిక ఆందోళనకు గురిచేస్తాయి. మీ సమస్యలను ఇంట్లోవాళ్ళతో చెప్పరు. బయట స్నేహితులకు చెప్పుకొని ఊరట చెందుతారు. రాజకీయ పదవి లభిస్తుంది. సంతానం వల్ల సమస్యలు అధికం అవుతాయి. చదువు, ఆరోగ్యం సమస్యలుగా మారుతాయి. ప్రేమ, పెళ్ళి వంటి వ్యవహారాలు చికాకుపరుస్తాయి. అవివాహితులకు వివాహకాలం. సంతానంలేని వారికి సంతానప్రాప్తి. రావలసిన పెండింగ్ బిల్స్ దారికి వస్తాయి. రాజకీయ మార్పులను అనుకూలంగా మలచుకోగులుగుతారు. మీ ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా కొన్ని బలహీనతలు మీకు దొరుకుతాయి. వాటిని ఉపయోగించుకోగులుగుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి, ప్రింటింగ్, స్టేషనరీ, అలంకార వస్తు సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వాములతో విభేదాలు ఏర్పడతాయి. కీలక సమయంలో ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి. జీవిత భాగస్వామితోను, ఆత్మీయులతోను కొద్దికాలం చికాకులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఈఎన్టీ సమస్యల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న స్త్రీల వల్ల మేలు కలుగుతుంది. దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. స్వల్పకాల పరిచితులే అపరిమిత సహాయం చేస్తారు. బాల్యమిత్రులు, చిరకాల పరిచితుల నిర్ణయాలు, సలహాలు అమలు చేసేముందు నిపుణుల సలహాలను తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్, స్విమ్మింగ్‌లలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు డాక్యుమెంట్స్‌పై చేసిన సంతకాలు వివాదస్పదం అవుతాయి. నూతన విద్యాకోర్సులను అభ్యసించాలనే కోరిక బలపడుతుంది. మీ శక్తిసామర్థ్యాలకు, నిపుణతకు అవార్డులు లభిస్తాయి. నీతినిజాయతీలతో విధి నిర్వహణ చేస్తున్న మీకు కొంతమంది అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రిటైర్ అయినవారికి వేరే చోట మంచి ఉద్యోగం లభిస్తుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది. రొటేషన్లు, లాభాలు బాగుుంటాయి. అధికారులకు శక్తికి మించిన లంచాలు ఇవ్వవలసిన పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. సినీ, బుల్లితెర, కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు మధ్యస్తంగా ఉన్నాయి. ఆత్మీయవర్గం అవసరాలకు మాత్రం ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ధనం సర్దుబాటు చేస్తారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. విశేషించి సాంకేతికవిద్యలో రాణిస్తారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. సంతాన పురోగతి ఆనందానికి కారణం అవుతుంది. పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవడానికి శ్రమించవలసి వస్తుంది. పిల్లల విషయమై జీవితభాగస్వామితో విభేదాలు వస్తాయి. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి, డిజైనింగ్ చేసేవారికి, ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవారికి అనుకూలంగా ఉంది. సీజనల్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసివస్తుంది. మీకు రావలసిన స్థిరచరాస్తులు కోర్టుద్వారా వస్తాయి. బంధువులతో వైరం ఏర్పడుతుంది. బానిసత్వపు సంప్రదాయాలను ప్రక్కనపెట్టి స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. వివాహం కానివారికి వివాహప్రాప్తి, సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. సాంకేతిక, కళారంగాలలో రాణిస్తారు. విదేశాలలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక, మనోహరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారి ఋణం తగినవిధంగా తీర్చుకుంటారు. విడిపోవాలనుకునే వ్యక్తులతో శాశ్వతంగా విడిపోతారు. చేయవలసిన మేలు చేసినా, నోటి దురుసుతనం వల్ల స్నేహితుల అభిమానాన్ని, రావలసిన ప్రయోజనాలని పోగొట్టుకుంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. బ్యూటీపార్లర్స్ నిర్వహణలో లాభాలు బాగుంటాయి. ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగం లభిస్తుంది. యాంకరింగ్ రంగంలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. సమాజంలో పరపతి కలిగినవారితో స్నేహం బలపడుతుంది. కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులు మీ శ్రమను, సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఎలర్జీ ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు సంబంధమైన సమస్యలు, మోకాళ్ళ నొప్పులు బాధించవచ్చు. కోరుకున్న రాజకీయపదవి లభిస్తుంది. స్వయంకృతాపరాధాల వలన నష్టపోయే అవకాశం ఉంది. పెద్దలతో విభేదాలు ఏర్పడతాయి. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి నిపుణులను సంప్రదిస్తారు. ప్రేమవివాహాలు ప్రధాన ప్రస్తావనాంశాలు అవుతాయి. రెండు నెలలు మానసిక అశాంతి ఏర్పడుతుంది. మీ మీద నిందారోపణలు నిజం కాదని నిరూపించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. దూరప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు, పిల్లలు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాలలో పెట్టుబడిగా పెడతారు. అన్నీ ఉన్నా అనుభవించలేక పోతున్నామనే భావన మిమ్మల్ని కలవరపరుస్తుంది. -
హాస్యప్రియులే !
మిథునం: ఆస్ట్రోఫన్డా రాశులలో మిథునం మూడోది. ఇది బేసి రాశి, క్రూర స్వభావం, వైశ్యజాతి, రంగు ఆకుపచ్చ, ఛాతీని సూచిస్తుంది. ద్విస్వభావ రాశి, పురుష రాశి, దీని దిశ పశ్చిమం. ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర నాలుగు పాదాలూ, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. అమెరికా, ఉత్తరాఫ్రికా, బెల్జియం, వేల్స్ ప్రాంతాలను సూచిస్తుంది. మిథున రాశిలో జన్మించిన వారు సున్నిత మనస్కులు, చురుకైన తెలివితేటలు, హాస్యప్రియులు, కించిత్ చాపల్యం గలవారు. కళాభిరుచి, వాక్చాతుర్యంతో ఇతరులను త్వరగా ఆకట్టుకుంటారు. వీరి ఆలోచనలకు, ఆచరణకు వ్యత్యాసం ఉంటుంది. ఒక పనిని మధ్యలోనే విడిచిపెట్టి మరో పనిని మొదలుబెడతారు. పలు విద్యలు, కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు సాధారణంగా సహనవంతులు. గొడవలకు దూరంగా ఉంటారు. క్లిష్టమైన వివాదాలను చాకచక్యంగా పరిష్కరించి, అందరి మెప్పు పొందగలరు. అపారమైన ఊహాశక్తి, సృజనాత్మకత, వాదనా పటిమ వీరి సొంతం. తరచు మార్పును కోరుకుంటారు. గ్రహగతులు అనుకూలంగా లేకుంటే, వీరు తమ తెలివి తేటలను వికృత ప్రయోజనాల కోసం వాడుకుంటారు. మితిమీరిన స్వార్థంతో మోసాలకు, ద్రోహాలకు, కుంభకోణాలకు పాల్పడేందుకు కూడా వెనుకాడరు. తరచు మాట మార్చే లక్షణం వల్ల నిందలకు గురవుతారు. స్థిరత్వం లేని చేష్టల వల్ల ఆత్మీయులు సైతం వీరి పట్ల సహనాన్ని కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి. (వచ్చేవారం కర్కాటక రాశి గురించి...) -
శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు
మేషం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 5.) వీరికి జూన్ 19 నుంచి చతుర్ధంలో గురుడు ఉచ్ఛస్థితి సంచారం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నా, క్రమేపీ పరిస్థితులు కొంత చక్కబడతాయి. నవంబర్ నుంచి అష్టమ శని ప్రారంభం. సప్తమ, అష్టమ రాశుల్లో శని సంచారం అంత అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యం కాగలదు. ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానం పాటించడం సర్వదా శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. తలచిన పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. ద్వితీయార్థంలో వాహన, గృహయోగాలు. వ్యాపార సంస్థల వారికి సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి. ద్వితీయార్థంలో పదోన్నతులతో పాటు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి తప్పదు. రాజకీయవర్గాలకు మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ద్వితీయార్థంలో పదవులు, సన్మానాలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కుజుడు, నవంబర్ నుంచి శని అష్టమస్థితి కారణంగా వ్యవహారాలలో చిక్కులు. వ్యయప్రయాసలు. చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. ఈ కాలంలో స్థానచలనాలు కలిగే అవకాశం. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదృష్ట సంఖ్య-9. వృషభం (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం -5.) వీరికి ప్రథమార్ధంలో గురు, శని, రాహువుల అనుకూల స్థితి ఉపకరిస్తుంది. వ్యయంలో కేతువు వల్ల మానసిక క్లేశాలు, వ్యయప్రయాసలు. ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారం కలిగినా శుభస్థితి వల్ల మధ్యస్థంగా ఉంటుంది. జూలై నుంచి పంచమ రాహువు, లాభస్థితిలో కేతువు అన్ని విధాలా అనుకూలురు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రథమార్థంలో రాబడి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులు చేరువ కాగలరు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చొరవ చూపుతారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే తొందరపాటు మాటల కారణంగా ఇంటాబయటా వివాదాలు నెలకొనే అవకాశముంది, ఆచితూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. భూసంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కళాకారులు నైపుణ్యాన్ని చాటుకుని ముందుకు సాగుతారు. రాజకీయవర్గాల వారు కొత్త పదవులు చేపట్టే వీలుంది. ప్రజాదరణ పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. సాంకేతిక వర్గాలవారికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. అక్టోబర్ - నవంబర్ మధ్య అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమ శని ప్రభావం వల్ల కొంత చికాకులు తప్పకపోవచ్చు. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించండి. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-6. మిథునం (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుబలం విశేషం. ప్రథమార్థంలో శని, రాహుకేతువులు అనుకూలురు. జూలై నుంచి అర్థాష్టమ రాహువు ప్రభావం కలిగినా గురుబలం ఉపకరిస్తుంది. మొత్తం మీద వీరికి ద్వితీయార్థం అనుకూల కాలమని చెప్పాలి. స్వతంత్రభావాలు, నిర్ణయాల వల్ల కొన్ని చిక్కులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఒక్కొక్కప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు జూన్ తర్వాత పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలాసవంత జీవనానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి మంచి గుర్తింపు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుని విజయాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు శుభసూచకాలే. పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. నవంబర్ - జనవరి మధ్య కుజుని అష్టమస్థితి సంచారం వల్ల ఈతిబాధలు, మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మకరరాశి కుజునికి ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యారాధన మంచిది. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, మాఘమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. కర్కాటకం (ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుడు స్వక్షేత్ర సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలం. జూలై నుంచి అర్థాష్టమ రాహువు, నవంబర్ 1 వరకు అర్థాష్టమ శని ప్రభావం అధికం. మొత్తం మీద వీరికి ఆదాయానికి లోటు లేకున్నా వృథా ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇంటాబయటా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మంచికి వెళ్లినా అపవాదులు భరించాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ద్వితీయార్థంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సాధించే వీలుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడే వీలుంది. అయితే, శని, రాహువుల ప్రభావంతో పాటు, జూలై -సెప్టెంబర్ మధ్య కుజుని అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా అవసరాలకు డబ్బు అందడం విశేషం. జనవరి - ఫిబ్రవరి మధ్య అష్టమ కుజుని ప్రభావం వల్ల చర్మ, ఉదర సంబంధిత రుగ్మత లు, తద్వారా ఔషధసేవనం. వ్యాపారులు స్వల్పలాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు పైస్థాయి నుంచి ఒత్తిళ్లులు ఎదురైనా సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు నైపుణ్యాన్ని చూపినా తగిన గుర్తింపు రావడం కష్టమే. రాజకీయవర్గాల వారు ద్వితీయార్థంలో కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం. శని, గురు, రాహువు, కుజులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య-2. సింహం (ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4.) వీరికి జూన్ వరకూ గురుడు యోగదాయకుడు. తదుపరి వ్యయస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సివస్తుంది. జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని యోగదాయకులు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలుఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. జీవిత భాగస్వామి సలహాల ద్వారా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ద్వితీయార్థం నుంచి గురుబలం తగ్గడం వల్ల కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులతో కూడిన బదిలీలు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారు జారవిడుచుకున్న అవకాశాలను తిరిగి పొందుతారు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. పదవీయోగం, సన్మానాలు. క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తా చాటుకుంటారు. నవంబర్ నుంచి శనికి అర్థాష్టమ స్థితి, సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఉదరం, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ కాలంలో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-1. కన్య (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 5, అవమానం - 4.) వీరికి జూన్ నుంచి గురుడు లాభస్థితి విశేషమైనది. నవంబర్ వరకూ ఏల్నాటిశని ఉన్నా గురుబలం వల్ల ప్రభావం తగ్గుతుంది. నవంబర్ నుంచి ఏల్నాటి శని పూర్తికాగలదు. జన్మరాశిలో జూలై వరకూ కుజుని స్తంభన వల్ల కొంత ఆందోళన, మానసిక అశాంతి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మధ్యమధ్యలో కొంత అవరోధాలు కలిగినా దేవగురుడు మీకు అన్ని విధాలా అనుకూలించడం వల్ల అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. పెండింగ్‌లోని కోర్టు కేసులు పరిష్కారమవుతాయ. స్థిరాస్తి వృద్ధి. జీవితాశయ సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిహసించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మొదట్లో కొంత వెనుకబడినా క్రమేపీ అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు సఫలమవుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దరిచేరి ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష ప్రజాదరణ. వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడలు, శాస్త్ర, సాంకేతిక వర్గాలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. తుల (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7) వీరికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ కుజుడు వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం ఊరట కలిగించే విషయం. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత, జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు ఎదురవుతాయి. చేసే కార్యాలలో ఏకాగ్రత లోపించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల నిర్ణయాలలోనూ ఆచితూచి అడుగు వేయడం సర్వదా శ్రేయస్కరం. బంధువులు, మిత్రుల నుంచి అపవాదులు, విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రధమార్థంలో గురుని భాగ్యస్థితి, తదుపరి దశమస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి, పైస్థాయి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు ద్వితీయార్థంలో కార్యజయం, శుభవార్తలు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలించే అవకాశం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా సాగడమే ఉత్తమం. రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు, ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద వీరికి సామాన్యమనే చెప్పాలి. శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పఠించండి. జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-6. వృశ్చికం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 7) వీరికి జూన్ 18వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల సంచారం అనుకూలం కాదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి వల్ల ఏల్నాటి శని ప్రభావం ఉన్నా జన్మరాశిపై గురుదృష్టి వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. జూన్ వరకూ కొంత ఆదుర్దా, మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆవాంతరాలు, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో మౌనం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. జూన్ నుంచి శుభకార్యాల నిర్వహణ. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. సమాజంలో మంచి గుర్తింపు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన లేదా ఆస్తి లాభాలు ఉంటాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమ పెరిగినా తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వారి కృషి కొంతమేరకు సఫలమవుతుంది. విద్యార్థుల కష్టం కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకున్న అవకాశాలు దక్కుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు, తిరిగి జనవరి - ఫిబ్రవరి మధ్య కుజ ప్రభావం వల్ల ఒత్తిడులు, అయినవారితో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వీరు శని, రాహు, గురు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-9. ధనుస్సు (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7) వీరికి జూన్ వరకు గురుడు సప్తమంలోనూ, తదుపరి అష్టమంలోనూ సంచరిస్తాడు. నవంబర్ వరకూ శని లాభస్థానంలో సంచారం. తదుపరి వ్యయస్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నుంచి వీరికి ఏల్నాటిశని ప్రారంభం. అయితే గురుడు అష్టమంలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం, వ్యయస్థితిలోని శనిని వీక్షించడం మంచిది. మొత్తం మీద శ్రమ కలిగినా కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ప్రథమార్థంలో వాహనాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది, తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగాలు, విశేష ప్రజాదరణ. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. క్రీ డాకారులు, శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నవంబర్ నుంచి ఏల్నాటిశని ప్రారంభం వల్ల కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. చేసే పనిలో ఏకాగ్రత లోపించడం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వీరు శని, గురులకు జపాదులు నిర్వహించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఉపకరిస్తుంది. చైత్ర, శ్రావణం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. మకరం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 3.) వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేష యోగకారులై ఉంటారు. మొత్తం మీద వీరికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తలచిన పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. పట్టుదలతో కార్యోన్ముఖులై ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాల వారికి చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. కళాకారులు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకుంటారు, పురస్కారాలు వంటివి పొందుతారు. విద్యార్థుల శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అవకాశాలు మెరుగుపడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలలో అవరోధాలు వంటి చికాకులు ఎదురవుతాయి. వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. కుంభం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3.) వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగకారకుడు. భాగ్యస్థానంలో శని, రాహువులు సామాన్యులు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రధమార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశయాలు సాధిస్తారు. శత్రువిజయం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాబడితో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. పంటల దిగుబడి పెరిగి రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయవర్గాలకు పద వులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలు గతం కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడారంగాల వారికి పూర్వవైభవం. అష్టమరాశిలో జూలై వరకూ కుజుడు, జూలై నుంచి రాహువు సంచారం అంత మంచిది కాదు. దీనివల్ల మానసిక ఆందోళన. చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఈ గ్రహాలకు పరిహారం చేయించుకుంటే మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. మీనం (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6.) వీరికి జూన్ నుంచి గురుడు విశేష యోగప్రదుడు కావడంతో పాటు, స్వక్షేత్రాన్ని వీక్షించడం శుభదాయకం. అష్టమ శని, రాహు ప్రభావం ఉన్నా గురుబలం వీరికి కొండంత అండగా ఉండడం శుభసూచికం. మొత్తం మీద వీరికి అనుకూలమనే చెప్పాలి. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. బంధువర్గం, జీవిత భాగస్వామి తరఫు వారితో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు, గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, వాహనయోగాలు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ద్వితీయార్థంలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పనిభారం మాత్రం తప్పదు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల వారు జూన్ నుంచి అభివృద్ధి పథంలో సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు కొంత వ్యతిరేకత ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. విజయాల కోసం శ్రమపడాలి. శాస్త్ర, న్యాయ, సాంకేతికరంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. జూలై -సెప్టెంబర్ మధ్య అష్టమంలో కుజ, శని కలయిక వల్ల ఈతిబాధలు, మానసిక ఆందోళన. జీవిత భాగస్వామితో విభేదాలు. చర్మ, గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. శనికి తైలాబిషేకం, సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మేలు. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. సర్వేజనా సుఖినోభవంతు... పుష్కరాలు... గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం-నర్మద, మిథునం-సరస్వతీ, కర్కాటకం-యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం-తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం-తుంగభద్ర, కుంభం-సింధు నది, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి. శూన్యమాసాలు - నిర్ణయాలు సూర్యుడు మీనరాశిలో ఉండే చైత్రం, మిథున రాశిలో ఉండే ఆషాఢం, కన్య యందు భాద్రపదం, ధనుస్సులో ఉన్నప్పుడు పుష్య మాసం శూన్య మాసములని అంటారు. ఈ శూన్య మాసాల్లో శుభకార్యాలు నిర్వర్తించరు. ఆయనములు ఆయనములు రెండు. సూర్యుడు (రవి) మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించునప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైన దిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది. -
చంద్రబింబం మార్చి 16 నుండి 22 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకర్షిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవితాశయం నెరవేరే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి మాట సహాయం అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు. పారిశ్రామికరంగం వారికి యోగవంతం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఒక ప్రకటన నిరుద్యోగులకు నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులు ఒత్తిడులకు లోనవుతారు. రాజకీయరంగం వారికి గందరగోళం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు, ఆహ్వానాలు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వాహనయోగం. భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమయం. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగయత్నాలలో నిరుద్యోగులకు విజయం. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయరంగం వారికి ప్రజాదరణ పెరుగుతుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికరంగం వారికి అనుకోని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఇంటాబయటా అనుకూల పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించినా పుంజుకుంటాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చే స్తారు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. అనుకోని ప్రయాణాలు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. హితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. పదోన్నతులు. రాజకీయరంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. -
చంద్రబింబం: మార్చి 9 నుండి 15 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. ఆరోగ్యపరమైన చికాకులు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి నిరుత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. విద్యార్థులకు కొంత నిరాశ. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యభంగం. రాజకీయరంగం వారికి నిరాశాజనకంగా ఉంటుంది. పాతబాకీలు వసూలవుతాయి. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) స్థిరాస్తి వృద్ధి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) పనులు సకాలంలో పూర్తి. శ్రమ ఫలించే సమయం. ఒక వ్యవహారంలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరం. పారిశ్రామికరంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకం. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. లాభాలు స్వల్పం. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. రాజకీయరంగం వారికి నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. వారం చివరిలో ధన, వస్తులాభాలు. వాహనయోగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కళారంగం వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. వారం ప్రారంభంలో శుభవార్తలు. సోదరుల నుంచి ధనలాభం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.చిరకాల కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులలో జాప్యం. బంధువులు, మిత్రులతో వైరం. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. సోదరుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యం. రాజకీయరంగం వారికి చికాకులు. వారం చివరిలో ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం : మార్చి 2 నుండి 8 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కళారంగం వారు అనుకోని అవకాశాలు పొందుతారు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) బంధువులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూములు, వాహనాలు కొంటారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయరంగం వారికి పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికరంగం వారికి ప్రభుత్వ సహాయం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక లావాదేవీలు కొంత మందగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యపరమైన చికాకులు కొంత తగ్గుతాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) కొత్త కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పాతబాకీలు అందుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) సన్నిహితులు సహకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు క్రమేపీ అనుకూలిస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వారం చివరిలో విందువినోదాలు. వాహనయోగం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆస్తుల విషయంలో సోదరుల నుంచి ఒత్తిడులు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో ముందడుగు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు