
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు విడుదలై సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లని నందమూరి ఫ్యాన్స్‌తో ఫుల్ అయ్యాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల జై బాలయ్య అంటూ కేకలు, ఈళలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అఖండ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ థియేటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా ప్రేక్షకులు భయంతో పరుగులు తీసిన సంఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది.
చదవండి: ‘అఖండ’మూవీ రివ్యూ
అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా థియేటర్లో పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది. షార్ట్ సర్క్యూట్‌తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment