Akhanda Movie
-
గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?
తమన్ పేరు చెప్పగానే దద్దరిల్లిపోయే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తాయి. పలు సినిమాల్ని తన సంగీతంతో ఓ రేంజులో ఎలివేట్ చేశాడు. వాటిలో 'అఖండ' ఒకటి. బాలకృష్ణ హీరో, బోయపాటి డైరెక్టర్ అయినా సరే ఈ మూవీ విషయంలో ఎక్కువ క్రెడిట్ తమన్దేనని ప్రేక్షకుల అభిప్రాయం. కానీ మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో తమన్ కష్టం ఏం లేదన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఆ కామెంట్స్‌పై స్వయంగా తమన్ పరోక్షంగా కౌంటర్ కామెంట్స్ చేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా 'స్కంద' మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఫైట్స్ తప్ప మరే విషయంలోనూ మెప్పించలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అఖండ'కి తమన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది కదా అని జర్నలిస్ట్ అడగ్గా.. 'ఆ సినిమాను ఆర్ఆర్ (రీరికార్టింగ్) లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది. అదే టైంలో ఆ పర్టిక్యులర్ కల్ట్ మీద తమన్ అద్భుతంగా చేయగలిగాడు' అని బోయపాటి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్) ఇలా బోయపాటి కామెంట్స్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే తమన్.. 'ఐ డోంట్ కేర్' అని ట్వీట్ వేశాడు. ఇది బోయపాటిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ అని అందరూ అనుకున్నారు. తాజాగా 'భగవంత్ కేసరి' సక్సెస్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన తమన్.. బాలకృష్ణ ముందే బోయపాటి పరువు తీసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'మంచి సీన్‌ని మనం చెడగొట్టం. మనం ఇంకా దాన్ని ఎలివేట్ చేయాలనే చూస్తాం. అక్కడ సీన్లో ఎమోషన్ లేకపోతే నేను ఏం చేసినా వర్కౌట్ కాదు. ఎవడి వల్ల అవ్వదు. చచ్చిన శవం తీసుకొచ్చి బతికించమంటే ఎలా? అంతే లాజిక్ ఇక్కడ. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంటారు గానీ అక్కడ మేటర్ లేకపోతే నేనేం చేయను. అక్కడ వాళ్లు(దర్శకులు) ఇవ్వాలి' అని తమన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతా చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) #Thaman Comments 🤷pic.twitter.com/XDDsBF6Zk3 — CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) October 25, 2023 -
రామ్ ఫ్యాన్స్‌కి డబల్ బోనాంజా
-
Maha Shivaratri 2023: థియేటర్స్‌లో మళ్లీ ఆ సూపర్ హిట్ మూవీస్..ఎక్కడ?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. హీరోల పుట్టినరోజు లేదా ఏదైన పండగ రోజు చూస్కొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణల సినిమాలు రీరిలీజై.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో స్పెషల్ డే వస్తే చాలు ఓల్డ్ సూపర్ హిట్ మూవీస్.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న కూడా చాలా సినిమాలు మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. శివరాత్రి రోజు రీరిలీజ్‌కు రెడీ అయిన స్టార్ హీరోల సినిమాలపై ఓలుక్కేద్దాం. పుష్ప ది రైజ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఉదయం 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు. అఖండ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టింది. ఇందులో అఘోరాగా బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12.15 నిమిషాలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్స్‌లో రాత్రి 11.49 గంటలకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. శివరాత్రి పురస్కరించుకొని ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15గంటలకు, అలాగే ఉదయం 3 గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేయనున్నారు. కాంతార చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే పేరుతో టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలై..ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి రోజు హైదరాబాద్‌లోని సప్తగిరి 70ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు ప్రదర్శంచనున్నారు. టెంపర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవి ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్‌ని కొత్త లుక్‌లో చూపించడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌లోని దేవి థియేటర్స్‌లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య థియేటర్స్‌లో అర్థరాత్రి 12.30 గంటలకు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు మహేశ్‌బాబు నటించిన సరిలేరే నీకెవ్వరు సినిమా కొత్తపేటలోని మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో శనివారం అర్థరాత్రి 11.59 గంటలకు, దూకుడు చిత్రం సుదర్శన్‌లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో ఉదయం 3 గంటలకు విడుదల కానుంది. -
మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలయ్య తన కుమారుడి వెండితెర ఆరంగ్రేటంపై తొలిసారి స్పందించారు. ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తారా అన్న వార్తలపై అంతా దైవ నిర్ణయం అని నవ్వుతూ అన్నారు. అఖండ సీక్వెల్‌పై బాలయ్య ఏమన్నారంటే.. బాలయ్య బ్లాక్‌బస్టర్ చిత్రం అఖండ. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని.. అధికారిక ప్రకటించడమే ఆలస్యమని అన్నారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌కు హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. కాగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. -
ఇఫీకి అంతా సిద్ధం
ఈ ఏడాది జరగనున్న ‘ది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ)కి రంగం సిద్ధం అయింది. 53వ ఇఫీ వేడుకలు గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. పన్నెండుమంది సభ్యులున్న జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 25 సినిమాలను, ఆరుగురు సభ్యుల జ్యూరీ నాన్ – ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 20 సినిమాలను ఎంపిక చేసింది. ఇండియన్ పనోరమ సెక్షన్ కింద ఈ 45 చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఇందులో పది హిందీ చిత్రాలు, ఐదు మరాఠీ చిత్రాలు, నాలుగేసి చొప్పన తెలుగు, తమిళ సినిమాలు, ఇంకా ఇతర భాషల చిత్రాలు ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం), బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, హిందీ నుంచి అడివి శేష్ ‘మేజర్’, అనుపమ్ ఖేర్ – పల్లవీ జోషి భాగమైన ‘ది కశ్మీరీ ఫైల్స్’, ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’ వంటివి ఉన్నాయి. నాన్–ఫీచర్ విభాగంలో ‘టాంగ్’, ‘రే– ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే’, ‘క్లింటన్ అండ్ ఫాతిమా’ వంటి సినిమాలు ఉన్నాయి. కాగా మెయిన్‌స్ట్రీమ్ సెక్షన్లో ‘ది కశ్మీరీ ఫైల్స్’ (హిందీ), ‘ఆర్ఆర్ఆర్’ (తెలుగు), ‘అఖండ’ (తెలుగు), ‘టానిక్’ (బెంగాలీ), ‘ధర్మవీర్: ముక్కమ్ పోస్ట్’ (మరాఠీ) చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ పనోరమ సెక్షన్లో తెలుగు చిత్రాలు ‘సినిమా బండి’ (దర్శకుడు కంద్రేగుల ప్రవీణ్), ‘ఖుదీరామ్ బోస్’ (దర్శకుడు విద్యాసాగర్ రాజు) ఉన్నాయి. -
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, మెయిన్ స్ట్రీమ్‌లో ఆర్ఆర్ఆర్, అఖండ చిత్రాలు
ఈ ఏడాది జరిగే గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఒకటి. తాజాగా ఈ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించే తేదీలు, ప్రదర్శించే సినిమా వివరాలను ఇండయన్ పనోరమా ప్రకటించింది. ఈ చిత్రోత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. 25 ఫిచర్స్ ఫిలింస్, 20 నాన్ ఫిచర్స్ ఫలింస్ను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. అందులో తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, ఆఖండ చిత్రాలకు గుర్తంపు లభించింది. మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కడం విశేషం. ఆర్ఆర్ఆర్, ఆఖండలతో పాటు బాలీవుడ్ మూవీ కాశ్మీర్ ఫైల్స్, టోనిక్(బెంగాలి చిత్రం) ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) సినిమాలను ఈ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో ప్రదర్శించనున్నారు. కాగా కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు. -
సైమా అవార్డు పోటీల్లో ‘పుష్ప’రాజ్ హవా.. బరిలో ఉన్న చిత్రాలివే
దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్). ఈ ఏడాది ఈ వేడుకను సెప్టెంబర్ 10,11 తేదీలలో బెంగళూరులో జరపనున్నారు. ఈ నేపథ్యంలో సైమా వేదికగా తలపడనున్న సినిమాల జాబితాను విడుదల చేశారు. తెలుగు నుంచి పుష్ప, అఖండ, జాతిరత్నాలు, ఉప్పెన చిత్రాలు ఎక్కువ విభాగాలలో నామినేట్ అయ్యాయి. తెలుగు నుంచి పుష్ప అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అవ్వడం గమనార్హం. తమిళ్ నుంచి ‘కర్ణన్(10)’, కన్నడ నుంచి ‘రాబర్డ్’, మలయాళం నుంచి ‘మిన్నల్ మురళీ’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ పొందాయి. ఈ మొత్తం నామినేషన్స్ నుంచి విన్నర్‌ను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసి అవార్డులు అందిస్తారు. ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులు, సాంకేతిక నిపుణులకు సైమా వెబ్‌సైట్‌కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. సైమా అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలివే.. టాలీవుడ్ పుష్ప(అల్లు అర్జున్) : 12 అఖండ(బాలకృష్ణ): 10 జాతిరత్నాలు(నవీన్ పొలిశెట్టి): 8 ఉప్పెన(వైష్ణవ్ తేజ్):8 కోలీవుడ్ కర్ణన్(ధనుష్): 10 డాక్టర్(శివ కార్తికేయన్): 9 మాస్టర్(విజయ్): 7 తలైవి(కంగనా రనౌత్): 7 మాలీవుడ్ మిన్నల్ మురళీ(టోవినో థామస్): 10 కురుప్(దుల్కర్ సల్మాన్):8 మాలిక్(ఫహద్ పాజిల్):6 జోజీ(ఫహద్ ఫాజిల్):6 శాండల్‌వుడ్ రాబర్ట్(దర్శన్):10 గరుడ గమన వృషభ వాహన(రాజ్ బి.శెట్టి): 8 యువరత్న(పునీత్ రాజ్‌కుమార్): 7 -
నందమూరి హీరోలను కాపాడుతున్న ‘చిట్టితల్లి’
అప్పుడప్పుడు సినిమా పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్లు అనేవి భలేగా వర్కౌట్ అవుతాయి. కావాలని ఫాలో అయినవి కాకపోయినా వాటి వల్ల వచ్చే ఫలితాలు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఇటీవలి కాలంలో నందమూరి హీరోలకు ‘పాప’ ఫ్యాక్టర్ అనేది ఆయా చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడానికి ఉపయోగపడిందనేది వాస్తవం. గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజైన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాలో బాలకృష్ణ కూతురిగా నటించిన పాప చుట్టే దర్శకుడు బోయపాటి శ్రీను సెకండ్ హాఫ్ మొత్తం కూడా నడిపించాడు.అలాగే సీక్వెల్ కి లింక్ కూడా అక్కడే ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొమురం భీమ్ క్యారెక్టర్ పోరాడేది చిన్నపాపైన మల్లి కోసమే.ఈ తాలూకు ఎమోషన్ రామ్ చరణ్ కన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యింది తారక్ క్యారెక్టర్ తోనే.తాజాగా రిలీజైన బింబిసార సినిమాలో చెడ్డవాడైన చక్రవర్తి తన చేతిలో మరణించిన పాప కోసం ప్రాయశ్చిత్తంగా వర్తమానంలో తన ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. ఇది దర్శకుడు వశిష్ట ప్రెజెంట్ చేసిన థీమ్ లో బలమైన పాయింట్ ఇదే. (చదవండి: సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్) అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసార చిత్రాలలో చైల్డ్ సెంటిమెంట్ ఇంత బ్రహ్మాండంగా వర్కౌట్ అవ్వడం స్పెషల్ అనే చెప్పాలి.ఇంకా అది కూడా కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ఈ మూడు హిట్ కావడం గమనార్హం. నందమూరి ఫ్యాన్స్ ఆనందం అయితే మాములుగా లేదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో సక్సెస్ లేక వెయిట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ రేంజ్ సక్సెస్ దక్కడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. బింబిసార 2 సినిమా కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ చిట్టితల్లిని కంటిన్యూ చేస్తారు. -
మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది
అనుకోకుండా యాక్టర్ అయ్యాను అన్న మాట తరచూ వింటూ ఉంటాం. అలాంటి కోవలోకే వస్తాడు అఖండ విలన్ గజేంద్ర సాహు అలియాస్ నితిన్ మెహతా. 21 ఏళ్లపాటు ఇండియన్ ఆర్మీకి సేవలందించిన ఆయన ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్నాడు. మరి ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఆయన సినిమాలవైపు ఎలా అడుగులేశాడు అన్నదాని గురించి తాజా ఇంటర్వ్యూలో స్పందించాడు. 'ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక నేను గడ్డం పెంచి కొత్త లుక్ ట్రై చేశాను. అలా అని సినిమాల్లోకి, మోడలింగ్‌లోకి రావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఓ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో ఓ ఫిలింమేకర్ కంటపడ్డాను. ఆ తర్వాత ఢిల్లీలో తొలిసారి మోడల్‌గా కనిపించాను. అనంతరం ఫ్యాషన్ వీక్స్‌లో పాల్గొనాలంటూ ఫోన్ వచ్చింది. అలా యాడ్స్‌లో, చివరికి సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ జర్నీ నాకు చాలా నచ్చింది. అనుకోకుండా ఈదారిలో పడ్డా ప్రయాణం మాత్రం బాగుంది. అఖండ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణగారితో పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఆయనతో పని చేసినప్పుడు ఈ ఇండస్ట్రీకి నేను కొత్తవాడిని అన్న ఫీలింగే రానీయలేదు. ప్రతికూల పాత్రల్లో నటించడం బాగుంది. అది ఓ రకమైన కిక్ ఇస్తోంది. దక్షిణాది సినిమాలు బాగుంటాయి. నేను సినిమాల్లోకి రావడానికి ముందే తెలుగు మూవీస్ చూసేవాడిని. మున్ముందు కూడా విలన్ పాత్రలు చేయాలనుంది. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలతో స్క్రీన్‌పై తన్నులు తినాలనుంది. ఇతర దక్షిణాది భాషల్లోనూ నటించాలనుంది. ప్రస్తుతానికైతే రావణాసుర, స్పై మూవీస్ చేస్తున్నాను. అలాగే ఓ తమిళ చిత్రం కూడా చేస్తున్నా' అని తెలిపాడు నితిన్ మెహతా. చదవండి: హీరో విక్రమ్‌కు గుండెపోటు రామ్ చరణ్ చేతులమీదుగా 'పరంపర 2' ట్రైలర్.. -
'అఖండ' నటుడు చలపతి చౌదరి కన్నుమూత
ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి (67) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయ్‌చూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న పలువురు సెలబ్రిటీలు చలపతి చౌదరికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా విజయవాడకు చెందిన చౌదరి రాయ్‌చూర్‌లో స్థిరపడ్డారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి, శివరాజ్ కుమార్, బాలకృష్ణ వంటి పలు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లోనూ కనిపించారు. ఇటీవల ఆయన నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రంలోనూ కనిపించి మెప్పించారు. చదవండి 👇 జీవిత నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: నిర్మాతలు ఫైర్ ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ -
బోయపాటితో మరో మూవీ.. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య!
టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ ఉండవచ్చు. కాని బోయపాటి, బాలయ్య కాంబోకు తిరుగులేదు. సింహా, లెజెండ్,అఖండ తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని బ్లాక్ బస్టర్స్. బీసీ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ అందించిన మూవీస్. అందుకే ఈ కాంబో మళ్లీ రిపీట్ బాగుంటుందని టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం బోయపాటి కూడా అదే పనిలో ఉన్నాడని సమాచారం. (చదవండి: 40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేశాను: చిరంజీవి) బాలయ్య, బోయపాటి సినిమా అనగానే అందరూ అఖండ -2 ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని ఓ రియాలిటీ షోలో ఆల్రెడీ బోయపాటి స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశాడు. కాని బాలయ్య అక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. బోయపాటితో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే లెజెండ్ రేంజ్ లో పొలిటికల్ స్టోరీ ఉండాలి అంటున్నాడట. అందుకు బోయపాటి కూడా సరే అన్నాడని సమాచారం. ప్రస్తుతం బోయపాటి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ కమిట్ అయ్యాడు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.మరో వైపు బాలయ్య కూడా గోపీచంద్ మలినేని మేకింగ్ లో నటిస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి సినిమా సెట్లో అడుగుపెట్టాలనుకుంటున్నాడట బాలయ్య. ఆ లోపు బోయపాటి ఓ పవర్ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ రెడీ చేయాల్సి ఉంటుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అఖండ హీరోయిన్‌తో బాలయ్య ‘దబిడి దిబిడి’.. వైరల్ వీడియో
‘అఖండ’ మూవీతో నందమూరి బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. బాలయ్య కెరీర్లో వంద కోట్ల వసూళ్ళను సాధించిన తొలి చిత్రంగా ‘అఖండ’ నిలిచింది. ఇండియా మొత్తంగా రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాతికి ముందే రిలీజ్ అయిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లో ఇప్పటికీ ఈ మూవీ షో వేస్తున్నారంటే అఖండ క్రేజ్ ఎల ఉందో అర్థమవుతోంది. చదవండి: హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు, రూ. 15 కోట్ల డిపాజిట్‌కు ఆదేశం ఈ నేపథ్యంలో ఈ మూవీ 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అఖండ టీం 100 రోజుల వేడుకను ‘కృతజ్ఞత సభ’ పేరుతో కర్నూల్ ఎస్టీబీసీ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ టీం అంతా బస్సులో కర్నూలు బయలుదేరిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో బాలకృష్ణ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ను భయపెట్టిస్తూ ఫ్యాన్స్ పట్ల కృతజ్ఞత చూపించిన తీరు ఆసక్తిగా ఉంది. చదవండి: సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్ కాగా ఈ వీడియోలో బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్‌ను పిలిచి.. ‘ప్రగ్యా ఇప్పుడే బాగా విశ్రాంతి తీసుకో.. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రాయలసీమ. అక్కడ జనం అభిమాన్ని తట్టుకోలేవ్.. దబిడి దిబిడియే’ అంటూ ఆటపట్టించాడు. ఇందులో బాలయ్య తీరును చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యాజెస్వాల్తో పాటు నటి పూర్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, మిగత మూవీ క్రూడ్ ఉన్నారు. View this post on Instagram A post shared by Telugu FilmNagar (@telugufilmnagar) -
Akhanda 100 Days Function: కర్నూలులో అఖండ 100 రోజులు వేడుక (ఫొటోలు)
-
Shankar Mahadevan: బ్రీత్లెస్ సింగర్
-
Shankar Mahadevan: భం...భం అఖండ అంటూ ఖంగున మోగే కంఠం ఆయన సొంతం
ఆయన పాట వింటే తనువు పరవసిస్తుంది. మనసు పులకరిస్తుంది. గుండె సంబరపడుతోంది. ఆయనే భారతీయ సంగీత స్వరకర్త శంకర్ మహదేవన్. ఆకాశం అమ్మాయితే లాంటి రొమాంటిక్ పాట అయిన ,మహాప్రాణ గీతం అనే భక్తిరస పాట అయిన , కొడితే కొట్టాలిరా అని మాస్ సాంగ్ అయిన ఆయన గాత్రంతో కొత్త అందం తీసుకొస్తాడు.ఆయన పాడిన బ్రీత్లెస్ ట్రాక్ అప్పడు, ఇప్పడూ సూపర్‌హిట్టే. నేడు ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ జర్నీపై ఓ లుక్కేద్దాం 1967 మార్చి 3న ముంబైలో పుట్టి పెరిగాడు శంకర్ మహదేవన్. బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. ఐదేళ్ల వయసులోనే వీణ వాయించటం ప్రారంభించాడు. మరాఠీ సంగీత స్వరకర్తగా పేరు పొందిన పండిట్ శ్రీనివాస్ ఖలే మార్గదర్శకత్వంలో సంగీతాన్ని అభ్యసించాడు. చదువు పూర్తి అయిన తరువాత కొన్నాళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేశాడు. అలా కొంతకాలం పని చెసిన తర్వాత సంగీతం రంగంలోకి అడుగుపెట్టాడు. ప్లేబ్యాక్ సింగర్‌గా ఒక తమిళ చిత్రంలో తొలి అవార్డును సాధించాడు. ఎఆర్. రెహమాన్ తో కలసి పాడిన పాట ఆయనకు జాతీయ చలన చిత్ర అవార్డు తెచ్చిపెట్టింది. 1998లో మహదేవన్ నిర్మించి పాడిన బ్రీత్లెస్ ఆల్బమ్ పెద్ద సంచలనం. ఆ తర్వాత ఆయన వరసగా సినిమాలకి మ్యూజిక్ అందించడం, అలాగే పాటలు పాడటం మొదలెట్టాడు. ఇక తెలుగులో ఆయన పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా లో చంద్రుడిలో ఉండే కుందేలు పాట , అత్తారింటికి దారేది లో అమ్మో బాపుగారి బొమ్మో పాట, మొన్నటి అఖండ టైటిల్ సాంగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలుగు వాడు కాకపోయినప్పటికీ.. కఠినమైన పదాలను సైతం చాలా అలవోకగా పాడేయడం ఆయన స్పెషల్. తెలుగులో శంకర్ మహదేవన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన ఏకైక సినిమా సిద్దార్ధ నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ఇక హిందీలో ఆయన సంగీతం అందించిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుక్కతిప్పుకోకుండా, ఊపిరి బిగబట్టి పాటలు పాడి శ్రోతల్ని మంత్రముగ్థుల్ని చేసే ప్రతిభ అతని సొంతం. అందరుకే సినీ సంగీత ప్రపంచంలో శంకర్ మహదేవన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన ఫ్యాన్స్ ఆనంద పారవశ్యంలో మునిగి తేలతారు. ఇక అవార్డుల విషయానికొస్తే.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు. నాగార్జున హీరోగా నటించిన శిరిడి సాయిలోని ఒక్కడే దేవుడు పాటకు గానును నంది అవార్డు వచ్చింది. అలాగే 2019 లో ఆయన సంగీతానికి చేసినా సేవకి గాను పద్మ శ్రీ తో ప్రభుత్వం సత్కరించింది. -
బన్నిని ఫాలో అవుతున్న బాలయ్య.. బోయపాటిపై ఒత్తిడి!
కొద్ది రోజులుగా బాలయ్య జోరు పెంచాడు.అభిమానులు కోరుకున్న విధంగా ట్రెండింగ్ లో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఓటీటీ వరకు వచ్చి టాక్ షో చేశాడు.ఇప్పుడు ఇదే స్పీడ్ లో తాను నటించిన బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ తెరకెక్కాలని పట్టుబడుతున్నాడట.గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం.. చాలా కాలం తర్వాత బాలయ్యకు భారీ బ్లాక్ బస్టర్‌ను అందించింది.సింహా, లెజెండ్ చిత్రాలను మించి వసూళ్లను కొల్లగొట్టింది.ఇటు థియేటర్స్ లోనూ, అటు ఓటీటీలో దుమ్మురేపింది.అందుకే ఇప్పుడు ఇమిడియెట్ గా సీక్వెల్ తెరకెక్కాలి అంటున్నాడట. అందుకోసం దర్శకుడు బోయపాటి పై ఒత్తిడి తీసుకొస్తున్నాడట. అఖండ తర్వాత బన్నితో బోయపాటి మూవీ చేయాల్సి ఉండగా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రాజెక్ట్ లో బిజీ అయ్యాడు.దాంతో బోయపాటి ఇమిడియెట్ గా రామ్ తో మూవీ లాక్ చేసుకున్నాడు.ఎనర్జిటిక్ స్టార్ తో కలసి ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు.ఇటీవలే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.అయితే రామ్ తో మూవీ తర్వాత బోయపాటి అఖండ2 పై ఫోకస్ పెట్టనున్నాడట.అఖండ 2 స్టోరీ లైన్ కు సంబంధించినలీడ్ ను మొదటి భాగం క్లైమాక్స్ లో చెప్పకనే చెప్పాడు బోయపాటి.పైగా అందుకు తగ్గ స్టోరీ కూడా రెడీగా ఉందని అన్ స్టాపబుల్ షోలో చెప్పాడు. అందుకే రామ్ తో మూవీ కంప్లీట్ కాగానే అఖండ 2 పట్టాలెక్కించాలనుకుంటున్నాడట.పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.వేడి తగ్గకముందే పార్ట్ 2 రిలీజ్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలనుకుంటున్నాడు బన్ని. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను బాలయ్య అండ్ బోయపాటి ఫాలో కావాలనుకుంటున్నారు. అన్ని కుదిరితే 2023 అఖండ పార్ట్ 2 పట్టాలెక్కనుంది. -
హీరో కన్నా 'అఖండ' డైరెక్టర్‌కే ఎక్కువ రెమ్యునరేషన్!
తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవలే నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి 'అఖండ' ద్వారా మరో సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడీ డైరెక్టర్. 50 రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డులను తిరగరాసిందీ మూవీ. ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అఖండ' సినిమాతో బోయపాటి రేంజ్ పెరిగింది. దీంతో హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట! అఖండ సీక్వెల్ తీసేందుకు బోయపాటి సిద్ధంగా ఉన్నాడు. కానీ బాలయ్య బిజీ షెడ్యూల్లో ఉండటంతో ప్రస్తుతం వేరే సినిమాను పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో మాస్ మూవీ చేసేందుకు మంచి కథ సిద్ధం చేసుకున్నాడట ఈ డైరెక్టర్. ఇక్కడ ట్విస్టేంటంటే.. హీరో రామ్ కన్నా దర్శకుడు బోయపాటి శ్రీను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ హీరో రామ్ 9 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంటే అఖండ డైరెక్టర్ బోయపాటి దానికి మరో మూడు కోట్లు జత చేసి మొత్తంగా రూ. 12 కోట్లు అందుకోనున్నాడట. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. -
మళ్లీ ప్రారంభంకానున్న అఖండ జాతర..
నందమూరి నటసింహం బాలకృష్ణ మాసీవ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన చిత్రం 'అఖండ'. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతేడాది విడుదలై అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ఒకరకంగా చెప్పాలంటే థియేటర్లలో అఖండ జాతర జరిగింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో రిలీజై అక్కడ కూడా 'బోత్ ఆర్ సేమ్' అన్న రేంజ్లో వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ జోరును కోలీవుడ్‌లో చూపెట్టనుంది అఖండ. ఈ యాక్షన్ డ్రామా చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. జనవరి 28న ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్దగా ఏ సినిమా రిలీజ్లు లేకపోవడంతో ఈ సూపర్ హిట్ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనుందని టాక్. -
అఖండ మేకింగ్ వీడియో, సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారా?
నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ. డిసెంబర్ 2న ఒంటరిగా బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తూ చరిత్ర సృష్టించింది. కరోనా వల్ల పెద్దగా కలెక్షన్లు రావేమో అనుకున్న విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచివేస్తూ ఏకంగా రూ.200 కోట్ల(నాన్ థియేట్రికల్ బిజినెస్‌తో కలిపి) వసూళ్లు సాధించింది. జనవరి 21న అఖండ హాట్‌స్టార్‌లో ల్యాండ్ అవగా ఓటీటీలో కూడా తిరుగులేదనిపించుకుంటోందీ చిత్రం. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తొలి 24 గంటల్లోనే ఈ సినిమాను 10 లక్షల మంది వీక్షించారట. ఇది ఓటీటీ చరిత్రలోనే ఒక రికార్డని తెలుస్తోంది. ఈ సందర్భంగా హాట్ స్టార్ అఖండ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య కష్టాన్ని, టెక్నీషియన్ల శ్రమను, బోయపాటి డెడికేషన్‌ను చూడొచ్చు. అలాగే కెమెరాలు ఆఫ్‌లో ఉన్నప్పుడు బోయపాటి, బాలయ్యల సరదాగా కబుర్లాడినట్లు కనిపిస్తోంది. బాలయ్య త్రిశూలంతో చేసిన కొన్ని ఫైట్ సీన్లను డైరెక్టర్ ఎలా దగ్గరుండి చేయించారో కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఈ మేకింగ్ వీడియోను మీరూ ఓ సారి చూసేయండి.. -
ఓటీటీలోనూ దూసుకెళ్తున్న ‘అఖండ’.. తొలిరోజే రికార్డు నమోదు
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హైట్రిక్ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఓటీటీలో విడుదలైన ‘అఖండ’.. అక్కడ కూడా రికార్డు క్రియేట్ చేసింది. జనవరి 21 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హార్ట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ.. తొలి 24 గంటల్లోనే 10 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఇది ఓటీటీ చరిత్రలో ఓ రికార్డు అని చెప్పొచ్చు. ఓటీటీలో భారీ ఓపెనింగ్స్ రావడంతో పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ‘థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ‘అఖండ’.. ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఈ వేదిక ద్వారా మరింత మంది సినీ అభిమానులకు మా చిత్రం వీక్షించడం పట్ల సంతోషంగా ఉంది ’ అన్నారు బాలకృష్ణ. కోవిడ్ కారణంగా థియేటర్స్‌లో చూడలేకపోయిన వారంతా.. ఓటీటీలో ‘అఖండ’ చిత్రం వీక్షించి ఆస్వాదించండి’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. -
రామ్ చరణ్-శంకర్ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది: శ్రీకాంత్
విలన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా మారాడు శ్రీకాంత్. కొన్నాళ్ల పాటు హీరోగా పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. మరోవైపు సపోర్టింగ్ యాక్టర్‌గానూ రాణించాడు. ఇక బోయపాటి, బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’తో మళ్లీ విలన్‌గా మారాడు శ్రీకాంత్. ఈ సినిమాలో మైనింగ్ మాఫియా లీడర్ వరదరాజులుగా శ్రీకాంత్ విలనిజానికి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖండ గురించి, వరదరాజులు పాత్ర గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘సరైనోడు సినిమాలో నటిస్తున్న సమయంలోనే బోయపాటి శ్రీను నన్ను పిలిచి విలన్ క్యారెక్టర్లో నటిస్తారా అని అడిగారు. దానికి నేను ఓకే చెప్పా. అయితే అప్పటి వరకు చిన్న చిన్న సినిమాల్లో నటించొద్దని చెప్పారు. యుద్ధం శరణం సినిమాలో విలన్‌గా చేశాను. అది చాలా మంచి సినిమా.. కానీ విజయం సాధించలేదు. ఆ తర్వాత విలన్ పాత్రలు వచ్చినా.. నేను ఒప్పుకోలేదు. బోయపాటి పిలిచి వరదరాజులు క్యారెక్టర్ గురించి చెప్పారు. అది నాకే కొత్తగా అనిపించింది. కచ్చితంగా నాకు గుర్తింపు వస్తుందని అనుకున్నాను. కానీ అఖండ సినిమా మాత్రం ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. వరదరాజులు క్యారెక్టర్... నేను విలన్‌గా చెయ్యొచ్చుననే కాన్ఫిడెంట్‌ని ఇచ్చింది’అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ఇక రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్రను చూసి ప్రతి ఒక్కరు షాకవుతారు. ఇతను శ్రీకాంతేనా? అని అనుకుంటారు. తెరపై కొత్త శ్రీకాంత్‌ని చూస్తారు’అన్నారు. మరి ఈ పాత్ర ద్వారా శ్రీకాంత్ ఎలా మెప్పిస్తారో చూడాలి. -
'అఖండ' 50 రోజుల మాస్ జాతర ఫోటోలు
-
ఇప్పుడు అఖండ పండగ.. ఎంజాయ్ చేయండి: బాలకృష్ణ
‘మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చి ‘అఖండ’ సినిమా వీక్షిస్తున్నారు. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం’అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ‘అఖండ’. గత ఏడాది డిసెంబరు 2న విడుదైన ఈ చిత్రం.. జనవరి 20 (గురువారం)తో యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్లో అర్థ శతదినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ‘ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. ఈ చిత్రం శుక్రవారం(జనవరి 21) నుంచి డిస్నీప్లస్ హార్ట్స్టార్లో విడుదల కానుంది. చూసి ఎంజాయ్ చేయండి’అన్నారు. ఈ విజయాన్ని ఎన్టీఆర్ గారికి అంకితమిస్తూన్నామని అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘నిజాయితీగా చెబుతున్నా... ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు’అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అఖండ’ విజయం.. 50 రోజులు.. 200 కోట్ల కలెక్షన్స్
ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో 50 రోజులు.. 100 రోజులు ఆడేవి. కానీ ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా రెండు వారాల కంటే ఎక్కువ ఆడడం కష్టమే. సూపర్ హిట్ అయితే.. ఓ నాలుగు వారాలు నడవడమే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజులు థియేటర్స్‌లో ఆడిదంటే మాములు విషయం కాదు. చాలా రోజుల తర్వాత ఆ ఘనతను నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ’మూవీ 50 రోజులు పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 క్లబ్బులో ప్రవేశించినట్టు ‘అఖండ’ చిత్ర నిర్మాతలు రూ. 200 క్లబ్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి.. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. -
థియేటర్లలో సిన్న సిత్రాలు.. ఓటీటీల్లో హిట్ సినిమాలు
గతేడాది థియేటర్లలో అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో ఇక బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందండి ఫుల్‌గా ఉంటుందని భావించాయి సినీ వర్గాలు. కానీ ఎప్పటిలాగే కరోనా కోరలు చాచి ఆ సందడిని మాయం చేసింది. ప్రతీ రోజు పెరుగుతున్న కొవిడ్ కేసులతో సినిమా షెడ్యూల్స్ తారుమారు అయ్యాయి. ఏడాది ప్రారంభంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతికి సందడి చేయాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా వేసుకున్నాయి. కానీ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రాన్ని మాత్రం ధైర్యంగా థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ త్రోబ్యాక్ వీడియో.. పూరీ జగన్నాథ్ షాక్ పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో చిన్న సినిమాలకు వరంగా మారింది. దీంతో ప్రస్తుతం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరిస్తున్నాయి. థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ సందడి చేసేందుకు సిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా ! థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు: 1. వర్మ: వీడు తేడా, జనవరి 21న విడుదల 2. వధుకట్నం, జనవరి 21న విడుదల 3. ఉనికి, జనవరి 26న విడుదల ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు: 1. అఖండ- జనవరి 21, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. శ్యామ్ సింగరాయ్- జనవరి 21, నెట్‌ఫ్లిక్స్ 3. లూజర్ 2- జనవరి 21, జీ5 ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు.. -
స్టార్స్‌తో ప్రయోగాలు చేయకూడదు: బాలకృష్ణ
Balakrishna About Akhanda Movie Success In Sankranthi Sambaralu Event: ‘‘రకరకాల సినిమాలు ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను ఒక రకంగానే ఊహించుకుంటారు. స్టార్స్‌తో (స్టార్ యాక్టర్లు) ప్రయోగాలు చేయకూడదు. గతంలో స్టార్స్ చేసిన ప్రయోగాత్మక చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి కానీ కొన్ని కమర్షియల్‌గా రాణించలేదు. ‘అఖండ’లో నా అఘోరా పాత్ర గెటప్ గురించి బోయపాటిగారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు’’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరు 2న విడుదలైంది. ఈ చిత్రం యాభై రోజుల దిశగా వెళుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ‘అఖండ’ థ్యాంక్స్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అఖండ’ సందేశాత్మక, వినోదాత్మక చిత్రం. అందుకే ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. కొందరి నిర్మాతల్లా కాకుండా కరోనా పరిస్థితులు భయపెడుతున్నా ధైర్యంగా రిలీజ్‌కు ముందడుగు వేసిన మిర్యాల రవీందర్వంటి నిర్మాతలు కూడా ఇండస్ట్రీలో ఉండాలి. ప్రపంచం గర్వించదగ్గ దర్శకుల్లో బోయపాటి శ్రీనుగారు ఉన్నారు. సినిమా అనేది ప్రజలకు నిత్యావసర వస్తువు అయిపోయింది. ఎంతోమంది ఉపాధి ఆధారపడి ఉన్న ఇండస్ట్రీకి ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై ప్రత్యేకంగా నా అభిప్రాయం అంటూ ఏదీ లేదు. ఇండస్ట్రీలోని అన్ని సెక్టార్ల వారూ ఈ విషయంపై చర్చించుకుని సమష్టిగా ప్రభుత్వాలను సంప్రదించాలి’’ అన్నారు. అలాగే బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఒక హీరో సినిమాను ఆ హీరో అభిమానులే ఎక్కువగా చూస్తారు. కానీ ‘అఖండ’ను అందరు హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకులు చూసి విజయం అందించారు. ‘అఖండ’కు సీక్వెల్ చేసే అవకాశం ఉంది. ఇక అన్ని సినిమా యూనిట్స్ వారు సినిమాలు గెలవాలని మాట్లాడుతున్న ఈ టైమ్‌లో నంబర్స్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు’’ అన్నారు. ‘‘సినిమా విఫలమైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్సే. నా తొలి రెండు సినిమాలకు ఇబ్బంది పడిన డిస్ట్రిబ్యూటర్స్ ‘అఖండ’తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు. అలాంటిది ‘అఖండ’ యాభై రోజుల దిశగా వెళుతోంది’’ అన్నారు రవీందర్ రెడ్డి. కాగా ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అయ్యప్ప శర్మ, రాం ప్రసాద్, విజయ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీలో అఖండ, సంక్రాంతి తర్వాతే రిలీజ్
గతేడాది థియేటర్‌ను రూల్ చేసినవారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ' సినిమాతో ఘన విజయం సొంతం చేసుకున్నాడు బాలయ్య. కరోనా కాలంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. డిసెంబర్ 2న విడుదలైన అఖండ సినిమా బాక్సాఫీస్ దండయాత్రను ముగించుకుని ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయింది. సంక్రాంతి తర్వాత జనవరి 21న డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ అధికారికంగా వెల్లడించింది. మరోపక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన 'పుష్ప' సినిమా జనవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. నిజానికి పుష్ప.. అఖండ రిలీజైన పదిహేను రోజులకు (డిసెంబర్ 17న) థియేటర్లలోకి వచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం పుష్ప కంటే ముందే అందుబాటులోకి రావడం గమనార్హం. Hi there! We're glad to inform you that Akhanda will premier on 21st Jan, 2022. Stay tuned for more updates. — Disney+HS_helps (@hotstar_helps) January 5, 2022 -
Rewind 2021: సిగ్నేచర్ స్టెప్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరోలు
2021.. టాలీవుడ్ ఎన్నో వండర్స్ క్రియేట్ చేసింది. కరోనా కాలంలోనూ వసూళ్లను అందుకోవడం మిగితా ఇండస్ట్రీస్ పోలిస్తే విజయాల శాతం ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు ఆడియెన్స్ లో కూడా జోష్ తీసుకొచ్చింది. సిగ్నేచర్ స్టెప్స్ తో దుమ్మురేపాయి. 2021 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కేవలం కలెక్షన్స్ తో సరిపెట్టుకోలేదు. థియేటర్స్ కు పూర్వ వైభవం మాత్రమే తీసుకురాలేదు. ఆడియెన్స్ కు కూడా కిక్ తీసుకోచ్చాయి. వాళ్లతో స్టెప్పులేయించాయి. ముఖ్యంగా హీరోల సిగ్నచర్ స్టెప్స్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అఖండలో బాలయ్య వేసిన షర్ట్ స్టెప్ ఈ ఏడాది ఒక హైలైట్. ఇటీవల అన్ స్టాపబుల్ టాక్ షోకి విచ్చేసిన రవితేజ కూడా ఇదే స్టెప్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మాస్ రాజా మాత్రమే కాదు..మరో కథానాయిక నివేదా ధామస్ కూడా బాలయ్య స్టెప్ ను రిపీట్ చేసేందుకు బాగానే ట్రై చేసింది. ఇక అటు రీల్స్ లో, ఇటు షార్ట్స్ లోనూ ఈ జై బాలయ్య హుక్ స్టెప్ దే హవా View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) జనవరి 7న రిలీజ్ అవుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి చాలా ట్రైలర్స్, టీజర్స్, వచ్చాయి. కాని నాటు నాటు సాంగ్ మాత్రం ఒక్కసారిగా వైరల్ అయింది. జై బాలయ్య స్టెప్ తో పాటు నాటు నాటు కూడా పాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపుతోంది. ఆర్ఆర్ఆర్ నార్త్ ఇండియా ప్రమోషన్ లో ఈ స్టెప్ రిపీటెడ్ గా కనిపించింది. బిగ్ బాస్ సెట్ లో తారక్, చరణ్ తో కలసి సాక్షాత్తు సల్మాన్ ఖాన్, ఈ హుక్ స్టెప్ వేసాడు. నాటు నాటు పై లెక్కనేనన్ని కవర్ సాంగ్స్ వచ్చాయి..స్టిల్ వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. పుష్ప లో సాంగ్స్ అన్ని సూపర్ హిట్.ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఈ పాటలు దుమ్మురేపుతున్నాయి. ఈ మూవీలో సామి సామి సాంగ్ కోసం రష్మిక వేసిన హుక్ స్టెప్ కూడా చాలా పాపులర్ అయింది. సినిమా ప్రమోషన్ ఎక్కడ జరిగినా, అక్కడ రష్మిక ఈ హుక్ స్టెప్ వేయాల్సిందే. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అఖండమైన విజయాన్ని అందుకున్నబాలయ్య
-
'జై బాలయ్య' పాటకు నివేదా థామస్ స్టెప్పులు.. సీన్ కాస్తా రివర్స్
Nivetha Thomas Dance Video On Jai Balayya Song: అఖండ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించాడు నందమూరి బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. చాలా కాలం తర్వాత తెరచుకున్న థియేటర్లకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది ఈ సినిమా. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్‌గా నిలిచింది. సాంగ్స్, బీజీఎంతో మాస్ ప్రేక్షకులను కిర్రాక్ అనిపించాడు తమన్. అఖండలో రెండు షేడ్స్‌లో అలరించిన బాలకృష్ణ ఒకే ఒక్క పాటలో మాస్ బీట్‌కు స్టెప్పులేసి అదరగొట్టాడు. జై బాలయ్య అనే సాంగ్ సినిమా రిలీజ్‌కు ముందే సూపర్ హిట్ అయింది. ఈ పాట విడుదలవడంతోనే నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఆ పాటకు స్టెప్పులేయడం ట్రెండ్‌గా కూడా మారింది. తాజాగా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ జై బాలయ్యకు పాటకు స్టెప్పులేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ భిన్నమైన పోస్ట్‌లు, వీడియోలు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది నివేదా. అందుకే జై బాలయ్య సాంగ్‌లోని స్టెప్పులను వదల్లేదు. పాటలో డ్యాన్స్ మూమెంట్స్ వేస్తుండగా షర్ట్స్ మారే స్పెప్పు వేసింది నివేదా. అయితే మొదటి షర్ట్ మారేవరకూ బానే ఉంది. రెండో షర్ట్ మారేప్పుడు సీన్ రివర్స్ అయింది. స్టెప్పు వేసేప్పుడు రెండో షర్ట్ సరిగా రాకపోవడంతో తాను కూడా నవ్వుతూ ఫన్ క్రియేటే చేసింది నివేదా. ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఏదేమైనా అఖండ ఎక్స్‌పీరియెన్స్ అదిరిపోయింది' అని క్యాప్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
'అఖండ'కు సీక్వెల్ తీయాలనుంది: నిర్మాత రవీందర్ రెడ్డి
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించి హిట్ సాధించిన చిత్రం అఖండ. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషనల్లో వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో తమన్ బీజీఎం ప్రధాన ఆకర్షణగా మారింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. జయ జానకీ నాయక సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యారు రవీందర్ రెడ్డి. తర్వాత అఖండ చిత్రాన్ని నిర్మించిన ఆయన భారీ హిట్ అందుకుని అగ్ర నిర్మాతగా ఎదిగారు. డిసెంబర్ 29న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. ఆ నమ్మకంతోనే 'అఖండ' చేశాను పెద్ద డైరెక్టర్, రేర్ కాంబినేషన్ అనే నమ్మకంతోనే అఖండ సినిమాను చేశాను. ఒకప్పుడు ఒక్క డైరెక్టరే పది సినిమాలు చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ దర్శకుడు ఒక సినిమాను చేయడమే కష్టం. స్టార్ హీరోలకు పది ప్లాఫులు వచ్చినా కూడా ఒక్క హిట్ వస్తే సెట్ అవుతుంది. స్టార్ హీరోకున్న అడ్వాంటేజ్ అదే. నేను అదే నమ్ముతా. బోయపాటి గారు మొదటి సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అన్నీ చెప్పారు. నాకు ముందే తెలుసు అఖండ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని నాకు ముందే తెలుసు. ఈ విషయాన్ని చెబితే నమ్మరేమో కానీ నాకు మాత్రం మొదటి నుంచి నమ్మకం ఉంది. హీరో, దర్శకుడు ఎక్కడా కూడా మాట్లాడలేదు. సినిమా విడుదల కంటే ముందు నుంచి నేనే మాట్లాడుతూనే వచ్చాను. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బాలకృష్ణ గారి అభిమానులకు కావాల్సిన మాస్ సాంగ్ కూడా ఉంది. అఘోర పాత్ర అద్భుతంగా వచ్చింది. ఆ ఎంట్రీతో అందరూ ట్రాన్స్‌లోకి వెళ్లారు అఖండ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాం. ప్రతీ ఒక్క సీన్ అద్బుతంగా ఉంటుంది. నాలుగు రోజుల్లోనే బయ్యర్స్ బయటపడతారని అనుకున్నాను. ఓవర్సీస్లో ఆడుతుందా? లేదా? అని ఆలోచించలేదు. ఎప్పుడు విడుదల చేసినా కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని నమ్మకంగా ఉండేది. ఇది కేవలం బాలకృష్ణ సినిమా అని అభిమానులు చూడలేదు. అఘోర పాత్ర ఎంట్రీతో అందరూ ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. అందరితో సినిమాలు చేస్తాను స్టార్ హీరోలతోనే అని కాదు అందరితోనూ సినిమాలు చేస్తాను. కథలు కుదిరితే అందరితో చేస్తాను. అఖండ సినిమా విషయంలో దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. మా సినిమా విడుదల విషయంలో ప్రభుత్వం కొంత సపోర్ట్ చేసింది. త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నాం. సీక్వెల్ తీయాలనుంది బోయపాటి గారి రాబోయే సినిమాల్లో నేను భాగస్వామిని అవుతానా? లేదా? నేను చెప్పలేను. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే కోరిక నాక్కూడా ఉంది. ఒక వేళ హిందీలో రీమేక్ చేయాలనుకుంటే.. ఇలాంటి పాత్రలకు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు అయితే బాగుంటుంది. కొత్త హీరోతో సినిమా వచ్చే ఏడాది మార్చిలో ఓ సినిమాను ప్రారంభిస్తాను. అందులో ఓ కొత్త హీరోను పరిచయం చేయబోతోన్నాను. ఒక పెద్ద సినిమా కూడా చర్చల దశల్లో ఉంది. ఇంకా కన్ఫామ్ కాలేదు. రాజకీయాలపై నాకు ఆసక్తి ఉంది. కానీ ఇప్పుడు అయితే నేను ఏ పాలిటిక్స్‌లో లేను. షూటింగ్ తర్వతా ఆయనతో మాట్లాడాను సినిమా షూటింగ్ ముగిసిన తరువాత బాలకృష్ణ గారితో మాట్లాడాను. చాలా సహకరించారు.. థ్యాంక్స్ సర్ అని అన్నారు. లేదు లేదు మీరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, బాగా చేశారు అని బాలకృష్ణ గారు అన్నారు. నా మైండ్‌లో తమనే ఉన్నారు అఖండ సినిమా కథ విన్నప్పటి నుంచి కూడా మా మైండ్‌లో తమనే ఉన్నారు. ఇలాంటి మ్యూజిక్ ఇస్తాడని నాకు ముందే తెలుసు. బాలకృష్ణ గారితో మనం చేస్తున్నాం.. నన్ను తొందరపెట్టొద్దు. పగలగొట్టేద్దామని తమన్ అన్నారు. తమన్ ఏం చెప్పారో దాని కంటే వంద రెట్లు ఎక్కువ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ పాత్ర చాలా ముఖ్యమైంది. ఎలా మాట్లాడిన వివాదమవుతుంది ప్రభుత్వాలు అనేవి ప్రజలకు ప్రాతినిధ్యంగా వహిస్తాయి. వ్యక్తులు, సంస్థల కోసం ప్రభుత్వాలు ప్రయారిటీ ఇవ్వవు. మా సినమా విడుదల సమయంలో సినిమా పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అలాంటి సమయంలో నేను ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాను. ఈ విషయం మీద ఎలా మాట్లాడినా కూడా వివాదంగానే మారుతుంది. ఆ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను పెట్టమని ఇండస్ట్రీ వాళ్లే అడిగారు. దాని వల పారదర్శకత ఉంటుందని అలా అడిగారు. బాలకృష్ణ కెరీర్ మొత్తంలో నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇదే బెంచ్ మార్క్ అయ్యేలా ఉంది. దాదాపు అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. రీటేక్స్ ఉండవు.. నేను సెట్‌కి వెళ్తే మానిటర్ పక్కన కూర్చుని చూస్తుంటాను. బాలకృష్ణ గారు అక్కడే కూర్చుంటారు. మేం ఇద్దరం మాట్లాడుకుంటాం. కానీ ఆయన ఏదో పెద్ద హీరో అన్నట్టుగా ప్రవర్తించరు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఒక్కసారి షాట్లోకి వెళ్తే మారిపోతారు. పక్కన ఉన్నప్పుడు బాలకృష్ణ వేరేలా ఉంటారు.. సెట్స్ మీదకు వెళ్తే వేరేలా ఉంటారు. బాలకృష్ణ గారు ఒకసారి చేస్తే రీటేక్స్ అనేవే ఉండవు. అలా చేయడం నాకు తెలీదు అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్ చేసుకోవడం నాకు తెలీదు. ఎవరైనా కథ చెబితే.. నచ్చితే.. దానికి తగ్గట్టు హీరోలకు వినిపించడమే అలవాటు. మున్ముందు నాకు కూడా అలా అడ్వాన్స్‌లు ఇచ్చేది అలవాటు అవుతుందేమో చూడాలి. -
యాదాద్రిని దర్శించుకున్న అఖండ టీం ఫొటోలు
-
యాదాద్రిని దర్శించుకున్న హీరో బాలయ్య..
Balayya Along With Akhanda Movie Team Visits Yadadri Temple: అఖండ సినిమా విజయం దైవ సంకల్పమని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన అఖండ టీంతో కలసి యాదాద్రిని దర్శించారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రగ్యా జైస్వాల్ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?
‘కంచె’ సినిమాలో సంప్రదాయకట్టుతో కనిపించిన ప్రగ్యా జైస్వాల్.. ఫ్యాషన్ అవుట్ ఫిట్స్‌లోనూ అంతే మెరుస్తుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసే బ్రాండ్స్ ఇవే.. అనావిలా.. ముతక చీరలంటే ముసలివాళ్లకు మాత్రమే అనుకునే ఎంతోమంది ఆలోచనను మార్చేసింది ముంబైకి చెందిన అనామిలా మిశ్రా. 2004లో ‘అనామిలా’ పేరుతో లెనిన్ ఫ్యాబ్రిక్ ఉపయోగించి, డిజైన్ చేసిన శారీ కలెక్షన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. బోరింగ్ డిజైన్స్‌కు చెక్ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్‌కు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతారు. కేవలం లెనిన్ ఫ్యాబ్రిక్ చీరలనే అనామిలా డిజైన్ చేస్తుంది. అయితే, వీటి ధర సాధారణ పట్టుచీర కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ముంబైలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. హౌజ్ ఆఫ్ శిఖా చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్‌కు కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అలా బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేసి, 2014లో ‘హౌజ్ ఆఫ్ శిఖా’ ప్రారంభించింది. ఇదొక ఆన్లైన్ జ్యూయెలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కు ప్రాముఖ్యతనివ్వడంతో, డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టయిల్ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. టోట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా వాటినే షాపింగ్ చేస్తుంటా. కేవలం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ధరించే దుస్తులపై దృష్టి సారిస్తా. చదవండి: Sai Pallavi : స్టేజ్ మీద సాయి పల్లవి కన్నీళ్లు.. కారణం ఏంటంటే -
2021 ఈ హీరోలకు చాలా స్పెషల్.. అద్భుతాలు జరిగాయి!
2021లో బాక్సాఫీస్ రన్ చాలా తక్కువ. కాని ఎక్కువగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న టాప్ యాక్టర్స్, యంగ్ హీరోస్ హిట్ ట్రాక్ అందుకోవడం ఈ ఇయర్ స్పెషాలిటీ. క్రాక్ టు అఖండ వరకు చూసుకుంటే 2021 కమ్ బ్యాక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ‘క్రాక్’తొ కమ్ బ్యాక్ సంక్రాంతి సీజన్ లో రిలీజైన క్రాక్ మూవీతో మాస్ రాజా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2017 లో విడుదలైన రాజా ది గ్రేట్ మూవీ తర్వాత రవితేజ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్ అనూహ్య రీతిలో విజయాన్ని అందుకున్నాడు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీలోనూ ,ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మాస్ రాజా కు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. నరేశ్ విజయానికి ‘నాంది’ 2012లో వచ్చిన బ్లాక్ బస్టర్ సుడిగాడు తర్వాత మళ్లీ ఆ స్తాయిలో విజయాన్ని అందుకోవడానికి అల్లరి నరేష్ 2021 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పైగా అల్లరి నరేష్ తన అల్లరిని పక్కన పెట్టి పూర్తిగా సీరియల్ సబ్జెక్ట్ లో నటించి మెప్పించాడు. సీటీ కొట్టించిన ‘సీటిమార్’ 2014లో లౌక్యంతో సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్. మధ్యలో చాలా చిత్రాలు చేసాడు కాని కావాల్సిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 2021లో సీటీమార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు. అఖిల్ ఖాతాలో భారీ విజయం 2015లో హీరోగా కెరీర్ ప్రారంభించాడు అఖిల్. హెలో, మిస్టర్ మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటికీ ఫస్ట్ హిట్ మాత్రం దక్కలేదు. కాని ఈ ఇయర్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఈ అక్కినేని హీరోగా మెమొరబుల్ హిట్ గా నిలిచింది. ‘అఖండ’తో నటసింహం బాక్సాఫీస్ వేట రవితేజ, అల్లరి నరేష్, గోపీచంద్, అఖిల్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఈ ఏడాదే బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాడు. అఖండతో సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించాడు బాలయ్య. 2017లో విడుదలైన గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు బాలయ్య. దాదాపు నాలుగేళ్ల తర్వాత అఖండతో బంపర్ హిట్ కొట్టాడు. -
‘అఖండ’జోరు.. సెంచరీ కొట్టిన బాలయ్య
నటసింహం నందమూరీ బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’మూవీ జోరు ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రొటీన్ కథే అయినా.. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు బాలయ్య రెచ్చిపోయి నటించడం.. దానికి తమన్ మ్యూజిక్ తోడవడంతో థియేటర్స్‌లో బొమ్మ అదిరిపోయింది. బాలయ్య కెరీర్లోనే తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ని అందుకోవడం గమనార్హం. ఈ పది రోజుల్లో.. . నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రేడ్ నిపుణుల నుంచి అందిన సమాచారం మేరకు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోరూ. 49.34 కోట్లు షేర్ వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కలిపితే మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా…. రూ. 100 కోట్లు గ్రాస్‌ను దాటినట్లు చెబుతున్నారు. రూ.53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ వారం రోజుల్లోనే టార్గెట్‌ని పూర్తి చేసుకొని బ్రేక్ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది. మొత్తం మీద బాక్సాఫీస్ వద్ద బాలయ్య సునామీ సృష్టించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. . ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. -
వైజాగ్‌లో అఖండ విజయోత్సవం
-
ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hero Srikanth Interesting Comments On His Role In Akhanda Movie: శ్రీకాంత్.. ఫ్యామిలీ హీరోకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఇప్పటి వరకు 100 పైగా చిత్రాల్లో నటించగా అందులో ఎక్కువగా కుటంబ కథా చిత్రాలే చేశాడు. దీంతో పరిశ్రమలో శ్రీకాంత్‌కు సాఫ్ట్ ఇమేజ్ ఏర్పడింది. అలా హీరోగా, నటుడిగా ఇంతకాలం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీకాంత్ అఖండ సినిమాలో క్రూరమైన విలన్‌గా కనిపించి అందరిని బయటపెట్టాడు. తనకు అలవాటు లేని పాత్ర అయినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేశాడు శ్రీకాంత్. అయితే కొంతమంది ఫ్యాన్స్ శ్రీకాంత్‌ను విలన్‌గా చూడటానికి ఇష్టపడటం లేదు. చదవండి: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా! దీంతో అఖండలో శ్రీకాంత్ పాత్రకు మిశ్ర స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైన అఖండ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తూ బ్లాక్‌బస్టర్ విజయం వైపు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌లో భాగంగా శ్రీకాంత్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌పై శ్రీకాంత్ స్పందించాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. అఖండలో తన పాత్ర వ్యక్తిగతం తనకు బాగా నచ్చిందని, అయితే ఈ గెటప్‌లో మొదటిసారి చూసిన తన భార్య ఊహ వణికిపోయిందని చెప్పాడు. ‘ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత అదే గెటప్‌లో ఇంటికి వెళ్లాను. అప్పుడు ఊహతో కలిసి కొందరు మాట్లాడుకుంటు ఉన్నారు. నన్ను అలా చూసి వాళ్లంతా కంగారుపడ్డారు. చదవండి: Rashmi-Chiranjeevi: రెమ్యునరేషన్ విషయంలో తగ్గని రష్మీ, ఎన్ని లక్షలో తెలుసా? ఇక ఊహ అయితే గుర్తుపట్టలేదు. ఒక్కసారిగా నన్ను అలా చూసి వణికిపోయింది. సినిమా చూసిన తర్వాత కూడా ఊహ చాలా కంగారు పడింది. ఎందుకంటే నన్ను ప్రేక్షకులు ఇలా ఆదిరిస్తారో లేదోనని భయపడుతూనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మొదట ప్రతినాయకుడిగా నటించడానికి ఒప్పుకున్న తర్వాత చాలామంది తనని నమ్మలేదని, విలన్‌గా చేయడం అవరమా? అని తనతో అన్నవాళ్లు ఇప్పుడు తన పాత్రపై ప్రశంసలు కురిపిస్తున్నారంటూ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు బాలకృష్ణ కూడా ఇప్పుడే విలన్ పాత్రలు చేయకు కొంతకాలం ఆగమని సూచించినట్లు తెలిపాడు. ఇకపై కూడా కేవలం హీరోగా నటిస్తానని కూర్చోకుండా.. నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా కూడా చేస్తానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. -
అఖండ సినిమాతో పరిశ్రమకు ధైర్యం వచ్చింది: బాలకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: అఖండ సినిమా ఘన విజయంతో ఫుల్లు ఖుషీలో ఉన్నారు హీరో బాలకృష్ణ. అఖండ భారీ విజయం నేపథ్యంలో గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాడు బాలకృష్ణ. ఆయనతో పాటు దర్శకుడు బోయపాటి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. సంవత్సరం తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారు.ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం కాదు....చిత్ర పరిశ్రమ విజయం’’ అన్నారు. (చదవండి: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు) అంతేకాక ‘‘ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు సినిమాను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు’’ అన్నారు బాలకృష్ణ. చదవండి: అన్‌స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్ -
బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఓటీటీలోకి అఖండ!
Balakrishna Akhanda In Hotstar OTT Release Date: నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హైట్రిక్ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రొటీన్ కథే అయినా.. బాలయ్యను సరికొత్త గెటప్‌లో కనిపించడం, పోరాట ఘట్టాలు, డైలాగ్స్ అదిరిపోవడంతో ‘అఖండ’బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల చేసినట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఖాతాలో మరో సూపర్ హిట్ పడడంతో నందమూరీ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అఖండ’ మూవీ గురించిన మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అఖండ స్ట్రీమింగ్ కానుందట. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. -
‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘తెలుగు ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాలను బాగా ఇష్టపడతారు. తమిళంలో కాస్త తక్కువ. కానీ రజనీకాంత్, విజయ్ వంటి హీరోలకు మాత్రం వారి అభిమానులు భారీ యాక్షన్ సీక్వెన్సెస్నే కోరుకుంటారు’’ అని స్టంట్ శివ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ చిత్రానికి పనిచేసిన ఫైట్ మాస్టర్, యాక్టర్ శివ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మెకానిక్‌గా ఉన్న నేను సినిమాలపై ఆసక్తితో ఫైట్ మాస్టర్‌గా మారాను. బాలకృష్ణగారి ‘లక్ష్మీనరసింహా, విజయేంద్ర వర్మ, సింహా’ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశాను. ఇప్పుడు ‘అఖండ’ కు వర్క్ చేయడం సంతోషంగా ఉంది. బాలకృష్ణగారి ‘అఘోరా’ పాత్రకు ఫైట్స్ కంపోజ్ చేశాం. ఫైట్స్ మాస్టర్స్‌లా కాకుండా బాలకృష్ణగారి అభిమానుల్లా ఫైట్స్ కంపోజ్ చేశాం. ఈ సినిమాకి దాదాపు 65 రోజులు ఫైట్స్ తీయగా, మరో 15 రోజులు యాక్షన్ సీన్స్‌లోని మిగతా వర్క్, ఎలివేషన్ షాట్స్ తీశాం. క్లైమాక్స్ ఫైట్ కంపోజింగ్ కాస్త కష్టంగా అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్‌ను బాలకృష్ణగారు సూపర్‌హీరోలా చేశారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బోయపాటిగారు ఓ ఫైట్మాస్టర్లానే ఆలోచిస్తారు. నిర్మాత రవీందర్‌రెడ్డిగారు బాగా హెల్ప్ చేశారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం కూడా ఫైట్స్‌కి ప్లస్ అయ్యాయి. (అన్‌స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్) ‘క్రాక్’ తర్వాత యాక్టర్‌గా నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ‘ఎఫ్ 3’ చిత్రంలో నేనే మెయిన్ విలన్. ఫైట్ మాస్టర్‌గా ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. పీటర్ హెయిన్స్ సోదిరిని వివాహం చేసుకున్నాను. నా కుమారులు కెవిన్, స్టీవెన్ కూడా ఫైట్ మాస్టర్స్‌గా చేస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిన్, స్టీవెన్ పాల్గొన్నారు. (‘అఖండ’ లోని గిత్తలు ఎవరివో, వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?) -
అఖండ సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో చెలరేగిన మంటలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మునిసిపాలిటీలోని రవిశంకర్ థియేటర్లో అఖండ సినిమా ప్రదర్శన సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. సినిమా కొనసాగుతుండగా తెర వెనుక ఉన్న సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. -
విషాదం... అఖండ మూవీ చూస్తూ బాలయ్య అభిమాని మృతి
Hero Balakrishna Fan Died While Watching Akhanda Movie: ప్రస్తుతం ఎక్కడ చూసిన అఖండ మానియ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంటూ విజయం వైపు దూసుకెళుతోంది. దీంతో అఖండ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ జోష్‌లో ఉన్న హీరో బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అఖండ సినిమా చూస్తున్న ఆయన అభిమాని ఒకరు మృతి చెందారు. బాలయ్య వీరాభిమాని, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ అఖండ సినిమా చూస్తూ హఠాన్మరణం చెందాడు. స్థానిక శ్యామల థియేటర్లో ఆయన అఖండ సినిమా చూస్తూ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చదవండి: సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా? అది గమనించిన థియేటర్ యాజమాన్యం ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. సినిమా చూస్తున్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో జాస్తి రామకృష్ణ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. రాజమండ్రి సమీపంలోని నామవరం వీఎస్ మహల్ థియేటర్ దగ్గర నుంచి ఆయన కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారు జాస్తి రామకృష్ణ. ఆయన మరణంపై జిల్లాలోని ఇతర ఎగ్జిబిటర్లు సంతాపం తెలిపారు. రామకృష్ణ మరణం జిల్లాకు తీరని లోటు అని అన్నారు. రామకృష్ణ మరణంపై బాలయ్య అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ -
‘అఖండ’ లోని గిత్తలు ఎవరివో, వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Akhanda Movie Bulls: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కనిపించిన బసవన్నలు(కోడెలు) చౌటుప్ప ల్ మండలం లక్కారం గ్రామానికి చెందినవే. గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టాడు. నిత్యం వాటికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చాడు. పేరు పెట్టి పిలిస్తే పలికేలా, చెప్పిన మాట వినేలా తయారు చేశాడు. ఆక్రమంలో సొంత పని నిమిత్తం శ్రీనివాస్ గతేడాది రామోజీ ఫిలింసిటీకి వెళ్లాడు. అక్కడ షూటింగ్ జరుగుతుండడంతో ఎద్దుల చర్చ వచ్చింది. దాంతో తన కోడెలకు సంబంధించిన వీడియోలు చూపించాడు. కోడెల నైపుణ్యం నచ్చిన నిర్వాహకులు షూటింగ్‌కు ఆహ్వానించారు. ఆ మేరకు ఏడాది క్రితం రామోజీ ఫిలింసిటీలో రెండ్రోజుల పాటు కోడెలు షూటింగ్లో పాల్గొన్నాయి. చిత్రంలోని ప్రారంభ సన్నివేశంతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో ఇవి కన్పిస్తాయి. మూగజీవాలైనప్పటికీ సినిమా షూటింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సినిమాకే వన్నె తెచ్చాయి. ప్రముఖ హీరోతో కలిసి ప్రధానమైన సినిమాలో తన కోడెలు నటించడం, చక్కటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్ తెలిపాడు. -
అఖండ సినిమాపై మహేశ్ బాబు రివ్యూ
Mahesh Babu Review On Balakrishna Akhanda Movie: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ థియేటర్లలో విడుదలై కేక పుట్టిస్తోంది. మంచి ఓపెనింగ్స్, అదిరిపోయే టాక్‌తో ఖాతా తెరిచిన అఖండ రికార్డుల దిశగా ముందుకెళ్లడం ఖాయమనిపిస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో మాస్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు రివ్యూ ఇచ్చాడు. అఖండ సినిమా చూసిన అనంరతం మహేశ్ ట్వీట్ ‘అఖండ భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయ్యిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుతో పాటు అఖండ టీంకు అభినందనలు’ అంటూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. బాలయ్య సినిమాపై మహేశ్ బాబు ట్వీట్ చేయడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ తొలిసారిగా విలన్‌గా నటించి స్టన్నింగ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడని అంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్గా నటించగా.. పూర్ణ కీలక పాత్రలో నటించింది. జగపతిబాబు కీ రోల్ పోషించాడు. Extremely happy to hear that #Akhanda has had a massive start! 👏👏 Congratulations to #NandamuriBalakrishna garu, #BoyapatiSreenu garu and the entire team! @ItsMePragya @MusicThaman @dwarakacreation — Mahesh Babu (@urstrulyMahesh) December 2, 2021 -
థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ, రంగంలోకి పోలీసులు
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు విడుదలై సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లన్నీ నందమూరి ఫ్యాన్స్‌తో ఫుల్ అయ్యాయి. థియేటర్ల దగ్గర ప్రేక్షకులు జై బాలయ్య అంటూ కేకలు, ఈళలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లల్లో పండగ వాతావరణం నెలకొంది. మూములుగానే బాలయ్య సినిమా చూస్తున్న ఫ్యాన్స్ అంతా పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అలాంటి వాళ్లు ఇక అఖండ సినిమా చూస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా విశ్వరూపం చూపించాడు. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! ఇక ఫ్యాన్స్‌ను ఆపడం కష్టమే. ఇండియాలోనే కాదు విదేశాల్లోని థియేటర్లో కూడా అభిమానులంతా ఊగిపోతూ నానా రచ్చ చేస్తున్నారట. దీంతో వారి దెబ్బకు థియేటర్లో షోను రద్దు చేయాల్సి వచ్చిందట. ఆస్ట్రేలియాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు తెగ కేకలు వేస్తూ రచ్చ చేశారట. దీంతో థియేటర్ యజమానులు మూవీ ఆపేసి మరీ మైకులో వార్నింగ్ ఇచ్చారట. అయినా బాలయ్య అభిమానులు ఏమాత్రం తగ్గకపోవడంతో చివరకు పోలీసులను రంగంలోకి దిగాల్సి వచ్చింది. షోను ఆపేసి ప్రేక్షకులకు వార్నింగ్ పోలీసులు వెళ్లిపోయారట. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్గా ప్రజ్ఞా జైస్వాల్ నటిచింది. ఇక జగపతి బాబు, శ్రీకాంత్‌లు విలన్‌గా ఆకట్టుకుంటున్నారు. చదవండి: బాలయ్య ఫ్యాన్స్‌కు చేదు అనుభవం, థియేటర్లో అగ్ని ప్రమాదం -
బాలయ్య ఫ్యాన్స్‌కు చేదు అనుభవం, థియేటర్లో అగ్ని ప్రమాదం
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు విడుదలై సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లని నందమూరి ఫ్యాన్స్‌తో ఫుల్ అయ్యాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల జై బాలయ్య అంటూ కేకలు, ఈళలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అఖండ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ థియేటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా ప్రేక్షకులు భయంతో పరుగులు తీసిన సంఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. చదవండి: ‘అఖండ’మూవీ రివ్యూ అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా థియేటర్లో పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది. షార్ట్ సర్క్యూట్‌తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు. -
‘అఖండ’మూవీ రివ్యూ
టైటిల్ : అఖండ నటీనటులు : బాలకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, సుబ్బరాజు, కాలకేయ ప్రభాకర్ తదితరులు నిర్మాణ సంస్థ: ద్వారకా క్రియేషన్స్ నిర్మాత : మిర్యాల రవిందర్ రెడ్డి దర్శకత్వం: బోయపాటి శ్రీను సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : సి రామ్ ప్రసాద్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : డిసెంబర్ 2, 2021 నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన `అఖండ`పై తొలి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’తర్వాత ఈ హిట్ కాంబోలో హ్యట్రిక్ మూవీ కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘అఖండ’పై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య గురువారం(డిసెంబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ‘అఖండ’కథేంటంటే అనంతపురం జిల్లాకు చెందిన మురళీకృష్ణ(బాలకృష్ణ) ఓ రైతు. ఊరికి పెద్ద, పేదవారికి అండగా ఉంటాడు. ఫ్యాక్షనిజం బాటపట్టిన యువతను దారి మళ్లీంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాడు. పేదవారి కోసం స్కూల్స్, ఆస్పత్రులు కట్టించి సేవ చేస్తుంటాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ శరణ్య(ప్రగ్యా జైశ్వాల్) మురళీ కృష్ణ మంచితనం చూసి మనసు పడుతుంది. తన ప్రేమ విషయాన్ని తెలియజేసి పెళ్లి చేసుకుంటుంది. కట్ చేస్తే.. వరద రాజులు(శ్రీకాంత్) వరదా మైన్స్ పేరుతో మైనింగ్ మాఫియా నడుపుతుంటాడు. తను చేస్తున్న అక్రమాలకు అడ్డొస్తున్నవారిని దారుణంగా హతమారుస్తుంటాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యురేనియం తవ్వకాలను ప్రారంభిస్తాడు. ఈ తవ్వకాల వల్ల ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. విషయం తెలుసుకున్న మురళీకృష్ణ.. యూరేనియం తవ్వకాలను ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ వరదరాజులు తనకున్న పలుకుబడితో అతనిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టిస్తాడు. ఈ క్రమంలో అఖండ(బాలకృష్ణ) ఎంట్రీ ఇచ్చి, మురళీకృష్ణ ఫ్యామిలీకి అండగా నిలుస్తాడు. అసలు అఖండ ఎవరు? మురళీకృష్ణ కుటుంబానికి అఖండకు సంబంధం ఏంటి? మైనింగ్ మాఫియా లీడర్ వరదరాజులు వెనుక ఉన్నదెవరు? మురళీకృష్ణ ఫ్యామిలీని అఖండ ఎలా కాపాడాడు? వరదరాజు ఆగడాలకు అఖండ ఎలా అడ్డుకట్ట వేశాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. మరోసారి బాలకృష్ణ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం బాలకృష్ణ వన్‌మేన్ షో అనే చెప్పాలి. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ‘జైబాలయ్య’పాటకు ఆయన వేసిన స్టెప్పులు, అఖండ రూపంలో చేసే ఫైట్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. జిల్లా కలెక్టర్‌గా, మురళీకృష్ణ భార్యగా ప్రగ్యా జైశ్వాల్ ఆకట్టుకుంది. అటవి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పద్మావతి పాత్రలో పూర్ణ అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన శ్రీకాంత్.. తెరపై కొత్తగా కనిపించాడు. వరద రాజులు అనే క్రూరమైన పాత్రకు ఆయన న్యాయం చేశాడు. బాలకృష్ణ, శ్రీకాంత్ మధ్య వచ్చే సీన్స్ అదరిపోతాయి. సన్యాసిగా జగపతిబాబు, నెగెటివ్ షేడ్స్ ఉండే పోలీసు అధికారి రాజన్‌గా కాలకేయ ప్రభాకర్, శక్తిస్వరూపానందగా కనిపించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటే.. అభిమానుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. దానికి కారణం గతంలో వీరిద్దరు కలిసి ‘సింహా’, ‘లెజెండ్’సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడమే. ఈ సూపర్ హిట్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ అంటే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ‘అఖండ’లో ఉంటాయి. బాలయ్య మాస్ ఇమేజ్, బోయపాటి మార్క్ డైలాగ్స్‌తో ‘అఖండ’మూవీ సాగుతుంది. అడుగడుగున బాలయ్య అభిమానులు ఈలలు కొట్టించే సీన్స్ ఉంటాయి. ఫస్టాఫ్ అంతా మురళీకృష్ణ - శరణ్యల మధ్య ప్రేమాయణం, మైనింగ్ మాఫియా చేసే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. ఇంటర్వెల్‌కి ముందు అఖండ ఆగమనం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి బాలయ్య రెచ్చిపోతాడు. అఖండగా ఆయన చేసే ప్రతి ఫైట్ సీన్ బాలయ్య అభిమానులను ఈలలు వేయిస్తుంది. అయితే అదే సమయంలో సెకండాఫ్‌లో విపరీతమైన హింసకు తావిచ్చేరనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. పోరాట ఘట్టాలు, డైలాగ్స్‌తోనే సినిమాను లాక్కొచ్చాడు దర్శకుడు బోయపాటి. కథను పట్టించుకోకుండా హీరోయిజంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. బాలయ్య కనిపించే ప్రతి సీన్.. ఎంట్రీ సీన్‌లాగే ఉంటుంది. ఆయన చేసే ప్రతి ఫైట్.. క్లైమాక్స్ సీన్‌ని తలపించేలా ఉంటుంది. మొత్తంగా బాలయ్య అభిమానులకు అయితే బోయపాటి ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. జైబాలయ్య, అఖండ, అడిగా అడిగా.. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరొట్టేశాడు. ముఖ్యంగా అఘోరా నేపథ్యంలో వచ్చే ప్రతి సీన్‌ని తనదైన బీజీఎంతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమా స్టార్టింగ్ మొదలు.. ఎండింగ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎం.రత్నం డైలాగ్స్ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Akhanda Movie: జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
Balakrishna Akhanda, Fans Celebrations At Bramaramba Theatre: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు(డిసెంబర్2)న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో తెల్లవారుజామున బెనిఫిట్ షో వేయగా.. అర్థరాత్రి నుంచే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. థియేటర్ ప్రాంగణమంతా జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. బాలయ్య విశ్వరూపం చూపించారని, మాస్ జాతర అంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సెలబ్రేషన్స్‌తో హంగామా సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
అఖండ మూవీ ట్విటర్ రివ్యూ
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` నేడు(డిసెంబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం, తానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘అఖండ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. బాలయ్య మాస్ డైలాగ్స్ ఏమేరకు ఆకట్టుకున్నాయి? మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. (చదవండి: ‘అఖండ’మూవీ రివ్యూ) Meeru tappu chesthey cell lo vestharu ! Memu hell lo vestham!! Both are not same!! Mass dialogue sequence followed by #Akhanda title song !! #AkhandaRoar !! So far second half 80% filled with action sequences !! — Sasi (@sasidharanne) December 2, 2021 ఫస్టాఫ్ చాలా బాగుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్ మాస్ ఎలిమెంట్స్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. తమన్ నేపథ్య సంగీతం అదిరిపోయిందట. బాలయ్య చెప్పే మాస్ డైలాగ్స్‌కి థియేటర్లలో ఫ్యాన్స్ ఈళలు వేయడం పక్కా అని ఓ నెటిజన్ కామెంట్చేశాడు. ఇక ఎప్పటి లాగే బాలయ్య తనదైన నటనతో రెచ్చిపోయాడట. అఘోరాగా బాలయ్య నటన సినిమాకే హైలెట్ అట. ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. Highlights are Balayya intro , interval bang, police station fight , and climax . No one can pull of aghora role better than Balayya . 🔥🔥 bgm leaves you in that trance .. boya mass will leave fans and mass audience fully satisfied movie concept is also very good #akhanda — Super Sampangi (@supersampangi) December 2, 2021 #Akhanda Live Updates FIRST HALF REPORT: Though ridiculously bad at times, the first half is fairly entertaining and engaging! Interval is 🔥🔥🔥 with Aghora Entry!!@MusicThaman Em BGM Raa, ADARAKOTTESAV 🔥🔥🔥. Peaks asalu!#AkhandaOnDec2nd#AkhandaRoaringFrom2ndDec — FDFSLiveAus (@FDFSLiveAus) December 2, 2021 @MusicThaman Dudeeee This is officially your ERA.. Mindblowing work #Akhanda — PST (@PSTtwtz) December 2, 2021 INTERVAL: #AkhandaMassJathara 🙏🏽🔥 Mass combo ki perfect example Balayya - Boya 💥💥#Akhanda — Anna Yaaru 🐯🌊 (@EV9999_Tarakian) December 2, 2021 Comedy lepesinattu next movie lo ee love scenes kuuda lepeyandi Boya gaaru #Akhanda — Sathwik Sriram (@sksathwik) December 2, 2021 Don't expect like legend& simha #Akhanda different masss bomma balaya acting 🔥🔥🔥 Boyapati approached differently & delivered BLOCKBUSTER @MusicThaman Biggest plus point rampage BGM congratulations @dwarakacreation thank you for bringing to ONLY THEATERS — fan of NTR (@Ntrfan999922) December 2, 2021 #Akhanda Review నటసింహం అన్న పదానికి అర్థం చూయించేసాడు ,, 💯🙏🏻 కుమ్మిమోపారదెంగాడయ్యా🤙🌪🌋#AkhandaMassJathara #Balayya 🦁 — Mahesh🖤Kajal (@MaheshKajal3) December 2, 2021 #Akhanda followed by Gopichand ,anil movies manchi linup set chesukunnadu balayya — vikky (@mnopq999) December 2, 2021 Mental ekkesindi ra ayya asalu. Interval fight nunchi start aithadi #Akhanda rampage, climax varaku kummutune untaadu. Bala-Boya-Thaman andaru kalipi duty chestharu, just mind blowing anthe. Every action sequence is still flashing in front of my eyes. — Hulkeshwara Shastry (@casual_babu) December 2, 2021 Kurnool mass jathara shuru 🔥🔥🤙💥💥 jai balaya jai balaya 🔥🙌💥#Akhanda #AkhandaMassJathara pic.twitter.com/jzsCsTlEie — tarak yusuf (@NtrYusuf) December 2, 2021 #Akhanda UK 1st half : ABOVE AVERAGE ( Dragged some love scenes) Boya perfectly targeted akhanda entry in interval and AKHANDA ARRIVES. 2nd half : ONLY ONE WORD BHAM AKHANDA FINALLY YOU WONT GET DISAPPOINTED WITH #BB3 #AkhandaOnDec2nd — tolly_wood_UK_Europe (@PsPk__Europe_UK) December 2, 2021 Balayya and srikanth confrontation💥💥💥💥💥...emi dialogues raa mawa #akhanda — Gangstar GASTINO🔔 (@shannu309) December 2, 2021 Hearing super positive response for #Akhanda from USA premiers. Mass Jathara Shuru 🤙🏻🤙🏻🤙🏻#AkhandaMassJathara #AkhandaFromToday #AkhandaRoar — Telugumovie USA (@TelugumovieUsa) December 2, 2021 #Akhanda 2haff kukka Rod antunaru .... — 𝐍𝐈𝐘𝐀𝐙 ᴋɪɴɢ👑 (@itsniyazKING) December 2, 2021 #Akhanda Roaring in theatres Positive talk #BheemlaNayak #RRR #RadheyShyam https://t.co/DElN4u3bXB — MANA MEMES KA ADDA (arun💥) (@arunakula4) December 2, 2021 This Decade is completely Belongs to @MusicThaman 💥💥💥 His Music & BGMs makes an Average Film as BLOCKBUSTERS A BGM Ka Baap Ban Gaya Rayyyy Kudos to His Hard Work This is Just Begining #Akhanda#BheemlaNayak #SarkaruVaariPataa — Guntur Box Office (@MacherlaMbfc) December 2, 2021 #Akhanda - No one can match #NBK’s Roudhram, aggression and diction. He lived in the role of #Aghora completely Complete Mass action loaded with “balayya elements” Single screens will be on 🔥 and it’s not a film of reviews. One in a while we get to watch this mass films pic.twitter.com/6KgFDBEETD — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 2, 2021 -
అఖండ బెనిఫిట్ షోల పేరుతో దోపిడీ
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురానున్న ఆన్లైన్ టిక్కెట్ విధానం కంటే ముందు విడుదలవుతున్న సినిమా ద్వారా టికెట్లను అధిక ధరలకు అమ్మి ప్రేక్షకులను దోపిడీ చేయుచున్నారని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలంటూ ఉండవని.. ఒకే ఒక బెనిఫిట్ షో మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ ప్రస్తుతం ఏపీలో చారిటీ పేరుతో ఉదయం 6 గంటలకు, 9 గంటలకు బెనిఫిట్ షోలు వేస్తూ వాటిని రూ.600 అమ్ముతున్నారని చెప్పారు. చాలా రోజులుగా చిన్న నిర్మాతలు, కార్మికులు పడుతున్న కష్టాలను గ్రహించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆన్లైన్ టిక్కెట్ విధానం, రోజుకు 4 ఆటల ప్రదర్శన చిత్ర పరిశ్రమ బాగు కొరకు, ప్రజలు సినిమా టిక్కెట్స్ కొనుగోలులో దోపిడీ కాకుండా ఉండటం కోసం ప్రవేశ పెట్టారని తెలిపారు. డిసెంబర్ 2న విడుదలయ్యే ‘అఖండ’ సినిమాను ప్రత్యేక ప్రదర్శనతో పాటు.. ఉదయం 6 గంటలకు, 9 గంటలకు ప్రదర్శనకు టికెట్స్ స్వచ్ఛంద సంస్థల పేరుతో పోస్టర్స్ ముద్రించి టిక్కెట్స్ కావలసినవారు సంప్రదించవల్సిన నంబర్లని తెలియచేస్తూ వాట్సప్ గ్రూపులలో పెట్టి అమ్మతున్నట్లు ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని ఆ సినిమా థియేటర్ టికెట్లను రెవెన్యూ, హోం శాఖ ద్వారా బుకింగ్స్‌లో అమ్మేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
ఆ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నా: పూర్ణ
‘‘సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ అని నా ఫీలింగ్. ప్రజల వల్లే సెలబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.. వాటిని నేను ఒకేలా తీసుకుంటాను. నెగెటివ్ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నాను’’ అని పూర్ణ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణ–బోయపాటిగార్ల కాంబినేషన్లో ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో పద్మావతి అనే పాత్ర చేశాను. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. నా లక్కీ నంబర్ 5. 2021ని కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాది మంచి పాత్రలు వచ్చాయి. హీరోయిన్‌గానే చేయాలని ఫిక్స్ అవ్వలేదు. సినిమాలో నాలుగైదు సీన్లు చేసినా ప్రాధాన్యత ఉండాలనుకుంటాను. శోభన, రేవతి, సుహాసినిగార్లలా ఎలాంటి పాత్రలైనా చేయాలనుకుంటున్నాను. ‘దృశ్యం 2’లో లాయర్‌గా బాగా నటించావని చాలామంది అభినందించారు. కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయింది. ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. కానీ ఇంతదాకా ప్రయాణించాను. డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. కెరీర్ చాలాకాలం సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. ముందు నేను కొన్ని తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు జాగ్రత్తగా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నాను’’ అన్నారు. -
డిసెంబర్ మొదటి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!
Telugu Upcoming Web Series & Movies Of December 2021: కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వధారణమైపోయింది. మరి డిసెంబర్ ప్రారంభంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో చూసేద్దాం.. అఖండ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలవుతోంది. మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మరక్కార్: అరేబియన్ సుమద్ర సింహం. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్డౌన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ చిత్రం థియేటర్లో విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అర్జున్, కీర్తి సురేశ్, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో నటించారు. తడప్ ఆర్ఎక్స్ 100.. తెలుగులో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తడప్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి తడప్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుతారియా హీరోయిన్గా కనిపించనుంది. మిలాన్ లుతారియా దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా డిసెంబర్ 3వ తేదీన రిలీజవుతోంది. బ్యాక్ డోర్ పూర్ణ లీడ్ రోల్లో నటించిన మూవీ బ్యాక్ డోర్. కర్రి బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాను బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. బ్యాక్ డోర్ మూవీ డిసెంబర్ 3న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్కైలాబ్ సత్యదేవ్, నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా స్కైలాబ్. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డా.రవి కిరణ్ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో వచ్చే చిత్రాలివే! నెట్‌ఫ్లిక్స్ ♦ ద పవర్ ఆఫ్ ది డాగ్ (హాలీవుడ్) - డిసెంబర్ 1 ♦ లాస్ ఇన్ స్పేస్ (వెబ్ సిరీస్) - డిసెంబర్ 1 ♦ కోబాల్ట్ బ్లూ (హాలీవుడ్) - డిసెంబర్ 3 ఆహా ♦ మంచి రోజులు వచ్చాయి (తెలుగు) - డిసెంబర్ 3 అమెజాన్ ప్రైమ్ ♦ ఇన్ సైడ్ ఎడ్జ్ (హిందీ వెబ్‌సిరీస్) - డిసెంబర్ 3 జీ5 ♦ బాబ్ విశ్వాస్(హిందీ) - డిసెంబర్ 3 బుక్ మై షో ♦ ఎఫ్9 (తెలుగు) - డిసెంబర్ 1 -
‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
బాలయ్య ఓ ఆటమ్‌బాంబు..ఆ విషయం శ్రీనుకు బాగా తెలుసు: రాజమౌళి
‘‘బాలకృష్ణగారు ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం రెండు విషయాలు. ఒకటి ఆయనకు సినిమాలపై ఉన్న ఎడిక్షన్, రెండు సినిమాలో ఆయనకు ఉన్న డిక్షన్ (వాచకం). ఆయన చెప్పినట్లు డైలాగులు ఎవరూ చెప్పలేరు’’ అని అల్లు అర్జున్ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘జై బాలయ్య’ పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేయగా, ఈ సినిమా రిలీజ్ టీజర్, బిగ్ టికెట్‌ను హీరో అల్లు అర్జున్ విడుదల చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘రీల్లోనైనా.. రియల్‌గా అయినా బాలకృష్ణగారు రియల్‌గానే ఉంటారు. ఆయనలోని ఈ క్వాలిటీ నాకు ఇష్టం. సెకండ్ లాక్డౌన్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా ‘అఖండ’ తెలుగు పరిశ్రమకు ఓ అఖండజ్యోతిలా వెలుగు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ – ‘‘బాలకృష్ణగారు ఓ ఆటమ్‌బాంబు. ఆ బాంబు ఎలా ప్రయోగించాలో బోయపాటి శ్రీనుకు తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించి, ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘అఖండ’ గురించి ఎక్కువగా చెప్పదలచుకోలేదు. థియేటర్స్‌లో చూస్తారు. దురదృష్టవశాత్తు కరోనా వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ స్తంభించిపోయింది. మా సినిమా తర్వాత ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’.. ఇలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఆడాలని కోరుకుంటున్నాను. ఇందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘జై బాలయ్య’ పాటకు సాధన చేసే ప్రక్రియలో భాగంగా బాలకృష్ణగారు జారిపడ్డారు.. భుజానికి గాయమైనా బాలయ్య సాంగ్ చేశారు. అదీ బాలయ్య’’ అన్నారు బోయపాటి శ్రీను. ఈ వేడుకలో గాయకుడు ఎస్పీ చరణ్, గోపీచంద్ మలినేని, సాయి కొర్రపాటి, వై. రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
'జగపతిబాబును గుర్తుపట్టలేదు, బాలకృష్ణ మనిషేనా?'
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు.. ♦ నటిగా మారాలని అనుకున్నప్పుడే మంచి పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నా వరకు వచ్చిన కథల్లోంచి మంచి కారెక్టర్లను ఎంచుకున్నాను. అందులో కొన్ని వర్కవుట్ అవుతాయి. కొన్ని కావు. ఫలితం మనం చేతుల్లో ఉండదు. నేను మాత్రం మంచి పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాను. ♦ బాలకృష్ణ గారు చాలా సీనియర్. అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఇది వరకు ఆయనను రెండు మూడు సార్లు కలిశాను. ఆయనతో పని చేస్తున్నానని తెలిసిన మొదటి రోజు ఎంతో నర్వస్‌గా ఫీలయ్యాను. కానీ కలిసిన ఐదు నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయన అలా నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్ అవుతుంది. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన గ్రేట్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ♦ నేను ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషించాను. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఇది వరకు చూసిన ప్రగ్యా కనిపించొద్దని బోయపాటి గారు అన్నారు. నాకు బోయపాటి గారి మీద చాలా నమ్మకం ఉంది. ఆయన ఒక పాత్ర కోసం ఒకరిని అనుకున్నారంటే అది కచ్చితంగా పర్ఫెక్ట్ చాయిస్‌లా ఉంటుంది. ఆయన ఎంతో ఆలోచించి గానీ ఒక పాత్రకు ఆర్టిస్ట్‌ను ఎంచుకోరు. అందుకే ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు మొత్తం కథ వినకుండానే ఓకే చెప్పాను. ♦ అఖండ లాంటి కథ, అలాంటి కారెక్టర్ నేను ఇంత వరకు చూడలేదు. ఇక్కడే అని కాదు. ఇతర భాషల్లోనూ అలాంటి పవర్ ఫుల్ పాత్రను నేను చూడలేదు. బాలకృష్ణ గారు ఆ పాత్రలో డిఫరెంట్ లెవెల్లో కనిపిస్తారు. ఉదయాన్నే మూడు గంటలకు లేస్తారు.. ఆరు గంటలకే సెట్‌కు వస్తారు.. రోజంతా షూటింగ్ చేస్తారు.. ఆయన డెడికేషన్ చూసి మీరు మనిషేనా? అని అడిగేశాను. బాలకృష్ణ గారు అంత పవర్ ఫుల్ వ్యక్తి కావడంతోనే బోయపాటి గారు అఖండ లాంటి పాత్రను రాశారేమో. ♦ అఖండ చిత్రంలో నాది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ క్యారెక్టర్ చుట్టే కథ తిరుగుతుంది. నాకు ఎదురైన సంఘటనల వల్లే రెండో పాత్ర అయిన అఖండ ఎంట్రీ ఉంటుంది. అలా ఈ సినిమాలో నాకు నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. ♦ బాలకృష్ణ గారు, బోయపాటి గారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అందుకే నేనే ఎక్కువగా సోషల్ మీడియాలో మా సినిమాను ప్రమోట్ చేశాను. నా సినిమా అంటే నాకు ఎంతో ఎగ్జైట్ ఉంది. అందుకే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నాను. ఈ విషయంలో నేను, తమన్ కూడా మాట్లాడుకున్నాం. మనిద్దరమే ఉన్నాం.. ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నాం. ♦ శ్రావణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. అఖండ సినిమా వర్కవుట్ అవుతంది. కచ్చితంగా నా పాత్ర కూడా అందరికీ రిజిస్టర్ అవుతుంది. నేను ఇంత వరకు సినిమాను చూడలేదు. కానీ అక్కడక్కడా రషెస్ చూశాను. సినిమా అద్బుతంగా వచ్చింది. అడిగా అడిగా పాటలో అద్భుతంగా కనిపించాను అని కెమెరామెన్ ప్రశంసించారు. ♦ జగపతి బాబు సార్ గారిని ఆ గెటప్‌లో చూసి మొదటి రోజు గుర్తు పట్టలేదు. ఆయన పిలవడంతో ఆ తరువాత గుర్తు పట్టాను. అలా బోయపాటి గారు అందరినీ మార్చేశారు. -
ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే వేదికపై అల్లు అర్జున్- బాలయ్య
Allu Arjun As cheif Guest For Akhanda Pre release Event: నందమూరి బాలకృష్ణ-ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడు. ఈ నెల 27న నిర్వహించే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బన్నీ- బాలయ్య ఒకే వేదికపై సందడి చేయనుండటంతో ఫ్యాన్స్‌కి ఇక పండుగే అని చెప్పొచ్చు. కాగా సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. -
బాలయ్య, నేను తొమ్మిది రోజులు మైనింగ్ ఏరియాలో కష్టపడ్డాం : శ్రీకాంత్
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశా.. కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇకపై హీరోగానే చేస్తాను అని పట్టుపట్టను కానీ మంచి పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నాను’అన్నారు హీరో శ్రీకాంత్. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`లో ఆయన విలన్‌గా నటించాడు. ఈ మూవీ సెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. అలా ఏది పడితే అది చేయకండని బోయపాటి ముందే హెచ్చారించారు. సరైనోడు సినిమాలో మంచి సాఫ్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. మంచి విలన్ పాత్రను రాస్తాను వేస్తారా? అని అడిగారు. నేను అక్కడి నుంచే వచ్చాను.. ఎందుకు చేయను భయ్యా అని అన్నాను. అలా కొన్ని రోజులు ఎదురుచూశాను. అలా ఓ సారి బాలయ్య బాబు అఖండ కోసం విలన్ క్యారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు క్యారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా? అనుకున్నాను. ► నా గెటప్ చూసి అందరూ ఫోన్లు చేశారు. ప్రశసించారు. కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు. నాక్కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. వరదరాజులు పాత్ర చాలా బాగా వచ్చింది. ► బాలయ్యతో శ్రీరామారాజ్యం సినిమాలో నటించాను. అందులో లక్ష్మణుడి పాత్రలో తమ్ముడిగా కనిపిస్తే ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపిస్తాను. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర అదిరిపోవాలి. అప్పుడు మన పాత్ర కూడా బాగా వస్తుందంటూ బోయపాటి చెబుతూ ఉండేవారు. క్రికెట్ ఆడే సమయం నుంచి ఆయనతో మంచి ర్యాపో ఉంది. ► ఈ సినిమా తరువాత బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ఏది పడితే అది ఒప్పుకోకు. సబ్జెక్ట్‌లు నేను చెబుతాను అని బాలకృష్ణ అనేవారు. ► లెజెండ్ సినిమా జగపతి బాబుకు ఎంత ప్లస్ అయిందో నాకు తెలుసు. ఇప్పటికీ మంచి స్థానంలో ఉన్నారు. నాకూ అలా ఉంటుందని నేను అనుకోను. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. దర్శక నిర్మాతలు ఎలాంటి పాత్రలు ఇస్తారో చూడాలి. ఓ పక్కన హీరోగా, విలన్‌గా నటిస్తున్నాను ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలోనూ పాత్రను పోషిస్తున్నాను. మంచి పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నాను. ► ఈ చిత్రంలో నాది సెటిల్డ్ పర్ఫామెన్స్‌లా ఉంటుంది. డబ్బింగ్లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. సెటిల్డ్‌గా డైలాగ్స్ చెప్పించారు. ► బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే అది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. ► ఇది హెవీ హై ఓల్టేజ్ సినిమా. నేచర్‌తో ఎలా ఉండాలి.. ఎలా పోరాడాలనే విషయాలుంటాయి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా పాత్రను చూసి జనాలు ఏమంటారు? తిడతారా? అని చూస్తున్నాను. ► నాకు హీరోగా చేయడమే ఇష్టం. కానీ పాత్రలు నచ్చితే క్యారెక్టర్లు కూడా చేశాను. అది నాకొక సరదా. హీరోగానే చేస్తాను అని పట్టుపట్టను. లైఫ్‌ను అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి. ► ఇలాంటి సినిమాను చేయాలంటే అది బోయపాటి వల్లే అవుతుంది. కథ వినేటప్పుడు.. తెర మీదకు వెళ్లేటప్పటికి చాలా హైలో ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. బాలకృష్ణ నేను కలిసి ఓ ఫైట్ కోసం తొమ్మిది రోజులు మైనింగ్ ఏరియాలో కష్టపడ్డాం. ► థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ వేరు. ఓటీటీలో అయితే ఇంట్లో ఒకరిద్దరం కూర్చుని చూస్తాం. కానీ ఇలాంటి సినిమాను అందరి మధ్య కూర్చుని చూస్తూ విజిల్స్ వేస్తూ చూడాలి. అప్పుడే మజా ఉంటుంది. ► పునీత్ రాజ్ కుమార్‌తో ఓ సినిమాలో విలన్‌గా నటించాను. శంకర్ రామ్ చరణ్ సినిమాలో ఓ పాత్రను చేస్తున్నాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. -
బాలకృష్ణ సర్జరీ వల్ల సింపుల్‌గా ప్లాన్ చేశాం: నిర్మాత
Akhanda Movie Producer Miryala Ravinder Reddy: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కరోనా రాకముందే ఈ సినిమాను ప్రారంభించాం. కరోనా సమయంలో టీజర్ విడుదల చేశాం. ఫస్ట్ లాక్డౌన్ అయ్యాక షూటింగ్ చేశాం. సెకండ లాక్డౌన్లో చిన్న టీజర్ విడుదల చేశాం. సెకండ్ లాక్డౌన్ తరువాత క్లైమాక్స్ షూట్ చేశాం. అన్ని కరోనాల తరువాత ఇప్పుడు సినిమాను విడుదల చేస్తున్నాం. పెద్ద సినిమాల ప్రయాణం ఎలా ఉండబోతోందనేది అఖండతోనే తెలుస్తుంది. ► బాలకృష్ణ గారితో జర్నీని మాటల్లో చెప్పలేను. బయట మాట్లాడుకునే బాలకృష్ణ గారు వేరు. ఆయనతో కలిసి ట్రావెల్ చేశాక కనిపించే బాలకృష్ణ గారు వేరు. స్క్రీన్ మీద బాలకృష్ణ వేరు. ► డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి విడుదల తేదీని నిర్ణయించారు. మేం డిసెంబర్ 24న రావాలని అనుకున్నాం. కానీ డిసెంబర్ 2 అనేది సరైన తేదీ అని అంతా అనుకున్నారు. ► సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరువాత.. చివరి వరకు అలా చూస్తుండిపోతారు. విజువల్ వండర్‌గా ఉంటుంది. ► ఏ సినిమాకైనా కథే ముందు. ఆ తరువాతే స్టార్ హీరో అయినా స్టార్ డైరెక్టర్ అయినా. అయితే పెద్ద హీరోలకు కథ లైన్‌గా ఉన్నా పర్లేదు. వారే మోస్తారు. వారి అభిమానులు ముందుకు తీసుకెళ్తారు. ► బాలకృష్ణ గారి వందో సినిమాను బోయపాటి గారు చేయాలి. లెజెండ్ సినిమా సమయంలోనే మహజ్జాతకుడు అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా కథను బాలకృష్ణ గారికి బోయపాటి గారు వినిపించారు. అన్నీ కుదిరాయి. ద్వారకా క్రియేషన్స్, రవీందర్ రెడ్డిగారితో చేద్దామని బాలకృష్ణతో బోయపాటి గారు అన్నారు. ► అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక.. ఆ టైటిల్ ఎందుకు పెట్టారా? అని తెలుస్తుంది. కథకు టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ► అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తిగతం కన్నా.. దైవం, ప్రకృతి వాటిపై రియాక్ట్ అవుతుంటారు. అలాంటి కారెక్టర్ రావడం, సమస్యలను పరిష్కరించడమనేది కథ. ► బోయపాటి గారి కెరీర్లో, బాలకృష్ణ గారి కెరీర్లో ఇంత వరకు ఇన్ని స్క్రీన్లలో విడుదలైన సినిమా మరొక్కటి లేదేమో. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో అఖండ రావొచ్చు. ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. మెల్బోర్న్లో అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటకే ఫుల్ అయిపోయాయి. ► సినిమా అంటే వ్యక్తిగతం, మన నలుగురికి మాత్రమే సంబంధించింది. వాళ్లు తీసుకునే నిర్ణయాలు వారికి కరెక్ట్ అనిపించొచ్చు. మనకు ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం గౌరవించాల్సిందే. ► కరోనా, టిక్కెట్ల రేట్ల పెంపు అనేవి లేనప్పుడు ఈ సినిమాను ప్రారంభించాం. దానికి తగ్గట్టే బడ్జెట్ అనుకున్నాం. కానీ పరిస్థితుల వల్ల బడ్జెట్ పెరిగింది. ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మాకు అంత లాభం రాకపోవచ్చు. ► కరోనా వల్ల బయటకు వెళ్లి షూటింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇక్కడే సెట్స్ వేసి చేశాం. క్లైమాక్స్‌ను అరుణాచలంలోని ఓ గుడిలో షూట్ చేశాం. ఆ టెంపుల్ అద్భుతంగా ఉంటుంది. ► ఇందులో రెండు పాత్రలు అని చూడకూడదు. ఆ రెండో పాత్ర సూపర్ మ్యాన్. మనిషికి ఎక్కువ దేవుడికి తక్కువ. సూపర్ హీరో. ► ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తులో ప్లాన్ చేశాం. కానీ బాలకృష్ణ గారికి సర్జరీ జరగడంతో సింపుల్‌గా చేయాలని అనుకున్నాం. అందుకే శిల్పా కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. ► లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో.. అఖండ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ టర్న్ అవుతుంది. ఈ చిత్రంలో జగపతి బాబు గారు కూడా ఉన్నారు. కొన్ని సీన్లే ఉంటాయి. కానీ సినిమాను గైడ్ చేసే ఇంపార్టెంట్ రోల్ పోషించారు. ► మేం నమ్మినదాని కంటే.. ఎక్కువగా తమన్ నమ్మాడు. అనుకున్న దాని కంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ తరువాత తమన్ గురించి మాట్లాడుకునేది ఎక్కువగా ఉంటుంది. ► హీరోయిన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ఇచ్చి ఇలా వెళ్లే పాత్ర కాదు. ► కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి సినిమాలే చేస్తాను. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. -
అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశా, ఆ పాటకు నెల రోజులు పట్టింది: తమన్
సినిమాకు ఏం కావాలో అది చేస్తాను. ఎక్కువ ఖర్చు అనేది నేను అంగీకరించను. ఒక్కో పాటకు ఒక్కోలా చేయాల్సి ఉంటుంది. శంకర్ మహదేవన్ పాడితే బాగుంటుందని అనుకుంటే.. ఆయనతోనే పాడిస్తాం. అంతే కానీ ఖర్చు తక్కువ అవుతుందని వేరే వాళ్లతో పాడించను’అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ( Akhanda)`కు సంగీతం అందించాడు తమన్. ఈ మూవీ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►కరోనా వల్ల సినిమాలో మార్పులు వచ్చాయి. కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చాను. విడుదలయ్యే టైంకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలి. అందుకే మళ్లీ రీరికార్డింగ్ చేశాను. అఖండ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. మంచి రేసుగుర్రంలా బోయపాటి గారు పరిగెత్తారు. మా అందరినీ పరిగెత్తించారు. ►ఈ సినిమాలో ఫైర్ ఉంది. ఇందులో ఎమోషన్ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి. బాలయ్య గారు అదరగొట్టేశారు. ఇది పర్ఫెక్ట్ మీల్లాంటి సినిమా. ►అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాం. చాలా బాగా వచ్చింది. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య గారు మెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకు త్వరగా ఏజ్ అవుతుంది. కానీ బోయపాటి గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ►మా మ్యూజిక్‌ను జనాల్లోకి తీసుకెళ్లేదే హీరోలు. వారి వల్లే అందరికీ రీచ్ అవుతుంది. ఈ చిత్రంలో బోర్ కొట్టే సీన్స్ ఉండవు. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో చేయడం చాలా కొత్త. సపరేట్గా ఇద్దరికి పని చేయడం వేరే.. ఇలా ఈ ఇద్దరికి కలిపి చేయడం వేరు. ఇది వేరే ఫైర్. ►ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. అఘోరాల గురించి చాలా రీసెర్చ్ చేశాం. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్లో ఉంటుంది. ► అఘోర అంటేనే సైన్స్. వాళ్లు అలా ఎందుకు మారుతారు? అనే విషయాలపై సినిమా ద్వారా క్లారిటీ వస్తుంది. దేవుడిని ఎందుకు నమ్మాలి అనే దాన్ని క్లారిటీగా చూపిస్తారు. సినిమా చూసి మా టీం అంతా కూడా చాలా హైలో ఉన్నాం. ►నిర్మాత చాలా మంచివారు. ఆయన సినిమాలకు చెందిన వ్యక్తి కాదు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలిసిన వారు. ద్వారక క్రియేషన్స్‌లో పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ►ఇలాంటి జానర్లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది. కమర్షియల్ సినిమా అంటే అన్నీ స్పైసీగా ఉండాలి. కానీ ఇలాంటి చిత్రాలకు అది కుదరదు. టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు దాదాపు ఓ నెల రోజులు పట్టింది. గొప్ప సన్నివేశం తరువాత ఆ పాట వస్తుంది. ►డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే మాకు ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లుంటే మాకు కూడా ఊపు వస్తుంది. ఇందులో శ్రీకాంత్ , జగపతి బాబు అద్భుతంగా కనిపిస్తారు. ►మ్యూజిక్ అనేది చాలా ముందుకు వచ్చింది. పెళ్లికి ముందు గ్రీటింగ్ కార్డ్‌లా మ్యూజిక్ మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇంకో పది, ఇరవై ఏళ్లు ఉంటుంది. ఈ ట్రెండ్ మంచిది. పాట హిట్ అయితే సింగర్ల గురించి వెతుకుతారు. కానీ ఇప్పుడు సింగర్లు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుస్తోంది. వారి ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూసి సంతోషిస్తారు. ఆ విషయంలో హీరోలకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్, హీరోలు అందరూ ఒప్పుకుని ప్రోత్సహిస్తున్నారు. ఇలా పాటలను విడుదల చేయడం వల్ల ఆడియో కంపెనీలకు రెవెన్యూ కూడా వస్తోంది. -
టాలీవుడ్‌కి మరో స్టార్ విలన్ దొరికినట్లేనా?
టాలీవుడ్ విలన్స్ లో బోయపాటి మూవీ విలన్స్ మరీ క్రూయెల్ గా ఉంటారు. లెజెండ్ లో జగపతి, సరైనోడు లో ఆదిపినిశెట్టి, వినయ విధేయ రామలో వివేక్ ఓబెరాయ్ పవర్ ఫుల్ విలన్స్ గా కనిపించారు. ఇప్పుడు ఇదే రేంజ్ విలనీతో ఆడియెన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు హీరో శ్రీకాంత్. బాలయ్య-బోయపాటి కాంబో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అందులో హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో క్రూరమైన లుక్స్ తో బాలయ్యనే భయపెడుతున్నాడు. శ్రీకాంత్ కు కంప్లీట్ గా న్యూ ఇమేజ్ ఇచ్చేందుకు బోయపాటి పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ను డిజైన్ చేసాడట. గతంలో లెజెండ్ తో జగపతిబాబును విలన్ గా మార్చి అతనికి స్టార్ డమ్ తీసుకొచ్చాడు బోయపాటి. ఇప్పుడు సేమ్ సీన్ శ్రీకాంత్ విషయంలోనూ రిపీట్ అవుతుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. అఖండలో శ్రీకాంత్ విలనీ వర్క్ అవుట్ అయితే మాత్రం టాలీవుడ్ లో మరో స్టార్ విలన్ అందుబాటులోకి వచ్చినట్లే లెక్క. -
Akhanda Movie Images: బాలకృష్ణ 'అఖండ' మూవీ స్టిల్స్
-
బాలయ్య ‘అఖండ’ ట్రైలర్: నెట్టింట మొదలైన మీమ్స్ రచ్చ..అన్నీ అరాచకాలే!
టాలీవుడ్లో నటసింహం నందమూరి బాలక్రిష్ణ, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా మాస్ కాంబో వినే ఉంటాం అయితే వీరిద్దరిది ఊర మాస్ కాంబో. ప్రస్తుత రోజుల్లో బాలయ్యతో పక్క యాక్షన్ చిత్రం తీయాలంటే అది తనతోనే సాధ్యమని నిరూపించుకున్నారు బోయపాటి. పైగా ఇప్పటి వరకు ఈ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడమే కాక సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కలయికలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాపై అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉండడంతో బాలయ్య ఫ్యాన్స్‌కు దీపావళి మళ్లీ వచ్చినట్లు ఉంది. ఇప్పటికే ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోపై కోటి వ్యూస్‌ను తెచ్చుకొని యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. మరో వైపు ఈ సినిమా ట్రైలర్‌పై సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు, నెటిజన్లు సినిమాలోని సన్నివేశాలపై మీమ్స్ క్రియేట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘అఖండ’ ట్రైలర్ మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. అందులో.. ట్రైలర్‌లోని మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఇలా ఏ ఒకదాన్ని వదలకుండా మీమ్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ ట్రైలర్‌పై ఫన్నీగా మీమ్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. Bulldozer Balayya Babu🔥🔥🔥 #AkhandaTrailerRoar #NandamuriBalakrishna pic.twitter.com/NIjlLfmMIx — Prabhas (@Prabhas280) November 14, 2021 Typical Indian mother's waking up kids by changing time be like:#AkhandaTrailerRoar pic.twitter.com/iaCrPHUoCe — Prasanth🎶 (@EvarSirMeeru) November 14, 2021 Theaters situation on December 2nd🔥💥🥁 Maass Jathare 🥁🔥💥#AkhandaTrailerRoar pic.twitter.com/1ffrMvUWrG — Balayya Trends (@NBKTrends) November 14, 2021 Me in theater #AkhandaTrailerRoar pic.twitter.com/uSINv0pTkW — Deepika (@Deepika__DC) November 14, 2021 -
అఖండ ట్రైలర్: బాలయ్య నట గర్జన చూశారా?
Nandamuri Balakrishna Akhanda Trailer Released: సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 'విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు' అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. 'అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్లకాలువ' అని డైలాగ్‌తో గర్జించాడు బాలయ్య. ఆశ చచ్చిపోయినప్పుడు, నమ్మకానికి చోటు లేనప్పుడు, విధ్వంస శక్తులు విరుచుకుపడినప్పుడు అఖండ వస్తాడు, కాపాడతాడు అంటూ బాలయ్య అఘోరాగా నటించిన మరో పాత్ర అఖండ పవర్ గురించి చెప్పారు. 'ఒక మాట నువ్వంటే అది శబ్ధం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం'', మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్' అని అఘోరాగా బాలయ్య గర్జించిన డైలాగులు మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
గూస్బంప్స్ తెప్పిస్తున్న 'అఖండ' టైటిల్ సాంగ్
Akhanda Title Song Released: బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి అఖండ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ ఆలపించిన ఈ సాంగ్ భారీ విజువల్స్‌తో గూస్బంప్స్ తెప్పిస్తుంది. పాట విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సింహా’,‘లెజెండ్’వంటి బెగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
'అఖండ' హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు వైరల్
Pragya Jaiswal HD Images: మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కంచె' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకీ నాయకా' సినిమాలో నటించిన ప్రగ్యా ఇప్పుడు మరోసారి ఆయన దర్శక్వంలో అఖండ సినిమాలో నటిస్తుంది. బాలయ్యకు జోడీగా తొలిసారి నటించిన ప్రగ్యాకు సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది. ఇటీవలె సూట్, చీర కాంబినేషన్లో ధరించిన కాస్ట్యూమ్స్ ఆకట్టుకుంటున్నాయి. టైమ్స్ బిజినెస్ అవారర్డ్స్ 2021 సందర్భంగా ఈ భామ తళుక్కున మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న అఖండ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తియ్యింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రటించే అవకాశం ఉంది. -
Akhanda: ఫీల్‌గుడ్ మెలోడితో వచ్చిన బాలయ్య.. సాంగ్ అదిరింది!
సింహా’,‘లెజెండ్’వంటి బెగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. ‘అడిగా అడిగా’ అంటూ సాగే ఈ ఫీల్‌గుడ్ మెలోడికి కల్యాణ చక్రవర్తి లిరిక్స్ అందించగా, ఎస్పీ చరణ్, ఎంఎల్ శృతి అద్భుతంగా ఆలపించారు. త్వరలోనే షూటింగ్ ముగించుకొన్న ఈ చిత్రం.. విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. -
తమిళనాడులో ‘అఖండ’ హల్చల్.. దేవాలయంలో క్లైమాక్స్ ఫైట్ సీన్
‘సింహా’,‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఉగాది కానుకగా టైటిల్ రోర్ పేరుతో వదిలిన టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ తమిళనాడులో ప్రారంభమైంది. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్లో బాలకృష్ణ సహా ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ ఈ ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో మరో హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. -
స్టార్ట్..కెమెరా..యాక్షన్ : వరుసగా షూటింగులు
తెలుగు చిత్ర పరిశ్రమలో సోమవారం ‘యాక్షన్.. స్టార్ట్’ అంటూ షూటింగ్స్ సందడి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన చిత్రాలతో పాటు కొత్త సినిమాల షూటింగ్స్ కూడా మొదలయ్యాయి. అఖిల్ ‘ఏజెంట్’ లుక్ విడుదల చేసి, షూటింగ్ ఆరంభించారు. రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’ లుక్‌ని విడుదల చేయడంతో పాటు షూటింగ్ షురూ చేశారు. ఇక మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’, బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాల షూటింగ్ పునః ప్రారంభమైంది. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ కూడా ఆరంభమైంది. ► అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాతో సాక్షీ వైద్య హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సరెండర్–2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అఖిల్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘కిక్, రేసుగుర్రం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కాంబినేషన్లో ‘ఏజెంట్’ రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్ సుంకర, పత్తి దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. ► రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామారావు: ఆన్ డ్యూటీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ కథానాయిక. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. రవితేజ, దివ్యాంశా కౌశిక్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ► మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, సీఈఓ: చెర్రీ. ► బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రధారి. ► రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్. -
కథ క్లైమాక్స్‌కు, లొకేషన్ వెతుకుతున్న బోయపాటి
సాక్షి, తిరుమల: దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు బుధవారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.. 'అఖండ' సినిమా క్లైమాక్స్ షూటింగ్ లొకేషన్ కోసం వెతుకుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షాలు ఉండటంతో కడపలో లొకేషన్ చూస్తున్నామన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తిని బట్టి అఖండ సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాగా బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో అఖండపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది పూర్తవగానే బన్నీతో ఓ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మురగదాస్‌తో గజినీ సీక్వెల్ చేసే అవకాశం ఉంది. చదవండి: అలా లీనమైపోయిన నివేథా.. వీడియో వైరల్ -
Balakrishna: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది. బాలయ్య బర్త్‌డే(జూన్ 10)సందర్భంగా ఆయన నటించబోయే 107వ సినిమా పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ బ్యానర్‌పై నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్‌తో పాటు ఇంట్రడ్యూసింగ్ వీడియోను దర్శకుడు గోపిచంద్ మలినేని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.‘క్రాక్’ విజయం తర్వాత బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని ఓ మాస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . ఈ మేరకు 107వ చిత్రంలో బాలయ్య మాస్ లుక్‌లో సందడి చేసే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. చదవండి: బాబాయ్‌కి అబ్బాయిలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బర్త్‌డే విషెస్ Akhanda: బాలయ్య బర్త్‌డే సర్ప్రైజ్.. నవ్వుతూ నటసింహం అలా.. -
Akhanda: బాలయ్య బర్త్‌డే సర్ప్రైజ్.. నవ్వుతూ నటసింహం అలా..
‘సింహా’,‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఉగాది కానుకగా టైటిల్ రోర్ పేరుతో వదిలిన టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. Wishing our #Akhanda, #NandamuriBalakrishna garu A very Happy Birthday. Here's #AkhandaBirthdayRoar for you💥💥#HBDBalakrishna #HappyBirthdayBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @IamJagguBhai @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/QI9EKzYHuw — Dwaraka Creations (@dwarakacreation) June 9, 2021 తాజాగా బాలయ్య పుట్టిన రోజు (జూన్ 10) సందర్భంగా బుధవారం సాయంత్రం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. బర్త్ డే విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన 'అఖండ' న్యూ పోస్టర్ లో బాలకృష్ణ నవ్వుతూ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. కలర్ ఫుల్ గా ఉన్న బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఇది సెలబ్రేషన్ మూడ్ లో వచ్చే సాంగ్ లోదని అర్థం అవుతోంది. కొత్త పోస్టర్ విడుదలతో ఒక్క రోజు ముందే నందమూరి అభిమానుల్లో పుట్టిన రోజు సంబరాలు మొదలయ్యాయి. ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన స్టార్ హీరోలు.. ఒక్కో సినిమాకు ఎంతంటే.. PSPK28: ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్.. స్పందించిన నిర్మాణ సంస్థ -
బాలయ్య సినిమాకు నో చెప్పిన రకుల్.. కారణం ఇదేనట!
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘అఖండ’తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కు ప్రాధాన్యం ఉందట. అందులో ఓ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించారట. కాని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం బాలయ్యకు నో చెప్పిందట. బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక బాలయ్య సినిమాకి నో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో 'ఎటాక్', 'మే డే' లో హీరోయిన్గా నటిస్తోంది. ఇక అంతకు ముందు బాలయ్య సినిమాలో హీరోయిన్ కోసం దర్శకుడు గోపీచంద్ శ్రుతిహాసన్ని సంప్రదించాడట. ‘సలార్' సినిమా కారణంగా డేట్లు కుదరడం లేదని ఆమె కూడా నో చెప్పినట్లు వార్తలు వినిపించాయి. ఇక అఖండ విషయానికి వస్తే.. నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అంతకు ముందు వీరిద్దరి కాంబోలో సింహ, లెజెండ్ లాంటి సూపర్ చిత్రాలు వచ్చాయి. దీంతో మూడో చిత్రం అఖండపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. -
నందమూరి ఫ్యాన్స్‌కి బాలయ్య బాబు అదిరిపోయే అప్డేట్
నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు బాలకృష్ణ. ఈ మేరకు రేపు (మే 27) ఉదయం 8.45 గంటలకు ఓ చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం బాలకృష్ణకు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అందులో ఎన్టీఆర్ ఫోటో ఉంచడంతో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం వరకూ పూర్తైంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. 'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్ల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ‘అఖండ’నుంచి ఓ పాట విడుదల కాబోతుందని ప్రచారం కూడా జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలనే రేపు వెల్లడిస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’విడుదల చేయనున్నాడని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి బాలయ్య బాబు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. A surprise at 8:45AM tomorrow. Stay Tuned.#NandamuriTarakaRamaRao #NandamuriBalaKrishna@NBKFilms_ pic.twitter.com/NtJkF4cuc9 — NBK FILMS (@NBKFilms_) May 26, 2021 -
బాలయ్యను చూసి ఆశ్చర్యపోయా: ప్రగ్యా జైస్వాల్
నటసింహం నందమూరి బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. సెట్లో ఆయనను చూసి ఆశ్చర్య పోయానని చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. పక్కా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్లో పాల్గొన్న ప్రగ్యా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలను పంచుకుంది. ‘‘అఖండ’లో అవకాశం వచ్చిందనగానే భయపడిపోయాను. బాలయ్యకు కోపం ఎక్కువనీ.. సెట్లో ఉన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండాలని కొందరు చెప్పడమే నా భయానికి కారణం. అయితే వాళ్ళు చెప్పినట్టు కాకుండా సెట్లో ఆయన చాలా సరదాగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయా. జోక్స్ వేస్తూ ఎప్పుడూ నవ్విస్తుంటారు. ఆయన కూల్‌గా ఉండటంతో ధైర్యంగా నటించాను’ అని చెప్పుకొచ్చింది ప్రగ్యా. అంతేకాదు నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. ఇక అఖండ విషయానికి వస్తే.. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
బాలయ్య సినిమాలో మీనా.. ప్రత్యేకంగా ఆ సీన్ కోసమేనట
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అఖండలో మాదిరే ఈ సినిమాలోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కన్పించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సీనియర్ హీరోయిన్ మీనా కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం బాలయ్య ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో బాలకృష్ణకు జోడీగా మీనా కనిపించనున్నారట. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన ఆయన భార్య పాత్రలో మీనా నటించబోతోందని సమాచారం. ఇక మెయిన్ హీరోయిన్గా శృతిహాసన్ నటించబోతున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. ఇక మీనా విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే'లో నటిస్తుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
టీజర్ హిట్.. రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరిగింది. ఒక్కో సినిమా వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. దీంతో మన హీరోలు రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.50 నుంచి 70 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. యంగ్ హీరోలు సైతం ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పుచ్చకుంటున్నారు. కానీ సీనియర్లు హీరోలలో ఒక్క చిరంజీవి తప్ప మిగతావారంతా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నాగార్జున, వెంకటేశ్‌లు సినిమాను బట్టి రూ.5 నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటున్నటు సమాచారం. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు పుచ్చుకుంటున్నారట. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’కు కూడా బాలయ్య రూ.7 కోట్లు తీసుకుంటానని మొదట ఒప్పుకున్నాడట. కానీ ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన రావడంలో తన రెమ్యునరేషన్‌ని పెంచాడట ఈ నందమూరి నటసింహం. యూట్యూబ్‌లో అఖండ టీజర్ దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టి రికార్డుని క్రియేట్ చేసింది. ఇక ఈ టీజర్ సూపర్ హిట్ కావడంతో బాలయ్య తన పారితోషికాన్ని మరో మూడు కోట్లు పెంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే అఖండ కోసం బాలయ్య మొత్తంగా రూ.10 కోట్లు తీసుకోబోతున్నారన్నమాట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కోసం దర్శకుడు బోయపాటి శ్రీను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. రూ.70 కోట్లతో ఈ సినిమా రూపొందుతుంది. బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. అందుకే బోయపాటి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా విడుదల తర్వాత నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే బాక్సాఫీస్ ప్రాఫిట్ బట్టి దర్శకుడికి షేర్స్ ఇస్తారని సమాచారం. -
‘అఖండ’ రికార్డు.. జై బాలయ్య.. నీకు ఎదురే లేదయ్యా
నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి సినిమా వస్తుదంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. అందులోనూ బోయపాటి శ్రీనుతో సినిమా అంటే..ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటాయి.‘సింహా’, ‘లెజెండ్’ వంటి బెగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోడ్ ‘అఖండ’ వీడియో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇంతవరకూ చూడని సరికొత్త లుక్‌లో బాలయ్య కనిపించడం, తమన్ బ్యాక్‌గ్రౌండ్ సంగీతం అదిరిపోవడంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ టీజర్ ఇప్పటికే ఈ టీజర్ 33మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి బాలకృష్ణ కెరీర్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలుకొట్టింది. 386k పైగా లైక్స్‌తో ‘అఖండ’ దూసుకెళ్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే బాలయ్య బ్యాచ్ ఇంత వరకు ఏ హీరోకి రానన్ని వ్యూస్, లైకులు ఈ టీజర్ దక్కించుకుంది. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌కి 19మిలియన్లు వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ రెండు చిత్రాల టీజర్లపై చర్చ జరుగుతోంది. చిరంజీవి సినిమా టీజర్‌ను మించి ఎక్కువ వ్యూస్ సాధించడంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరం చేసుకుంటున్నారు. ‘జై బాలయ్య.. నీకు ఎదురే లేదయ్యా’అంటూ నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'అఖండ'లో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా... ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మెగాస్టార్ రికార్డును బద్దలు కొట్టిన బాలయ్య
"కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.." ఇదిప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానుల ఫేవరెట్ డైలాగ్. కేవలం డైలాగ్ మాత్రమే కాదు, స్వామీజిగా దర్శనమిచ్చిన బాలయ్య లుక్స్‌కు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. యూట్యూబ్‌లో రికార్డులను సైతం తిరగరాస్తోంది. అఖండ టీజర్ విడుదలైన 25 గంటల్లో 12 మిలియన్ల వ్యూస్ రాగా ఆరు రోజులకే 27 మిలియన్ల వ్యూస్ దాటేసింది. రెండు నెలల క్రితం రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా టీజర్‌కు మాత్రం ఇప్పటివరకు 19 మిలియన్ల వ్యూసే వచ్చాయి. 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ నెల రోజుల్లో 7 మిలియన్ల వ్యూస్ మాత్రమే రాబట్టింది. దీంతో బాలయ్య సినిమా రిలీజ్‌కు ముందే తన హవా చూపిస్తున్నాడని ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. మొత్తానికి హీరోల రికార్డులను ఒక్క టీజర్‌తో బద్దలు కొట్టేశాడు బాలయ్య. కాగా బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో వస్తున్న 'అఖండ' సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చదవండి: Akhanda: అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య