
Balakrishna Akhanda, Fans Celebrations At Bramaramba Theatre: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు(డిసెంబర్2)న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.
బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో తెల్లవారుజామున బెనిఫిట్ షో వేయగా.. అర్థరాత్రి నుంచే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. థియేటర్ ప్రాంగణమంతా జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. బాలయ్య విశ్వరూపం చూపించారని, మాస్ జాతర అంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సెలబ్రేషన్స్‌తో హంగామా సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.