bramaramba
-
దుర్గాదేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైనున్న జగజ్జనని దుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. మహాగౌరిగాశ్రీశైల భ్రమరాంబ శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నందివాహనంపై ఆసీనులను కావించి అలంకార మండపంలో ఉంచారు. తేజోనిధిగా సూర్య ప్రభపై.. నక్షత్ర వెలుగులో చంద్రప్రభపై తిరుమల కొండ మీద శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ సంబరం అంబరాన్ని తాకేలా సాగుతోంది. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్యప్రభపై ఊరేగుతూ స్వర్ణకాంతులతో దివ్యతేజోమూర్తి భక్తులకు దర్శనమి చ్చారు. రాత్రి చంద్రప్రభపై చల్లని చంద్రకాంతుల్లో భక్తులను అనుగ్రహించారు. శ్రీవేంకటేశ్వరుడికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు. సూర్యుడు తేజోనిధి, ప్రకృతికి చైతన్య ప్రదాత, సకల రోగాల నివారకుడు. స్వర్ణకాంతులీనే భాస్కరుడిని సప్తఅశ్వాల రథసారధిగా చేసుకుని మలయప్ప మత్స్య నారాయణుడి అలంకారంలో స్వర్ణ కాంతులీనుతూ ఉదయం వేళ తిరుమాడవీధుల్లో వైభవంగా విహరించారు. ఇక భగవంతుని మారు రూపమైన చంద్రుడిని వాహనంగా మలుచుకున్న వేంకటాచలపతి రాత్రి వేళలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు. -
Akhanda Movie: జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
Balakrishna Akhanda, Fans Celebrations At Bramaramba Theatre: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు(డిసెంబర్2)న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో తెల్లవారుజామున బెనిఫిట్ షో వేయగా.. అర్థరాత్రి నుంచే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. థియేటర్ ప్రాంగణమంతా జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. బాలయ్య విశ్వరూపం చూపించారని, మాస్ జాతర అంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సెలబ్రేషన్స్‌తో హంగామా సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
నిజాయితీకిదా నజరానా!
శ్రీకాళహస్తి రూరల్: ముక్కుసూటి అధి కారిగా పేరు తెచ్చుకున్న శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వహణాధికారిణి భ్రమరాంబ మంగళవారం బదిలీ అయ్యారు. ఈమె స్థానంలో తొలిసారి ఐఏఎస్ అధి కారి బాధ్యతలు స్వీకరించనున్నారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామస్వామిని ఇక్కడకు కార్యనిర్వహణాధికారిగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతానికి బ్రమరాంబకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఎండోమెంట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తశుద్ధితో ముందడుగు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే భ్రమరాంబను బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం మాస్టర్ ప్లాన్ అమలు పూర్తికాకమునుపే ఈమెకు స్థాన చలనం కల్పించడం చర్చనీయాంశమైంది. 2015 అక్టోబర్ 8న ఆమె ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ మూడుసార్లు శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహిం చారు. మూడుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిం చిన ఘనత ఈమెకే దక్కింది. రూ. 2కోట్ల వ్యయంతో భరద్వాజ తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఆమె బాధ్యతలు స్వీకరించాక గోశాలను గాడిలో పెట్టారు. అంతకుముందు దీని పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. నర్సరీ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపారు. ఆలయ ఆవరణలో దళారీ వ్యవస్థను నిర్మూలించటంలో చాలామటుకు సఫలీకృమయ్యారు. ఆలయంపై స్థానిక అధికార పార్టీ నాయకుల పెత్తనాన్ని నియంత్రించగలిగారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నివాసం కోల్పోతున్న యజమానులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై కొంత మేర సక్సెస్ అయ్యారు. కొంతమంది యజమానులకు నష్టపరిహారం అందించి స్వాధీనం చేసుకుని ఇళ్లను తొలగించారు. ఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈమె నిబద్ధతగా వ్యవహరించేవారని ఆలయ ఉద్యోగులు చెబుతారు. వివాదాలు చోటుచేసుకున్నా నిర్ణయం అమలులో తనదైన పంధాలో ముందుకు వెళ్లారు. పాలకమండలి, అర్చకులు, వేద పండితులు తిరుగుబాపుటా ఎగురవేసినా పట్టించుకోలేదు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి తనిఖీల పేరుతో ఆలయానికి వచ్చి హడావుడి చేసేవారు. ఎమ్మెల్యే కుమారుడు ఆలయంలో ఆధిపత్యం కొనసాగాలనే విధంగా ఉండేవారు. వీరిద్దరి జోక్యం ఆలయంపై పడనీయకుండా అడ్డుపడగలిగేవారు. ఈమె నిర్ణయాలు అధికారపార్టీ నాయకులకు మింగుడుపడేవి కావు. రెండేళ్ల నుంచి ఈమెను బదిలీ చేయాలని అధికార పక్షం నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిసింది. అవినీతి ఆరోపణ లేకపోయినా బదిలీ చేయడం..వెంటనే పోస్టింగ్ ఇవ్వకపోవడంపై ఆలయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నా యి. నిజాయితీ అధికారుల పట్ల టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఇది దర్పణం పడుతోందని ఆ వర్గాలు నిరసిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ పూర్తి అయ్యే వరకు ఇక్కడే విధులు నిర్వహించాలని భ్రమరాంబ భావిస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఐఎఎస్ సారథ్యం.. ముక్కంటి ఆలయానికి గణనీయంగా వార్షిక ఆ దాయం పెరగటంతో 15 సంవత్సరాల నుంచి ఐ ఏఎస్ అధికారిని ఈఓగా నియమించాలనే ఒత్తిళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఆర్డీఓ, ఆర్జేసీ హో దా కలిగిన వారిని మాత్రమే నియమిస్తూ వచ్చా రు. ఎట్టకేలకు ఐఏఎస్ అధికారికి పరిపాలనా బా ధ్యతలను అప్పగించారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా సుమారు 290 భవనాలను స్వాధీనం చేసుకుని రూ.300 కోట్లతో ఆలయాన్ని విస్తరించేందుకు ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వవర్గాలు సమర్ధించుకుంటున్నాయి. కొత్త ఈఓ రామస్వామి ఆలయ ఈఓగా నియమితులైన ఎస్.రామస్వామి ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన వారు. కర్నూలు జిల్లాలో సుదీర్ఘకాలం పాటు డీఆర్వోగా, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌గా, జేసీ–2గా సమర్థంగా విధులు నిర్వర్తించారు. రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయిన రామస్వామి అనేక ఘటనలపై విచారణాధికారిగా నియమితులై.. నిష్పక్షపాతంగా పనిచేశారు. ఈయన నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నా యి. -
శ్రీభ్రమరాంబదేవికి లక్షకుంకుమార్చన
శ్రీశైలం: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో అష్టాదశశక్తిపీఠమై వెలిసిన శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి ఆదివారం లక్ష కుంకుమార్చన పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చక, వేదపండితులు శ్రీఅమ్మవారికి నవావరణపూజ, విశేష కుంకుమార్చన తదితర పూజాదికాలను శాస్త్రోక్తంగా జరిపారు. దేవస్థానం నిర్వహిస్తోన్న మాసోత్సవాల్లో మూలానక్షత్రం, పౌర్ణమి రోజుల్లో శ్రీభ్రమరాంబదేవికి లోకకల్యాణార్థం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపడం ఆనవాయితీగా వస్తుందని అధికారులు తెలిపారు. -
భ్రామరికి బంగారు హారం
శ్రీశైలం : శ్రీ భ్రమరాంబాదేవికి సంక్రాంతి పర్వదినాన శనివారం.. నిజమాబాద్‌కు చెందిన ఆర్ శోభారాణి 58 గ్రాములతో తయారు చేయించిన బంగారు హారాన్ని సమర్పించారు. శ్రీస్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించుకున్న అనంతరం హారానికి సంప్రోక్షణ పూజలను నిర్వహించి..ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డికి అందజేశారు. -
నందివాహనంపై కైలాసనాథుడు
-
శ్రీశైలంలో ఘనంగా శమీపూజ
- నందివాహనంపై కైలాసనాథుడు - నిజాలంకరణలో భ్రమరాంబాదేవి - పూర్ణాహుతితో ముగిసిన రుద్ర, చండీ యాగాలు శ్రీశైలం: విజయదశమి పర్వదినాన మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో వైభవంగా శమీపూజలు నిర్వహించారు. అలంకార మండపంలో శ్రీభ్రమరాంబాదేవిని నిజాలంకరణలో అలంకరించి, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టింపజేసి ఈఓ నారాయణభరత్‌గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి, అర్చకులు విశేష వాహన పూజలను చేశారు. నందివాహనాధీశులైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ ఆలయప్రాంగణంలోని శమీ(జమ్మి) వృక్షం వద్దకు చేర్చారు. జమ్మిచెట్టుకు వేదపండితులు, అర్చకులు పూజలను చేశారు. పండుగ కావడంతో రాష్ట్రం నలమూలల నుంచి వచ్చిన భక్తులతో పాటు శ్రీౖశైలం, ప్రాజెక్టుకాలనీ, లింగాలగట్టు, బ్రహ్మగిరి, విష్ణుగిరి ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది స్థానిక భక్తులతో ఆలయప్రాంగణం కిక్కిరిసిపోయింది. పూర్ణాహుతితో ముగిసిన శ్రీదేవీశరన్నవరాత్రోత్సవాలు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల1 నుంచి ప్రారంభమైన శరన్నవరాత్రోత్సవాలు మంగళవారం ఉదయం 8.30 గంటలకు చండీ, రుద్రయాగాల పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో తొమ్మిదిరోజులపాటు శాస్త్రోక్తంగా జరిగిన ఈ యాగాలకు పూర్ణాహుతి ద్రవ్యాలను ఈఓ నారాయణ భరత్ గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి ,అర్చకులు, వేదపండితులు విశేష పూజలు చేసి హోమగుండానికి సమర్పించారు. ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థానం అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
సిద్ధిదాయినీ నమోస్తుతే
-
నేడు నిజాలంకరణలో భ్రమరాంబాదేవి
శ్రీశైలం: శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం విజయదశమిని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబాదేవిని నిజాలంకరణలో దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లను నందివాహనంపై ఊరేగిస్తూ శమి( జమ్మి) వృక్షం వద్దకు చేరుస్తారు. శమిపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవమూర్తులను తిరిగి యథాస్థానంలో ఆవహింపజేస్తారు.అలాగే దసరా ఉత్సవాలకు పూర్ణాహుతిని నిర్వహిస్తారు. -
రాజరాజేశ్వరిదేవిగా శ్రీశైల భ్రమరాంబాదేవి
-
వరాల తల్లి..సిద్ధిదాయిని
నవదుర్గల్లో తొమ్మిదో రూపం సిద్ధిదాయిని. మహర్నవమిన అమ్మవారిని సేవించే సాధకులకు సర్వసిద్ధులు లభిస్తాయని భక్తుల నమ్మకం. అమ్మవారు చతుర్భుజాలను కలిగి, పద్మాసనంపై ఆశీనురాలై కనిపిస్తారు. కుడివైపు చేతులలో గద, చక్రం, ఎడమవైపు చేతులలో పద్మాలను, శంఖం ధరించి ఉంటుంది. సాక్షాత్తు పరమశివుడు ఈమె నుంచే సిద్ధులను పొందినట్లు దేవీపురాణం చెబుతోంది. - శ్రీశైలం -
కైలాస వాహనంపై శ్రీశైలేశుడు
– కూష్మాండదుర్గగా భ్రామరి శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీశైల మల్లికార్జునుడు దేవేరీ భ్రామరితో కలిసి కైలాస వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. శ్రీశైల భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ రూపంలో దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చారణ.. మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు వాహన, అలంకార ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం కైలాస వాహనంపై అధిష్టింపజేసి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను.. అమ్మవారి అలంకారరూపాన్ని ఆలయ ప్రాంగణం నుంచి మాడ వీధుల గుండా రథశాల వద్దకు చేర్చారు. అక్కడ గ్రామోత్సవ పూజలను నిర్వహించిన అనంతరం అంకాలమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఉత్సవం కొనసాగి రాత్రి 9.30గంటలకు తిరిగి ఆలయం చేరుకుంది. -
ఉత్సవ శోభ
-
శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాల శోభ
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీదేవీశరన్నవరాత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటల తరువాత స్వామిఅమ్మవార్లును శోభాయమానంగా అలంకరించారు. శ్రీ భ్రమరాంబాదేవి శైలపుత్రి రూపంలో భక్తులకు కనులపండువగా దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయప్రాంగణానికి ఈశాన్యభాగంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శైలపుత్రి అలంకార రూపానికి, భంగివాహనంపై ఆవహింపజేసిన స్వామిఅమ్మవార్లను రాత్రి 8.30గంటలకు విశేషపూజలను నిర్వహించి ఆలయప్రదక్షిణ చేయించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం వైభవంగా సాగింది. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. – శ్రీశైలం -
అభిషేకాలకు పోటెత్తారు
మల్లన్నకు 700 పైగా సామూహిక అభిషేకాలు శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో మాసశివరాత్రి పర్వదిన సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 7.30గంటల వరకు ఆరు విడుతలుగా జరిగిన సామూహిక అభిషేకాలలో 705 టికెట్లకు పైగా విక్రయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులరద్దీ సాధారణంగానే ఉన్న అభిషేకాలు చేయించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపించారు. ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణ మండపంలో ఉదయం 6.30గంటలకు మొదట విడత బ్యాచ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30గంటల వరకు ఐదు విడతల అభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు తక్కువ సంఖ్యలో అభిషేకాలు జరిగాయి. అయితే ఒకవైపు వర్షం కురుస్తుండడంతో అభిషేకం టికెట్లు తీసుకున్న సేవాకర్తలు వేచి ఉండడానికి ఇబ్బంది పడ్డారు. సామూహిక అభిషేక సేవాకర్తలు వేచి ఉండేందుకు వీలుగా దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరారు. హరిహరరాయగోపురం పక్కనే ఉన్న దత్తాత్రేయ ఉద్యానవనంలో షెడ్డును ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాల కోసం ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. -
విరిగిపడిన కొండచరియలు
శ్రీశైలం నుంచి సాక్షి బృందం: పాతాళగంగాలోని భ్రమరాంబ స్నానపు ఘాట్ సమీపంలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. దాదాపు ఐదారు బండరాళ్లు పై నుంచి కింద పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో భక్తులు, అధికారులు, సిబ్బంది కాని ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మరోవైపు పడిన రాళ్లను ఉదయమే అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న స్లోపింగ్ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గోపాల్‌రావును ఆదేశించారు. దీంతో ఆయన భ్రమరాంబ ఘాట్‌ను రెండు గంటల సేపు మూసి వేయించి స్లోపింగ్ పనులను చేపట్టారు. దీంతో వచ్చిన భక్తులందరూ మల్లికార్జున ఘాట్‌కు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. మరోవైపు రోప్‌వేను కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆర్కే రవికృష్ణ సందర్శించి భక్తుల ఇబ్బందులను గుర్తించి వెంటనే రోప్ వే, భ్రమరాంబ ఘాట్లను పునరుద్ధరించాలి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పాతాళగంగాలోని మల్లికార్జున ఘాట్ నుంచి రెండుకు ఇరువైపు అధికారులు ఆకస్మికంగా బండపరుపు పనులను చేపట్టారు. -
భక్తులను కాపడేందుకు శ్రీశైలంలో భ్రమరాంబ కొలువు
శ్రీశైలం: భక్తులను కాపాడేందుకే శ్రీశైలభ్రమరాంబాదేవి అష్టాదశ శక్తిపీఠంగా కొలువు తీరిందనిప్రముఖ ప్రవచకులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శనివారం సాయంత్రం దివ్యపరిమళ పుష్పార్చనపై ప్రవచనాలను వినిపించారు. కార్యక్రమానికి ముందుగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు, దేవస్థానం ఈఓ నారాయణ భరత్ గుప్త, వేదపండితులు, అర్చకులు జ్యోతిప్రజ్వలన చేసి చాగంటి కోటేశ్వరరావును పుష్పాలంకతులను చేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ దంపతులు, భక్తులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఆ తరువాత చాగంటి ప్రవచనాలను వినిపిస్తూ స్వచ్ఛమైన భక్తులో ఉన్న భక్తిని, పద్మంలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదగా భ్రామరి భక్తుల్లో ఉన్న భక్తిని ఆస్వాదిస్తుందని చెప్పారు. అమ్మవారిని తొలుతగా నమస్కరించేది గంగాదేవి అని, ఆ గంగా ఇక్కడ పాతాళగంగగా శ్రీస్వామిఅమ్మవార్లను ఆరాధిస్తుందన్నారు. అటువంటి మహత్తర నదీకి పుష్కరాలు రాబోతున్నాయని, కృష్ణవేణీ నదీ త్రిమూర్తు స్వరూపమన్నారు. -
శాకాంబరిగా శ్రీభ్రమరాంబాదేవి
-
శాకాంబరీ నమో నమః
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలోని అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీభ్రమరాంబాదేవిని మంగళవారం శాకాంబరిగా అలంకరించి ప్రత్యేకపూజలను చేశారు. ఆషాఢమాస పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబాదేవి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో అలంకరించారు. సంప్రదాయానుసారం అమ్మవారికి ప్రత్యేక అర్చనలను అర్చకులు, వేదపండితులు ఏకాంతంలో నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రధాన ద్వారానికి కుడివైపు ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేయించి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అలంకరించారు. అనంతరం 10 గంటలకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు, తదితర ప్రత్యేకపూజలను జేఈఓ హరినాథ్‌రెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా చేశారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవీ, సప్తమాత్రుకలు, గ్రామదేవత అంకాళమ్మ, అమ్మవారి ఆలయప్రాంగణంలోని అష్టాదశ మహాశక్తి విగ్రహాలు, ధ్వజస్తంభాలు, అన్నదాన మందిరంలోని అన్నపూర్ణాదేవి వార్లను పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. అమ్మవారిని శాకలతో అర్చించడంతో అతివష్టి అనావష్టి తొలగి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి కరువు కాటకాలు నివారింపబడుతాయని పురాణాలు చెబుతున్నట్లు జేఈఓ వెల్లడించారు..