శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాల శోభ
శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాల శోభ
Published Sat, Oct 1 2016 11:17 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీదేవీశరన్నవరాత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటల తరువాత స్వామిఅమ్మవార్లును శోభాయమానంగా అలంకరించారు. శ్రీ భ్రమరాంబాదేవి శైలపుత్రి రూపంలో భక్తులకు కనులపండువగా దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయప్రాంగణానికి ఈశాన్యభాగంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శైలపుత్రి అలంకార రూపానికి, భంగివాహనంపై ఆవహింపజేసిన స్వామిఅమ్మవార్లను రాత్రి 8.30గంటలకు విశేషపూజలను నిర్వహించి ఆలయప్రదక్షిణ చేయించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం వైభవంగా సాగింది. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
– శ్రీశైలం
Advertisement
Advertisement