శ్రీభ్రమరాంబదేవికి లక్షకుంకుమార్చన
శ్రీశైలం: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో అష్టాదశశక్తిపీఠమై వెలిసిన శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి ఆదివారం లక్ష కుంకుమార్చన పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చక, వేదపండితులు శ్రీఅమ్మవారికి నవావరణపూజ, విశేష కుంకుమార్చన తదితర పూజాదికాలను శాస్త్రోక్తంగా జరిపారు. దేవస్థానం నిర్వహిస్తోన్న మాసోత్సవాల్లో మూలానక్షత్రం, పౌర్ణమి రోజుల్లో శ్రీభ్రమరాంబదేవికి లోకకల్యాణార్థం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపడం ఆనవాయితీగా వస్తుందని అధికారులు తెలిపారు.