srisailam dam
-
మేలోగా శ్రీశైలం ఫ్లంజ్ పూల్‌కు మరమ్మతులు పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం ఫ్లంజ్ పూల్‌లో ఏర్పడిన భారీ గొయ్యిని మేలోగా పూడ్చి, మరమ్మతులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) చైర్మన్ అనిల్ జైన్ ఆదేశించారు. గొయ్యిపై తక్షణమే సీడబ్ల్యూపీఆర్ఎస్(సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణులతో అధ్యయనం చేయించి, పూడ్చివేత, మరమ్మతుల విధానాన్ని తయారుచేసి తమకు పంపాలన్నారు. దానిపై తాము అధ్యయనం చేసి మరమ్మతు చేయాల్సిన విధానాన్ని ఖరారు చేసి పంపుతామని తెలిపారు. జలాశయం భద్రతపై అనిల్ జైన్, నిపుణుల కమిటీ చైర్మన్ వివేక్ త్రిపాఠి గురువారం ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్వో) చీఫ్ కుమార్, శ్రీశైలం ప్రాజెక్టు సీఈ కబీర్‌బాషా, ఎస్ఈ మోహన్, తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఆ రాష్ట్ర ఎస్డీఎస్వో సీఈ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం జలాశయంలోకి 2009, అక్టోబర్ 2న 26.08 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ఫ్లంజ్ పూల్ కోతకు గురై భారీ గొయ్యి ఏర్పడింది. ప్రాజెక్టును తనిఖీ చేసిన ఎన్డీఎస్ఏ.. తక్షణమే గొయ్యిని పూడ్చి, మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. ఇదే అంశాన్ని సమావేశంలో గుర్తుచేస్తూ ఇప్పటికీ మరమ్మతులు ఎందుకు చేయలేదని అనిల్ జైన్ నిలదీశారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఆ గొయ్యిపై సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్టు వెంకటేశ్వరరావు వివరించారు. శ్రీశైలం డ్యాం సేఫ్టీ బాధ్యత ఏపీదే.. డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం జలాశయాల భద్రత బాధ్యత వాటి ఓనర్ల(యజమానులు)దేనని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ తెలిపారు. శ్రీశైలం జలాశయం నిర్వహణ ఏపీ పరిధిలో ఉన్నందున.. ఆ జలాశయం భద్రత బాధ్యత ఆ రాష్ట్ర అధికారులదేనని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ పర్యవేక్షణ తమ రాష్ట్ర పరిధిలో ఉన్నందున ఆ ప్రాజెక్టు భద్రతకు తాము బాధ్యత వహిస్తామని చెప్పారు. దీనిపై వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించాల్సి ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈఎన్సీ చేసిన ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున.. దానితో ముడిపెట్టకూడదని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. దీనిపై అనిల్ జైన్ స్పందిస్తూ.. శ్రీశైలం జలాశయం నిర్వహణను చూస్తున్న ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరే(ఏపీ) ఓనర్ అవుతారని స్పష్టం చేశారు. -
పెను ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ‘ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం భద్రత పెను ప్రమాదంలో ఉంది. డ్యామ్ పునాదుల కింద భూగర్భంలోని భారీ రాతిఫలకాల మధ్య పెళుసుతో కూడిన బలహీన అతుకులున్నట్టు జియలాజికల్ సమాచారం స్పష్టం చేస్తోంది. నిలువుగా రెండు భారీ జాయింట్లు, వాటికి అనుబంధ జాయింట్లూ ఉన్నట్టు తెలుపుతోంది. అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్ పునాదులు రక్షణను కోల్పోయి జారిపోయే ప్రమాదం ఉంది. ఇది డ్యామ్ భద్రతకు అత్యంత ప్రమాదకరం. డ్యామ్ దిగువన ఏర్పడిన భారీ గుంత (ప్లంజ్‌పూల్) 120 మీటర్ల లోతైనదని 2018 జూలైలో నిర్వహించిన బాతిమెట్రిక్ సర్వేలో తేలింది. గుంత లోతు డ్యామ్ పునాదుల లోతుకు మించిపోయినట్టు తెలుస్తోంది. గుంత.. డ్యామ్ పునాదుల వరకు విస్తరించి రాతిఫలకాల మధ్య పెళుసుతో ఉన్న జాయింట్ల (షీర్ జోన్)ను ప్రభావితం చేసి ఉండవచ్చు. డ్యామ్ జారిపోకుండా రక్షణ కల్పించే పునాదుల మందం గణనీయంగా తగ్గిపోయి ఉండవచ్చు..’ అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి చెందిన నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. జలాశయం భద్రత దృష్ట్యా తక్షణమే పలు అధ్యయనాలు, మరమ్మతులు చేపట్టాలని సిఫారసు చేసింది. 2009 వరదలతో పెరిగిన ముప్పుఎన్డీఎస్ఏ సభ్యులు (విపత్తుల నిర్వహణ) వివేక్ త్రిపాఠి నేతృత్వంలో డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్, కన్సల్టెంట్ కమలేశ్ జైన్‌తో సంస్థ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు, సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల నిపుణులు కూడా కమిటీలో ఉ న్నారు. ఈ కమిటీ గత ఏడాది శ్రీశైలం జలాశయాన్ని సందర్శించింది. అనంతరం తన నివేదికను సమర్పించింది. తాజాగా వెలుగు చూసిన నివేదిక వివరాలిలా ఉన్నాయి.78 గంటల భీకర వరదతో తీవ్ర నష్టంశ్రీశైలం జలాశయం నిర్మాణం 1963లో ప్రారంభమై 1984లో పూర్తైంది. 1975–76లో జలాశయం దిగువన బకెట్ ఏరియా కోతకు గురైనట్టు గుర్తించి, నిపుణుల కమిటీ సూచన మేరకు రక్షణగా ఆప్రాన్ ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. మళ్లీ కమిటీ సూచన మేరకు 1984–85లో కాంక్రీట్‌తో నిండిన స్టీల్ సిలిండర్లను ఆప్రాన్‌కు రక్షణకు పాతిపెట్టగా, అవీ కోతకు గురయ్యాయి. శ్రీశైలం జలాశయాన్ని గరిష్టంగా 19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మించగా, 2009 అక్టోబర్‌లో ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీటర్లకు పెరిగిపోవడంతో జలాశయం పొంగిపొర్లింది. 78 గంటల పాటు భీకర వరద కొనసాగడంతో జలాశయానికి తీవ్ర నష్టం వాటిల్లింది.ప్లంజ్‌పూల్‌పై కమిటీ సిఫారసులు⇒ శ్రీశైలం జలాశయం దిగువన డైక్/కాఫర్ డ్యామ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. దీంతో దిగువ భాగంలో నీటి నిల్వల స్థాయి పెరిగి గుంత మరింతగా కోతకు గురికాకుండా ఉంటుంది. ⇒ గుంత కారణంగా జలాశయం పునాదుల కింద రాతిపొరల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి ఆధునిక పద్ధతుల్లో సిమ్యూలేషన్ అధ్యయనాలు చేయాలి. వేర్వేరు వరద తీవ్రతలను ప్రామాణికంగా తీసుకుని జలాశయానికి ఉండే ముప్పును, స్థిరత్వాన్ని, జారిపోయే ప్రమాదాన్ని అంచనా వేయాలి. ⇒ జలాశయం దిగువన దెబ్బతిన్న కాంక్రీట్‌తో నిండిన స్టీల్ సిలిండర్లను పునరుద్ధరించాలి. ⇒ ప్లంజ్పూల్కి రెండువైపులా స్థిరత్వం కోసం రాతిఫలకాలకు బోల్టులు అమర్చి కాంక్రీట్‌తో రీఎన్‌ఫోర్స్ చేయాలి. ⇒ దిగువన గుంత పరిమాణం మరింత పెరగకుండా జలాశయం గేట్ల నిర్వహణలో మార్పులు చేయాలి. ⇒ జలాశయం పునాదుల వరకు గుంత విస్తరించిందా? లేదా? అనే అంశాన్ని డ్రిల్లింగ్ ద్వారా నిర్ధారించాలి. ⇒ జలాశయం ఎగువన ఎడమగట్టుకు రక్షణగా నిర్మించిన గోడకు మరమ్మతులు జరపాలి. పియర్, స్పిల్‌వే ఎగువ భాగానికి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ మరమ్మతులు చేపట్టాలి.ఇతర సిఫారసులు⇒ జలాశయం 17/18 బ్లాకులకు రెండుచోట్ల అడ్డంగా వచ్చిన పగుళ్లకు మరమ్మతులు చేయాలి. భవిష్యత్తులో మళ్లీ ఏర్పడకుండా నివారించేందుకు వీలుగా పగుళ్లకు కారణాలను శోధించాలి. ⇒ డ్యామ్ దిగువన 4, 9, 10 నంబర్ల గేట్ల వద్ద ఏర్పడిన గుంతల లోతును అధ్యయనం చేసి, దాని ఆధారంగా మరమ్మతులను నిర్వహించాలి. ⇒ 16, 17వ బ్లాకుల వద్ద ఏర్పాటు చేసిన రివర్ స్లూయిస్ల నుంచి లీకేజీని అరికట్టడానికి అత్యంత ప్రాధాన్యతతో మరమ్మతులు చేయాలి. ⇒ డ్యామ్ ఫౌండేషన్ గ్యాలరీలో ఆందోళనకర రీతిలో పెద్దమొత్తంలో సీపేజీ జరుగుతోంది. సీపేజీ అధికంగా ఉన్న బ్లాకులకు కర్టైన్ గ్రౌటింగ్ నిర్వహించాలి. ⇒ భూకంపాల ముప్పుపై ఎప్పుడో జలాశయం నిర్మాణ సమయంలో అధ్యయనాలు చేశారు. ఇప్పుడు అత్యాధునిక సమాచారం లభ్యతగా ఉన్న నేపథ్యంలో మళ్లీ కొత్తగా అధ్యయనం జరపాలి. ⇒ జలాశయానికి ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి. -
సొరంగంలో ఆశలు గల్లంతు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్/ సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు ఆదివారం రోజంతా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రమాదం జరిగి 40 గంటలైనా కార్మీకుల జాడగానీ, వారి యోగక్షేమాలుగానీ తెలియకపోవడంతో... వారు సురక్షితంగా బయటపడే అవకాశం తక్కువనే చర్చ జరుగుతోంది. ఆదివారం ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలతో కలసి లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లి.. సుమారు 6 గంటల తర్వాత తిరిగి వచి్చన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా.. పరిస్థితి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. సొరంగం లోపలి వరకు వెళ్లి బయటికి వచి్చనవారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మేర మట్టి, బురద నీరు, శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో 12 కిలోమీటర్ల వద్ద సైతం మోకాలి లోతు నీళ్లు ఉన్నాయి. కూలిన మట్టి, శిథిలాలను తొలగిస్తేగానీ గల్లంతైన కార్మికులను చేరుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలేమీ ప్రారంభం కాలేదు. ఏదైనా అద్భుతం జరిగితే కానీ.. సొరంగం లోపల పరిస్థితి భీతావహంగా ఉండటం, మళ్లీ పైకప్పు కూలవచ్చనే ఆందోళనల నేపథ్యంలో రెస్క్యూ కష్టసాధ్యంగా మారింది. దోమలపెంట వద్దనున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ఒక్క లోకో ట్రైన్ మాత్రమే ఆధారం. దాని ద్వారా 12.6 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. అక్కడి నుంచి కన్వేయర్ బెల్టు మీద లోపలికి చేరుకోవాల్సి వస్తోంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకే సహాయక బృందాలు వెళ్లగలిగాయి. శిథిలాలు కొట్టుకురావడంతో వాటిని తొలగించకుండా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి ఊటను మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. నిమిషానికి 10 వేల లీటర్ల నీటిని ఎత్తిపోసే మోటార్లను వినియోగిస్తున్నారు. లోపలికి వెళ్లి బయటికి వచి్చన రెస్క్యూ బృందాలతో ‘సాక్షి’ మాట్లాడింది. గల్లంతైన కార్మీకుల మీద కాంక్రీట్ సెగ్మెంట్లు, మట్టి, శిథిలాలు పడి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. లేదా వారు సొరంగం కూలిన ప్రాంతానికి ఆవలివైపు చిక్కుకుని ఉన్నా.. రెండు వైపులా మూతపడి ఉండటంతో ఆక్సిజన్ లభించడం కష్టమేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సొరంగం కూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం దాకా వెళ్లిన రెస్క్యూ సిబ్బంది.. కార్మికులను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని అంటున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. ఎస్ఎల్బీసీ సొరంగం–1 ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల శనివారం ఉదయం 8.30 గంటలకు పైకప్పు కూలిపడింది. ఆదివారం అర్ధరాత్రి సమయానికి 40 గంటల కీలక సమయం గడిచిపోయింది. దీనితో కార్మీకుల క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక శాఖ, ఆర్మీకి చెందిన రెస్క్యూ సిబ్బంది మూడు వేర్వేరు బృందాలుగా ఏర్పడి సొరంగం లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళ్లారు. వారు తిరిగి వచ్చి గల్లంతైన కార్మీకుల యోగక్షేమాల గురించి చెబుతారేమోనని.. సొరంగం బయట అధికారులు, నేతలు, మీడియా ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మంత్రితోపాటు రెస్క్యూ సిబ్బంది నిరాశ వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ బైసన్ డివిజన్‌కు చెందిన ఇంజనీర్ టాస్‌్కఫోర్స్ (ఈటీఎఫ్) ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ వైద్య బృందాలను సైతం టన్నెల్ వద్ద అందుబాటులో ఉంచారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నారు.శిథిలాలు, బురద తొలగించేదెలా?సొరంగం కూలిపడి పేరుకుపోయిన మట్టిని, శిథిలాలను తొలగించనిదే కార్మీకుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకోలేని పరిస్థితి. కానీ నీటి ఊటల కారణంగా.. మట్టిని తొలగించిన కొద్దీ పైకప్పు మళ్లీ కూలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సొరంగం భూఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల దిగువన ఉందని, కూలిన చోట మట్టిని తీసినకొద్దీ.. పైన వదులుగా ఉన్న మట్టి మళ్లీ సొరంగంలోకి పడిపోతుందని రెస్క్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సొరంగంపైన భూమి ఉపరితలం నుంచి డ్రిల్లింగ్ చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపినా.. 400 మీటర్ల లోతున రంధ్రం చేయడానికి చాలా రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సొరంగంలో పేరుకున్న మట్టి, నీళ్లు, ఇతర శిథిలాలను తొలగించేందుకూ కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.పైకప్పు కూలిన చోట.. కాంక్రీట్ సెగ్మెంట్ లేదు! సొరంగంలో ప్రమాదం జరిగిన చోట పైకప్పుకు రక్షణగా కాంక్రీట్ సెగ్మెంట్లు లేవని తెలిసింది. టన్నెల్ చివరన పనులు జరిగిన చోట సుమారు 100 మీటర్ల మేర కాంక్రీట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేయలేదని సమాచారం. అంతేగాకుండా సొరంగంలో నాలుగేళ్లుగా నీటి ఊటలు (సీపేజీ) కొనసాగుతుండటంతో మట్టి వదులుగా మారడం, తవ్వకం పనుల్లో రక్షణ గోడ నిర్మించకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పైకప్పు కుప్పకూలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటేనే.. సొరంగం లోపల చిక్కుకున్న కార్మీకులను బయటికి తెచ్చేందుకు ఏదైనా వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఆచరణలో పెడితేనే ఫలితమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక వ్యూహం లేకుండా రెస్క్యూ బృందాలు లోపలి వరకు వెళ్లి వచి్చనట్టు తెలిసింది. సొరంగంలో పేరుకున్న మట్టిని తొలగించి కన్వేయర్ బెల్టుల ద్వారా, లేదా లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపితే గానీ చిక్కుకున్న కార్మీకుల జాడ కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. అడ్డంకులన్నీ అధిగమించి కార్మీకులను చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టీబీఎం మెషీన్ దగ్గరికి చేరుకోవడమే కష్టంగా ఉంది సొరంగంలో పైకప్పు కూలిన చోట ఉన్న టీబీఎం మెషీన్ వద్దకు చేరుకోవడమే కష్టంగా ఉంది. ఇప్పటివరకు రెండు సార్లు లోపలికి వెళ్లి వచ్చాం. మెషీన్ వద్ద 200 మీటర్ల దాకా భారీగా బురద పేరుకుని ఉంది. దాన్ని దాటడం వీలుపడటం లేదు. టన్నెల్ పైకప్పు మళ్లీ కుంగకుండా సేఫ్టీ కోసం రాక్ బోల్టింగ్ చేస్తున్నాం. నీటి తొలగింపు కొనసాగుతోంది. – కలేందర్, సింగరేణి మైనింగ్ సేఫ్టీ సూపర్వైజర్ వారి జాడ కనిపించలేదు.. టన్నెల్లో భారీగా మట్టి, శిథిలాలు పేరుకుపోవడంతో మెషీన్ దగ్గరికి వెళ్లేందుకు కుదరడం లేదు. చిక్కుకున్న వారి జాడ ఏదీ కనిపించలేదు. ఎలాంటి అరుపులు సైతం వినిపించలేదు. – రాందేవ్, సుబేదార్, ఆర్మీ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది టన్నెల్ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది. 200 నుంచి 500 మీటర్ల మధ్య టన్నెల్ బోరింగ్ మెషీన్ బురదలో కూరుకుపోయింది. 35 మందిమి సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి తీసుకొని వెళ్లాం. రాత్రంతా కష్టపడి దగ్గరకు చేరుకోగలిగాం. – రవినాయక్, ఎన్డీఆర్ఎఫ్ టీం, విజయవాడ పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి.. మేం పనుల కోసం టన్నెల్ చివరికి చేరుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి. సిమెంట్ దిమ్మెలు కూలి, పెద్ద ఎత్తున మట్టి కుంగింది. మేమంతా భయంతో వెనక్కి పరుగెత్తుకు వచ్చాం. చేతులు, కాళ్లు, ముఖానికి చిన్న గాయాలయ్యాయి. – చమేల్ సింగ్, ప్రమాదం నుంచి బయటపడిన ఫోర్‌మెన్ ఏం జరుగుతోందో అర్థం కాలేదు శనివారం ఉదయం టన్నెల్లో ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు కొందరు మెషీన్ వైపు ఉన్నా, ఏమీ చేయలేక భయంతో వెనక్కి వచ్చాం. వాళ్లు మట్టి, బురదలో మునిగారు. ప్రాణాలతో బయటికి వస్తారో, లేదో తెలియదు. – ఎడుమలై, ప్రమాదం నుంచి బయటపడ్డ కన్వేయర్ బెల్ట్ ఫోర్‌మెన్ మా వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదు.. టీబీఎం ముందు భాగంలో 8 మంది ఉన్నారు. మేం వెనక భాగంలో ఉన్నాం. ఒక్కసారిగా పైకప్పు కూలడంతో భయాందోళన నెలకొంది. మాతో కలసి పనిచేసే వాళ్ల పరిస్థితి ఏమిటో తెలియదు. చాలా బాధగా ఉంది. – జగదీశ్ పాండా, ప్రమాదం నుంచి బయటపడ్డ మెకానికల్ ఫోర్‌మెన్ -
ప్రమాదంలో ‘శ్రీశైలం’
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని... తక్షణమే జోక్యం చేసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి తెలంగాణ రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆనకట్టల భద్రత కమిటీ చైర్మన్ హోదాలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) ఎన్.అనిల్‌కుమార్ బుధవారం ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. 1981లో నిర్మించిన శ్రీశైలం జలాశయానికి 2009లో వచ్చిన భీకర వరదలతో స్పిల్ వే దిగువన నీళ్లుపడే ప్రాంతంలో భారీ గుంత (ప్లంజ్ పూల్) ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడంతో.. క్రమంగా ప్లంజ్ పూల్ విస్తరిస్తూ, జలాశయానికి ముప్పుగా పరిణమించిందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయాన్ని 14 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా డిజైన్ చేయగా.. 2009లో ఏకంగా 25లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని వివరించారు. భారీగా నీటి విడుదలతో.. స్పిల్ వేకు దిగువన భూమి కోతకు గురై భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. ఈ గుంతను పూడ్చకపోతే 143.23 మీటర్ల ఎత్తున్న జలాశయం పునాదులను బలహీనపరిచి, డ్యామ్‌కు ప్రమాదకరంగా మారుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ వంటి సంస్థలు అధ్యయనంలో తేల్చాయని వివరించారు. జలాశయానికి ప్రమాదం జరిగితే భారీ నష్టం శ్రీశైలం జలాశయానికి ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాలను భారీ వరద ముంచేస్తుందని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర విపత్తును సృష్టిస్తుందని లేఖలో అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీటి సరఫరా, జల విద్యుదుత్పత్తి నిలిచిపోతాయని పేర్కొన్నారు. జలాశయం పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తక్షణమే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్డీఎస్ఏను కోరారు. వచ్చే వానాకాలంలో గుంత మరింత విస్తరించకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయం రక్షణకు చర్యలు తీసుకోకపోతే దిగువన ఉన్న నాగార్జునసాగర్, ప్రకాశం బరాజ్‌లు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొంటాయన్నారు. అదే జరిగితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తాగు, సాగునీటితోపాటు చెన్నైకి తాగునీటి సరఫరా సైతం నిలిచిపోతుందని వివరించారు. -
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీక్..
సాక్షి, శ్రీశైలం: శ్రీశైలం డ్యామ్ తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజ్ ఘటన వెలుగు చూసింది. అయితే, డ్యామ్‌కు మాత్రం ఎటువంటి ప్రమాదం లేదని తెలంగాణ జెన్కో అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. శ్రీశైలం డ్యామ్ తెలంగాణ(ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసగా పంప్ మోడ్ ఆపరేషన్ చేస్తుండటంతో బట్టర్ ఫ్లై వాల్వు వద్ద నీరు లీక్ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే, నీరు లీకేజీ కారణంగా డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని జెన్కో అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిపుణులతో చర్చించి నివేదికను రూపొందిస్తామని అధికారులు చెప్పారు. -
శ్రీశైలం జలాశయం ఖాళీ!
సాక్షి, అమరావతి: దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ కేంద్రాల ద్వారా తరలించాలన్న నిబంధనను తెలంగాణ జెన్కో తుంగలోకి తొక్కేసింది. కృష్ణా బోర్డు ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు తరలించేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదు. తెలంగాణ జెన్కో ఇదే రీతిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పోతే జనవరి 15వ తేదీలోగా శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ కావడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల రాయలసీమతోపాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్లే... రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించింది. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని సాకు చూపుతూ దాన్ని తెలంగాణ సర్కార్ తన ఆ«దీనంలోకి తీసుకుంది. ఇదే సమయంలో నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలో ఉన్నప్పటికీ దాన్ని కూడా తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై అప్పటి చంద్రబాబు సర్కార్ చూసీచూడనట్లు వ్యవహరించింది. తెలంగాణ, ఏపీలో టీడీపీ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం అప్పట్లో చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. ఆ పాపం పర్యవసానంగానే కృష్ణా బోర్డు అనుమతి లేకుండా అక్రమంగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ మన రాష్ట్ర ప్రయోజనాలను హరిస్తూ వస్తోందని రైతులు మండిపడుతున్నారు. ‘ఏపీ వాదన సహేతుకం కాదు’ సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్–89 మార్గదర్శకాల ప్రకారమే వాదనలు వినాలన్న ఏపీ ప్రభుత్వ వాదన సహేతుకం కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సెక్షన్–89లోని మార్గదర్శకాలు, 2023 అక్టోబర్ 6న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం –1956లో సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన అదనపు నిబంధనలు రెండూ ఒకటేనని.. రెంటినీ కలిపి వాదనలు వినాలంది. కాలయాపన, తాత్కాలిక ఏర్పాటును అడ్డంపెట్టుకుని నీటిని తరలించడం కోసమే ఏపీ ఆ రెండు భిన్నమైనవని వాదిస్తోందని పేర్కొంది. సెక్షన్–89, సెక్షన్–3 కింద ఇచ్చిన మార్గదర్శకాలు వేర్వేరని భావిస్తే.. తొలుత సెక్షన్–3 కింద వాదనలు వినాలని తేల్చి చెబుతూ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2లో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం 2023 అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు నియమ, నిబంధనలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని తెలంగాణ తెలిపింది. అందువల్ల సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై విచారించడానికి వీల్లేదన్న ఏపీ వాదన అసంబద్ధమని కొట్టిపారేసింది. -
శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోతుండటంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజి సామర్థ్యం 72.77 టీఎంసీలు, డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందని రాష్ట్ర జల వనరుల శాఖ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు భూమి భారీగా కోతకు గురువుతుండటం.. వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల వచ్చే మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటం వల్లే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వేచేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలోని 548 జలాశయాల్లో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటి స్థానంలో నిలిచింది.45 ఏళ్లలో కొండలా పూడికకృష్ణా నదిపై నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయం నిర్మాణాన్ని ప్రారంభించారు. 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా.. సాగు, తాగునీటి అవసరాల కోసం ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోచ్చని తేల్చింది.జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలేశ్రీశైలం జలాశయంపై ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతలు ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం, లైవ్ స్టోరేజి సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటి పారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ వ్యయంతో కూడిన పని అని, పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ సమగ్ర స్వరూపంతొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976గరిష్ట నీటిమట్టం 885 అడుగులుక్యాచ్మెంట్ ఏరియా: 60,350 చ.కి.మీ.గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం 615.18 చ.కి.మీ. -
శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నాపట్టించుకోరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తెలంగాణను నిలువరించని ప్రభుత్వంకృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టువిభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. -
శ్రీశైలం, సాగర్‌ను ఖాళీ చేస్తారా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తిని నిలిపేసి, జలాలను సంరక్షించాలన్న తమ ఆదేశాలను ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఉల్లంఘించడంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాలపై చర్యలకు ఉపక్రమించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో పోటీ పడి విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాలను ఖాళీ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల అధికారులతో మళ్లీ రిజర్వాయర్ నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ద్వారా శుక్రవారం ఈ సమావేశం నిర్వహిస్తామని బోర్డు సభ్యులు ఆర్ఎన్ శంఖ్వా ఇరు రాష్ట్రాలకు లేఖ రాయగా.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో వాయిదా వేశారు. ఈ నెల 25 తర్వాత సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఏడాది తర్వాత ఆర్ఎంసీ సమావేశంశ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలపై సరైన పర్యవేక్షణ, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణకు మార్గదర్శకాలను ఖరారు చేయడం ఆర్ఎంసీ ప్రధాన ఉద్దేశం. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించిన ముసాయిదా నిబంధనలను పరిశీలించి, అవసరమైన సవరణలతో తుదిరూపు ఇవ్వడం, జలాశయాలన్నీ నిండిన తర్వాత రెండు రాష్ట్రాలు జరిపే మిగులు జలాల వినియోగాన్ని లెక్కిల్లోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించడంపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా కృష్ణా బోర్డు ఆర్ఎంసీని కోరింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్ఎంసీ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్లీ ఏడాదికి పైగా విరామం తర్వాత కృష్ణా బోర్డు ఆర్ఎంసీ సమావేశాన్ని తలపెట్టడం గమనార్హం.21న కృష్ణా బోర్డు సమావేశంకృష్ణా బోర్డు 19వ సర్వ సభ్య సమావేశం ఈ నెల 21న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర రావు, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలిక కృష్ణా జలాల సర్దుబాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. -
లాంచీ సర్వీసుల లాంచింగ్
నాగార్జునసాగర్/ కొల్లాపూర్ రూరల్: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంకు కృష్ణానదిలో ఒకేరోజు రెండు ప్రధాన కేంద్రాల నుంచి లాంచీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి ఒకటి, సోమశిల నుంచి మరొక లాంచీ సర్వీ స్ను శనివారం ప్రారంభించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వీటిని నడుపుతున్నారు. కార్తీకమాసం తొలిరోజున శనివారం నాగార్జునసాగర్ నుంచి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. నాగార్జున సాగర్ జలాశయంలో సరిపడా నీటి లభ్యత లేకపోవడం, కరోనా తదితర కారణాలతో ఐదు సంవత్సరాలుగా నాగా ర్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని నిలిపి వేశారు. ఈ సంవత్సరం విస్తృతంగా వర్షాలు కురిసి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం ఐదు గంటలపాటు ఈ లాంచీ ప్రయాణం కొనసాగుతుంది. లాంచీలో ప్రయాణి కులు నాగార్జునసాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా ప్రయాణం ఉంటుందని పర్యాటక శాఖ అధికా రులు తెలిపారు. మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి కూడా శ్రీశైలం వరకు శనివారం లాంచీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 110 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏసీ లాంచీని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంవరకు లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ. 1,600 ధర నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలంకు రాను పోను ప్రయాణ టికెట్ పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు 2,400గా నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఒక ట్రిప్పుకు మాత్రమే అయితే పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్‌ను నిర్ణయించారు. తొలిరోజు సోమశిల నుంచి 50 మంది ప్రయాణించారు. నాగార్జునసాగర్ జలాశ యం నీటిమట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణి కుల రద్దీనిబట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నారు. కార్యక్రమంలో లాంచీ మేనేజర్ హరి, ఉద్యోగుల సంఘం నాయకులు నర్సింహ పాల్గొన్నారు. -
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలంప్రాజెక్ట్/ విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల)/తాడేపల్లి రూరల్ : ఆయా ప్రాజెక్టుల నుంచి శుక్రవారం నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం గత మూడురోజులుగా గరిష్టస్థాయి 885 అడుగుల వద్ద ఉంది. ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని బట్టి దిగువ ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,26, 281 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. 2గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 55, 782 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 884.60 అడుగులకు చేరుకుంది. సాగర్ 12 క్రస్ట్‌గేట్ల ద్వారా..నాగార్జునసాగర్ నుంచి 12 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం 12 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 96,324 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 589.30 అడుగుల వద్ద ఉండగా, ఇది 309.9534 టీఎంసీలకు సమానం. పులిచింతల నుంచి..నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 1,93,966 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేశారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 6.860 టీఎంసీలు నిల్వ ఉంది.ప్రకాశం బ్యారేజ్ నుంచి..ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో ప్రాజెక్టు 70 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2 లక్షల 20 వేల 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 2 లక్షల 36 వేల 158 క్యూసెక్కుల వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చి చేరుతోంది. బ్యారేజీ రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా.. తూర్పు డెల్టా కాలువకు 8 వేల 632 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7 వేల 26 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలం 4 క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లిరూరల్: శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పెరుగుతుండటంతో గురువారం 4 రేడియల్ క్రస్ట్‌గేట్లను తెరచి 1,12,300 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. గురువారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,89,328 క్యూసెక్కుల వరద శ్రీశైలంకు వచ్చి చేరుతోంది. బుధవారం నుండి గురువారం వరకు బుధవారం నుండి గురువారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి శ్రీశైలంకు 1,27,093 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. కుడిగట్టు కేంద్రంలో 15.213 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.744 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంది. సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగటంతో నాగార్జున సాగర్ జలాశయం నుంచి గురువారం 20 రేడియల్ క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 2,10,149 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 20 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 1,62,000 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,826 క్యూసెక్కులు మొత్తం 1,90,826 క్యూసెక్కులు దిగువకి విడుదల చేస్తున్నారు. కుడి,ఎడమ కాలువలు, ఎస్ఎల్బీసీ, వరద కాలువల ద్వారా 19,323క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో బ్యారేజి రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు 21 వేల 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
శ్రీశైలంలో 4, సాగర్‌లో 16
నాగార్జునసాగర్, దోమలపెంట: వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల నుంచి స్పిల్‌వే ద్వారా 82,940 క్యూసెక్కులు, విద్యుదు త్పత్తి చేస్తూ 35,524, సుంకేసుల నుంచి 72,114, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,900 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,139 మొత్తం 68,039 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తు తం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ ఎస్ఎస్కు 1,561, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శనివారం అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లను ఐదడుగులు పైకి ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,29,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590 అడుగుల గరిష్ట నీటిమట్టంతో ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,74,120 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రధాన విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 29,435 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల నుంచి 1,29,600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ లకు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు 15,085 క్యూసె క్కుల నీరు వదులుతున్నారు. మొత్తం సాగర్ నుంచి 1,74,120 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
‘శ్రీశైలం’ పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోవడంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజీ సామర్థ్యం 72.77 టీఎంసీలు.. డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందన్నది రాష్ట్ర జలవనరులశాఖ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వే చేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలో 548 జలాశయాలలో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటిస్థానంలో నిలిచింది. 45 ఏళ్లలో కొండలా పూడిక కృష్ణానదిపై నంద్యాల జిల్లాలో శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయ నిర్మాణాన్ని ప్రారంభించి, 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు.. సాగు, తాగునీటి అవసరాలకు ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని తేల్చింది. జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే..శ్రీశైలం జలాశయంపై తెలంగాణలో ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం.. లైవ్ స్టోరేజీ సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ ఎత్తున వ్యయంతో కూడిన పని.. పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇదీ శ్రీశైలం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం👉తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976👉 కనీస నీటిమట్టం: 854 అడుగులు👉 గరిష్ట నీటిమట్టం: 885 అడుగులు👉 క్యాచ్మెంట్ ఏరియా: 60,350 చదరపు కిలోమీటర్లు👉 గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం: 615.18 చదరపు కిలోమీటర్లు -
నిలకడగా గోదావరి
పోలవరం రూరల్/ధవళేశ్వరం/విజయపురిసౌత్: గోదావరి నది ప్రవాహం శనివారం నిలకడగా సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.790 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 8.15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తూ, మిగిలిన 7,81,839 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాల విడుదలశ్రీశైలం నుంచి వచ్చే కృష్ణాజలాలు పెరగటంతో శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి కృష్ణానదిలోకి 32,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 77,496 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ కుడికాలువ ద్వారా 10 వేల క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 3,667, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 29,029, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడ్డ కొండచరియలు
శ్రీశైలం ప్రాజెక్ట్: మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా శ్రీశైలం డ్యాంకు సమీపంలోని ఘాట్ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడ్డాయి. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం పైభాగంలోని హైదరాబాద్–శ్రీశైలం రహదారిలో కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాకాలంలో డ్యాం వ్యూ పాయింట్ నుంచి లింగాలగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి ఈగలపెంట వరకు వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, టూవీలర్‌పై వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అధికారులు సూచించారు. కాగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా శ్రీశైలం మండలంలోని సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లో వరదనీరు పొంగి పొర్లింది. మండలంలో 130.80 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సున్నిపెంటలోని మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయ ప్రహారీ గోడ కొంత భాగం కూలిపోయింది. -
1989 టీఎంసీలు కడలిపాలు
సాక్షి, హైదరాబాద్: గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ కడలి వైపు కదిలిపోతున్నాయి. ఇప్పటికే 1,903 టీఎంసీల గోదావరి, 86 టీఎంసీల కృష్ణా జలాలు కలిపి మొత్తం 1989 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణాలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఎగువ గోదావరి పరీవాహకంలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వరద రాకపోవడంతో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు సగం కూడా నిండలేదు. కృష్ణాలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో 10 రోజులుగా వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం(తెలంగాణ) నుంచి అంతర్వేది(ఏపీ) వరకూ పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడంతో వస్తున్న వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వర్షాల్లేక వరద తగ్గుముఖం..గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు, వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 47.25 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 3,583 క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టు కాల్వలకు విడుదల చేస్తున్నారు. గోదావరికి ప్రాణహిత వరద తోడుకావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు 2,89,710 క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్ నుంచి 4,48,810 క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్ నుంచి 4,61,484 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్టు దిగువన వదులుతున్నారు. ⇒ పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. కాళేశ్వరం లింక్–2లో భాగంగా నీటిని ఎత్తిపోయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.82 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,676 క్యూసె క్కులు ఉండగా, 3,602 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. ఎగువ కృష్ణాలో తగ్గిన వరదకృష్ణా పరీవాహకంలో ఎగువన వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 15,000, నారాయణపూర్ నుంచి 6,000, జూరాల ప్రాజెక్టు నుంచి 82,339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,84,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ నీటిని దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి దిగువకు 1,04,424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్ ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదలనాగార్జునసాగర్/దోమలపెంట : శ్రీశైలం నుంచి వచ్చే వరద తగ్గడంతో నాగార్జునసాగర్ వద్ద కొన్ని గేట్లు మూసివేశారు. శనివారం సాయంత్రం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. ఆదివారం ఉదయానికి 16 గేట్లకు తగ్గించారు. మధ్యాహ్నానికి 14, 10 గేట్లకు తగ్గిస్తూ సాయంత్రానికి ఎనిమిది గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. పర్యాటకులతో ఆదివారం నాగార్జునసాగర్ జనసంద్రంగా మారింది. సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.సొంతవాహనాల్లో తరలిరావడంతో డ్యాం దిగువన కృష్ణాతీరం వెంట గల రోడ్లన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం నుంచి వరద వస్తుందనే సాకుతో ఆదివారం కూడా తెలంగాణ వైపు లాంచీలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు చాలామంది నిరాశతో వెళ్లారు. కొంతమంది మాత్రం రైట్ బ్యాంకు వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆరు గేట్లు పైకెత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
కడలి వైపు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కడలి వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సా.6 గంటలకు 1లక్షా 51వేల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 13,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 1,37,450 క్యూసెక్కులను 50 గేట్లను మూడు అడుగులు, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లోకి గురువారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3.74 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇక్కడ 37.10 టీఎంసీలను నిల్వచేస్తూ దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.32 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 882.8 అడుగుల్లో 203.42 టీఎంసీలు నిల్వచేస్తూ పది గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి చేస్తూ 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలు నిల్వచేస్తూ గేట్లు ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆ రెండింటి నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 59 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 103.74 టీఎంసీలు నిల్వచేస్తూ 60 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో.. గురువారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. స్వల్పంగా పెరుగుతున్న గోదావరి..ఇదిలా ఉంటే.. గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలతో ఉప నదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ నదిలోకి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30.800 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 6.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద పెరుగుతూ 35.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరద మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున చింతూరు మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలంలో అన్నవరం వాగు పొంగి వరదనీరు రహదారి పైనుండి ఉధృతంగా ప్రవహించింది. వరినాట్లు నిమిత్తం అవతలి పక్కకు వెళ్లిన వ్యవసాయ కూలీలు తిరుగుమార్గంలో ప్రాణాలకు తెగించి వాగును దాటారు. -
శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.శ్రీశైలం ముఖద్వారం నుంచి ఈగలపెంట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 20 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో సందర్శకులు తాకిడి భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకులు క్యూ కట్టారు.ఘాట్ రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. మున్ననూర్ అటవీ చెక్ పోస్టు నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్యామ్‌కు రెండువైపులా సుమారు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షలకుపైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా కళకళ లాడుతోంది. దీంతో సాగర్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
కనువిందు చేస్తున్న శ్రీశైలం అందాలు
-
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. పైన ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీనితో నాగార్జున సాగర్‌లోకి శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో 3 లక్షల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది.శ్రీశైలం నుంచి నీటి విడుదలను పెంచిన నేపథ్యంలో.. సాగర్‌కు వరద మరింత పెరిగిపోనుంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తే అవకాశముంది. కృష్ణా ప్రధాన పాయలో వస్తున్న వరదకుతోడు తుంగభద్రలోనూ భారీ ప్రవాహం ఉండటంతో.. ఈ వరద మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని అధికారులు చెప్తున్నారు. -
సాగర్‌లోకి 3.99 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉద్ధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లోకి 3,99,159 క్యూసెక్కులు చేరుతుండడంతో నీటినిల్వ 550.6 అడుగుల్లో 211.1 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీవరద వస్తున్న నేపథ్యంలో మరో మూడురోజుల్లో సాగర్ నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉద్ధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే పదిగేట్లను 20 అడుగులు ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడికేంద్రం నుంచి 23,904 క్యూసెక్కులు, ఎడమకేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కుల నీరు సాగర్ వైపు ఉరకలెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేలు, మల్యాల పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 253 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధానపాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 3.27 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఖాళీ ప్రదేశాన్ని నింపుతూ దిగువకు 3 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేస్తూ దిగువకు 2.85 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటిమట్టం 311.75 మీటర్లకు (సముద్రమట్టానికి) చేరుకుంది. తుంగభద్ర ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగనుంది. తగ్గుతున్న గోదావరి వరద పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. నదిలో కలుస్తున్న ఉపనదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ తగ్గుతుండటంతో నదిలో ప్రవాహం తగ్గుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.750 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే నుంచి 8.06 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా వరద నీరు తగ్గుతూ 34.20 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం తగ్గుతుండటంతో నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేయడంతో మళ్లీ వరద పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
శ్రీశైలం వద్ద కృష్ణమ్మ అందాలు డ్రోన్ వీడియో
-
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
-
సాగర సంబురం
సాక్షి,హైదరాబాద్/దోమలపెంట: శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతుండగా,నాగార్జునసాగర్ ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకుంటోంది. బిరబిరా కృష్ణమ్మ తరలివస్తుండడంతో నాగార్జునసాగర్‌లో గంట గంటకూ నీటినిల్వ పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 4,13,178 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 883.5 అడుగుల వద్ద 207.41 టీఎంసీలకు చేరుకుంది.ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటం.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది, దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 60,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యు దుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది.నాగార్జునసాగర్‌లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1,55,716 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 517.2 అడుగుల వద్ద 144.22 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నిల్వసామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 170 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంరోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశముంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పశి్చమ కనుమల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణా, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.కృష్ణా ప్రధానపాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 2.85 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.77 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 70 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మళ్లీ గోదావరికి పెరిగిన వరదమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలుసాక్షి, హైదరాబాద్: గోదావరినది పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది.భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ బుధవారం గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను హెచ్చరించింది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క సాగర్) బరాజ్‌లోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.సీతమ్మసాగర్(దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్దకు మంగళవారం సాయంత్రం 8.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 43.7 అడుగులుగా నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.ధవళేశ్వరం బరాజ్‌లోకి 11,26,625 క్యూసెక్కులు చేరుతుండగా.. 11,19,425 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బరాజ్ వద్ద నీటిమట్టం 12.6 అడుగులుగా నమోదవుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక కూనవరం వద్ద శబరి ఉధృతితో నీటిమట్టం 39.25(సముద్రమట్టానికి) మీటర్ల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
సాగర్ వైపు కృష్ణమ్మ...
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా కదలిపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి సోమవారం రాత్రి 7 గంటలకు 4,52,583 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 879.3 అడుగుల్లో 184.70 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది, దీంతో సాయంత్రం 4.30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తగా, 76,056 క్యూసెక్కుల వరద కిందకు వెళ్లిపోతోంది.కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 61,810 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది. నాగార్జునసాగర్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 54,772 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 512.6 అడుగుల్లో 136.13 టీఎంసీలకు చేరుకుంది.సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నిల్వసామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 176 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో ఆరేడు రోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశముంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పశి్చమ కనుమల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధానపాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 2.90 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 3.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.31 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 1.06 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటిమట్టం 311 మీటర్లు(సముద్రమట్టానికి)గా కొనసాగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.51 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,504 క్యూసెక్కుల నీటిని వదులుతూ మిగులుగా ఉన్న 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు వది లేస్తున్నారు. ఇటు సుంకేశుల నుంచి.. అటు జూరాల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది.సాగర్‌లో విద్యుదుత్పాదన ప్రారంభంనాగార్జునసాగర్ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిరాక మొదలు కావడంతో నాగార్జునసాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదనను సోమవారం రాత్రి ప్రారంభించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న టెయిల్‌పాండ్ నీటిసామర్థ్యం 7 టీఎంసీలుకాగా.. ఒక టీఎంసీ నీటితో తెలంగాణ ప్రభుత్వం నిత్యం విద్యుదుత్పతి చేస్తున్నది. గత మే నెలలో ఆంధ్రా అధికారులు రాత్రికిరాత్రే టెయిల్‌పాండ్‌లో గల 7టీఎంసీలలో 4 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.దీంతో విద్యుదుత్పాదన నిలిచిపోయింది. మరోవైపు నాగార్జునసాగర్ జలాశయం అడుగంటడంతో దిగువన టెయిల్‌పాండ్‌కు నీటిని విడుదల చేసే పరిస్థితిలేక విద్యుదుత్పాదన చేయలేదు. సాగర్‌లో విద్యుదుత్పాదన ద్వారా 24 వేల క్యూసెక్కుల నీటిని టెయిల్‌పాండ్‌కు విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద..
-
నేడు శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్..
సాక్షి, శ్రీశైలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో, ఈరోజు సాయంత్రం శ్రీశైలం గేట్లు ఎత్తనున్నారు అధికారులు. దిగవకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.కాగా, ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తనున్నారు. ఈ క్రమంలో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. కాగా, జూరాల, తుంగభద్ర నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే, శ్రీశైలం గేట్లను రేపు ఎత్తాలని అధికారులు భావించినప్పటికీ వదర నీరు భారీగా వచ్చి చేరుతుండంతో ఈరోజే గేట్లను ఎత్తనున్నారు.ఇక, శ్రీశైలంలో ఫుల్‌గా నీరు చేరుతుండటంతో కృష్ణమ్మ సాగర్‌వైపు పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు.. అల్మట్టి, నారాయణపూర్ డ్యామ్స్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. -
రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3.79 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 61,111 క్యూసెక్కులు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద రావడంతో పాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది.మహారాష్ట్ర, కర్ణాటకలలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నది ఎగువన వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 3.27 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తగ్గని తుంగభద్ర తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో మంత్రాలయం వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగి, ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బరాజ్‌లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులను వదులుతూ, 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నా రు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. -
నిండుగా కృష్ణమ్మ ప్రవాహం
సాక్షి,హైదరాబాద్/నాగర్‌కర్నూల్/ధరూర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గురు వారం జూరాల ప్రాజెక్టుతోపాటు తుంగ భద్ర నుంచి కలిపి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చి చేరింది. జూరాల లో విద్యుదుత్పత్తితోపాటు ప్రాజెక్టు 46 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఆల్మట్టి నుంచి 2,75,000 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 2,50,120 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది.శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా, వరదనీటితో 855.20 అడుగులకు చేరింది. కృష్ణానదిలో వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో వారంరోజుల్లో శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయిలో నిండుతుంది.2021లో జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా, రెండేళ్లుగా నీటి ప్రవాహం లేక ప్రాజెక్టు నిండలేదు. సాగర్ ఎడమకాల్వకు నీటి నిలిపివేత నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు గురువారం ఉదయం నీటిని నిలిపి వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పరిధిలోని గ్రామాలకు తాగునీటిని అందించడం కోసం వా రం రోజుల పాటు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు.మళ్లీ పెరుగుతున్న గోదావరి భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం 51.2 అడుగుల నీటిమట్టం ఉండగా, క్రమంగా తగ్గుతూ బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. అయితే మళ్లీ గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతూ ఒంటిగంటకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితే‹Ù.వి.పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
శ్రీశైలంలోకి 96,369 క్యూసెక్కులు
సాక్షి, అమరాతి/శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96,369 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 822.5 అడుగులకు చేరింది. జలాశయంలో నీరు 42.73 టీఎంసీలకు చేరుకుంది. కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 13,634 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక్కడ 17 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చేరింది. మూడురోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశం ఉంది. అప్పుడు గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశంఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది. సాగర్ నీటిమట్టం 504.30 అడుగులునాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో ఏమాత్రం లేదు.ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు. -
శ్రీశైలం చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఎగువ నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు 33,499 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 813.7 అడుగుల్లో 36.56 టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులున్న ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 179.26 టీఎంసీలు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 79 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా 69 వేల క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. నారాయ ణపూర్ డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులు చేరుతుండగా.. 1,08,860 క్యూసెక్కులను విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 90,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 17 క్రస్టుగేట్లను ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. అలాగే ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్కేంద్రంలోని 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టగా ఇందుకోసం 33,084 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, కుడి, ఎడమ కాల్వలతోపాటు నెట్టెంపాడు, భీమా లిఫ్టులకు కలిపి మొత్తం 1,04,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేదు.తుంగభద్రలో...కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లోకి 1,03,787 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 68.77 టీఎంసీలకు చేరుకుంది. మరో 37 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.అటు కృష్ణా ప్రధానపాయ.. ఇటు తుంగభద్ర బేసిన్లలో శనివారం వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కూడా వరద ఇదే రీతిలో కొనసాగుతుందని కేంద్ర జలసంఘం (సీడ బ్ల్యూసీ) అంచనా వేసింది. ఎగువన ఆల్మట్టి, నారా యణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండగా, మరో మూడు నాలుగో రోజుల్లో తుంగభద్ర జలాశయం సైతం నిండే అవకాశాలున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలా శయానికి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశముంది. వర్షాలు కొనసాగితే నెలాఖరు లోగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి.మూసీ ప్రాజెక్టుకు జలకళకేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. హైదరాబాద్‌తోపాటు మూసీ నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. బిక్కేరు వాగు నుంచి కూడా నీరు వస్తుండటంతో మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం ప్రాజెక్టుకు 810 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రానికి ఒక్కసారిగా 1700 క్యూసెక్కులకు పెరిగింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.06 టీఎంసీల నీరు ఉంది. -
శ్రీశైలంలో మహిళలకు నాట్స్ ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నంధ్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. మహిళలు మరొకరి మీద ఆధారపడకుండా వాళ్లు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. సున్నిపెంట గ్రామంలో పదిమంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు శిక్షణ శిబిరాన్ని బాపు నూతి ప్రారంభించారు. కుటుంబంలో మహిళ పాత్ర చాలా కీలకమని అలాంటి మహిళ ఏదో ఒక స్వయం ఉపాధి సాధించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఉన్న బాపయ్య చౌదరి లాంటి వారు మానవత దృక్పథంతో తమ సేవా కార్యక్రమాలను నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామమైన సున్నిపెంటలో చేయటం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. భవిష్యత్తులో నాట్స్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో తమ సేవలు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ) -
తెలంగాణకు 8.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో.. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్‌ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్‌కుమార్, ఈఈ విజయ్‌భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు. -
కృష్ణా జలాలు తీసుకుంది చాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లను తీసుకోవడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యులు డాక్టర్ ఆర్ఎన్ శంఖువా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నెల 2న లేఖ రాశారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీ లను తెలంగాణ వాడుకుందని ఫిర్యాదు చేస్తూ ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. -
శ్రీశైలంలో మిగిలిన నీళ్లు మాకే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న 15.23 టీఎంసీల జలాలను అత్యవసర తాగు నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తీవ్ర కరువు పరిస్థితి ఉన్నా కూడా శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 51 టీఎంసీలను ఆ రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించిందని పేర్కొంది. ఇతర నదీ బేసిన్లకు కృష్ణా జలాలను తరలించేందుకు కృష్ణా ట్రిబ్యునల్–1 అనుమతి లేదని గుర్తు చేసింది. ఇకపై శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకోకుండా ఏపీని నిలువరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. తాగునీటి అవసరాలు ముఖ్యం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలను తాగు అవసరాలకు కేటాయించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ లేఖలో కోరారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకు న్నట్టు గుర్తు చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం సాగు అవసరాలకు సైతం నీటిని తరలించుకుందని ఆరో పించారు. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా 2 కోట్ల మంది అయితే.. ఏపీ జనాభా 78లక్షల మంది మాత్రమేనని తెలిపారు. 2011 నాటి లెక్కల ప్రకారమే.. తెలంగాణ తాగునీటి అవసరాలకు 46.4 టీఎంసీలు, ఏపీ తాగునీటి అవసరాలకు 18 టీఎంసీలు అవసరమని వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్–2కు సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారం చూస్తే.. తాగునీటి అవసరాల కోసం ఏపీకి 8.85 టీఎంసీలు, తెలంగాణకి 40 టీఎంసీలు అవసరమని స్పష్టం చేశారు. గత వానాకాలంలో తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన 18.7 టీఎంసీలను ఈ ఏడాది వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా బోర్డును కోరారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను పణంగా పెట్టి శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలను కేటాయించాలన్న నిబంధనేదీ లేదన్నారు. -
TS: స్వరాష్ట్రంలోనే అన్యాయం!
కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్.. దానిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదంతో సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది. కృష్ణా నీటిని ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్రానికి తరలించుకుపోతుంటే కేసీఆర్ సహకరించారని అంటూ అధికారపక్షం విమర్శలు గుప్పించగా.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తోందని, ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ దీటుగా ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ సర్కారు తీరును వివరించేందుకు తాము నల్లగొండలో బహిరంగ సభ చేపడితే.. దృష్టి మళ్లించేందుకు సభలో తీర్మానం పెట్టారని మండిపడింది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పాపాల భైరవుడు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్‌ను కొడతారంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాకే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. జలాల్లో ఏపీకి ఎక్కువ వాటా ఇచ్చినా, ఆ రాష్ట్రం భారీగా తరలించుకుపోతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కారు కుమ్మక్కైందని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించినది గత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నం చేసినా.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకొని మంత్రిని మాట్లాడనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘2020లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 92,500 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోవడానికి ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 203 తెచ్చినా కేసీఆర్ సర్కార్ అడ్డుకోలేదు. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. కృష్ణా నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినా పట్టించుకోలేదు. పోతిరెడ్డిపాడు ద్వారా 1983లో 11,150 క్యూసెక్కుల నీరు తరలిస్తే.. 2005లో వైఎస్సార్ ప్రభుత్వం దానిని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచింది. జగన్ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 92,500 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు ద్వారా 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలను తీసుకెళ్తే.. 2014 నుంచి 2024 వరకు ఏకంగా 1,201 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయింది. ఏనాడూ అభ్యంతరం తెలపలేదు 2014లో కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాల్లో నీటి వాటాను తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా నిర్ణయిస్తే.. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి 299 టీఎంసీలకు ఒప్పుకొని.. కృష్ణా జలాల్లో తెలంగాణకు శాశ్వత నష్టం చేకూర్చారు. 2015 నుంచి 2023 వరకు ఏటా ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్, హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలేమీ తెలపలేదు. అప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల కోసం 299 టీఎంసీలకు ఒప్పుకొన్నవాళ్లు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన 225 టీఎంసీల గురించి గానీ, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన 206 టీఎంసీల గురించి గానీ ఏనాడూ అడగలేదు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డిలకు అవసరమైన నీటి గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. అపెక్స్ కమిటీ సమావేశంలో కేసీఆర్ సైతం.. 2016 సెపె్టంబర్ 16న ఢిల్లీలో జరిగిన తొలి అపెక్స్ కమిటీ సమావేశానికి అధికారులతో పాటు అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు హాజరయ్యారు. అప్పుడు కూడా కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొని వచ్చారు. నీటి వాటాలపై ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత ఒప్పందమే కొనసాగించాలంటూ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా కేసీఆర్ అంగీకరించడం రాష్ట్రానికి తీరని ద్రోహమే. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతి, అన్యాయం స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇంతా చేసి తెలంగాణ ప్రజానీకంలో అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వాస్తవాలతో ప్రజెంటేషన్ ఇస్తున్నాం. కృష్ణానీటి వాటాలో అన్యాయంపై మేం పోరాడుతాం. ఏపీ ప్రయోజనం కలిగేలా చేశారు ఏపీ సీఎం జగన్, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ గంటల కొద్దీ ఏకాంత చర్చలు చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ముగిసేదాకా కేసీఆర్ అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరుకాకుండా ఏపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారు. కేసీఆర్ తెలంగాణ నీళ్లను ఏపీకి ఇస్తున్నారంటూ జగన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో పొగడటం నిజం కాదా? అసెంబ్లీ ఎన్నికల చివరిరోజున నాగార్జునసాగర్‌ను ఏపీ ప్రభుత్వం అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక రాజకీయం లేదా? కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని తరలించుకోవడం వాస్తవం కాదా? ఈ ఘటనపై కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కృష్ణాబోర్డుకు నాగార్జునసాగర్‌ను అప్పగించేందుకు సిద్ధమన్న రీతిలో అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్రానికి లేఖ రాయడం మరింత నష్టం కలిగించింది. మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకమని కేంద్రానికి స్పష్టం చేశాం. ఇందుకు సంబంధించిన సమావేశం మినిట్స్ మార్చాలని కోరాం. అయినా ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. కేసీఆర్ సభకు వస్తే.. తేలుస్తాం: రేవంత్‌రెడ్డి పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ అని.. కృష్ణా నదిజలాలపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే ఆయన సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ చర్చలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు, వారి మాటలకూ ఏమాత్రం విలువ లేదు. గత పదేళ్ల పాపాలకు కేసీఆరే బాధ్యుడు. ఆ పాపాల భైరవుడు సభలోకి వచ్చి చర్చ చేస్తే మేం సమాధానం చెప్తాం. బీఆర్ఎస్ అధినేత ఇక్కడికొచ్చి మాట్లాడాలి. ఆయనకు ఎంతసేపైనా మైక్ ఇచ్చేందుకు సిద్ధం. తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో తేలుస్తాం..’’ అని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత ఎన్నికల్లో కేసీఆర్‌కు నల్గొండ జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చెప్పుతో కొట్టినట్టుగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కనీసం మంచినీళ్లు కూడా అందని విధంగా నాశనం చేశారని ఆరోపించారు. ఇంత అన్యాయం చేసిన కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకురాసి తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కోవర్టులున్నారు.. సాగనంపుతాం: భట్టి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. కృష్ణా జలాలపై అప్పటి ఈఎన్సీ మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈఎన్సీ బీఆర్ఎస్ వ్యక్తిగా పనిచేశారని, అందుకే సాగనంపామని పేర్కొన్నారు. ఇలాంటి కోవర్టులు ఇంకా ఉన్నారని, వారిని కూడా పంపేస్తామని చెప్పారు. -
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై సుప్రీంకు
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించకుండా తెలంగాణ సహాయ నిరాకరణ చేస్తే సుప్రీంకోర్టుకు నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. గత నెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. కానీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే తెలంగాణ అధికారులు మాటమార్చారు. ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధి విధానాల ఖరారుకు ఈనెల 1న హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించినట్లు ప్రకటించినా, ఆ తర్వాత తెలంగాణ అధికారులు మరోసారి మాటమార్చారు. ఈ నేపథ్యంలో గత నెల 17న తీసుకున్న నిర్ణయాల అమలుపై ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అధికారులు అంగీకరించకపోయినా లేదా గైర్హాజరైనా అదే అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించి, కోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 2021లో ఎగువ నుంచి వరద రాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయ పోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేసి, అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కారు మాత్రం తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించేందుకు నిరాకరించింది. యథేచ్ఛగా తెలంగాణ జలచౌర్యం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు చేసిన వి/æ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తెలంగాణ భూభాగంలో ఉందంటూ ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కారు అధీనంలోకి తీసుకుందని, అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగు నీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో డిసెంబర్ 1న రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సంయమనం పాటించాలని ఆదేశించారు. సాగర్‌పై నవంబర్ 30 నాటి యథాస్థితిని కొనసాగిస్తూ నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు. -
fact check: పంటల‘కేసీ’ కళ్లెట్టుకు సూడు..
కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల శాఖ ఇంజినీర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇది చూసిన పచ్చ పత్రిక ఈనాడు తట్టుకోలేక నీటి తడులపై తప్పుడు కథనాన్ని ప్రచురించింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా కేసీ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించడం, కర్షకులు ఆనందంగా ఉండడాన్ని ఓర్వలేని రామోజీ తన అక్కసు వెళ్లగక్కారు. శ్రీశైలం నీళ్లు అమ్ముకుంటున్నారంటూ కి‘రాత’కానికి దిగారు. కర్నూలు సిటీ/ఆళ్లగడ్డ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు కేసీ కెనాల్ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. సాగు నీటి సలహా మండలి సమావేశంలోనూ తీర్మానం చేశారు. ఆ మేరకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులూ ఆరుతడి పంటలను సాగు చేశారు. ఆ తరువాత సెప్టెంబరు, నవంబరు నెల చివరి వారాల్లో కొంత మేర వర్షాలు పడ్డాయి. దీంతో నవంబరు నెల 25న మరోసారి సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి కేసీ కెనాల్‌కు డిసెంబరు 15 వరకు నీటిని ఇవ్వాలని తీర్మానించారు. రైతులు కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటిని ఇవ్వాలని కోరారు. దీంతో నంద్యాల కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు వారాబందీ ప్రకారం నీరు విడుదల చేస్తున్నారు. నీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు రాత్రీపగలు కెనాల్‌పై గస్తీ కాసి ప్రతి ఎకరాకూ నీరు అందించారు. మంచి దిగుబడులు రావడంతో రైతులు సంబరపడ్డారు. జలవనరుల శాఖ ఇంజినీర్లను సన్మానిస్తున్నారు. అన్నీ తప్పుడు రాతలే రామోజీ పచ్చ పత్రిక బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కై రబీలోని మిరప పంటకు నీటిని అమ్ముకుంటున్నారని కథనం వండివార్చింది. ఇదంతా అవాస్తవం. కేసీ కెనాల్ పరిధిలో మిరప సాగుచేసిన రైతుల్లో బడా రైతులు లేరు. ఒకరికి మాత్రమే పది ఎకరాలు ఉంది. మిగిలిన వారందరూ ఎకరా, ఎకరన్నర ఉన్న సన్నకారు రైతులే. కానీ అనధికారికంగా 20 వేల ఎకరాల్లో సాగు చేశారంటూ తప్పుడు గణాంకాలు ప్రచురించింది. ఇకపోతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 5 టీఎంసీలు కేసీ కెనాల్‌కు తీసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతోనే ముచ్చుమర్రి నుంచి నీటిని తీసుకుంటుంటే ఈనాడు తప్పుడు రాతలు రాసింది. ‘‘నీటి కేటాయింపులు లేవు. రైతులకు నీరు ఎలా ఇస్తారు? రైతులకు అన్యాయం జరుగుతుందనేలా విషపు కథనాన్ని కక్కింది. రైతుల నుంచి వసూళ్ళు చేసిన సొమ్ము రాష్ట్ర స్థాయి అధికారికి చేరిందంటూ అవాస్తవాలతో పైత్యం ఒలకబోసింది. దీనిపై ఇంజినీరింగ్ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అది ముమ్మాటికీ తప్పుడు కథనమే ఉయ్యాలవాడ: శ్రీశైలం నుంచి ఎస్సార్బీసీ కేసీ కెనాల్‌కు వచ్చే సాగు నీటికి రైతులు డబ్బులు ఇచ్చారని ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బుడ్డా చంద్రమోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్ డైరెక్టర్ గజ్జెల క్రిష్ణారెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ ఆరికట్ల శివరామక్రిష్ణారెడ్డి రైతులతో కలిసి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర సాగునీటి జలవనరుల సలహాదారులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేయించారని పేర్కొన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై రైతులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈనాడుది తప్పుడు కథనం కేసీ కెనాల్ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో 97 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆగస్టు, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన ఐఏబీ సమావేశాల్లో డిసెంబర్ 15 వరకు నీటిని అందించాలని తీర్మానం జరిగింది. రైతుల విన్నపం మేరకు శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం. ముచ్చుమర్రి ద్వారా వారాబందీ ప్రకారం రాత్రి, పగలు గస్తీకాసి నీరు అందిస్తుంటే ఇంజినీర్లు డబ్బులు వసూలు చేశారంటూ తప్పుడు కథనం రాయడం బాధాకరం. – వి.తిరుమలేశ్వర రెడ్డి, కేసీ ఈఈ సాగునీరు కొనుక్కొనే దుస్థితి లేదు సాగునీటి కోసం అధికారులకు లంచాలిచ్చి కొనుక్కొనే దుస్థితి రైతుకు దాపురించలేదు. వర్షాభావంలోనూ మా పంటలకు నీరు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వచ్చి పంటలు పండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా కుంటలను నింపుకునేందుకు కేసీ కెనాల్‌కి నీరు వదిలారు. – రామాంజనేయరెడ్డి, రైతు, గుండుపాపల చివరి పంటలకు సాగునీరు ఇచ్చారు ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే జలాశయాల్లో నీరు అంతంత మాత్రమే. అయినా మా పంటలు ఎండకూడదనే ఉద్దేశంతోనే వారాబందీగా నీరు అందించారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందింది. – వాసుడు, రైతు, చాకరాజువేముల -
నేటి నుంచి శ్రీశైలం, సాగర్‌లో ఎన్డీఎస్ఏ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నేతృత్వంలోని నిపుణుల బృందం తనిఖీ చేయనుంది. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును, 13–15 తేదీల్లో నాగార్జునసాగర్‌ను ఎన్డీఎస్ఏ బృందం సందర్శించనుంది. గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టనుంది. ఎన్డీఎస్ఏ సభ్యుడు (డిజాస్టర్, రిసిలియన్స్) వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను, ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు రాకేశ్ కశ్యప్ నేతృత్వంలోని బృందం సాగర్ ప్రాజెక్టును తనిఖీ చేయనుంది. ఈ బృందంలో ఎన్డీఎస్ఏ నుంచి ముగ్గురు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, ఏపీ, సీఎస్ఎంఆర్ఎస్, తెలంగాణ నుంచి చెరో అధికారి కలిపి మొత్తం ఎని మిది మంది సభ్యులు ఉండనున్నారు. శ్రీశైలం ప్రా జెక్టు నుంచి భారీగా వరద విడుదల చేస్తుండటంతో దిగువ భాగంలో 40 మీటర్లలోతు గుంత (ప్లజ్ పూల్) ఏర్పడింది. దిగువ భాగంలో రక్షణ చర్యలతోపాటు కాంక్రీట్ వాల్ నిర్మాణం, స్పిల్ వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని, దీనికి రూ. 800 కోట్లు అవసరమని కేఆర్ఎంబీ గతంలో అంచనా వేసింది. ఇక నాగార్జునసాగర్ స్పిల్‌వే ఓగీలో కాంక్రీట్ పనులు, సీపేజీ గుంతలకు మరమ్మతులు, కుడికాలువ హెడ్ రెగ్యూలేటరీ గేట్లకు మరమ్మతులు, పూడికను బయటకు పంపే గేటు మారి్పడి వంటి పనులు చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ ఇప్పటికే గుర్తించింది. ఇందుకు రూ. 20 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఎన్డీఎస్ఏ బృందం తనిఖీల అనంతరం రెండు ప్రాజెక్టుల మరమ్మతులపై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
నీటి వాటాలపైనా అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తరహాలోనే.. కృష్ణా జలాల వాటాపైనా తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనిని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి.. దాని ప్రకారమే రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసినా.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకూ పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నీటి వాటాలపైనా అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–6(2) ప్రకారం.. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 65 శాతం లభ్యత కింద ఉన్న మిగులు జలాలు 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినా.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై.. మళ్లీ అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై తెలంగాణ రాష్ట్రం మళ్లీ అడ్డం తిరిగింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈనెల 17న ఢిల్లీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కృష్ణా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించిన తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ప్లేటు ఫిరాయించి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు తాము అంగీకరించలేదని బుకాయించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కానీ.. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించినట్లు సమావేశపు మినిట్స్‌లో స్పష్టంగా ఉంది. ఈ మినిట్స్‌పై ఏపీ అధికారులతోపాటు తెలంగాణ అధికారులు కూడా సంతకాలు చేశారు. అప్పుడూ ఇలాగే ప్లేటు ఫిరాయింపు.. గతంలో కృష్ణా బోర్డు 16వ సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిన తెలంగాణ అధికారులు.. ఆ మరుసటి రోజే అడ్డం తిరిగారు. ఇప్పుడూ అదే రీతిలో అడ్డం తిరగడంతో కేంద్ర జల్‌శక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు.. ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 24లోగా త్రిసభ్య కమిటీ సమావేశమై ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధానాన్ని ఖరారు చేయాలి. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున హాజరయ్యే నీటిపారుదల శాఖ ఈఎన్సీ స్పందనను బట్టి చర్యలు తీసుకోవడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ సిద్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీలో ఆరు.. తెలంగాణలో తొమ్మిది ఔట్లెట్లు.. నిజానికి.. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణాబోర్డును ఏర్పాటుచేసింది. ఈ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం.. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని నిర్దేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏపీ భూభాగంలోని ఆరు, తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను స్వాధీనం చేయాలని 16వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. తెలంగాణ భూభాగంలోని అవుట్లెట్లను స్వాధీనం చేసుకుంటే.. తమ భూభాగంలోని అవుట్లెట్లను అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ.. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్లెట్లను బోర్డుకు అప్పగించబోమని అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి మన భూభాగంలోని సాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను జలవనరుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ నిర్వహణలో ఉన్న సాగర్‌ను ఏపీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించడమే అజెండాగా ఈనెల 17న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. -
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నీటి వాటాలు తేలకుండా కేఆర్‌ఎంబీలోకి ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నా రు. శుక్రవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయా లు, ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నదే తమ విధాన మని హరీశ్‌రావు చెప్పారు. బీఆర్ ఎస్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు వారం రోజుల్లోగా (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని తెలుస్తోందని, అదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరు గుతుందన్నారు. కేంద్రం జూలై 2021లోనే ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధి లోకి తేవాలని ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాద నను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కృష్ణా నీటిని ఏపీకి 50%, తెలంగాణకు 50% పంపిణీ చేయాల్సిందిగా తాము షరతు విధించామని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీల నీటిని నాగార్జున సాగ ర్కు విడుదల చేయాలని మరో షరతు పెట్టినట్లు వెల్లడించారు. ఏక పక్షంగా నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని కోరినట్లు తెలిపారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా ప్రాజె క్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కేఆర్ఎంబీలో ఉమ్మడి ప్రాజెక్టులను చేరిస్తే రాష్ట్రానికి ఆత్మహత్యా సదృశ్యమేనన్నారు. జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెస్తే జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని హరీశ్‌రావు చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టుపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు. హైదరాబాద్ తాగునీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం స్పందించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదని, ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలిపారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
నెలలోగా ప్రాజెక్టుల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెల రోజుల్లోగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపా యి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్ సీలు, కృష్ణా బోర్డు సమావేశమై.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రధాన కాంపోనెంట్లు/ఔట్ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంలో అనుసరించాల్సిన విధివిధానాల(హ్యాండింగ్ ఓవర్ ప్రొటోకాల్స్)కు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణా ళికను వారం రోజుల్లోగా సిద్ధం చేస్తామని తెలిపా యి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఈ మేరకు అంగీకరించినట్టు సమావేశపు మినట్స్‌లో ఆ శాఖ పొందుపరిచింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ తర ఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణ రెడ్డితో పాటు కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగర్ వద్ద నో ఎంట్రీ నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట బందోబస్తును కొనసాగించను న్నాయి. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు / అధికారులను సైతం ఇకపై డ్యామ్ పరిసరాల్లోకి అనుమతించరు. ఈ విషయంపై సైతం రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాల భూభాగాల పరిధిలో చెరి సగం వస్తుండగా, ఏదైనా మరమ్మతు పనులు చేపట్టేందుకు సంబంధిత భూభాగం పరిధిలోని రాష్ట్రం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీకి చెల్లించాల్సిన బకాయిలను సైతం తక్షణమే చెల్లిస్తామని రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించేందుకు 15 రోజుల తర్వాత మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ వాదనలు ఇవే.. ఇతర అంశాలపై చర్చించి పరిష్కరించుకోవ డానికి ముందు నాగార్జునసాగర్ వద్ద 2023 డిసెంబర్ 28కి ముందు నెలకొని ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో కోరారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను తెలంగాణ కిందికి విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశ యంలో నిల్వలు అడుగంటిపోతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌కుమార్ సమావేశం దృష్టికి తీసుకె ళ్లారు. సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కోసం కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చినా తెలంగాణ అధికారుల దయాదా క్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు కట్టుబడి సాగర్ నుంచి నీటివిడుదలను నిలుపుదల చేశామని తెలిపారు. -
కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో.. ఫలించిన సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయిం చింది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు.. తెలంగాణకూ ప్రయోజనమే. రెండు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను 2014–15లో పూర్తిగా ఆదీనంలోకి తీసుకుంది. శ్రీశైలంలో మాత్రం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధీనంలోకి తీసుకుంది. అయినా సరే.. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం, తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలన్న స్వార్ధంతో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. ► శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాలకు నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో ఏపీ వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ► 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని, రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015, ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జునసాగర్‌కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో.. వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ► శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటి ద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ హరించివేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ► 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలిస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా, తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు ఏపీకి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. -
నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్‌ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్నందన్కుమార్ వివరించారు. వెనకడుగు కాదు.. ముందడుగే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్‌పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్‌ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్‌ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు. అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్‌లలోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్‌ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. -
కృష్ణా జలాల వివాదంపై నేడు భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నది దిగువ బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించడమే అజెండాగా బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించనున్నారు. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య నవంబర్ 30న వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు పరిధిని నిర్దేశించేవరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ(ఆంధ్రప్రదేశ్), సాగర్ నిర్వహణను ఆ ప్రాజెక్టు సీఈ(తెలంగాణ)కి అప్పగించింది. కానీ తమ భూభాగంలో ఉందంటూ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నా అప్పటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా దిగువకు నీటిని వదిలేస్తూ.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. శ్రీశైలం పాజెక్టును ఖాళీ చేస్తూ రాయలసీమ హక్కులను తెలంగాణ హరిస్తూ వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్‌కు తరలించిన జలాలను.. కుడి కాలువకు విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులను కాలరాస్తూ వస్తోంది. బోర్డు పరిధి నిర్దేశించినప్పటికీ.. దీనిపై 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలి. కృష్ణా బోర్డు సమావేశంలో ఆ ప్రాజెక్టులను అప్పగించడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరగడంతో ఇప్పటివరకు గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్లో దిగువన నీటి అవసరాలు లేకపోయినా.. శ్రీశైలంలో ఏపీకి కేటాయించిన 17 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసి సాగర్‌కు తరలించిన తెలంగాణ.. వాటిని ఏపీకి విడుదల చేయకుండా మొండికేసింది. దాంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి నవంబర్ 30న ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాగర్ వివాదంతో కదలిన కేంద్రం సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం చెలరేగడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి డిసెంబర్లో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్‌పై యధాస్థితిని కొనసాగిస్తూ.. సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వివాదానికి తెరదించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించడంతోపాటు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 2015లో చేసిన సర్దుబాటు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాలు కొనసాగించడం, వరద జలాల మళ్లింపుపై బుధవారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. -
జూరాలకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో.. శ్రీశైలం జలాశయంలో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు ప్రాజెక్టుకు 2,800క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. నెట్టెంపాడు ఎత్తిపోతల నీటి పంపింగ్ కొనసాగుతుంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 99, ఎడమ కాల్వకు 1,140, కుడి కాల్వకు 731, ఆర్డీఎస్ లింకు కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంలో నీటిమట్టం 842 అడుగులు దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో సోమవారం 842 అడుగుల వద్ద 64.9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,427 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,392, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 960, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 135 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
చిన్నబోయిన కృష్ణమ్మ!
సాక్షి, అమరావతి: నిండా నీటితో పరుగులు తీసే కృష్ణమ్మ ఈ ఏడాది చిన్నబోయింది. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పాయతోపాటు కృష్ణా ఉప నదులైన కోయినా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వేదవతి, భీమాలలోనూ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. బేసిన్లో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన నికర జలాల లభ్యతలో ఈ ఏడాది సగం కూడా లభించడం లేదు. నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో నీటికి కటకట ఏర్పడింది. సాగునీటికే కాదు తాగునీటికీ ఇబ్బందులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ పర్వత శ్రేణుల్లో పురుడు పోసుకునే కృష్ణమ్మ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ మీదుగా 1,400 కి.మీ. పొడవున ప్రవహించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ చరిత్రలో రెండో కనిష్ట ప్రవాహం కృష్ణా నదిలో ఏటా సగటున 75 శాతం లభ్యత (నికర జలాల) ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసింది. అందులో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299) చొప్పున కేటాయించింది. కానీ.. ఈ ఏడాది కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రధాన పాయతోపాటు ఉప నదుల్లో వరద ప్రవాహం పెద్దగా రాలేదు. దాంతో నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకుంది. మహారాష్ట్రలో కృష్ణా ప్రధాన పాయ, కోయినా, దూద్గంగ, భీమా వంటి ఉప నదుల ద్వారా ఇప్పటివరకు ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి 298 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయతోపాటు ఘటప్రభ, మలప్రభ, వేదవతి, తుంగభద్ర ద్వారా ప్రాజెక్టుల్లోకి 427 టీఎంసీల ప్రవాహం వచ్చింది. బేసిన్లో దిగువన గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల్లోకి కృష్ణా ప్రధాన పాయతోపాటు మూసీ, పాలేరు, మున్నేరు వంటి ఉప నదుల ద్వారా ఇప్పటివరకు కేవలం 157 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. శ్రీశైలంలోకి 120 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. ఇది ఆ ప్రాజెక్టు చరిత్రలో రెండో కనిష్ట ప్రవాహం కావడం గమనార్హం. 2015–16లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన 58.69 టీఎంసీలే ఆ ప్రాజెక్టు చరిత్రలో కనిష్ట ప్రవాహం. కృష్ణా బేసిన్లో 2019–20 నుంచి 2022–23 వరకూ నాలుగేళ్లూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే అధికంగా జలాలు లభించాయి. ఈ ఏడాది నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో బేసిన్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. -
5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితులవల్ల దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు కనిష్టంగా ఉన్న నేపథ్యంలో మే 31 వరకూ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు నిర్వహించనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి మే 31 వరకూ తాగునీటి అవసరాలకు ఎన్ని నీళ్లు అవసరమో అక్టోబర్ 3లోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కోరింది. కమిటీలో సభ్యులందరూ ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యతను బట్టి, రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుని నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డుకు సిఫార్సు చేయడానికి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కృష్ణాబోర్డు ఛైర్మన్ ఏర్పాటుచేశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటిసారిగా జూలైలో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. తాగునీటి అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల నుంచి 12.7 టీఎంసీలను విడుదల చేయాలని సిఫార్సు చేయడంతో ఆ మేరకు నీటి విడుదల ఉత్తర్వులను జూలై 21న కృష్ణా బోర్డు జారీచేసింది. ఆ తర్వాత ఆగస్టు 21, 24న త్రిసభ్య కమిటీ రెండోసారి సమావేశమైంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటినిల్వ తక్కువగా ఉన్న నేపథ్యంలో.. తాగునీటి అవసరాల కోసం నిల్వచేయాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై సంప్రదింపులు జరపకపోవడంతో అప్పట్లో నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణాబోర్డు జారీచేయలేదు. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ దృష్టికి సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తీసుకెళ్లారు. తక్షణమే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించి.. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలను చర్చించి.. నీటి కేటాయింపులకు సిఫార్సు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఆదేశించారు. దాంతో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. -
అది మా పరిధిలోకి రాదు
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలను కేటాయిస్తూ ఆ రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవోపై విచారణ తమ పరిధిలోకి రాదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 తేల్చి చెప్పింది. ఈ జీవోపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)ను బుధవారం కొట్టివేసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు తెలంగాణ సర్కారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీల వాటా తమకే దక్కుతుందని ఏకపక్షంగా తీర్మానించుకుని మొత్తం 90 టీఎంసీలను ఆ ఎత్తిపోతలకు కేటాయించుకుంటూ 2022 ఆగస్టు 18న తెలంగాణ ప్రభుత్వం జీవో 105 జారీ చేసింది. కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను నాగార్జునసాగర్‌కు ఎగువన కృష్ణా నదిలో 45 టీఎంసీలను అదనంగా వాడుకునే వెసులుబాటును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చింది. విభజన నేపథ్యంలో ఆ 45 టీఎంసీలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని, చిన్న నీటి వనరుల విభాగంలో కేటాయింపులకంటే తెలంగాణ అధికంగా వాడుకుంటున్నందున, జీవో 105ను రద్దు చేయాలంటూ కేడబ్ల్యూడీటీ–2లో గతేడాది ఏపీ ప్రభుత్వం ఐఏ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ ఎస్.తాళపత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి సభ్యులుగా ఉన్న కేడబ్ల్యూడీటీ–2 పలుమార్లు విచారించి, బుధవారం తుది తీర్పు ఇచ్చింది. విభజన చట్టంలో సెక్షన్–89(ఏ) ప్రకారం అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956 కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ నీటిని కేటాయించని ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయింపులు చేయడం తమ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను విభజన చట్టం అమల్లోకి వ చ్చిన తర్వాత తెలంగాణ చేపట్టిందని తెలిపింది. అందువల్ల ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విచారణ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. -
రిజర్వాయర్ల నీళ్లు.. పూడిక పాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిపోతోంది. ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో.. శ్రీశైలం లైవ్ స్టోరేజీ (వాడుకోదగిన నీళ్లు) సామర్థ్యం 253.058 టీఎంసీల నుంచి 188.71 టీఎంసీలకు.. నాగార్జునసాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీల నుంచి 189.295 టీఎంసీలకు పడిపోయింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ‘శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ (ఎస్ఆర్ఎస్)’ సర్వేలలో ఈ అంశం వెల్లడైంది. జలాశయాల్లో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్ 1ఏ/ఏబీ ఉపగ్రహాల డేటా ఆధారంగా పరిశీలించి, విశ్లేషించడం పూడిక పరిస్థితిపై నివేదికను సిద్ధం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాలు తాగు, సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 13.182 టీఎంసీలు తగ్గిన సాగర్ సామర్థ్యం నాగార్జునసాగర్ డ్యామ్‌ను 1956–1968 మధ్య నిర్మించారు. అప్పట్లో జలాశయం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీలుకాగా, 1999లో నిర్వహించిన శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సర్వేలో సామర్థ్యం 195.806 టీఎంసీలకు తగ్గిపోయిందని తేలింది. 2001, 2009లలో నిర్వహించిన రిజర్వాయర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేలలో మాత్రం సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం వరుసగా 217.47 టీఎంసీలు, 213.388 టీఎంసీలని తేలింది. తాజాగా శాటిలైట్ డేటాను విశ్లేషించగా.. 2020 నాటికి సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 189.295 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1968–2020 మధ్య 52 ఏళ్లలో 13.182 టీఎంసీల ( 6.511శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. సగటున ఏటా 0.125 శాతం నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతోంది. శ్రీశైలానికి 64.339 టీఎంసీల నష్టం కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయాన్ని 1981లో నిర్మించగా.. 1984 నుంచి నీళ్లను నిల్వ చేస్తున్నారు. 253.058 టీఎంసీల లైవ్ స్టోరేజీ, 55 టీఎంసీల డెడ్ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) కలిపి మొత్తం 308.06 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. తాజా అధ్యయనంలో శ్రీశైలం లైవ్ స్టోరేజీ 188.71 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1984–2021 మధ్య 37 ఏళ్లలో శ్రీశైలం ఏకంగా 64.339 టీఎంసీల (25.425శాతం)సామర్థ్యాన్ని నష్టపోయిందని, ప్రాజెక్టు ఏటా 0.687 శాతం లైవ్ స్టోరేజీని కోల్పోతోందని వెల్లడైంది. ఇంతకుముందు 1990, 1999లలో నిర్వహించిన రిమోట్ సెన్సింగ్ సర్వేల్లో శ్రీశైలం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 194.437 టీఎంసీలు, 181.95 టీఎంసీలకు తగ్గిపోయినట్టు గుర్తించారు. తాజా సర్వేతో పోల్చితే 1990, 1999 నాటి సర్వేలు ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొన్నా.. అప్పట్లో వాటర్ స్ప్రెడ్ ఏరియాను సరిగ్గా అంచనా వేయక కచ్చితమైన ఫలితం రాలేదని తాజా సర్వేలో సీడబ్ల్యూసీ పేర్కొంది. పూడికను నివారించేదిలా? జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని అని.. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. ఈ మేరకు తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది. ♦ అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకునేందుకు పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా చెట్లను పెంచాలి. ♦ నదీ తీరాల్లో రివిట్మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ♦ నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు. ♦ వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది. ♦ రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి. -
పోలవరంపై బాబువి కాకి లెక్కలు
బి.కొత్తకోట : గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సీ నారాయణరెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై శనివారం ఆయన హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశ పనులపై మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల పోలవరం ప్రాజెక్టుకు రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లింది. అప్పట్లో కాంట్రాక్టర్లు లాభదాయకమైన పనులు మాత్రమే చేసి సొమ్ము చేసుకున్నారు. నిజానికి.. పోలవరం పనుల పరిశీలనకు వచ్చిన చంద్రబాబు అక్కడ ఆరు కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని మళ్లించి చేపట్టిన పనులను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఏమి మాట్లాడలేకపోయారు. అలాగే.. కుప్పంకు అక్టోబర్‌లో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తాం. కుప్పం ఉపకాలువ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నాం. ఇక్కడ రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లు ప్రతిపాదించాం. అవుకు రెండో సొరంగం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక్కడినుంచి ఒక టీఎంసీ నీటిని గండికోట ప్రాజెక్టుకు తరలిస్తాం. గత ప్రభుత్వం ఈ పనులను వదిలేసింది. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లోని 68 చెరువులకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి నింపుతాం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు గురించి తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు తన ప్రభుత్వంలో నిర్వహణకు కేవలం రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.కోటిన్నర పార్కు కోసం ఖర్చుచేసి.. మిగతా రూ.3.5 కోట్లను భోంచేశారు. వెలిగొండ మొదటి సొరంగం పనులు పూర్తిచేశాం. రెండో సొరంగం పనులు అక్టోబర్‌లోగా పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. ఇక కర్ణాటక చేపట్టిన అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేశాం. ఆ పనులు ముందుకు సాగే పరిస్థితుల్లేవు. శ్రీశైలం జలాశయంలో 66 శాతం జలాలు ఏపీ వాటాకు వస్తాయి. ఇరు రాష్ట్రాల నీటి పంపకాలు జరగలేదని తెలంగాణ వాదించడం సరికాదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాం. ఉత్తరాంధ్రకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను రూ.2వేల కోట్ల వ్యయంతో పూర్తిచేయనున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదటి దశ ఒక టీఎంసీ సామర్థ్యంతో తాగునీటి సంబంధిత పనులు ప్రారంభమయ్యాయి. -
‘కృష్ణా’లో కరువు తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రధాన జలాశయాలకు శనివారం నాటికి వరద ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. ఆల్మట్టిలోకి కేవలం 900 క్యూసెక్కులు చేరుతుండగా, దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి ఎలాంటి వరద రావడం లేదు. జూరాల రిజర్వాయర్‌కు 3,000 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్‌లోకి 587 క్యూసెక్కులు చేరుతుండగా, శ్రీశైలానికి ఎలాంటి వరద రావడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు గత జూలై నెలాఖరు నాటికి నిండగా, తర్వాత కురిసే వర్షాలతో వచ్చే వరదను నేరుగా శ్రీశైలం జలాశయానికి విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఆగస్టు ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావం నెలకొని ఉండటంతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జలాశయాలకు ఎలాంటి వరద రాలేదు. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో 108 టీఎంసీల వరద రావాల్సి ఉంది. శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 107.194 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీళ్లను విడుదల చేస్తుండటం, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కాల్వలకు నీళ్లను తరలిస్తుండటంతో జలాశయంలో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌కు సైతం ఎలాంటి ప్రవాహం రావడం లేదు. సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 150.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయం నిండడానికి మరో 161 టీఎంసీల వరద రావాల్సి ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సాగు, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకుంటే వేసవిలో తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక జారీ చేసింది. త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 22 లేదా 23వ తేదీలకు వాయిదా వేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ రాష్ట్రం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ/ చెన్నై తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ/గాలేరు నగరి సుజల స్రవంతి అవసరాలకు 4 టీఎంసీలు, కేసీ కాల్వకు 2.5 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 4.5 టీఎంసీలు కలుపుకుని 16 టీఎంసీలను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలను సైతం తెలియజేయాలని కృష్ణా బోర్డు ఇక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 21న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు. -
శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్‌ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది. ‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా! పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు. శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్‌బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి. పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు. ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్‌లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే! శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు. రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి మద్రాస్‌లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్. ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది. సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్‌ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్‌తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం. చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్‌ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్‌ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్‌కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి. ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది. డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్‌కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది. అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు. సత్య శోధన శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ) ► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయి. ► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు. ► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్‌లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు. ► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు ► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్‌ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్‌లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్‌లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్‌ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్‌కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు. ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్‌కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు. వర్ధెల్లి మురళి -
శ్రీశైలంలో ఆగని విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆంధ్రలోని కుడిగట్టులో స్వల్పంగా.. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం నీళ్లపై ఆధారపడి ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిపివేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశించినా ఖాతరు చేయకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. కాగా, శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 0.192 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను, ఎడమగట్టు కేంద్రంలో 7.975 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌కు 15,685 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయానికి గత 4 రోజులుగా వరద ప్రవాహం నిలిచిపోయింది. మరోవైపు దిగువ ప్రాంతాలకు నీరు విడుదల అవుతుండడంతో జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతుంది. ప్రస్తుతం జలాశయంలో 119.7828 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 864.30 అడుగులకు చేరుకుంది. -
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణాబోర్డు ఆదేశించింది. బోర్డు జారీ చేసే నీటి కేటాయింపుల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు లేఖ రాసింది. నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇంకా ఎలాంటి ఇండెంట్ ఇవ్వలేదని గుర్తు చేసింది. సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న నేపథ్యంలో, వార్షిక సగటు వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం జలాశయాలు పూర్తిగా నిండకపోవచ్చని, ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించాల్సిన అవసరముందని చెప్పింది. కృష్ణా బోర్డుకు సంబంధం లేదు సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి జరపాలని కృష్ణాబోర్డు కోరడం పట్ల తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాగర్‌కు నీటి విడుదల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మించాలని ప్రణాళిక సంఘం అనుమతిచ్చిందని, శ్రీశైలం నిండిన తర్వాతే సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేస్తున్నాయి. ఈ విషయంలో కృష్ణాబోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని, జలవిద్యుదుత్పత్తి బోర్డు పరిధిలోకి రాదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ త్వరలో కృష్ణా బోర్డుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది. జల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది ప్రస్తుతం వర్షాభావం నెలకొని ఉండడంతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ భారీ పెరిగింది. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు లోటును పూడ్చుకోవడానికి మాత్రమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి చేస్తున్నామని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ కొరత నెలకొన్న సమయంలో జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. -
వాయువేగంతో వెలిగొండ
సాక్షి, అమరావతి: ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఫలాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి మరో తార్కాణమిది. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో సొరంగం పనులను శరవేగంగా కొలిక్కి తెస్తోంది. ఇప్పటికే 17.924 కి.మీ. పొడవున సొరంగం తవ్వకం పనులు పూర్తి కాగా మిగతా 876 మీటర్ల పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేసేలా ముమ్మరం చేసినట్లు సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. శ్రీకారం చుట్టిన వైఎస్సార్ ఈ ఏడాదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు తరలించి తొలి దశ పూర్తి చేసే దిశగా పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్‌లో నిల్వ చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టి పడియ కాలువ ద్వారా 9,500, గుండ్ల బ్రహ్మేశ్వరం రిజర్వాయర్ ద్వారా 3,500, రాళ్లవాగు ద్వారా 1,500) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ 2004 అక్టోబర్ 27న వెలిగొండకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్‌తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులను పూర్తి చేశారు. సొరంగాలను నల్లమల సాగర్‌తో అనుసంధానించి 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక 1996 లోక్‌సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే అదికూడా శంకుస్థాపన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. 2014లో మళ్లీ అధికారంలో ఉండగా వెలిగొండను చంద్రబాబు కామధేనువులా మార్చుకున్నారు. రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి లేకపోవడం గత సర్కారు లూటీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ని వర్తింపజేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.650 కోట్లకుపైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు రాబట్టుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిచ్చిన చంద్రబాబు చివరకు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి అంచనా వ్యయాన్ని పెంచేశారు. అనంతరం వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. స్వప్నాన్ని సాకారం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దివంగత వైఎస్సార్ చేపట్టిన వెలిగొండను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. శ్రీశైలం నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తి చేశారు. వెలిగొండ పనులకు ఇప్పటిదాకా రూ.953.12 కోట్లను వ్యయం చేసి ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. గత సర్కారు అంచనా వ్యయం పెంచిన రెండో సొరంగంలో మిగిలిన పనులను రద్దు చేసిన సీఎం జగన్ వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. నాడు టీడీపీ సర్కార్ నిర్దేశించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువ వ్యయంతో పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ. సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. వైఎస్సార్ హయాంలోనే నల్లమల పర్వత శ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో విస్తరించిన వెలిగొండ కొండల మధ్య సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కాంక్రీట్ ఆనకట్టలు నిర్మించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్‌ను పూర్తి చేశారు. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్‌కు తరలించేందుకు వీలుగా 23 కి.మీ. పొడవున ఫీడర్ ఛానల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండో సొరంగంలో కాలం చెల్లిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) స్థానంలో గతేడాది మనుషుల ద్వారా పనులను చేపట్టారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద మనుషుల ద్వారా సొరంగాన్ని తవ్విస్తున్నారు. ఇప్పటికే 6.822 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేసింది. మిగిలిపోయిన మరో 876 మీటర్ల పనులు అక్టోబర్‌లోగా పూర్తవుతాయి. -
కృష్ణాలో తగ్గిన వరద
సాక్షి, అమరావతి: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 82,055 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 846.7 అడుగులకు పెరిగింది. నీటినిల్వ 73.23 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. పూర్తినిల్వ 215.81 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 142 టీఎంసీలు అవసరం. కృష్ణా ప్రధానపాయపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలుగా మారిన నేపథ్యంలో.. ఇకపై కురిసే వర్షాల వల్ల ఆ డ్యామ్‌లలోకి వచ్చే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సిందే. ఈ నేపథ్యంలో శ్రీశైలంతోపాటు, నాగార్జునసాగర్ కూడా ఆగస్టులో నిండుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి మూసీ నుంచి 11,755 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 32 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 13 టీఎంసీలు అవసరం. మున్నేరు, కట్టలేరు, బుడమేరు తదితర వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 48,696 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో గేట్లద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 46.715 టీఎంసీల కృష్ణా మిగులు జలాలు కడలిలో కలిశాయి. ఇవన్నీ మున్నేరు, కట్టలేరు వరద జలాలే కావడం గమనార్హం. ఇక పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం ఏర్పడటంతో.. కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద మరింత తగ్గింది. ఆల్మట్టిలోకి 1.16 లక్షలు, నారాయణపూర్‌లోకి 60 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో గేట్లను మూసేశారు. ఆ రెండు డ్యామ్‌లలో విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తూ దిగువకు 55 వేల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాలలోకి వరద ప్రవాహం 63,563 క్యూసెక్కులకు తగ్గడంతో గేట్లను మూసేసి.. విద్యుదుత్పత్తి చేస్తూ 41,252 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం మరింతగా తగ్గనుంది. ఇక కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలోను వరద తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 42,376 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 72.36 టీఎంసీలకు చేరుకుంది. ఈ డ్యామ్ నిండాలంటే ఇంకా 33 టీఎంసీలు అవసరం. -
కృష్ణాలో పెరిగిన వరద
సాక్షి, అమరావతి/హొళగుంద(కర్నూలు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,14,445 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 64.41 టీఎంసీలకు చేరుకుంది. దాంతో ఆల్మట్టి డ్యామ్ సగం నిండినట్లయింది. మరో 65 టీఎంసీలు చేరితే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆల్మట్టిలోకి మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాలకు.. స్థానికంగా కురిసిన వర్షాలు తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ఆడ్యామ్లో నీటి నిల్వ 19.09 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 18 టీఎంసీలు అవసరం. ఇక జూరాల ప్రాజెక్టులోకి 26,244 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 33,235 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 4,045 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 35.47 టీఎంసీలకు చేరుకుంది. మూసీ ప్రవాహంతో నాగార్జునసాగర్‌కు దిగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 8,532 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.73 టీఎంసీలకు చేరుకుంది. మున్నేరు, వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజ్‌లోకి 10,917 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 7,785 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,132 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు భారీగా వరద కృష్ణా నది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ప్రవాహం జోరందుకుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 30 టీఎంసీలను దాటింది. సోమవారం ఉదయం 64,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నీటి చేరిక ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి డ్యాం నిండి ఎల్ఎల్సీ కింద వరి సాగుకు అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గ, ఆగుంబే, వరనాడు, తీర్థనహళ్లి తదితర డ్యాంల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద నీరు చేరికపై వారు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం దిగువ కాలువకు తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులు ఈ నెల 28 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా సోమవారం ఉదయం 1,602.84 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నిల్వ ఉంది. 24ఏఎల్ఆర్129: తుంగభద్ర రిజర్వాయర్‌లోకి చేరిన వరద నీరు 24ఎస్ఆర్ఐ 30ఏ – 812 అడుగులు వద్ద శ్రీశైలం డ్యాం నీటిమట్టం -
శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టులో జలవిద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 22,573 క్యూసెక్కులు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు.. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 808.90 అడుగుల్లో 33.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నారాయణపూర్, ఉజ్జయిని డ్యామ్‌లకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధాన పాయ, భీమాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 41,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 37,930 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్‌లోకి 2,015 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 8,685 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.39 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు దిగువన మున్నేరు, వాగులు, వంకల ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజ్‌లోకి 15,698 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 6,114 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 9,584 క్యూసెక్కులను అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టిలోకి పెరిగిన వరద పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,07,769 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.56 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదలుతున్న ఆరు వేల క్యూసెక్కులు నారాయణపూర్ డ్యామ్‌కు చేరుతున్నాయి. సోమవారం ఆల్మట్టిలోకి మరింతగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. తుంగభద్రలోనూ పెరిగిన ప్రవాహం తుంగభద్ర డ్యామ్, తుంగ ఆనకట్ట దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల తుంగభద్రలో వరద ఉద్ధృతి కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 54,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.36 టీఎంసీలకు చేరుకుంది. -
తాగు, సాగు నీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంలో సాగు, తాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా ఖరారు చేసింది. నీటి సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు జలాశయంలో కనీస నీటి మట్టానికి ఎగువన నీటి నిల్వ ఉండేలా చూడాలని నిర్దేశించింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికంటే 75 శాతం లభ్యత ఆధారంగా రెండు రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను వాడుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు, తాగు నీటి అవసరాలను దెబ్బతీసేలా ఇతర అవసరాలకు అంటే విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్స్ (నిర్వహణ నియమావళి)లో ఈ విషయాలను స్పష్టంగా చెబుతూ కృష్ణా బోర్డుకు సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. నాగార్జునసాగర్ రూల్ కర్వ్స్‌పైనా సీడబ్ల్యూసీ ముసాయిదా నివేదిక ఇచ్చింది. వీటిపై రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)లో చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. మరోసారి ఆర్ఎంసీలో చర్చ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తికి నియమావళి, రెండు ప్రాజెక్టుల రూల్ కరవ్స్, మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా వద్దా అనే అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు గతేడాది మే 10న కృష్ణా బోర్డు ఆర్ఎంసీని ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు అప్పటి సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కో డైరెక్టర్లు ఇందులో సభ్యులు. ఆర్ఎంసీ ఆరు సార్లు సమావేశమై.. గతేడాది డిసెంబర్ 8న కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించి, అంగీకారం తెలిపిన తెలంగాణ అధికారులు.. నివేదికపై సంతకం చేసేందుకు మాత్రం నిరాకరించారు. ఈ అంశంపై ఈనెల 10న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించి, ఆర్ఎంసీని పునరుద్ధరించారు. రూల్ కరŠవ్స్, విద్యుదుత్పత్తికి నియమావళి, వరద జలాల మళ్లింపుపై మరోసారి చర్చించి నెలలోగా నివేదిక ఇవ్వాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ ఆర్ఎంసీని ఆదేశించారు. వివాదాలకు చరమగీతం పాడటానికే కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచుగా విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణం ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుదుత్పత్తి, వరద జలాల మళ్లింపే. ఆర్ఎంసీ నివేదికను బోర్డు సమావేశంలో మరో మారు చర్చించి 2023–24లో అమలు చేయడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ నిర్ణయించారు. గతంలో తరహాలోనే ఆర్ఎంసీ నివేదికపై ఈసారీ తెలంగాణ అధికారులు సంతకాలు చేయడానికి నిరాకరిస్తే.. కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. -
శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ మావే..
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో అంగీకరించిన వాటా కంటే తెలంగాణ సర్కార్ అధికంగా 90.36 టీఎంసీలు వాడుకుందని.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తాగునీటి అవసరాలు, ఉద్యాన పంటలు, సాగు చేసిన పంటలను రక్షించుకోవడం కోసం సాగర్ కుడి కాలువకు 6, ఎడమ కాలువకు 1 టీఎంసీని విడుదల చేస్తూ తక్షణమే ఉత్తర్వులివ్వాలని కోరింది. ఈ మేరకు గురువారం కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలివీ.. ♦ దిగువ కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో లభ్యతగా ఉన్న జలాలు 961.07 టీఎంసీలు. ఇందులో అంగీకరించిన మేరకు ఏపీ వాటా 634.30 టీఎంసీలు(66 శాతం) తెలంగాణ వాటా 326.77 టీఎంసీలు(34 శాతం). ♦ ఈ నెల 12 వరకూ ఏపీ 470.63 టీఎంసీలు, తెలంగాణ 417.13 టీఎంసీలు వాడుకున్నాయి. వీటిని పరిశీలిస్తే.. ఏపీ కోటా కింద ఇంకా 163.67 టీఎంసీలు మిగిలాయి. తెలంగాణ సర్కార్ కోటా కంటే ఎక్కువగా 90.36 టీఎంసీలు అధికంగా వాడుకుంది. ♦ ఈ నెల 12 నాటికి శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న 126.01 టీఎంసీలన్నీ ఏపీవే. ఆ రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేసి, దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించండి. -
శ్రీశైలం జలాశయం ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా సాగునీరు, విద్యుదుత్పత్తి అవసరాలకు జలాశయం నుంచి నీళ్లను తరలించడంతో జలాశయంలో నిల్వలు కనీస నీటి మట్టానికి దిగువన పడిపోయాయి. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, గురువారం నాటికి కేవలం 51.92 టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలాయి. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా.. సాగునీటి అవసరాలకు 854 అడుగులు, విద్యుదుత్పత్తి అవసరాలకు 834 అడుగుల కనీస నీటి మట్టం(ఎండీడీఎల్) ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 830 అడుగులకు పడిపోయింది. సాగునీటి, తాగునీటి అవసరాల పరిరక్షణ కోసం తక్షణమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసేలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు. నిల్వల్లో ఏపీకి మిగిలింది 13 టీఎంసీలే ! తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ప్రస్తుత నీటి సంవత్సరంలో మొత్తం 932.07 టీఎంసీల జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే 725.51 టీఎంసీలను రెండు రాష్ట్రాలు వాడుకున్నాయి. మొత్తం లభ్యత జలాల్లో తాత్కాలిక కేటాయింపుల నిష్పత్తి 66: 34 ప్రకారం ఏపీకి 615.17 టీఎంసీలు, తెలంగాణకు 316.90 టీఎంసీల వాటా ఉంది. ఇప్పటికే ఏపీ 542.45 టీఎంసీలను వాడుకోగా, ఆ రాష్ట్రం పరిధిలోని ఇతర జలాశయాల్లో నిల్వ ఉన్న 59.68 టీఎంసీల కృష్ణా జలాలను కలుపుకుని ఆ రాష్ట్రం మొత్తం 602.13 టీఎంసీలను వాడుకున్నట్టు అయింది. తెలంగాణ 183.05 టీఎంసీలను వాడుకోగా, ఇక్కడి ఇతర జలాశయాల్లోని 10.2 టీఎంసీల నిల్వలు కలిపి మొత్తం 193.26 టీఎంసీలను వాడుకున్నట్టు అయింది. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో 136.67 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, అందులో ఏపీకి 13.03 టీఎంసీలు, తెలంగాణకు 123.63 టీఎంసీల కోటా ఉందని తెలంగాణ పేర్కొంటోంది. కల్వకుర్తి ఎత్తిపోతలకు కష్టకాలమే ! శ్రీశైలం జలాశయంలో 800.52 అడుగుల కనీస నీటి మట్టం ఉంటేనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2.38లక్షల ఎకరాల ఆయటకట్టుకు సాగునీటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి సరఫరాకు వీలు కానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సాగునీటి అవసరాలకు 13.6 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 4.40 టీఎంసీలు కలిపి మొత్తం 18టీఎంసీలు అవసరం. ప్రస్తుతం జలాశయంలో 51టీఎంసీలే మిగిలి ఉండగా, రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి కొనసాగిస్తుండడంతో నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలను పరిరక్షించడానికి తక్షణమే రెండు రాష్ట్రాలతో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది. గతేడాది శ్రీశైలం జలాశయంలో నిల్వలు డెడ్‌స్టోరేజీకి పడిపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా వేసవి తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం జలాశయంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లను ఎత్తిపోయాల్సి వచ్చింది. నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీలో కృష్ణా బోర్డు కన్వీనర్‌తో పాటు ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు పాల్గొననున్నారు. రబీ ఆయకట్టుతో పాటు వేసవి తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. -
శ్రీశైలం ‘హైడల్’ పునరుద్ధరణ !
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కిందట ప్రమాదంలో కాలిపోయిన శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం పునరుద్ధరణ ఎట్టకేలకు సంపూర్ణమైంది. 4వ యూనిట్‌కు సైతం తాజాగా మరమ్మతులు పూర్తయ్యాయి. అయితే ఈ యూనిట్‌కి సంబంధించిన సర్జ్‌పూల్‌లో పడిపోయిన భారీ గేటు.. ఇంకా బయటకు తీయకపోవడంతో విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు అడ్డంకిగా మారింది. గేటును బయటకు తీసిన తర్వాతే 4వ యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు వీలుంది. మరమ్మతులకు రూ.60 కోట్లకు పైగా వ్యయమైందని జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు కేరళ నుంచి వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ! 900(6 ్ఠ150) మెగావాట్ల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 6 యూనిట్లుండగా, 2020 ఆగస్టు 20న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అన్ని యూ నిట్లు కాలిపోయాయి. అందులో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఇతర సిబ్బందితో సహా మొత్తం 9 మంది ఈ ప్రమాదానికి బలయ్యారు. 1, 2 వ యూనిట్లకు అదే ఏడాది మరమ్మతులు జరిపి వినియోగంలో తీసుకురాగా..3, 5, 6వ యూనిట్లను తర్వాతి కా లంలో వినియోగంలోకి తెచ్చారు. నాలుగో యూని ట్కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తి గా కాలిపోగా, అప్పటికప్పుడు అలాంటి ట్రాన్స్ఫార్మర్ మార్కెట్లో ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రం నిర్మాణం సమయంలో ..ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కేరళ లిమిటెడ్ (టెల్క్) తయారు చేసిన 190 ఎంవీఏ సామర్థ్యం కలిగిన 3 లింబ్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లను వినియోగించారు. నాటి ట్రాన్స్ఫార్మర్ల డిజైన్, నమూనాలను పంపించి అలాంటిదే కొత్త ట్రాన్స్ఫార్మర్ తయారీ కోసం టెల్క్కి జెన్కో ఆర్డర్ పెట్టింది. భారీగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉండడంతో ట్రాన్స్ఫార్మర్ తయారీకి టెల్క్ రెండేళ్లకు పైగా సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఇటీవల కేరళ నుంచి ట్రాన్స్ఫార్మర్ రావడంతో 4వ యూనిట్‌కు మరమ్మతులు సైతం పూర్తయినట్టు జెన్కో వర్గాలు తెలిపాయి. కొలిక్కి రాని విచారణలు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా సీఐడీ విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. దక్షిణ డిస్కం సీఎండీ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ సైతం విచారణ నివేదికను సమర్పించలేదని సమాచారం. ఓ వైపు విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ.. మరో వైపు విద్యుదుత్పత్తిని నియంత్రించే ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టంలోని ప్యానెల్ బోర్డులో బ్యాటరీలను మార్చే పనులను సమాంతరంగా చేపట్టడంతోనే షార్ట్ సర్యు్కట్ సంభవించి ఈ ఘోర ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసి ఉంటే ప్యానెల్‌బోర్డు వద్దే మంటలను నియంత్రించే అవకాశం ఉండేదని నిపుణులు అంటున్నారు. అవగాహన లేక ఇంజనీర్లు, సిబ్బంది అగ్నిమాపక పరికరంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉత్పత్తి నిలుపుదల చేసినా, గ్రిడ్ నుంచి సమీపంలోని సబ్‌స్టేషన్ ద్వారా శ్రీశైలం విద్యుత్ కేంద్రానికి రివర్స్ విద్యుత్ సరఫరా జరిగింది. మంటలు ప్యానెల్ బోర్డు నుంచి సమీపంలోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్కు వ్యాపించాయి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కాలిపోవడంతో సొరంగం తరహాలో ఉండే విద్యుత్ కేంద్రం అంతటా వేగంగా బూడిదతో కూడిన పొగ వ్యాపించింది. దీంతో సిబ్బంది ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోగా ఉత్పత్తి నిలుపుదల చేసి, బయటి సబ్ స్టేషన్ నుంచి రివర్స్ సప్లై లేకుండా చేస్తే ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదని జెన్కో సీనియర్ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. గేటు తీయాలంటే భయం ! శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం 4వ యూనిట్ సర్జ్‌పూల్ బయటి మార్గం నుంచి 75 మీటర్లు లోపలికి వెళ్లి నీళ్లలో మునిగి ఉన్న భారీ గేటును బయటికి తీసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఈ పని చేసేందుకు ఎవరూ సాహసించడం లేదని జెన్కో వర్గాలు తెలిపాయి. ప్రమాదకర రీతిలో కాకుండా సురక్షితమైన పద్ధతిలో ఈ గేటును బయటకు తీయాలనే ఆలోచనతో ఈ పనిని పెండింగ్‌లో పెట్టారు. జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన తర్వాత 4 యూనిట్ ప్రధాన మార్గం నుంచే ఈ గేటును బయటకు తీయాలని జెన్కో ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
జల వివాదాలకు తెరపడేనా?
సాక్షి, అమరావతి: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) నివేదికను ఆమోదించి జల వివాదాలకు కృష్ణా బోర్డు తెరదించుతుందా? లేక యథాప్రకారం నివేదికను అటకెక్కించి జల వివాదాలను కొనసాగనిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్ఎంసీ నివేదికపై చర్చించి, ఆమోదించడమే అజెండాగా జనవరి 6న కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరాక ఆర్ఎంసీ రూపొందించిన నివేదికపై సంతకాలు చేయడంలో తెలంగాణ అధికారులు అడ్డం తిరిగిన నేపథ్యంలో.. సర్వసభ్య సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. నివేదిక తయారీలోనే తీవ్ర జాప్యం ► కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు ప్రధానంగా కారణమవుతున్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్(ప్రాజెక్టుల నిర్వహణ విధి విధానాలు), మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా? వద్దా అనే అంశాలపై 2022, మే 6న సర్వ సభ్య సమావేశంలో చర్చించారు. ఈ మూడు సమస్యల పరిష్కారానికి కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీ, జెన్కోల డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని 2022, మే 10న నియమించారు. ► ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై 15 రోజుల్లోగా.. రూల్ కర్వ్స్, వరద జలాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించారు. కానీ.. గడువులోగా ఆర్ఎంసీ నివేదిక ఇవ్వలేదు. ► నివేదికను రూపకల్పనకు ఆరు సార్లు ఆర్ఎంసీ సమావేశమైంది. 3న శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగానూ, ఉత్పత్తయ్యే విద్యుత్‌లో చెరి సగం పంచుకునేలా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉంటేనే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేసేలా రెండు రాష్ట్రాల మద్య ఏకాభిప్రాయం కుదిరింది. సాగర్ రూల్ కర్వ్స్‌పై సీడబ్ల్యూసీను సంప్రదించి ఖరారు చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వరద రోజుల్లో మళ్లించే జలాలను లెక్కించినా.. వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని నిర్ణయించాయి. ఇదే అంశాలతో 3న నివేదికను రూపొందించింది. కృష్ణా బోర్డు నిర్ణయమే ఫైనల్ ఆర్ఎంసీ నివేదికపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారు. దాంతో 5న నివేదికపై సంతకాలు చేయడానికి ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, సంతకాలు చేసేదిలేదని తెలంగాణ అధికారులు సమావేశానికి డుమ్మాకొట్టారు. దీంతో నివేదికపై కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, మౌతాంగ్, ఏపీ అధికారులు సంతకాలు చేసి 8న బోర్డు చైర్మన్‌కు అందజేశారు. ఈ నివేదికపై జనవరి 6న కృష్ణా బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్. నివేదికను అమలు చేస్తే జల వివాదాలకు తెరపడినట్టేనంటున్నారు. -
సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నీటి వినియోగంలో సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆర్ఎంసీ (జలాశయాల నిర్వహణ కమిటీ) తేల్చిచెప్పింది. రుతుపవనాల కాలంలో జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులకు పైనే ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వర్కింగ్ అరేంజ్మెంట్ ప్రకారం.. శ్రీశైలం వద్ద ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు చెరి సగం (50: 50) పంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై తుది నివేదిక ఇచ్చారు. డిసెంబర్ 3న నిర్వహించిన ఆర్ఎంసీ ఆరో సమావేశంలో తుది నివేదికను రెండు రాష్ట్రాలు అంగీకరించినా.. దానిపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు డిసెంబర్ 5న ఏర్పాటుచేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారని, దీంతో ఆర్ఎంసీలో మిగతా సభ్యులైన నలుగురు (కన్వీనర్ ఆర్కే పిళ్లై, కృష్ణా బోర్డు సభ్యులు మౌతాంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో డైరెక్టర్ ఎమ్వీవీ సత్యనారాయణ) తుది నివేదికపై సంతకాలు చేశారని తెలిపారు. ఈ తుది నివేదికపై బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కృష్ణా బోర్డు ఆమోదించాకే ఆర్ఎంసీ నివేదిక అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు నోటిఫై అయ్యే దాకా ఈ నివేదిక అమల్లో ఉంటుందని తెలిపారు. ఆర్ఎంసీ తుది నివేదిక, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్స్ ఆధారంగా నీటి కేటాయింపులకు రక్షణ కల్పి ంచాలంటూ రెండు రాష్ట్రాలు కేడబ్ల్యూడీటీ–2ను కోరడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఆర్ఎంసీ తుది నివేదికలో మరికొన్ని ప్రధానాంశాలు ఇవీ.. ►శ్రీశైలం జలాశయంలో 75 శాతం లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలి. ఆ తర్వాతే విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. ►శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ►ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల కంటే ఎగువన నీటిని నిల్వ చేయాలి. ►శ్రీశైలంకు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్య ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ మిలియన్ యూనిట్లలో లెక్కకట్టి.. దాన్ని ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలి. ►నాగార్జునసాగర్‌కు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్య రూల్ కర్వ్‌లో నిర్ణయించిన నీటి మట్టం కంటే ఎక్కువగా ఉంటే విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఉత్పత్తయిన విద్యుత్‌ను లెక్కకట్టాలి. వరద తగ్గాక.. దిగువున సాగు, తాగునీటి అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తూ ప్రధాన కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేయాలి. ►నాగార్జునసాగర్ నిర్వహణ విధి విధానాలపై(రూల్ కర్వ్స్) రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) తెలియజేసి ఖరారు చేసుకోవాలి. మిగులు జలాలను కోటాలో కలపొద్దు.. ►ప్రతి సంవత్సరం రెండు రాష్ట్రాలు వినియోగించిన నీటిని రెండు విభాగాలుగా లెక్కించాలి. 75 శాతం లభ్యత ఆధారంగా ఏ రాష్ట్రం ఎంత వాడుకుంది.. ఎంత వాడుకోలేదు అన్నది లెక్కట్టాలి. మిగులు జలాలను ఏమేరకు మళ్లించారు అన్నది లెక్కకట్టాలి. ►వరద రోజుల్లో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు ఎవరు ఏ మేరకు మళ్లించినా.. ఆ జలాలను మిగులు జలాలుగానే లెక్కకట్టాలి. ►జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను మూసివేసిన సమయంలో అంటే మిగు లు జలాలు లేని రోజుల్లో వాడుకున్న నీటిని ఆయా రాష్ట్రాల నికర జలాల కోటాలో కలపాలి. ►ఆర్ఎంసీ స్థానంలో జలాశయాల శాశ్వత నిర్వహణ కమిటీ(పీఆర్‌ఎంసీ) ఏర్పాటు చేసి.. ఉమ్మ డి జలాశయాల నిర్వహణను పర్యవేక్షించాలి. -
KRMB: అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నిర్వహణ విధానాల్లో (రూల్ కర్వ్స్) స్వల్ప మార్పులకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు అంగీకరించిన తెలంగాణ.. తుది నివేదికపై సంతకం పెట్టే సమయంలో అడ్డం తిరిగింది. హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, జెన్కో సీఈ సుజయ్‌కుమార్ హాజరైనా.. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం గైర్హాజరయ్యారు. దాంతో తుది నివేదికపై ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై, బోర్డు సభ్యుడు (విద్యుత్) మౌతాంగ్, ఏపీ ఈఎన్సీ, జెన్కో సీఈ సంతకాలు చేశారు. తొలుత అంగీకారం తెలిపిన తెలంగాణ అధికారులు.. ఆ తర్వాత సంతకాలు చేయడానికి గైర్హాజరైనట్లు పేర్కొంటూ ఆర్ఎంసీ కన్వీనర్ పిళ్లై కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు తుది నివేదికను అందజేశారు. ఈ నివేదికపై కృష్ణా బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీ. ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఆర్ఎంసీ సమావేశంలో శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్స్‌లో స్వల్ప మార్పులకు తాము సమ్మతించకపోయినా, అంగీకరించినట్లుగా కన్వీనర్ పిళ్లై తప్పుగా చిత్రీకరించారంటూ కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం సాయంత్రం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీకి తాము అంగీకరించబోమని, 50:50 నిష్పత్తిలో పంపిణీ చేయాలంటూ ఆ లేఖలో పాత పల్లవి అందుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా శ్రీశైలం, సాగర్ల రూల్‌కర్వ్స్ ముసాయిదా, విద్యుత్ ఉత్పత్తి, మళ్లించిన వరద జలాలను కోటాలో కలాపాలా వద్దా అనే అంశాలపై చర్చించడానికి నాలుగుసార్లు ఆర్ఎంసీ సమావేశాలు నిర్వహించారు. ఒకట్రెండు సమావేశాలకు మాత్రమే తెలంగాణ అధికారులు హాజరయ్యారు. శనివారం జరిగిన ఐదో సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం రూల్‌కర్వ్స్‌లో స్వల్ప మార్పులకు ఇరు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. సాగర్ రూల్‌కర్వ్స్‌పై సీడబ్ల్యూసీ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. చదవండి: (ఏబీఎన్ వెంకటకృష్ణను విచారించిన సీఐడీ) శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగా ఉంచాలన్న సీడబ్ల్యూసీ ప్రతిపాదనకు అంగీకరించారు. శ్రీశైలంలో 50 : 50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తి చేయాలని, సాగు, తాగునీటికి బోర్డు కేటాయించిన నీటితోనే విద్యుదుత్పత్తి చేయడానికి సమ్మతించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కడలిలో వరద జలాలు కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటాలో కలపకూడదన్న ఏపీ ప్రతిపాదనకు అంగీకరించారు. అయితే, ఇదే అంశాలతో కూడిన తుది నివేదికపై సంతకం చేయడానికి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఇదీ నివేదిక శ్రీశైలం రూల్ కర్వ్స్‌లో స్వల్ప మార్పులు, 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తి, మళ్లించిన వరద జలాలను లెక్కించినా కోటాలో కలపకూడదంటూ పేర్కొన్న తుది నివేదికపై తెలంగాణ మినహా ఆర్ఎంసీ సభ్యులు సంతకాలు చేశారు. శ్రీశైలం, సాగర్ల నిర్వహణకు శాశ్వత జలాశయాల నిర్వహణ కమిటీ (పీఆర్‌ఎంసీ)ని ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. కృష్ణా బోర్డు కేటాయించిన నీటి వినియోగంపై ప్రతి పది రోజులకు ఒక సారి పీఆర్‌ఎంసీ సమావేశమై, లోటుపాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దడానికి బోర్డుకు సూచనలు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. -
శ్రీశైలంపై ఉమ్మడి సమ్మతి!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విభేదాలు పక్కనపెట్టి ఏకాభిప్రాయానికి వచ్చాయి. జలాశయం నిర్వహణ విధివిధానాల (రూల్‌కర్వ్)కు స్వల్పమార్పులతో ఉమ్మడిగా సమ్మతి తెలిపాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వర్యంలోని రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) శనివారమిక్కడ జలసౌధలో నిర్వహించిన చివరి సమావేశంలో ఈ మేరకు కీలక ముందడుగు పడింది. అయితే, నాగార్జునసాగర్ జలాశయం రూల్‌కర్వ్‌పై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. తదుపరి మార్పుల కోసం తమ అభ్యంతరాలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లాలని ఆర్ఎంసీ సూచించింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం వచ్చినా చర్చలు సంపూర్ణం కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశం కొనసాగించాలని నిర్ణయించారు. సోమవారం తుది నిర్ణయం తీసుకుని రెండు రాష్ట్రాల సంతకాలతో సిఫార్సులను కృష్ణా బోర్డుకు సమర్పిస్తామని ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై విలేకరులకు తెలిపారు. జలాశయాలకు ఇక పర్మినెంట్ కమిటీ సోమవారం భేటీ తర్వాత ఆర్ఎంసీ తదుపరి సమావేశాలు ఉండవు. ఆపై ఈ కమిటీ ఉనికిలోనే ఉండదు. జలాశయాల నిర్వహణ, విద్యుదుత్పత్తిపై పర్యవేక్షణకు రెండు రాష్ట్రాల నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులతో పర్మినెంట్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డుకు సిఫారసు చేయాలని ఆర్ఎంసీ నిర్ణయించింది. జల విద్యుత్‌పై తొలగిన పేచీ శ్రీశైలం జలాశయం నిల్వల వినియోగం విషయంలో తొలుత తాగు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ అవసరాలకు నష్టం కలగకుండా జలవిద్యుదుత్పత్తి జరపాలని రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలంలో నిల్వలు 854 అడుగులకు పడిపోయిన సందర్భంలో తాగు, సాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవసరాలు తీరిన తర్వాతే విద్యుదుత్పత్తి జరపాలి. ఇక శ్రీశైలంలో 50:50 నిష్పత్తిలో సమంగా జలవిద్యుదుత్పత్తి జరపాలని రూల్‌కర్వ్‌లోని నిబంధనలకు రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ నిబంధనలను రెండు రాష్ట్రాలు అనుసరిస్తే భవిష్యత్తులో వివాదాలు, ఇబ్బందులు ఉండవని రవికుమార్ పిళ్లై పేర్కొన్నారు. శ్రీశైలంలో 200 టీఎంసీలు కావాలి శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేసేందుకు 512 టీఎంసీలు లభ్యతగా ఉండగా, 312 టీఎంసీలను నాగార్జునసాగర్‌లో నిల్వ చేసేందుకు వీలుంది. మిగిలిన 200 టీఎంసీలను శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్‌లోని తమ ప్రాజెక్టుల అవసరాలకు వాడుకోవడానికి అవకాశం కల్పించాలని తెలంగాణ కోరినట్టు తెలిసింది. 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా రెండు రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్టు రవికుమార్ పిళ్లై తెలిపారు. మిగుల జలాలను గుర్తించి లెక్కించే మెకానిజాన్ని ఆర్ఎంసీ రూపకల్పన చేసింది. తెలంగాణ సరిహద్దులోకి వచ్చే ప్రతి చుక్కనూ లెక్కించనున్నారు. వరదలు ఉన్నప్పుడు ఎంత జలాలు(మిగులు) వచ్చాయి? లేనప్పుడు(డిపెండబుల్) ఎంత జలాలు వచ్చాయి? అని గుర్తించి కచ్చిత లెక్కలను నమోదు చేయనున్నారు. వరద (మిగులు) జలాల వినియోగాన్ని కోటా కింద పరిగణించరు. ఎవరికైనా అవసరముంటే వాడుకుంటాం: సి.మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదల శాఖ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి, సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నిల్వల నిర్వహణ, శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్ విషయంలో ఏపీ, తెలంగాణ ఏకాభిప్రాయానికి వచ్చాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 34 టీఎంసీలను మాత్రమే తరలించుకోవాలన్న షరతుతో మేము సమ్మతి తెలిపాం. 50:50 నిష్పత్తిలో జలవిద్యుదుత్పత్తి చేయాలని గతంలోనే ఒప్పుకున్నాం. ఎవరికైనా ఎక్కువ అవసరాలుంటే వాడుకుంటాం. మిగులు జలాల వాడకం లెక్కలోకి రాదు: సి.నారాయణ రెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ శ్రీశైలం జలాల్లో తొలుత తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే విద్యుత్ ఉత్పత్తి జరపాలని నిర్ణయించాం. మిగులు జలాల వినియోగాన్ని లెక్కించాలి. కోటా కింద పరిగణించరాదు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు నిండిన తర్వాత వృథాగా వెళ్లే జలాలనే మిగులు జలాలుగా పరిగణిస్తారు. వీటిని సాధ్యమైనంత ఎక్కువ వాడుకోవాలని నిర్ణయించాం. రూల్‌కర్వ్ అంటే...? రిజర్వాయర్ల నిర్వహణకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ప్రామాణిక పద్ధతి)గా రూపొందించిందే రూల్‌కర్వ్. జలాశయాల్లో లభ్యత మారుతూ అన్నిసార్లు మన అవసరాలు తీరడానికి అవకాశం ఉండదు. ఎంత వ్యత్యాసం ఉంటే అందుకు తగ్గట్లు మన అవసరాలను ఎంత మేరకు కుదించుకుని నీళ్లను వాడుకోవాలి అన్న విషయం రూల్‌కర్వ్‌లో ఉంటుందని రవికుమార్ పిళ్లై తెలిపారు. జలాశయాల నిర్వహణతోపాటు భద్రతకు ఇవి చాలా అవసరమన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల ముసాయిదా రూల్‌కర్వ్‌ను సీడబ్ల్యూసీ రూపొందించి రెండు రాష్ట్రాలకు పంపిందని తెలిపారు. వీటిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలపగా, వాటిపై చర్చించి తుదిరూపం ఇవ్వడానికి ఆర్ఎంసీ ప్రయత్నిస్తోందన్నారు. -
24న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం ఈ నెల 24న హైదరాబాద్‌లో జరగనుంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళిని రూపొందించడమే అజెండాగా ఈ సమావేశం ఉంటుంది. ఇప్పటికే ఆర్ఎంసీ నాలుగుసార్లు సమావేశమై శ్రీశైలం, సాగర్ నిర్వహణపై సమగ్రంగా చర్చించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఏ కాలువకు ఎప్పుడు నీరు విడుదల చేయాలి, విద్యుత్ ఉత్పత్తిని ఎలా చేయాలి, మళ్లించిన వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా... వద్దా... అనే అంశాలపై ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాను 24న జరిగే భేటీలో చర్చించి, ఆమోదించనుంది. ఆ తర్వాత కృష్ణా బోర్డుకు ముసాయిదా నివేదిక సమర్పించనుంది. కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలో ఈ ముసాయిదాను చర్చించి, రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు దానిలో మార్పులు, చేర్పులు చేసి నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తారు. ఈ నియమావళి ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడాలనేది బోర్డు లక్ష్యం. -
పవన్‌కల్యాణ్.. ఓ కరివేపాకు
శ్రీశైలం ప్రాజెక్ట్: రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఓ కరివేపాకు లాంటివాడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సోమవారం శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాం«దీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను శ్రీశైలం ప్రాజెక్ట్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రోజా మాట్లాడుతూ అందరినీ కరివేపాకులా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని, అలాగే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పచ్చపత్రికలు, ఛానళ్లు ఎత్తుకు ఎత్తినట్లే ఎత్తి కిందపడేశాయని దీనిని పవన్‌కల్యాణ్ గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇప్పటం గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో ఉందని ఆ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగితే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ పర్యటించాల్సింది పోయి పవన్‌కల్యాణ్‌ను కరివేపాకులా ముందుకు తోశారని ఆమె అన్నారు. జనసేన అంటే సైకో సేనలా, రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా 3 రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నారని, ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వాసవిసత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు తెలనాకుల సత్యనారాయణ, శ్రీనివాసరావు, కలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పోటెత్తిన కృష్ణమ్మ..
సాక్షి, హైదరాబాద్/ దోమలపెంట/ గద్వాల రూరల్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది మళ్లీ పోటెత్తింది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,60,748 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టులో 885 అడుగుల వద్ద 215.8 టీఎంసీలను నిల్వ చేశారు. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, ఏపీ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 27,137 క్యూసెక్కులతో పాటు ప్రాజెక్టు 9 గేట్ల ద్వారా మొత్తం 3,16,652 క్యూసెక్కులను శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జునసాగర్‌లోకి వస్తున్న 3,38,298 క్యూసెక్కులను పూర్తిగా దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 588.8 అడుగులవద్ద 308.47 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. అలాగే పులిచింతలలోకి 4,09,060 క్యూసెక్కులు వస్తుండగా 3,96,062 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన కర్ణాటకలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి నుంచి 82,000 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 92,550 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కు 52.94 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 70 వేల క్యూసెక్కులను శ్రీశైలం డ్యామ్ వైపు విడుదల చేస్తున్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం..ఈ సీజన్లో ఇది రెండో గరిష్ట వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్టు/మాచర్ల: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉపనదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,95,652 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో పదిగేట్లను 15 అడుగులు ఎత్తి 3,77,160 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,534 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడ్ హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 141 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.5 అడుగుల్లో 212.91 టీఎంసీలు నిల్వచేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, విద్యుత్కేంద్రాల నుంచి దిగువకు వదిలేస్తున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 4,25,400 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో స్పిల్‌వే 20 గేట్లు, విద్యుత్కేంద్రాల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 589.7 అడుగుల్లో 311.15 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి పెరుగుతున్న వరద పులిచింతల ప్రాజెక్టులోకి 3,90,904 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో వరద నియంత్రణలో భాగంగా పులిచింతల ప్రాజెక్టును కొంతభాగం ఖాళీ చేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 4,34,066 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వచ్చే వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,96,561 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు ఆరువేల క్యూసెక్కులు విడుదల చేస్తూ 2.90 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల నుంచి భారీగా విడుదల చేసిన వరదలో 4 లక్షల నుంచి 4.30 లక్షల క్యూసెక్కులు శనివారం ప్రకాశం బ్యారేజ్‌కి చేరుకునే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వచ్చిన వరదను వచ్చినట్లు 1.84 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి తుంగభద్ర, వేదవతి, బీమా, హంద్రీ వరద తోడవనుండటంతో శనివారం కూడా ఇదేరీతిలో శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి కొనసాగనుంది. అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ దాకా.. కర్ణాటక, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నాలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. దీంతో అప్పర్ పెన్నార్ నుంచి ప్రాజెక్టు నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకు అన్నింటి గేట్లను ఎత్తేశారు. అనంతపురం జిల్లాలోని చాగల్లు రిజర్వాయర్ నుంచి 32 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో వైఎస్సార్ జిల్లాలోని గండికోట, మైలవరం జలాశయాల్లోకి వరద ఉద్ధృతి పెరిగింది. గండికోట, మైలవరం నిండుకుండలను తలపిస్తున్నాయి. మైలవరం జలాశయం నుంచి 41,392 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో సోమశిలలోకి వరద ఉద్ధృతి పెరిగింది. సోమశిలలోకి 31,260 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇక్కడ 68.39 టీఎంసీలను నిల్వచేస్తూ.. స్పిల్‌వే, విద్యుత్కేంద్రం ద్వారా 27,998 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు సంగం బ్యారేజ్ మీదుగా నెల్లూరు బ్యారేజ్‌కు చేరుతున్నాయి. నెల్లూరు బ్యారేజ్‌లో మిగులుగా ఉన్న 16 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
శ్రీశైలంలో పది, సాగర్‌లో 22 గేట్లు ఎత్తివేత
దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్/నాగార్జునసాగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు 2,67, 000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 43 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. మొత్తం 3,76, 825 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. జలాశయం నీటిమట్టం 884.5 అడుగులు కాగా, 212.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం ఆనకట్ట వద్ద పదిగేట్లను 15 మీటర్ల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ నుంచి మొత్తం 4,42,694 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు వద్ద 22 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 3,55,228 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుదుత్పాదనకు, కుడి, ఎడమ కాల్వలు, వరదకాల్వలు, ఎస్ఎల్బీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 589.50 అడుగులు ఉంది. -
శ్రీశైలంలో 9 గేట్ల ఎత్తివేత
దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్: జూరాల, శుంకేసుల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద తొమ్మిది గేట్లను ఎత్తారు. జూరాల స్పిల్‌వే ద్వారా 1,72,368 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 33,221, సుంకేసుల ద్వారా 1,21,185, హంద్రీ నుంచి 20,820 మొత్తం 3.47 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885.0 అడుగులుగా ఉంది. 215.8070 టీఎంసీలతో పూర్తిస్థాయిలో నిల్వ ఉంది. తొమ్మిది గేట్లను పది మీటర్ల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 2.52లక్షలు, తెలంగాణ ఎడమగట్టు, ఏపీ కుడిగట్టు విద్యుత్ కోసం 66,151 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో 33 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. -
ఆగని వానలు.. అనంతపురం జిల్లాలో కుండపోత
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఇంకా ఆగలేదు. బుధవారం కొన్ని ప్రాంతాల్లో తెరపినిచ్చినా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అనంతపురం, అన్నమయ్య, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు, సత్యసాయి, పల్నాడు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. అనంతపురం నగరం వర్షాలతో వణుకుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కసిపాడులో బుధవారం అత్యధికంగా 12.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఏర్పడితే మరింత బలపడి రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురుస్తాయని భావిస్తున్నారు. రెండు, మూడురోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత 24 గంటల్లో పుంగనూరులో 6.9 సెంటీమీటర్లు, రాప్తాడు, కూడేరుల్లో 6.4, కె.కోటపాడులో 6.3, అనంతపురంలో 6.2, తంబళ్లపల్లెలో 5.7, కుట్టగుళ్లలో 5.4, నగరంలో 5.3, రాజాంలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనంతపురాన్ని చుట్టుముట్టిన వరద అనంతపురం జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం రాత్రి వరకు వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలావరకు చెరువులు నిండిపోయాయి. అనంతపురం నగరాన్ని వరద చుట్టుముట్టింది. వందలాది ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో లోతట్టు ప్రాంతాల జనం విలవిల్లాడుతున్నారు. నగరంలో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి బాధితులను వాటిలోకి తరలిస్తున్నారు. అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ నాగలక్ష్మి, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు అనంతపురంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద బాధితులకు రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు భోజనం, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది రబ్బర్ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం సమయానికి జూరాల, సుంకేసుల నుంచి 1,57,051 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం రెండు గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన అనంతరం 66,120 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు çహెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6,333 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 600 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మట్టంఓ 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
కొనసాగుతున్న వర్షాలు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఈస్ట్ మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ. సెంట్రల్, నార్త్, వెస్ట్ మండలాల్లో 29.6 మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే, విజయవాడ రూరల్‌లో 25.2మి.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలో 9.2.మి.మీ. సగటు వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా బంటుమిల్లిలో 27.2మి.మీ, అత్యల్పంగా ఉయ్యూరులో 1.8మి.మీ కురిసింది. అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. కుందుర్పిలో 60.2 మి.మీ., ఆత్మకూరులో 50.2 మి.మీ మేర భారీ వర్షం కురిసింది. కంబదూరు 37 మి.మీ, కూడేరు 32.2 మి.మీ, రాప్తాడు 20.2 మి.మీ. వర్షం కురిసింది. శ్రీశైలానికి పెరుగుతున్న వరద మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి లక్షా 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,28,106 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. రెండు గేట్లను 10 అడుగుల మేర తెరచి 55,874 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. అలాగే, సాగర్ జలాశయం నుంచి 10 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 80,690 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.