సాక్షి, శ్రీశైలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో, ఈరోజు సాయంత్రం శ్రీశైలం గేట్లు ఎత్తనున్నారు అధికారులు. దిగవకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.
కాగా, ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తనున్నారు. ఈ క్రమంలో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. కాగా, జూరాల, తుంగభద్ర నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే, శ్రీశైలం గేట్లను రేపు ఎత్తాలని అధికారులు భావించినప్పటికీ వదర నీరు భారీగా వచ్చి చేరుతుండంతో ఈరోజే గేట్లను ఎత్తనున్నారు.
ఇక, శ్రీశైలంలో ఫుల్‌గా నీరు చేరుతుండటంతో కృష్ణమ్మ సాగర్‌వైపు పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు.. అల్మట్టి, నారాయణపూర్ డ్యామ్స్‌లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment