శ్రీశైలంలోకి గంటగంటకు పెరుగుతున్న ప్రవాహం
822.5 అడుగుల్లో 42.73 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
మూడురోజుల్లో తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం
ప్రకాశం బ్యారేజ్ నుంచి 12,325 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
సాక్షి, అమరాతి/శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96,369 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 822.5 అడుగులకు చేరింది. జలాశయంలో నీరు 42.73 టీఎంసీలకు చేరుకుంది. కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 13,634 క్యూసెక్కుల నీరు వస్తోంది.
ఇక్కడ 17 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చేరింది. మూడురోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశం ఉంది. అప్పుడు గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment