శ్రీశైలం డ్యాం నుంచి విడుదలవుతున్న నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఇన్‌ఫ్లో తగ్గడంతో నాలుగు గేట్లను ఆదివారం మూసేశారు. ఆరు గేట్లను పదడుగులు ఎత్తి 1,66,248 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 2,47,385 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 884.20 అడుగుల మట్టంలో 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సాగర్ 10 గేట్ల నుంచి నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయానికి 1,89,488 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ పది రేడియల్ క్రస్ట్ గేట్లను పదడుగులు ఎత్తి 1,45,760 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,886 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 587.80 అడుగుల మట్టంలో 305.9818 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment