Water storage
-
గంగ కంటే కృష్ణ మిన్న
సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద, పొడవైన నది గంగ. నీటి లభ్యతలోనూ గంగదే ప్రథమ స్థానం. గంగ నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం లభ్యత ఆధారంగా 17,940.20 టీఎంసీలు గంగా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో లభిస్తాయి. కానీ..ఆ గంగా బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ(లైవ్) సామర్థ్యం 1,713.58 టీఎంసీలే. కృష్ణాలో ఏటా 75 శాతం లభ్యత ఆధారంగా లభించేది 3,157.29 టీఎంసీలు. కృష్ణా బేసిన్లో 1,783.43 టీఎంసీలు నిల్వ (లైవ్) సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లున్నాయి. వీటిని బట్టి చూస్తే దేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో కృష్ణా బేసిన్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో జలవనరులపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సమగ్రంగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇటీవల నివేదికను రూపొందించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ..దేశంలో ఉత్తరాన హిమాలయ నది సింధూ నుంచి.. దక్షిణాన ద్వీపకల్ప నది కావేరి వరకూ నదుల్లో ఏటా సగటున 75 శాతం లభ్యత ఆధారంగా 70,391.84 టీఎంసీలు లభిస్తాయి. నీటి లభ్యతలో బ్రహ్మపుత్ర(18,565.53 టీఎంసీలు) మొదటి స్థానంలో ఉండగా.. గంగా(17,940.20 టీఎంసీలు) రెండో స్థానంలోనూ.. గోదావరి(4,145.66 టీఎంసీలు) మూడో స్థానంలో ఉంది. ఇక నీటి లభ్యతలో కృష్ణా (3,157.29 టీఎంసీలు) నాలుగో స్థానంలో నిలిచింది.దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లలో నీటి నిల్వ (లైవ్) సామర్థ్యం 10,724.16 టీఎంసీలు. నీటి లభ్యతలో అగ్రస్థానంలో ఉన్న బ్రహ్మపుత్ర..రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో అట్టడుగున నిలిచింది.గోదావరి బేసిన్లో 1,233.75 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉండగా.. పెన్నా బేసిన్లో 178.84 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి. -
Updates: ‘అధికారులెవరూ రాలేదండీ’
AP And Telangana Floods News Latest Updates In Teluguశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో : 1,38,833 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 96,081 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 884.60 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు .. ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ 12 రోజులైనా ముంపు ప్రాంత ప్రజలకు తప్పని తిప్పలు ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే నానుతున్న అంబాపురంలోని కాలనీలు వరదలో ఉండలేక ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ప్రజలు దొంగల భయంతో మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్న కొందరు ప్రభుత్వం నుంచి ఈరోజు వరకూ తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం మంచినీరు కూడా సప్లై చేయడం లేదంటున్న అంబాపురం ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇళ్ల నుంచి బయటికి వస్తున్న వరద బాధితులు ఎన్యుమరేషన్ దాదాపు పూర్తైందంటున్న అధికారులు.. తమ వద్దకు ఏ ఒక్కరూ రాలేదంటున్న వరద బాధితులువాలంటీర్ వ్యవస్థ ఉంటే తమకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్న అంబాపురం వాసులునల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలభద్రాచలంతగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహంఈరోజు ఉదయం 11 గంటలకు 42.7అడుగుల గోదావరి నీటిమట్టంమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులుసూర్యాపేటఅనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందంఅనంతగిరి మండలం గోండ్రియాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో ధ్వంసం అయిన ఇళ్లలు, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించిన కేంద్ర బృందం క్లిక్ చేయండి: దేవుడా ఈ నరకం ఇంకెన్నాళ్లూ! ప్రకాశం బ్యారేజీ వద్ద కేంద్ర బృందంప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందంబోటు ప్రమాదంలో దెబ్బ తిన్న బ్యారేజీని పరిశీలించిన సభ్యులుఖమ్మం ఖమ్మం నగరంలోని వరదల్లో నీట మునిగిన నయా బజార్ కాలేజీ ని పరిశీలించిన ఎమ్మెల్సీ కోదండరాం అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కొనసాగుతున్న ఆపరేషన్ బోట్ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంనిన్నంతా కష్టపడ్డ అండర్ వాటర్ టీంఇవాళ కూడా కొనసాగనున్న పనులుబోట్లను ముక్కలు చేసి ఆపై బెలూన్లతో తొలగించే యత్నంమెదక్ఏడుపాయాల ఆలయం మళ్లీ మూసివేతసింగూరు గేట్లు ఎత్తేయడంతో భారీగా నీరుఆలయాన్ని తాకుతూ నీటి ప్రవాహంరెండ్రజుల కిందటే తెరుచుకున్న ఆలయంఈలోపే మళ్లీ మూసేసిన నిర్వాహకులుబ్యారేజీకి కేంద్ర కమిటీనేడు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్ర కమిటీ ప్రకాశం బ్యారేజీ చెంతకు కమిటీప్రస్తుత బ్యారేజీ పరిస్థితిపై ఆరా తీయనున్న సభ్యులు ఎన్టీఆర్ జిల్లా:వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో కేంద్ర బృందం పర్యటనకలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన కేంద్ర బృందంవరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ పరిశీలననష్టంపై కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ జి.సృజనకేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేసిన కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డైరీ ) చలసాని ఆంజనేయులుఫోటో ఎగ్జిబిషన్ అనంతరం ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం నంద్యాల:శ్రీశైలం జలాశయానికి కోనసాగుతున్న వరద నీరుజలాశయం 1 గేటు 10 అడుగులు మేరకు మరొక్కసారి ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో: 1,38,833 క్యూసెక్కులుఔట్ ఫ్లో: 96,081 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలుప్రస్తుతం: 212.9198 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి విజయవాడ:విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలుశుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులునీళ్లలో నానుతున్న ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటివారి వీధిముంపులోనే ప్రకాశ్ నగర్, అంబపురంలోపల కాలనీల ప్రజలకు అందని సాయం రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలుప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్మ్యాపింగ్ ఉంటేనే ఎన్యుమరేషన్ అంటున్న అధికారులుఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్ ఖమ్మం జిల్లాఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టంఈరోజు ఉదయం 9 గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టంఅమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లుస్పిల్ వే దిగువన 25.580 మీటర్లు నీటిమట్టం నమోదు.48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.ఏలూరు జిల్లాజంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులునల్లగొండ జిల్లానాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరదక్రస్ట్ గేట్లు మూసివేతఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులుసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండిసూర్యాపేట జిల్లా:పులిచింతల అప్డేట్ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులుఅవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం:175 అడుగులుప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులుపూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలుపవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.నిజామాబాద్ జిల్లాశ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలుప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.జూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద13 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాగోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుబ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలబ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలుసఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలుఅప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులుఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలువరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులుకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి, వైనతేయ నదులు -
తుంగభద్రలో అంచనాలకు మించి నీరు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభంలో తుంగభద్ర బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత అధికంగా ఉండే అవకాశం ఉందని సాగునీటిరంగ నిపుణులు చెబుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019, 2020, 2021, 2022 తరహాలోనే రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. రాష్ట్రానికి గరిష్ఠ స్థాయిలో నీటిని రాబట్టి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించిందని గుర్తుచేస్తున్నారు. జూన్ 1 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తుంగభద్ర డ్యామ్‌లోకి 249.02 టీఎంసీల ప్రవాహం వచ్చి0ది. ఇందులో 104.70 టీఎంసీలను డ్యామ్‌లో నిల్వచేసి.. కాలువలకు 25 టీఎంసీలు విడుదల చేసి.. మిగిలిన 120 టీఎంసీలను గేట్లు ఎత్తి దిగువకు వదిలేశారు. తుంగభద్ర డ్యామ్‌లోకి నవంబర్ చివరి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈలెక్కన డ్యామ్‌లో నీటి లభ్యత బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే అధికంగా ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కోటా నీటిని రాబడితేనే రైతులకు ప్రయోజనం తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం, నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది.2019–20, 2020–21, 2021–22, 2022–23, 2023–24ల్లో తుంగభద్ర బోర్డు చరిత్రలో అత్యధిక స్థాయిలో రాష్ట్ర కోటా కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ వాటాను రాబట్టిన ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. నాలుగేళ్లు ఏటా సగటున 69 టీఎంసీలను బోర్డు నుంచి ప్రభుత్వం విడుదల చేయించింది. గతేడాది తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. 40 టీఎంసీలు రాష్ట్రానికి దక్కేలా చేసి రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. ఈ ఏడాది నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో 2019–23 మధ్య తరహాలోనే ఇప్పుడూ గరిష్ఠంగా నీటి వాటాను రాబట్టి ప్రయోజనాలను పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. -
ఇది ఎన్డీఎస్ఏ ఆర్డర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీటిని నిల్వ చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ కోరిందని..వారికంటే కేటీఆర్‌కు కొద్దిగా ఎక్కువ పరిజ్ఞానం ఉన్నట్టుందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యంత నిపుణులైన ఆరుగురితో ఎన్డీఎస్ఏ ఈ కమిటీ ఏర్పాటు చేసిందని, వారి సూచనల ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోవాలా? కేటీఆర్ చెప్పినట్టు పోవాలా? అని ప్రశ్నించారు.నీరు ఉన్నా పంపింగ్ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్న కేటీఆర్ తన పేరును జోసెఫ్ గోబెల్స్‌గా మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలసౌధలో శుకవ్రారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలి్టమేటం జారీ చేయడంపై స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపింగ్ సాధ్యం కాదు పంపింగ్ చేయాలంటే అన్నారం బరాజ్‌లో కనీసం 11 మీటర్లు, సుందిళ్ల బరాజ్‌లో కనీసం 9 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉండాలని, రెండు బరాజ్‌లలో 5 మీటర్ల నీటిమట్టంలోపే బుంగలు పడి ఉండడంతో పంపింగ్ సాధ్యం కాదని ఉత్తమ్ స్పష్టం చేశారు. బరాజ్‌ల గేట్లు దింపి పంప్‌హౌస్‌ల ద్వారా వాటిలోకి నీరుఎత్తిపోస్తే అవి కొట్టుకుపోతాయని, కేటీఆర్ అదే కోరుకుంటున్నట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బరాజ్‌లు కొట్టుకుపోతే భారీ ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతుందన్నారు.దిగువ ఉన్న సమ్మక్క బరాజ్, సీతమ్మసాగర్ బరాజ్‌లూ కొట్టుకుపోతాయని, భద్రాచలం, ఏటూరునాగారంతో పటు 44 గ్రామాలు పూర్తిగా నీట మునుగుతాయని తెలిపారు. నీళ్లు మళ్లించడానికి తక్కువ నిల్వ సామర్థ్యంతో బరాజ్‌లు నిర్మిస్తారని, ఏకంగా 16 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించారని తప్పుబట్టారు. ప్లానింగ్, డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయని.. ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఇచి్చందని గుర్తు చేశారు. కేటీఆర్, కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి కమీషన్ల కక్కుర్తితో రీఇంజనీరింగ్ చేసి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.1.47లక్షల కోట్లకు వ్యయం పెరుగుతందని కాగ్ తేల్చిందన్నారు. రాష్ట్ర ప్రజలపై ఆర్థికభారం మోపినందుకుగాను మీరు, మీ తండ్రి కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 2 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ బరాజ్‌లు మినహా కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగిలిన భాగాల ను వాడుకుంటామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు నీటిని పంపింగ్ చేసే ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రామడుగు, అనంతగిరి, ఇమామాబా ద్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తో పాటు ఎగువ మానేరుకు సైతం ఎల్లంపల్లి నీటినే తరలిస్తామని చెప్పారు. ఎల్లంపల్లిలో 14 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను పంపింగ్ చేస్తామన్నారు. శ్రీరాంసాగర్ నిండిన వెంటనేనీళ్లను ఎత్తిపోస్తామన్నారు. విహార యాత్రలకు బీఆర్ఎస్ నేతలు: జీవన్‌రెడ్డి మేడిగడ్డ బరాజ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించగా, వారి హయాంలోనే కుంగిందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ ఘటన వెనక అనుమానాలున్నాయని కేటీఆర్ అనడాన్ని తప్పుబట్టారు. విహార యాత్రల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారని విమర్శించారు. -
నీళ్లు.. నేలమట్టం.. డెడ్ స్టోరేజీలో జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో 2015–16 తర్వాత ఇంతగా నీటి సమస్య రావడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు 2023–24 నీటి సంవత్సరం (వాటర్ ఇయర్ – జూన్ నుంచి మే వరకు)లో తగిన వరద రాలేదు. నిజానికి మొదట్లో రాష్ట్రంలో సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా.. అక్టోబర్ తర్వాత వానలు జాడ లేకుండా పోయాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సాధారణ వర్షపాతంతో పోల్చితే.. 56.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో జలాశయాల్లోకి కొత్త నీరు చేరక.. ఉన్న నీటి నిల్వలు శరవేగంగా అడుగంటిపోతూ వచ్చాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో 14 ప్రధాన జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీనితో మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా కటకట తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ జూన్‌లో వానలు ఆలస్యంగా మొదలైతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ‘కృష్ణా’లో ఏడేళ్ల తర్వాత మళ్లీ కరువు.. ఏడేళ్ల తర్వాత ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఇన్‌ఫ్లో వచ్చింది. శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల వరద వస్తుందని అంచనా. కానీ 2015–16లో అతి తక్కువగా 71 టీఎంసీలే చేరింది. ఆ తర్వాత మళ్లీ 2023–24లో 144.36 టీఎంసీలు మాత్రమే వరద వచ్చింది. ఇక నాగార్జునసాగర్‌కు కూడా సాధారణంగా వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీలు రావాల్సి ఉండగా.. 2015–16లో కేవలం 72 టీఎంసీలు.. ఆ తర్వాత మళ్లీ తక్కువగా ఈసారి 147 టీఎంసీలు వరద మాత్రమే వచ్చింది. కనీస నిల్వలూ కరువే! శ్రీశైలం జలాశయంలో సాగునీటి అవసరాలకు ఉండాల్సిన కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 854 అడుగులుకాగా.. ఇప్పటికే 810 అడుగులకు పడిపోయింది. నిల్వలు 34.29 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 510 అడుగులుకాగా.. ప్రస్తుతం 511.5 అడుగుల వద్ద ఉంది. నిల్వలు 134.23 టీఎంసీలకు తగ్గిపోయాయి. అయితే ఇందులో వాడుకోగల నీళ్లు అతి తక్కువే. ఇక జూరాల ప్రాజెక్టు కనీస మట్టం 1033 అడుగులకుగాను.. ఇప్పటికే 1031.27 అడుగులకు పడిపోయింది. గోదావరిలో మూడేళ్ల కనిష్టానికి వరదలు గోదావరి నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ ఏడాది ఇన్‌ఫ్లోలు గణనీయంగా తగ్గాయి. ఇంత తక్కువ వరదలు రావడం మూడేళ్ల తర్వాత ఈసారే. కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2023–24లో 203.73 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20 తర్వాత ఇంత తక్కువ వరద రావడం ఇదే తొలిసారి. 2022–23లో 593 టీఎంసీలు, 2021–22లో 678 టీఎంసీలు, 2020–21లో 368 టీఎంసీలు వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 2019–20 తర్వాత ఈసారి అతితక్కువగా 396 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో 7.53 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. 20.1 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే సమయానికి 12.26 టీఎంసీల నీళ్లు ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మిడ్ మానేరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. దిగువ మానేరుకు సైతం 2019–20 తర్వాత అతితక్కువగా ఈ ఏడాది 78 టీఎంసీలే ఇన్‌ఫ్లో నమోదైంది. ఒకేసారి వచ్చి.. లాభం లేక.. గోదావరిపై ప్రధాన ప్రాజెక్టుల్లోకి వందల టీఎంసీల్లో నీరు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నా.. అదంతా భారీ వరద కొనసాగే కొద్దిరోజుల్లోనే కావడం గమనార్హం. అప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. తర్వాత వానలు లేక ఇన్‌ఫ్లో లేకుండా పోయింది. ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితి వచ్చింది. మంజీరా వెలవెల సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్‌లోనూ నీళ్లు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాలకు మంజీరా నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఏప్రిల్ తొలివారంలోనే ఇలా ఉంటే.. మే వచ్చే సరికి నీటి సరఫరా పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
దక్షిణాది రాష్ట్రాల్లో నీటికి కటకట
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. నైరుతి రుతువపనాల ప్రభావం వల్ల కృష్ణా, కావేరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వల్ల జలాశయాల్లోకి నీటి నిల్వలు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్లు) కాగా.. 25.361 బీసీఎం (48 శాతం) నిల్వలే ఉన్నాయని తెలిపింది. గతేడాది ఇదే రోజు నాటికి ఈ జలాశయాల్లో 92 శాతం నీరు నిల్వ ఉండేదని.. గత పదేళ్లలో సగటున ఆ ప్రాజెక్టుల్లో 74 శాతం నిల్వ ఉండేవని వెల్లడించింది. గత పదేళ్లలో ఈ ఏడాదే జలాశయాల్లో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 11.121 బీసీఎంలు కాగా.. ప్రస్తుతం కేవలం 2.815 బీసీఎంలు (25 శాతం) మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఆ ప్రాజెక్టుల్లో 98 శాతం నీరు నిల్వ ఉండేదని.. గత పదేళ్లలో ఇదే రోజు నాటికి సగటున 76 శాతం నీరు నిల్వ ఉండేదని సీడబ్ల్యూసీ వెల్లడించింది. నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో సాగునీటికి దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, పెన్నా బేసిన్లో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 150 భారీ ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహం, నీటి నిల్వలను సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఆ 150 ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై శుక్రవారం సీడబ్ల్యూసీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నివేదికలోని ప్రధానాంశాలివీ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 150 జలాశయాల్లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 257.812 బీసీఎంలు. ఆ ప్రాజెక్టుల లైవ్ స్టోరేజ్ కెపాసిటీ 178.784 బీసీఎంలు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లో 129.636 బీసీఎంలు(73 శాతం) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ఆ ప్రాజెక్టుల్లో 140.280 బీసీఎంలు (81 శాతం) నీరు నిల్వ ఉండేది. గత పదేళ్లలో ఇదే సమయానికి సగటున 160.40 బీసీఎంలు (92 శాతం) నీరు నిల్వ ఉండేది. దేశవ్యాప్తంగా చూసినా గత పదేళ్ల కంటే ఈ ఏడాది జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి లభ్యత మెరుగ్గానే ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని జలాశయాల్లో 89 శాతం, తూర్పు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో 77 శాతం, పశ్చిమ రాష్ట్రాల్లోని జలాశయాల్లో 88 శాతం, మధ్య భారత రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో 83 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి. -
రిజర్వాయర్ల నీళ్లు.. పూడిక పాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిపోతోంది. ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో.. శ్రీశైలం లైవ్ స్టోరేజీ (వాడుకోదగిన నీళ్లు) సామర్థ్యం 253.058 టీఎంసీల నుంచి 188.71 టీఎంసీలకు.. నాగార్జునసాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీల నుంచి 189.295 టీఎంసీలకు పడిపోయింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ‘శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ (ఎస్ఆర్ఎస్)’ సర్వేలలో ఈ అంశం వెల్లడైంది. జలాశయాల్లో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్ 1ఏ/ఏబీ ఉపగ్రహాల డేటా ఆధారంగా పరిశీలించి, విశ్లేషించడం పూడిక పరిస్థితిపై నివేదికను సిద్ధం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాలు తాగు, సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 13.182 టీఎంసీలు తగ్గిన సాగర్ సామర్థ్యం నాగార్జునసాగర్ డ్యామ్‌ను 1956–1968 మధ్య నిర్మించారు. అప్పట్లో జలాశయం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీలుకాగా, 1999లో నిర్వహించిన శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సర్వేలో సామర్థ్యం 195.806 టీఎంసీలకు తగ్గిపోయిందని తేలింది. 2001, 2009లలో నిర్వహించిన రిజర్వాయర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేలలో మాత్రం సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం వరుసగా 217.47 టీఎంసీలు, 213.388 టీఎంసీలని తేలింది. తాజాగా శాటిలైట్ డేటాను విశ్లేషించగా.. 2020 నాటికి సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 189.295 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1968–2020 మధ్య 52 ఏళ్లలో 13.182 టీఎంసీల ( 6.511శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. సగటున ఏటా 0.125 శాతం నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతోంది. శ్రీశైలానికి 64.339 టీఎంసీల నష్టం కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయాన్ని 1981లో నిర్మించగా.. 1984 నుంచి నీళ్లను నిల్వ చేస్తున్నారు. 253.058 టీఎంసీల లైవ్ స్టోరేజీ, 55 టీఎంసీల డెడ్ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) కలిపి మొత్తం 308.06 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. తాజా అధ్యయనంలో శ్రీశైలం లైవ్ స్టోరేజీ 188.71 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1984–2021 మధ్య 37 ఏళ్లలో శ్రీశైలం ఏకంగా 64.339 టీఎంసీల (25.425శాతం)సామర్థ్యాన్ని నష్టపోయిందని, ప్రాజెక్టు ఏటా 0.687 శాతం లైవ్ స్టోరేజీని కోల్పోతోందని వెల్లడైంది. ఇంతకుముందు 1990, 1999లలో నిర్వహించిన రిమోట్ సెన్సింగ్ సర్వేల్లో శ్రీశైలం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 194.437 టీఎంసీలు, 181.95 టీఎంసీలకు తగ్గిపోయినట్టు గుర్తించారు. తాజా సర్వేతో పోల్చితే 1990, 1999 నాటి సర్వేలు ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొన్నా.. అప్పట్లో వాటర్ స్ప్రెడ్ ఏరియాను సరిగ్గా అంచనా వేయక కచ్చితమైన ఫలితం రాలేదని తాజా సర్వేలో సీడబ్ల్యూసీ పేర్కొంది. పూడికను నివారించేదిలా? జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని అని.. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. ఈ మేరకు తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది. ♦ అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకునేందుకు పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా చెట్లను పెంచాలి. ♦ నదీ తీరాల్లో రివిట్మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ♦ నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు. ♦ వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది. ♦ రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి. -
డెడ్ స్టోరేజీకి ‘నాగార్జున సాగర్’!.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు వరకే... గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది. చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు! సాగర్ 570 అడుగులకు చేరితేనే.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్‌లోని బ్యాక్‌వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నారు ఎండిపోతోంది పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. – పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్పల్లి, మిర్యాలగూడ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా... ►2019- ఆగస్టు 12 ►2020- ఆగస్టు 8 ►2021- ఆగస్టు 2 ►2022 - జూలై 28 ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో) గరిష్టం ప్రస్తుతం శ్రీశైలం 885 864.57 నాగార్జున సాగర్ 590 515.4 -
కృష్ణాలో పెరిగిన వరద
సాక్షి, అమరావతి/హొళగుంద(కర్నూలు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,14,445 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 64.41 టీఎంసీలకు చేరుకుంది. దాంతో ఆల్మట్టి డ్యామ్ సగం నిండినట్లయింది. మరో 65 టీఎంసీలు చేరితే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆల్మట్టిలోకి మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాలకు.. స్థానికంగా కురిసిన వర్షాలు తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ఆడ్యామ్లో నీటి నిల్వ 19.09 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 18 టీఎంసీలు అవసరం. ఇక జూరాల ప్రాజెక్టులోకి 26,244 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 33,235 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 4,045 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 35.47 టీఎంసీలకు చేరుకుంది. మూసీ ప్రవాహంతో నాగార్జునసాగర్‌కు దిగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 8,532 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.73 టీఎంసీలకు చేరుకుంది. మున్నేరు, వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజ్‌లోకి 10,917 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 7,785 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,132 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు భారీగా వరద కృష్ణా నది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ప్రవాహం జోరందుకుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 30 టీఎంసీలను దాటింది. సోమవారం ఉదయం 64,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నీటి చేరిక ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి డ్యాం నిండి ఎల్ఎల్సీ కింద వరి సాగుకు అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గ, ఆగుంబే, వరనాడు, తీర్థనహళ్లి తదితర డ్యాంల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద నీరు చేరికపై వారు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం దిగువ కాలువకు తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులు ఈ నెల 28 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా సోమవారం ఉదయం 1,602.84 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నిల్వ ఉంది. 24ఏఎల్ఆర్129: తుంగభద్ర రిజర్వాయర్‌లోకి చేరిన వరద నీరు 24ఎస్ఆర్ఐ 30ఏ – 812 అడుగులు వద్ద శ్రీశైలం డ్యాం నీటిమట్టం -
గౌరవెల్లిని ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని, ఒక వేళ పనులు పూర్తయితే నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఇప్పటికే నీటిని నిల్వ చేసి ఉంటే కాల్వలకు విడుదల చేయొద్దని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.అఝగేషన్ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన కేసులో గోదావరి బోర్డు ప్రతివాదిగా ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గౌరవెల్లి రిజర్వాయర్ పనులపై యథాస్థితిని కొనసాగించాలని, కొత్త పనులు చేపట్టరాదని తాజాగా గోదావరి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఆ క్లాజుల ప్రకారం నడుచుకోవాలి’’ గోదావరి బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని క్లాజులు 1(డీ)(3), 2(ఎఫ్), 2(జీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది. క్లాజు 1(డీ) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)ల నుంచి అనుమతులు పొందే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, ఇతర మార్పులు, రెగ్యులేటర్లు, అప్రోచ్ చానల్, సొరంగం పనులు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు చేపట్టాలన్నా గోదావరి బోర్డు, టీఏసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి అని గుర్తు చేసింది. క్లాజు 2(ఎఫ్) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టుల పనులు నిలుపుదల చేసి, గెజిట్ విడుదలైన ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. క్లాజు 2(జీ) ప్రకారం అనుమతి రాని ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పక్కనబెట్టాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రం వచ్చాక పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 1.04 టీఎంసీల సామ ర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీడి జైనింగ్‌లో భాగంగా గౌరవెల్లి సామ ర్థ్యాన్ని 8.5 టీఎంసీలకు పెంచాలని నిర్ణ యం తీ సుకున్నారు. ఇందుకోసం 1960 ఎక రాలను సేకరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి కాగా, 1.02 టీఎంసీలను నింపారు. రిజ ర్వాయర్ సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెరి గినా ప్రధాన కాల్వ సామర్థ్యం 1.04 టీ ఎంసీలే ఉంది. పర్యావరణ అనుమతులు లే కుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని గ్రా మ స్తులు కొందరు కేసు వేయగా, ఎన్జీటీ గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
పునరావాసం కల్పించాకే.. పోలవరంలో నీటి నిల్వ
సాక్షి, అమరావతి: నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కమిటీ దిశానిర్దేశం చేసింది. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో లైడార్ సర్వే ప్రకారం ముంపునకు గురయ్యే గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ ఝా అధ్యక్షతన కేంద్ర జల్ శక్తి శాఖ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల కార్యదర్శులు పంకజ్‌కుమార్, సౌరబ్గార్గ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, పీపీఏ సీఈవో, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీధర్ సభ్యులుగా కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశాన్ని బుధవారం వర్చువల్‌గా చైర్మన్ అనిల్‌కుమార్ ఝా నిర్వహించారు. నిధులిస్తే మరింత త్వరితగతిన పునరావాసం పోలవరం తొలి దశ పనుల పూర్తికి సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.16,952.07 కోట్లకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని.. ఆ మేరకు నిధులిస్తే మరింత త్వరితగతిన పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర అధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని గుర్తించామని.. వాటిలోని 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని రాష్ట్ర అధికారులు వివరించారు. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో వాటితోపాటు మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు తొలి దశలోనే పునరావాసం కల్పించాల్సి ఉంటుందన్నారు. వెరసి మొత్తం 25,528 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని.. ఇందుకు రూ.7,304 కోట్లు అవసరమని.. ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదించామని చెప్పారు. వాటిని ఆమోదించి నిధులిస్తే పునరావాసాన్ని త్వరితగతిన కల్పిస్తామని చెప్పారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఆ మేరకు నిధులు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పనపై యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇవ్వాలని అధికారులను కేంద్ర కమిటీ ఆదేశించింది. నిర్వాసితుల జీవనోపాధులను మెరుగుపరిచేలా వారికి వివిధ చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామని, విద్యార్హత ఆధారంగా వివిధ పరిశ్రమల్లో ఉపాధి కల్పించడానికి వీలుగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన వివరణకు కేంద్ర కమిటీకి సంతృప్తి వ్యక్తం చేసింది. పునరావాసం కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందని ప్రశంసించింది. అనుమానాల నివృత్తిపై సంప్రదింపులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ముంపుపై వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర కమిటీ ఛైర్మన్ అనిల్‌కుమార్ ఝా సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై కేంద్ర జల్ శక్తి శాఖ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. పోలవరం ముంపుపై మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేసి, సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పారు. -
వేసవిలోనూ పెన్నా బేసిన్లో జలరాశి
సాక్షి, అమరావతి: పెన్నా నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లోని రిజర్వాయర్లలో వేసవిలోనూ పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. శుక్రవారానికి రిజర్వాయర్లలో 151.94 టీఎంసీలు ఉన్నాయి. పెన్నా బేసిన్‌లోని రిజర్వాయర్ల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. అంటే.. ఖరీఫ్ పూర్తయి, రబీ పంటలు కోత దశలో ఉన్న సమయంలో పెన్నా రిజర్వాయర్ల సామర్ధ్యంలో ఇప్పటికీ 63.42 శాతం నీరు నిల్వ ఉండటం గమనార్హం. సోమశిల రిజర్వాయర్‌లో 78 టీఎంసీలకుగానూ 52.62 టీఎంసీలు, కండలేరులో 68.3 టీఎంసీలకుగాను 38.65 టీఎంసీలు, గండికోటలో 26.85 టీఎంసీలకుగాను 25.37 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలకుగాను 8.16 టీఎంసీలు, వెలిగల్లు ప్రాజెక్టులో 4.64 టీఎంసీలకుగాను 4.41 టీఎంసీలు జలాలు ఉన్నాయి. పెన్నా బేసిన్ చరిత్రలో ఏప్రిల్ రెండో వారంలో ఈ స్థాయిలో నీరు ఉండటం ఇదే ప్రథమమని అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వాయర్లలో గతేడాది ఇదే రోజుకు 134.74 టీఎంసీలు.. 2021లో 127.6 టీఎంసీలు నిల్వ ఉండేవి. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన నంది కొండల్లో జన్మించే పెన్నా నది.. జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, బాహుదా, పించా, పాపాఘ్ని వంటి ఉప నదులను కలుకుకొని శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి.. ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. వర్షఛాయ ప్రాంతంలో ఉన్న ఈ నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోడంతో 2019 వరకూ పెన్నాలో ప్రవాహం పెద్దగా ఉండేది కాదు. కానీ.. గత నాలుగేళ్లుగా బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నది ఉరకలెత్తింది. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్‌లో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేసుకున్నారు. రబీలోనూ నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు అదే రీతిలో పంటలు సాగుచేసుకున్నారు. ప్రస్తుతం రబీ పంటలు కోత దశలో ఉన్నాయి. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున పెన్నా బేసిన్లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెప్పాయి. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్‌లో పంటల సాగుకు ముందస్తుగా నీటిని విడుదల చేయవచ్చని తెలిపాయి. -
రెండో పంటకూ నీరు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంట కాలం దాదాపుగా పూర్తయింది. ఇప్పటికీ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో లభ్యత ఆధారంగా రెండో పంటకూ నీళ్లందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో ధవళేశ్వరం బ్యారేజ్, కొవ్వాడ కాల్వ రిజర్వాయర్ మినహా నీటి నిల్వ చేసే జలాశయాలు లేవు. వాటి సామర్థ్యం కూడా 3.65 టీఎంసీలే. ఆ రిజర్వాయర్లలో 3.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరిలో సహజసిద్ధ ప్రవాహం, సీలేరులలో లభ్యత ఆధారంగా గోదావరి డెల్టాలో రెండో పంటకు ప్రభుత్వం నీటిని విడుదల చేయనుంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల, గాజులదిన్నె, భైరవానితిప్ప ప్రాజెక్టులలో 586.21 టీఎంసీలకుగాను 506.97 టీఎంసీలు (86.48%) నిల్వ ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారడిన ప్రాజెక్టులతోపాటు కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలు చివరి దశకు చేరుకున్నాయి. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యత ఆధారంగా రెండు రాష్ట్రాలకు డిసెంబర్ 6న త్రిసభ్య కమిటీ నీటి పంపకాలు చేయనుంది. పులిచింతలలో 45.77 టీఎంసీలకుగానూ 45.31 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని ఆయకట్టుకు రెండో పంటకు కూడా నీరందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెన్నా ప్రధాన పాయపై అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకూ అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. ఈ జలాశయాల నిల్వ సామర్థ్యం 238.75 టీఎంసీలు. ప్రస్తుతం 195.55 టీఎంసీలు ఉన్నాయి. ఈ బేసిన్‌లోని సోమశిల, కండలేరు, పెన్నా డెల్టాలో పంటలకు నీటిని విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏలేరు, వంశధార, నాగావళి బేసిన్లలోనూ.. ఏలేరు, వంశధార, నాగావళి తదితర బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 154.87 టీఎంసీలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో 114.36 టీఎంసీలు (73.86 శాతం) ఉన్నాయి. ఏలేరు, వంశధార, తోటపల్లి తదితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ(నీటిపారుదల సలహా మండలి) సమావేశాలలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
శ్రీశైలానికి 1,07,853 క్యూసెక్కుల వరద
శ్రీశైలం ప్రాజెక్ట్/మాచర్ల/సత్రశాల(రెంటచింతల): కొద్ది రోజులుగా కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం సమయానికి జూరాల, సుంకేసుల నుంచి 1,07,853 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు క్రస్ట్‌గేట్లను పదడుగులు ఎత్తి 83,811 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన అనంతరం 66,199 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 2,750 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 884.70 అడుగుల మట్టంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి, స్థానికంగా ఉన్న ఉప నదుల ఉంచి నాగార్జునసాగర్ జలాశయానికి 1,46,318 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్ 12 గేట్లను ఐదడుగులు ఎత్తి 96,696, విద్యుదుత్పాదన అనంతరం 32967.. కలిపి మొత్తం 1,29,663 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలు, వరద కాలువ, ఎస్ఎల్బీసీలకు మొత్తం 16,665 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ జలాశయంలో 589.60 అడుగుల మట్టంలో 310.8498 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి 1,14,029, రెండు యూనిట్లలో విద్యుదుత్పాదన అనంతరం 7,206.. కలిపి మొత్తం 1,21,235 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. -
‘వెల్’ డన్! పాతాళ గంగ పైపైకి..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 79 శాతం బావుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర భూగర్భ జల బోర్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 14,275 బావుల్లో గత పదేళ్లగా నీటి మట్టాలపై అధ్యయనం నిర్వహించి రూపొందించిన నివేదికను కేంద్రం ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. 2021 నవంబరు గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 706 బావుల్లో పరిశీలన చేపట్టగా 419 బావుల్లో గరిష్టంగా రెండు మీటర్ల మేర నీటి మట్టంలో పెరుగుదల కనిపించినట్లు వెల్లడైంది. మరో 50 బావుల్లో నాలుగు మీటర్లకు పైనే నీటి మట్టం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలో 80 నుంచి 86 శాతం బావుల్లో నీటి మట్టాల పెరుగుదల నమోదైంది. ఉత్తరాదిలో పెరుగుదల స్వల్పంగా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా బావుల్లో నీటి మట్టాల పెరుగుదల కారణంగా జాతీయ సగటు 70 శాతంగా నమోదైంది. ‘ఉపాధి’లో వర్షపు నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం.. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు పెద్ద ఎత్తున పనులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటి నిల్వకు దోహదపడే వాటినే ఎక్కువగా చేపడుతోంది. గత మూడేళ్లలో దాదాపు రూ.3,147.43 కోట్ల విలువైన వర్షపు నీటి నిల్వలకు దోహద పడే పనులను చేపట్టింది. ఇందులో గత ఆరి్థక ఏడాదిలో రూ.1,004 కోట్ల విలువైన పనులను ఉపాధి హామీ ద్వారా చేపట్టారు. -
శ్రీశైలానికి తగ్గుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఇన్‌ఫ్లో తగ్గడంతో నాలుగు గేట్లను ఆదివారం మూసేశారు. ఆరు గేట్లను పదడుగులు ఎత్తి 1,66,248 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 2,47,385 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 884.20 అడుగుల మట్టంలో 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ 10 గేట్ల నుంచి నీటి విడుదల నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయానికి 1,89,488 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ పది రేడియల్ క్రస్ట్ గేట్లను పదడుగులు ఎత్తి 1,45,760 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,886 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 587.80 అడుగుల మట్టంలో 305.9818 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
మళ్లీ శ్రీశైలం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/రామగిరి: ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నుంచి దిగువకు భారీగా వరద వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం మరింతగా పెరిగింది. గురువారం రాత్రి 9 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,25,372 క్యూసెక్కులు చేరుతోంది. నీటి నిల్వ 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో మళ్లీ ఒక గేటును పది అడుగుల మేర ఎత్తి 27,800 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 64,073 క్యూసెక్కులు వదులుతున్నారు. దాంతో సాగర్‌లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌లో 562.5 అడుగుల్లో 238.24 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 73 టీఎంసీలు కావాలి. సాగర్‌కు దిగువన మూసీలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పులిచింతలలోకి 10,400 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దీనికి పాలేరు, మున్నేరు తదితర వాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 22,107 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,043 క్యూసెక్కులు వదులుతూ బ్యారేజ్ గేట్లు ఎత్తి 10,064 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరోవైపు.. గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2.66 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 11 వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు వదులుతూ మిగులుగా ఉన్న 2.55 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ఉప నదులు పరవళ్లు.. రెండ్రోజులుగా రాయలసీమ, కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ఉపనది అయిన వేదవతి.. పెన్నా, దాని ఉప నదులు చిత్రావతి, పాపాఘ్ని పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం చేరుతుండడంతో అవి నిండుకుండలను తలపిస్తున్నాయి. అలాగే, అనంతపురం జిల్లాలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు (పేరూరు డ్యామ్) గేట్లు ఎత్తేసి దిగువకు పది వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఈ డ్యామ్ 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో వరద రావడం.. అన్నిగేట్లు ఎత్తడం మూడు దశాబ్దాల్లో ఇదే ప్రథమం. -
సాగర్‌లో 193 టీఎంసీల నిల్వ
సాక్షి, హైదరాబాద్/కేతేపల్లి/హుజూర్నగర్/నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 58,750 క్యూసెక్కులు చేరుతుండటంతో సాగర్‌లో 542.7 అడుగుల వద్ద 193.15 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులుకాగా గరిష్ట నీటి నిల్వ 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 119 టీఎంసీలు అవసరం. మరోవైపు మూసీ ద్వారా కృష్ణాలోకి వరద చేరుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 7,400 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 10 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. పులిచింతలలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న ప్రవాహానికి.. పాలేరు, మున్నేరు, వైరా, కట్టలేరు ఉరకలెత్తడంతో ప్రకాశం బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 62,775 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 5,275 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 57,500 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి తగ్గిన వరద.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోకి 1,02,418 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో కుడిగట్టు కేంద్రంలో ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 27,180 క్యూసెక్కులను, ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నాయి. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గడంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్పిల్ వేలో ఒక గేటును మూసివేశారు. మరో గేటును 10 అడుగుల మేర ఎత్తి 26,744 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాలు, స్పిల్ వే గేటు ద్వారా మొత్తం 85,708 క్యూసెక్కులు సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. గోదావరిలోనూ.. పరీవాహక ప్రాంతంలో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురవడంతో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ.. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం శాంతించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 6,68,560 క్యూసెక్కులకు తగ్గింది. దిగువన తుపాలకుగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీలోకి వస్తున్న ప్రవాహం 8,82,330 క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం తగ్గుతుండటంతో సీతమ్మసాగర్‌లోకి చేరుతున్న వరద 8,94,998 క్యూసెక్కులకు తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేణ సాధారణ స్థాయికి చేరుకుంటోంది. అక్కడ వరద మట్టం 39.3 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. -
తుంగభద్ర డ్యామ్‌కు పెరిగిన వరద
హొళగుంద (కర్నూలు): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యామ్‌లో ఇన్‌ఫ్లో ఆదివారం మరింత మెరుగు పడింది. శనివారం 72,592 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహ జలాలు ఆదివారం 89,664 క్యూసెక్కులకు పెరిగాయి. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 1,633 అడుగులు కాగా.. ఆదివారం ఉదయం 8 గంటలకు 1,605.56 అడుగులుగా నమోదైంది. 100.855 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 27.481 టీఎంసీలుండగా సాయంత్రానికి 32 టీఎంసీలకు పైగా నీరు నిల్వ అయ్యాయి. అందులో 255 క్యూసెక్కులను రాయబసవన కెనాల్‌కు వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1,585.77 అడుగులతో 7.033 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉపరితల ద్రోణి, అకాల వర్షాల కారణంగా డ్యామ్ ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇన్‌ఫ్లో బాగా పెరిగింది. -
చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల ఆయకట్టు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల ఆయకట్టు పంటలతో కళకళలాడుతోంది. ఖరీఫ్ కోతలు పూర్తయినా ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో రబీ పంటలకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. సమృద్ధిగా నీరు వస్తుండటంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాలు, ఏపీఎస్సైడీసీ పరిధిలోని ఎత్తిపోతల కింద 7.86 లక్షల ఎకరాలు ఉండగా, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార, ఏలేరు తదితర నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో ఎన్నడూ నీటి చుక్క చేరని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి. వాటి కింద ఆయకట్టుకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుండటంతో రైతులు ఆనందంతో ఉన్నారు. అప్పర్ పెన్నార్ నుంచి మడ్డువలస దాకా వర్షాఛాయ ప్రాంతం అనంతపురం జిల్లాలో పెన్నా బేసిన్‌లోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు దశాబ్దాల తర్వాత నిండింది. దేశంలో అత్యల్ఫ వర్షపాతం నమోదయ్యే వేదవతి (హగరి) దశాబ్దాల తర్వాత ఉరకలెత్తడంతో ఎన్నడూ నిండని భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కూడా నిండింది. శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి నది ఉప్పొంగడంతో మడ్డువలస ప్రాజెక్టు ఈ ఏడాది రెండుసార్లు నిండింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు అన్ని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. ఇప్పటి వరకు ఎన్నడూ 10 లక్షల ఎకరాలకు కూడా నీరందని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల ఆయకట్టు.. ఇప్పుడు పూర్తి స్థాయిలో నీరందుకుంటోంది. ఏమాత్రం వృథా కాకుండా యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకూ నీళ్లందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. -
'పెన్నా' పరవళ్లు
సాక్షి, అమరావతి: నీటిచుక్క జాడలేక ఎడారిలా మారిన పెన్నా నది ఇప్పుడు జీవనదిగా అవతరించింది. మూడు దశాబ్దాల తర్వాత 2019లో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ పరవళ్లు తొక్కింది. గతేడాది, ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ ఉరకలెత్తుతోంది. బేసిన్లో అన్ని ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. పెన్నా, ఉప నదులు ఉధృతంగా ప్రవహించడంతో బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినా.. ఖరీఫ్ పంటలకు వాడుకోగా ఇప్పటికీ ప్రాజెక్టుల్లో 175.91 టీఎంసీలు నిల్వ ఉండటం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో 157.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అంటే.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 18.07 టీఎంసీలు అధికంగా నిల్వ ఉండటం గమనార్హం. మొత్తం మీద ప్రాజెక్టులన్నీ నిండటం.. పెన్నా ప్రవాహంతో భూగర్భ జలాలు పెరగడంతో పాడిపంటలతో బేసిన్ సస్యశ్యామలమైంది. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకోవడం.. పరీవాహక ప్రాంతంలో అధిక వర్షాలు కురవడంవల్ల ఆ నదులు ఉరకలెత్తుతూ ప్రవహిస్తాయి. కానీ, పెన్నా తద్భిన్నం. వర్ష ఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో జన్మించి.. ప్రవహించే ప్రాంతంలో సగటున 400–800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఎల్‌నినో.. లానినో పరిస్థితుల ప్రభావంవల్ల నైరుతి రుతుపవనాల గమనం ఆధారంగా పెన్నా బేసిన్లో వర్షాలు కురుస్తాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం పెన్నా బేసిన్. జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా ఈ బేసిన్లోనే ఉంది. కర్ణాటకలో 1995 నుంచి 2004 మధ్య నందిదుర్గం నుంచి నాగలమడక వరకూ ఆ రాష్ట్ర సర్కార్ పెన్నాపై భారీఎత్తున చెక్ డ్యామ్‌లు, డ్యామ్‌లు నిర్మించింది. పెన్నా ఉప నదులైన చిత్రావతిపై పరగోడు వద్ద డ్యామ్ నిర్మించింది. జయమంగళి, కుముద్వతిపైనా అదే రీతిలో చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో పెన్నా, ఉప నదుల నుంచి.. ఎగువ నుంచి దిగువకు చుక్కనీరు రాకుండాపోయింది. అదే సమయంలో రాయలసీమలో సక్రమంగా వర్షాలు కురవక.. కరువు పరిస్థితులు ఏర్పడటంతో పెన్నా ఎండిపోయింది. 2019 నుంచి రాష్ట్రంతోపాటూ రాయలసీమలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పెన్నా వరదకు కృష్ణా వరదను తోడుచేసి.. గత రెండేళ్లుగా గండికోట, సోమశిల, కండలేరు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో తొలిసారిగా గరిష్ఠస్థాయిలో నీటిని నిల్వచేశారు. జీవనదిగా పెన్నమ్మ రూపాంతరం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. పెన్నా ప్రధాన పాయపై అనంతపురం జిల్లాలో పెండేకళ్లు, చాగల్లు, వైఎస్సార్ కడప జిల్లాలో గండికోట, మైలవరం, నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరుల్లో 2019, 2020, ఈ ఏడాదీ గరిష్ఠస్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఉప నదులైన చిత్రావతిపై అనంతపురం–వైఎస్సార్ కడప సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మద్దిలేరు (యోగి వేమన) ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ ఉంది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది పాపాఘ్ని ఉప్పొంగడంవల్ల వైఎస్సార్ జిల్లాలోని వెలిగల్లు నిండిపోయింది. చెయ్యేరు, సగిలేరుపై ఉన్న ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థితి. బాహుదా ఉరకలెత్తడంతో చిత్తూరు జిల్లాలోని బాహుదా ప్రాజెక్టు, పెద్దేరు నిండిపోయాయి. ఎగువన పెన్నమ్మకు పునరుజ్జీవం కర్ణాటక చెక్ డ్యామ్‌లు, డ్యామ్‌ల నిర్మాణంతో ఎగువ నుంచి పెన్నాకు వరద రాకపోవడంవల్ల కర్ణాటక సరిహద్దులో అనంతపురం జిల్లాలో ఉన్న పేరూరు డ్యామ్ (అప్పర్ పెన్నార్) నుంచి పీఏబీఆర్, మధ్య పెన్నార్ వరకూ పెన్నా ఒట్టిపోయింది. దీంతో దిగువ రీతిలో ఎగువన కూడా జీవనదిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాపాఘ్ని, స్వర్ణముఖి ఉప నదులనూ పునరుజ్జీవింపజేసే చర్యలను వేగవంతం చేసింది. వాతావరణ మార్పుల వల్లే.. వాతావరణ మార్పులవల్ల వర్షాలు పడే రోజులు తగ్గాయి. కానీ.. వర్షంపడే రోజుల్లో ఒకేసారి కుండపోత కురుస్తోంది. దీనివల్ల చెరువులు నిండి.. పెన్నాలోకి వరద ప్రవహిస్తోంది. ఫలితంగా 2019 నుంచి పెన్నా, ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండుతున్నాయి. పాడిపంటలతో ఈ బేసిన్ సస్యశ్యామలమవుతోంది. ఎగువన పెన్నా నదిని పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించడం శుభపరిణామం. – డాక్టర్ మల్లారెడ్డి, డైరెక్టర్, యాక్షన్ ఫెటర్నా ఎకాలజీ సెంటర్, అనంతపురం సవ్యమైన రీతిలో జలచక్రం ఎన్నడూలేని రీతిలో 2019 నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంవల్ల పెన్నా, ఉప నదులు ఉరకలెత్తుతున్నాయి. పెన్నా వరద జలాలకు కృష్ణా వరద జలాలను జతచేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను నింపింది. ఇది పెన్నాలో వాతావరణ సమతుల్యతకు దారితీసింది. జలచక్రం సవ్యమైన రీతిలో మారడంవల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇదే జీవనదిగా పెన్నా అవతరించడానికి బాటలు వేస్తోంది. – మురళీనాథ్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా -
‘శ్రీశైలం’లో నీటి నిల్వ సామర్థ్యం ఎంత?
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జలాశయంలో డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో బ్యాథమెట్రిక్ సర్వే చేయడం ద్వారా ఏ మట్టంలో.. ఎంత నీరు నిల్వ ఉంటుందన్నది తేల్చే పనులను ముంబైకి చెందిన ‘జియో సర్వీసెస్’ మారిటైమ్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ శుక్రవారం సర్వే పనులు ప్రారంభించింది. జలాశయం జల విస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు. బెడ్ లెవల్ సగటున 500 మీటర్లు. పూర్తి నీటిమట్టం 885 అడుగులు. జలాశయం జల విస్తరణ ప్రాంతంలో బెడ్ లెవల్ నుంచి 885 అడుగుల వరకు.. ఏ మట్టం వద్ద ఎంత నీరు నిల్వ ఉంటుదన్నది పడవల ద్వారా ఏడీసీపీ (అకౌస్టిక్ డాప్లర్ కరంట్ ప్రొఫైలర్) పరికరాన్ని ఉపయోగించి.. బ్యాథమెట్రిక్ సర్వే ద్వారా తేల్చుతామని హైడ్రాలజీ విభాగం సీఈ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. శ్రీశైలం జలాశయాన్ని నిర్మించినప్పుడు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు. 2001–02లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 264 టీఎంసీలేనని తన సర్వే ద్వారా తేల్చింది. భూమి కోతతో కొట్టుకొస్తున్న పూడిక నదీ పరివాహక ప్రాంతంలో అడవులను నరికేయడం వల్ల భూమి కోతకు గురై.. వరదతో పాటు మట్టి కొట్టుకొస్తోంది. అందువల్లే శ్రీశైలం జలాశయంలో పూడిక భారీ ఎత్తున పేరుకుపోతోంది. ఇందు వల్లే నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. 2009–10లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యంపై మరో సర్వే చేసింది. ఆ సర్వేలో నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు తగ్గిందని తేలింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యంపై సర్వే చేయాలి. ఈ నేపథ్యంలో ఎన్హెచ్పీ (నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు)లో భాగంగా శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం తేల్చే పనులను జల వనరుల శాఖ అధికారులు చేపట్టారు. తాజాగా చేపట్టిన సర్వే 15 రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
తెలుగు రాష్ట్రాల్లో జల సిరులు
సాక్షి, అమరావతి: ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వ అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నదుల్లో వరద ప్రవాహం, సహజ సిద్ధ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఖరీఫ్ పూర్తయింది. రబీలో పంటలు సాగు చేస్తున్నారు. ఈ దశలో సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) దేశంలో తన పర్యవేక్షణలోని 128 జలాశయాల్లో నీటి నిల్వలపై అధ్యయనం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల్లోని నీటి నిల్వలు గత పదేళ్ల సగటుతో పోల్చితే ఈ ఏడాది 50% అధికంగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ► దేశ వ్యాప్తంగా సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని 128 జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9,104.38 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 3,716.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 4,116.42 టీఎంసీలు ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 3,021.99 టీఎంసీలు నిల్వ ఉండేవి. ► దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1,864.94 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 1,169.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదేరోజు వీటిలో 1,133.23 టీఎంసీలు నిల్వ ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 787.5 టీఎంసీల నిల్వ ఉండేవి. అంటే.. గత పదేళ్ల సగటు నీటి నిల్వ కంటే ఈ ఏడాది 50 శాతం అధికంగా నిల్వ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ► ఉత్తరాది, ఈశాన్య, పశ్చిమ, మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉన్నాయి. ► దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోనూ.. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోనూ.. పెన్నా బేసిన్లో సోమశిల, కండలేరు, ఇతర బేసిన్లలో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు గతేడాది కంటే అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొంది. ► ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో రబీ పంటల సాగుకు.. వేసవిలో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. -
‘గండికోట’ ఫుల్
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతోపాటు దూరదృష్టితో వ్యవహరిస్తుండటంతో సామాజిక ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయి. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగంగా పూర్తి చేసి వరద నీటిని ఒడిసిపట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరుగుతోంది. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టులను గరిష్ట స్థాయిలో నింపడం ద్వారా ఆ ఫలాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం మొత్తానికి అందుతున్నాయి. తక్కువ లోతులోనే నీరు సమృద్ధిగా లభిస్తుండటంతో తాగు, సాగునీటి అవసరాలకు ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడం, భూగర్భ జలాలు పెరగడంతో వాతావరణ మార్పులు భారీ స్థాయిలో లేకుండా ఉష్ణోగ్రతలు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. ఆయకట్టుకు పుష్కలంగా నీరందిస్తూ పొలాలను సస్యశ్యామలం చేయడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పునరావాస కల్పనలో గత సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో ఏటా వందల టీఎంసీల వరద జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. గండికోట జలాశయంలో 26.85 టీఎంసీలు నిల్వ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట జలాశయంలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను మంగళవారం నిల్వ చేశారు. జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదే కాకుండా గాలేరు–నగరిలో అంతర్భాగమైన పైడిపాళెం, సర్వారాయసాగర్, వామికొండసాగర్ ప్రాజెక్టుల్లోనూ ఈ ఏడాదే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో పూర్తి సామర్థం మేరకు పది టీఎంసీలు నిల్వ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పులిచింతల ప్రాజెక్టు, సోమశిల రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ చేయడం తెలిసిందే. గతంలో 3 టీఎంసీలే నిల్వ.. గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా 2012 నుంచి 2019 వరకు గరిష్టంగా మూడు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల నీటిని నిల్వ చేయలేకపోయారు. 2014 నుంచి 2019 వరకు గండికోట నిర్వాసితుల పునరావాసం కోసం ఐదేళ్లలో రూ.146.29 కోట్లను మాత్రమే టీడీపీ సర్కార్ ఖర్చు చేయడం గమనార్హం. చిత్రావతి, వామికొండ, పైడిపాళెం, పులిచింతల, సోమశిల, కండలేరు నిర్వాసితుల పునరావాసానికి కూడా గత సర్కార్ పైసా వ్యయం చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితుల పునరావాసానికి రూ.522.85 కోట్లను జూన్ 24న విడుదల చేసింది. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, భూసేకరణకు రూ.403.2 కోట్లను మంజూరు చేసింది. వెరసి రూ.926.05 కోట్లను వ్యయం చేసి 17,809 మంది నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించింది. దీంతో గండికోటలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగారు. ఇక గాలేరు–నగరిలో అంతర్భాగమైన వామికొండసాగర్లో 1.60, సర్వారాయసాగర్‌లో 3.06, పైడిపాళెంలో ఆరు టీఎంసీలకుగానూ 5.84 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.240.53 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో జలాశయం పూర్తయిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే పూర్తి సామర్థ్యం మేరకు పది టీఎంసీలను నిల్వ చేశారు. పులిచింతలతో శ్రీకారం.. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సర్కార్‌తో చర్చించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరావాసం నిధులను విడుదల చేసి పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత తొలిసారిగా గతేడాది 45.77 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ ఏడాదీ అదే రీతిలో నీటిని నిల్వ చేశారు. దీనివల్ల కృష్ణా డెల్టాలో పంటల సాగుకు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటికి ఇబ్బందులు తొలిగాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా దశాబ్దాల క్రితం పూర్తయిన సోమశిల రిజర్వాయర్‌లో గతేడాది పూర్తి సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ ఏడాదీ అదే రీతిలో నిల్వ చేశారు. దీంతో పెన్నా డెల్టా, తెలుగుగంగ ఆయకట్టులో పంటల సాగుకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములకు నీళ్లందించడం ద్వారా కరువును తరిమికొట్టేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయఙ్ఞం చేపట్టారు. 84 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టి పలు ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లోనూ నీటిని నింపలేని దుస్థితి నెలకొంది. కమీషన్లు రాకపోవడంతో గత సర్కారు పునరావాసం పనులను నిర్లక్ష్యం చేసింది. దీంతో గతంలో ఏటా వందలాది టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృథాగా కలిశాయి. కండలేరులో గరిష్టంగా నిల్వ చేసేలా.. కండలేరు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. కండలేరు నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా 60 టీఎంసీలను నిల్వ చేసింది. వచ్చే సీజన్ నాటికి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా 68.03 టీఎంసీలను నిల్వ చేసే దిశగా అడుగులు వేస్తోంది. -
జల కల్పన
ఆమె ఓ ఆర్కిటెక్ట్. లక్షల రూపాయలు ఆర్జించే అవకాశం ఉన్న తన కెరీర్‌కే పరిమితమై పోకుండా భావితరాలకు విలువైన నీటి బొట్టును ఒడిసిపట్టి అందించేందుకు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తరిగిపోతున్న జలసంపదను పది కాలాల పాటు నిల్వచేసేందుకు వినూత్న డిజైన్లు రూపొందించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు పొందారు. ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమే కల్పనా రమేశ్. హైదాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు కల్పనా రమేష్. సాహె (సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్) సంస్థను స్థాపించి దశాబ్దకాలంగా వర్షపునీటి సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ప్రధాని దృష్టి నేను రూపొందించిన వర్షపు నీటి సంరక్షణ డిజైన్లు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులకు చెందినవారు దేశవ్యాప్తంగా ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ట్యాగ్‌చేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయ ‘మై గౌ’ సైట్ సీఈఓ మార్చి 6న నాకు ఫోన్‌చేసి పీఎం సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు మీరు అర్హత సాధించారని చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. నేరుగా ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సైట్లలో నేను సమాచారాన్ని పొందుపరిచే అవకాశం ఉండదు. మైగౌ సైట్ సీఈఓకు సమాచారం చేరవేస్తే వారు నేను అందించే సమాచారాన్ని పరిశీలించి నా తరఫున ఆయా సైట్లలో నేను కోరిన సమాచారాన్ని పోస్ట్చేస్తారు. ఈ విధానంలో నా ఆలోచనలు, డిజైన్లు కోట్లాదిమందికి చేరతాయని సంతోషంగా ఉంది. విస్తృత అవగాహన గత మూడేళ్లుగా వర్షపునీటి సంరక్షణపై 150కి పైగా అవగాహన కార్యక్రమాలు, 50 ప్రత్యేక చర్చాగోష్ఠులు నిర్వహించాం. తాజాగా హైదరాబాద్‌లోని సిల్వర్‌ఓక్ విద్యాసంస్థలో 6–8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాననీటి సంరక్షణపై రెండునెలలు క్లాస్‌రూమ్‌లో, మరో రెండు నెలలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. వాళ్లు వెళ్లి ఇళ్లు, కాలనీల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవలే మజీద్ బండ (కొండాపూర్) ప్రాంతంలో కొడికుంట చెరువును మా సాహె సంస్థ దత్తతకు తీసుకుంది. ఈ చెరువులోకి వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేస్తోంది. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణం, నిర్మాణ డిజైన్లను బట్టి వాననీటి సంరక్షణ పిట్స్‌ను మేము డిజైన్ చేస్తున్నాం. నా స్వస్థలం బెంగళూరు. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశాను. విద్యాభ్యాసం అక్కడే సాగింది. కానీ గత 20 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నాం. ఇప్పుడు ఇదే నా ఓన్సిటీ. ఇక్కడే వర్షపునీటి సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాను. నా భర్త రమేష్ లోకనాథన్ది సాఫ్ట్వేర్ రంగం. ఆయన సహాయ సహకారాలు కూడా నాకెంతగానో ఉన్నాయి. వర్షపు నీటి నిల్వపై క్షేత్రస్థాయిలో పిల్లలకు అవగాహన భవిష్యత్ లక్ష్యం ‘చినుకు.. చినుకు ఒడిసిపట్టు.. భావితరాలకు దాచిపెట్టు’ అన్న నినాదంతో వర్షపునీటిని ఒడిసిపట్టే కృషిలో నిర్విరామంగా పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో నా సేవలు, డిజైన్లు ప్రధాని సోషల్‌మీడియా అకౌంట్ల ద్వారా కోట్లాదిమందికి చేరనున్నాయి. ఈ జలయజ్ఞంలో ప్రతీ భారతీయుడు భాగస్వామి కావాలన్నదే నా లక్ష్యం.. నా స్వప్నం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరాల్లో వర్షపునీటిలో 80 శాతం వృథా అవుతోంది. ఇందులో 50 శాతం ఒడిసిపట్టినా నీటి కరువు ఉండదన్నదే నా నిశ్చిభిప్రాయం’’అని ముగించారు కల్పన. – ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్ నీటి బ్యాంకు! ఇళ్లు, అపార్ట్మెంట్లలో తక్కువ ఖర్చుతో వర్షపునీటిని సంరక్షించుకోవచ్చు. ఇంటి పైకప్పుపై కురిసిన వర్షపునీటిని నేరుగా కింద ఉన్న నీటి సంపులో నింపుకోవాలి. ఇలా ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 30 వేల నుంచి లక్ష లీటర్ల వరకు నిల్వచేయవచ్చు. ఇది నిండిన తరవాత ఓవర్‌ఫ్లో అయ్యే నీటిని ఎండిన బోరుబావిలోకి మళ్లిస్తే మీకు ఏడాదికి సరిపడా జలబ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ట్యాంకర్ కష్టాలు లేకుండా చూసుకోవచ్చు. ఏడాదికి సుమారు 35–45 రోజుల పాటు వర్షం తప్పక కురుస్తుంది. ఇందుకోసం ఒకసారి రూ.15–రూ.25 వేల వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఉదా.. వెయ్యి చదరపు అడుగుల భవనం రూఫ్‌టాప్‌పై పడిన వర్షపు నీటిని ఒడిసిపడితే 70 వేల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి వందరోజుల పాటు సరిపోతాయి. ఇక 2000 చదరపు అడుగుల భవనానికి 1.40 లక్షల లీటర్లు, 3000 చదరపు అడుగుల భవనంపై కురిసిన నీటి ద్వారా 2.10 లక్షల లీటర్లు, 4000 చదరపు అడుగుల భవనానికి 2.80 లక్షల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. కల్పన