పులిచింతలపై కుదిరిన ఒప్పందం | AP Govt Agree to Reduce Water Storage in Pulichintala project | Sakshi
Sakshi News home page

పులిచింతలపై కుదిరిన ఒప్పందం

Published Thu, Sep 18 2014 7:23 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

AP Govt Agree to Reduce Water Storage in Pulichintala project

హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది. 11 టీఎంసీల నీటి నిల్వను 7 టీఎంసీలకు తగ్గించేందుకు అంగీకరించింది. నీటి నిల్వ కారణంగా నల్లగొండ జిల్లాలో ముంపునకు గురవుతున్న నాలుగు గ్రామాలకు రూ. 20 కోట్ల బకాయిలు చెల్లించేందుకు కూడా ఒప్పుకుంది.

ఈ నిధులను నల్లగొండ జిల్లా కలెక్టర్ కు ఇచ్చి బాధితులను ఆదుకునేందుకు రెండు ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన ఒప్పందాల మేరకు పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించాలని రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement