pulichintala project
-
శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశంఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది. సాగర్ నీటిమట్టం 504.30 అడుగులునాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో ఏమాత్రం లేదు.ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు. -
పురుగుల మందుతాగిన యువకుడు.. చికిత్స పొందుతూ
నల్లగొండ: పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన నున్న వీరయ్య, సరిత దంపతుల కుమారుడు నున్న సాయిరాం(27) డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. శనివారం ఉదయం వీరయ్య గోదాంలో హమాలీ పనులకు, సరిత వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సాయిరాం ఇంట్లో గడ్డి మందు తాగాడు. స్థానికులు గమనించి నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా సాయిరాం ఆత్మహత్యకు గల కారాణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు మేళ్లచెరువు: పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన యాంపంగు సందీప్(19) తన స్నేహితులు పాష, వెంకటేష్, నవీన్, సాయితో కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జడపల్లి తండా సమీపంలోని పుష్కరఘాట్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి నదిలోకి దిగగా సందీప్ గల్లంతైనట్లు అతడి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు అక్కడకు చేరుకొని కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపినట్లు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి కేతేపల్లి: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ గ్రామానికి చెందిన చెవుగాని జానయ్య(52) వృత్తిరిత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ సమీపంలోని చెరువులో గాలంతో చేపలు పట్టేందుకు వెళ్లిన జానయ్య చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మునిగి మృతిచెందాడు. సాయంత్రం చెరువులో మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి భార్య యల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పులిచింతల ప్రాజెక్టు గేటు బిగింపు పూర్తి
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు స్థానంలో కొత్త గేటును బిగించారు. జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థ బీకెమ్ ప్రతినిధులు శుక్రవారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 250 టన్నుల బరువున్న గేటును భారీ క్రేన్ల సహాయంతో అమర్చారు. స్పిల్ వే 16, 17 పియర్స్ (కాంక్రీట్ దిమ్మెలు) మధ్య గేటును దించి.. ఆర్మ్ గడ్డర్లను పియర్స్ ట్రూనియన్ బీమ్ల యాంకర్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్‌లతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత గేటును పైకి ఎత్తుతూ.. కిందకు దించుతూ పలుమార్లు పరీక్షించారు. గేటు పనితీరు ప్రమాణాల మేరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జపాన్‌లో బుష్‌ల తయారీ, దిగుమతిలో జాప్యం వల్లే నాగార్జున సాగర్ నిండిపోవడంతో 2021 ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 55,028 క్యూసెక్కులను తెలంగాణ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఆ రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 2021 ఆగస్టు 5 తెల్లవారుఝామున ఏడు గేట్లను రెండడుగులు ఎత్తారు. ఈ క్రమంలోనే 16వ గేటు ఎడమ వైపు పియర్ ట్రూనియన్ బీమ్ విరిగిపోయి గేటు ఊడిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, 48 గంటల్లోనే దాని స్థానంలో స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలాశయంలో నీటి నిల్వ తగ్గాక కొత్త గేటు బిగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 16, 17వ పియర్లకు ట్రూనియన్ బీమ్‌లను కొత్తగా నిర్మించారు. గేటును కూడా సిద్ధం చేశారు. గేటును పియర్స్ మధ్య బిగించడానికి, వాటి ఆర్మ్ గడ్డర్లను ట్రూనియన్ బీమ్లతో అనుసంధానం చేసే సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. కొత్త బుష్‌ల తయారీలో జపాన్ సంస్థ తీవ్ర జాప్యం చేసింది. దీని వల్లే గేటు బిగింపు ఆలస్యమైంది. పది రోజుల క్రితం జపాన్ సంస్థ బుష్లను పంపడంతో అదే రోజు గేటు బిగింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు శుక్రవారం పూర్తి చేశారు. కృష్ణా డెల్టాకు వరం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటకు సకాలంలో నీటిని విడుదల చేసి.. తుపానులు వచ్చేలోగా పంట కోతలు పూర్తయ్యేలా చేయడం ద్వారా రైతుకు దన్నుగా నిలవాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 నవంబర్ 18న పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 20,37,656 క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు సులభంగా విడుదల చేసేలా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. స్పిల్‌వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2019 ఆగస్టులోనే పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత నాలుగేళ్లుగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ కృష్ణా డెల్టాలో రెండు పంటలకు సకాలంలో నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. -
కృష్ణమ్మకు భారీగా వరద
సాక్షి, అమరావతి: తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 1.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అదే స్థాయిలో దిగువకు వదిలేశారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, బుడమేరు, పాలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్ట్‌కు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,60,875 క్యూసెక్కులు చేరుతుండటంతో.. అంతే స్థాయిలో వరదను 55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం.. గేట్లు ఎత్తి సముద్రంలోకి ఈ స్థాయిలో వరదను వదిలేయడం ఇదే తొలిసారి. ఖమ్మం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇవ్వడంతో శనివారం ప్రకాశం బ్యారేజీలోకి చేరే ప్రవాహం తగ్గనుంది. ఎగువ కృష్ణాలో స్థిరంగా ప్రవాహం పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 1.66 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద కాస్త తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.07 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరుకుంది. జూరాలకు ఎగువ నుంచి 1.22 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో స్పిల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. జూరాల నుంచి 1,20,390 క్యూసెక్కులు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల సుంకేశుల బ్యారేజ్ నుంచి 4,311, హంద్రీ నుంచి 117 వెరసి 1,24,818 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరుతుండటంతో నీటి నిల్వ 45.53 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద పెరగనుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మూసీ నుంచి పులిచింతలలోకి 55,144 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 28.03 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయనున్నారు. -
నేటి నుంచి పులిచింతల గేటు అమర్చే పనులు
అచ్చంపేట: పల్నాడు జిల్లా అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్ట్‌కు అమర్చిన 16వ నంబరు రేడియల్ గేటు 2021 ఆగస్ట్ 5న కృష్ణా నది వరదలకు కొట్టుకుపోగా.. కొత్త గేటు అమర్చే పనులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గేటు కొట్టుకుపోయిన నాటినుంచి ఇప్పటివరకు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్‌తో 16వ నంబర్ గేటును బ్లాక్‌చేసి ప్రాజెక్ట్‌లో సాగునీటిని నింపుతూ వచ్చారు. కాగా.. కొత్తగేటును అమర్చేందుకు ప్రభుత్వం రూ.22.05 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.7.53 కోట్లతో రేడియల్ గేటు తయారీ, రూ.1.73 కోట్లతో కాంక్రీట్ పనులు, రూ.9.57 కోట్లతో అన్ని గేట్లను క్రమబద్ధీకరించే పనులు చేపట్టాల్సి ఉంది. మరో రూ.3.20 కోట్లతో నడక దారిని ఏర్పాటు చేయాలి. ఆయా పనులు రెండు నెలలుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు కాంక్రీట్, గడ్డర్స్, ఆమ్స్, స్కిన్ప్లేట్స్ పనులను పూర్తి చేశారు. కొత్త రేడియల్ గేటును ప్రాజెక్ట్‌కు అమర్చాల్సి ఉంది. ఈ నెల 2 నుంచి 16 వరకు 16వ నంబర్ గేటు అమర్చే పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్ట్ మీదుగా రాకపోకలు నిలిపివేత పనులకు అంతరాయం ఏర్పడకుండా ప్రాజెక్ట్ మీదుగా మంగళవారం నుంచి 15 రోజులపాటు రాకపోకలను నిలిపివేశారు. రేడియల్ గేటు పైభాగంలో కోల్తార్ పెయింట్స్ వేసి రబ్బరు సీల్స్ బిగించి, గ్రీజింగ్ చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయిన వెంటనే రేడియల్ గేట్‌ను ప్రాజెక్ట్‌కు బిగించేందుకు 100 టన్నుల క్రాలర్ హెవీలోడ్ క్రేన్, 80 టన్నుల టైర్మౌంటెడ్ క్రేన్లను సిద్ధం చేశారు. పనులను సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అరుణకుమారి, అసిస్టెంట్ ఇంజినీర్లు విక్రమ్, వెంకటరెడ్డి పర్యవేక్షించనున్నారు. -
‘పులిచింతల’ చకచకా
సాక్షి, నరసరావుపేట/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు మరమ్మతు పనులు చకచకా సాగుతు న్నాయి. ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22.04 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 45.77 టీఎంసీలు నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పులిచింతలలో 2019–20లో 45.77 టీఎంసీలు, 2020–21లో 45.77 టీఎంసీలు, 2021–22లో 44.53 టీఎంసీలు, 2022–23లో 45.77 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రారంభించిన నాటినుంచి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం విశేషం. 16వ గేట్ స్థానంలో రేడియల్ గేట్ నిర్మాణం గత ప్రభుత్వాలు నిర్మాణం, నిర్వహణలో అలసత్వం వల్ల డ్యామ్ 16వ గేట్ 2021 ఆగస్ట్ 5న వరద ఉధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 16వ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ గేట్‌ను యుద్ధప్రాతిపదికన అమర్చి నీటిని నింపి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంది. తర్వాత 40 టీఎంసీలకు పైగా నీటితో ప్రాజెక్టు కళకళలాడింది. ఈ గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రూ.7.54 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రేడియల్ గేట్ ఏర్పాటు, దాన్ని అమర్చేందుకు అవసరమైన కాంక్రీటు దిమ్మెలు, క్రేన్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. మే చివరి నాటికి అన్ని పనులు పూర్తి పులిచింతల ప్రాజెక్టు 16వ రేడియల్ గేట్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గేట్ల అమరికకు అవసరమైన పనులు పూర్తయ్యాయి. ఇక గేట్లను ఆ స్థానంలో అమర్చి ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. అన్ని పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తాం. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులో నీటి నిల్వకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం – రామకృష్ణ, ఎస్ఈ, పులిచింతల ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణకు రూ.9.57 కోట్లు పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 రేడియల్ గేట్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు తరచూ వివిధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తుండటం, వందలాది టీఎంసీల నీరు ప్రాజెక్టు నుంచి కిందకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని మరమ్మతులు చేయాల్సి వస్తోంది. వీటన్నింటికి ప్రభుత్వం రూ.9.57 కోట్లు ఖర్చు చేస్తోంది. రేడియల్, స్లూయిజ్ గేట్లు, క్రేన్లకు గ్రీజు, పెయింట్, గడ్డర్ల పటిష్టం వంటి పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్యామ్ గేట్ల పిల్లర్ల పటిష్టానికి రూ.1.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. డ్యామ్ రేడియల్ గేట్లకు చేరుకునే నడక దారి పునరుద్ధరణకు రూ.3.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు పైనుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. గతంలో ఈ మార్గం నుంచి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు నుంచి తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు కొనసాగేవి. (చదవండి: బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బు విత్‌డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు.. ) -
Fact Check: ‘గేటు’పై ఈనాడు అడ్డగోలు అబద్ధాలు
సాక్షి, అమరావతి: వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేటు బిగింపు పనులు, మరమ్మతులు తుదిదశకు చేరుకున్నాయని పసిగట్టిన ‘ఈనాడు’ ఆదరాబాదరగా ఓ అడ్డగోలు కథనాన్ని అచ్చేసి చంకలు గుద్దుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక వంటకాన్ని సిద్ధం చేయాలనే ఆదుర్దాతో ‘పులిచింతల గేటు ఏర్పాటు ఎప్పటికి?’ అంటూ బురద చల్లేందుకు ప్రయత్నించింది. మరో 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా 30 శాతం పనులే జరిగాయంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది. గేట్ల బిగింపు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. కాలినడక వంతెన పనులు 70 శాతం పూర్తి కాగా 23 పియర్ల కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ కూడా పూర్తైంది. ఈనాడు ఆరోపణ: వరదలకు కొట్టుకుపోయిన 16వ గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు, మరమ్మతుల పనులకు పరిపాలన ఆమోదం కోసం 9 నెలల సమయం పట్టింది. వాస్తవం: ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పరిస్థితిపై సాంకేతికంగా మదింపు చేసి మిగిలిన 23 గేట్ల పనితీరును నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ చేయాలని సూచించింది. కమిటీ సూచనల మేరకు జల వనరుల శాఖ రూపొందించిన అంచనాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. నిపుణుల కమిటీతో సమగ్ర అధ్యయనం జరిపించింది. పనులను రెండు భాగాలుగా విభజించి బెకెమ్ సంస్థకు అప్పగించారు. కాలినడక వంతెన పనులను స్వప్న కన్స్ట్రక్షన్స్కు కేటాయించారు. ఆరోపణ: నిధులు ఇవ్వక పోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. వాస్తవం: గేట్లకు సంబంధించి రూ.1.59 కోట్లు, కాలినడక వంతెన పనులకు సంబంధించి రూ.1.29 కోట్ల బిల్లులను ప్రభుత్వం త్వరలో చెల్లించనుంది. ఆరోపణ: గేటు తయారీ, బిగింపులో ఆలస్యం జరుగుతోంది. వాస్తవం: గేటు తయారీలో అతి ప్రధానమైన ట్రూనియన్ బుష్ బేరింగ్లను జపాన్ నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. గేటును పియర్స్‌కు బిగించడానికి అవసరమైన కాంక్రీట్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. క్యూరింగ్‌కు 15 రోజులు పడుతుంది. గేటు తయారీ పూర్తయింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ పూర్తయింది. 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా ‘ఈనాడు’ 30 శాతం పనులే పూర్తయినట్లు అవాస్తవాలు అచ్చేసింది. కాలినడక వంతెన పనుల్లో కూడా 70 శాతం (16వ గేటు వరకూ) పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి గేటుకు స్టాప్‌లాగ్ గేటు అమర్చి రబ్బర్ సీళ్లను అమర్చే పనులు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా వాటిని పూర్తి చేసి ఈ సీజన్లో పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
జలయజ్ఞ ఫలం.. ఉప్పొంగుతున్న పులిచింతల
అచ్చంపేట: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మహానేత వరప్రసాదిని పులిచింతల ప్రాజెక్టు నిర్మితమైన దశాబ్దం తర్వాత తొలిసారిగా పూర్తిసామర్థ్యానికి నీటి నిల్వ చేరింది. 45.77 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.62 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు. 2004 అక్టోబరులో భూమిపూజ ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఎన్నో యేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబరు 15న గుంటూరు సరిహద్దులోని అచ్చంపేట మండలం, మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజచేశారు. 45.77 టీఎంసీల నీటి నిల్వతోపాటు 23 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. నిర్మాణ కాలంలో నక్సల్స్ ప్రభావం, భారీవర్షాలు, పర్యావరణ అనుమతులు వంటి ఎన్ని అవాంతరాలు వచి్చనా ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ తదిశ్వాస వరకు శ్రమించారు. ఆయన ఉండగానే 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నత్తనడకన సాగిన పనులు ఎట్టకేలకు 2012లో పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు వర్షాలు సక్రమంగా లేక రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టులో 20 నుంచి 25 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం సాధ్యం కాలేదు. గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు అచ్చంపేట, బెల్లంకొండ మండల పరిసరాలలో ఒకప్పుడు 400 నుంచి 500 అడుగులకుపైగా బోరు వేసినా చుక్కనీరు పడేది కాదు. కానీ ఇప్పుడు అవే భూముల్లో 100 నుంచి 200 అడుగుల లోపే నీళ్లు పడుతున్నాయి. ఇది పులిచింతల ప్రాజక్టు పుణ్యమే. 2019 నుంచి వరుణ కటాక్షం 2019 మే నెలలో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతోనే ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులో తొలి సారిగా 40 టీఎంసీలకు మించి నీటిని నిల్వ పెరిగింది. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటినిల్వకు చేరింది. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలోని 23 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఫలితంగా రైతులు రెండు పంటలూ పండిస్తున్నారు. ఇదీ చదవండి: నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -
అభివృద్ధికి కేరాఫ్ పల్నాడు
‘దాస్యమూ, దోపిడీ, దారిద్య్రమూ హెచ్చి, పాడిపంటల మేలు బంగారు నా తల్లి, కరవు కాపురమైందిరా పలనాడు.. కంటనీరెట్టిందిరా’ అంటూ కవి పులుపుల ఎంతో ఆవేదన చెందాడు ఆనాడు. ఇక మళ్లీ అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఈ పలనాటి సీమ దరి చేరకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడి మాగాణుల్లో ఆయకట్టు పెంచి ఆదాయ వనరులు పుష్కలంగా పెంపొందించేందుకు అన్ని అవకాశాలు కల్పించింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు నేడు ఫలనాడుగా మారనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వరికిపూడిశెల ప్రాజెక్టు కూడా రానుండటంతో పల్నాడు జిల్లాలో ఆయకట్టు పెరగనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పలనాడులోకే సాగునీటి ప్రాజెక్టులన్నీ రావడం విశేషం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాచర్ల నియోజకవర్గంలో ఉంటే, పులిచింతల ప్రాజెక్టు పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో ఉంది. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 41.8813 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 544.90 అడుగులకు చేరింది. ఇది 198.6870 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 4,459, ఎడమకాలువకి 6,097, ఎస్ఎల్బీసీకి 1,650, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో చెంతనే కృష్ణానది ఉన్నప్పటికీ సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుగ్గవాగు రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు సరైన సమయంలో అందక పంటలు ఎండుముఖం పట్టేవి. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరికపూడిశెలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎత్తిపోతల పూర్తి అయితే 73 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా చూడవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బొల్లాపల్లి మండలంలో 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందటంతో పాటు వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అలాగే ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. నూజెండ్ల మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తి చేశారు. నూజెండ్ల మండలం కంభంపాడు, కొత్తపాలెం, పువ్వాడ, ములకలూరు, ఉప్పలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు వాణిజ్య పంటలకు పల్నాడు కేరాఫ్‌గా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పండే పత్తి, మిర్చి పంటలు 90 శాతం పల్నాడులోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది రికార్డు స్థా యిలో 2,66,640 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సుమారు రెండు లక్షల ఎకరాల వరకూ పల్నాడు ప్రాంతంలోనే సాగైంది. జిల్లాలో మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజు పాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, అమరావతి, బెల్లంకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల తదితర మండలాల్లో విస్తారంగా మిర్చి పంట సాగు చేశారు. మరోవైపు పత్తిని తీసుకుంటే జిల్లాలో 4,23,750 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి వల్ల 2,73, 950 ఎకరాల్లోనే సాగు అయ్యింది. అందులో కూడా 90 శాతం పల్నాడులోనే సాగు అయ్యింది. పల్నాడు ప్రాంతంలో 2.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో 7,13,142 ఎకరాలు సాధారణ విస్తీర్ణం ఉంది. భవిష్యత్‌లో కూడా వాణిజ్య పంటల కారణంగా పల్నాడు జిల్లాకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్రంలో అధిక ఆదాయం పొందే జిల్లాల్లో పల్నాడు కూడా నిలిచే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. -
శ్రీశైలం డ్యామ్‌లో 4 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల) /సత్రశాల (రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో నాలుగు గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల హంద్రీ నుంచి 1,79,728 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమవారం నాలుగు గేట్ల ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 64,615 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 214.8450 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు 10 క్రస్ట్‌గేట్ల ద్వారా 1,36,304 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 1,70,121 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట: శ్రీశైలం జలాశయానికి సోమవారం వరద ప్రవాహం పెరిగింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, సుంకేసుల, హంద్రీ నదుల నుంచి 33,650 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ తెలంగాణ 12,713 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తోంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఎడమగట్టు కేంద్రంలో 6.890 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కాగా, డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 13.10 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 160.5282 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 874.30 అడుగులకు చేరుకుంది. పులిచింతలకూ వరద ప్రవాహం.. మరోవైపు నాగార్జునసాగర్ దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం వస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో అధికంగా నీరు ప్రాజెక్టులోకి చేరుతోందని ఏఈ రాజశేఖర్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 61,628 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణ పనులు జరుగుతున్నందున 53 మీటర్ల లోతు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 50 మీటర్లకు మించి నీరు నిల్వ ఉంచే అవకాశం లేదన్నారు. అందువల్ల ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు వదులుతున్నామని వివరించారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.5871 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పూర్తి సామర్థ్యంతో నీటిని నింపాలంటే పనులు పూర్తి కావాలని చెప్పారు. ఇందుకు మరో 20 రోజులు పడుతుందని తెలిపారు. -
టెన్షన్.. టెన్షన్; నది మధ్యలో.. నాలుగు గంటలు
నందిగామ: అదో ఇసుక రీచ్.. శుక్రవారం అర్ధరాత్రి.. ఇసుక తవ్వే జేసీబీలు.. నింపుకొనే టిప్పర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. నిరంతరాయంగా ఇసుక తవ్వుతూ, వాహనాల్లో నింపుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నదిలో ప్రవాహం పెరిగింది.. కాసేపటికే వాహనాలను ముంచెత్తింది. పెద్ద సంఖ్యలో టిప్పర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు, సిబ్బంది నదిలో చిక్కుకుపోయి.. బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బయటికెళ్లే మార్గం తెగిపోయి.. చెవిటికల్లు ఇసుక రీచ్ నుంచి రోజూ వందల వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు ఇసుక లోడ్ చేసుకునేందుకు రీచ్‌కు వెళ్లాయి. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి అర్ధరాత్రి సమయంలో నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నదిలో ఒక్కసారిగా వరద పెరిగింది. ఆ సమయంలో నదిలో 132 టిప్పర్లు/లారీలు, నాలుగు ట్రాక్టర్లు, కొన్ని జేసీబీలు ఉన్నాయి. నది ప్రవాహాన్ని గుర్తించిన కొందరు డ్రైవర్లు, సిబ్బంది వెంటనే బయటికి వెళ్లగలిగారు. ఇంతలోనే నదిలోకి వేసిన తాత్కాలిక మార్గం కొట్టుకుపోయింది. దాంతో 123 మంది నదిలోనే చిక్కుకుపోయారు. వాహనాలన్నీ ఆగిపోయాయి. దీనిపై సమాచారం అందిన పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం 6.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి నాటు పడవల సాయంతో 123 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాహనాలన్నీ నదిలోనే ఉండిపోయాయి. తెగిపోయిన మార్గాన్ని పునరుద్ధరించి వాటిని బయటికి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. -
పులిచింతలను పరిశీలించిన నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ప్రాజెక్టును పరిశీలించింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 5న తెల్లవారుజామున దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసేందుకు గేట్లు ఎత్తేటపుడు సాంకేతిక లోపం వల్ల 16వ గేటు ఊడిపోవటం తెలిసిందే. వరద ఉధృతికి కొట్టుకుపోయిన గేటు స్థానంలో రికార్డు సమయంలో స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేసి ప్రాజెక్టులో నీటినిల్వకు మార్గం సుగమం చేసిన ప్రభుత్వం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసింది. గేటు ఊడిపోవడానికి కారణాలు, ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన డిజైన్స్ సలహాదారు గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్) సీఈ శ్రీనివాస్ సభ్యులుగా, పులిచింతల ఎస్ఈ రమేష్‌బాబు కన్వీనర్‌గా నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బుధవారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించింది. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు కమిటీ బుధవారం రావడంతో ఆ కమిటీకి వివరాలను అందించేందుకు ఈఎన్సీ నారాయణరెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజైన్స్ సలహాదారు గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్ సీఈ సత్యనారాయణ, సీడీవో సీఈ శ్రీనివాస్, పులిచింతల ఎస్ఈ రమేష్‌బాబు బుధవారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. 9వ నంబరు గేటును ట్రయల్ రన్ వేశారు. 23 గేట్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని తేల్చారు. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయవచ్చని సూచించారు. మరోసారి పరిశీలిస్తాం గేటు ఊడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేశారు. స్పిల్ వే కాంక్రీట్, స్టీల్ పటిష్టతను తేల్చేందుకు పరీక్షలకు పంపాలని నిర్ణయించారు. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్ పటిష్టతను బట్టి.. గేటు ఊడిపోవడానికి కారణాలను అన్వేషించవచ్చునని డిజైన్స్ సలహాదారు గిరిధర్‌రెడ్డి చెప్పారు. వరద ఉధృతికి ఊడిపోయిన గేటు పూర్తిగా వంగిపోయిందని.. ఆ గేటు మళ్లీ వినియోగించడానికి పనికిరాదని తేల్చారు. ఆ గేటు స్థానంలో కొత్తది తయారుచేసి అమర్చాలని నిర్ణయించారు. గేట్ల నిర్వహణను మరింత మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్ పటిష్టత తేలాక ప్రాజెక్టును మరోసారి పరిశీలించి, అధికారులతో సమీక్షించి ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. -
‘స్టాప్ గేటు’ ఫలవంతం: పులిచింతలకు జలకళ
సాక్షి, అమరావతి బ్యూరో: పులిచింతల ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంది. జలాశయంలో నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 16వ గేటు విరిగిపోవడంతో, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసేందుకు, ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేశారు. మరమ్మతుల సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం ఐదు టీఎంసీల కనిష్ట స్థాయికి పడిపోయింది. యుద్ధప్రాతిపదికన స్టాప్ గేటు ఏర్పాటు చేశారు. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వరద స్థిరంగా కొనసాగుతుండటంతో మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటి నిల్వ 17.64 టీఎంసీలకు చేరింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు మళ్లీ నీటితో కళకళలాడుతూ కనిపిస్తోంది. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 18,887 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పట్టిసీమ నీరు తీసుకోకుండానే.. కృష్ణా డెల్టాలో ముమ్మరంగా వరి నాట్లు సాగుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా కాలువలకు నీటిని పుష్కలంగా విడుదల చేస్తున్నారు. కేఈబీ, ఏలూరు కాలువలకు 1400 క్యూసెక్కుల చొప్పున, బందరు కాలువకు 2200, రైవస్ కాలువకు నాలుగు వేలు, కృష్ణా పశి్చమ డెల్టాకు 6200, గుంటూరు కాలువకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాలువలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుగా బ్యారేజీ గేట్లు మూసి వేశారు. నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా పట్టిసీమ నీరు తీసుకోకుండానే, పులిచింతల ప్రాజెక్టు నుంచి అవసరమున్న మేరకు నీటిని సేకరిస్తూ, మిగిలిన నీటిని నిల్వ చేస్తున్నారు. రైతు ప్రయోజనాలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు విరిగిపోయినా దాని స్థానంలో రికార్డు స్థాయిలో రెండు రోజుల్లో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమమైంది. డెల్టా ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి తన చిత్త శుద్ధిని నిరూపించుకొంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. ప్రాజెక్టులోకి 1,46,318 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,46,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 63,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టులోకి 40,636 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. డెల్టా సాగు నీటిని అవసరాలకు దిగువనున్న ప్రకాశం బ్యారేజీలోకి 18,887 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నదికి స్వల్పంగా వరద పెరిగిన నేపథ్యంలో, సాగు నీటి అవసరాలకు సరిపడా నీటిని వినియోగించుకొంటూనే, పులిచింతల ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలకు వారం రోజుల్లోపే చేరుతుందని నీటి పారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నాం స్టాప్‌లాగ్ ఏర్పాటు కోసం పులిచింతల ప్రాజెక్టులో నీరు తగ్గించాం. గేటు ఏర్పాటు పూర్తవడంతో తిరిగి నీటిని నిల్వ చేస్తున్నాం. ప్రస్తు తం 17.64 టీఎంసీల నీరు ఉంది. కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నింపుతున్నాం. త్వరలో ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, తగు చర్యలు తీసుకొంటున్నాం. - రమేశ్‌బాబు, ఎస్ఈ, పులిచింతల ప్రాజెక్టు -
కేఆర్ఎంబీ ఆదేశాలు పట్టించుకోని తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులి చింతల ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు ఉత్పాదన నిలిపివేయాలంటూ పలుసార్లు ఆదేశాలిచ్చినా తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని కేంద్రం తెలిపిం ది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లకుండా తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి జూలై 5న లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్‌లో విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయాలంటూ జూన్ 17న తెలంగాణ జెన్కోను ఆదేశించినట్లు తెలి పారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్‌తో పాటు నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పాదనను కొనసాగించడంతో వెంటనే నిలిపివేయాలని జూలై 15న తెలంగాణ జెన్కో అధికారులను కేఆర్ఎంబీ ఆదేశించిందన్నారు. విద్యుత్తు ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జలవిద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కేఆర్ఎంబీ స్పష్టం చేసినట్లు చెప్పారు. కేఆర్ఎంబీ లేఖలకు తెలంగాణ జెన్కో (హైడల్) డైరెక్టర్ జూలై 16న ప్రత్యుత్తరమి స్తూ తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారన్నారు. విద్యుత్తు ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు ఆదేశాలు జారీచేసే వరకు.. శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్, నాగా ర్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్ ఉ త్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీ జూలై 16న రా సిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలి పారు. అయినప్పటికీ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖా తరు చేస్తూ తెలంగాణ జలవిద్యుత్తు ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేఆర్ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియో గం చేసేదిశగా ఆ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు చెప్పారు. దీనివల్ల బోర్డు సమర్థంగా పనిచేస్తుందన్నారు. విశాఖ ఉక్కుకు రబోధి బొగ్గు గనులు విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)కు జార్ఖండ్‌లోని రబోధి బొగ్గు గనులు కేటాయిస్తూ 2019లోనే ఆదేశాలు జారీచేసినట్లు కేంద్రం తెలిపింది. కోకింగ్ కోల్ లభించే రబోధి బొగ్గుగనిని ఆర్ఐఎన్ఎల్కు కేటాయిస్తున్నట్లుగా నామినేటెడ్ అథారిటీకి 2019 డిసెంబర్ 16న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్ఐఎన్ఎల్కు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టంగా ఉందన్నారు. ఆర్ఐఎన్ఎల్కు బొగ్గు గనులను కేటాయించాలని కోరుతూ బొగ్గు మంత్రిత్వశాఖకు పలు దఫాలుగా విజ్ఞప్తులు వచ్చిన విషయం వాస్తవమేనని చెప్పారు. ఆ విజ్ఞప్తుల మేరకే ఆర్ఐఎన్ఎల్కు రబోధి గనుల కేటాయింపు జరిగిందన్నారు. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో కొన్నింటిని వ్యూహాత్మక విక్రయం చేయాలన్న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్‌ఐఎన్‌ఎల్‌లోని నూరుశాతం ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి నాటికి సాలూరు బైపాస్ రోడ్డు పూర్తి రాయపూర్–విశాఖపట్నం సెక్షన్ జాతీయ రహదారి 26లో భాగంగా సాలూరు టౌన్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కోవిడ్ లాక్డౌన్ పరిస్థితుల కారణంగా బైపాస్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం 32 శాతం బైపాస్ పనులు జరిగాయని, గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కల్పన చేస్తున్నట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. ఈ పథకం ద్వారా 2018–19 నుంచి 2021–22లో జూలై 9 వరకు 6,536 మెక్రో ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు ద్వారా 52,288 మందికి ఉపాధి కల్పన అంచనా వేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. -
పులిచింతల ప్రాజెక్టు వద్ద భూప్రకంపనలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెలంగాణ వైపు చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూమి మూడు సార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై మొదటిసారి 2.3, రెండోసారి 2.7, మూడో సారి 3.0గా నమోదైనట్టు అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లా వైపు జడపల్లిమోటుతండా, కంచుబోడుతండాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. పులిచింతలలో పెరుగుతున్న నీటి నిల్వ స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు అనంతరం పులిచింతల ప్రాజెక్టులో నీటినిల్వను పెంచుతున్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రాజెక్టులో నీటిమట్టం 139.33 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో నీరు 9.307 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు, పూర్తి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 36.47 టీఎంసీలు అవసరం. స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేసే సమయానికి 5 టీఎంసీలున్న నీరు ఆదివారం రాత్రికి 9.307 టీఎంసీలకు చేరడంతో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొట్టుకుపోయిన 16వ నంబరు గేటును బయటకు తీయడానికి మరికొంత సమయం పడుతుందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్ విలేకరులతో చెప్పారు. శ్రీశైలం జలాశయంలో 210.5133 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 311.7462 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి 50,662 క్యూసెక్కుల ప్రవాహం పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతోంది. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.799 టీఎంసీల నీరున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగనర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. పులిచింతల నుంచి ఒక గేటు ద్వారా 12,341 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 17,148 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లను మూసివేసి, కృష్ణా డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. -
రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు
-
దోపిడీ బట్టబయలు కాకుండా.. రు‘బాబు’
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టులో చేసిన తప్పులు, దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవాస్తవాలను వల్లె వేస్తూ నెపాన్ని మరొకరిపై నెడుతున్నారని నీటి పారుదల రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే సమయంలో ప్రోటోకాల్ ప్రకారం నిపుణుల కమిటీతో ప్రాజెక్టును తనిఖీ చేయించాలి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, ఏవైనా లోపాలు ఉంటే వాటిని చక్కదిద్దాలి. ఆ తర్వాత ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలి. ఈ ప్రోటోకాల్ ప్రకారమే రిటైర్డు సీఈ కె.సత్యనారాయణ, డిజైన్స్ సలహాదారు, రిటైర్డు ఈఎన్సీ డాక్టర్ పి.రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీమ్ (ఎస్‌డీఎస్‌ఐటీ) 2015 జనవరి 5న పులిచింతల ప్రాజెక్టును తనిఖీ చేసింది. గేట్లను ఎత్తడానికి, దించడానికి ఏర్పాటు చేసిన వైర్లను సరి చేయాలని, స్పిల్ వే గ్యాలరీలో సీపేజీ(లీకేజీ)కి అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేయాలని.. స్పిల్ వే నుంచి 15 మీటర్ల పొడవున 500 మిల్లీమీటర్ల మందంతో అప్రాన్ నిర్మించాలని సూచిస్తూ సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. ఈ పనులను బొల్లినేనికి చెందిన ఎస్సీఆర్–సీఆర్18జీ సంస్థే చేయాలి. వాటికి అదనంగా ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. ఆప్రాన్‌ను కొత్త కాంట్రాక్టర్‌తో చేయించి, బిల్లులు చెల్లించారు. గ్రౌటింగ్ సక్రమంగా చేయకుండానే బొల్లినేనికి బిల్లులు చెల్లించారు. గేట్ల వైర్లను, ట్రూనియన్ బీమ్ల యాంకర్లో యోక్ గడ్డర్లను పట్టించుకోలేదు. నివేదికలో పేర్కొన్న అధిక అంశాలను బుట్టదాఖలు చేశారు. లోపాలు బయట పడకుండా డ్రామాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణపై చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే 1995లో ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని గుర్తు చేస్తున్నారు. కృష్ణా వరదల నియంత్రణలోబాబు విఫలమవడం వల్లే 1998లో శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు విద్యుత్ కేంద్రాన్ని వరద ముంచెత్తిందని చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం వల్లే 2003 అక్టోబర్ 30న వైఎస్సార్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని, చివరకు సొంత జిల్లా చిత్తూరులో 2018లో కాళంగి ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోవడానికి చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రజాధనాన్ని దోచుకోవడం మినహా వాటి భద్రతపై ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించని చంద్రబాబు.. ఇప్పుడు తన దోపిడీ, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడుతున్నారని అధికార వర్గాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్టర్ షరతులకు అంగీకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారని పులిచింతల ప్రాజెక్ట్ సీఈ నివేదిక ఇచ్చాకే బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇవ్వాలి. కానీ అలా నివేదిక ఇవ్వకుండానే ఆ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్, ఈఎండీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రూపంలో బ్యాంకు గ్యారంటీలు (అగ్రిమెంటు విలువలో 7.5 శాతం) సుమారు రూ.21 కోట్లను చెల్లించేలా 2018లో చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. అదనపు పరిహారం చెల్లింపు అంశంపై (ఆర్బిట్రేషన్ నిబంధనను కాంట్రాక్టర్ అడ్డం పెట్టుకుని) మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయకుండా, 766 రోజులపాటు అధికారులను అడ్డుకుని కాంట్రాక్టర్‌కు చంద్రబాబు దన్నుగా నిలిచారు. తీరా తీవ్ర జాప్యం చేశాక, కేసు విచారించాలంటే చెల్లించాల్సిన పరిహారంలో 50 శాతం.. రూ.199.67 కోట్లను డిపాజిట్ చేయాల్సిందేనని కాంట్రాక్టర్ పెట్టిన షరతుకు అంగీకరించారు. ఆ మేరకు చెల్లింపులు చేస్తూ 2018 జనవరి 18న చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాతే.. కాంట్రాక్టు అగ్రిమెంటు విలువ రూ.268.89 కోట్ల కంటే అదనంగా అంతే మొత్తాన్ని బొల్లినేనికి చెల్లించడం ద్వారా చంద్రబాబు కమీషన్లు దండుకున్నారు. ఈ తప్పులు, ఎస్‌డీఎస్‌ఐటీ నివేదికను అమలు చేయకపోవడం వల్లే ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు ఊడిపోయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే అవాస్తవాలు వల్లె వేస్తున్నారని మండిపడుతున్నారు. -
రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు
సాక్షి, అమరావతి, సాక్షి, అమరావతి బ్యూరో, అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన రెండు రోజుల్లోనే దాని స్థానంలో శనివారం స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమం చేసి, రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు గేటు విరిగిపోయాక.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసి, నీటి నిల్వను పునరుద్ధరించిన దాఖలాలు లేవని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో శనివారం రాత్రి 11 గంటలకు పులిచింతల ప్రాజెక్టులోకి 37,332 క్యూసెక్కులు చేరుతున్నాయి. విద్యుదుత్పత్తి ద్వారా 12,968 క్యూసెక్కులను తెలంగాణ ప్రభుత్వం దిగువకు విడుదల చేస్తోంది. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుతో ప్రాజెక్టులో నీటి మట్టం 129.19 అడుగుల్లో 6.4 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు గేట్లు అన్నీ మూసి వేశారు. కాగా, గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ట్రూనియన్ బీమ్ యాంకర్ యోక్ గడ్డర్లో సమస్య తలెత్తడంతో గేటు ఊడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అధికారులను సీఎం ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు పనులకు ఉపక్రమించారు. నిర్విరామ శ్రమతో ఫలితం 17 గేట్లు ఎత్తేసి.. దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో శనివారం తెల్లవారుజాముకు ప్రాజెక్టులో నీటి నిల్వను క్రస్ట్ లెవల్‌కు అంటే 3.66 టీఎంసీలకు తగ్గించారు. ఎగువ నుంచి 46 వేల క్యూసెక్కుల వరద వస్తున్నప్పటికీ లెక్క చేయకుండా శనివారం ఉదయం నుంచే ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో బీకెమ్ ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. స్టాప్ లాగ్స్‌ను క్రేన్ల ద్వారా సక్రమంగా బిగించేందుకు వైజాగ్‌కు చెందిన సీలైన్ ఆఫ్‌షోర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 10 మంది సభ్యుల బృందం నిర్విరామంగా శ్రమించింది. స్టాప్ లాగ్‌ను అమర్చుతున్న దృశ్యం విరిగిపోయిన 16వ గేటు వెనుక భాగంలో రెండు పియర్లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్ ద్వారా స్పిల్ వే బ్రిడ్జిపై నుంచి గ్యాంట్రీ క్రేన్ ద్వారా తొలుత 17 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు, 28 టన్నుల బరువు ఉన్న ఎలిమెంటు (ఇనుప దిమ్మె)ను దించారు. దానిపై అంతే బరువున్న రెండో ఎలిమెంటును దించారు. అప్పటి నుంచే నీటి నిల్వ మొదలైంది. ఇలా ఎలిమెంట్లను ఒకదానిపై మరొకటి ఏర్పాటు చేస్తూ నీరు కిందకు రాకుండా రబ్బర్ సీళ్లు వేశారు. అర్ధరాత్రి చివరగా 23 టన్నుల బరువున్న 11వ ఎలిమెంటును దించారు. దాంతో 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇది మిగతా గేట్ల తరహాలో ఎత్తడానికి, దించడానికి వీలుండదు. నీటి నిల్వకు దోహదం చేస్తుంది. పూర్తి గేటు ఏర్పాటుకు కసరత్తు విరిగిపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయి, స్పిల్ వే నుంచి దాదాపు 750 మీటర్ల దూరంలో పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. గడ్డర్స్ ఆచూకీ లభించలేదు. ప్రవాహం తగ్గాక.. 250 టన్నుల బరువున్న గేటును వెలికితీసి, పరిశీలిస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. పటిష్టంగా ఉంటే అదే గేటును బిగిస్తామని.. లేదంటే దాని స్థానంలో కొత్తగా గేటును తయారు చేస్తామని చెప్పారు. గేటు బిగించడానికి రెండు పియర్లకు ట్రూనియన్ బీమ్‌లు దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని తొలగించి కొత్తగా నిర్మిస్తామన్నారు. ట్రూనియన్ బీమ్ యాంకర్లో గేట్ల ఆర్మ్ గడ్డర్లను అనుసంధానం చేయడానికి సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు అవి బాగుంటే వాటినే ఉపయోగిస్తామని.. లేదంటే జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి గేటును బిగించేందుకు రెండు నెలల సమయం పడుతుందన్నారు. స్టాప్ లాగ్ గేటు ద్వారా పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేస్తామని, కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తాం పులిచింతల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తామని జల వనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ప్రాజెక్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యయన కమిటీ వేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా నివేదిక ఇస్తుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు పనులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను శనివారం సందర్శించారు. -
ఆందోళన వద్దు.. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతాం..!
కృష్ణా: పులిచింతల స్టాప్‌లాగ్ గేట్ పనులను ప్రభుత్వ విప్ ఉదయ భాను పరిశీలించారు. స్టాప్ లాగ్ గేట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. నేటి రాత్రి (శనివారం)కి స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. 16వ గేటు కొట్టుకువపోవడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని ఉదయ భాను పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు భవిష్యత్తులో హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటును పరిశీలిస్తామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన విమర్షించారు. లోకేష్ విషయం తెలియకుండా ట్వీట్లు చేస్తున్నారని దుయ్య బట్టారు. మచిలీపట్నం కోర్టు తీర్పుపై హైకోర్టుకి అపీల్‌కి వెళ్లకుండా.. చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాన్ని అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం చేయలేదా? అని అడిగారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే గత ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేసిందని విమర్షించారు. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతామని, కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ ఉదయభాను తెలిపారు. -
కొత్త గేట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు పంపుతాం
-
పులిచింతల: శరవేగంగా స్టాప్ లాక్ గేటు పనులు
సాక్షి, గుంటూరు: పులిచింతల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. సాయంత్రానికి స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. స్టాప్ లాక్ గేటు పూర్తికాగానే రిజర్వాయర్ నింపుతామన్నారు. పులిచింతల ఘటనపై అధ్యయనానికి నిపుణుల కమిటీ నియమించామని, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ పేర్కొన్నారు. -
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద కొనసాగుతున్న మరమ్మతు పనులు
-
పులిచింతల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే..
సాక్షి, అమరావతి: చంద్రబాబు కమీషన్ల కక్కుర్తే పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడానికి కారణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుతోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ బొల్లినేని రామారావు నిర్వాకాలు పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా డెల్టా రైతులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని మండిపడ్డారు. పులిచింతల పాపం ముమ్మాటికీ బాబుదేనని విమర్శించారు. ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని 2015లోనే భద్రతా కమిటీ నివేదిక ఇచ్చినా బాబు సర్కారు బేఖాతరు చేసిందన్నారు. ఆనాడే చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. సగర ఉప్పర కులస్తుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. దీనికి సగర ఉప్పర కార్పొరేషన్ చైర్పర్సన్ గానుపెంట రమణమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత బంగారు శీనయ్యలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సజ్జల మాట్లాడుతూ బీసీల్లో చిన్న కులాల నేతలను ప్రజాప్రతినిధులుగా ఎదిగేలా చేసేందుకు సీఎం జగన్ ధృడసంకల్పంతో ఉన్నారన్నారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ చిన్నగోవిందరెడ్డి, నవరత్నాల అమలు కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవీ చదవండి: ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే.. -
యుద్ధప్రాతిపదికన ‘గేటు’ పునరుద్ధరణ పనులు
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/అచ్చంపేట (పెదకూరపాడు): పులిచింతల ప్రాజెక్టులో ఎడమ వైపున ట్రూనియన్ బీమ్ విరిగిపోవడం వల్ల ఊడిపోయిన 16వ గేటు స్థానంలో యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును అమర్చేందుకు జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్టాప్ లాగ్ గేటును దించేందుకు ముందస్తుగా చేపట్టాల్సిన పనులను ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ పర్యవేక్షణలో బీకెమ్ సంస్థ నిపుణులు శుక్రవారం పూర్తి చేశారు. శనివారానికి ప్రాజెక్టులో నీటిమట్టం క్రస్ట్ లెవల్ (గేట్లు అమర్చే స్థాయి)కు చేరగానే.. స్టాప్ లాగ్ గేటును దించుతామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ గేటును 11 ఎలిమెంట్స్(భాగాలు)గా కిందికి దించుతారు. ఊడిపోయిన 16వ గేటు వెనుక భాగంలో పియర్స్‌కు అమర్చిన రెయిలింగ్ ద్వారా 17 మీటర్ల వెడల్పు, సుమారు 1.68 మీటర్ల పొడవు గల 28 టన్నుల ఎలిమెంట్‌ను తొలుత దించుతారు. దానిపై అంతే వెడల్పు, ఎత్తుతో కూడిన 26 టన్నుల బరువైన ఎలిమెంట్ దించుతారు. వాటికి ముందే అమర్చిన రబ్బర్ సీల్స్‌తో ఆ రెండు ఎలిమెంట్లను అతికిస్తారు. ఇలా 11 ఎలిమెంట్లను ఒక దానిపై ఒకటి దించి.. అతికించడం ద్వారా 18.5 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేస్తారు. ఈ గేటు బరువు సుమారు 240 టన్నుల బరువు ఉంటుంది. పూర్తి స్థాయి గేటు ఎత్తు, వెడల్పు స్థాయిలో ఈ స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడం ద్వారా జలాశయంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తారు. నేడు క్రస్ట్ లెవల్ స్థాయికి నీటి మట్టం పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం రాత్రి 8 గంటలకు 40.9 మీటర్ల స్థాయిలో 7.7142 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 31,825 క్యూసెక్కులు చేరుతుండగా.. 17 గేట్లను 6 మీటర్లు, ఒక గేటును 2.5 మీటర్ల మేర తెరిచి 2,44,406 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇదే రీతిలో దిగువకు నీటిని విడుదల చేస్తే శనివారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి నిల్వ క్రస్ట్ లెవల్ 36.34 మీటర్లకు చేరుతుంది. అప్పుడు ప్రాజెక్టులో 3.61 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. ఎగువ నుంచి స్థిరంగా 31 వేల క్యూసెక్కుల వరద వచ్చినా.. సులభంగా స్టాప్ లాగ్ గేటును దించుతామని అధికార వర్గాలు తెలిపాయి. స్టాప్ లాగ్ గేటును దించే ప్రక్రియ శనివారం సాయంత్రానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశాయి. పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాగ్ గేటు పెట్టడానికి జరుగుతున్న పనులు ఆ నివేదికను టీడీపీ బుట్టదాఖలు చేయడంతోనే.. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడానికి ముందు 2015లో జనవరి 5న స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీమ్ (ఎస్‌డీఎస్‌ఐటీ) ఇచ్చిన నివేదికను అప్పటి టీడీపీ సర్కార్ బుట్టదాఖలు చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేసినా.. కొద్ది రోజుల్లోనే పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుండగా.. ప్రాజెక్టుపై ఈ నెల 8, 9 తేదీలలో వాహనాలు, ప్రజల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు తహసీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రాజెక్ట్ వద్ద 144వ సెక్షన్ విధిస్తున్నట్టు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు : మంత్రి పేర్ని నాని పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం వెనుక ఎవరైనా కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఈ ప్రాజెక్టు గేట్లను 2013–14లో అమర్చారని గుర్తు చేశారు. వెలగపూడిలో సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో పులిచింతల ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిన విషయంపై చర్చించామన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో హైడ్రాలిక్ గేట్లు అమర్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారని తెలిపారు. యోక్ గడ్డర్ లోపం వల్లే... పులిచింతల నుంచి వరదను దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ఎడమ ట్రూనియన్ బీమ్‌లో గేటును అనుసంధానం చేసిన యోక్ గడ్డర్లో 25 మిల్లీమీటర్ల మందంతో కూడిన రేకు(ఇనుప ప్లేట్)పై అధిక ఒత్తిడి పడి చితికిపోయింది. దాంతో యోక్ గడ్డర్ విరిగిపోయింది. దీనివల్ల ట్రూనియన్ బీమ్ పగిలిపోవడంతో గేటు ఊడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిందని జల వనరుల శాఖ అధికారులు, బీకెమ్ సంస్థ నిపుణులు తేల్చారు. ఇక్కడున్న ఒక్కో గేటు బరువు 250 టన్నులు. రెండు పియర్ల(కాంక్రీట్ దిమ్మెల) మధ్య ట్రూనియన్ బీమ్‌లకు అమర్చిన యాంకర్లో యోక్ గడ్డర్లను ఆర్మ్ గడ్డర్లతో అనుసంధానం చేయడం ద్వారా గేట్లను బిగిస్తారు. వరద ఉధృతి వల్ల 1,500 టన్నుల భారం పడినా.. గేట్లను సులభంగా ఎత్తేలా వాటిని అమర్చారు. గేటు ఎత్తే సమయంలో 2,500 టన్నుల భారం పడినా యోక్ గడ్డర్ విరిగిపోయే అవకాశమే లేదని.. కానీ ఆ స్థాయిలో భారం పడకున్నా 16వ గేటు యోక్ గడ్డర్ విరిగిపోవడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరమ్మతుల కోసమే స్టాప్ లాగ్ గేటు పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే పొడవు 560.25 మీటర్లు, ఎడమ వైపు నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్(ఎన్వోఎఫ్) పొడవు 232.75, కుడి వైపు ఎన్వోఎఫ్ పొడవు 141 మీటర్లు. మట్టి కట్ట పొడవు 355 మీటర్లు. ప్రాజెక్టు టాప్ బీమ్ లెవల్(టీబీఎం) 58.24 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 53.54 మీటర్లు. కనీస నీటిమట్టం 42.67 మీటర్లు. స్పిల్ వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. అంటే, స్పిల్ వేకు 32.34 మీటర్ల నుంచి 50.84 మీటర్ల మధ్య వీటిని బిగించారు. వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేస్తే 20.37 లక్షల క్యూసెక్కుల(176 టీఎంసీల)ను ఒకేసారి దిగువకు వదిలేయవచ్చు. ఈ గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు. ఆ తర్వాత 11 ఎలిమిమెంట్లను విడదీస్తారు.