పులిచింతల : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు పులిచింతల ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేయనున్నారు. అయితే రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో ఈసారి సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోటోలకు చోటు దక్కలేదు.
కేవలం స్థానిక మంత్రులు, నేతలు, ముఖ్యమంత్రి ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే దర్శనం ఇచ్చాయి. అంతే కాకుండా ప్రాజెక్ట్ సభా ప్రాంగణానికి కూడా జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం ప్రాంగణంగా నామకరణం చేశారు. వీటన్నింటితో పాటు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను కూడా ఏర్పాటుచేశారు.ఇక తెలంగాణ బిల్లును కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏవిధంగా వ్యవహరిస్తారన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి పులిచింతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హెలికాప్టర్ లో పులిచింతల బయల్దేరారు.