Flex Banner
-
పవన్‌కు కొత్త ట్విస్ట్.. అన్నా ఎన్నాళ్లీ అవమానాలు!
అన్నయ్యా.. మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం కానీ నువ్వు విన్నావు కాదు.. మనం లేకుంటే వాళ్లకు కుర్చీ ఎక్కే ఛాన్స్ దక్కేనా?. అలాంటప్పుడు మనం గౌరవప్రదమైన సీట్లు తీసుకుని పోటీ చేద్దాం అంటే నువ్వు ఒప్పుకోలేదు.. జస్ట్ గుప్పెడు సీట్లు తీసుకుని వాటితో మనం చేసేదేం లేదు.మనం గేమ్‌లో అరటిపండులం అయిపోతాం తప్ప గేమ్ చేంజర్స్ కాలేం. వాళ్ళు ఆట ఆడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలి. ఈ ఖర్మ మనకు ఎందుకు అన్నయ్యా.. కలలు కనండి.. అవి నిజం చేసుకోవడానికి కృషి చేయండి అని అబ్దుల్ కలాం చెప్పారు కానీ ఆయన మన సొంత కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడాలని చెప్పారు తప్ప వేరే వారి కలలు నిజం చేసేందుకు మనం శ్రమించాలని చెప్పలేదు.వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారు.. పాలనను అస్తవ్యస్తం చేస్తారు .. ఆ ఫెయిల్యూర్స్‌ను నీ మీద నెట్టేస్తారు చూస్తూండండి.. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో వేసుకుని.. తప్పులన్నిటికీ మనను నిందిస్తారు.. ఎందుకొచ్చిన దరిద్రం మనకు.. బయటకు వెళ్ళిపోదాం.. ప్రతిపక్షంలో ఉందాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. మనకు ఈ అధికారం అనే లంపటం వద్దు.. అంటూ ఆవేదనతో జనసైనికులు కడపజిల్లాలో ఫ్లెక్సీలు కట్టారు.వాస్తవానికి పవన్ సపోర్ట్‌తోనే చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. ఇంకా చెప్పాలంటే చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన ఏనాడో విశ్వసనీయతను కోల్పోయారని.. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకుండి.. బాబు ఇచ్చిన హామీలకు తానూ బాధ్యుడిగా ఉంటూ వాటిని నెరవేర్చే బాధ్యతను నెత్తిన పెట్టుకుంటానని చెప్పడంతోనే ప్రజలు విశ్వసించి ఈ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని కేడర్ భావిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కనీసం యాభై సీట్లయినా తీసుకోకుండా కేవలం 21 సీట్లలో పోటీ చేయడం ద్వారా ప్రభుత్వంలో క్రియాశీలకంగా.. కీలకంగా ఉండలేని పరిస్థితి వస్తోందని కేడర్ లోలోన బాధ పడుతోంది.పైగా చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ను సైతం అడుగడుగునా అవమానిస్తున్నారని.. మొన్నటి దావోస్ సభలకు సైతం డిప్యూటీ సీంఎను తీసుకుని వెళ్లలేదని.. కేవలం చంద్రబాబు.. లోకేష్ వెళ్లి ఆయనను పక్కనబెట్టేశారని.. తీరా అట్నుంచి ఇద్దరూ ఒట్టి చేతులతో వచ్చారని ఆ ఫ్లెక్సీల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వారిమీద నమ్మకం లేకనే పెట్టుబడులు రాలేదని.. అదే పవన్ వెళ్లి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. పవన్‌ను చూసి అయినా కనీసం నాలుగైదు కంపెనీలు వచ్చేవని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయినా అట్నుంచి వచ్చాక బాబును ఎలివేట్ చేస్తూ టీవీలు.. ఛానెళ్లలో ప్రోగ్రామ్‌లు నడుపుతున్నారని. కేడర్ ఆవేదన చెందుతోంది.తప్పులు చేసేది వాళ్ళు.. ఒప్పుకునేది మీరుతిరుమలలో తొక్కిసలాట వంటి ఘోరాలు జరిగినపుడు వారెవరూ తమకు సంబంధం లేనట్లు ఉంటారు.. మీరు మాత్రం నిజాయితీగా జనంలోకి వెళ్లి తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబుతున్నారు. కానీ, ఆ ఘోరానికి కారణమైన చంద్రబాబు తాలూకా మనుషులు మాత్రం కనీసం చీమ కుట్టినట్టు అయినా భావించడం లేదు. మనం ప్రతిపక్షంలో ఉండి .. ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుండు.. అధికారంలో భాగమై ఎందుకూ విలువలేకుండా పోతున్నాం.. అంటూ ఏర్పాటైన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.సగటు జనసైనికుడి ఆవేదన.. అంతర్మథనాన్ని ఆ ఫ్లెక్సీలో పాయింట్లుగా రాసి అందర్నీ ఆలోచింపజేస్తున్నారని అంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జనసేన కేడర్ ఫోన్లలో సర్క్యులేట్ అవుతూ వారిని ఆలోచనలో పడేసింది. -సిమ్మాదిరప్పన్న. -
మహా బ్రాండ్ మేళా!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సంరంభానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో ఈ భారీ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఒకవైపు తమ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు బ్రాండ్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా కూడా ఖర్చు పెడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది దీనికి హాజరవుతారని అంచనా. ఇందులో రూ. 2 లక్షల కోట్ల పైగా వ్యాపార అవకాశాలు ఉంటాయని స్వయంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీనితో ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బడా బ్రాండ్లు మహా కుంభ మేళాకు క్యూ కట్టాయి. కోట్ల సంఖ్యలో మేళాకి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా డాబర్ ఆమ్లా, వాటికా బ్రాండ్లు మహిళల కోసం చేంజింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం డాబర్ లాల్ తేల్ స్పెషల్ బేబీ కేర్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అటు ఆడియో కథల ప్లాట్‌ఫాంకు ఎఫ్ఎం ఈ కార్యక్రమం సందర్భంగా తమ ఓటీటీ యాప్ ‘భక్తి’ని ఆవిష్కరిస్తోంది. ఇందుకోసం టెంట్లు, కియోస్క్ లతో బ్రాండ్‌కి ప్రచారం చేస్తోంది. ఐటీసీ బ్రాండ్ బింగో! .. స్థానిక పాటలపై రీల్స్ చేస్తోంది. మదర్ డెయిరీ సంస్థ పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి 45 కియోస్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇక ఆతిథ్య రంగ సంస్థలు సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. ఒనొరా హాస్పిటాలిటీ సంస్థ దాదాపు 175 లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తోంది. ఐటీడీసీ కూడా యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లాంటి ఫీచర్లతో లగ్జరీ టెంట్ల ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. మహా కుంభమేళాలో క్యాంపా తదితర ఉత్పత్తులను విస్తృతంగా అందుబాటులో ఉంచడంతో పాటు పలు సేవలు కూడా అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) తెలిపింది. భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు క్యాంపా ఆశ్రమ్, ఆరామ్ స్థల్ మొదలైనవి ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. హోర్డింగ్‌లకు రూ. పది లక్షలు ... కుంభమేళా సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కార్యక్రమం ఆసాంతం హోర్డింగ్‌లు లేదా ఫ్లెక్స్ బోర్డ్‌లు కొనసాగించాలంటే రూ. 10 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లపై 10 సెకన్ల ప్రకటనకు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పొడవునా ప్రచారం కోసం బ్రాండ్లు కనీసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ కార్యక్రమంపై ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరానుండటంతో బ్రాండింగ్‌కి ఇది భారీ అవకాశంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. → మహిళల కోసం డాబర్ ఆమ్లా, వాటికా చేంజింగ్ రూమ్స్ → డాబర్ దంత్ స్నాన్ జోన్స్, పిల్లల కోసం డాబర్ లాల్ తేల్ ప్రత్యేక సంరక్షణ గదులు → మదర్ డెయిరీ 45 కియోస్క్ లు → ‘భక్తి’ ఓటీటీ యాప్‌ను ప్రారంభిస్తున్న కుకు ఎఫ్ఎం → ఐటీడీసీ లగ్జరీ టెంట్లు→ మహా కుంభమేళా ప్రకటనల హక్కులను హైదరాబాద్‌కి చెందిన కంపెనీ శ్రేయాస్ మీడియా దక్కించుకుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు
-
ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప-2కు రాజకీయ సెగ!
ఏపీలో ఊహించిందే జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను.. పవన కల్యాణ్ అభిమానులు టార్గెట్ చేశారు. చాలాకాలంగా పుష్ప-2 సినిమాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి అల్లు అర్జున్ అభిమానులు అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు విడుదల ముందు.. ఈ వార్ తారాస్థాయికి చేరింది. ఏకంగా.. రాజకీయ మలుపులతో సినిమాను అడ్డుకుంటామనే స్థాయికి చేరింది. అల్లు అర్జున్ను టార్గెట్ చేసిన జనసేన నేతలు.. సినిమాను అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. పుష్ఫ-2 బెనిఫిట్ షో వేయడానికి వీల్లేదని గన్నవరం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించాడు. అలాకాని పక్షంలో.. గురువారం సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘‘అల్లు అర్జున్ అహంకారంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. మెగాఫ్యామిలీలో ఎవరిని టచ్ చేసినా ఊరుకోం. వాళ్ల సంగతి చూస్తాం’’ అంటూ రమేష్ బాబు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు రంగంలోకి దిగారు. రమేష్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈలోపే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం అంతే ప్రతిఘటనకు దిగారు. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా జనసేన కవ్వింపు చర్యలకు దిగుతోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను, పుష్ప 2 చిత్రాన్ని హేళన చేస్తూ ఎడిటింగ్ పోస్టర్లు, వీడియోలతో రెచ్చిపోతున్నారు. మరోవైపు.. పుష్ప 2 చిత్రానికి మద్దతుగా అభిమానులు భారీ కటౌట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇంకోపక్క.. వైఎస్సార్సీపీ పేరిట పలుచోట్ల పోస్టర్లు వెలియడం గమనార్హం. అయితే.. వీటిని మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పుష్ప-2 పోస్టర్లను చించేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలా చోట్ల ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అనంతపురంలో జనసేన నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గుత్తిలో కేపీఎస్ థియేటర్ వద్ద ఫ్లెక్సీలను చించేశారు. తిరుపతి పాకాలలో రామకృష్ణ థియేటర్ వద్ద ఫ్లెక్సీ వివాదం రేగింది. చూడాలి.. రేపు ఇది ఇంకా ఎటు పోతుందో!.ఇక.. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్.. స్నేహధర్మంతో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పకు మద్దతుగా నిలిచారు. ఇది మెగా ఫ్యామిలీలో కొందరికి సహించలేదని.. ఫలితంగానే మెగా అభిమానులకు అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారన్నది ఓపెన్ సీక్రెట్. -
సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం
అల్లూరి సీతారామరాజు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంధ్యారాణి సోమవారం పర్యటించారు. అయితే.. మంత్రి సంధ్యారాణి పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన ఆ ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటో కనిపించకపోవటం గమనార్హం. అయితే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టని వైనం కనిపించింది. దీంతో పాడేరులో ఫ్లెక్సీల ఏర్పాటు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
కొడాలి నాని పుట్టిన రోజు.. ఫ్లెక్సీలను అడ్డుకున్న పోలీసులు
-
ఏలూరుపాడులో రఘురామకృష్ణంరాజు దౌర్జన్యం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరుపాడులో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దౌర్జన్యానికి దిగారు. అంబ్కేదర్ ఫ్లెక్సీని రఘురామకృష్ణంరాజు చించేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో వచ్చి చించేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు తీరును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వార్ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వివాదం రచ్చరచ్చగా మారింది. పాత మున్సిపల్ సెంటర్లో జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీల్లో జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఇదీ చదవండి: ఆ చర్చల సారాంశం చెప్పలేను: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ -
ఇదేం రూల్?.. విశాఖ ఎలక్షన్ కోడ్‌లో అధికారుల ఓవరాక్షన్
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యుల నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు.. ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసి తాతకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కుమారు డు, సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నంద మూరి రామకృష్ణ, సుహాసినితో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల, ప్రవేశ ద్వా రం రెండువైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమాను లు.. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో, ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్డు ఫుట్‌పాత్‌పై, మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం తమ హీరో ఫ్లెక్సీలు తొలగించారన్న విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బయట ఉంచిన ఫ్లెక్సీలను తిరిగి లోపల పెట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. వారు అందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పూలమాల వేసి పాలాభిషే కం చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన జూని యర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఫుట్‌పాత్‌పై ఉంచిన రెండు ఫ్లెక్సీలను ఘాట్ లోపలికి తీసుకువచ్చారు. ఇది గమనించిన పోలీ సులు.. బయట ఉన్న ఫ్లెక్సీలు లోపలికి ఎందుకు తీసుకువచ్చారంటూ.. వెంటనే వాటిని యథా స్థానంలో పెట్టాలని ఆదేశించారు. వారు విన్పించుకోక పోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రి క్తత నెలకొంది. చివరకు పోలీసులు లోపలికి తీసుకువచ్చిన ఫ్లెక్సీలను తిరిగి బయట పెట్టించి వారిని అక్కడినుంచి పంపించి వేయడంతో ఉద్రి క్తత చల్లారింది. కాగా నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..తెలుగు బిడ్డ బొడ్డు కోయకముందే రాజకీయాలంటే ఏంటో తెలిపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సాహసోపేత పథకాల అమలుతో పేదవాడి ఆక లి తీర్చి, విప్లవాత్మక, సామాజిక మార్పులు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని చెప్పారు. -
టీడీపీకి కేశినేని మరో షాక్.. బాబు ఫ్లెక్సీల తొలగింపు
సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని.. టీడీపీ పార్టీకి మరో షాకిచ్చారు. రాజీనామా ప్రకటన అనంతరం కేశినేని భవన్‌పై టీడీపీ పార్టీ జెండాలు, బ్యానర్లను కేశినేని నాని తొలగించారు. చంద్రబాబు, ఎన్టీఆర్, కేశినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను మంగళవారం తొలగించారు. వాటీ స్థానంలో కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కేశినేని శ్వేత తన విజయవాడ 11 డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చదవండి: flash back: పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు ! -
చంద్రబాబు సభలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని.. దెబ్బ అదుర్స్! -
ఎమ్మెల్సీ కవిత 'వర్సెస్' ఎంపీ అర్వింద్.. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీల వార్ దాకా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారని ఆరోపించారు.' శాసనసభ ఎన్నికల ప్రచారం స్పీడందుకుంటున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నువ్వా నేనా అనే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నిక ల్లో కవితపై అర్వింద్ విజయం సాధించినప్పటి నుంచీ ఈపోరు నడుస్తూనే వస్తోంది. పసుపు బోర్డు అంశంపై అర్వింద్, కవితతోపాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం పోటాపోటీ మాటలతో పాటు ఫ్లెక్సీల వార్‌కు దిగారు. మీరొక ఫ్లెక్సీ పెడితే మేము పది ఫ్లెక్సీలు పెడతాం అన్న రీతిలో ఈ వార్ నడిచింది. మాటల యుద్ధం మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇది రానురాను మరింత పెరుగుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత తాజాగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో తిరిగి బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడిస్తామన్నారు. మరోవైపు అర్వింద్ మాత్రం బీఆర్ఎస్పై మాటల దాడిని తీవ్రతరం చేశారు. కవిత ప్రచారం చేస్తే బీజేపీకి మరింత మెజారిటీ వస్తుందని అర్వింద్ అన్నారు. బీఆర్‌స్‌కు కార్యకర్తలే ఓట్లు వేయరన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారన్నారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందన్నారు. అభద్రతా భావంతో ఉన్న బీఆర్ఎస్ హిందువులను కులాల వారీగా విభజిస్తోందన్నారు. ఎక్కడా గెలవలేని కవిత ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారన్నారు. అలాంటి కవిత వేరేవాళ్లను ఎలా గెలిపిస్తుందని అర్వింద్ అన్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. కులసంఘాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి మాత్రం జీవన్‌రెడ్డిపై మాటల దాడి చేస్తున్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని చెబుతున్నారు. జీవన్‌రెడ్డి సర్పంచ్‌లను బెదిరించినట్లు నన్ను బెదిరించాలంటే సాధ్యం కాదన్నారు. తాను గెలిస్తే జీవన్ మాల్ లీజ్‌ను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఫాంహౌజ్, పైరవీల ధ్యాస జీవన్రెడ్డిదన్నారు. ఆర్మూర్ అంబేద్కర్ సెంటర్లో లైవ్ చర్చకు రావాలని రాకేష్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆస్తుల చిట్టా బహిర్గతం చేసుకుందామన్నారు. ఎవరేమిటో తేల్చుకుందామన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో బీఆర్ఎస్ అ భ్యర్థి గణేష్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ సైతం మెల్లగా మాటల దాడి పెంచుతున్నారు. ఇవి చదవండి: 'ఓటు' ను కొన్ని సమయాల్లో వేరే పేర్లతో పిలుస్తారు.. అవేంటో తెలుసా..!? -
ఆఫీసర్లు వద్దన్నా కడుతున్నారు లోకేష్ హోర్డింగ్‌లు
-
తాడికొండ టీడీపీలో కాకరేపుతున్న వివాదం.. అక్కడ ఏం జరుగుతోంది?
సాక్షి, గుంటూరు జిల్లా: తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఫ్లెక్సీల వివాదం కాకరేపుతోంది. చంద్రబాబు మేడికొండూరు పర్యటనలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమయ్యింది. బాబు రాక సందర్భంగా టీడీపీ నేత తోకల రాజవర్థన్‌రావు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌కుమార్ ఆ ప్లెక్సీలను తీయించివేశారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన తోకల రాజవర్థన్‌రావు వర్గీయులు.. తెనాలి శ్రావణ్‌కుమార్‌తో పాటు అతని అనుచరులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: ‘కోడెల మరణానికి చంద్రబాబే ప్రధాన కారణం’ -
మోదీ పర్యటన వేళ.. బీఆర్ఎస్ సరికొత్త ప్రచార అస్త్రం.. ‘ఇదే ఆహ్వానం..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ నుంచి పుట్టుకొచ్చి రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీ టీఆర్ఎస్. రెండు దఫాలు రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని దక్కించుకున్న కె.చంద్రశేఖరరావు మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈక్రమంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) కాస్తా బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) అయింది. ఇప్పటికే కేంద్రంతో పలు అంశాలపై విభేదిస్తూ వచ్చిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి అడుపెట్టడంతో మరింత దూకుడు పెంచారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ అరెస్టుతో రాజకీయంగా మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరస్పర విమర్శలు, కేసులు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అటు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇస్తుండటం ఒక ఎత్తయితే, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలతో సైతం వినూత్నంగా సెటైర్లు వేస్తుండటం గమనార్హం. (చదవండి: సికింద్రాబాద్-తిరుపతి ‘వందే భారత్’ రైలు ప్రత్యేకతలు, టికెట్ ధరలివే!) ఇక ప్రధాని మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ వస్తుండటంతో బీఆర్ఎస్ మరో ప్రచార అస్త్రానికి తెరలేపింది. బీజేపీలోని కీలక నేతల వారసుల ఫోటోలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. కమలం పార్టీ నేతలు పరివారానికే పట్టం కడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు కారు పార్టీ నేతలు. ‘మీ పరివారం మీకు ఆహ్వానం పలుకుతోంది’ అంటూ సెటైరికల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: కేసీఆర్ వస్తే మోదీ చేతులతో సన్మానం చేయిస్తా: బండి సంజయ్) -
చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో ఫ్లెక్సీలు
-
చిత్తూరు: రొంపిచర్లలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బీరు బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఐదు రోజులక్రితం సోమలలో తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఘర్షణలకు దిగారు. టీడీపీ కార్యకర్తలు రొంపిచెర్ల క్రాస్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించి చెప్పులతో కొట్టి కాల్చివేశారు. దీనిపై రొంపిచెర్ల సర్కిల్లో శనివారం ఉదయం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తిరిగి సాయంత్రం ఇరువర్గాలు రొంపిచెర్ల సర్కిల్‌కు చేరుకోగా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో రొంపిచెర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న రొంపిచెర్ల ఎస్ఐ శ్రీనివాస్ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటికి కల్లూరు, భాకరాపేట, పీలేరు, ఎర్రావారిపాళ్యెం స్టేషన్ల నుంచి పోలీసులు రొంపిచెర్లకు చేరుకుని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, దాడుల విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌రెడ్డి రొంపిచెర్ల చేరుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. రొంపిచెర్ల మండలంలో ఉనికి కోసమే టీడీపీ ఘర్షణలకు పాల్పడుతోందని అన్నారు. చదవండి: (నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్) -
ఎల్లారెడ్డిపేటలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
-
హైదరాబాద్‌లో ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ నగరంలో పలుచోట్ల ‘మోదీ నో ఎంట్రీ’ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ యూత్‌ఫోర్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా చౌరస్తాల్లో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. -
మునుగోడులో పోస్టర్ వార్
చౌటుప్పల్ మండలంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు 2016లోనే హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదంటూ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టి, దాని ముందు సమాధిలా ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని గ్రామాల్లో ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్నటివరకు బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలియగా.. తాజాగా టీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు పడ్డాయి. ఆగస్టు నుంచే పోస్టర్ల గోల షురూ.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు నెల నుంచే పోస్టర్ల గోల మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే కొన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని బ్యానర్లు పెట్టగా.. మరికొన్ని గ్రామాల్లో మాకు డబ్బులు వద్దు రోడ్డే కావాలి అంటూ ఫ్లెక్సీలు కట్టారు. మరోచోట రోడ్డు వేస్తేనే మా గ్రామంలోకి రావాలంటూ ఊరి బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు’అంటూ సెప్టెంబర్ 15న పోస్టర్లు కనిపించాయి. తర్వాత ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పే’అంటూ రాజగోపాల్‌రెడ్డిపై పోస్టర్లు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బొమ్మలతో సమాధులు, కాష్టాల వంటివీ జరిగాయి. తాజాగా శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టి.. కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్.. వీడియో వైరల్ -
అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిరసన సెగ
సాక్షి, పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ చేస్తోన్న పాదయాత్రపై పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజధాని ముసుగులో వస్తున్న తెలుగుదేశం బినామీలు గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ''ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు, వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులుగా అమరావతి, కర్నూలు, విశాఖపట్నం కావాలి, రాజధాని ముసుగులో తెలుగుదేశం బినామీ నాయకులు గోబ్యాక్ గోబ్యాక్'' అంటూ ఫ్లెక్సీల్లో నినాదాలు ముద్రించారు. చదవండి: (స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ) -
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేదం.. ఆ రోజు నుంచే అమల్లోకి
సాక్షి, విజయవాడ: ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేదం నవంబర్ 1 నుంచి అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ముద్రించడం, అంటించడం, రవాణాపైన నిషేదం విధించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ ప్రింటింగ్ మెటీరియల్ ఇంపోర్ట్పైనా నిషేదం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: (ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్) -
CM Basavaraj Bommai: తెలంగాణ సర్కార్‌పై కర్ణాటక సీఎం ఆగ్రహం
బెంగళూరు: ‘40 పర్సెంట్ ప్రభుత్వానికి సుస్వాగతం’అని కర్ణాటక సీఎం గురించి హైదరాబాద్‌లో వేసిన ఫ్లెక్సీలపై సీఎం బసవరాజ బొమ్మై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనడానికి బొమ్మై హైదరాబాద్‌కు వస్తారని తెలిసి ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆదివారం బెంగళూరులో బొమ్మై మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అస్తవ్యస్తంగా మారతాయని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిని కర్ణాటకలో ప్రస్తావిస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రశ్నించారు. ఇదొక పథకం ప్రకా రం చేసిన కుట్ర, ఇలాంటి వాటితో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలు నాశనమ వుతాయని, ఎవరూ కూడా ఇలా చేయరాదని సూచించారు. ఒక రాష్ట్రంపై ఆధార రహిత ఆరోపణలను చేయటం సరికాదన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై తాము ఫ్లెక్సీ వేస్తే ఎలా ఉంటుందని బొమ్మై ప్రశ్నించారు. కాగా, కర్ణాటకలో అన్ని పనుల్లో మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. చదవండి: (మార్గదర్శికేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు) -
ఆప్ ఈవెంట్‌ను హైజాక్ చేసిన మోదీ! రాత్రికి రాత్రే ఏం జరిగింది?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించాల్సిన ఓ కార్యక్రమాన్ని కేంద్రం హైజాక్ చేసిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్. రాత్రికి రాత్రే పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై నరేంద్ర మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్తా.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని విమర్శించారు. ఈమేరకు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 'కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సం కార్యక్రమం ఆదివారంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఏమైందో తెలియదు. శనివారం రాత్రి అనూహ్యంగా ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై మొత్తం మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగిస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు.' అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. పోలీసులు ఉంది ప్రజలకు భద్రత కల్పించడానికి గానీ, ప్రధాని మోదీ కోసం బ్యానర్లు కట్టేందుకు కాదని ధ్వజమెత్తారు. Delhi Govt के वन महोत्सव में CM @ArvindKejriwal को शामिल होना था लेकिन प्रधानमंत्री कार्यलय के आदेश पर Police ने मंच पर कब्ज़ा कर ज़बरदस्ती Modi जी की तस्वीर लगा दी और हटाने पर गिरफ़्तारी की धमकी दी मोदी जी दिल्ली Govt के कायर्क्रम में अपनी तस्वीर लगाकर क्या साबित करना चाहते? pic.twitter.com/B3Hdo5KCLr — AAP (@AamAadmiParty) July 24, 2022 ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు గోపాల్ రాయ్. ఇప్పటికే తమ నేత సత్యేంద్ర జైన్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా కుట్ర జరుగుతోందని అన్నారు. సీఎం కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు వెళ్లకుండా అధికారిక ప్రక్రియ నిలివేశారని విమర్శించారు. చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' -
మా ఫ్లెక్సీలు తొలగిస్తావా?
పుత్తూరు రూరల్: మా ఫ్లెక్సీలనే తొలగిస్తావా? అంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్‌పైకి దూసుకెళ్లారు. పుత్తూరులో జరిగిన ఈ ఫ్లెక్సీల రాద్ధాంతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మున్సిపల్ సిబ్బంది వైఎస్సార్ సర్కిల్ నుంచి ఫ్లెక్సీలను తొలగిస్తూ వస్తున్నారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వచ్చి మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. కొంతసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామిరెడ్డిని టీడీపీ నాయకులు తమ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అయినా 15 రోజులుగా గడువిచ్చామని, నేడు తొలగించాలని చెప్పారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేతలు కమిషనర్‌పైకి దూసుకెళ్తూ దుర్భాషలాడారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయినా కమిషనర్ అక్కడే నిలబడడంతో, కొంతసేపటికి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీవరత్నంనాయుడు తమ ఫ్లెక్సీలకు చలానాలను కట్టి అనుమతి తీసుకుంటామని, అంత వరకు ఫ్లెక్సీలు యథాస్థానంలో ఉండాలని కోరారు. ఇందుకు కమిషనర్ సమ్మతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులను అక్కడి నుంచి వాహనాల్లో ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత మున్సిపల్ సిబ్బంది అనుమతులు లేని ఫ్లెక్సీలను తొలగించారు. -
ఫ్లెక్సీల ఏర్పాటు కోసం టీడీపీ నాయకుల నిర్వాకం
చీపురుపల్లి: తారు రోడ్లు బాగోలేవంటూ టీడీపీ నాయకులు లేనిపోని ఆర్భాటం చేస్తారు. వారు చేసిన హడావుడికి తగ్గట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అదే తెలుగుదేశం నాయకులు సమావేశాల పేరిట ఏర్పాటు చేసే ఫ్లెక్సీల కోసం ఎంతో పటిష్టంగా ఉన్న బీటీ రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చీపురుపల్లి పట్టణంలో ఆదివారం ఇదే సంఘటన జరిగింది. గరివిడి మండలంలోని కుమరాం పంచాయతీ సర్పంచ్ ముల్లు రమాదేవి టీడీపీలో చేరుతున్న సందర్భంగా పట్టణంలోని తారురోడ్లు తవ్వేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చక్కగా ఉన్న రోడ్లను తవ్వేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చీపురుపల్లిలోని మూడు రోడ్ల జంక్షన్, గెడ్డమిల్లు, ఆంజనేయపురం, అగ్రహారం, గరివిడి, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటి కోసం నాలుగైదు నెలల కిందట కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బీటీ రోడ్లను గోతులుగా మార్చేశారు. టీడీపీ మద్దతుతో గెలిచి.... గరివిడి మండలంలోని కుమరాం పంచాయతీ సర్పంచ్ ముల్లు రమాదేవి గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలుపొందారు. ఆ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు పోటీ చేయకుండా ముల్లు రమాదేవికి పార్టీ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. దీంతో ఆమె గెలుపొందారు. ఇదంతా జరిగి చాలా కాలం గడిచిపోయింది. అయితే రమాదేవి ప్రస్తుతం టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ మద్దతుతో గెలిచి మళ్లీ అదే పార్టీలో చేరడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
టీఆర్ఎస్ నేతలకు షాక్.. ఫ్లెక్సీలపై పెనాల్టీలు
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకొని పలువురు టీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల వంటివి భారీగా ఏర్పాటు చేశారు. వాటితో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా ద్వారా పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందించిన ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్(సీఈసీ) ఈ చలానాల జారీ ప్రారంభించింది. వాటిని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా సీఈసీ ఖాతాకు అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నుంచి పార్టీ డివిజన్ స్థాయి నాయకుల వరకు పెనాల్టీల ఈ– చలానాలు జారీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ఫ్లెక్సీలున్నప్పటికీ పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకే పెనాల్టీలు వేయడంతో, పెనాల్టీలు పడనివి అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ► మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్పార్క్, పంజగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, తార్నాక, ప్యాట్నీ ఈస్ట్‌మారేడ్‌పల్లి, మెట్టుగూడ, తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ– చలానాలు జారీ చేశారు. ఒక్కో ఫ్లెక్సీకి రూ. 5వేల వంతున చలానాలు జారీ అయ్యాయి. ► హైటెక్‌సిటీలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల వంతున రెండింటికి లక్ష రూపాయల చలానాలు జారీ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట ఏర్పాటైన వాటికి, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన వాటికి పెనాల్టీలు విధించా రు. బుధవారం సాయంత్రం వరకు తలసానిపై ఇరవైకి పైగా, పార్టీ జనరల్సెక్రటరీపై దాదాపు ఇరవై ఫ్లెక్సీలకు ఈచలానాలు జారీ చేశారు. ► టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి హుస్సేన్‌సాగర్‌లో బోట్‌కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50వేలు, రూ.15వేలు వంతున రెండు ఈ– చలానాలు జారీ అయ్యాయి. గచ్చిబౌలిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన షేక్‌హమీద్‌కు లక్ష రూపాయల వంతున రెండు ఈ– చలానాలు జారీ చేశారు. ఈచలానాల జారీ ఇంకా కొనసాగుతుండటంతో కచ్చితంగా ఎంత మొత్తం అనేది తెలియడానికి సమయం పట్టనుంది. తగ్గేదేలే.. ► పెనాల్టీలు వేసినా తాము తగ్గేది లేదని, పార్టీపై.. అగ్రనాయకులపై తమ అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నట్లుగా పలువురు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు తదితరమైన వాటితో స్వాగతాలు పలికారు. పెనాల్టీలు పడినా సరే అధిష్టానం దృష్టిలో పడితే చాలన్నట్లుగా కొందరు వీటిని ఏర్పాటు చేశారు. ► ట్విట్టర్ వేదిక ద్వారా కొందరు పౌరులు టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లు కారు అని అన్న మీరే ఇలా వ్యవహరించారేం? అని ప్రశ్నించారు. మేం నిబంధనలు పాటించాలి కానీ మీ పార్టీ పాటించవద్దా అని పేర్కొన్నారు. బెంగళూర్‌లో ఫ్లెక్సీలు, గుట్కా, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారని పోస్ట్‌చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటదో తెలియని నగరంలో ఒక్కసారిగా గాలిదుమారం వీస్తే రోడ్డున పోయే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. -
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు
-
కేటీఆర్ పర్యటన.. టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చిన వరంగల్ కార్పొరేషన్
సాక్షి, వరంగల్: మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు పర్యటన నేపథ్యంలో వరంగల్ మున్సిపల్‌కార్పొరేషన్ టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీ ఫైన్ విధించింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణికి బల్దియా అధికారులు ఏకంగా రూ.2 లక్షలు జరిమానా విధించారు. టీఆర్ఎస్ నాయకులు కేశవరావుకు రూ.50 వేల జరిమానా విధించారు. కాగా, నేడు కేటీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. జెండాలు, తోరణాలు, బ్యానర్లతో మడికొండ నుంచి వరంగల్ వరకు రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి. -
ప్రమాదకరంగా కటౌట్లు..!
శంషాబాద్ రూరల్: జాతీయ రహదారి, గ్రామ రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని ముంచింతల్ శివారులో ని శ్రీరామనగరంలో ఇటీవల 12 రోజుల పాటు జరిగిన సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయా రోడ్డు మార్గాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లోనూ.. బెంగళూరు జాతీయ రహదారితో పాటు గొల్లూరు, ముచ్చింతల్, బుర్జుగడ్డతండా, పెద్దషాపూర్‌తండా, పీ–వన్ మార్గాల్లో ఉత్సవ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీ నేతలు భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసి వారం దాటినా ఇప్పటిదాకా వాటిని తొలగించడంలేదు. కటౌట్లు ఎప్పుడు విరిగి పడతాయోనని వాహనదారులు, స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలగింపులో నిర్లక్ష్యం.. రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగింపులో అటు ఉత్సవ నిర్వాహకులు..ఇటు పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కటౌట్ల ఏర్పాటుతో ఉత్సవాల సమయంలో సందర్శకులకు కొంత వరకు అటు వెళ్లే మార్గాలను సూచనలకు ఉపయోగపడ్డాయి. కానీ పూర్తయినా వెంటనే వాటిని తొలగించే బాధ్యత పంచాయతీలపై ఉన్నా..వారు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. వాహనదారులకు ఇబ్బంది.. బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన కటౌటు విరిగింది. ఇది ఎప్పుడు ఊడి కింద పడుతుందో తెలియడం లేదు. వీటితో పాటు చాలా చోట్ల ఉన్న కటౌట్లు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. -
టీడీపీ కార్యకర్తల బరితెగింపు !
కంచికచర్ల(కృష్ణా జిల్లా): వైఎస్సార్ సీపీ నాయకుల ఫ్లెక్సీను చింపేసిన సంఘటన సోమవారం గొట్టుముక్కల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సర్పంచ్ గుదే రంగారావు, ఎంపీటీసీ సభ్యురాలు గుదే సరస్వతి వైఎస్సార్ సీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని ఆకతాయిలు రాత్రి వేళ ఫ్లెక్సీని చింపివేశారు. చదవండి: AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు! 2014లో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు ఆలోకం కృష్ణారావును చిన్నపాటి వివాదానికి టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. గతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావుపై టీడీపీ నాయకులు హత్య ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీని టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఉంటారని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు
-
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు..
సాక్షి, మేడ్చల్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో కోమడిరెడ్డితో పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించారు. కొంపల్లిలో ఈ నెల 9,10 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. ఎంపీ కోమటిరెడ్డి పేరుతో కాంగ్రెస్ నాయకుడు మహిపాల్‌రెడ్డి హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లను గుర్తుతెలియని ఆగంతకులు కత్తిరించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. అంతర్గత విభేదాల కారణంగా సొంత పార్టీ నాయకులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణాలో ఫ్లెక్సీ ఇష్యూ
-
ప్రచారం నేతలది.. ఖర్చు జీహెచ్ఎంసీది.. ఎలాగంటారా?
బంజారాహిల్స్: రాజకీయ నేతలు రోడ్లకిరువైపులా, కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్‌పాత్, రోడ్లను సైతం ఆక్రమిస్తుండటంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్‌పాత్‌లపై పెద్ద పెద్ద కర్రలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కూడళ్లలో చెట్లను తొలగించి, గడ్డిని సైతం తవ్వి ఏర్పాటు చేస్తున్నారు. రహదారుల పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలతో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని అగ్రసేన్ చౌరస్తాలో భారీ వర్షంలో వెళ్తున్న ఓ వ్యక్తిపై ఫ్లెక్సీ పడగా ఈ ఘటనలో బాధితుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. (చదవండి: Huzurabad Bypoll: మాట ముచ్చట: అయిలన్నా.. ఏం నడ్తందే?) సొంత నిధులతో.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రతి రోజూ ఏదో ఒకటి కొత్త కటౌట్లు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతూ జీహెచ్ఎంసీ అధికారులు, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నామంటూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే.. ఇంత వరకు ఎవరి దగ్గర కూడా జరిమానాలు వసూలు చేసినట్లు కనిపించడం లేదు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రం డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి వాటిని తొలగిస్తున్నారు. కటౌట్లు ఏర్పాటు చేసిన నేత వాటిని తొలగించే ఖర్చు నుంచి తప్పించుకుంటుండగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందం మాత్రం తమ సొంత సిబ్బందితో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ వాటిని తొలగిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. కటౌట్ పెట్టిన నేత వాటిని తొలగించే బాధ్యత కూడా ఆయనే తీసుకోవాల్సి ఉండగా జీహెచ్ఎంసీ పుణ్యమా అంటూ తొలగించే ఖర్చులు మిగులుతున్నాయి. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) -
కిషన్ రెడ్డి సభ.. కార్పొరేటర్‌కు షాకిచ్చిన జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది. -
కౌశిక్‌రెడ్డికి షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. భారీ జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా పాడి కౌశిక్‌రెడ్డి పేరిట ఐటీ కారిడార్‌తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలపై పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధ్యులకు జరిమానా విధించాలని పదుల సంఖ్యలో ట్వీట్ చేశారు. దీనిపై ఈవీడీఎం స్పందించింది. ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు, హోర్డింగులను తొలగించడమే కాకుండా జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి పక్షపాతం లేదని, చట్టం మేరకు పారదర్శకంగా పనిచేస్తున్నామని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ వారికి సమాధానమిచ్చారు. ఆయా ప్రాంతాల్లోని ఫ్లెక్సీలకు కౌశిక్‌రెడ్డికి పెనాల్టీలు విధిస్తూ ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ–చలానాలు జారీ చేసింది. ఒక్కో ఫ్లెక్సీకి రూ.5 వేల నుంచి మొదలుకొని లక్ష రూపాయల వరకు పెనాల్టీలు విధించింది. మొత్తం 4.56 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. మీ ఫిర్యాదు పరిశీలించామని, త్వరలోనే పెనాల్టీ విధిస్తామని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన వారందరికీ సమాధానాలు పంపింది. ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీష్‌రావు, సంతోష్‌కుమార్, కవిత తదితరుల ఫొటోలుండటంతో చట్టం అమలులో జీహెచ్ఎంసీ కళ్లు మూసుకుందని కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, అంజన్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. కారెక్కిన కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్ కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌశిక్‌తో పాటు అతని అనుచరులు కూడా కారెక్కారు. -
శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు!
సాక్షి, బెంగళూరు : కోవిడ్ పేరుతో ప్రచారం పొందాలని ప్రయత్నించిన బీజేపీ నేతలు చివరకు నెటిజన్లతో చివాట్లు పెట్టించుకున్న సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం అధికారులు నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద ఉచితంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడే పబ్లిసిటీ పిచ్చితో నాయకులు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్ఆర్ విశ్వనాథ్ తదితరుల ఫొటోలతో సోమవారం ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి...అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. విషయం కాస్త పార్టీ పెద్దలకు తెలియడంతో నెలమంగల బీజేపీ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. దీంతో సాయంత్రం సమయానికి ఫ్లెక్స్ తీయించేశారు. బీడీఏ అధ్యక్షుడు ఎస్ఆర్ విశ్వనాథ్ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో జనాలు.. ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ చీవాట్లు పెడుతున్నారు.ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో నెటిజన్లు ‘మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందా.. కరోనాతో శవరాజకీయాలు చేస్తారా’ అంటూ బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
లిఫ్ట్ అడిగి స్కూటర్‌పై.. ప్రాణం తీసిన ఫ్లెక్సీ
సాక్షి, చెన్నై: స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ ఫ్లెక్సీ రూపంలో ప్రాణాలు కోల్పోయారు. పుదుకోట్టై జిల్లా తిరుబువనం సమీపంలోని కరంపకుడి అమ్మనిపేటకు చెందిన స్వామికన్ను భార్య విజయరాణి మేల్మెట్టనూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగుపయనంలో ఎంతకు బస్సు రాకపోవడంతో అటు వైపు స్కూటర్లో వచ్చిన యువకుడ్ని లిఫ్ట్ అడిగారు. అతడు లిఫ్ట్ ఇవ్వడంతో ఇద్దరు స్కూటర్‌పై అమ్మని పేటకు బయలుదేరారు. మార్గ మధ్యంలో ఓ చోట రవిచంద్రన్ అనే వ్యక్తి తన తండ్రి మరణించడంతో నివాళులర్పించే రీతిలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉండడం, అది గాలికి స్కూటర్‌పై పడడం చోటుచేసుకుంది. స్కూటర్ వెనుక ఉన్న విజయరాణిపై ఫ్లెక్సీ పడడంతో ఆమె రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించగా మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం చెన్నైలో అన్నాడీఎంకే వర్గాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పడి రోడ్డుపై స్కూటర్లో వెళ్తున్న ఓ యువతి మరణించిన విషయం తెలిసిందే. -
కేటీఆర్ ఫైర్.. 20 వేల జరిమానా
ఎర్రగడ్డ : ఎవరు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది...నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పాం కదా...అయినా ఎందుకు ఏర్పాటు చేశారంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని సుల్తాన్‌నగర్‌బస్తీ ప్రాంతంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఇందుకోసం మద్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు కేటీఆర్ కారు దిగగానే రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగిస్తే తప్ప తాను బస్తీ దవాఖానాను ప్రారంభించేది లేదని అధికారులకు తెలిపారు. అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ సర్కిల్–19 డీఎంసీ రమేష్‌ను, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందును పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన స్థానిక కార్పొరేటర్ షహీన్ బేగంకు అప్పటికప్పుడు రూ.20 వేలు జరిమానాను విధించారు. ఇందుకు సంబంధించిన రసీదును అధికారులు కార్పొరేటర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ స్థానికంగా ఏర్పాటు చేసిన దవాఖానాను ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాబు ఇంత పతనమవుతాడనుకోలేదు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవడంపై అభ్యంతరం తెలిపిన చంద్రబాబును ట్విటర్ వేదికగా దుయ్యబట్టారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు’ అని మండిపడ్డారు.(ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?: విజయసాయిరెడ్డి) మరో ట్వీట్లో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాబు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడని విమర్శించారు. పరిపాలన అంటే లూటీ చేయడమే అతని ఫిలాసఫీ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎవరేంటి అనేది ప్రజలకు తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు. -
సీఎం ఫెక్ల్సీకి.. పెనాల్టీ!
సాక్షి, సిటీబ్యూరో: సీఎం బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటుదాం అంటూ పిలుపునిస్తూ ఫెక్ల్సీ ఏర్పాటు చేసినందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్(జెడ్సీ) ప్రావీణ్యకు సోమవారం జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం రూ.10 వేలు ఈ–చలానా జారీ చేసింది. గోల్కొండ కోట సమీపంలో సీఎం ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొంటూ చలాన్లు జారీ చేశారు. దీనిపై కమిషనర్‌తో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ప్రావీణ్య తెలిపారు. ఈ విషయంపై కమిషనర్‌ను సంప్రదించగా, బ్యానర్లు క్లాత్వా, ఫ్లెక్సీలా అనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము క్లాత్‌వి ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. ఒకవేళ ఫ్లెక్సీలైతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా గోల్కొండ కోట వద్ద ఇలాంటి ప్రచారం ఫెక్ల్సీలు ఏంటని ఓ సంస్థ ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం వల్లే చలానా విధించారని తెలిసింది. -
కార్పొరేటర్‌కు రూ.5,000 జరిమానా
అమీర్‌పేట: రోడ్లపై ఫ్లెక్సీలు కట్టినందుకు జీహెచ్ఎంసీ అధికారులు అమీర్‌పేట కార్పొరేటర్ నామన శేషుకుమారికి రూ.5,000 జరిమానా విధించారు. సోమవారం మంత్రులు వేములు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్‌ఆర్‌నగర్‌కు వచ్చిన సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ కార్పొరేటర్ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫ్లెక్సీలు కట్టినందుకు గాను కార్పొరేటర్‌కు జరిమానా విధించారు. అందుకు సంబంధించిన రసీదును కార్పొరేటర్‌కు అందజేశారు. -
‘ఇంకెంత మంది శుభశ్రీలు చనిపోవాలి’
చెన్నై : అధికార పార్టీకి చెందిన హోర్డింగ్ కారణంగా మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శుభశ్రీ ఉదంతం పట్ల నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ప్రచారానికి ఇంకెంత మంది శుభశ్రీలు చనిపోవాలని ప్రశ్నించారు. శుక్రవారం కమల్ మీడియాతో మాట్లాడుతూ...’అసలు ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ బ్యానర్లు పెట్టాలి. ఎక్కడ పెట్టాలో తెలియదా. కనీస ఇంగిత ఙ్ఞానం కూడా లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే శుభశ్రీ, రఘు వంటి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వాళ్ల తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వారి వేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ విషయాల గురించి వారిని ప్రశ్నించినా..నిజాలు మాట్లాడినా నాలుక కోస్తామని హెచ్చరిస్తారు. అటువంటి వాళ్లను అసలు పట్టించుకోవడమే మానేశాను. ప్రజా సమస్యల గురించి కచ్చితంగా ప్రశ్నించి తీరతా’ అని పేర్కొన్నారు.(చదవండి : నిషేధంతో బతుకు ప్రశ్నార్థకం) అదే విధంగా ప్రజలు కూడా ఇవన్నీ భరిస్తూ మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ...‘ కలకాలం బానిసల్లా బతుకుదామని అనుకుంటే మీకంటే పిచ్చివాళ్లు ఎవరూ ఉండరు. పాలకులు మిమ్మల్ని బానిసల్లా చేసి ఆడుకుంటున్నారు. సాధారణ ప్రజల వల్ల ఏమతుందిలే అనే ధీమాతో ఉన్నారు. అయితే మీరంతా ఎంతో ధైర్యవంతులని, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుని వారికి బుద్ధి చెప్పి.. సరికొత్త నాయకులను ఎన్నుకుంటారని నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోండి అని కమల్ పిలుపునిచ్చారు. కాగా వారం రోజుల క్రితం పల్లావరం సమీపంలో బ్యానర్ మీద పడడం, వెనుక వచ్చిన లారీ మీదకి ఎక్కడంతో శుభశ్రీ అనే టెకీ మరణించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అధికారులు పరుగులతో ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. అనుమతులు లేకుండా వాటిని ఏర్పాటు చేసిందుకు గాను 650 మందిపై కేసులు నమోదయ్యాయి. -
శుభశ్రీ మరణం.. నిషేధం అమల్లోకి!
సాక్షి, చెన్నై: తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల నిషేధం వ్యవహారం డిజిటల్ ప్రింటింగ్ రంగంలో ఉన్న వారి బతుకును ప్రశ్నార్థకం చేసింది. ఏడు లక్షల మంది రోడ్డున పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డిజిటల్ ప్రింటింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించి, అనుమతులు ఇచ్చిన చోట మాత్రమే బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు తగ్గ చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తులు పెరిగాయి. ఈ నేపథ్యంలో వర్తక సంఘం నేత విక్రమరాజా నేతృత్వంలోని బృందం సీఎం పళనిస్వామిని కలిసి విన్నవించుకున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలను నిషేధించాలని పలు దఫాలుగా హైకోర్టు హెచ్చరించినా, ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకున్న వాళ్లే లేరు. ఎక్కడ బడితే అక్కడ ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యక్షం అవుతూనే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఐదు రోజుల క్రితం పల్లావరం సమీపంలో బ్యానర్ మీద పడడం, వెనుక వచ్చిన లారీ తొక్కించడం వంటి పరిణామంతో శుభశ్రీ అనే యువతి మరణించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అధికారులు పరుగులతో ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. అనుమతులు లేకుండా వాటిని ఏర్పాటు చేసిందుకు గాను 650 మందిపై కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధం అమల్లోకి వచ్చినట్టుగా పరిస్థితి మారింది. అలాగే, డీఎంకే సైతం తాము అనుమతి లేనిదే ఏర్పాటు చేయబోమని స్పష్టం చేస్తూ కోర్టులో ప్రమాణ పత్రం కూడా సమర్పించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న డిజిటల్ ప్రింటింగ్ వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. ఈ రంగాన్ని నమ్ముకుని ఏడు లక్షల మంది మేరకు ఉన్నారు. వీరందరి పరిస్థితి, ఇక రోడ్డున పడ్డట్టేనా అన్నట్టుగా మారింది. (చదవండి : ఫ్లెక్సీలపై ఇంత వ్యామోహమా ?) సీఎంతో భేటీ.. డిజిటల్ ప్రింటింగ్‌ను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆ అసోషియేషన్లు విజ్ఞప్తి చేసే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం పళని స్వామిని వర్తక సంఘాల నేత విక్రమరాజా నేతృత్వంలో ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఓ వినతి పత్రం అందజేశారు. స్మార్ట్ సిటీ పథకం మేరకు దుకాణాల తొలగింపు.. తాజాగా బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధం అంశాలను గుర్తు చేస్తూ, డిజిటల్ ప్రింటింగ్ రంగంలో ఉన్న వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ప్రింటింగ్‌ను క్రమబద్ధీకరించి, ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని.. అదే విధంగా అనుమతి ఉన్న చోట మాత్రమే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుభశ్రీ కుటుంబానికి సాయం.. బ్యానర్ రూపంలో విగత జీవిగా మారిన శుభశ్రీ కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5లక్షలు సాయం అందజేశారు. స్టాలిన్ మాట్లాడుతూ బ్యానర్లు, ఫ్లెక్సీల సంస్కృతికి డీఎంకే వ్యతిరేకమని, అయితే, నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడాన్ని కట్టడిచేసే విధంగా ముందుకుసాగామని తెలిపారు. ఇక, ఆ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమని, ఇందుకు తగ్గట్టు తాము కోర్టుకు ప్రమాణపత్రం కూడా సమర్పించినట్టు పేర్కొన్నారు. -
హృదయాలను పిండేసిన శుభశ్రీ మరణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇంటిలో పెళ్లి, జన్మదినం, వివాహ వార్షికోత్సవం, మరణం... ఒక్క మాటలో చెప్పాలంటే శుభం, అశుభం ఏది జరిగినా ఫ్లెక్సీలతో ఆర్భాటానికి పోతారా. భార్యాభర్తలు విడాకులు తీసుకునేపుడు మినహా అన్ని కార్యాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లపై ఇంత వ్యామోహమా’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. మహిళా ఇంజినీర్ శుభశ్రీ దారుణ మరణం రాష్ట్ర ప్రజల హృదయాలను పిండేసింది. ప్రజలు ప్రతిపక్షాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజల ప్రాణాలంటే అధికారులకు అంతచులకనా అంటూ మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా మండిపడింది. చెన్నై క్రోంపేట భవానీనగర్‌కు చెందిన శుభశ్రీ (23) దురైపాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో విధులు ముగించుకుని తన బైక్‌లో ఇంటికి బయలుదేరారు. క్రోంపేట–దురైపాక్కం రేడియల్ రోడ్డు మార్గంలో పల్లికరణైలో ఆమె ప్రయాణిస్తుండగా అన్నాడీఎంకే ప్రముఖుడు జయగోపాల్ కుమారుని వివాహ వేడుక సందర్భంగా దారిపొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలోని ఒకటి తెగి రోడ్డుపై పడడం శుభశ్రీ దానికింద ఇరుక్కోవడం, వెనుకనే వస్తున్న టాంకర్ లారీ ఆమెపై నుంచి వెళ్లి పోయి శుభశ్రీ ప్రాణాలు విడవడం క్షణాల్లో జరిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి ట్యాంకర్ లారీ డ్రైవర్ మనోజ్ (25)ను అరెస్ట్‌చేశారు. ప్రమాదం చోటుచేసుకోగానే జయశంకర్ పారిపోగా అతనిపై పోలీసులు కేసుపెట్టారు. కన్నీరుపెట్టిన రాష్ట్ర ప్రజలు ఒకరి వివాహ వేడుక మరొకరి ప్రాణాలు తీయడం, శుభశ్రీ ఉజ్వలభవిష్యత్తు టాంకర్ చక్రాల కిందనలిగిపోవడం రాష్ట్ర ప్రజల హృదయాలను కలచివేసింది. ఇదిలా ఉండగా, న్యాయవాదులు లక్ష్మీనారాయణన్, కణ్ణదాసన్...న్యాయమూర్తులు సత్యనారాయణన్, శేషసాయిల ముందు హాజరై ఈ దారుణ ఉదంతాన్ని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా అన్నాడీఎంకే నేత జయశంకర్ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని హరించివేసిందని పేర్కొంటే కేసు నమోదు చేశారు. ప్రజల ఆస్తికి నష్టం కలిగించాడనే సెక్షన్ కింద జయశంకర్‌పై బలహీనమైన కేసును నమోదు చేశారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టాలని వారు కోరారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడంపై ఇప్పటికే పలు ఆదేశాలను జారీచేశామని అన్నారు. అయితే అధికారులు అమలు చేయడం లేదు. మానవ రక్తం పీల్చే జలగల్లా తయారయ్యారు. మద్రాసు హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. సచివాలయాన్ని హైకోర్టుకు మార్చాలనే ఆదేశాలు మినహా అన్నిరకాల ఆదేశాలు జారీచేశాం. రాజకీయ నేతల మెప్పు కోసం కార్యకర్తలు కట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు లేదా రూ.3లక్షలు నష్టపరిహారం ఇస్తున్నారేగానీ ఇలాంటి దయనీయ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం లేదు. పల్లికరణైలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతించిన పోలీసు, కార్పొరేషన్ అధికారులు న్యాయస్థానంలో హాజరుకావాలని న్యాయమూర్తులు ఆదేశించారు. చదవండి: యువతిని బలిగొన్న బ్యానర్ అన్నాడీఎంకే, డీఎంకే ఆంక్షలు పార్టీ నిర్వహించే బహిరంగ సభలు, కార్యక్రమాలకు కట్ అవుట్, బ్యానర్లు ఏర్పాటు చేసే పార్టీ నేతలు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ హెచ్చరించారు. ముగిసిన అంత్యక్రియలు ప్రమాద వార్త అన్ని మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో శుభశ్రీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరిపోయారు. పోస్టుమార్టం ముగిసిన తరువాత ఇంటికి చేరిన కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. శోకతప్త హృదయాల మధ్య శుక్రవారం సాయంత్రం శుభశ్రీ అంత్యక్రియలు ముగిసాయి. శుభశ్రీ ఫొటోల ముందు క్యాండిళ్లు వెలిగించి పలుచోట్ల ఘనంగా నివాళులర్పించారు. శుభశ్రీ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
జనసేన కార్యకర్తల అరాచకం
సాక్షి, పశ్చిమగోదావరి : వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్బీహెచ్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని మోటార్ సైకిళ్ల సైలెన్సర్లు తీసి గట్టిగా కేకలు వేస్తూ, మనుషులపైకి దూసుకెళ్తూ ర్యాలీలు నిర్వహించారు. జన సైనికులు, కార్యకర్తలు చేస్తున్న ధ్వనికాలుష్యం, ఫ్లెక్సీ ధ్వంసం వంటి కార్యక్రమాలపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీని బ్లేడ్లతో కోసి ధ్వంసం చేయడంపై మండల వైఎస్సార్సీపీ శ్రేణులు వీరవాసరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. బాధ్యులను గుర్తించి విచారణ చేపడతామని వీరవాసరం ఎస్సై బి.మహేశ్వరరావు తెలిపారు. -
ఖాకీలకు ఫైన్
గోల్కొండ: అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన గోల్కొండ పోలీసులకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. గురువారం గోల్కొండ కోట బోనాల సందర్భంగా గోల్కొండ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అమ్మవారి చిత్రంతో పాటు డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని కోట వద్ద ఏర్పాటు చేశారు. ఈ విషయం బల్దియా అధికారులకు తెలియడంతో వెంటనే డిప్యూటీ కమిషనర్ పబ్లిక్ స్థలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు గోల్కొండ ఎస్హెచ్ఓకు రూ.10 వేల జరిమానా విధించారు. -
గ్రామాల్లో రగులుతున్న ఫ్లెక్సీల రగడ
సాక్షి, బాపట్ల(గూంటూరు) : గతంలో ఎన్నడూ లేని విధంగా బాపట్ల నియోజకవర్గంలో ఫ్లెక్సీలు చించే సంస్కృతికి తెరతీశారు. డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్వహిస్తున్న గ్రామసభల్లో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లేటప్పుడు స్వాగతం పలుకుతు ఆయా గ్రామాల్లోని పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు స్వార్ధపరులు కావాలనే చింపుతూ గ్రామాల్లో రాజకీయ రగడకు చిచ్చుపెడుతున్నారు. గ్రామసభలకు ముందు రోజు కానీ, గ్రామసభల తర్వాత రోజైనా తప్పనిసరిగా ఆయా గ్రామాల్లోని ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బాపట్ల మండలంలోని హైదరపేట, గోపాపురం, కర్లపాలెం మండలంలోని చింతాయపాలెం, బుద్దాం గ్రామాల్లో ఇటీవల ఇదే రీతిలో ఫ్లెక్సీలు తొలగించారు. ఇదిలా ఉండగా తాజాగా ఆదివారం మండలంలోని పూండ్ల గ్రామంలో ఫ్లెక్సీలను చింపారని, గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశాలుండాయంటూ పూండ్ల గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐ శ్రీనివాసరెడ్డిను వివరణ కోరగా గ్రామాల్లో ఫ్లెక్సీలు తొలగిస్తున్న మాట వాస్తవమే. అయితే అవి ఆకతాయిల చేష్టలా లేక కావాలనే కొందరు వ్యక్తులు ఇలా చేస్తున్నారే అనే కోణంలో విచారిస్తున్నాం. వీటికి కారకులైన వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాం అన్నారు. -
అవే తిప్పలు!
సాక్షి,సిటీబ్యూరో: మరో వారం రోజుల్లో రుతుపవనాలు సిటీని పలకరించనున్నాయి. ఈదురుగాలులు భారీగా వీచే ప్రమాదం పొంచి ఉంది.. ఈ తరుణంలో మెట్రో రైళ్లకు భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్ వాటిపైనున్న ఫ్లెక్సీలు గండంలా పరిణమించాయి. ఈదురుగాలులు వీచిన ప్రతిసారి ఫ్లెక్సీలు ఎగిరిపోయి మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో తరచూ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఎల్భీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలో ఇలాంటివి ఏకంగా 95 భారీహోర్డింగ్‌లు, యూనిపోల్స్ మెట్రో రైళ్లకు శాపంగా మారాయి. వీటిని తొలగించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు బల్దియా అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ విషయమై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్యారడైజ్–బేగంపేట్ మార్గంలో ఓ భారీ ఫ్లెక్సీ చిరిగి మెట్రో మార్గంలోని ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడడంతో మెట్రో రైళ్లు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడిన ఫ్లెక్సీలను తొలగించడం మెట్రో రైలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. హైటెన్షన్ తీగలు కావడం ..25 కెవి విద్యుత్ ప్రసారం అవుతుండటంతో సుమారు 5 కి.మీ మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో సుమారు 20–30 నిమిషాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తోందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా రూట్లలో మెట్రో రైళ్లు తరచూ నిలిచిపోతుండడంతో ప్రయాణీకుల విలువైన సమయం సైతం వృథా అవుతుండడం గమనార్హం. అనుభవాల నుంచి పాఠాలు నేర్వని వైనం.. గతంలో తార్నాక, మెట్టుగూడా, అమీర్‌పేట్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లకున్న ఫెక్సీలు చిరిగిపోయి మెట్రో రైలు ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాలపై అధ్యయనం చేసిన మెట్రో రైలు అధికారులు సుమారు 95 భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను గుర్తించారు. వీటిని వేరొకచోటికి తరలించాలని బల్దియా అధికారులకు పలుమార్లు విన్నవించారు. అయితే సదరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైళ్ల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణీకుల విలువైన సమయం వృథా అవుతోంది. తక్షణం ఆయా రూట్లలో భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తొలగించాలని మెట్రో ప్రయాణీకులు,హెచ్ఎంఆర్ అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ సైతం వీటిని తొలగించాలని బల్దియా యంత్రాంగానికి సూచించినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. కాంబి టికెట్‌పై వీడని సందిగ్ధం... ఆర్టీసీబస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కాంబిటికెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆయా విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో కాంబిటిక్కెట్ అంశంపై నెలకొన్న సందిగ్ధం వీడడంలేదు. ఈ కాంబి టికెట్‌తో తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని..ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉండటంతో ఆర్టీసీ వర్గాలు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఏడు కోట్లు దాటిన మెట్రోప్రయాణికులు.. మెట్రో ప్రయాణీకులు ఏడు కోట్ల మార్క్‌ను దాటారు. గ్రేటర్ నగరంలో 2017 నవంబరు 29 నుంచి మెట్రో రాకపోకలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి నేటి వరకు సుమారు ఏడు కోట్ల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ప్రతివారం ఐదు వేల చొప్పున ప్రయాణికుల సంఖ్యలో పురోగతి ఉన్నట్లు పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్భీనగర్–మియాపూర్ రూట్లో నిత్యం 3 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారని తెలిపాయి. అధికారుల అంచనాల ప్రకారం ఈ రెండు రూట్లలో నిత్యం 6 లక్షలమంది రాకపోకలు సాగిస్తారని మెట్రో ప్రారంభానికి ముందు అంచనా వేయగా..అందులో సగం మార్కును దాటకపోవడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో వాణిజ్యకార్యకలాపాలు మెట్రో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి అవే తిప్పలు.. ఇక మెట్రో స్టేషన్ల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణీకులకు కష్టాలు తప్పడంలేదు. స్టేషన్లలో దిగి క్యాబ్‌లు, ఆటోల్లో ఇంటికి చేరుకునేందుకు రూ. వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రో ఛార్జీలకంటే ఈ బాదుడు రెట్టింపు స్థాయిలో ఉంది. ఉదాహరణకు ఎల్భీనగర్ నుంచి మెట్రోరైలులో మియాపూర్ మెట్రో స్టేషన్లో దిగిన వ్యక్తి అక్కడి నుంచి లింగంపల్లికి క్యాబ్‌లో బయలుదేరితే సుమారు రూ.200 చెల్లించాల్సి వస్తోంది. మెట్రో టిక్కెట్ ఛార్జీ రూ.60 కాగా..క్యాబ్ చార్జీ అంతకు మూడింతలకు పైగానే ఉండడం గమనార్హం. గతంలో మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు మెర్రీ గో అరౌండ్ బస్సులను నడపాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఆచరణలో సాధ్యపడలేదు. దీంతో సిటీజన్లకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ తిప్పలు తప్పడంలేదు. -
కమలంలో కలకలం
సికింద్రాబాద్/చిలకలగూడ: భారతీయ జనతా పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగరానికి వస్తున్న సందర్భంగా ఒక నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో నాయకుడు చించేయడం ఇందుకు కారణమైంది. ఈ వ్యవహారం పోలీసు కేసుల వరకు వెళ్లింది. అసలే అంతంతమాత్రం కేడర్ కలిగిన పార్టీలో ఉన్న కొద్దిపాటి నాయకులు బజారున పడి ఫ్లెక్సీలు చించుకోవడం పట్ల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలిసారి నగరానికి వస్తున్న సందర్భంగా చిలకలగూడ కూడలి నుంచి వారాసీగూడ వరకు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన బండపల్లి సతీష్‌కుమార్ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సదరు ఫ్లెక్సీల్లో తన ఫొటో లేదన్న కారణంగా సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి రవిప్రసాద్‌గౌడ్, అతడి కుమారుడు సాయిగౌడ్ ఫ్లెక్సీలను కొడవళ్లతో చించేశారని బండపెల్లి సతీష్ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన అంతు తేలుస్తానని రవిప్రసాద్ బెదిరించినట్లు సతీష్ ఆరోపించారు. సాంకేతిక కారణాలతో అతడి ఫొటోను ఫ్లెక్సీలో పెట్టలేకపోయామని అంతమాత్రాన ఫ్లెక్సీలను చించివేయడం తగదన్నారు. కాగా గత ఎన్నికల్లో బండపెల్లి సతీష్‌కు పూర్తి సహకారం అందించానని రవిప్రసాద్‌గౌడ్ పేర్కొన్నాడు. సీనియర్ నాయకుడైన తన ఫొటోను ఫ్లెక్సీలో లేనందునే వాటిని చించివేసినట్లు తెలిపారు. తన ఇల్లు, కార్యాలయం ముందు తన ఫొటోలు లేని ఫ్లెక్సీలను కట్టిన బండపల్లి సతీష్ అనుచరులు తమను రెచ్చగొడుతున్నారన్నారు. బండపెల్లి సతీష్ ఫిర్యాదు మేరకు రవిప్రసాద్‌గౌడ్, సాయిప్రసాద్‌గౌడ్, సందీప్, ఉపేందర్‌లపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి తెలిపారు. -
మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లకు ఫ్లెక్సీలు గండంగా మారాయి. తరచూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈదురుగాలులు వీచినప్పుడు ఫ్లెక్సీలు ఎగిరిపోయి మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఇందుకు కారణమవుతున్న భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్ ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్ సీటీ రూట్లలో ఏకంగా 95 ఉన్నాయి. వీటిని తొలగించాలని హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) అధికారులు ఇప్పటికే పలుమార్లు జీహెచ్ఎంసీకి విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తరలించే విషయంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆదివారం ఈదురు గాలులకు ఓ భారీ ఫ్లెక్సీ ఎగిరొచ్చి ప్యారడైజ్ – బేగంపేట్ మార్గంలోని మెట్రో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడింది. దీంతో మెట్రో రైళ్లు 20 నిమిషాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతున్న ఫ్లెక్సీలను తొలగించడం మెట్రో రైలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇవి హైటెన్షన్ (25 కేవీ) తీగలు కావడంతో దాదాపు 5 కి.మీ మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి వస్తోంది. 20–30 నిమిషాలు శ్రమించి ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తరచూ జరుగుతుండడంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలోనూ... గతంలో తార్నాక, మెట్టుగూడ, అమీర్‌పేట్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లకు ఉన్న ఫ్లెక్సీలు చిరిగిపోయి మెట్రో రైలు ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాలపై అధ్యయనం చేసిన మెట్రో రైలు అధికారులు సుమారు 95 భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను గుర్తించారు. వీటిని వేరొ చోటుకు తరలించాలని బల్దియా అధికారులకు విన్నవిస్తూ లేఖలు రాశారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటికి స్పందించలేదు. దీంతో తరచూ మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతోంది. తక్షణం ఆయా రూట్లలో భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తొలగించాలని ప్రయాణికులు, హెచ్ఎంఆర్ అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పని చేసిన కేటీఆర్ సైతంవీటిని తొలగించాలని బల్దియా యంత్రాంగానికి సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంగమనార్హం. -
అమలు కాని ఎన్నికల కోడ్
సాక్షి, చాట్రాయి: ఎన్నికల కోడ్ సందర్భంగా గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు, బోర్డులు తొలగించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు అధికారులకు కానరావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ ప«థకాలకు సంబంధించిన బోర్డులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రుల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. చాలా గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్ల సమాచారం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు పసుపు రంగు వేశారు. ఆ రోడ్లు స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేయడం, వేసిన పసుపు రంగు టీడీపీకీ చెందడంతో ఆ రంగును తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఫ్లెక్సీలు కళకళ.. కోడ్ వెలవెల!
సాక్షి, కోనాయపాలెం (చందర్లపాడు) : ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 11న ఎలక్షన్స్ జరగనున్నాయి. అయినప్పటికీ కోనాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్ ఇంటి ముందు పింఛన్లు, సంక్రాంతి కానుకలతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. హరిజనవాడలోని వాటర్ ట్యాంకు వద్ద, అంగన్వాడీ కేంద్రం వద్ద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల వివరాల జాబితాను రాశారు. ఎలిమెంటరీ పాఠశాల (చిన్నైస్కూల్) వద్ద చంద్రబాబు, లోకేష్ బొమ్మలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రచార పట్టికలు దర్శనమిస్తున్నాయి. ఇవి గ్రామంలోని జనసమర్థం ఉండే ప్రధాన రహదారుల వెంబడి ఉన్నప్పటికీ అధికారులు వీటిని తొలగించలేదు. ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని తొలగించని పక్షంలో సంబంధిత అధికారులపై ఎలక్షన్ కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. మరి వీటిని తొలగిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది. తోటరావులపాడులో ఇలా.. తోటరావులపాడు గ్రామ ఎంట్రన్స్‌లో హైస్కూల్‌కు వెళ్లే ప్రధాన మార్గానికి ఎన్టీర్ మార్గ్ పేరు పెట్టి పెద్ద ఆర్చిని నిర్మించారు. ఈ ఆర్చికి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోల డూమ్‌లలో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. ఏటూరు గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారి వెంబడే ఈ ఆర్చి ఉండటం విశేషం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ అధికారులు ఈ ఆర్చికి అమర్చిన టీడీపీ నాయకుల ఫొటోలు కనపడకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. -
కోడ్ కూసినా తొలగని బాబు చిత్రాలు!
సాక్షి, కావలి: నియోజకవర్గంలో చంద్రబాబు చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు . ఆదివారం సాయంత్రం నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినా అధికారులు తొలగించలేదు. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ప్రకటించినప్పటికీ, కావలిలోని అధికారులు మాత్రం సోమవారం సాయంత్రానికి కూడా టీడీపీ నాయకుల సేవల్లో ఉంటూ నిద్రమత్తు వీడలేదు. బాహాటంగా కనిపిస్తున్న చంద్రబాబు చిత్రాలతో కూడిన హోర్డింగ్‌లను తొలిగించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో అసలు కావలిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తేలా పరిస్థితులు ఉన్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కావలి రెవెన్యూ డివిజన్‌కు మొట్టమొదటిసారి ఐఏఎస్ అధికారి చామకూరు శ్రీధర్‌ను సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆయన కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద, ఆయన నివాసం ఉండే బంగ్లా ఎదురుగానే చంద్రబాబు హోర్డింగ్‌లు ఉన్నప్పటికీ వాటిని తొలిగించలేదు. ఐఏఎస్‌కు ఎంపికై మొట్టమొదటి పోస్టింగ్‌గా కావలి సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చామకూరు శ్రీధర్ వ్యవహారశైలిపై తొలి నుంచి కూడా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నియోజకరవర్గం సంగతి పక్కన పెడితే ఆయన కార్యాలయంతో పాటు ఆయన చుట్టూ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా చంద్రబాబు హోర్డింగ్‌లు ఉన్నప్పటికీ వాటిని తొలిగించే పని చేయకపోవడం పట్ల అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. -
కోడ్ కూత వినబడలేదా.!
సాక్షి ప్రతినిధి కడప: ఆదివారం సాయంత్రమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులంతా ఎన్నికల కమిషన్ నియమావళికి లోబడి విధి నిర్వహణ చేపట్టాలి. ఇకపై ఎన్నికలు ముగిసే వరకూ ప్రతి అడుగు నియమావళికి అనుగుణంగా ఉండాలి. కాగా ఎన్నికల కమిషన్‌కు దీటుగా జిల్లా యంత్రాంగం స్పీడు అందుకోలేకుంది. జిల్లా కేంద్రంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ ప్రచార హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. కేవలం ఓటర్లను ప్రలోభపర్చేందుకు ఏర్పాటు చేసినట్లుగా కన్పిస్తున్న హోర్డింగ్‌లు అలాగే తిష్ట వేశాయి. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, నాగరాజుపేట, అప్సర సర్కిల్, పాతబస్టాండ్, ఏడు రోడ్ల సర్కిల్ ఇలా నగరమంతా హోర్డింగ్‌లు హోరెత్తుతున్నాయి. తక్షణమే వాటిని తొలగించాల్సిన యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలే చేపట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలోనే కోడ్ అమలు తీరు ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు. -
యథేచ్ఛగా టీడీపీ కోడ్ ఉల్లంఘన
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదనే విమర్శలొస్తు న్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆదివారం నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చి చేరింది. అయితే అధికారులు ఇంకా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ప్రభుత్వ ప్రచార ప్రకటనల్లో సీఎం, మంత్రుల ఫొటోలు తొలగించాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంకా సీఎం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు దర్శనమి స్తున్నాయి. నిబంధనల మేరకు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాల్సి ఉంది. ఇతర పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగు వేస్తున్న అధికారులు.. ‘అధికార’ పార్టీ నేతల విగ్రహాలకు మినహాయింపు ఇస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగింపు సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీ నేతల ఫ్లెక్సీలను తొలగించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లను ఎమ్మెల్సీ కోడ్ వచ్చిన వెంటనే తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ గాంధీ, అంబేడ్కర్, రాష్ట్రపతి, గవర్నర్ ఫొటోలను మాత్రమే ఉంచి.. సీఎం, మంత్రి తదితరుల ఫొటోలను తొలగించాలి. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఫొటోలు దర్శనమిస్తుండడం గమనార్హం. అన్న క్యాంటీన్లలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను తొలగించే ధైర్యం అధికారులకు లేకపోయింది. మంత్రి ఆనందబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘన నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలకు సంబంధించిన పనిముట్లను లబ్ధిదారులకు అందజేయకూడదు. అయితే మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి గుంటూరు జిల్లా యడవూరు మండలంలోని పదిహేను గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆదివారం రాత్రే కుట్టు మిషన్లను పంపిణీ చేయించారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున మంత్రి నక్కా ఆనందబాబుకు ఓటెయ్యాలని హామీ తీసుకున్నారు. రోడ్ల నిర్మాణం.. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు చేసేస్తున్నారు.ప్రభుత్వ పథకాలకు చెందిన హోర్డింగులు, స్టిక్కర్లు ఎప్పటిలాగే దర్శనమిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి–గోవిందపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరుకు సంబంధించి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీని అభినందిస్తూ టీడీపీ నేతలు సోమవారం సభ ఏర్పాటు చేశారు. పలాస ఎమ్మెల్యే శివాజీ కుమార్తె గౌతు శిరీష, ఆయన అల్లుడు వెంకన్న చౌదరి దర్జాగా సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చారు. కోటబొమ్మాళి మండలం కొత్తపేట కొండ పోరంబోకు స్థలంలో టీడీపీకి చెందిన కార్యకర్తలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా పాత తేదీలతో పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేశారని కొత్తపేట మాజీ సర్పంచి ఆర్.ముకుందరెడ్డి టెక్కలి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వీరఘట్టం మండలంలో ‘బడికొస్తా’ పథకంలో భాగంగా 8, 9వ తరగతులు చదువుతున్న బాలికలకు గతంలో అందించాల్సిన సైకిళ్లను సోమవారం పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో .. తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారపార్టీ నాయకుల సిఫార్సు లేఖలకు అధికార యంత్రాంగం దర్శనాలు కల్పిస్తోంది. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు తొలగించలేదు. ఇక ఫైబర్‌నెట్ కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి చిత్ర పటాలతో ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇంకా తీయలేదు. తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. మీకెందుకు సార్.. ‘పచ్చ’పాతం.. రాజమహేంద్రవరం నగరంలోని జాంపేట వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పార్టీ బ్యానర్లపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రాలు ఉన్నాయంటూ బ్యానర్లు తొలగించాలని హడావుడి చేసిన అధికారులు.. టీడీపీ కార్యాలయం వద్ద స్వామి భక్తి ప్రదర్శించారు. అక్కడ సీఎం చంద్రబాబు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫొటోలు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకపోవడంపై జనం మండిపడుతున్నారు. టీడీపీ కార్యాలయంపైన చంద్రబాబు, గోరంట్ల ఫొటోలున్నా పట్టించుకోని అధికారులు ఏ అధికారీ పట్టించు‘కోడ్’.. కాకినాడ నగరంలోని జగన్నాథపురం వంతెన దిగువ భాగంలో ప్రభుత్వం బీసీ కులస్తులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా కాకినాడ నగరపాలక అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. కర్నూలు జిల్లాలో.. ఆత్మకూరు పట్టణంలో టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ పేదలను పిలిపించుకుని స్థానిక మైనార్టీ కాలనీలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ భరత్‌కుమార్ అక్కడికి వెళ్లేలోపు అందరూ జారుకున్నారు. వెల్దుర్తి మండలం రామళ్లకోటలో సీబీఎన్ ఆర్మీ పేరుతో వాహనాలు వినియోగించి ప్రచారం చేపట్టారు. కొలిమిగుండ్లలో చెత్తబుట్టలు పంపిణీ చేసి..పట్టపగలే కోడ్ ఉల్లంఘించారు. -
టీడీపీ ప్రచారార్భాటం.. ప్రజలపైనే భారం
పశ్చిమగోదావరి , భీమవరం: అధికార పార్టీ ఆర్భాట ప్రచారం పట్ట ణాలు, గ్రామాల్లో మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రాణసంకటంగా మారింది. విచ్చల విడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీటిని తొలగించాల్సిన బాధ్యత సిబ్బందిపై పడింది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బంది ప్రజావసరాలు తీర్చే పనులను పక్కన పెట్టి ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించే చర్యలు చేపట్టారు. అడుగడుగునా అధికార పార్టీ ఫ్లెక్సీలు టీడీపీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రజలను ఆకట్టుకోవడానికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో తెలుగుతమ్ముళ్లు తామేమీ తక్కువ కాదంటూ పుట్టినరోజులు, పండుగల పేరుతో పట్టణాలు, గ్రామాల్లో అడుగడుగునా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. దీనిలో భాగంగా ఇతరులు తమతో పోటీ పడకుండా ఉండడానికి ఇతర నాయకులు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. దీనిలో భాగంగానే పాలకొల్లు పట్టణంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకున్నారంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. ఒక్క పాలకొల్లులోనే కాకుండా ఇటువంటి వివాదాలు జిల్లా వ్యాప్తంగా అనేకం చోటుచేసుకున్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి పన్ను చెల్లించకుండా ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నాయకుల మన్ననలు పొందేం దుకు పాకులాడుతున్నారు. విచ్చలవిడిగా ప్రధాన కూడళ్లు, రోడ్లు వెంబడి,రోడ్డు మలుపుల్లోను ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడడంతో ఎదరు వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తొలగింపు భారం ప్రజలపైనే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, చోటా మోటా నాయకులు తమ అవసరాలకు, ఆర్భాటాలు, పేరు ప్రతిష్టల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా పూర్తిగా తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రెండు రోజులుగా మునిసిపల్, పంచాయతీ సిబ్బంది ఇతర పనులను పక్కన పెట్టి మరీ వీటిని తొలగించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అలాగే కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. తొలగించిన ఫెక్సీలు, బ్యానర్లను తరలించడానికి మునిసిపాల్టీలు ,పంచాయతీలు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. ప్రజల అవసరాలు తీర్చాల్సిన సిబ్బంది రాజకీయ నాయకుల ఆర్భాటాల కోసం ఏర్పాటుచేసినవాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసే వారి నుంచే ఖర్చును రాబట్టే చర్యలు తీసుకుంటే ఇష్టారాజ్యంగా కట్టేవారు అదుపులో ఉంటారని, అలా కాకుండా ప్రభుత్వ సిబ్బంది తొలగించడం వల్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు తిరిగి దర్శనమిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బందికి ప్రాణ సంకటం ఫ్లెక్సీలను విద్యుత్ తీగల దగ్గర, కాలువలు, డ్రెయిన్లు వెంబడి ఎతైన ప్రదేశాల్లోను ఏర్పాటు చేయడంతో వాటిని తొలగించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్లెక్సీలకు ఐరన్ గొట్టాలు వాడడం వల్ల పొరపాటున విద్యుత్ తీగలపై పడితే పెను ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ ఫ్లెక్సీలను ఎతైన ప్రాంతం నుంచి కిందకు దించడం, కాలువలు, డ్రెయిన్ల పక్కన తొలగించే సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. -
ప్రాణం తీసిన ఫ్లెక్సీ
శ్రీకాకుళం, పాలకొండ: ఆ కుటుంబానికి ఒక్కడే కుమారుడు.. డిగ్రీ వరకూ చదువుకుని స్వయం ఉపాధి పొందుతూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ప్రతి రోజు గ్రామం నుంచి పాలకొండ వచ్చి నెట్ సెంటర్ నడుపుతూ అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. సరదాగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఫ్లెక్సీ తీరని శోకం మిగిల్చింది. చేతికి అందుకు వచ్చిన కుమారుడ్ని కాటికి తీసుకుపోయింది. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోటదుర్గమ్మ ఆలయం వద్ద గురువారం మధ్యాహ్నం విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన చందక వెంకటరావు, గౌరీశ్వరిల కుమారుడు చందక జగదీష్(30) డిగ్రీ చదువుకుని ఉపాధి కోసం కోటదుర్గమ్మ ఆలయం సమీపంలో మేడపై ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం షాపు వచ్చి పనులు చేసుకుంటున్నాడు. షాపునకు అడ్డంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు సిద్ధమయ్యాడు. అదే గ్రామానికి చెందిన స్నేహితుడు లావేటి ప్రసాద్ సహాయంతో ఫ్లెక్సీని తొలగిస్తుండగా పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ జగదీష్‌కు తాకింది. దీంతో అక్కడికి అక్కడే మేడపైన పడి మృతిచెందాడు. జగదీష్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ప్రసాద్‌ను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి ఎడమ చేయి వేళ్లు కాలిపోయి, వీపుపై బలమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జగదీష్ మృతదేహాన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రవీంద్రకుమార్ పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహం అప్పగించారు. ఎస్సై వాసునారాయణ కేసు నమోదు చేశారు. ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీల ఏర్పాటు.. నగర పంచాయతీలో ఫ్లెక్సీలను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు అయితే షాపులు, విగ్రహాలను కప్పి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కోటదుర్గమ్మ ఆలయం కూడా కనిపించకుండా బ్యానర్లు కడుతున్నారు. దీంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
శునకం కోసం..
టీ.నగర్ ,చెన్నై: కనిపించకుండా పోయిన శునకం ఆచూ కీ తెలపాలంటూ యజమాని ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించాడు. కోయంబత్తూరు వడవల్లికి చెందిన దీపక్ (45) వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఆరు నెలలుగా శునకాన్ని పెంచుకుంటూ వచ్చాడు. శునకం గత జనవరి 24 నుంచి కనిపించకుండా పోయింది. అనేక చోట్ల గాలించినా ఫలితం లేదు. దీపక్ ప్రస్తుతం దీని ఆచూకీ కోసం నగరమంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఒక టెంపోలో శునకం ఫొటోతో కూడిన ఫ్లెక్సీ నగరమంతటా సంచరిస్తోంది. శునకం ఆచూకీ తెలిపిన వారికి నగదు అందజేయనున్నట్లు దీపక్ తెలిపాడు. -
ఫ్లెక్సీలతో డేంజర్!
సాక్షి, సిటీబ్యూరో: అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఫ్లెక్సీల వెనక పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఏర్పడుతున్న ముప్పు ఆందోళన కలిగిస్తోంది. మహానగరం పరిధిలో వేలాదిగా ఉన్న హోర్డింగ్‌లతోపాటు, వివాహాది శుభకార్యాలకు సైతం పాలీ వినైల్ క్లోరైడ్(పీవీసీ)తో తయారుచేసిన బ్యానర్లు ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. అయితే వీటిని తరచూ మార్చేసమయంలో పీవీసీ ఫ్లెక్సీల వ్యర్థాలను సాధారణ చెత్తతోపాటు పడవేసి ఆరుబయట తగులబెడుతుండడంతోనే అనర్థాలు తలెత్తుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగలో కేన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెన్స్, డయాక్సీన్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గాలిలో చేరి పీల్చే గాలిని కలుషితం చేస్తుండడం అనర్థాలు తెచ్చిపెడుతోంది. మహానగరం పరిధిలో నిత్యం సుమారు 4800 టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పన్నమౌతుండగా..ఇందులోసుమారు 300 టన్నుల వరకు ఇలాంటి వ్యర్థాలున్నట్లు పీసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమ్మో పీవీసీ ఫ్లెక్సీలు.. గ్రేటర్ పరిధిలో పలు బహుళజాతి, వాణిజ్య సంస్థలు, దేశీయ కంపెనీలు, వినియోగ, విలాస వస్తువులకు చెందిన వాణిజ్య ప్రకటనలు అందరికీ కనిపించేలా ప్రదర్శించేందుకు వేలాదిగా హోర్డింగ్లున్నాయి. వీటన్నింటికీ జీహెచ్ఎంసీ నుంచి అనుమతులున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా..వీటిపై వాణిజ్య ప్రకటనల నిమిత్తం అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా అధిక గాఢత కలిగిన రంగులు, పాలీవినైల్ క్లోరైడ్స్(పీవీసీ)తో చేసిన ఫ్లెక్సీలను వినియోగిస్తున్నారు. వీటి ఆకర్షణ తగ్గకుండా వీటిని ప్రతీనెలా మార్చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సాధారణ చెత్తతోపాటే పడవేస్తుండడంతోపాటు డంపింగ్‌యార్డులు, బహిరంగ ప్రదేశాల్లో వేసి తగులబెడుతున్నారు. వీటి నుంచి వెలువడుతోన్న విషవాయువులు పర్యావరణంలో కలుస్తున్నాయి. ఈ వాయువులను పీల్చినవారి కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడంతోపాటు నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధుల బారినపడుతున్నారు. ఈ పరిణామం దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో కేన్సర్‌కు కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరు ఆదర్శం.. పీవీసీ ఫ్లెక్సీల స్థానంలో కాగితం, బట్ట(క్లాత్)తో తయారుచేసిన ఫ్లెక్సీలను వినియోగిస్తూ బెంగళూరు మహానగరం దేశంలోని పలు సిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రేటర్ పరిధిలోనూ ఇదే స్ఫూర్తితో ఇలాంటి విధానాన్ని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో నగర పర్యావరణానికి మేలుజరగడంతోపాటు..సిటీజన్లు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడినవారవుతారని స్పష్టంచేస్తున్నారు. నిత్యజీవితంలో ఉపయోగించేపలు వస్తువులు విచ్ఛిన్నం అయితేలికగా పర్యావరణంలో కలిసేందుకు పట్టే సమయం ఇలా... వస్తువు పట్టే సమయం ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, 200–1000 ఏళ్లు పీవీసీఫ్లెక్సీలు పేపర్ బ్యాగ్ ఒకనెల కాటన్సంచి 3 నెలలు ఫ్లైఉడ్ 13 ఏళ్లు పాలకార్టన్స్ 5 ఏళ్లు కార్డ్బోర్డ్ 2 నెలలు వార్తాపత్రికలు 1.5 నెలలు సిగరెట్ పెట్టె 10–12 ఏళ్లు లెదర్షూజ్ 25–40 ఏళ్లు పలుచటి స్టీల్క్యాన్ 50 ఏళ్లు రబ్బర్బూట్ సోల్ 50–80 ఏళ్లు అల్యూమినియం క్యాన్ 200–500 ఏళ్లు -
‘ప్రజల సొమ్ముతో బాబు సోకులు పడుతున్నాడు’
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. మోదీ సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎంపీ పైడికొండల మాణిక్యాల రావు ధ్వజమెత్తారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా, రాష్ట్రవ్యాప్తంగా ‘నో ఎంట్రీ మోదీ’, ‘గో బ్యాక్ మోదీ’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సభను అడ్డుకోవడానికి చంద్రబాబు ఆర్టీసీ, ఆటో యూనియన్లను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 11న ఢిల్లీలో చంద్రబాబు చేయబోయే ధర్మపోరాట దీక్షకు జనాలను తరలించడానికి.. ఇప్పటికే రెండు రైళ్లకు రూ.1.12 కోట్లు మంజూరు చేశారని మండిపడ్డారు. ప్రజా ధనంతో ఆర్టీసీ ద్వారా 7 నక్షత్రాల బస్సు కొనిపించుకున్న చంద్రబాబు.. సామన్య బస్సుగా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టార్జితంతో చంద్రబాబు సోకులు పడుతున్నారంటూ విమర్శించారు. -
ఫ్లెక్సీల రగడ....
తిరుపతి రూరల్/ చంద్రగిరి: ఫ్లెక్సీల రగడ పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతోంది. అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగిం చాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా, కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఫలితంగా పల్లెల్లో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. ఫ్లెక్సీల రగడతో సీఎం సొంత మండలంలో ఉండగానే టీడీపీ నేత పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయారు. పార్టీ ఫ్లెక్సీలను కట్టారంటూ చిత్తూరు నుంచి రెండు సుమోల్లో వచ్చిన రౌడీలు వృద్ధుడిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మండల పరిధిలోని ముంగళిపట్టులో జరిగింది. బాధితుడి వివరాల మేరకు... దివంగత వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, జగనన్న ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితుౖడై ముంగళిపట్టుకు చెందిన దామోదర నాయుడు సంక్రాంతి సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన హేమాంబర్ నాయుడు సోమవారం రాత్రి పాల కేంద్రం వద్దకు వెళ్తున్న దామోదర నాయుడును దుర్భాషలాడాడు. ఫ్లెక్సీలను తీసివేయాలని హెచ్చరించి, బెదిరించాడు. దాంతో హేమాంబర్ నాయుడుతోపాటు అతని బావమరిది, మరికొంత మంది దామోదర్ నాయుడు ఇంటికి వెళ్లి బెదిరించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో దామోదర్ నాయుడు పొలం వద్దకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రెండు సుమోల్లో రౌడీలను తీసుకొచ్చి, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రయాణికులు అడ్డుకోకుంటే... ప్రాణాలు తీసేవాళ్లే సుమారు 15 మందితో కూడిన రౌడీ మూక దామోదర నాయుడుపై పడి, కర్రలతో తీవ్రంగా దాడి చేసింది. ఒకే వ్యక్తిని అంత మంది కలసి దాడి చేస్తున్న వైనాన్ని అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు చేరుకుని అడ్డుకోవడంతో దామోదర నాయుడును వదిలేసి పారిపోయారు. ప్రయాణికులే అక్కడికి రాకుంటే దామోదర నాయుడును అంతమొందించేవారని, వారే తన ప్రాణాలు కాపాడారని దామోదర నాయుడు తెలిపాడు. గాయపడిన దామోదర నాయుడును పోలీసులు చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు నుంచి రౌడీలు... దామోదర నాయుడును అంతమొందించాలనే వ్యూహంతో నాని అనుచరులు చిత్తూరు నుంచి ముంగలిపట్టుకు చేరుకున్నారు. అదే గ్రామంలోని స్థానిక టీడీపీ నాయకుల అండగా ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాడి విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న దామోదర నాయుడును పరామర్శించారు. ‘ఫ్లెక్సీలు తీయనన్నందుకు చావబాదారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని’ దామోదర నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ ఎమ్మెల్యేకు తమ గోడు వెల్లబోసుకున్నారు. న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటామని బాధితులకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అనంతరం వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రెండు ఎముకలు విరిగినట్లు గుర్తించారు. ఆయనను ఆస్పత్రి సిబ్బంది 108లో తిరుపతి రుయాకు తరలించారు. -
ముదురుతున్న కేసీఆర్ ఫ్లెక్సీ వివాదం
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం బస్టాండ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైన కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అంశం వివాదంగా మారుతోంది. అనుమతి లేదంటూ ఫ్లెక్సీని హఠాత్తుగా తొలగించారు. ఫ్లెక్సీ తొలగింపు సమయంలో పోలీసులు, కొందరు మునిసిపల్ సిబ్బంది, ఇద్దరు అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఆర్టీసీ డీఎం కూడా దగ్గరన్నట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన ఫ్లెక్సీలను అలాగే ఉంచి ఒక్క ఈ ఫ్లెక్సీనే ఎందుకు తొలగించారని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారు నిలదీయడంతో వివాదం పెద్దదవుతోంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మరునాడు బుధవారం బస్టాండ్ సెంటర్లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, హైదరాబాద్ సెటిలర్ అయిన సీహెచ్ చినరెడ్డప్ప ధవేజీ, అతని స్నేహితులు మేడిద రాము, బుడితి అనిల్ కలసి తెలంగాణ బాహుబలి కేసీఆర్‌కు శుభాకాంక్షలు అని స్లోగన్ ఇస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ జనాన్ని బాగా ఆకర్షించింది. అయితే పోలీసులు వచ్చి ఎస్సై ఫ్లెక్సీ తీయించారని మేడిది రాము తెలిపారు. అయితే టౌన్ ఎస్సై మాత్రం ఫ్లెక్సీ మేం తీయించలేదని, మాకు సంబందం లేదని అంటున్నారు. మునిసిపల్ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. దీంతో ఈ అంశం వివాదంగా మారింది. ఇబ్బందికరంగా ఉండటం, ప్రజల నుంచి స్పందన రావడంతో టీడీపీ పెద్దలే తీయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రెడ్డప్ప ధవేజీ మాట్లాడుతూ గతంలో మాయావతి ఫ్లెక్సీలు పెట్టారని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్టారన్నారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నించారు. మునిసిపాలిటీ అనుమతి తీసుకుని మళ్లీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామన్నారు. తామేమీ ఎవరినీ కించరుస్తూ ఫ్లెక్సీ పెట్టలేదన్నారు. కేవలం శుభాకాంక్షలు మాత్రమే చెప్పామని అందులో తప్పేముందని ప్రశ్నించారు. -
ఫ్లెక్సీల వివాదం... వినికిడి కోల్పోయిన దళితుడు
చిత్తూరు , తిరుపతి రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. చట్టాలు కఠినంగా ఉన్నా అధికారానికి తొత్తులుగా మారిన అధికారుల నిర్లక్ష్యం వల్ల చట్టాలు సైతం అభాసుపాలౌతున్నాయి. చివరకు పల్లెల్లో ప్రశాంతత కరువౌతోంది. సోదరులుగా ఉన్న పల్లె వాసులు ఫ్లెక్సీల మహమ్మారి వల్ల స్టేషన్లు్ల, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎదురౌతోంది. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు దళితుడైన పుట్టా రవిపై పులివర్తి నాని అనుచరులు హత్యాయత్నం చేయడంతో అతను వినికిడి శక్తిని కోల్పోయాడు. జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీలను నిషేధించాలనే కలెక్టర్ ఆశయానికి సైతం కింది స్థాయి అధికారులు గండికొడుతున్నారు. వినికిడి కోల్పోయిన దళితుడు.. దీపావళి సందర్భంగా చంద్రగిరి మండలం మొరవపల్లిలో పార్టీలకు అతీతంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే హరిజనవాడకు చెందిన దళితుడు పుట్టా రవి సైతం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. తమను ఎదిరించి ఫ్లెక్సీలు కడతావా? అంటూ కులం పేరుతో పులివర్తి నాని అనుచరులు 15 రోజుల క్రితం రవిపై హత్యాయత్నం చేశారు. అతను వెళ్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టారు. కిందపడిపోగానే కర్రలతో దాడి చేశారు. దాడిలో రవి చెవిపై కర్రతో బలంగా కొట్టారు. చావు బతుకుల్లో ఉన్న అతనిని దారినపోయే ప్రయాణికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. గాయాలతో పాటు చెవికి బలంగా తగలడంతో కర్ణభేరి పగిలిపోయింది. రవి వినికిడి శక్తిని కోల్పోయాడు. తిరుపతిలో చికిత్స పొందుతున్న అతనికి రెండు రోజుల్లో అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. నిందితులపై చర్యలు ఏవీ? రవిని కులం పేరుతో దూషించడమే కాకుండా దాడితో హత్యాయత్నానకి పాల్పడిన పులివర్తి నాని అనుచరులు కాశింపెంట్ల మాజీ సర్పంచ్ గాలి సతీష్‌నాయుడు, కొమ్మినేని గిరి, శివ, పట్టాభిలపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. దాడి జరిగి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. తన కుమారుడికి వినికిడి శక్తి పోవటానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రవి తల్లి రమక్క డిమాండ్ చేస్తున్నారు. -
హంగులు.. ఆర్భాటాలు
సాక్షి, కల్వకుర్తి టౌన్ : చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానంలో ఓటింగ్ ప్రధానమైంది. మారుతున్న కాలానికి అణుగుణంగా ఓటింగ్ విధానంలోనూ మార్పు సంతరించుకుంది. ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నూతన ఒరవడికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు ఉపయోగించగా ఇటీవల కాలంలో ఈవీఎంలు వినియోగాన్ని ఎన్నికల సంఘం పెంచింది. ఈసారి ఎన్నికల్లో ఓటు కచ్చితత్వాన్ని ఓటరు తెలుసుకునేలా నూతనంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాలను ఎన్నికల సంఘం తెలంగాణలో వినయోగిస్తోంది. 1950లో ఎన్నికల సంఘం ఏర్పాటు దేశంలో ఎన్నికలు సజావుగా, నిష్పపక్షపాతంగా నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ద సంస్ధ భారత ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటుచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాతీయ ఎన్నికల కమిషన్‌లో భాగమే. రాజకీయ పార్టీ గుర్తింపు, రద్దు, ఎన్నికల ప్రణాళిక, ప్రవర్తనా నియామవళి రూపకల్పన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ అంతా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటుంది. ఈ మేరకు దేశంలో మొదటి సారిగా ఎన్నికలు 1951వ సంవత్సరంలో జరగగా ప్రజలు ఓటు వేసేందుకు బ్యాలెట్ విధానం అమలులో ఉండేది. ముద్రించిన బ్యాలెట్ పేపరుపై ఏ అభ్యర్ధిని ఎన్నుకుంటామో ఆ అభ్యర్థి గుర్తుపై ముద్ర వేసి బ్యాలెట్ బాక్స్‌లో వేసేవారు. ఆ తర్వాత నూతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా 2004 నుంచి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంపై ఆరోపణలు రావటంతో ప్రస్తుతం రాబోయే ఎన్నికలలో ఈవీఎంలతో పాటుగా వీవీ ప్యాట్లను వినియోగిస్తోంది. రిగ్గింగ్‌కు చెల్లిన కాలం భారతదేశంలో మొదటిసారి నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను వినియోగించారు. ఈ విధానంలో అభ్యర్ధుల పేర్లు, పార్టీ గుర్తుతో ముద్రించిన పేపర్లు వాడేవారు. వాటిపై ఓటరుకు వచ్చిన అభ్యర్థి గుర్తు వద్ద స్టాంప్ చేసి ఆ బ్యాలెట్ పేపరును బ్యాలెట్ బాక్సులో వేసేవారు. ఓటింగ్ పక్రియ పూర్తయిన అనంతరం పేపర్ల(ఓట్ల)లెక్కింపు ఉండేది. ఈ విధానంలో రిగ్గింగ్‌కు ఎక్కువ అవకాశం ఉండేది. దొంగ ఓట్లు ఎక్కువగా పోలయ్యేవి. 1999 ఎన్నికలలో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. ఈవీఎంలు 2004 తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్ల ఓటింగ్ కోసం బ్యాలెట్ బాక్స్‌ల స్ధానంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు అమలులోకి వచ్చాయి. అంతకుముందు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఇక్కడ ఈ విధానం అమలు సఫలం కావటంతో 2004 నుంచి అన్ని చోట్ల ఈవీఎం ఓటింగ్ విధానం అమలులోకి వచ్చింది. దీని వలన బ్యాలెట్ పత్రాల ముద్రణ వలన జరిగే కాగితం వాడకం అరికట్టినట్లయ్యంది. ఈవీఎంలను భారత్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వరంగ సంస్ధలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా వ్యవస్ధ లేని చోట కూడా బ్యాటరీ సాయంతో పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. ఒక్కో ఈవీఎంలో 1400 లోపు మంది ఓటర్లు ఓట్లు వేయొచ్చు. పోటీలో 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలను వాడతారు. లేనిపక్షంలో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తారు. వీవీ ప్యాట్లు రాష్ట్రంలో వచ్చే నెల 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఈవీఎంలతో పాటుగగా వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించునున్నారు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరుగుతోందని.. ఏ పార్టీకి ఓటు వేసిన అధికార పార్టీకే పడుతోందని కొన్ని రాజీకయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను వినయోగింలోకి తీసుకొస్తున్నారు. ఈ యంత్రం ద్వారా అభ్యర్థి ఎవరికి ఓటు వేశారో ఏడు సెకన్ల పాటు డిస్ప్లే కనిపిస్తుంది. మారుతున్న ప్రచార సరళి ఎన్నికల్లో అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం, గోడలపై రాతలతో మొదలు పార్టీ కండువాలు, టోపీలు, జెండాలు, కరపత్రాలు, వాహనాలకు మైక్సెట్లతో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో గోడలపై రాతలు ఎక్కువగా కనిపించేవి. దీంతో పెయింటింగ్ కళాకారులకు చేతినిండా పని ఉండేది. సత్తు రేకుపై అభ్యర్థి పేరు గుర్తుతో అచ్చువేయించి, వాటిని గోడలపై అచ్చువేయటం ద్వారా పెయింటింగ్ చేయించాల్సిన అవసరం ఉండేది కాదు. పార్టీ కార్యాలయం భవనంపై తమ పార్టీ గుర్తులను ఏర్పాటు చేసి దానికి లైటింగ్ ఏర్పాటు చేసేవారు. పార్టీ చెండాలు పట్టుకొని అభ్యర్ధుల వెంట పార్టీ కార్యకర్తలు తిరగేవారు. నేటి సాంకేతిక యుగంలో ఫ్లెక్సీలు రాకతో పెయింటింగ్, లైటింగ్ కళాకారులకు వారికి పనిలేకుండా పోయింది. డిజిటల్ ప్రచారం ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. రాజకీయ పార్టీల నాయకులు సైతం ప్రచారానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లను వేదికగా చేసుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మెసేజ్‌లు, వాట్సాప్, వాయిస్ కాల్స్ ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. వాల్ పెయింటింగ్‌ల స్థానంలో ఫ్లెక్సీలు వచ్చాయి. గతంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసేందుకు ఫ్లైవుడ్ వాడేవారు. దీనిపై అభ్యర్ధుల,నాయకుల బొమ్మలు వేసేవారు. ఇందుకు కొన్ని రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఫ్లెక్సీలు అందుబాటులోకి రావటంతో ఎంత పెద్ద కటౌట్ అయినా క్షణాల్లో రెడీ అవుతోంది. -
సొంత పార్టీపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సి ఇప్పుడు వివాదాన్ని రాజేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయ శాంతి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 23 సోనియా గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సోనియాకు స్వాగతం చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఓ ఫ్లెక్సి ఏర్పాటు చేసింది. కానీ దీనిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేదు. దాంతో ఇతరులను విమర్శించే ముందు మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ టీఆర్ఎస్ని విమర్శించే మనం ఇప్పుడు చేసింది ఏంటంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేకపోవడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. చెప్పడానికే నీతులు పాటించడానికి కావా అంటూ జనాలు విమర్శిస్తున్నారని అన్నారు. ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా.. మహిళలు కూడా సభకు హాజరవుతారు కదా అంటూ విజయశాంతి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. సొంత పార్టీ నేతలనే విమర్శిస్తూ రాములమ్మ ఇలా మాట్లాడటం పట్ల కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
దేవినేనీ.. ఇదేం పని!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షం ఊసే లేకుండా చేయాలన్న లక్ష్యమో.. లేక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల రోజురోజుకీ ప్రజల్లో పెరుగుతోన్న ఆదరణకు భయమేస్తోందో.. మొత్తానికి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తన నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ లేదని చూపడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఫ్లెక్సీల రాజకీయానికి తెరతీశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు చెందిన ఫ్లెక్సీ గానీ, హోర్డింగ్ గానీ కనిపించిందా.. అధికారులపై శివాలెత్తిపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో : అత్త సొమ్ము అల్లుడి దానం అంటే ఇదే.. మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా సొంత ప్రచారానికి దుర్వినియోగం చేస్తున్నారు. అదేమంటే.. ఇది ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాత్రమేనని.. ఇందులో మంత్రి చేసుకుంటున్న సొంత ప్రచారం ఏదీ లేదని ఆయన అనుచరులు బుకాయిస్తున్నారు. సరే.. ప్రభుత్వ పథకాల కోసమే నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారనుకున్నా.. ఆయా శాఖల మంత్రుల ఫోటోలు ఆ ఫ్లెక్సీల్లో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేని పరిస్థితి. కేవలం ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి దేవినేని ఉమాకు ముఖచిత్రాలు మినహా ఎవ్వరి ఫోటోలకు ఫ్లెక్సీలో చోటు లేకపోవడం గమనార్హం. వీటన్నింటిని ఏర్పాటు చేసిన యాడ్స్ కంపెనీకి నెలనెలా ప్రభుత్వమే లక్షలాది రూపాయలు చెల్లిస్తోంది. ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు కనిపిస్తే శివాలే.. తెలుగుదేశం అధినేత వైఖరితో అధికారపార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యం.. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తుండటంతో మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రతిపక్షనేతపై కత్తికట్టారు. ఎక్కడా వారికి సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు అధికార యంత్రాంగాన్ని పావుగా వాడేసుకుంటున్నారు. పొరపాటున ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు కనిపిస్తే అధికారులపై ఆయన శివాలెత్తిపోతున్నారు. అధికారులే దగ్గరుండీ.. దీంతో మంత్రికి జడిసి పంచాయతీ, మున్సిపాలిటీ, పోలీసు అధికారులు దగ్గరుండీ ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు తొలగించేస్తున్నారు. మైలవరం, ఇబ్రహీంపట్నం పోలీసులకు ఈ పని నిత్యకృత్యంగా మారిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇటీవల వెలగలేరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేయగా.. దానిని దగ్గరుండి పోలీసులు తొలగించడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కడితే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. జాతీయ రహదారులపై ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఎన్హెచ్ఐ నిబంధనల మేరకు ఏ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పెట్టినా నేరమే. పైగా ఎవరైనా ఏర్పాటు చేసినా వాటిని ఎన్హెచ్ఐ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేస్తారు. పదేపదే ఎవరైనా కావాలని పెడితే.. వారికి నోటీసులు జారీ చేసి చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే హైదరాబాద్, జి.కొండూరు జాతీయ రహదారుల్లోని సెంటర్ మీడియన్పై ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలపై దాదాపు 25 కిలోమీటర్ల మేర ప్రభుత్వ సొమ్ముతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఎన్హెచ్ఐ అధికారులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్నారు. అదేసమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉంటే రాత్రిరాత్రే వచ్చి వాటిని తొలగించేస్తున్నారు. ‘మంత్రి ఉమాకు ఓటమి భయం పట్టుకుంది’ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఓటమిభయం పట్టుకుందని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు కాండ్రకొండ పెద్ద గురవయ్య అన్నారు. కొండపల్లిలో వైఎస్సార్ సీపీ బ్యానర్లు తొలగించటమే కాకుండా గోడలకు అంటించిన వాల్‌పోస్టర్లు కూడా అధికారులతో చించివేయించటం చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. కొండపల్లి పార్టీ కార్యాలయంలో వాల్‌పోస్టర్లు చించివేయటంపై గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రి చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచి కాండ్రకొండ చినగురవయ్య, షేక్ షిలార్దాదా, అడపా దుర్గా ప్రసాద్, పల్లపోతు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జాషువారాజు పాల్గొన్నారు. -
దళితుడిపై పులివర్తి నాని అనుచరుల దౌర్జన్యం
చిత్తూరు, తిరుపతి రూరల్: మొన్న వల్లివేడులో..రౌడీయిజం ఎక్కడ పుట్టిందో తెలుసా చిత్తూరులోనే. రౌడీయిజం పుట్టిన ఊరు నుంచి వచ్చానని పులివర్తి నాని హెచ్చరికలు..నిన్న....చంద్రగిరిలో..గాంధీని కాదు. అవసరం అయితే రెండు చెంపలు పగలుకొడతా... అంటూ మరోమారు బహిరంగ బెదిరింపులు.నేడు... అగ్రవర్ణాలు ఉన్న మా ప్రాంతంలో కులం తక్కువవాడివి నువ్వు ఫ్లెక్సీలు కడతావా? అంటూ సినీ ఫక్కీలో పులివర్తి నాని అనుచరులు వెంటాడి..వెంటాడి కాశింపెంట్ల పంచాయతీ మొరవపల్లి దళితవాడకు చెందిన పుట్ట రవిపై దాడికి తెగబడి చంపేందుకు యత్నం. ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు సంస్కృతి విషపు మొక్కలా విస్తరిస్తోంది. మంగళవారం రాత్రి పులివర్తి నాని అనుచరులైన కాశింపెంట్ల మాజీ సర్పంచ్ గాలి సతీష్‌నాయుడు, కొమ్మినేని గిరి, శివ, పట్టాభి కలిసి రవిని కాశింపెంట్ల నుంచి పూతలపట్టు సర్కిల్ వరకు వెంటబడ్డారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి వెంట వేము కళాశాల సమీపంలో అతని స్కూటర్‌ను కారుతో ఢీకొట్టారు. కింద పడిన రవిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. పిడికిళ్లతో గుద్దుతూ, కాళ్లతో తన్నారు. ముక్కులో, నోట్లో నుంచి రక్తం కారింది. వందలాది మంది ప్రయాణికులు చూస్తుండగానే ఈ దాడి జరిగింది. కాపాడాలని రవి చేసిన ఆర్తనాదాలు ప్రయాణికులను కదిలిం చాయి. నాని అనుచరులపై ప్రయాణికులు తిరగబడ్డారు. అతన్ని కాపాడేందుకు రాళ్లను చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో నాని అనుచరులు తలో దిక్కుకు పారిపోయారు. రుయాలో చికిత్స... తీవ్ర రక్తగాయాలతో ఉన్న రవిని వేము కళాశాల సిబ్బంది, ప్రయాణికులు పాకాలలోని పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమికి చికిత్స అనంతరం విచక్షణరహితంగా కొట్టడం వల్ల ముక్కులో, నోట్లో నుంచి రక్త కరుతుండటంతో పాటు శరీరం కమిలిపోయి, ఎముకలకు దెబ్బలు తగిలి అల్లాడుతున్న రవికి మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిం చారు. 108కు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా పేషెంట్‌తోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి రుయాలో చికిత్స పొందుతున్న రవిని మంగళవారం రాత్రి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. దీపావళికి ఇంటి వద్ద ఫ్లెక్సీ కట్టుకున్నందుకు కులం పేరుతో దూషిస్తూ వెంటబడి చంపేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యేకు బాధితుడు కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. చెవిరెడ్డి అతన్ని ఓదార్చాడు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవసరం అయితే మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైకు తీసుకెళ్తామన్నారు. మొరవపల్లికి వెళ్లి రవి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆసుపత్రికి వచ్చి రాత్రంతా ఉన్నారు. చంపుతామని నాని అనుచరులు బెదిరించిన మాటలు బాధితుడు సెల్ఫోన్లో రికార్డు అయింది. ఈ వాయిస్ రికార్డును బాధితుడు పోలీసులకు అందించినట్లు సమాచారం. దీంతో నాని అనుచరుల్లో అందోళన మొదలైంది. -
ఖబడ్దార్ తెలుగు తమ్ముళ్లంటూ జనసేన ఫ్లెక్సీలు
విజయవాడ: తెలుగు దేశం పార్టీ(టీడీపీ)ని తీవ్రంగా విమర్శిస్తూ విజయవాడ నగరంలో ఓ జనసేన ఫ్లెక్సీ బుధవారం వెలిసింది. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను ఫ్లెక్సీల ద్వారా జనసేన కార్యకర్తలు ప్రదర్శించారు. ‘ పిచ్చి ముదిరిన పచ్చ పురాణం.. ఏం తమ్ముళ్లు వేధిస్తుందా..ఓటమి భయం, గుర్తుస్తోందా.. దశాబ్ధ ప్రతిపక్ష కాలం..!’ అంటూ ఫ్లెక్సీలో టీడీపీకి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. 2009లో బెజవాడ గడ్డ మీద మీరు(చంద్రబాబు) జీరో..2014లో ఎలా అయ్యారు హీరో అని ప్రశ్నించారు. మీ నాయకుడి తంత్ర ఫలమా..? మా నాయకుడి కాళ్లు మొక్కిన ఫలమా..? అని తీవ్రంగా దుయ్యబట్టారు. 2019 ఓటమి భయంతోనే కాంగ్రెస్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎల్లోమీడియాను కూడా ఫ్లెక్సీలో తీవ్రంగా విమర్శించారు. 2019లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పకపోతే తాము జనసైనికులమే కాదని సవాల్ విసిరారు. తెలుగు తమ్ముళ్లూ గోదావరిలో మొదలైంది మీకు కౌంట్‌డౌన్ అంటూ అమరావతి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరిట ఫ్లెక్సీ వెలిసింది. రెండు మూడు రోజుల కిందట జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ టీడీపీ నాయకులు కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానికి కౌంటర్ గానే జనసైనికులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ తెలుగు దేశం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ -
వారిది కన్నీరు.. వీరికి పన్నీరు!
బతుకులు పోయి వందలాది మంది ఏడుస్తుంటే.. నేతలు మాత్రం పొగడ్తలు కోరుకున్నారు. గ్రామాల్లో నీటితో పోటీ పడి కన్నీరు కురుస్తుంటే.. నాయకులు మాత్రం దాన్ని పన్నీరుగా మార్చుకున్నారు. తిత్లీ ధాటికి సగం జిల్లా సర్వనాశనమైన వేళ అధికార పార్టీ నాయకులు ప్రచార పర్వానికే పెద్ద పీట వేశారు. దాహమో రామచంద్రా.. అంటూ రోదిస్తున్న ప్రాంతాలకు నీటి కంటే ముందు ఫ్లెక్సీలు వెళ్లాయి. ఇళ్లు కోల్పోయి ఎవరు కరుణిస్తారా అని చేతులు జోడించి బాధితులు నిల్చుని ఉంటే వారి చేతుల్లో నిత్యావసరాలు కాకుండా పార్టీ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కరెంటు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే థాంక్యూ.. అని చెప్పాలనే సూచనలు వినిపించాయి. టీడీపీ నాయకుల ప్రచార పిచ్చికి తిత్లీ ఓ మౌన సాక్ష్యమైంది. శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రచారం.. టీడీపీ నాయకుల ప్రధాన ఆయుధం. ఆపత్కాలంలో కూడా నాయకులు ఈ సాధనాన్ని వదల్లేదు. తిత్లీ ధాటికి సిక్కోలు కకావికలమైన వేళ కూడా సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రచారంపైనే దృష్టి పెట్టారని సాక్షాత్తు బాధితులే సెలవిస్తున్నారు. తిత్లీ తుఫాన్లో అధికారికంగా అధికారులు, పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీ సభ్యులు తమకు తోచిన విధంగా పార్టీ ప్రచారానికి పాల్పడుతున్నారు. తిత్లీలో ప్రజలు బాధ పడుతుంటే రూ.కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న తీరుపై జనం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో తిత్లీ తుఫాన్ సంభవించిన రెండో రోజుకు గ్రామాలకు, మారు మూల పల్లెలకు తాగునీరు అందక ముందే పార్టీ ఫ్లెక్సీలు చేరుకున్నాయంటే ముఖ్యమంత్రి ప్రచార పిచ్చి అర్థం చేసుకోవచ్చు. పలాసతో పాటు 13 మండలాలను తుఫాన్ ప్రభావిత ప్రాంతాలగా గుర్తించినప్పటికీ అత్యధికంగా ఉద్దానం ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దీంతో ముఖ్యమంత్రి పలాసలో పాగా వేసినప్పటికీ ప్రచారానికి పరమావధిగా ప్రాధాన్యత ఇచ్చారు. అటు అధికారులు, ఇటు నాయకులు పలు శాఖలకు చెందిన యంత్రాంగాలతో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ «అధికంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.కోట్ల ఖర్చు ముఖ్యమంత్రి పలాసలో ఉండగానే ఇంకా అనేక గ్రామాలకు విద్యుత్ అందజేయడానికి ముందే ఫ్లెక్సీలు, జెండాలు, ప్లకార్డులు, ఆర్టీసీ బస్సులకు పెయింటింగ్‌లు, కరపత్రాలు, ఒకటేమిటి అనేక రూపాల్లో ప్రచారం మొదలుపెట్టారు. నేటి నుంచి అందించనున్న పరిహారం నేరుగా ఖాతాల్లోకి పడుతున్నప్పటికీ ప్రచారం కోసం రూ.రెండు కోట్ల రూపాయలతో డమ్మీ చెక్కులను విడుదల చేశారు. ఇలా ఏ ఒక్క అవకాశం ఉన్నప్పటికీ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో ఉన్న హోర్డింగ్‌లు లక్షలు ఖరీదు అయినప్పటికీ వాటిపై, ఆర్టీసీ బస్సులపై, చెక్‌లపై ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పరిహారంలో కొబ్బరి చెట్టుకు రూ.1500 ఇస్తున్నప్పటికీ దాన్ని రెట్టింపు చెయ్యమని వారు వేడుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమం అయితే అధికారులతో ప్రచారం, కాకుంటే నాయకులతో ప్రచారం చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రకటన సామగ్రి ముఖ్యమంత్రి చేరుకునే ముందే వచ్చేస్తున్నాయి. ప్రచారానికి పెద్ద పీట.. బాధితులు నీరు అందని స్థితిలో ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని ప్రచారం చేయడం ఎంతవరకని సబబని అడుగుతున్నాను. అధికారులు మీవెంట ఉన్నపుడు సహాయం ఎలా అందుతుంది. ముఖ్యంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఎవ్వరినీ ఆదుకోలేదు. – చింతాడ మాధవరావు, సున్నాడ -
నకిలీ ఫ్లెక్సీ ఫొటోలతో బట్టబయలైన టీడీపీ కుట్ర
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాజకీయంగా పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలతో అప్పటికప్పుడే పక్కా ఏర్పాట్లకు సీఎంఓ దిగింది. నిందితుడు శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధముందని, ఆతడు వైఎస్ జగన్ అభిమాని అని నమ్మించేలా గ్రాఫిక్స్‌తో కూడిన ఫ్లెక్సీ ఫొటోలను చంద్రబాబు కార్యాలయం రూపొందింప చేసి మంత్రుల ద్వారా, తన పచ్చ మీడియా ద్వారా ప్రచారానికి తెరలేపింది. చంద్రబాబు సూచనల మేరకు మంత్రులు నక్కా ఆనందబాబు కాలువ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి తదితరులు వరుసగా మీడియాతో మాట్లాడుతూ దాన్ని అమల్లో పెట్టారు. ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నం ఘటనను ఖండించడానికి బదులు దాన్ని రాజకీయంగా పక్కదారి పట్టించడంపైనే వారి విమర్శలు సాగాయి. సినీనటుడు శివాజీ పేర్కొన్నట్లు ఆపరేషన్ గరుడలో భాగంగానే ఇది జరిగిందని, కేంద్రం కావాలని ఇలా చేస్తూ రాష్ట్రాన్ని అస్థిర పరిచేందుకు ఇలా చేస్తోందని ఆరోపణలకు దిగారు. మంత్రు లు నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావులు నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని, అభిమానితోనే ఇలా చేయించుకున్నారంటూ ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్‌పైకి నెట్టే కుట్రకు తెరలేపారు. హేపీ న్యూ ఇయర్, పొంగల్ అంటూ జగన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్లెక్సీ కూడా కట్టించారని ఫోన్లో జగన్, నిందితుడు శ్రీనివాసరావు కలసి ఉన్నట్లుగా ఫోన్లో ఉన్న ఫొటోను చూపించారు. అయితే ఎప్పుడో పది నెలల క్రితంనాటి ఫ్లెక్సీ ఫొటో అంటూ మంత్రులు మీడియాకు విడుదల చేసిన ఫోన్లోని ఆ ఫొటో ఫ్లెక్సీకి సంబంధించినదిగా కాకుండా ఏదో గ్రాఫిక్స్‌తో రూపొందించినట్లుగా ఉండడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రాఫిక్స్ ఫ్లెక్సీ ఫొటోలో గరుడ పక్షి బొమ్మ ముద్రించి ఉండడం విశేషం. హేపీ న్యూ ఇయర్ ఫ్లెక్సీల్లో గరుడ బొమ్మ ముద్రించరని, ప్రభుత్వమే దీన్ని గ్రాఫిక్స్‌లో పెట్టించి విడుదల చేసిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోపక్క విశాఖపట్నంలో పోలీసు అధికారులు కూడా ఘటన జరిగిన కొద్ది సమయంలోనే ఇదే గ్రాఫిక్స్‌తో కూడిన ఫొటోను చూపి శ్రీనివాసరావు జగన్ అభిమాని అని ప్రకటన చేయడం కూడా అనుమానాలను మరింత పెంచింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు ఒక పథకం ప్రకారం నడిపిస్తున్నారన్న చర్చ ప్రజల్లో సాగుతోంది. -
జెండాలు,ఫ్లెక్సీలతో నిండిపోయిన విజయనగరం
-
గుడివాడలో అధికార పార్టీ విడ్డూరం
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్లుగా ఉంది గుడివాడ అధికార పార్టీ నేతల తీరు. వారు తానా అంటే తందానా.. అంటున్నారు ఇక్కడి పోలీసు అధికారి. అధికార పార్టీ నేతలు సెలవిచ్చిందే తడవుగా న్యాయాన్యాయాలతో పని లేకుండానే పోలీసు పవర్‌ను వినియోగిస్తున్నారు. గుడివాడలో చోటు చేసుకున్న ఈ వింత పరిస్థితిని చూసి జనం నవ్వుతుండగా పోలీసులు మాత్రం ఇదేం ఖర్మరా బాబూ.. అంటున్నారు. ‘సాక్షి’ సేకరించినవివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా, గుడివాడ : పట్టణంలోని మార్కెట్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకుల ఫొటోలతో స్వాగత ఆర్చీ ఏర్పాటు చేశారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలపై ఫొటోలను ఎవరైనా ఆకతాయిలు కోసేస్తారేమోనని పోలీసు రక్షణ కల్పించాలని అధికార పార్టీ నేతలు ఆదేశించినట్లు సమాచారం. దీంతో గుడివాడ పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఫ్లెక్సీలకు పదిహేను రోజులుగా రాత్రీ పగలు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆరుగురు పోలీసులతో బందోబస్తు... వినాయక చవితి ముందు రోజు ఫ్లెక్సీలతో టీడీపీ నేతలు స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. ఆరోజు నుంచి ఉదయం ఇద్దరు కానిస్టేబుళ్లు, మధ్యాహ్నం ఇద్దరు, రాత్రికి ఇద్దరు చొప్పున డ్యూటీలు వేశారు. అయితే ఉత్సవాలు ముగిసినా నిమజ్జనం జరిగి నాలుగు రోజులు దాటినా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. దీంతో ఫ్లెక్సీలకు ప్రతి రోజు పోలీసు బందోబస్తు మాత్రం తప్పటం లేదు. పగలు ఎండలో.. రాత్రి దోమలతో చెలగాటం... కాపలా కాస్తున్న పోలీసులకు పగలు ఎండ, రాత్రి దోమలతో చెలగాటం తప్పడం లేదు. రాత్రి సమయంలో నిద్ర పోకుండా కాపలా కాస్తున్నారు. ఎక్కడైనా మనుషులకు కాపలా కాస్తారు తప్ప, బ్యానర్లకు కూడా పోలీసులు కాపలా కాయటమేమిటని ప్రజలు నవ్వుకుంటున్నారు. అధికారం ఉందని ఇలా దుర్వినియోగం చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి కాపలా ఉండే పోలీసులు దోమల బాధ తట్టుకోలేక ఏనాడో పాపం చేసుకున్నాం... లేకుంటే ఇదేం ఖర్మ.. అని ఆవేదన చెందుతున్నా రు. అధికార పార్టీ నేతలకే కాకుండా ఫ్లెక్సీలో ఉండే ఫోటోలకు కూడా పోలీసులు సేవలు చేయటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. -
శుభవార్త : ఫ్లెక్సీ ఫేర్స్‌కు గుడ్ బై
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఫ్లెక్సీ రేట్ల విధానంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఫ్లెక్సీ రేట్ల విధానానికి గుడ్ బై చెప్పాలని రైల్వే శాఖనిర్ణయించింది. డైనమింక్ ప్రైసింగ్ పేరుతో ప్రస్తుతం 142 రైళ్ళలో అమల్లో ఉన్న ఫ్లెక్సీ ఫేర్స్ పాలసీని కొన్ని రైళ్లలో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వినియోగదారులపై ఛార్జీల భారంతోపాటు, ఈ విధానం ద్వారా డిమాండ్ బాగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. డైనమిక్ ప్రైసింగ్ పేరుతో అమలవుతున్న ఈపద్ధతిలో ఆశించిన ప్రయోజనం దక్కకపోగా ప్రీమియం రైళ్లలో డిమాండ్భారీగా క్షీణిస్తోంది. ముఖ్యంగా చార్జీలు విమాన టికెట్లను మించిపోవడంతో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. దీంతో 40 రైళ్ళలో ఈ ఫ్లెక్సీ విధానాన్ని ఎత్తివేయనుంది. అయితే మిగిలిన 102 రైళ్ళలో ఫెక్లీ ఫేర్స్ అమలు కానున్నాయి. ప్రయాణానికి నాలుగు రోజులు ముందు, చివరి నిమిషంలో బుకింగ్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. దీంతోపాటు 60శాతం కంటే తక్కువ బుకింగ్స్ ఉన్న రైలు టికెట్లపై గ్రేడెడ్ డిస్కౌంట్ కూడా ఉందని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణీకులను ఆకర్షించడంపై సాధించడంపై తాము దృష్టి కేంద్రీకరించామనీ, సరసమైన ధరల్లో రైల్వే ప్రయాణాన్ని తిరిగి వారికి అందుబాటులోకి తేవాలని భావించామని సీనియర్ రైల్వే అధికారి చెప్పారు. వినియోగదారుపై భారం మోపడం ద్వారా కాకుండా, సీట్ల అధిక వినియోగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తున్నామన్నారు. ఈ కొత్త విధానం సంబంధిత ప్రభుత్వ అధికారుల తుది ఆమోదం అనంతరం అమల్లోకి రానుందని చెప్పారు. కాగా 44 రాజధాని, 46 శతాబ్ది, 52 దురంతో రైళ్ళలో ప్రస్తుతం డైనిమిక్ ప్రైసింగ్ విధానం అమల్లో ఉంది. దురంతో రైళ్ళలో ఏసీతో పాటు నాన్ ఏసీ బెర్త్ లు కూడా ఉంటాయి.. మిగిలిన రైళ్ళలో అన్నీ ఏసీ బోగీలే. ధరలు భారీగా పెరగడంతో ప్రయాణీకులు, డిస్కౌంట్ ఆఫర్లు, తగ్గింపు రేట్లతో ఆకట్టుకుంటున్న విమాన ప్రయాణాలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆలస్యంగా కళ్ళు తెరిచిన రైల్వేశాఖ ఈ కొత్త విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. -
ఆకాశమే హద్దుగా ఎగసిన ప్రజాభిమానం
-
కేటీఆర్ బర్త్ డే.. ఆర్భాటాలు బంద్..!
-
కేటీఆర్ బర్త్ డే.. ఆర్భాటాలు బంద్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం 42వ వసంతంలోకి అడుగుపెట్టుబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఒక పాటను బహూకరించారు. కేటీఆర్ బర్త్‌డే సాంగ్‌ను ఎమ్మెల్యేశంభీపూర్ రాజు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం విడుదల చేశారు. ‘నీలాల మబ్బుల్లో సూర్యుడు.. నువ్వు తెలంగాణ నేల రాముడు’ అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, తన జన్మదినం సందర్భంగా కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కేటీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తి మేరకు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మేయర్ బొంతు రామ్మోహన్ తీసేయించారు. ఇక కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్ అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. తనకు కేటాయించిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. -
పుట్టినరోజున ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయొద్దని మంత్రి కె.తారకరామారావు అభిమానులను కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే నగరంలో అక్కడక్కడ పెట్టిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్లను కోరారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికలు, టీవీలకు ఇచ్చే ప్రకటనల ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేయాలని పిలుపునిచ్చారు. పూల బొకేలు, ఫ్లెక్సీలకు అయ్యే చిన్న మొత్తాలను సైతం సీఎం సహాయ నిధికి పంపించాలని కోరారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని కోరారు. -
టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ.. ఎస్పీకి ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం : ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి లోకేష్ కర్నూల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య చిచ్చురగులుకున్న విషయం తెలిసిందే. అనంతపురంలో టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కానీ సూరి అనుచరులు మాత్రం మంత్రి పరిటాల సునీత వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే సూరి ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాక ఫ్లెక్సీలు తొలగించిన కొంతమందిని పోలీసులు తప్పించారని ఎమ్మెల్యే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.