సాక్షి, అనంతపురం : ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి లోకేష్ కర్నూల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య చిచ్చురగులుకున్న విషయం తెలిసిందే. అనంతపురంలో టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కానీ సూరి అనుచరులు మాత్రం మంత్రి పరిటాల సునీత వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఎమ్మెల్యే సూరి ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాక ఫ్లెక్సీలు తొలగించిన కొంతమందిని పోలీసులు తప్పించారని ఎమ్మెల్యే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment