టీడీపీ ఎమ్మెల్యేపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్‌ | Kethireddy Venkatarami Reddy Slams On TDP MLA Varadapuram Suri | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్‌

Published Mon, Dec 17 2018 4:19 PM | Last Updated on Mon, Dec 17 2018 4:22 PM

Kethireddy Venkatarami Reddy Slams On TDP MLA Varadapuram Suri - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని మొగలిచెట్లపల్లిలో రోడ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలసి ఆయన వినతిపత్రం అందించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ బీసీలపై కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొగలిచెట్లపల్లి గ్రామస్తులు వైఎస్సార్‌సీపీలో చేరడంతోనే రోడ్లను ధ్వంసం చేయటం ఆటవిక పాలనేనని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఆధికారులు కఠినంగా వ్యవహరించకపోతే ప్రత్యక్ష ఆందోళకు దిగుతామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement